Sreesanth
-
ఈసారి టీ20 వరల్డ్‌కప్ భారత్‌దే.. ఆ ఇద్దరే కీలకం: శ్రీశాంత్
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భారత జట్టు తొలి మ్యాచ్‌కు సిద్దమైంది. శుక్రవారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ మహిళలతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని ఉమెన్ ఇన్ బ్లూ ఉవ్విళ్లూరుతోంది.ఈ నేపథ్యంలో హర్మన్ సేనను ఉద్దేశించి భారత మాజీ పేసర్ శ్రీశాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ను కైవసం చేసేకునేందుకు భారత్‌కు అన్ని విధాలగా అర్హత ఉందని శ్రీశాంత్ అభిప్రాయపడ్డాడు.వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేసిన భారత జట్టు అద్బుతంగా ఉంది. టీమ్‌తో పాటు భారత్‌కు గొప్ప కోచింగ్ స్టాప్ ఉంది. ముఖ్యంగా హెడ్‌కోచ్ అమోల్ భాయ్ (ముజుందార్) కోసం ఎంత చెప్పకున్న తక్కవే. అతడొక అద్బుతమైన కోచ్. ఈ సారి అతడి నేతృత్వంలో భారత్ విశ్వవిజేతగా నిలుస్తుందని అనుకుంటున్నా. కోచ్‌తో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ టోర్నీ ఆరంభానికి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌ను నేను చూశాను. తమ జట్టు 100 శాతం ఎఫెక్ట్ పెట్టి ఆడితే ఏ జట్టునైనా ఓడించగలదని ఆమె చెప్పుకొచ్చింది అంటూ శ్రీశాంత్ పేర్కొన్నాడు.ఆ ఇద్దరే కీలకం..ఈ టోర్నీలో భారత్‌కు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానలు ఎక్స్ ఫ్యాక్టర్స్(కీలక ఆటగాళ్లగా) మారనున్నారు.హర్మన్ గత కొంత కాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఆమె 2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడిన ఇన్నింగ్స్ మళ్లీ ఈసారి చూడబోతున్నామని నేను అనుకుంటున్నాను. ఆమె ఈ సారి ఏదో మ్యాజిక్‌తో ముందుకు వస్తుందని నమ్మకం నాకు ఉంది. మరోవైపు స్మృతి మంధాన కూడా సత్తాచాటనుంది. అదేవిధంగా జెమీమా రోడ్రిగ్స్ కూడా అద్భుతమైన ప్లేయర్. వీరుముగ్గరు తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేస్తే భారత్‌కు తిరిగుండదు అని శ్రీశాత్ చెప్పుకొచ్చాడు. -
ధోనికి కోపం వచ్చింది.. అతడి వల్లే: అశ్విన్
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్‌కు ‘మిస్టర్ కూల్’గానూ పేరుంది. పరిస్థితి చేయిదాటి పోతే తప్ప తలా.. మైదానంలో కోపం, అసహనం ప్రదర్శించడు. అయితే, శ్రీశాంత్ చేసిన పని వల్ల తొలిసారి ధోనికి ఆగ్రహానికి గురికావడం చూశానంటున్నాడు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.తొలిసారి ధోని కోప్పడటం చూశా2010 నాటి సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందని తన పుస్తకం ‘ఐ హావ్ ది స్ట్రీట్స్- ఏ కుట్టీ క్రికెట్ స్టోరీ’(I Have The Streets- A Kutty Cricket Story)లో అశూ వెల్లడించాడు. నాటి మ్యాచ్ సంగతులను ప్రస్తావిస్తూ..‘‘ఆరోజు నేను డ్రింక్స్ అందించే పని చేస్తున్నా. అప్పుడు ధోని హెల్మెట్ తీసుకురమ్మని చెప్పాడు. నాకెందుకో మహీ కోపంగా ఉన్నట్లు కనిపించింది.అతడు సహనం కోల్పోవడం నేను అంతకు ముందెన్నడూ చూడలేదు. ‘శ్రీ(శ్రీశాంత్) ఎక్కడ ఉన్నాడు? అతడు అసలేం చేస్తున్నాడు?’ అని ఎంఎస్ అడిగాడు.శ్రీశాంత్‌కు ఈ సందేశం చేరవేరుస్తానని నేను చెప్పాను. ఆ తర్వాత ఎంఎస్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే, మరుసటి ఓవర్లో నన్ను మళ్లీ పిలిచి మహీ హెల్మెట్ రిటర్న్ చేశాడు.శ్రీకి ఇక్కడ ఉండటం ఇష్టం లేదేమో!అప్పుడు కామ్‌గానే ఉన్నట్లు అనిపించింది. నాకు హెల్మెట్ ఇచ్చే సమయంలో.. ‘ఒక పనిచెయ్.. రంజీబ్ సర్(టీమ్ మేనేజర్) దగ్గరికి వెళ్లు.శ్రీకి ఇక్కడ ఉండటం ఇష్టం లేదని చెప్పు. వెంటనే అతడికి టికెట్ బుక్ చేయమని చెప్పు. అతడు ఎంచక్కా ఇండియాకు తిరిగి వెళ్లిపోతాడు. సరేనా’ అని నాతో అన్నాడు.ధోని అలా అనడం ఊహించని నాకు షాక్ తగిలినట్లయింది. అసలు నేను ఈ మాటలు విన్నది ధోని నుంచేనా అని కాసేపు అయోమయానికి గురయ్యాను’’ అని అశ్విన్ తన పుస్తకంలో రాశాడు.ఆ మరుసటి ఓవర్లో తనతో పాటు శ్రీశాంత్ కూడా భారత ఆటగాళ్లకు మైదానంలో డ్రింక్స్ అందించాడని అశూ తెలిపాడు. అయినప్పటికీ ధోని శాంతించలేదని.. అతడి నుంచి డ్రింక్స్ తీసుకోవడానికి ఇష్టపడలేదని పేర్కొన్నాడు.మళ్లీ తననే పిలిచి.. శ్రీశాంత్ టికెట్ గురించి మేనేజర్‌తో చెప్పావా?లేదా అని తనను గట్టిగా ప్రశ్నించాడని అశూ తెలిపాడు. కాసేపయ్యాక అంతా మామూలుగా మారిపోయిందని.. సమస్య సమసిపోయిందని అశ్విన్ వెల్లడించాడు.ధోని కోపానికి కారణం ఇదేకాగా రిజర్వ్ ఆటగాళ్లతో పాటు డగౌట్లో కూర్చోకుండా పేసర్ శ్రీశాంత్ డ్రెస్సింగ్రూంలోనే ఉండిపోవడమే ధోని ఆగ్రహానికి కారణం. ఆ తర్వాత అశ్విన్‌తో మెసేజ్ పంపగా.. శ్రీశాంత్ జెర్సీ వేసుకుని డగౌట్‌కు రావడంతో పాటు.. ధోని దెబ్బకు డ్రింక్స్ కూడా సర్వ్ చేశాడట. అదీ సంగతి!చదవండి: బ్లడ్ క్యాన్సర్.. బాధగా ఉంది: బీసీసీఐకి కపిల్ దేవ్ విజ్ఞప్తి -
కెప్టెన్సీ లేదు.. చెలరేగిపోతాడు! అతడిదే ఆరెంజ్ క్యాప్: శ్రీశాంత్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ముంబై ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలై.. పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ముంబై కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా జట్టును విజయ పథంలో నడిపించడంలో విఫలమవుతున్నాడు. రోహిత్ శర్మను తప్పించి మరి జట్టు తనకు పగ్గాలను అప్పగించిన ముంబై యాజమన్యం నమ్మకాన్ని హార్దిక్ నిలబెట్టుకోలేకపోయాడు. ఎంఐ కెప్టెన్‌గా ఎంపికైనప్పటి నుంచి హార్దిక్‌కు అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఆఖరికి ముంబై హోం గ్రౌండ్ వాంఖడేలో కూడా హార్దిక్‌కు అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. హార్దిక్ కెప్టెన్సీపై విమర్శలు వ్యక్తమవుతున్నాడు. అతడిని తప్పించి ముంబై జట్టు పగ్గాలు మళ్లీ రోహిత్ శర్మకు అప్పగించాలని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ పేసర్ ఎస్ శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ కెప్టెన్సీలో రోహిత్ స్వేచ్ఛగా ఆడటానికి ఇష్టపడతాడని శ్రీశాంత్ తెలిపాడు. "సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోని నాయకత్వంలో ఆడటం మనం చూశాం. మేము అందరం కలిసి వన్డే వరల్డ్‌కప్‌ను కూడా గెలిచాము. ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా కింద రోహిత్ ఆడటానికి ఇష్టపడటం లేదని చాలా వార్తలు వినిపిస్తున్నాయి. అవన్నీ ఆ వాస్తవం. రోహిత్ హార్దిక్ కెప్టెన్సీలో ఆడటానికి కచ్చితంగా ఇష్టపడతాడు. నా వరకు అయితే రోహిత్ ఎలాంటి కెప్టెన్సీ భారం లేదు కాబట్టి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాకుండా ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ సీజన్లో రోహిత్ మంచి రిథమ్‌లో కన్పిస్తున్నాడు. రోహిత్‌కు ఐదు సార్లు ముంబైని విజేతగా నిలిపాడు. అయితే ఇప్పుడు జట్టును రోహిత్ వెనుకుండి నడిపిస్తాడని నేను అనుకుంటున్నానని" టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీశాంత్ పేర్కొన్నాడు. -
Yamadheera Review: క్రికెటర్ శ్రీశాంత్ విలన్‌గా నటించిన ‘యమధీర’ ఎలా ఉందంటే?
కన్నడ స్టార్ కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ విలన్‌గా నటించిన తాజా చిత్రం యమధీర. ఈ సినిమాలో నాగబాబు గారు, ఆలీ గారు, సత్య ప్రకాష్ గారు, మధు సూధన్ గారు తదితరులు కీలకపాత్రలు పోషించారు. వేదాల శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం నేడు(మార్చి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘యమధీర’ కథేంటంటే.. కెపి గౌతమ్ ( కోమల్ కుమార్) నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. అన్యాయం ఎవరు చేసిన సహించడు. అందుకే ఎక్కడా కూడా ఎక్కువ రోజులు ఉద్యోగం చేయలేకపోతాడు. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో గొడవ కారణంగా ట్రాన్స్ఫర్స్ అవుతూ చివరికి వైజాగ్ కమిషనర్‌గా వస్తాడు. అక్కడ ఒక యువకుడి మిస్టరీ డెత్ కేస్ రీఓపెన్ చేస్తాడు. విచారణలో ఆ యువకుడిని చంపింది అజర్ బైజాన్ దేశంలో ఉన్న దేశ్‌ముఖ్ (క్రికెటర్ శ్రీశాంత్) అని తెలుస్తుంది. అదేవిధంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయించి దేశముఖ్ సీఎం అవుతాడు. మరి ఈ కేసును గౌతమ్ ఎలా సాల్వ్ చేశాడు? సీఎం దేశ్‌ముఖ్‌కి ఆ హత్యకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం హోదాలో ఉన్న దేశముఖ్ నీ గౌతమ్ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ విషయాలు తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఈవీఎం ల ట్యాంపరింగ్ గురించి జనాలకి అవగాహన కలిగించే ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ యమధీర. కథగా చూస్తే ఇందులో కొత్తదనం ఏమి ఉండదు కానీ ఓ మంచి సందేశాన్ని కమర్షియల్ అంశాలను జోడించి చక్కగా చూపించారు. కన్నడ సినిమా అయిన అచ్చమైన తెలుగు సినిమా మాదిరి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టెక్నికల్ వాల్యూస్‌తో ఈ సినిమాని నిర్మించారు. ఎలక్షన్స్ గురించి ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి ముఖ్యంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. మదర్ సెంటిమెంట్ ఈ సినిమాకు ప్లస్ అయింది. ఫస్టాఫ్‌లో సాగదీత సన్నివేశాలు ఎక్కువగా ఉండడం, శ్రీశాంత్ పాత్ర నిడివి తక్కువగా ఉండడం సినిమాకు మైనస్. శ్రీశాంత్ పాత్ర నిడివి పెంచి, స్క్రిప్ట్‌ని మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. నటీనటుల విషయానికొస్తే.. హీరోగా కోమల్ కుమార్ నటన చాలా బాగుంది. అమ్మ సెంటిమెంట్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా చేశారు. నెగిటివ్ రోల్ లో క్రికెటర్ శ్రీకాంత్ చాలా బాగా నటించాడు. రిషిక శర్మ తన పరిధి మేరకు మంచి నటనను కనబరిచింది. మూగ వ్యక్తి పాత్రలో ఆలీ నటన ఆయన పండించిన కామెడీ చాలా అద్భుతంగా ఉంది. నాగబాబు, మధుసూదన్ రావు, సత్య ప్రకాష్, పృథ్వీరాజ్ ఎవరు పరిధికి వారు బాగా నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. అరుణ్ ఉన్ని అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచింది. పాటలు జస్ట్ ఓకే. వరదరాజ్ చిక్కబళ్ళపుర అందించిన డైలాగ్స్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
సినిమాలో విలన్‌గా టీమిండియా స్టార్ క్రికెటర్.. టీజర్ రిలీజ్
టీమిండియా తరఫున పలు మ్యాచులాడి, ఐపీఎల్లో ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్.. ప్రస్తుతం నటుడిగా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పలు సినిమాలు చేసిన శ్రీశాంత్.. 'యమధీర' చిత్రంతో త్వరలో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. మార్చి 23న తెలుగులో రిలీజ్ కాబోతున్న ఈ చిత్ర టీజర్‌ని తాజాగా రిలీజ్ చేశారు. చిత్ర విశేషాలని పంచుకున్నారు. (ఇదీ చదవండి: హీరో వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడో తెలుసా?) కన్నడ హీరో కోమల్ కుమార్, భారత క్రికెటర్ శ్రీశాంత్ ప్రతినాయక పాత్రలో నటించిన సినిమా 'యమధీర'. వేదాల శ్రీనివాస్ నిర్మించారు. నాగబాబు, అలీ, సత్య ప్రకాష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని నటుడు-నిర్మాత అశోక్ కుమార్ లాంచ్ చేశారు. క్రికెటర్ శ్రీశాంత్ ఫాస్ట్ బౌలర్‌గా మైదానంలో చూపే దూకుడుని ప్రతినాయకుడిగా చూపించే అవకాశం ఉందన్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ వేరే లెవెల్: టీమిండియా మాజీ క్రికెటర్!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే అభిమానుల గుండెల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్లో అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ హీరోల్లో ఎన్టీఆర్ ముందు వరసలో ఉంటారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇటీవల టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీ తన అభిమానం చాటుకున్నారు. ఎన్టీఆర్ నటన అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ తన అభిమాన హీరోలని చెప్పుకొచ్చారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో క్రికెటర్ చేరిపోయారు. టీమిండియా మాజీ బౌలర్ శ్రీశాంత్ జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శ్రీశాంత్ జూనియర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ ఈవెంట్లో ఎన్టీఆర్‌ను కలిసి మాట్లాడినట్లు తెలిపారు. మీరు చాలా బాగా డ్యాన్స్ చేస్తారని.. మీ నటన అద్భుతంగా ఉంటుందని చెప్పానని అన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ వెళ్తూ తనకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారని తెలిపారు. తెలుగులో ఎన్టీఆర్‌తో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని శ్రీశాంత్ అన్నారు. శ్రీశాంత్ మాట్లాడుతూ.. 'ఆయనకు గుర్తు ఉందో లేదో తెలియదు కానీ.. ఓ ఈవెంట్లో ఎన్టీఆర్‌ను కలిశా. అక్కడే ప్రియమణి, అల్లు అర్జున్ కూడా ఉన్నారు. నేను ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లా. మీరు డ్యాన్స్ అద్భుతంగా చేస్తారని చెప్పా. థ్యాంక్యూ శ్రీశాంత్ అన్నారు. అక్కడి నుంచి వెళ్తూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు. ఆయనను చూస్తే చాలా మోటివ్‌గా అనిపించింది. తెలుగులో ఎన్టీఆర్ సినిమాలో చిన్న అవకాశమొచ్చిన నటిస్తా' అని అన్నారు. -
గంభీర్‌తో గొడవ.. శ్రీశాంత్‌కు లీగల్ నోటీసులు
లెజెండ్స్ లీగ్‌లో టీమిండియా మాజీ ఆటగాళ్లు గౌతం గంభీర్- శ్రీశాంత్ మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా వీరిదద్దరి మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే మ్యాచ్ అనంతరం గంభీర్‌ను ఉద్దేశించి శ్రీశాంత్ చేసిన ఓ పోస్ట్.. ఈ గొడవకు మరింత అజ్యం పోసింది. గంభీర్ తనను పదే పదే ఫిక్సర్ అన్నాడని, అసభ్య పదజాలంతో తనను దూషించాడని శ్రీశాంత్ ఓ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. అయితే.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ కమిషనర్ శ్రీశాంత్‌కు లీగల్ నోటీసులు పంపించారు. శ్రీశాంత్ టోర్నమెంట్ కాంట్రాక్ట్ నిబంధనలు ఉల్లఘించాడని కమిషనర్ నోటీస్‌లో పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియాలో శ్రీశాంత్ పోస్ట్ చేసిన వీడియోలు తొలగించిన తర్వాతనే అతనితో చర్చలు జరుపుతామని తెలిపారు. ఈ వివాదంపై అంపైర్లు ఇచ్చిన నివేదికలో శ్రీశాంత్‌ను శ్రీశాంత్‌ను గంభీర్ ఫిక్సర్ అన్నాడని ఎక్కడా పేర్కొనలేదు. కాగా వీరిద్దరూ భారత తరుపన కలిసి 49 మ్యాచ్‌లు ఆడారు. 2007 టీ20, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో భాగస్వాములుగా ఉన్నారు. చదవండి: IPL 2024: పంజాబ్ కింగ్స్‌లోకి ఆసీస్ విధ్వంసకర ఆటగాడు..!? -
WC 2023: ఈసారి ఆ అవార్డు అతడికే.. ఫైనల్లో కివీస్‌తో: మాజీ పేసర్
ICC World Cup 2023:‘‘అప్పుడు.. యువీ పాజీ జట్టు కోసం ఏం చేశాడో తెలుసుగా.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అతడి సొంతమైంది. ఈసారి అలాంటి ఆల్‌రౌండర్ ఎవరైనా ఉన్నారా అంటే అది హార్దిక్ పాండ్యానే. అతడు ఈసారి ఆ అవార్డు అందుకునే ఛాన్స్ ఉంది. టీమిండియాకు అత్యంత ప్రధానమైన ఆటగాడు’’ అని టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ అన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2011లో యువరాజ్ సింగ్ మెరుపుల మాదిరే ఈసారి పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతం చేయగలడని జోస్యం చెప్పాడు. అదే విధంగా హార్దిక్‌తో పాటు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు కూడా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలిచే అవకాశాలున్నాయని శ్రీశాంత్ పేర్కొన్నాడు. వాళ్లిద్దరు కూడా ఇక అవార్డుకు మూడో పోటీదారు జస్ప్రీత్ బుమ్రా అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. ‘‘హార్దిక్ ఫాస్టెస్ట్ హండ్రెడ్ మర్చిపోవదు.. అలాగే బుమ్రా రెండు 5- వికెట్ హాల్స్ గుర్తున్నాయి కదా! ఇక మునుపెన్నడూ లేని విధంగా.. కుల్దీప్ యాదవ్ అద్భుత స్పెల్‌తో దూసుకుపోతున్నాడు. ఇవన్నీ గమనిస్తే ఈసారి ఈ ముగ్గురిలో ఒకరికి అవార్డు రావడం ఖాయమని అనిపిస్తోంది’’ అని శ్రీశాంత్ స్పోర్ట్స్‌కీడాతో వ్యాఖ్యానించాడు. అదే విధంగా.. వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో టీమిండియాతో న్యూజిలాండ్‌ను చూస్తామని శ్రీశాంత్ తన అంచనా తెలియజేశాడు. ఈసారి కప్పు మనదే 2019లో సెమీస్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకునేందుకు భారత్.. కివీస్‌ను తప్పక ఓడించాలని ఆకాంక్షించాడు. ఈసారి కప్పు టీమిండియాదే అని ధీమా వ్యక్తం చేశాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 ఆరంభం కానుంది. ఇక టీమిండియా అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో.. టోర్నీలో తమ ఆరంభ మ్యాచ్ ఆడనుంది. కాగా 2011లో సొంతగడ్డపై ధోని సేన విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఇందులో కీలక పాత్ర పోషించిన యువీ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నాడు. ఇక శ్రీశాంత్ కూడా ఈ జట్టులో సభ్యుడన్న సంగతి తెలిసిందే. చదవండి: Ind vs Aus: తప్పు నీదే.. వరల్డ్‌కప్ జట్టు నుంచి తీసేయడం ఖాయం.. జాగ్రత్త! -
రెండ్రోజులు అక్కడే పెట్టిన అరటిపండును శ్రీశాంత్ తిన్నాడు! ఆఖరికి లోదుస్తులు కూడా..
Sreesanth Once Ate Two-Day Old Banana: ‘మానే కాక(రమేశ్ మానే) అప్పట్లో టీమిండియాతో ప్రయాణించేవాడు. మసాజ్ చేయడంతో పాటుగా పూజలు కూడా చేస్తుండేవాడు. నిజానికి శ్రీశాంత్‌కు ‘మూఢనమ్మకాలు’ ఎక్కువ. తనలాంటి ఫాస్ట్బౌలర్ను నేనైతే ఎప్పుడూ చూడలేదు. మానే కాక.. పూజ సమయంలో అగర్బత్తీలను అరటిపండుకు కుచ్చి నిలబెట్టేవాడు. రెండ్రోజులైనా అదే తిన్నాడు అయితే, శ్రీశాంత్ నమ్మకాల గురించి తెలిసిన ఓ క్రికెటర్ అతడిని ఆటపట్టించాలని భావించాడు. శ్రీశాంత్.. నువ్వు గనుక ఇప్పటికిప్పుడు అరటిపండు తింటే ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీస్తావు తెలుసా అని ఊరించాడు. అప్పటికే ఆ అగర్బత్తీలు పెట్టిన అరటిపండు అక్కడ పెట్టి రెండ్రోజులు అయింది. అయినా శ్రీశాంత్ దానిని తిన్నాడు. వికెట్లు తీయాలనే కోరికతో అలా చేశాడు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. భారత మాజీ పేసర్ శ్రీశాంత్ గురించి చెప్పుకొచ్చాడు. జియో సినిమా షోలో భాగంగా.. టీమిండియా ఆటగాళ్ల వింత నమ్మకాల గురించి ప్రస్తావన రాగా 2006 నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. అందుకే అలా చేశాడు కాగా నాడు ఆ అరటిపండు తిన్న శ్రీశాంత్ అప్పటి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఐదు వికెట్లు తీశాడు. జమైకాలో వెస్టిండీస్‌తో టెస్టు సందర్భంగా మొత్తంగా 49 పరుగులు ఇచ్చి ఈ మేరకు వికెట్లు పడగొట్టాడు. వాళ్లైతే ఆఖరికి లోదుస్తులు కూడా ఇక ఇదే షోలో పాల్గొన్న టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. భారత క్రికెటర్లలో చాలా మందికి ఇలాంటి మూఢనమ్మకాలు ఉంటాయని చెప్పుకొచ్చాడు. రంజీ ఆడే రోజుల్లో కొంతమంది ఏదైనా ఒకరోజు ఐదు వికెట్లు తీస్తే.. ఆ బట్టలు.. ఆఖరికి లోదుస్తులు కూడా ఉతక్కుండా ఉంచుకునే వాళ్లని తెలిపాడు. అదృష్టం తమతో పాటు అలాగే అతుక్కుపోవాలని ఇలా చేసే వాళ్లని చెప్పుకొచ్చాడు. శ్రీశాంత్ ఒక్కడికే కాకుండా చాలా మందికి ఇలాంటి నమ్మకాలు ఉంటాయని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా కేరళకు చెందిన శ్రీశాంత్ ప్రస్తుతం జింబాబ్వే ఆఫ్రో టీ10లీగ్‌తో బిజీగా ఉన్నాడు. చదవండి: ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. ఇంత మొండితనం పనికిరాదు! -
అతడొక అద్భుతం.. సీఎస్కేకు డెత్ ఓవర్ల స్పెషలిస్టు దొరికేశాడు!
ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ యువ పేసర్ మతీషా పతిరాన అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లతో పతిరాన చెలరేగాడు. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన ఈ యవ పేసర్.. 7.81 ఏకానమీతో 13 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో పతిరానపై భారత మాజీ పేసర్ శ్రీశాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. సీఎస్కేకు అద్భుతమైన డెత్ ఓవర్లు స్పెషలిస్టు దొరికాడని శ్రీశాంత్ కొనియాడాడు. "సీఎస్కేకు పతిరాన రూపంలో అద్భుతమైన ఫాస్ట్ బౌలర్ దొరికాడు. అతడు బ్యాటింగ్ కూడా చేయగలిగితే బ్రావోకు ప్రత్యామ్నాయం అవుతాడు. డెత్ ఓవర్లలో వికెట్లు తీసే సత్తా పతిరానకు ఉంది. అతడు యార్కర్లు మాత్రమే కాదు అద్భుతమైన స్లోయర్ బాల్స్ కూడా వేస్తున్నాడు. చదవండి: IPL 2023: "బేబీ మలింగా" అరుదైన రికార్డు.. తొలి బౌలర్‌గా! అతడి బౌలింగ్‌ను ఎదుర్కొవడం చాలా కష్టం. ఒక్క మ్యాచ్‌లోనే కాకుండా ప్రతీ మ్యాచ్‌లో అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా ధోని సపోర్ట్ అతడికి ఉంది. ధోని ఇటువంటి ఎంతో మంది యువ బౌలర్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాడు" అంటూ స్టార్‌స్పోర్ట్స్ క్రికెట్ లైవ్‌లో శ్రీశాంత్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: అతడిని బాగా మిస్ అవుతున్నాం.. కానీ తప్పదు! చాలా అరుదుగా ఉంటారు: ధోని -
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడనున్న రాబిన్ ఊతప్ప
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023 సీజన్లో ఇండియా మహారాజా తరపున ఆడేందుకు భారత మాజీ ఆటగాళ్లు రాబిన్ ఊతప్ప, శ్రీశాంత్ సిద్దమయ్యారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ఊతప్ప ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. అదే విధంగా గతేడాది లెజెండ్స్ లీగ్ సీజన్లో ఊతప్ప కామేంటేటర్‌గా వ్యవహరించాడు. "లెజెండ్స్ లీగ్ క్రికెట్ చివరి సీజన్లో వాఖ్యతగా వ్యవహరించినప్పడే ఈ టోర్నీలో ఆడాలని నిర్ణయించకున్నాను. ఇప్పుడు నా పాత సహచరులతో ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది" అని రాబిన్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఇక గత సీజన్లో భిల్వారా కింగ్స్ తరపున ఆడిన శ్రీశాంత్.. ఈ ఏడాది సీజన్లో ఇండియా మహారాజాకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. మరోవైపు శ్రీశాంత్ మాట్లాడుతూ.. లెజెండ్స్ లీగ్ సెకెండ్ సీజన్ అద్భుతంగా జరిగిది. ఈ టోర్నీలో పోటీ మా అంచనాలకు మించి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మరి కొంత మంది మాజీ ఆటగాళ్లు ఈ టోర్నీలో భాగం కావాలని నేను ఆశిస్తున్నాను. అయితే భారత్ తరఫున ఆడడం ఎప్పుడూ గర్వంగా భావిస్తాను అని పేర్కొన్నాడు. చదవండి: IND vs SL: శ్రీలంకతో మూడో టీ20.. రుత్‌రాజ్‌కు నో ఛాన్స్! గిల్ వైపే మొగ్గు -
T20 WC: దినేశ్ కార్తిక్ లాగే అతడికి కూడా మద్దతు ఇవ్వాలి.. అప్పుడే: శ్రీశాంత్
India Vs Australia 2022 T20 Series- Bhuvneshwar Kumar- T20 World Cup 2022: స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో విమర్శల పాలయ్యాడు టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టీ20లో 4 ఓవర్లలో 52 పరుగులు సమర్పించుకున్న భువీ.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ క్రమంలో రెండో మ్యాచ్‌లో తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. ఇక హైదరాబాద్ వేదికగా జరిగిన మూడో టీ20లో 39 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగలిగాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో 91 పరుగులు ఇచ్చాడు భువీ. భువీ వైఫల్యం.. అభిమానుల్లో ఆందోళన డెత్ ఓవర్ల స్పెషలిస్టు, ప్రధాన పేసర్లలో ఒకడైన భువనేశ్వర్ ఇలా విఫలం కావడం జట్టు విజయావకాశాలపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్-2022కు సమయం ఆసన్నమవుతున్న వేళ భువీ ఫామ్‌లేమి అభిమానులను కలవరపెడుతోంది. అతడికి తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. టీమిండియా ఆటగాళ్లతో భువీ డీకేకు అండగా ఉన్నట్లే! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భువీపై నమ్మకం ఉంచి అతడికి అవకాశాలు ఇవ్వాలని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ మాదిరి భువనేశ్వర్‌కు కూడా అండగా నిలవాలని సూచించాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022లో భిల్వారా కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీశాంత్ హిందుస్థాన్ టైమ్స్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘ఒక్కోసారి మెరుగ్గా బౌలింగ్ చేసినప్పటికీ.. బ్యాటర్ చేతిలో మనకు పరాభవం తప్పకపోవచ్చు. ఆస్ట్రేలియా పిచ్‌లపై రాణించగలడు కొన్నిసార్లు మన వ్యూహం పక్కాగా అమలు అవుతుంది. మరికొన్నిసార్లు బెడిసికొడుతుంది. భువనేశ్వర్‌కు ఇప్పుడు మనందరి మద్దతు అవసరం. దినేశ్ కార్తిక్‌కు అండగా నిలిచినట్లే భువీకి కూడా సపోర్టుగా ఉండాలి. బంతిని అద్భుతంగా స్వింగ్ చేయగల భువీ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది. తను నకుల్ బాల్ సంధించగలడు. పేస్‌లో వైవిధ్యం చూపగలడు. ఆస్ట్రేలియా పిచ్‌లపై తను తప్పకుండా రాణిస్తాడని నాకు నమ్మకం ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. ధైర్యంగా ఉండు భువీ! విమర్శలు, కొంతమంది కామెంటేటర్ల మాటలు ఒక్కోసారి మనల్ని ఆందోళనకు గురిచేస్తాయని.. అయితే, మన నైపుణ్యాలు, సామర్థ్యాలపై నమ్మకం ఉంచి ముందుకు సాగాలని భువీకి సూచించాడు. విమర్శలు పట్టించుకోవద్దని.. ఆత్మవిశ్వాసంతో ఉండాలని భువీని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. కాగా అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీ ఆరంభం కానుంది. అంతకంటే ముందు టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడనుండగా.. భువీకి విశ్రాంతినిచ్చారు. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. కెప్టెన్‌గా ధావన్.. వైస్ కెప్టెన్‌గా శాంసన్! Ind Vs SA T20, ODI Series: దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20, వన్డే సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్! ఇతర వివరాలు Dinesh Karthik Vs Rishabh Pant: పంత్ కంటే కార్తీక్‌కు అవకాశం ఇవ్వడం అవసరం: రోహిత్ శర్మ -
కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్న శ్రీశాంత్
టీమిండియా మాజీ బౌలర్, వివాదాస్పద ఆటగాడు శాంతకుమరన్ శ్రీశాంత్ త్వరలో మరో కొత్త ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టనున్నాడు. ఈ ఏడాది చివర్లో (నవంబర్) ప్రారంభమయ్యే అబుదాబీ టీ10 లీగ్ నుంచి మెంటర్‌గా కెరీర్‌ను ప్రారంభించనున్నాడు. బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సారధ్యం వహించనున్న బంగ్లా టైగర్స్‌కు శ్రీశాంత్ తన సేవలందించనున్నాడు. ఈ జట్టుకు హెడ్ కోచ్‌గా బంగ్లా మాజీ ఆల్‌రౌండర్ ఆఫ్తాబ్ అహ్మద్ వ్యవహరించనుండగా.. అదే దేశానికే చెందిన నజ్ముల్ అబెదిన్ ఫహీమ్ అసిస్టెంట్ కోచ్‌గా పని చేయనున్నాడు. ఈ ఇద్దరితో కలిసి శ్రీశాంత్ కోచింగ్ టీమ్‌లో ఉంటాడని బంగ్లా టైగర్స్ యాజమాన్యం శనివారం వెల్లడించింది. కాగా, అబుదాబీ ఐదో సీజన్ కోసం బంగ్లా టైగర్స్ కీలక మార్పులు చేసింది. ఐకాన్ ప్లేయర్ కోటాలో షకీబ్‌ను కెప్టెన్‌గా ఎంచుకోవడంతో పాటు విధ్వంసకర ఆటగాళ్లు ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్), కొలిన్ మన్రో (న్యూజిలాండ్).. స్టార్ పేసర్ మహ్మద్ అమీర్ (పాకిస్థాన్), శ్రీలంక యువ సంచలనం మతీశ పతిరణను జట్టులో చేర్చుకుంది. సఫారీ స్టార్ ఆటగాడు డుప్లెసిస్ సారధ్యంలో గత సీజన్ బరిలో నిలిచిన బంగ్లా టైగర్స్ మూడో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే, ఈ ఏడాది మార్చిలో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీశాంత్.. తొలిసారి కోచింగ్ డిపార్ట్మెంట్లో చేరాడు. గతంలో టీమిండియా క్రికెటర్‌గా, సినిమాల్లో హీరోగా నటించిన ఈ కేరళ స్పీడ్‌స్టర్.. త్వరలో సరికొత్త అవతారంలో క్రికెట్ ఫ్యాన్స్ ముందుకు రానున్నాడు. ఐపీఎల్ (2013 సీజన్) స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషిగా తేలడంతో శ్రీశాంత్ కెరీర్‌కు అర్థంతరంగా ముగిసిన విషయం తెలిసిందే. 2022 ఐపీఎల్ వేలంలో కనీస ధర యాభై లక్షలకు తన పేరును నమోదు చేసుకున్న శ్రీశాంత్‌ను ఏ ఫ్రాంచైజ్ కొనుగోలు చేయలేదు. చదవండి: భారత్-పాక్ మ్యాచ్.. కత్తులు దూసుకున్న బుడ్డోళ్లు -
మాజీ క్రికెటర్ శ్రీశాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
WC 2022: అతడికి అంత సీన్ లేదు! ఒకవేళ టీమిండియా టైటిల్ గెలిస్తే..
ICC T20 World Cup 2022: టీమిండియా మెంటల్ కండిషనింగ్ హెల్త్‌కోచ్‌గా నియమితుడైన ప్యాడీ ఆప్టన్‌పై భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడి నియామకంతో జట్టుకు పెద్దగా ఒరిగేదేమీ లేదని, అద్భుతాలు చేయడం అతడికి చేతకాదని వ్యాఖ్యానించాడు. ఒకవేళ భారత్ టీ20 ప్రపంచకప్ గెలిస్తే ఆ ఘనత ఆటగాళ్లు, ద్రవిడ్ భాయ్‌కు మాత్రమే దక్కుతుందని పేర్కొన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2011 సమయంలో ప్యాడీ అప్టన్ భారత సిబ్బందిలో భాగమైన సంగతి తెలిసిందే. కాగా ఆటగాళ్ల మానసిక ఒత్తిడిని దూరం చేయగల నిపుణుడిగా పేరొందిన అతడు భారత్ టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో అతడికి మంచి సంబంధాలు ఉన్నాయి. ప్యాడీ అప్టన్(PC: BCCI) ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్-2022 సన్నాహకాల్లో భాగంగా అప్టన్‌ను మరోసారి టీమిండియా మెంటల్ కండిషనింగ్ హెల్త్‌కోచ్‌గా బీసీసీఐ నియమించింది. ఈ క్రమంలో వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియాతో ఇప్పటికే అతడు జట్టుకట్టాడు. అతడి వల్ల ఏమీకాదు! ఈ పరిణామాల గురించి మిడ్-డేతో శ్రీశాంత్ మాట్లాడుతూ.. ‘‘అతడు(అప్టన్) అద్భుతాలు చేయలేడు. ఒకవేళ మనం టీ20 వరల్డ్‌కప్ గెలిస్తే అది కేవలం మన ఆటగాళ్ల ప్రదర్శన.. రాహుల్ భాయ్ అనుభవం వల్లే! మనకు పటిష్టమైన జట్టు ఉంది. అంతేగానీ.. మనం ఇప్పుడు ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ వ్యక్తి జట్టుతో ఉన్నా లేకున్నా పెద్దగా తేడా ఏమీ ఉండదు’’ అని పేర్కొన్నాడు. ఇక 2011 నాటి ప్రపంచకప్ విజయంలో అప్టన్ పాత్ర కేవలం ఒక శాతం మాత్రమేనని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. రాహుల్ భాయ్‌తో కలిసి పనిచేశాడు కాబట్టే! ‘‘99 శాతం పనిని పూర్తి చేసింది గ్యారీ కిర్‌స్టన్.. అప్టన్ ఆయనకు కేవలం అసిస్టెంట్ మాత్రమే. రాజస్తాన్ రాయల్స్‌లో భాగంగా రాహుల్ భాయ్‌తో కలిసి పనిచేశాడు కాబట్టే మళ్లీ టీమిండియా సిబ్బందిలో భాగం కాగలిగాడు. నిజానికి అతడు మంచి యోగా టీచర్. కాబట్టి రాహుల్ భాయ్ కచ్చితంగా అతడి సేవలు వాడుకుంటాడు’’ అని శ్రీశాంత్ పేర్కొన్నాడు. కాగా ఈ కేరళ పేసర్ గతంలో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్-2013 సీజన్లో భాగంగా శ్రీశాంత్‌తో పాటు ద్రవిడ్, అప్టన్ కూడా ఈ ఫ్రాంఛైజీ తరఫున పనిచేశారు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్, ద్రవిడ్- అప్టన్ ద్వయం మధ్య విభేదాలు తలెత్తినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తన ఆటోబయోగ్రఫీలో అప్టన్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సమయంలో తుది జట్టులో చోటు దక్కని కారణంగా శ్రీశాంత్.. తనను, ద్రవిడ్‌ను అసభ్య పదజాలంతో దూషించాడని రాశాడు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదిలా ఉంటే.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో మసకబారిన శ్రీశాంత్ కెరీర్ అర్ధంతరంగా ముగిసిపోయిన విషయం తెలిసిందే. ఇక 2007 టీ20 ప్రపంచకప్, 2011 వరల్డ్‌కప్, గెలిచిన టీమిండియాలో శ్రీశాంత్ సభ్యుడన్న సంగతి తెలిసిందే. చదవండి: WC 2023: అందుకే గబ్బర్ కెప్టెన్ అయ్యాడు! రోహిత్ శర్మ కోరుకుంటున్నది అదే! -
శ్రీశాంత్‌పై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Sachin Tendulkar: ఇటీవలే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా వివాదాస్పద పేసర్ శ్రీశాంత్‌పై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శ్రీశాంత్‌ను తానెప్పుడూ టాలెంట్ ఉన్న బౌలర్‌గానే చూసానని ఇన్స్టాగ్రామ్ వేదికగా కేరళ స్పీడ్‌స్టర్‌పై ప్రశంసలు కురిపించాడు. ఆరేళ్లపాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించినందుకు గాను ధన్యవాదాలు తెలుపుతూ.. శ్రీశాంత్ సెకండ్ ఇన్నింగ్స్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. సచిన్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. View this post on Instagram A post shared by Sachin Tendulkar (@sachintendulkar) కాగా, 39 ఏళ్ల శ్రీశాంత్ మార్చి 9న తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ట్విటర్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన అనంతరం అతను తన సొంత దేశవాళీ జట్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్ గురించి కేరళ జట్టుకు ముందే సమాచారమందించినా పట్టించుకోలేదని, ఆరేళ్లపాటు టీమిండియాకు ఆడిన ఆటగాడికి కనీస మర్యాదగా వీడ్కోలు ఉంటుందని ఆశించానని, అయితే కొన్ని శక్తుల వల్ల తాను అందుకు కూడా నోచుకోలేకపోయానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే, తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఇటీవలే రంజీల్లోకి రీఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్.. ప్రస్తుత రంజీ సీజన్లో ఓ మ్యాచ్ ఆడాడు. మేఘాలయాతో జరిగిన ఆ మ్యాచ్‌లో అతను రెండు వికెట్లు పడగొట్టాడు. 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడైన శ్రీశాంత్.. భారత్ తరఫున 27 టెస్ట్‌ల్లో 87 వికెట్లు, 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టీ20ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. తక్కువ కాలంలోనే టీమిండియాలో కీలక బౌలర్‌గా ఎదిగిన శ్రీ.. 2013 ఐపీఎల్ సీజన్లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి క్రికెట్‌కు దూరమయ్యాడు. ఈ ఘటనతో అతనిపై జీవిత కాలం నిషేధం పడింది. చదవండి: రిటైర్మెంట్ అనంతరం శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు -
చెన్నై సూపర్ కింగ్స్‌లోకి శ్రీశాంత్...!
ఐపీఎల్-2022కు గాయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ దీపక్ చాహర్ దూరమైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో చాహర్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు సీఎస్కే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్కేకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. టీమిండియా వెటరన్ పేసర్ శ్రీశాంత్‌తో చాహర్ స్థానాన్ని భర్తీ చేయాలని చెన్నై భావిస్తోంది అన్నది ఆ వార్త సారాంశం. కాగా రూ.50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అమ్ముడుపోని ఆటగాడిగా శ్రీశాంత్ మిగిలిపోయాడు. ఇక 2013లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన శ్రీశాంత్‌పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో బీసీసీఐ అతడిపై జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు స్పందిస్తూ.. శిక్ష కాలాన్ని తగ్గించమని బీసీసీఐను ఆదేశించింది. దీంతో బీసీసీఐ అతడిపై నిషేధాన్ని ఏడు ఏళ్లకు కుదించింది. దీంతో 13 సెప్టెంబర్ 2020 నుంచి అతడిపై నిషేధం ఎత్తివేయబడింది. అనంతరం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయహాజారే టోర్నీ, రంజీ ట్రోఫీల్లో కేరళ తరపున శ్రీశాంత్ ఆడుతున్నాడు. రంజీట్రోఫీలో భాగంగా మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. అంతే కాకుండా తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ఇబ్బంది పెట్టే స్కిల్స్ శ్రీశాంత్‌కు ఉన్నాయి. అదే విధంగా పవర్‌ప్లేలో కూడా బౌలింగ్ చేసే సత్తా శ్రీశాంత్‌కు ఉంది. ఈ కారణాలతోనే చెన్నై శ్రీశాంత్‌పై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: IND vs SL: విరాట్ కోహ్లి అరుదైన రికార్డు.. ప్రపంచంలో రెండో ఆటగాడిగా! -
వేలంలో పేరు నమోదు చేసుకున్న శ్రీశాంత్.. ధర ఎంతో తెలుసా?
ఐపీఎల్-2022 మెగా వేలానికి సమయం అసన్నమైంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదిల్లో మెగా వేలం జరగనుంది. కాగా ఇప్పటికే 1214 మంది ఆటగాళ్లు మెగా వేలం కోసం తమ పేర్లును రిజిస్టర్ చేశారు. కాగా భారత మాజీ పేసర్ శ్రీశాంత్ మరో సారి వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ సారి తన బేస్ ప్రైస్ రూ. 50 లక్షలుగా నిర్ణయించాడు. గత ఏడాది వేలంలో రూ. 75 లక్షలుగా తన కనీస ధరగా శ్రీశాంత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఏ ఫ్రాంచైజీ కూడా అతడిని కొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఐపీఎల్లో శ్రీశాంత్ చివరిసారిగా 2013లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. ఆ తర్వాత అతడిపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో బీసీసీఐ అతడిపై జీవిత కాల నిషేధం విధించింది. అయితే ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు స్పందిస్తూ.. శిక్ష కాలాన్ని తగ్గించమని బీసీసీఐను ఆదేశించింది. దీంతో బీసీసీఐ అతడిపై నిషేధాన్ని ఏడు ఏళ్లకు కుదించింది. దీంతో 13 సెప్టెంబర్ 2020 నుంచి అతడిపై నిషేధం ఎత్తివేయబడింది. కాగా గత ఏడాదిలో సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీలలో కేరళ తరఫున ఆడాడు. అంతే కాకుండా త్వరలో జరగనున్న కేరళ రంజీ జట్టులో కూడా శ్రీశాంత్ భాగమై ఉన్నాడు. చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ఆల్ రౌండర్ గుడ్‌బై.. -
ఆడతాడు... తిడతాడు... కొడతాడు! అది భజ్జీ స్పెషల్..
