ప్రేయసిని పెళ్లాడిన శ్రీశాంత్ | Sreesanth marries Jaipur princess Bhuveneshwari Kumari | Sakshi
Sakshi News home page

ప్రేయసిని పెళ్లాడిన శ్రీశాంత్

Published Thu, Dec 12 2013 1:02 PM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM

ప్రేయసిని పెళ్లాడిన శ్రీశాంత్

ప్రేయసిని పెళ్లాడిన శ్రీశాంత్

గురువాయూర్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంతో నిషేధం ఎదుర్కొంటున్న కేరళ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ఓ ఇంటివాడయ్యాడు. రాజస్థాన్ రాజవంశానికి చెందిన జ్యువెలరీ డిజైనర్ భువనేశ్వరి కుమారిని అతడు గురువారం ఉదయం వివాహమాడాడు. ఇరు కుటుంబాలకు చెందినవారితో పాటు అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో గురువాయూర్లోని శ్రీ కృష్ణ ఆలయంలో వీరిద్దరు కేరళ హిందు సంప్రదాయం ప్రకారం ఒకటయ్యారు.

భువనేశ్వరి కుమారి కుటుంబ సభ్యులు ఈ వివాహ వేడుక కోసం డిసెంబర్ 8నే రాజస్థాన్ నుంచి కొచ్చి తరలి వచ్చారు. కొచ్చిలో బుధవారం ఓ ప్రయివేట్ హోటల్లో శ్రీశాంత్, భువనేశ్వరి కుమారిల రిసెప్షన్ రాజస్థానీ సంప్రదాయంలో జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది.

అయితే  స్పాట్ ఫిక్సింగ్ పాల్పడి జైలుకెళ్లిన సమయంలో కూడా శ్రీశాంత్కు భువనేశ్వరి కుమారి బాసటగా నిలిచినట్టు తెలిసింది. ఇక ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో క్రికెట్ ఆడకుండా బీసీసీఐ శ్రీశాంత్పై సెప్టెంబర్లో నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను బెయిల్పై ఉన్నాడు. ఈ కేసు డిసెంబర్ 18 విచారణకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement