
‘ఎవరినీ విచారించలేదు’
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో స్పాట్‌ఫిక్సింగ్, బెట్టింగ్‌లపై విచారణ జరుపుతున్న జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ... ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్, గురునాథ్ మెయ్యప్పన్‌లను ఇటీవల విచారించిందంటూ వచ్చిన వార్తలు వాస్తవం కాదని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ముద్గల్ కమిటీ ఎవరినీ విచారించలేదని, విచారణలో భాగం పంచుకుంటున్న అధికారులతో చర్చించేందుకే ఈ నెల 15, 16వ తేదీల్లో చెన్నైకి వెళ్లి వారితో సమావేశమైందని బీసీసీఐ పేర్కొంది.