లలిత్ మోదీ లేఖ నిజమే: ఐసీసీ | ICC confirms receiving Lalit Modi's email in 2013 | Sakshi
Sakshi News home page

లలిత్ మోదీ లేఖ నిజమే: ఐసీసీ

Published Sun, Jun 28 2015 11:57 PM | Last Updated on Sun, Sep 3 2017 4:32 AM

లలిత్ మోదీ లేఖ నిజమే: ఐసీసీ

లలిత్ మోదీ లేఖ నిజమే: ఐసీసీ

దుబాయ్: ముగ్గురు అంతర్జాతీయ ఆటగాళ్లకు రియట్ ఎస్టేట్ దిగ్గజం భారీగా లంచం ఇచ్చినట్టు ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ తమకు లేఖ రాసింది నిజమేనని ఐసీసీ ధృవీకరించింది. ఈ వ్యవహారంపై మోదీ శనివారం ట్విట్టర్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. ముడుపులు అందుకున్న వారిలో ఇద్దరు భారత్, ఒకరు విండీస్ ఆటగాడున్నట్టు ఆయన చెప్పారు. ‘మోదీ మాకు జూన్ 2013లో ఈ-మెయిల్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ఆ సమయంలోనే దీన్ని ఏసీఎస్‌యూకు తెలిపాం. వారు బీసీసీఐ అవినీతి వ్యతిరేక యూనిట్‌కు కూడా పంపారు’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు మోదీ లేఖపై ఐసీసీ వివరణ ఇవ్వాల్సిన అవసరముందని బీహార్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఆదిత్య వర్మ డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement