పక్కింటి పుల్లకూర రుచి అన్న సామెత తెలిసిందే కదా! పక్కింట్లోని వంటలే కాదు, వారి జీవితాల్లో తొంగి చూడటం కూడా సర్వసాధారణమైపోయింది ఈ రోజుల్లో! మరీ ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల్లో కూడా సాధారణ జనాల జోక్యం ఎక్కువైపోయిందీ రోజుల్లో.. వారు ఏం చేసినా తప్పుపట్టడమే తరువాయి అన్న చందంగా తయారైంది సోషల్ మీడియా. గత కొద్ది రోజులుగా నటి సుష్మితా సేన్, లలిత్ మోదీల ప్రేమ గురించైతే ఎన్ని పోస్టులు, మీమ్స్ వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె నిర్ణయాన్ని విమర్శిస్తూ ఇద్దరినీ తిట్టిపోసినవారే ఎక్కువమంది.
అయితే ఈ వైఖరి అంత మంచిది కాదని విమర్శించాడు దర్శకుడు మహేశ్ భట్. అదే సమయంలో సుష్మిత ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. 'ఆమె తనకు నచ్చినట్లుగా బతుకుతోంది. ఎలాంటి కట్టుబాట్లు విధించుకోకుండా స్వేచ్ఛగా జీవిస్తోంది. అంతటి గట్స్ ఆమెకున్నాయి. తనను ఇప్పటికీ అసాధారణమైన వ్యక్తిగానే గుర్తుంచుకున్నాను. తనకు నచ్చినట్లుగా బతుకుతున్న ఆమె గుండె ధైర్యానికి నేను సెల్యూట్ చేయాల్సిందే! ఇంకా ఆమెను వేధించకుండా ఆమె బతుకేదో ఆమెను బతకనివ్వండి' అని ట్రోలర్స్‌కు గట్టి కౌంటరిచ్చాడు.
గతంలో విక్రమ్ భట్‌తో నడిపిన ప్రేమాయణం గురించి చెప్తూ.. 'దస్తక్ సినిమా చేద్దామనుకున్నాను. అందుకామె ఓకే చెప్పింది. తర్వాతేం జరిగిందో మీకందరికీ తెలుసు. దస్తక్ షూటింగ్ సమయంలో సుష్మితా సేన్, విక్రమ్ భట్ ప్రేమించుకున్నారు. విక్రమ్ నాకు కుడిభుజంలా ఉండేవాడు. అతడిని ఆధారంగా చేసుకునే నేను నా పని పూర్తి చేసేవాడిని. సెట్స్‌లో ఆమెతో సరదాగా కలిసిపోయేవాడు. అలా వాళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైంది' అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు మహేశ్ భట్.
చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో సిద్దార్థ్ షికార్లు.. ఫొటోలు తీసినవారికి హీరో వార్నింగ్!
క్యాస్టింగ్ కౌచ్ వల్ల పెద్ద పెద్ద ప్రాజెక్టులు వదులుకున్నా..
Comments
Please login to add a commentAdd a comment