వివాదాస్పద చిత్రంలో...వివాదాస్పద వ్యక్తి | Cricketer Sreesanth to Enter Bollywood Soon | Sakshi
Sakshi News home page

వివాదాస్పద చిత్రంలో...వివాదాస్పద వ్యక్తి

Published Tue, Jun 17 2014 11:40 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

వివాదాస్పద చిత్రంలో...వివాదాస్పద వ్యక్తి - Sakshi

వివాదాస్పద చిత్రంలో...వివాదాస్పద వ్యక్తి

 క్రికెట్‌లో స్పాట్ ఫిక్సింగ్ వివాదం పుణ్యమా అని వార్తల్లో నిలిచి, ఆ కళంకం ఇప్పటికీ మాసిపోని మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఇప్పుడు బుల్లితెర, వెండితెరలపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లున్నారు. ప్రముఖులు పాల్గొనగా బుల్లితెరపై వచ్చే డ్యాన్స్ షో ‘ఝలక్ దిఖ్లా జా’ తాజా సీజన్‌లో ఇటీవలే ఆయన మెరిశారు. కాగా, ఇప్పుడీ మాజీ క్రికెటర్ ఏకంగా ఓ హిందీ సినిమాలో నటించనున్నారు. ఓ పాపులర్ మలయాళ చిత్రాన్ని, ఓ ప్రముఖ మలయాళ దర్శకుడు హిందీలో రీమేక్ చేయనున్నారు. ఆ సినిమాలో శ్రీశాంత్ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు భోగట్టా.
 
 సాక్షాత్తూ శ్రీశాంత్ సోదరుడైన దీపూశాంత్ ఈ సంగతి నిర్ధారించారు. ‘‘ప్రస్తుతం పాల్గొంటున్న డ్యాన్స్ రియాలిటీ షో అయిపోగానే శ్రీశాంత్ ఈ హిందీ సినిమాలో నటిస్తారు’’ అని దీపూశాంత్ తెలిపారు. ఇతర తారాగణం ఖరారు కావాల్సిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలని ఆలోచన. అన్నట్లు, ఇది ఓ కుటుంబ కథా చిత్రమట! అప్పట్లో వివాదాస్పదమైన మలయాళ సూపర్‌హిట్ చిత్రానికి ఇది హిందీ రీమేక్. మొత్తానికి, ఎక్కడకు వెళ్ళినా వివాదాన్ని వెంటబెట్టుకుపోవడం శ్రీశాంత్ పంథా అనుకోవచ్చేమో! అంతేనా, శ్రీశాంత్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement