Lalit Modi 2013 Tweet Viral After Dating Announcement With Sushmita Sen - Sakshi
Sakshi News home page

Sushmita Sen: లలిత్‌ మోదీ గట్టిగానే ట్రై చేశాడు, ఇన్నేళ్లకు ఫలించింది!

Published Fri, Jul 15 2022 8:52 PM | Last Updated on Fri, Jul 15 2022 9:21 PM

Lalit Modi 2013 Tweet Viral After Dating Announcement With Sushmita Sen - Sakshi

ప్రేమ పుట్టడాని ఒక్క క్షణం చాలు.. అన్న మాటకు ప్రత్యక్ష నిదర్శనంలా మారారు ఐపీఎల్‌ వ్యవస్థాపకుడు లలిత్‌ మోదీ, మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్‌. వీరి మధ్య ఉన్న పరిచయం కొత్తేమీ కాదు. ఎన్నో ఏళ్ల కిందటే ఒకరికొకరు తెలుసు. కానీ ఉన్నట్టుండి సడన్‌గా లవ్‌లో జారి పడ్డారు. ఒక్కరోజులోనే డేటింగ్‌ మొదలు పెట్టారు. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అంటూ ఫొటోలు వదిలారు. ఇది చూసి సోషల్‌ మీడియా యూజర్స్‌ విస్తుపోయారు. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారా? త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారా? అంటూ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే కలిసి జీవితాన్ని పంచుకోబోతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ క్రమంలో లలిత్‌ మోదీ గతంలో చేసిన ట్వీట్‌ ఒకటి వైరల్‌గా మారింది. 2013లో లలిత్‌ మోదీ.. సుష్మితతో చాట్‌ చేసిన స్క్రీన్‌షాట్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఇందులో మోదీ.. 'ఓకే ఐ కమిట్‌' అంటుంటే సుష్మిత మాత్రం.. 'మీరు చాలా మంచివారు. హామీలను నిలబెట్టుకోలేకపోవచ్చేమోగానీ కమిట్‌మెంట్లను మాత్రం గౌరవించాల్సిందే' అని రిప్లై ఇచ్చింది. మరో ట్వీట్‌లో సుష్మితను ట్విటర్‌లో కాకుండా ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా రిప్లై ఇవ్వమన్నాడు లలిత్‌.

ఈ ట్వీట్‌ కాస్తా ఇప్పుడు వైరల్‌ కావడంతో నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. '9 ఏళ్లకు సుష్మిత కనికరించింది', 'లేటు వయసులో ఘాటు ప్రేమ', 'మోదీ గట్టిగానే ట్రై చేసినట్లున్నాడే', 'ఓపిక, పట్టుదల, కృషితో లలిత్‌ మోదీ విజయం సాధించాడు' అంటూ జోకులు పేలుస్తున్నారు. కాగా లలిత్‌ మోదీ 1991లో మినాల్‌ మోదీని పెళ్లాడాడు. క్యాన్సర్‌ కారణంగా మినాల్‌ 2018 డిసెంబర్‌ 10న మరణించింది. మనీలాండరింగ్‌ కేసులో భారత్‌ నుంచి పారిపోయిన లలిత్‌ మోదీ 2010 నుంచి లండన్‌లో నివసిస్తున్నాడు.

చదవండి: లలిత్‌ మోదీతో డేటింగ్‌పై స్పందించిన సుష్మితా సేన్‌
నన్ను పెళ్లి చేసుకుంటే నా ప్రియుడి చెల్లికి పెళ్లవదా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement