Sushmita Sen Reacts On Being Labelled As 'Gold Digger' - Sakshi
Sakshi News home page

Sushmita Sen: డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతానా? ఆ హక్కు మీకు లేదు..

Published Sat, Aug 5 2023 12:10 PM | Last Updated on Sat, Aug 5 2023 12:37 PM

Sushmita Sen Reacts on Being Labelled as ‘Gold Digger’ - Sakshi

మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్‌.. సినిమాలతో పాటు లవ్‌ ఎఫైర్లతోనూ బాగా ఫేమస్‌ అయింది. సినిమాల్లో హీరోయిన్‌గా రాణించిన సమయంలో ఎంతోమందితో ప్రేమాయణం నడిపింది. ఈ క్రమంలో తనకంటే చిన్నవాడైన రోహ్మన్‌ షాల్‌తోనూ లవ్వాయణం నడిపింది. కానీ తర్వాత అతడికి బ్రేకప్‌ చెప్పింది. కొంతకాలానికే ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోదీతో ప్రేమలో పడింది. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్న విషయాన్ని తెలియజేస్తూ లలిత్‌ మోదీ ట్విటర్‌లోనూ కొన్ని ఫోటోలు రిలీజ్‌ చేశాడు. ఇది చూసిన జనాలు.. డబ్బు కోసమే సుష్మిత అతడిని ప్రేమిస్తోందంటూ విమర్శలు గుప్పించారు.

ఏదైనా అనుకోండి, డోంట్‌ కేర్‌
అయితే ఏమైందో ఏమో కానీ కొంతకాలానికే వీరిద్దరు కూడా బ్రేకప్‌ చెప్పుకున్నారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ ట్రోలింగ్‌పై, బ్రేకప్‌పై క్లారిటీ ఇచ్చింది నటి. తాలి వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సమయంలో ఆమె మాట్లాడుతూ.. 'నా గురించి మీరెలా మాట్లాడుకున్నా మంచిదే! డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతానని అంటున్నారు.. ఈ అవమానాలను నేను స్వీకరించినప్పుడే అవమానం.. కానీ అలాంటివి నేనసలు పట్టించుకుంటే కదా!

నేనిప్పుడు సింగిల్‌..
ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత విషయాలంటూ కొన్నుంటాయి.. వాటితో మీకు సంబంధం లేదు. ప్రతిదాంట్లో దూరే హక్కు మీకు లేదు. ఇంకో విషయం చెప్పాలి, నేనిప్పుడు సింగిల్‌గా ఉంటున్నాను. దాని గురించి కూడా మీకనవసరం!' అని ఘాటుగా వ్యాఖ్యానించింది. లలిత్‌ మోదీతో బ్రేకప్‌ అయిన విషయాన్ని చెప్పకనే చెప్పింది సుష్మిత. కాగా ఈ నటి ఈ ఏడాది ఫిబ్రవరిలో గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరగా ఓ మేజర్‌ సర్జరీ జరిగింది. అప్పుడు సినిమాలకు విరామం పలికిన ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొంటోంది. ప్రస్తుతం ఆర్య 3, తాలి అనే వెబ్‌ సిరీస్‌లు చేస్తోంది.

చదవండి: మా నాన్న ఎలా ఉంటాడో తెలియదు: ఏడ్చేసిన ధనరాజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement