
మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్, ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ విడిపోయారంటూ బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు సుష్మితా మొన్నటినుంచి తన మాజీ బాయ్‌ఫ్రెండ్ రోహ్మన్‌షాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. తాజాగా ఆమె కూతురు రినీ సేన్ బర్త్‌డే గ్రాండ్‌గా జరిగింది. ఈ పార్టీకి రోహ్మన్‌తో పాటు తన మరో మాజీ ప్రియుడు రితిక్ భాసిన్ కూడా వచ్చాడు. ఈ మేరకు పలు ఫొటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా వదిలింది.
'సెప్టెంబర్ 4న నా ఫస్ట్ లవ్ రినీ సేన్ 23వ పుట్టినరోజు జరుపుకుంది. నా కుటుంబసభ్యులు, రినీ ఫ్రెండ్స్‌తో రాత్రి పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేశాం. రినీ బర్త్‌డేను ఇంత అద్భుతంగా సెలబ్రేట్ చేసిన రితిక్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఐ లవ్‌యూ గయ్స్' అని రాసుకొచ్చింది. సుష్మిత కూతురు పుట్టినరోజున లలిత్ రాలేదు, కానీ ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్స్ రావడం ఏంటో? వారితో పార్టీ చేసుకోవడమేంటో అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
చదవండి: బిగ్‌బాస్ 6: నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే!
ఐశ్వర్యపై నెటిజన్ల ప్రశంసలు
Comments
Please login to add a commentAdd a comment