జీవితకాలపు వేటు వేయాల్సిందే: మోడీ
జీవితకాలపు వేటు వేయాల్సిందే: మోడీ
Published Mon, Feb 10 2014 5:19 PM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM
బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్, అతని అల్లుడు గురునాథ్ మేయప్పన్ పై జీవితకాలపు నిషేధం విధించాలని బహిష్కృత ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీ డిమాండ్ చేశారు. ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో గురునాథ్ మేయప్పన్ పై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ ముగ్దల్ కమిటి నేరారోపణ చేసిన సంగతి తెలిసిందే.
క్రికెట్ ఇండియా సిమెంట్ యాజమాన్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై చర్యలు తీసుకోవడానికి అధికారులు నిద్ర మత్తు నుంచి బయటపడాల్సిన సమయం ఆసన్నమైంది లలిత్ మోడీ ట్విటర్ లో తెలిపారు. ఈ వ్యవహారం గురించి నేనెప్పటి నుంచో చెబుతున్నాను. ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై జీవితకాలపు బహిష్కరణ విధించాలి అని ఆయన అన్నారు.
నివేదిక కాపీ కోసం వేచి చూస్తున్నాను. ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ యజమాని బెట్టింగ్, ఫిక్సింగ్ పాల్పడితే.. నిబంధనల ప్రకారం వేటు వేయాలని ఆయన అన్నారు.
Advertisement