PC: Crictrakcer
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ముంబై ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలై.. పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ముంబై కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా జట్టును విజయ పథంలో నడిపించడంలో విఫలమవుతున్నాడు.
రోహిత్ శర్మను తప్పించి మరి జట్టు తనకు పగ్గాలను అప్పగించిన ముంబై యాజమన్యం నమ్మకాన్ని హార్దిక్ నిలబెట్టుకోలేకపోయాడు. ఎంఐ కెప్టెన్‌గా ఎంపికైనప్పటి నుంచి హార్దిక్‌కు అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఆఖరికి ముంబై హోం గ్రౌండ్ వాంఖడేలో కూడా హార్దిక్‌కు అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది.
హార్దిక్ కెప్టెన్సీపై విమర్శలు వ్యక్తమవుతున్నాడు. అతడిని తప్పించి ముంబై జట్టు పగ్గాలు మళ్లీ రోహిత్ శర్మకు అప్పగించాలని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ పేసర్ ఎస్ శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ కెప్టెన్సీలో రోహిత్ స్వేచ్ఛగా ఆడటానికి ఇష్టపడతాడని శ్రీశాంత్ తెలిపాడు.
"సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోని నాయకత్వంలో ఆడటం మనం చూశాం. మేము అందరం కలిసి వన్డే వరల్డ్‌కప్‌ను కూడా గెలిచాము. ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా కింద రోహిత్ ఆడటానికి ఇష్టపడటం లేదని చాలా వార్తలు వినిపిస్తున్నాయి. అవన్నీ ఆ వాస్తవం. రోహిత్ హార్దిక్ కెప్టెన్సీలో ఆడటానికి కచ్చితంగా ఇష్టపడతాడు.
నా వరకు అయితే రోహిత్ ఎలాంటి కెప్టెన్సీ భారం లేదు కాబట్టి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాకుండా ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ సీజన్‌లో రోహిత్ మంచి రిథమ్‌లో కన్పిస్తున్నాడు. రోహిత్‌కు ఐదు సార్లు ముంబైని విజేతగా నిలిపాడు. అయితే ఇప్పుడు జట్టును రోహిత్ వెనుకుండి నడిపిస్తాడని నేను అనుకుంటున్నానని" టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీశాంత్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment