Mudgal committee
-
ముద్గల్ నివేదికను బయటపెట్టండి!
సుప్రీంకోర్టును కోరిన బీసీసీఐ న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్పై ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని బీసీసీఐ మంగళవారం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఎన్నో ఊహాగానాలకు తావిస్తున్న నివేదికను బయటపెట్టాలని తమను కోరడం తప్పే అయినప్పటికీ అలా చేయడం వల్ల ఇబ్బందులు తప్పుతాయని బోర్డు తరఫు న్యాయవాది వాదించారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ విచారణలో న్యాయవాది అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటున్నామని జస్టిస్ టీఎస్ ఠాకూర్, మొహమ్మద్ ఇబ్రహీం ఖలీఫుల్లాతో కూడిన బెంచ్ వెల్లడించింది. ఈ కేసును బుధవారానికి వాయిదా వేసింది. చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్ ‘ఇన్సైడ్ ట్రేడింగ్’కు పాల్పడ్డాడని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గురు సమాచారాన్ని లీక్ చేస్తే మరొకరు బెట్ కాసేవారని వివరించింది. మరోవైపు మొదట 1, 2 ఆటగాళ్ల పేర్లను బహిర్గతం చేయాలని కోరిన బీహార్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఆ తర్వాత మొత్తం నివేదికను బయటకు వెల్లడించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. -
అన్నీ మంచి శకునములే !
భారత క్రికెట్ పరిపాలనా వ్యవహారాల్లో శ్రీనివాసన్‌కు ఎదురులేదని మరోసారి రుజువు కాబోతోంది. మంగళవారం జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశం ద్వారా చాలా అంశాల్లో స్పష్టత వచ్చింది. ఇక డిసెంబరులో శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం లాంఛనమే కానుంది. సాక్షి క్రీడావిభాగం స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసు విచారణ సందర్భంగా ముద్గల్ కమిటీ నివేదికను పరిశీలించిన సుప్రీం కోర్టు బెంచ్... ‘ఓ క్రికెటర్ తప్పు చేస్తున్నాడని శ్రీనివాసన్‌కు తెలిసినా ఆయన పట్టించుకోలేదు’ అని తెలిపింది. ఈ మొత్తం కేసుల విషయంలో ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ ఇదొక్కటే. బెట్టింగ్, ఫిక్సింగ్‌లతో ఆయనకు సంబంధం లేదని నివేదిక ద్వారా వెల్లడైంది. అయితే ఉన్న ఒక చిన్న ఆరోపణ విషయంలో కూడా ఆయన దోషి కాదని బీసీసీఐ నిర్ధారించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన అంశం గురించి మంగళవారం జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో ఐపీఎల్ చైర్మన్ రంజీబ్ బిస్వాల్ వివరణ ఇచ్చారు. అదేమిటంటే... 2010లో భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న సమయంలో బిస్వాల్ జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించారు. ఆ పర్యటనలో ఒక భారత క్రికెటర్ (ముద్గల్ కమిటీలో ఈ క్రికెటర్ నంబర్ 3, చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు) తన హోటల్ రూమ్‌లో నిద్రపోకుండా ఒక మహిళతో బయట తిరుగుతూ కనిపించాడు. ఈ విషయాన్ని బిస్వాల్ అప్పుడే బోర్డుకు తెలిపారు. అప్పుడు శశాంక్ మనోహర్ బోర్డు అధ్యక్షుడు, శ్రీనివాసన్ కార్యదర్శి. వీరిద్దరితో పాటు రాజీవ్ శుక్లాకు కూడా ఈ విషయం చెప్పారు. దీంతో అప్పటి అధ్యక్షుడు మనోహర్ స్పందించి... ఆ క్రికెటర్‌ను గట్టిగా హెచ్చరించాలని బిస్వాల్‌కు సూచించారు. ఈ వ్యవహారంలో అధ్యక్షుడు చర్యలు తీసుకున్నందున నాటి కార్యదర్శి శ్రీనివాసన్ ఏమీ మాట్లాడలేదు. ముద్గల్ కమిటీ కూడా ఆ అంశాన్నే ప్రస్తావించిందని వర్కింగ్ కమిటీలో స్పష్టత వచ్చింది. ఫిక్సింగ్ కేసు విచారణ సందర్భంగా ఈ వ్యవహారాన్ని పూర్తిస్థాయిలో సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళతారు. కాబట్టి శ్రీనివాసన్‌కు ఎలాంటి న్యాయపరమైన సమస్యలు రావని వర్కింగ్ కమిటీ భావిస్తోంది. ఈస్ట్‌జోన్‌లో కీలకమైన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా, శ్రీనివాసన్‌కు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించారు. తొలుత కాస్త వెనుకడుగు వేసినా శ్రీని తప్పులేదని వర్కింగ్ కమిటీ తేల్చడంతో అండగా నిలిచేందుకు దాల్మియా ముందుకొచ్చారు. ఈ జోన్‌లోని ఆరు యూనిట్లు కూడా శ్రీనివాసన్‌కు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ డిసెంబర్ 17న జరిగే ఏజీఎమ్‌లో ఆయన నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయనున్నాయి. దీంతో అధ్యక్ష పదవి ఆశిస్తున్న శరద్ పవార్‌కు దాదాపుగా అన్ని ద్వారాలు మూసుకుపోయినట్లే. ఏజీఎమ్‌లో పవార్ వెనక్కి తగ్గినా.. అప్పటికప్పుడు కొత్త వ్యక్తి అధ్యక్షుడు అయ్యే అవకాశాలు లేవు. ఈస్ట్‌జోన్ మొత్తం శ్రీనివాసన్ వెంటే ఉంది. కాబట్టి ఆయన మూడోసారి బీసీసీఐ అధ్యక్షుడు కావడానికి లైన్ క్లియర్ అయినట్లే. మూడు సంఘాలపై చర్యలు! బీసీసీఐ ఎన్నికల అనంతరం మూడు సంఘాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బోర్డు పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు బోర్డుకు అయిన కోర్టు ఖర్చులన్నీ ముంబై, పంజాబ్, విదర్భ సంఘాల నుంచి రాబట్టాలని భావిస్తున్నారు. గుర్తింపు లేని బీహార్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ఆదిత్య వర్మ కోర్టులో కేసు దాఖలు చేస్తే... ఈ మూడు సంఘాలకు సంబంధించిన అధికారులు వర్మకు అండగా నిలవడం వల్లే చర్యలు తీసుకుంటున్నారని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక నుంచి ముంబైలో మ్యాచ్‌లు ఎంసీఏకి ఇవ్వకుండా... సీసీఐకి ఇచ్చి, బ్రబౌర్న్‌లో నిర్వహించాలనే ప్రతిపాదన కూడా ఉంది. -
'ధోని అబద్ధం చెప్పాడు'
న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్‌తో గురునాథ్ మెయ్యప్పన్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన ఆ జట్టు కెప్టెన్ ఎం.ఎస్.ధోని వ్యాఖ్యలతో ముద్గల్ కమిటీ నివేదిక విభేదించింది. మెయ్యప్పన్ కచ్చితంగా సీఎస్కే టీమ్ ప్రిన్సిపల్‌గా ఉన్నారని నివేదిక తేల్చిన విషయం తెలిసిందే. గతంలో ఈ కమిటీ ముందు హాజరైన ధోని... గురునాథ్ కేవలం క్రికెట్ అంటే ఆసక్తితోనే జట్టుతో పాటు ఉన్నాడని, అతడికి ఎలాంటి అధికారం లేదని అబద్ధం చెప్పాడు. తనే కాకుండా ఇండియా సిమెంట్స్ ప్రతినిధులు కూడా గురునాథ్‌కు సీఎస్కేలో ఎలాంటి వాటాలు లేవని అబద్దాలు చెప్పినట్లు కమిటీ పేర్కొంది. మరోవైపు ఈ విషయమై జస్టిస్ ముకుల్ ముద్గల్ మాట్లాడేందుకు నిరాకరించారు. మరోవైపు ధోని ఆస్ట్రేలియా పర్యటన కోసం బ్యాట్లను ఎంపిక చేసుకునేందుకు మంగళవారం మీరట్ వెళ్లాడు. ఒక్కోటి 1260 గ్రాముల బరువున్న ఆరు బ్యాట్లను ఎంపిక చేసుకున్నాడు. అక్కడి పిచ్‌ల స్వభావం దృష్ట్యా బ్యాట్లను మార్చాడు. -
రాజ్ కుంద్రాకు బుకీలతో సంబంధాలు:ముద్గల్ కమిటీ
న్యూఢిల్లీ: గత సంవత్సరం జరిగిన ఐపీఎల్ టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రాకు బుకీలతో సంబంధాలు కొనసాగించినట్లు ముద్గల్ కమిటీ తేల్చింది. దీంతో పాటు క్రికెట్ అడ్మినిస్టేటర్ సుందర రామన్ కు కూడా బుకీలతో సంబంధాలున్నట్లు స్పష్టం చేసింది. ఓ బుకీకి సుందర రామన్ ఎనిమిదిసార్లు ఫోన్ చేసినట్లు ఆధారాలు లభించాయని ముద్గల్ కమిటీ పేర్కొంది. అయితే బీసీసీఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ తో పాటు అతని మేనల్లుడు గురునాథన్ మెయప్పన్ లకు క్లీన్ చిట్ లభించింది. ఆ బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించి మెయప్పన్ లపై వచ్చిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని కమిటీ పేర్కొంది. ఐపీఎల్-2013 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసుకు సంబంధించి జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికపై శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. -
4 గంటల పాటు... కెప్టెన్ ధోనిని విచారించిన ముద్గల్ కమిటీ
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసును విచారిస్తున్న ముద్గల్ కమిటీ... చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్.ధోనిని నాలుగు గంటల పాటు విచారించింది. ఈనెల 11న విండీస్‌తో జరిగిన వన్డేకు ముందు రోజు ఈ విచారణ జరిగింది. చెన్నై బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా కూడా దాదాపు 3 గంటల పాటు విచారణను ఎదుర్కొన్నాడు. కొంత మంది ఢిల్లీ పోలీసు అధికారుల సమక్షంలో మహీని కమిటీ విచారణాధికారి, నేషనల్ నార్కోటిక్స్ బ్యూరో డిప్యూటీ డెరైక్టర్ బీబీ మిశ్రా ప్రశ్నించారు. వ్యక్తిగత కారణాలు చెప్పి తప్పించుకోకుండా ఉండేందుకు ఈ ఇద్దరికి ముందుగానే కమిటీ సమన్లు జారీ చేసింది. స్పాట్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించి వచ్చే నెల 2న ముద్గల్ కమిటీ తన తుది నివేదికను సుప్రీంకోర్టుకు అందజేయనున్న నేపథ్యంలో ఈ విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఏజీఎంపై నేడు సమావేశం
చెన్నై: బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై బోర్డు ఉన్నతాధికారులు నేడు (ఆదివారం) సమావేశం కానున్నారు. షెడ్యూల్ ప్రకారం ఏజీఎం ఈనెల 30లోగా జరగాల్సి ఉంది. అయితే మెజారిటీ సభ్యులు మాత్రం... ఐపీఎల్ బెట్టింగ్, ఫిక్సింగ్పై ముకుల్ ముద్గల్ కమిటీ తుది నివేదిక ఇచ్చే దాకా వాయిదా వేయాలని భావిస్తున్నారు. ఈ భేటీలో పాల్గొనే దాదాపు 20 మంది సభ్యులు శ్రీనివాసన్ మద్దతుదారులే. బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్... హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికల కారణంగా ఈ సమావేశానికి గైర్హాజరు కానున్నారు. ముద్గల్ కమిటీ నివేదికలో శ్రీనివాసన్‌కు క్లీన్చిట్ లభిస్తే మరోసారి అధ్యక్షుడిగా ఆయన ఎన్నికకు ఎలాంటి అడ్డంకి ఉండబోదని ఆయన మద్దతుదారుల ఆలోచన. ప్రస్తుతం శ్రీనివాసన్ ప్రత్యర్థి శశాంక్ మనోహర్‌కు నాలుగు రాష్ట్రాల యూనిట్ల మద్దతు మాత్రమే ఉంది. -
శ్రీనివాసన్‌కు క్లీన్చిట్!
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్పై ఇంకా విచారణ కొనసాగుతున్నా... ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్‌కు మాత్రం ఊరట దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన విచారణలో శ్రీని ప్రమేయం లేదని ఓ నిర్ధారణకు వచ్చిన ముద్గల్ కమిటీ ఆయనకు క్లీన్చిట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఫిక్సింగ్ కేసులో శ్రీనివాసన్‌కు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్నీ సేకరించలేకపోయిన కమిటీ సీబీసీఐడీ దర్యాప్తులో కూడా ఆయన జోక్యం లేదని తేల్చింది. కేవలం ఇద్దరు అధికారులు కావాలని ఆరోపణలు చేసినట్లు గుర్తించింది. మ్యాచ్‌లు ఫిక్స్ చేయాలని అటు కెప్టెన్ ధోనితోపాటు సూపర్‌కింగ్స్ ఆటగాళ్లకు కూడా శ్రీనివాసన్ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని కమిటీ దృష్టికి వచ్చింది. ఇటీవల సుప్రీంకోర్టుకు సమర్పించిన మధ్యంతర నివేదికలో కమిటీ ఈ అంశాలను పొందుపర్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే గురునాథ్ మెయ్యప్పన్‌పై కొన్ని ఆరోపణలు చేసిన కమిటీ... విక్రమ్ అగర్వాల్, ధోని, మెయ్యప్పన్ల మధ్య జరిగిన సమావేశంలో ఫిక్సింగ్ అంశాలు చోటు చేసుకోలేదని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
ముద్గల్ కమిటీకి మరో రెండు నెలలు
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బె ట్టింగ్‌పై విచారణ సాగిస్తున్న జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ తుది నివేదిక కోసం సుప్రీం కోర్టు మరో రెండు నెలల సమయం పొడిగించింది. గత మే16న శ్రీనివాసన్, 12 మంది క్రికెటర్లపై విచారణ సాగించేందుకు కోర్టు ముద్గల్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించి ఆగస్టు చివర్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గత నెల 29న కమిటీ మధ్యంతర నివేదిక ఇచ్చింది. అయితే భారత క్రికెటర్లలో కొందరి స్టేట్మెంట్స్ రికార్డు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తుది నివేదికకు మరికొంత సమయం కావాలని కోరింది. దీంతో కోర్టు రెండు నెలల సమయాన్ని పొడిగిస్తూ విచారణను వేగవంతం చేయాలని ఆదేశించింది. శ్రీనివాసన్ అభ్యర్థనకు తిరస్కారం బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునేందుకు అనుమతించాలన్న ఎన్.శ్రీనివాసన్ అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ముద్గల్ కమిటీ నుంచి క్లీన్చిట్ వచ్చే వరకు ఆ పదవిని చేపట్టే వీల్లేదని జస్టిస్ టీఎస్ ఠాకూర్, ఎఫ్ఎమ్ ఇబ్రహీం కలీఫుల్లాతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ముద్గల్ నివేదికలో శ్రీనివాసన్‌కు వ్యతిరేకంగా ఉంటే బయటపెట్టాలని, అలా లేనిపక్షంలో బాధ్యతలు చేపట్టేందుకు అనుమతించాలని లాయర్ కపిల్ సిబాల్ వాదించారు. అయితే రిపోర్టులో శ్రీనికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యానాలు లేకపోయినా విచారణ పూర్తి కాలేదు కాబట్టి అనుమతించలేమని బెంచ్ తేల్చి చెప్పింది. -
బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కు ఎదురుదెబ్బ!
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముగ్దల్ కమిటీ విచారణ పూర్తయ్యేంత వరకు శ్రీనివాసన్ బీసీసీఐ పదవీ బాధ్యతలు చేపట్టడానికి వీల్లేదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చించింది. అంతేకాక ఏపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై ముగ్దల్ కమిటీ జరుపుతున్న దర్యాప్తుపై సుప్రీం కోర్టు ఆసంతృప్తిని వెల్లగక్కింది. అంతేకాక కమిటీ దర్యాప్తును రెండు నెలల్లోగా పూర్తి చేయాలని ముగ్దల్ కమిటీని ఆదేశించింది. వార్షిక సాధారణ సమావేశం నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని శ్రీనివాసన్ చేసిన విజ్క్షప్తిని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు టీఎస్ ఠాకూర్, ఎఫ్ఎమ్ ఇబ్రహీం కలీఫుల్లా కూడిన బెంచ్ తోసిపుచ్చింది. -
విచారణకు సహకరిస్తా!
రాజ్‌కుంద్రా వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో బెట్టింగ్‌కు సంబంధించి రెండో దశ విచారణ సందర్భంగా ముద్గల్ కమిటీ ముందు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రా అన్నారు. మరోసారి తనకు తెలిసిన సమాచారం అందజేస్తానని ఆయన చెప్పారు. ‘ఫిక్సింగ్, బెట్టింగ్ విషయంలో మరో సారి ముద్గల్ కమిటీ విచారణ జరపడం మంచి పరిణామం. నాకు దానితో ఎలాంటి సమస్యా లేదు. ఇప్పటి వరకు నాకు ఇంకా కమిటీ ముందు హాజరు కావాలని పిలుపు రాలేదు. అయితే మున్ముందు విచారణలో అన్ని విధాలా సహకరిస్తా’ అని కుంద్రా వెల్లడించారు. తాను బెట్టింగ్‌కు పాల్పడినట్లుగా ఎప్పుడూ అంగీకరించలేదని రాయల్స్ యజమాని స్పష్టం చేశారు. సంజు శామ్సన్ రూపంలో రాజస్థాన్ రాయల్స్ మరో భారత క్రికెటర్‌ను అందించడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. రవీంద్ర జడేజా, స్టువర్ట్ బిన్నీ, రహానేల తర్వాత ఇప్పుడు శామ్సన్ కూడా టీమిండియాకు ఎంపిక కావడం... రాహుల్ ద్రవిడ్‌తో సహా తమ మేనేజ్మెంట్కు సంతోషాన్నిచ్చిందని కుంద్రా వ్యాఖ్యానించారు. -
‘ఎవరినీ విచారించలేదు’
న్యూఢిల్లీ: ఐపీఎల్లో స్పాట్‌ఫిక్సింగ్, బెట్టింగ్‌లపై విచారణ జరుపుతున్న జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ... ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్, గురునాథ్ మెయ్యప్పన్‌లను ఇటీవల విచారించిందంటూ వచ్చిన వార్తలు వాస్తవం కాదని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ముద్గల్ కమిటీ ఎవరినీ విచారించలేదని, విచారణలో భాగం పంచుకుంటున్న అధికారులతో చర్చించేందుకే ఈ నెల 15, 16వ తేదీల్లో చెన్నైకి వెళ్లి వారితో సమావేశమైందని బీసీసీఐ పేర్కొంది. -
ఐపీఎల్ ఫిక్సింగ్పై విచారణకు ముద్గల్ కమిటీ
ఆగస్టులోగా నివేదిక ఇవ్వాలి సుప్రీం కోర్టు ఆదేశం న్యూఢిల్లీ: గతేడాది ఐపీఎల్లో నెలకొన్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లపై పూర్తి స్థాయి విచారణకు రిటైర్డ్ జడ్జి ముకుల్ ముద్గల్ కమిటీయే నేతృత్వం వహించనుంది. ఇదే కమిటీ గతంలో తమ ప్రాథమిక విచారణను పూర్తి చేసి సీల్డ్ కవర్లో కోర్టుకు అప్పగించింది. దీంట్లో ఎన్.శ్రీనివాసన్‌తో సహా, 12 మంది క్రికెటర్ల పేర్లున్న విషయం తెలిసిందే. సభ్యులుగా ఎల్.నాగేశ్వర్ రావు, నిలయ్ దత్తా కొనసాగనున్నారు. అలాగే ఈ విచారణను ఆగస్టు చివరిలోగా పూర్తి చేసి సీల్డ్ కవర్లో అందించాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ కమిటీకి సహాయంగా ఐపీఎస్ మాజీ అధికారి బీబీ మిశ్రా ఉండనున్నారు. బీహార్‌లో సంచలనం కలిగించిన గడ్డి కుంభకోణం కేసును దర్యాప్తు చేసిన అనుభవం ఈయనకు ఉంది. అలాగే ముంబై, చెన్నై, ఢిల్లీల నుంచి ఒక్కో సీనియర్ పోలీస్ అధికారి సేవలు కూడా తీసుకోనున్నారు. అలాగే వీరితో పాటు ఓ మాజీ క్రికెటర్‌ను ముద్గల్, మిశ్రా ఎంపిక చేసుకోనున్నారు. విచారణలో భాగంగా కమిటీకి పరిశోధనా హక్కులతో పాటు సంబంధిత పత్రాలను సీజ్ చేయడం, సాక్ష్యాలను రికార్డు చేసే అధికారం ఉంటుంది. అయితే ఎవరినీ అరెస్ట్ చేసే అధికారం మాత్రం లేదు. విచారణ సాగినంత కాలం ఒక్కో రోజుకు రూ.లక్ష ఇవ్వడంతో పాటు అన్ని ఖర్చులను బీసీసీఐ భరించాల్సి ఉంటుంది. మరోవైపు ఈ విచారణ కోసం ముద్గల్ కమిటీ కాకుండా కొత్త వారిని నియమించాలన్న బోర్డు విన్నపాన్ని జస్టిస్ ఏకే పట్నాయక్‌తో కూడిన బెంచ్ తోసిపుచ్చింది. నివేదికలో ఉన్న 13 మంది నిందితుల పేర్లను కొత్త వారు చూడడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. వీటితో పాటు తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా గవాస్కర్, శివలాల్ యాదవ్ తమ పదవుల్లో కొనసాగుతారని కోర్టు స్పష్టం చేసింది. ఐసీసీ సమావేశాలకు, బీసీసీఐ ఏజీఎంలకు శ్రీనివాసన్ వెళ్లేందుకు అనుమతించాలన్న వినతిని కోర్టు తిరస్కరించింది. కోర్టు నిర్ణయం బాగుంది: ఆదిత్య వర్మ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్లపై విచారణకు ముద్గల్ కమిటీనే నియమించడంపై బీహార్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆదిత్య వర్మ సంతోషం వ్యక్తం చేశారు. ‘ఫిక్సింగ్ విచారణపై పూర్తి అధికారాలను ముద్గల్ కమిటీకి ఇచ్చిన సుప్రీం కోర్టు తీర్పుపై మేం చాలా సంతోషంగా ఉన్నాం’ అని వర్మ చెప్పారు. -
ఫిక్సింగ్పై విచారణ 25కు వాయిదా
-
ఫిక్సింగ్పై విచారణ 25కు వాయిదా
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌పై ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికపై సుప్రీం కోర్టు తమ విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది. ఈ రిపోర్ట్‌పై బీసీసీఐ తమ స్పందనను గురువారమే దాఖలు చేయడంతో వాటిని పూర్తిగా పరిశీలించాల్సి ఉందని జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయపడింది. గత సీజన్లో చోటు చేసుకున్న ఫిక్సింగ్ ఉదంతంపై విచారణ జరిపేందుకు రిటైర్డ్ జస్టిస్ ముద్గల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎన్.నాగేశ్వర్ రావు, అస్సాం క్రికెట్ అసోసియేషన్ సభ్యులు నిలయ్ దత్తాలతో కూడిన కమిటీని గతంలోనే సుప్రీం కోర్టు నియమించింది. -
ఐపీఎల్ కౌన్సిలే చర్య తీసుకుంటుంది
ముద్గల్ కమిటీ నివేదికలో తేడాలున్నాయి కోర్టుకు తెలిపిన బీసీసీఐ న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫిక్సింగ్పై సుప్రీం కోర్టుకు సమర్పించిన ముద్గల్ కమిటీ నివేదికలో తేడాలున్నాయని సుప్రీం కోర్టుకు బీసీసీఐ తెలిపింది. ఈ కమిటీ నివేదికపై బోర్డు తమ స్పందనను గురువారం తెలిపింది. త్రిసభ్య కమిటీ త మ నివేదికను రెండు భాగాలుగా కోర్టుకు సమర్పించింది. రిటైర్డ్ జస్టిస్ ముద్గల్, అడిషినల్ సొలిసిటర్ జనరల్ నాగేశ్వర్ రావు ‘వాల్యూమ్ వన్’ పేరిట ఓ నివేదిక ఇవ్వగా.. అస్సాం క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఉపాధ్యక్షుడు, ఐపీఎల్ పాలకమండలి సభ్యుడు నీలయ్ దత్తా అనుబంధ నివేదిక ఇచ్చారు. అయితే బెట్టింగ్‌లో గురునాథ్ పాత్ర స్పష్టంగా ఉందని, ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలిందని కాబట్టి కోర్టు ఆయనపై తదుపరి చర్యలు తీసుకోవాలని ముద్గల్ నివేదిక సూచించింది. కానీ గురునాథ్, చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ రూల్స్‌ను అతిక్రమించినట్టు తేలితే వారిపై చర్య తీసుకోవాల్సింది కూడా లీగ్ పాలక మండలేనని దత్తా తన నివేదికలో పేర్కొన్నారు. దీనికి బోర్డు మద్దతిస్తూ ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపింది. ‘ఐపీఎల్ ఫ్రాంచైజీ ఒప్పందం క్లాజు 11.3ని చెన్నై జట్టు అతిక్రమించిన విషయంపై ఈ రెండు నివేదికలు విభేదిస్తున్నాయి. ముద్గల్ నివేదిక చెన్నై జట్టును దోషిగా తేలిస్తే... దత్తా రిపోర్ట్ మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. గురునాథ్ ఆ జట్టుకు యజమాని అని ఎక్కడా పేర్కొనలేదు. కాబట్టి ఫ్రాంచైజీ ఒప్పందం ప్రకారం అతడిని యజమానిగా చెప్పుకునే అర్హత లేదని దత్తా తన నివేదికలో స్పష్టం చేశారు’ అని బీసీసీఐ కోర్టుకు తెలిపింది. -
సుప్రీం సిఫారసులకు బిసిసిఐ నో....
-
ఆటగాళ్ల పేర్లను వెల్లడించవద్దు
సుప్రీంకోర్టును కోరిన బీసీసీఐ న్యూఢిల్లీ: ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్తో సంబంధమున్నట్టుగా జస్టిస్ ముద్గల్ కమిటీ పేర్కొన్న నివేదికలోని ఆటగాళ్ల పేర్లను బహిర్గతపర్చవద్దని బీసీసీఐ... సుప్రీం కోర్టును అభ్యర్థించింది. ఈ ఉదంతంపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ తమ విచారణ నివేదికను సీల్డ్ కవర్లో ఉంచి గతంలోనే కోర్టుకు సమర్పించింది. ఫిక్సింగ్‌లో ఆరుగురు భారత ఆటగాళ్లకు ప్రమేయముందని, వీరిలో ఒకరు ప్రస్తుత జట్టులోనూ ఉన్నాడని ఆ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ నివేదికను ఆధారం చేసుకుని మీడియాలో అనేక ఊహా త్మక, నిరాధార కథనాలు వ్యాప్తిలోకి వచ్చాయని బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ఏ తప్పూ చేయని క్రికెటర్లకు నష్టం కలిగించేలా ఉన్నాయని కోర్టుకు తెలిపింది. అందుకే నివేదికలోని ఆటగాళ్ల పేర్లు బయటికి రాకుండా అడ్డుకోవాలని కోర్టును అభ్యర్థించింది. ప్యానెల్ సూచనలకు అంగీకారం బెట్టింగ్, ఫిక్సింగ్‌లకు తావు లేకుండా క్రికెట్‌ను స్వచ్ఛంగా ఉంచేందుకు జస్టిస్ ముద్గల్ చేసిన ప్రతిపాదనలను బీసీసీఐ అంగీకరించింది. ఐపీఎల్ మ్యాచ్‌ల అనంతరం జరిగే పార్టీలను నిషేధించడంతో పాటు క్రికెటర్ల ఏజెంట్ల పేర్లను రిజిష్టర్ చేసుకునే విధంగా చూస్తామని తెలిపింది. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చెందిన కంపెనీల్లో ఆటగాళ్లు ఉద్యోగులుగా ఉండరాదనే ముద్గల్ కమిటీ సూచనను బీసీసీఐ తోసిపుచ్చింది. ముద్గల్ కమిటీ నివేదికపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. -
జీవితకాలపు వేటు వేయాల్సిందే: మోడీ
బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్, అతని అల్లుడు గురునాథ్ మేయప్పన్ పై జీవితకాలపు నిషేధం విధించాలని బహిష్కృత ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీ డిమాండ్ చేశారు. ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో గురునాథ్ మేయప్పన్ పై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ ముగ్దల్ కమిటి నేరారోపణ చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్ ఇండియా సిమెంట్ యాజమాన్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై చర్యలు తీసుకోవడానికి అధికారులు నిద్ర మత్తు నుంచి బయటపడాల్సిన సమయం ఆసన్నమైంది లలిత్ మోడీ ట్విటర్ లో తెలిపారు. ఈ వ్యవహారం గురించి నేనెప్పటి నుంచో చెబుతున్నాను. ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై జీవితకాలపు బహిష్కరణ విధించాలి అని ఆయన అన్నారు. నివేదిక కాపీ కోసం వేచి చూస్తున్నాను. ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ యజమాని బెట్టింగ్, ఫిక్సింగ్ పాల్పడితే.. నిబంధనల ప్రకారం వేటు వేయాలని ఆయన అన్నారు.