Cricketer Sreesanth
-
శ్రీశాంత్‌కు భారీ ఊరట!
న్యూఢిల్లీ: తనపై విధించిన జీవితకాల నిషేధం తొలగింపుపై అవిశ్రాంతంగా పోరాడుతున్న టీమిండియా పేసర్ ఎస్.శ్రీశాంత్‌కు ఇది ఊరటనిచ్చే విషయమే.. బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని సవాల్ చేస్తూ బుధవారం అతడు కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ విచారణలో 34 ఏళ్ల కేరళ స్పీడ్‌స్టర్‌కు హైకోర్టు స్వాంతన కలిగించింది. వెంటనే అతడిపై ఉన్న జీవితకాల నిషేధాన్ని ఎత్తేయాల్సిందిగా బీసీసీఐకి నోటీసులు పంపింది. 2013లో జరిగిన ఐపీఎల్-6 సీజన్లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. గత నెల 16న శ్రీశాంత్ లీగల్ నోటీస్ పంపినా బీసీసీఐ పట్టించుకోలేదు. అయితే స్కాటిష్ క్లబ్ తరఫున లీగ్ క్రికెట్ ఆడేందుకు తను ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతకంటే ముందుగా ఏప్రిల్‌లో జరిగే ఈ టోర్నీలో ఆడేందుకు బోర్డు నుంచి ఎన్ఓసీ తీసుకోవడం తప్పనిసరి. కానీ బోర్డు నుంచి స్పందన కనిపించకపోవడంతో శ్రీశాంత్ కోర్టుకెక్కాడు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ తనకు వ్యతిరేకంగా ఈ కేసును రూపొందించిందని, అప్పట్లో బోర్డు ప్యానెల్ కూడా ఉద్దేశపూర్వకంగానే వ్యతిరేక విచారణ చేపట్టిందని తన అఫిడవిట్లో శ్రీశాంత్ పేర్కొన్నాడు. -
నాకు ‘గాడ్‌ఫాదర్’ లేడు
⇒ అందుకే నిషేధం పడింది ⇒ ఇప్పటికీ చెబుతున్నా... నేను తప్పు చేయలేదు ⇒ శ్రీశాంత్ ఇంటర్వ్యూ ముంబై: భారత క్రికెట్లో తనకెవరూ గాడ్‌ఫాదర్ లేడని అందుకే జీవితకాల నిషేధం అనుభవిస్తున్నానని క్రికెటర్ శ్రీశాంత్ అన్నాడు. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. అయితే తన మాట ఎవరూ వినలేదని, కేవలం ఐదు నిమిషాల్లోనే బోర్డుపెద్దలు తన తలరాతని నిర్ణయించారని వాపోతున్న శ్రీశాంత్ ఇంటర్వ్యూ... బీసీసీఐ మీకు అన్యాయం చేసిందని అనుకుంటున్నారా? అది అన్యాయం కంటే ఎక్కువ. అయినా నేను దాని గురించి మాట్లాడదలచుకోలేదు. ఎందుకంటే నా కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది. నాకు ఎక్కువ మందిని శత్రువులుగా చేసుకునే ఉద్దేశం లేదు. ఒకటి మాత్రం స్పష్టం, నేను తప్పు చేసినట్లు కోర్టు చెప్పలేదు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నా గురించి, నా ఆట గురించి మాత్రమే ఆలోచిస్తున్నా. నాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవు. ఒకవేళ ఉంటే కోర్టులో తేలిపోతుంది. బీసీసీఐ అవినీతి నిరోధక అధికారుల ముందు కేసును ఉంచినప్పుడు నీకు సరిగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదా? వాళ్లు నా మాటలు సరిగ్గా వినకుండానే ఐదు నిమిషాల్లో నా తలరాతను నిర్ణయించారు. ఈ సంఘటనల గురించి బీసీసీఐ చూసుకుంటుందని, విచారణ నుంచి నన్ను బయటపడేలా చేస్తానని బీసీసీఐ నాకు తెలిపిందని నేను అధికారులతో చెప్పాను. తర్వాత నేను కిందికి వచ్చి నా కార్లో కూర్చున్నాను. అప్పుడే మీడియా నుంచి కాల్స్ రావడం మొదలయ్యాయి. నాపై జీవితకాలం నిషేధం విధించారని తెలుసుకొని దిగ్భ్రాంతి చెందాను. నాకు క్రికెట్లో గాడ్‌ఫాదర్ లేడు. అందుకే ఈ స్థితి. నా జీవితంలో సాధించింది మొత్తం దేవుడి దయవల్లే సాధ్యమైంది. కేవలం అప్పటి పరిస్థితుల ఆధారంగా నన్ను నిందితుడిగా పేర్కొన్నారు. నాపై సూటిగా ఎలాంటి ఆరోపణలు లేవు. ఇప్పటి వరకు ఏవీ నిరూపణ కాలేదు. బీసీసీఐ మొత్తాన్ని మార్చాలని సుప్రీంకోర్టు సూచిస్తోంది. ఒకవేళ అదే జరిగితే మీరు మళ్లీ ఆడగలరని ఆశిస్తున్నారా? అవును. నేను జాతీయ జట్టుకే ఆడాలని ఆశించడం లేదు. కేరళ రాష్ట్ర జట్టు, ఫస్ట్ క్లాస్, కౌంటీల్లో ఎక్కడైనా సరే నన్ను ఆడేందుకు అనుమతించాలని కోరుకుంటున్నా. నేను క్రికెట్‌ను చాలా ఇష్టపడతాను. కాస్త సమయం తీసుకున్నా అన్నీ బయటపడతాయి. అందుకోసం నేను దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. నా క్రికెట్ కెరీర్‌ను తిరిగి కోరుకుంటున్నాను. ప్రస్తుతం నా వయసు 31-32 ఏళ్లు. ఇంకా నాలుగైదేళ్లు ఆడగలను. గత రెండు సంవత్సరాలు ఎంత కష్టంగా గడిచాయి? నా శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదు. ఈ రెండేళ్లు కేవలం అవమానాలు మాత్రమే ఎదురయ్యాయి. అన్నింటికంటే ఎక్కువ బాధాకరమైన విషయం... మా ఇంటికి 500 మీటర్ల దూరంలోనే ఉన్న కొచ్చి మైదానంలోకి వెళ్లలేకపోవడం. అందుకు ప్రతిరోజు బాధపడతాను. సుప్రీం కోర్టు విచారణను గమనిస్తున్నారా? అవును. ఏదైనా గొప్ప నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నాను. నా కేసు విషయానికొస్తే ఒక విషయం మాత్రం స్పష్టం.. కోర్టులో నేను ప్రధాన నిందితుడిగా లేను. సహ నిందితుడిగా మాత్రమే ఉన్నాను. నాపై ఎటువంటి చార్జ్‌షీట్ లేదు. నా తరఫు న్యాయవాదులు జనవరి 13న వాదించనున్నారు. నేను నిర్ధోషిగా బయటపడతానని భావిస్తున్నాను. అంటే మీపై నిషేధం విధించాక ఎటువంటి మంచి జరగలేదంటారా? అలాంటిదేమీ లేదు. త్వరలో నేను తండ్రిని కాబోతున్నాను. -
వివాదాస్పద చిత్రంలో...వివాదాస్పద వ్యక్తి
క్రికెట్లో స్పాట్ ఫిక్సింగ్ వివాదం పుణ్యమా అని వార్తల్లో నిలిచి, ఆ కళంకం ఇప్పటికీ మాసిపోని మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఇప్పుడు బుల్లితెర, వెండితెరలపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లున్నారు. ప్రముఖులు పాల్గొనగా బుల్లితెరపై వచ్చే డ్యాన్స్ షో ‘ఝలక్ దిఖ్లా జా’ తాజా సీజన్లో ఇటీవలే ఆయన మెరిశారు. కాగా, ఇప్పుడీ మాజీ క్రికెటర్ ఏకంగా ఓ హిందీ సినిమాలో నటించనున్నారు. ఓ పాపులర్ మలయాళ చిత్రాన్ని, ఓ ప్రముఖ మలయాళ దర్శకుడు హిందీలో రీమేక్ చేయనున్నారు. ఆ సినిమాలో శ్రీశాంత్ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు భోగట్టా. సాక్షాత్తూ శ్రీశాంత్ సోదరుడైన దీపూశాంత్ ఈ సంగతి నిర్ధారించారు. ‘‘ప్రస్తుతం పాల్గొంటున్న డ్యాన్స్ రియాలిటీ షో అయిపోగానే శ్రీశాంత్ ఈ హిందీ సినిమాలో నటిస్తారు’’ అని దీపూశాంత్ తెలిపారు. ఇతర తారాగణం ఖరారు కావాల్సిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలని ఆలోచన. అన్నట్లు, ఇది ఓ కుటుంబ కథా చిత్రమట! అప్పట్లో వివాదాస్పదమైన మలయాళ సూపర్‌హిట్ చిత్రానికి ఇది హిందీ రీమేక్. మొత్తానికి, ఎక్కడకు వెళ్ళినా వివాదాన్ని వెంటబెట్టుకుపోవడం శ్రీశాంత్ పంథా అనుకోవచ్చేమో! అంతేనా, శ్రీశాంత్! -
ప్రేయసిని పెళ్లాడిన శ్రీశాంత్
-
ప్రేయసిని పెళ్లాడిన శ్రీశాంత్
గురువాయూర్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంతో నిషేధం ఎదుర్కొంటున్న కేరళ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ఓ ఇంటివాడయ్యాడు. రాజస్థాన్ రాజవంశానికి చెందిన జ్యువెలరీ డిజైనర్ భువనేశ్వరి కుమారిని అతడు గురువారం ఉదయం వివాహమాడాడు. ఇరు కుటుంబాలకు చెందినవారితో పాటు అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో గురువాయూర్లోని శ్రీ కృష్ణ ఆలయంలో వీరిద్దరు కేరళ హిందు సంప్రదాయం ప్రకారం ఒకటయ్యారు. భువనేశ్వరి కుమారి కుటుంబ సభ్యులు ఈ వివాహ వేడుక కోసం డిసెంబర్ 8నే రాజస్థాన్ నుంచి కొచ్చి తరలి వచ్చారు. కొచ్చిలో బుధవారం ఓ ప్రయివేట్ హోటల్లో శ్రీశాంత్, భువనేశ్వరి కుమారిల రిసెప్షన్ రాజస్థానీ సంప్రదాయంలో జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే స్పాట్ ఫిక్సింగ్ పాల్పడి జైలుకెళ్లిన సమయంలో కూడా శ్రీశాంత్‌కు భువనేశ్వరి కుమారి బాసటగా నిలిచినట్టు తెలిసింది. ఇక ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో క్రికెట్ ఆడకుండా బీసీసీఐ శ్రీశాంత్‌పై సెప్టెంబర్‌లో నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను బెయిల్‌పై ఉన్నాడు. ఈ కేసు డిసెంబర్ 18 విచారణకు రానుంది. -
'బిగ్ బాస్'కు శ్రీశాంత్ నో!
ఆటతో కంటే తన ప్రవర్తనతోనే జనం నోళ్లలో నానిన క్రికెటర్ శాంతకుమారన్ శ్రీశాంత్. వివాదాలతో సావాసం చేసిన ఈ కేరళ స్పీడ్‌స్టర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో స్పాట్ ఫిక్సింగ్‌తో కారాగారం పాలయ్యాడు. జైలుకు వెళ్లొచ్చిన తర్వాత కూడా శ్రీశాంత్ హడావుడి తగ్గలేదు. 27 రోజుల జైలు జీవితం తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని, తాను అనుభవించిన కారాగారవాసాన్ని మరిచిపోవాలనుకోవడం లేదని విడుదల తర్వాత వేదాంతిలా సెలవిచ్చాడు. టీమిండియాలో చోటు దక్కించుకున్న కొత్తలో శ్రీశాంత్ తన స్పీడ్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. పదునైన బంతులను సంధిస్తూ కేరళ ఎక్స్‌పెస్‌గా ఎదిగాడు. మైదానంలో చలాకీతనం, భావోద్వేగాల ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించేవాడు. మైదానం వెలుపలా అతడు చేసిన విన్యాసాలు శ్రీశాంత్‌ను ప్రత్యేకమైన ఆటగాడిగా నిలిపాయి. ఆటపాటలతో అలరించేవాడు. పలు టీవీ కార్యక్రమాల్లో శ్రీ పాల్గొన్నాడు. ముద్దుగుమ్మలతో గంతులు వేశాడు. అసలు అమ్మాయిల కోసమే అతడు ఫిక్సింగ్ చేశాడన్న వాదనలు లేకపోలేదు. ఐదేళ్ల క్రితం జరిగిన ఐపీఎల్ తొలి అంచె పోటీలో సహచరుడు హర్భజన్ సింగ్ తనను చెంపదెబ్బ కొట్టాడంటూ మైదానంలో శ్రీశాంత్ ఏడుపు లంకించుకోవడంతో అతడిపై అందరూ జాలిపడ్డారు. జాలీగా ఉండే కుర్రాడిపై చేయి చేసుకోవడానికి చేతులెలా వచ్చాయని భజ్జీని దుమ్మెత్తిపోసిన వారూ లేకపోలేదు. అప్పుడు జరిగిన ఈ సంఘటన అనుకోకుండా చోటుచేసుకుంది కాదని అదంతా ఓ ప్రణాళిక ప్రకారమే జరిగిందని ఐపీఎల్ ఆరో ఎడిషన్‌లో ఆరోపించి శ్రీశాంత్ కలకలం రేపాడు. హర్భజన్ సింగ్‌ను 'వెన్నుపోటు దారు'గా వర్ణించాడు. కాగా, కెరీర్లో విజయాలకంటే వివాదాలతోనే ఎక్కువ ప్రాచుర్యం పొందిన శ్రీశాంత్‌కు గాలం వేసేందుకు కలర్స్ చానల్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రియాలిటీ షో 'బిగ్‌బాస్' లేటెస్ట్ సీజన్లో పాల్గొనేందుకు వచ్చిన ఆఫర్‌ను శ్రీ.. నిరాకరించాడు. పబ్లిసిటీ కోసమే ఈ షోలో పాల్గొంటారని, శ్రీశాంత్ ఇప్పటికే స్టార్ అని అతడి స్నేహితుడొకరు పేర్కొన్నారు. అయితే శ్రీశాంత్ 'బిగ్‌బాస్' షో పాల్గొంటే మరో సంచలనమయ్యేది అనేది అనడం నిర్వివాదాంశం.