
మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్, మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ లవ్‌లో ఉన్నామంటూ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు. అది కూడా ఒక్కరోజులోనే తమ మధ్య ప్రేమ చిగురించిందని, ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నప్పటికీ త్వరలో పెళ్లి కూడా చేసుకుంటామని సోషల్ మీడియా వేదికగా వారి మధ్య ఉన్న రిలేషన్‌ను బయటపెట్టాడు లలిత్ మోదీ. అయితే సుష్మితతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ ఆమెను భాగస్వామిగా పేర్కొన్నాడు.
దీంతో అయోమయానికి లోనైన నెటిజన్లు ఆల్‌రెడీ వీళ్లు పెళ్లి చేసుకున్నారనుకుని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో లలిత్ మోదీ తమకింకా పెళ్లవలేదని ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చాడు. తాజాగా సుష్మితా సేన్ సైతం ఈ విషయంపై స్పందించింది. 'ప్రస్తుతం నేను నాకు నచ్చిన ప్రదేశంలో సంతోషంగా ఉన్నాను. ఇంకా ఉంగరాలు మార్చుకోలేదు, పెళ్లి అవలేదు. కేవలం ప్రేమలో మునిగి తేలుతున్నా.. ఈ వివరణ సరిపోతుందనుకుంటా.. ఇక నా పని నేను చూసుకుంటా.. నా సంతోషాన్ని పంచుకునేవారికి థ్యాంక్యూ.. ఎవరైతే పంచుకోరో.. వారికి నా గురించి అవసరం లేదు.. ఏదేమైనా లవ్ యూ గయ్స్..' అని రాసుకొచ్చింది.
చదవండి: నేనేమైనా ఉగ్రవాదినా? పెళ్లి చేసుకోకూడదా?
మాజీ ఐపీఎల్ చైర్మన్‌తో సుష్మితా సేన్ డేటింగ్
Comments
Please login to add a commentAdd a comment