Spot-fixing
-
పోలీసుల చిత్రహింసలు తప్పించుకునేందుకే...
న్యూఢిల్లీ: దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసుల చిత్రహింసల నుంచి తప్పించుకునేందుకే స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఒప్పుకున్నానని... తాను మాత్రం ఏ తప్పూ చేయలేదని భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సుప్రీం కోర్టుకు తెలిపాడు. 2013 ఐపీఎల్లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో అతనిపై క్రికెట్ బోర్డు జీవితకాల నిషేధం విధించింది. దీనిపై కేరళకు చెందిన ఈ మాజీ పేసర్ న్యాయపోరాటం చేస్తున్నాడు. బుధవారం జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్‌లతో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ కేసును విచారించింది. పోలీస్ టార్చర్ నుంచి తప్పించుకోవడానికే శ్రీశాంత్ నిందను మోశాడని అతని లాయర్ కోర్టుకు వివరించారు. శ్రీశాంత్‌ను బుకీలు సంప్రదించిన మాట నిజమేనని అయితే తను మాత్రం బుకీల బుట్టలో పడలేదని దీనికి సంబంధించి మలయాళంలో బుకీ–శ్రీశాంత్‌ల మధ్య జరిగిన సంభాషణను లాయర్ కోర్టుకు అందజేశాడు. మైదానంలో టవల్‌తో తుడుచుకోవడం, ఆడించడమనేది సహజమని, ఇలా అందరు క్రికెటర్లు చేస్తారని దీన్ని ఫిక్సింగ్‌కు సంజ్ఞగా భావించడం తగదని శ్రీశాంత్ తరఫు న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ వాదించారు. దీనిపై న్యాయమూర్తులు స్పందిస్తూ... బుకీలు ఫిక్సింగ్‌కు పాల్పడమని సంప్రదించినపుడు క్రికెటర్ ఆ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఎందుకు తెలపలేదని లాయర్ ఖుర్షీద్‌ను ప్రశ్నించారు. దీన్నిబట్టి శ్రీశాంత్ ప్రవర్తన ఎలాంటిదనే విషయం తేటతెల్లమవుతోందని బెంచ్ స్పష్టం చేసింది. -
స్పాట్ ఫిక్సింగ్‌లో అడ్డంగా దొరికిన క్రికెటర్
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ క్రికెట్ ఆటగాళ్లు ఫిక్సింగ్‌లో కూరుకుపోయారు. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురౌతున్నా ఆటగాళ్లు మాత్రం ఫిక్సింగ్‌లో దొరకుతూనే ఉన్నారు. సరిగ్గా మూడు నెలలక్రితం పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో స్పాట ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పాక్ ఆల్‌రౌండర్ నవాజ్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రెండు నెలలపాటు నిషేధం విధించిన సంఘటన మరవక ముందే మరొక ఆటగాడు ఫిక్సింగ్‌లో అడ్డంగా దొరికిపోయాడు. తాజాగా బుధవారం పాక్ ఓపెనర్ బ్యాట్‌మెన్ సార్జీల్ఖాన్పై పాకిస్తాన్ అవినీతి నిరోధక ట్రిబ్యునల్ 5ఏళ్లపాటు నిషేధం విధించింది. మంగళవారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గత ఫిబ్రవరిలో దుబాయిలో నిర్వహించిన పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని సాక్ష్యాధారాలు సమర్పించడంతో ట్రిబ్యునల్ తుది తీర్పును వెలువరించింది. సార్జీల్ఖాన్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పతున్నారనే ఆరోపణలతో పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభమైన రెండో రోజునే లీగ్ నుంచి వెనక్కి పంపించారు. స్పాట్ ఫిక్సింగ్‌లో దొరకడం పాక్ క్రికెటర్లకు కొత్తేం కాదు. గతంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్‌భట్, పేసర్ మహమ్మద్ అమీర్, ఆసిఫ్‌లు 2010 ఇంగ్లండ్ పర్యటనలో స్పాట్ ఫిక్సింగ్‌లో అడ్డంగా దొరికిపోయారు. 2012-13లో టెస్ట్ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా సైతం ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభం అనంతరం ఈ ఫిక్సింగ్ భూతం మరింత విస్తరించింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మూడు నెలల క్రితం వేటు వేసింది. ఫిక్సింగ్ ఆరోపణలతో జంషెద్ అనే క్రికెటర్ కూడా గత ఫిబ్రవరిలో నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. -
నిషేధం ఎత్తివేయం
శ్రీశాంత్‌కు తేల్చి చెప్పిన బీసీసీఐ న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి జీవిత కాల నిషేధానికి గురైన పేసర్ శ్రీశాంత్ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. బీసీసీఐలో పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఏర్పడిన తర్వాత తనపై నిషేధాన్ని తొలగించాలంటూ కొన్నాళ్ల క్రితం శ్రీ ప్రత్యేకంగా బోర్డుకు లేఖ రాశాడు. స్కాట్లాండ్లో లీగ్ మ్యాచ్‌లు ఆడుకునేందుకు అనుమతి ఇవ్వాలని కూడా కోరాడు. అయితే అతనిపై విధించిన నిషేధాన్ని తొలగించే ప్రశ్నే లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని బోర్డు అధికారులు శ్రీశాంత్‌కు తెలియజేశారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని బోర్డు తేల్చి చెప్పింది. ‘శ్రీశాంత్‌పై జీవిత కాలం నిషేధం కొనసాగుతుంది. అతను ఎలాంటి పోటీ క్రికెట్లోనూ పాల్గొనేందుకు అనుమతించం. ఇదే విషయాన్ని అతనికి తెలియజేశాం. ఫిక్సింగ్ విషయంలో శ్రీశాంత్ తప్పు లేదంటూ ఏ కోర్టు కూడా తీర్పు ఇవ్వలేదు’ అని బోర్డు ప్రతినిధి స్పష్టం చేశారు. -
శ్రీశాంత్‌కు బీసీసీఐ అనుమతి నిరాకరణ
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవిత కాల నిషేధం ఎదుర్కొంటున్న పేసర్ శ్రీశాంత్ పునరాగమన ఆశలపై బీసీసీఐ నీళ్లు జల్లింది. స్కాట్లాండ్ క్రికెట్ లీగ్‌లో ఆడాలని చూస్తున్న ఈ కేరళ స్పీడ్‌స్టర్‌కు నిరభ్యంతర పత్రం మంజూరు చేయడానికి బీసీసీఐ నిరాకరించింది. 2013 ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు తమ విచారణలో తేలిందని, అందుకే అతడిపై జీవితకాల నిషేధం విధించామని బోర్డుకు చెందిన అధికారి తెలిపారు. 2015లో ఢిల్లీ కోర్టు నుంచి అతడికి క్లీన్చిట్ లభించినా నిషేధం ఎత్తివేసే విషయంలో తుది నిర్ణయం బీసీసీఐకే ఉంటుందన్నారు. -
అన్ని క్రికెట్ సంఘాలు అమలు చేయాల్సిందే..
లోధా ప్యానెల్ ప్రతిపాదనలపై సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: దేశంలోని అన్ని క్రికెట్ సంఘాలు తప్పనిసరిగా జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలు అమలు చేయాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ‘ఒకసారి బీసీసీఐ వీటిని అమలు చేస్తే ఇక అన్ని రాష్ట్ర సంఘాలు కూడా ఇదే పద్దతి అనుసరిస్తాయి. మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో ఏర్పాటైన ఈ కమిటీని ఆషామాషీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని అంశాలను నిశితంగా గమనించి నిపుణు లైన కమిటీ సభ్యులు చేసిన సూచనలివి. వీటిని కేవలం ప్రతిపాదనలే అనే కోణంలో చూడకూడదు’ అని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ స్పష్టం చేశారు. అంతకుముందు లోధా ప్యానెల్ సూచనలు ఆమోదయోగ్యం కాదని హర్యానా క్రికెట్ సంఘం చేసిన అభ్యంతరాలపై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మరోవైపు గరిష్ట వయస్సు ప్రతిపాదనపై కూడా కర్ణాటక క్రికెట్ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్యానెల్ సూచనలు కొన్ని అమలు పరిచే విధంగానే ఉన్నా కొన్ని మాత్రం ఆమోదయోగ్యంగా లేవని పేర్కొంది. -
చండీలాపై జీవిత కాల నిషేధం
-
చండీలాపై జీవిత కాల నిషేధం
♦ హికేన్ షాపై ఐదేళ్లు ♦ బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం ముంబై: ఐపీఎల్-6లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆఫ్ స్పిన్నర్ అజిత్ చండీలాపై జీవిత కాల నిషేధం విధించారు. సోమవారం శశాంక్ మనోహర్ నేతృత్వంలోని బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే సహచర ఆటగాడిని ఫిక్సింగ్ కోసం సంప్రదించినందుకు ముంబైకి చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ హికేన్ షాపై ఐదేళ్ల నిషేధం విధించారు. 2013లో జరిగిన ఐపీఎల్ ఎనిమిదో సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన చండీలా మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసేందుకు డబ్బులు తీసుకోవడంతో పాటు ఉద్దేశపూర్వకంగా పేలవ ప్రదర్శన కనబరచడం, మరో ఆటగాడితో ఫిక్సింగ్ చేయించాలని ప్రయత్నించిన ఆరోపణల్లో దోషిగా తేలడంతో బోర్డు కఠిన చర్య తీసుకుంది. ‘బీసీసీఐ అవినీతి వ్యతిరేక కోడ్‌లోని పలు నిబంధనల ప్రకారం చండీలాపై జీవిత కాల నిషేధం విధించాం. ఇక తను బోర్డుకు సంబంధించిన ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనడానికి వీల్లేదు. దేశవాళీల్లో సహచర ఆటగాడిని ఫిక్సింగ్ చేయాల్సిందిగా ఒత్తిడి చేసినందుకు హికేన్ షాపై ఐదేళ్ల నిషేధం పడింది. క్రికెట్లో స్వచ్ఛత కోసం మేం పాటుపడుతున్నాం. ఎలాంటి అవినీతి చర్యలకు దిగినా పరిస్థితి సీరియస్‌గా ఉంటుంది’ అని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. మరోవైపు పాక్ అంపైర్ అసద్ రవూఫ్ తనపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలపై స్పందించేందుకు సోమవారం నాటి సమావేశానికి హాజరుకాలేదు. అయితే ఈ విచారణ నిస్పాక్షికంగా జరగడం లేదని, తిరిగి మరో విచారణ అధికారి ఆధ్వర్యంలో మొదటినుంచి జరపాలని లేఖ రాశారు. అయితే కమిటీ దీన్ని తిరస్కరించింది. వచ్చే నెల 9లోగా ఫిక్సింగ్ ఆరోపణలపై రాతపూర్వక సమాధానాన్ని పంపించేందుకు ఆయనకు ఆఖరి అవకాశాన్నిస్తున్నట్టు పేర్కొంది. అదే నెల 12న రవూఫ్‌పై నిర్ణయాన్ని ప్రకటిస్తారు. -
చండిలా, హికేన్లపై నిర్ణయం 18కి వాయిదా
ముంబై: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల్లో ఇరుక్కున్న అజిత్ చండిలా, హికేన్ షాలపై నిర్ణయాన్ని బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ ఈనెల 18కి వాయిదా వేసింది. పాక్ అంపైర్ అసద్ రవూఫ్ తనపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలపై సమాధానమిచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరడంతో మంగళవారం సమావేశమైన కమిటీ అంగీకరించింది. -
మళ్లీ బరిలోకి 'స్పాట్ ఫిక్సింగ్' క్రికెటర్
లాహోర్ :స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో నిషేధానికి గురైన పాక్ పేసర్ మహ్మద్ ఆమిర్ మళ్లీ బరిలోకి దిగనున్నాడు. ఐసీసీ సవరించిన కొత్త నిబంధనల ప్రకారం వచ్చేనెల నుంచి పోటీ క్రికెట్లోకి అడుగు పెట్టనున్నాడు. ఇందులో భాగంగానే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గత నవంబర్ లో ఐసీసీకి లేఖ రాసింది. ఆమిర్ స్పాట్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించి సమీక్ష నిర్వహించి అతనికి తక్షణ ఉపశమనం కల్గించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొంది. 2015 సెప్టెంబర్ నెలతో అతని ఐదు సంవత్సరాల నిషేధ గడువు ముగుస్తుండటంతో ముందుగా దేశవాళీ క్రికెట్ లో అవకాశం కల్పించాలని పీసీబీ విజ్ఞప్తి చేసింది. దీనిపై శుక్రవారం ఐసీసీ సమీక్ష నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమిర్ వచ్చే నెల నుంచి మళ్లీ గుర్తింపు పొందిన పోటీ క్రికెట్ లో ఆడే అవకాశం దక్కింది. ప్రపంచకప్ తరువాత పాక్ లో జరిగే సూపర్-8 ట్వంటీ మ్యాచ్ ల్లో ఆమిర్ పాల్గొనే అవకాశం ఉంది. 2010 లో లార్డ్స్ లో జరిగిన టెస్ట్ లో ఆమిర్ ఫిక్సింగ్ కు పాల్పడటంతో అతనిపై ఐదు సంవత్సరాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమిర్ ఆరు నెలల జైలు జీవితాన్ని కూడా గడిపాడు. అయితే ఐసీసీ కొత్త నిబంధనలతో ఆమిర్ ఊరట చెందాడు. ఫిక్సింగ్ ఆరోపణల కేసులో ఏడాది లోపు జైలు జీవితం అనుభవించే క్రికెటర్లు తిరిగి క్రికెట్ ఆడే అవకాశాన్ని ఇస్తూ ఐసీసీ నిబంధనలను సవరించింది. -
శ్రీనివాసన్‌కు క్లీన్చిట్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ ఎన్.శ్రీనివాసన్‌కు జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ క్లీన్చిట్ ఇచ్చింది. ఐపీఎల్-6లో వెలుగుచూసిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఉదంతంపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు నియమించిన ఈ కమిటీ.. శ్రీనివాసన్ ఎలాంటి తప్పూ చేయలేదని తేల్చింది. ఆయన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లకు పాల్పడినట్టు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అలాగే ఈ కేసు విచారణను అడ్డుకునేందుకు కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని తెలిపింది. అయితే ఓ ఐపీఎల్ ఆటగాడు లీగ్ ప్రవర్తనా నియమావళిని అతిక్రమించిన విషయం శ్రీనితో పాటు మరో న లుగురు బోర్డు అధికారులకు తెలిసినా అతడిపై ఎలాంటి చర్య తీసుకోలేదని కమిటీ చెప్పింది. కానీ ఆ ఆటగాడెవరు? అతడు అతిక్రమించిన నిబంధనలు ఏమిటి? అనే విషయాలను కమిటీ వెల్లడించలేదు. నివేదికలో ఈ ఆటగాడిని మూడో నంబర్‌గా పేర్కొంది. ఈనెల 14న ఈ మొత్తం విచారణకు సంబంధించిన తుది నివేదికను కమిటీ సుప్రీం కోర్టుకు అందించిన విషయం తెలిసిందే. వీరిలో నలుగురు అధికారుల పాత్రపై నోటీసులు కూడా జారీ చేసింది. 25 పేజీల ఈ నివేదిక సోమవారం మీడియాకు అందుబాటులోకి వచ్చింది. దీంట్లో ఆ నలుగురికి సంఖ్యలు కేటాయించారు. గురునాథ్ నంబర్‌వన్‌గా ఉండగా, రాజ్ కుంద్రా నంబర్ 11, సుందర్ రామన్ నంబర్ 12, శ్రీనివాసన్ నంబర్ 13గా ఉన్నారు. బుకీతో సుందర్ రామన్‌కు సంబంధం ఐపీఎల్ సీఓఓ సుందర్ రామన్‌కు నేరుగా బుకీతో సంబంధాలున్నాయని కమిటీ తేల్చింది. సీజన్లో ఓ బుకీకి రామన్ ఎనిమిది సార్లు ఫోన్ చేశాడని చెప్పింది. విచారణలో ఈ విషయాన్ని రామన్ అంగీకరించారని, అయితే తాను ఫోన్ చేసిన వ్యక్తికిబెట్టింగ్తో సంబంధాలున్న విషయం తెలీదని చెప్పాడని నివేదిక తెలిపింది. ‘రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రా, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్‌లో పాల్గొంటున్న సమాచారం కూడా రామన్‌కు తెలుసు. అయితే ఇది శిక్షార్హమైన సమాచారం కాదని ఐసీసీ-ఏసీఎస్‌యూ చీఫ్ తెలిపినట్టు రామన్ విచారణలో చెప్పాడు’ అని నివేదిక పేర్కొంది. కుంద్రా బెట్టింగ్‌కు పాల్పడ్డారు గతేడాది ఫిబ్రవరిలో కుంద్రాను బెట్టింగ్ గురించి ప్రశ్నించినప్పుడు తనకేమీ తెలీదని సమాధానమిచ్చాడని కమిటీ పేర్కొంది. ‘అయితే పూర్తి స్థాయిలో విచారణ జరిపితే ఆయన బుకీలతో టచ్‌లో ఉన్నట్టు తెలిసింది. కుంద్రా స్నేహితుడొకరు చాలా పేరున్న పంటర్. తన తరఫున బెట్టింగ్ చేసేవాడు. మరోవైపు ఢిల్లీ పోలీసుల నుంచి కుంద్రా కేసు తమకు బదిలీ అయిన వెంటనే రాజస్థాన్ పోలీసులు ఎలాంటి కారణం లేకుండానే హఠాత్తుగా విచారణను ఆపేశారు’ అని కమిటీ పేర్కొంది. గురునాథ్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్‌గా కొనసాగిన గురునాథ్ మెయ్యప్పన్‌కు స్పాట్ ఫిక్సింగ్‌లో ప్రమేయం లేదని ముద్గల్ కమిటీ తెలిపింది. అయితే తను చట్టవ్యతిరేక బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడినట్టు తేల్చింది. ‘బుకీలకు తనకు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తితో సంభాషణలు జరిపినట్టు ఫోరెన్సిక్ శాంపిల్ తేల్చింది. అలాగే ఆయన చెన్నై టీమ్ ప్రిన్సిపల్ అని రూఢీ అయ్యింది. అయితే తను స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టుగా ఎవరూ చెప్పలేకపోయారు’ అని కమిటీ తేల్చింది. చెన్నై, రాజస్థాన్ జట్ల పరిస్థితి ప్రశ్నార్థకం! ఐపీఎల్ ఫ్రాంచైజీలైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండబోతోందనేది ప్రశ్నార్థకంగా మారింది. ముద్గల్ కమిటీ నివేదికలో వీరిద్దరికి ఆయా జట్లతో అధికారిక సంబంధాలున్నాయని తేలింది. లీగ్ నిబంధనల ప్రకారం ఏదేని జట్టు అధికారి తమ ప్రవర్తనతో ఆట ప్రతిష్టకు మచ్చ తెచ్చేట్టుగా ప్రవర్తిస్తే వారి ఫ్రాంచైజీ రద్దు అవుతుంది. కచ్చితంగా చర్యలు ఉంటాయి: శివలాల్ యాదవ్ బెట్టింగ్‌కు పాల్పడినట్టు కమిటీ తేల్చిన రాజ్ కుంద్రా, గురునాథ్ మెయ్యప్పన్లపై కఠిన చర్యలుంటాయని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్ స్పష్టం చేశారు. ఒకవేళ సుందర్ రామన్ బుకీతో మాట్లాడినట్టు సాక్ష్యాలు ఉంటే ఆయనపై కూడా చర్యలుంటాయని అన్నారు. బీసీసీఐ ఎవరినీ ఉపేక్షించదని శివలాల్ పేర్కొన్నారు. నేడు బీసీసీఐ అత్యవసర సమావేశం చెన్నై: ముద్గల్ కమిటీ నివేదికతో పాటు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నూతన తేదీపై బీసీసీఐ అత్యవసర వర్కింగ్ కమిటీ మీటింగ్‌లో చర్చించనున్నారు. నేడు (మంగళవారం) చెన్నైలో ఈ సమావేశం జరుగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 20న ఏజీఎం జరగాల్సి ఉన్నా ముద్గల్ కమిటీ విచారణ నేపథ్యంలో నాలుగు వారాలపాటు వాయిదా వేశారు. ఇప్పుడు నిర్దిష్ట తేదీపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడి హోదాలో శ్రీనివాసన్ కూడా సమావేశానికి హాజరవుతారు. -
శ్రీనివాసన్‌కు క్లీన్చిట్!
గురునాథ్ బెట్టింగ్తో ఆయనకి సంబంధం లేదు తేల్చిన జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ! ముంబై: ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వివాదంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ ఎన్.శ్రీనివాసన్‌కు జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ నివేదిక క్లీన్చిట్ ఇచ్చినట్టు సమాచారం. తమ తుది నివేదికను కమిటీ సోమవారం సుప్రీం కోర్టుకు అందజేసిన విషయం తెలిసిందే. తన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ కార్యకలాపాల్లో శ్రీనివాసన్‌కు గల సంబంధాలపై ఎలాంటి సాక్ష్యాలు లభించలేవని కమిటీ తెలిపిందని ఓ జాతీయ న్యూస్ చానెల్ కథనం ప్రసారం చేసింది. ఈనెల 10న ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు విచారణ ప్రారంభించనుంది. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్‌ల బెట్టింగ్‌పై గురునాథ్ దోషిగానే ఉన్నా స్పాట్ ఫిక్సింగ్‌లో మాత్రం అతడికి వ్యతిరేకంగా కమిటీ సాక్ష్యాలను సేకరించలేకపోయింది. ఒకవేళ సాక్ష్యాలు లభించి ఉంటే... గురునాథ్‌తో పాటు చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు కూడా న్యాయపరంగా చిక్కుల్లో పడేది. గతంలో కమిటీ విచారణ పూర్తయ్యేదాకా శ్రీనివాసన్‌ను బీసీసీఐ అధ్యక్ష పదవికి దూరంగా ఉండాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఈ నివేదిక ఆయనకు గొప్ప ఊరటనిచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. బుకీతో భారత ఆటగాడికి సంబంధం 2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో ఓ ప్రముఖ ఆటగాడికి బుకీలతో పాటు మ్యాచ్ ఫిక్సర్లతో సంబంధాలున్నట్టు జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ తేల్చినట్టు సమాచారం. అయితే ఐపీఎల్లో వివాదాస్పద రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లో అతడు సభ్యుడు కాదని, అలాగే తను ప్రస్తుత భారత జట్టులో ఆడడం లేదని కమిటీ తన నివేదికలో తెలిపింది. 2011 ప్రపంచకప్ కూడా ఫిక్స్ అయ్యిందని గతంలో ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన సెమీస్ మ్యాచ్ ఫలితాన్ని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. ఒకవేళ ముద్గల్ కమిటీ ఆ ఆటగాడి భాగస్వామ్యంపై సాక్ష్యాలు వెలికితీస్తే మరిన్ని వివరాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇదిలావుండగా విచారణలో భాగంగా చాలామంది ప్రస్తుత భారత ఆటగాళ్లు కమిటీ ముందు హాజరయ్యారు. వీరిలో ఐపీఎల్లో చెన్నైకి ఆడే ఆటగాళ్లను గురునాథ్ పాత్ర గురించి ప్రశ్నించారు. బెట్టింగ్ వివాదంలో గురునాథ్ వాయిస్ శాంపిల్స్ కూడా సరిపోయినట్టు ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది. -
సుప్రీంకోర్టుకు ముద్గల్ నివేదిక
10న విచారణ న్యూఢిల్లీ: ఐపీఎల్-6లో వెలుగు చూసిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణంపై తుది నివేదికను జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ సోమవారం సుప్రీం కోర్టుకు అందజేసింది. 13 మందిపై ఉన్న ఆరోపణలపై కమిటీ క్షుణ్ణంగా విచారించింది. ఈ మొత్తం నివేదికను జస్టిస్ టీఎస్ ఠాకూర్‌తో కూడిన బెంచ్‌కు సీనియర్ కౌన్సిల్ రాజు రామచంద్రన్ సీల్డ్ కవర్లో అందించారు. ఈనెల 10న నివేదికపై విచారణ జరుగుతుందని జడ్జి తెలిపారు. ఈ నివేదికలో ఒక భారత క్రికెటర్ పేరు ప్రస్తావించటంతో పాటు... ధోనికి ఉన్న కంపెనీల గురించి సమాచారం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే రాజ్‌కుంద్రా, మెయ్యప్పన్, విందూసింగ్ల పాత్రపై కూడా వివరంగా నివేదిక ఇచ్చినట్లు సమాచారం. -
సుప్రీంకు ముద్గల్ కమిటీ నివేదిక
-
స్పాట్ ఫిక్సింగ్పై సుప్రీంకు ముద్గల్ కమిటీ నివేదిక
న్యూఢిల్లీ : ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్పై జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ సోమవారం సుప్రీంకోర్టుకు తుది నివేదిక సమర్పించింది. మూడు నెలల విచారణ అనంతరం ఈ కమిటీ తన తుది నివేదికను న్యాయస్థానానికి సీల్డ్ కవర్లో అందించింది. ఈ కేసుపై ఈనెల 10న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బీసీసీఐ మాజీ చీఫ్, ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్‌తో పాటు టీఎన్‌సీఏ ప్రధాన కార్యదర్శి విశ్వనాథన్, క్యూ బ్రాంచ్ మాజీ ఎస్పీ సంపత్ కుమార్, సీనియర్ ఐపీఎస్ అధికారి అబాస్ కుమార్‌ను ముద్గల్ కమిటీ విచారించిన విషయం తెలిసిందే. -
3న సుప్రీంకు ముద్గల్ నివేదిక
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్పై విచారణ చేస్తున్న జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ తమ తుది నివేదికను నవంబర్ 3న సుప్రీం కోర్టుకు అందించనుంది. ‘మా విచారణ నివేదికను 3న సుప్రీం కోర్టు ముందుంచనున్నాం. ఇప్పుడు అంతకు మించి వివరాలేమీ చెప్పను’ అని కమిటీకి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ముద్గల్ తెలిపారు. ఈ కేసుపై 10న సుప్రీంలో విచారణ జరుగనుంది. అటు కోర్టు తీర్పు కోసం బీసీసీఐ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. -
ఆ మాటలు గురునాథ్, విందూలవే!
తేల్చిన సీఎఫ్ఎస్ఎల్ న్యూఢిల్లీ: చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్, బాలీవుడ్ నటుడు విందూ దారా సింగ్‌లు స్పాట్ ఫిక్సింగ్ సందర్భంగా మాట్లాడిన మాటలు.. వారి వాయిస్ శాంపిల్స్‌తో సరిపోయాయని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) తేల్చింది. దీంతో ఈ కేసులో కొంత పురోగతి రానుంది. ఈ కేసును విచారిస్తున్న ముద్గల్ కమిటీ తమ తుది నివేదికను ఈనెల 30న సుప్రీం కోర్టుకు అందజేయనుంది. బుకీలకు సమాచారాన్ని చేరవేస్తూ మ్యాచ్‌లపై గురు బెట్టింగ్‌లు కాసేవాడని కమిటీ నివేదికలో గురునాథ్‌పై ఆరోపణలు చేసింది. అయితే ఇప్పుడు సీఎఫ్ఎస్ఎల్ ఫలితం ఈ ఆరోపణలకు కొంత బలాన్ని చేకూర్చనుంది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌కు పాల్పడిన అందరి భాగోతాలను పూర్తి స్థాయిలో ఈ నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. నవంబర్ 10న ఈ కేసు విచారణకు రానుంది. -
‘ఎవరినీ విచారించలేదు’
న్యూఢిల్లీ: ఐపీఎల్లో స్పాట్‌ఫిక్సింగ్, బెట్టింగ్‌లపై విచారణ జరుపుతున్న జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ... ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్, గురునాథ్ మెయ్యప్పన్‌లను ఇటీవల విచారించిందంటూ వచ్చిన వార్తలు వాస్తవం కాదని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ముద్గల్ కమిటీ ఎవరినీ విచారించలేదని, విచారణలో భాగం పంచుకుంటున్న అధికారులతో చర్చించేందుకే ఈ నెల 15, 16వ తేదీల్లో చెన్నైకి వెళ్లి వారితో సమావేశమైందని బీసీసీఐ పేర్కొంది. -
వివాదాస్పద చిత్రంలో...వివాదాస్పద వ్యక్తి
క్రికెట్లో స్పాట్ ఫిక్సింగ్ వివాదం పుణ్యమా అని వార్తల్లో నిలిచి, ఆ కళంకం ఇప్పటికీ మాసిపోని మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఇప్పుడు బుల్లితెర, వెండితెరలపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లున్నారు. ప్రముఖులు పాల్గొనగా బుల్లితెరపై వచ్చే డ్యాన్స్ షో ‘ఝలక్ దిఖ్లా జా’ తాజా సీజన్లో ఇటీవలే ఆయన మెరిశారు. కాగా, ఇప్పుడీ మాజీ క్రికెటర్ ఏకంగా ఓ హిందీ సినిమాలో నటించనున్నారు. ఓ పాపులర్ మలయాళ చిత్రాన్ని, ఓ ప్రముఖ మలయాళ దర్శకుడు హిందీలో రీమేక్ చేయనున్నారు. ఆ సినిమాలో శ్రీశాంత్ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు భోగట్టా. సాక్షాత్తూ శ్రీశాంత్ సోదరుడైన దీపూశాంత్ ఈ సంగతి నిర్ధారించారు. ‘‘ప్రస్తుతం పాల్గొంటున్న డ్యాన్స్ రియాలిటీ షో అయిపోగానే శ్రీశాంత్ ఈ హిందీ సినిమాలో నటిస్తారు’’ అని దీపూశాంత్ తెలిపారు. ఇతర తారాగణం ఖరారు కావాల్సిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలని ఆలోచన. అన్నట్లు, ఇది ఓ కుటుంబ కథా చిత్రమట! అప్పట్లో వివాదాస్పదమైన మలయాళ సూపర్‌హిట్ చిత్రానికి ఇది హిందీ రీమేక్. మొత్తానికి, ఎక్కడకు వెళ్ళినా వివాదాన్ని వెంటబెట్టుకుపోవడం శ్రీశాంత్ పంథా అనుకోవచ్చేమో! అంతేనా, శ్రీశాంత్! -
రూ. 3 లక్షల కోట్లు
బెట్టింగ్ ద్వారా ఏటా భారత్‌లో చేతులు మారుతున్న మొత్తం ‘కొన్ని దశాబ్దాలుగా బెట్టింగ్ స్పోర్ట్స్‌లో భాగమైపోయింది. బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్, .. వీటిని పూర్తిగా నిరోధించలేం.. బెట్టింగ్‌కు ఆంక్షలతో కూడిన చట్టబద్ధత కల్పించడం ఒక్కటే దీనికి పరిష్కారం.’ ఇదీ బెట్టింగ్‌పై జస్టిస్ ముకుల్ ముద్గల్ అభిప్రాయం.. ఐపీఎల్లో అవినీతిపై ఆయన ఇటీవల సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో బెట్టింగ్‌కు చట్టబద్ధత తీసుకురావాలని సూచించారు. అయితే బెట్టింగ్‌కు చట్టబద్ధత అవసరమా ? ఇది సాధ్యమా కాదా ? అనే సంగతి కాసేపు పక్కన పెడితే కోట్ల రూపాయల సక్రమ, అక్రమ ధనం మాత్రం చేతులు మారుతోంది. రూ. 3,00,000 కోట్లు... అక్షరాల మూడు లక్షల కోట్ల రూపాయలు... రెండు, మూడు పెద్ద రాష్ట్రాల వార్షిక బడ్జెట్‌కు ఈ మొత్తం సమానం. అయితే ఇంత పెద్ద మొత్తం భారత్‌లో కేవలం బెట్టింగ్ ద్వారా చేతులు మారుతోంది... ఆశ్చర్యంగా అనిపించినా, నమ్మలేకపోయినా... ఇది నిజం. పోలీసులు బుకీలపై, బెట్టింగ్ రాయుళ్లపై ఎంతగా నిఘా పెట్టినా దీన్ని మాత్రం అరికట్టలేకపోతున్నారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్న వారిని అరెస్ట్‌చేసినా, బెయిల్‌పై బయటకు రాగానే మళ్లీ షరా మామూలే. ఐపీఎల్ ద్వారా ఎక్కువ టి20 క్రికెట్ మరీ ముఖ్యంగా 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చినప్పటి నుంచి బెట్టింగ్ జాఢ్యం మరింతగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్థాయి విద్యార్థులు ఎక్కువగా ఐపీఎల్ మ్యాచ్‌ల బెట్టింగ్ చేస్తున్నారు. ఇది ఆందోళనకర పరిణామం. గత సీజన్ ఐపీఎల్లో సుమారు రూ.40 వేల కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగినట్లు అంచనా. ప్రతి ఏటా ఐపీఎల్ సమయంలో బెట్టింగ్ 25 శాతం వరకూ పెరుగుతోంది. బెట్టింగ్‌కు చట్టబద్ధత కల్పిస్తే...? ఇండియాలో బెట్టింగ్‌కు చట్టబద్ధత లేదు కానీ.. ఇంగ్లండ్ లాంటి కొన్ని పాశ్చాత్య దేశాల్లో బెట్టింగ్ లీగలే. మన దగ్గర కూడా లీగల్ చేయాలనే డిమాండ్ అడపాదడపా వినిపిస్తోంది. ‘బెట్టింగ్‌ను లీగలైజ్ చేస్తే కోట్లాది రూపాయల ఆదాయం పన్నుల రూపంలో కేంద్రానికి వస్తుంది. ఏడాదికి మూడు లక్షలకు పైగా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. బెట్టింగ్ చట్టబద్ధత ద్వారా ప్రభుత్వానికి యేటా రూ. 1,00,000 కోట్లు (లక్ష కోట్ల రూపాయలు) పన్ను రూపంలో వస్తుంది. ఇలా ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కేంద్రం క్రీడాభివృద్ధికో లేదంటే సంక్షేమ పథకాలకో వినియోగించవచ్చు’ పలువురు మాజీ క్రికెటర్లు తరచూ చేస్తున్న సూచన ఇది. ఇటీవల ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ), కేంద్ర క్రీడా శాఖకు ఓ నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో బెట్టింగ్‌కు చట్టబద్ధత కల్పించడం ద్వారా వచ్చే లాభాలను వివరించినట్లు సమాచారం. మరింత పెరిగే అవకాశం ఒకవేళ బెట్టింగ్‌ను లీగలైజ్ చేస్తే... ఇందులో పందేల మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు బెట్టింగ్ నేరం కాబట్టి... చాటుగా భయపడుతూ పందేలు కాస్తున్నారు. అదే లీగల్ అయితే ఈ మొత్తం రెండు మూడు రెట్లకు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రస్తుతానికైతే బెట్టింగ్‌కు చట్టబద్దత కల్పించే అవకాశాలు చాలా తక్కువే. -
స్పాట్ ఫిక్సింగ్ లో మేయప్పన్ కు ఎదురుదెబ్బ!
బీసీసీఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్ అల్లుడు మాజీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యజమాని గురునాథ్ మేయప్పన్ మళ్లీ కష్టాల్లో పడ్డారు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంపై జస్టిస్ ముకుల్ ముగ్దల్ కమిటీ సోమవారం నివేదిక సమర్పించింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మేయప్పన్ పాత్ర ఉందంటూ ముగ్దల్ కమిటీ నేరారోపణ చేసింది. ముగ్లల్ కమిటీ నివేదికలో పొందుపరిచిన అంశాలకు మేయప్పన్ సమాధానమివ్వాలని ఆదేశించారు. మేయప్పన్ క్రికెట్ ఔత్సాహికుడు అంటూ శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలను విచారణ కమిటి తిరస్కరించింది. మద్రాస్ హై కోర్టుకు చెందిన ఇద్దరు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ టి జయరామ చౌతా, ఆర్ బాలసుబ్రమణ్యంతో కూడిన దిసభ్య కమిటీ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బీహార్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేయడంతో గత సంవత్సరం ముగ్దల్ కమిటిని ఏర్పాటు చేశారు. గత నాలుగు నెలలుగా దేశవ్యాప్తంగా ఆటగాళ్లను, జర్నలిస్టులను, జట్టు యాజమాన్యాన్ని, పోలీసులను, అవినీతి నిరోధక ఆధికారులను, వివిధ వ్యక్తులతోపాటు టాప్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, సౌరవ్ గంగూలీ, ఇతరులను కమిటీ విచారించింది. -
శ్రీశాంత్ కు పెళ్లి కుదిరింది!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంతో నిషేధం ఎదుర్కొంటున్న కేరళ ఫాస్ట్ బౌలర్ పెళ్లి కుదిరింది. రాజస్థాన్ కు చెందిన ఓ రాయల్ కుటుంబానికి చెందిన నయన్ తో గురువాయూర్ లోని శ్రీ కృష్ణ ఆలయంలో డిసెంబర్ 12 తేదిన పెళ్లి జరుగుతుంది అని శ్రీశాంత్ తల్లి సావిత్రి దేవి తెలిపారు. గత కొద్ది సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోందని.. ఐపీఎల్ ఆరవ ఎడిషన్ లో స్పాట్ ఫిక్సింగ్ పాల్పడి.. జైలుకెళ్లిన సమయంలో కూడా శ్రీశాంత్ కు నయన్ బాసటగా నిలిచినట్టు తెలిసింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్ ఆడకుండా బీసీసీఐ సెప్టెంబర్ లో నిషేధం విధించింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ప్రస్తుతం శ్రీశాంత్ బెయిల్ పై ఉన్నారు. శ్రీశాంత్ పై మోకా (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజడ్ క్రైమ్ యాక్ట్) కింద కేసు నమోదైంది. ఈ కేసు డిసెంబర్ 18 తేదిన విచారణకు రానుంది. -
ఫిక్సింగ్ నివారణకు రెండంచెల వ్యూహం: ద్రవిడ్
మ్యాచ్, స్పాట్ ఫిక్సింగ్ క్రిమినల్ నేరమని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. కఠినమైన చట్టాలతోనే దీన్ని నివారించగలమని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్, స్పాట్ ఫిక్సింగ్‌ను అరికట్టేందుకు రెండంచెల వ్యూహాన్ని ద్రవిడ్ సూచించాడు. వర్థమాన క్రికెటర్లకు జూనియర్ స్థాయిలో అవగాహన కల్పించాలని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. దీంతో పాటు చట్టాన్ని కఠినతరం చేయాలని అన్నాడు. ఈ చర్యలు ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిదని చెప్పాడు. ఐపీఎల్ ఆరో ఎడిషన్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ముగ్గురు క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్ అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే వీరు నేరం చేశారా, లేదా అనే దానిపై తానేమీ మాట్లాడబోనని ద్రవిడ్ అన్నాడు. తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే హక్కు అందరికీ ఉందన్నాడు. క్రికెట్ ప్రయోజనాలను కాపాడేందుకు పోలీసుల దర్యాప్తుకు క్రికెట్ పాలకులు సహకరించాలని సూచించాడు.