‘జంబో’ అనిల్ కుంబ్లే మృదు స్వభావి. బౌలింగ్ తప్ప వేరే ధ్యాస లేదు అతనికి. కానీ అతని నీడన ఎదిగిన ‘టర్బోనేటర్’కు దూకుడెక్కువ. మైదానంలో ఆడతాడు. తిడతాడు. ఇంకెమైనా అంటే చెంప చెళ్లుమనిపిస్తాడు కూడా! అవును భజ్జీ అంతే! తగ్గేదేలే అంటాడు. మనోడైనా... ఇంకెవరైనా... తాడోపేడో తేల్చుకునే రకం. ఇది ఆట సంగతీ... మ్యాచ్ ఫిక్సింగ్‌తో మసకబారిన క్రికెట్ తదనంతరం సౌరవ్ గంగూలీ సారథ్యంలో టీమిండియాగా రూపాంతరం చెందుతున్న రోజులవి. అప్పటికే కుంబ్లే టాప్ స్పిన్నర్. అయినప్పటికీ తనదైన శైలి ఆఫ్ స్పిన్‌తో హర్భజన్ ఎదిగాడు. 2001 అతని కెరీర్‌కు బంగారుబాట వేసింది. భారత్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా మూడు టెస్టులాడింది. ఈ సిరీస్‌లో భజ్జీ 32 వికెట్లు తీశాడు. ముంబైలో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓడిపోయింది. కోల్‌కతాలో జరిగిన రెండో టెస్టులో వీవీఎస్ లక్ష్మణ్ (281) స్పెషల్ ఇన్నింగ్స్... హర్భజన్ ‘హ్యాట్రిక్’ మాయాజాలంతో టీమిండియా అద్భుత విజయం సాధించింది. సిరీస్‌ను 1–1తో సమం చేసింది. ఆ తర్వాత చెన్నైలో జరిగిన మూడో టెస్టులో భారత్ రెండు వికెట్లతో నెగ్గి సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. 2003లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టులో హర్భజన్ కీలక ఆటగాడిగా ఉన్నాడు. మంకీగేట్ కథ... భారత్ 2008లో ఆసీస్ పర్యటనకెళ్లింది. సిడ్నీలో మ్యాచ్ సందర్భంగా చెలరేగిన జాతి వివక్ష ఆరోపణలు, వివాదం, విచారణ.... తదనంతరం ‘మంకీగేట్’గా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. భజ్జీ తనను కోతి అన్నాడని జాతి వివక్ష ఆరోపణలు చేశాడని సైమండ్స్ నానాయాగీ చేశాడు. అప్పుడు క్రీజులో ఉన్న సచిన్, జట్టు మేనేజర్‌గా వెళ్లిన ఎంవీ శ్రీధర్, ‘టర్బో’తో పాటు విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. ఆసీస్, భారత్ క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారంతో ఈ కథ ముగిసింది. అబ్బనీ తియ్యని దెబ్బ! ఆట... మాట... ఇలా వుంటే అతను కొట్టే దెబ్బ సంగతి మాత్రం స్పీడ్‌స్టర్ శ్రీశాంత్‌కు బాగా ఎరుక. 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభమైంది. తొలి సీజన్లో ముంబై ఇండియన్స్‌కు హర్భజన్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌కు శ్రీశాంత్ ఆడారు. నిజానికి వీరిద్దరు ఏడాది క్రితం టి20 ప్రపంచకప్ నెగ్గిన ధోని సేన సభ్యులు. ఇద్దరి మధ్య ఎక్కడ పొరపాటు జరిగిందో కానీ ముంబైపై పంజాబ్ గెలిచాక శ్రీకాంత్ నోరు జారడంతో హర్భజన్ ఆగ్రహంతో అతని చెంప చెళ్లుమనిపించాడు. శ్రీశాంత్ చాలాసేపు వెక్కివెక్కి చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. చదవండి: మీడియా సమావేశానికి కోహ్లి డుమ్మా కొట్టనున్నాడా! -
శ్రీశాంత్‌కు దక్కని చోటు, లిస్టులో అర్జున్
చెన్నై: ఐపీఎల్–2021 వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది. ఈ నెల 18న చెన్నైలో జరిగే వేలంలో మొత్తం 292 క్రికెటర్లు అందుబాటులోకి వస్తారు. ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు 1114 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకోగా... ఫ్రాంచైజీ యాజమాన్యాల సూచనల ప్రకారం 292 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. ఈ జాబితాలో శ్రీశాంత్‌కు చోటు దక్కలేదు. సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు జాబితాలో ఉన్నాడు. వేలంలో గరిష్టంగా 61 స్థానాలు ఖాళీలు ఉండగా, ఇందులో 22 మంది వరకు విదేశీ ఆటగాళ్లను ఎనిమిది జట్లు ఎంచుకోవచ్చు. అత్యధికంగా బెంగళూరు జట్టులో 13 స్థానాలు ఖాళీ, సన్‌రైజర్స్ జట్టులో 3 స్థానాలు ఖాళీ ఉన్నట్టు తెలిసింది. కనీస రూ.2 కోట్ల జాబితాలో భారత్ నుంచి హర్భజన్, కేదార్ జాదవ్, విదేశాల నుంచి.. స్మిత్, మ్యాక్స్‌వెల్ ఉన్నారు. మరో వైపు బోర్డు ప్రకటనలో ‘వివో’ ఐపీఎల్–2021 అని ప్రముఖంగా ప్రస్తావించడాన్ని బట్టి చూస్తే ఈ ఏడాది లీగ్‌కు మళ్లీ చైనా మొబైల్ కంపెనీ ‘వివో’నే స్పాన్సర్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. -
ఐపీఎల్ వేలం.. బరిలో అర్జున్ టెండూల్కర్
చెన్నై: వివాదాస్పద భారత క్రికెటర్ శ్రీశాంత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్లో మళ్లీ ఆడేందుకు తహతహలాడుతున్నాడు. ఈ సీజన్ కోసం నిర్వహించే వేలంలో పాల్గొనేందుకు రూ. 75 లక్షల కనీస ధరతో తన పేరు నమోదు చేసుకున్నాడు. కానీ పోటీ తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఫిక్సింగ్ మరకలున్న అతనిపై ఏ ఫ్రాంచైజీ కన్నెత్తి చూస్తోందో వేచి చూడాలి. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా ఈ వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. అర్జున్ రూ. 20 లక్షల కనీస ధరతో పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. ఈ నెల 18న జరిగే ఆటగాళ్ల వేలానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రంగం సిద్ధం చేసింది. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీల్లో కేవలం 61 ఖాళీలే ఉన్న ఈ సీజన్ కోసం 1,097 మంది ఆటగాళ్లు వేలంలో పోటీపడుతున్నారు. మిషెల్ స్టార్క్, ప్యాటిన్సన్ (ఆస్ట్రేలియా), జో రూట్ (ఇంగ్లండ్)లాంటి అంతర్జాతీయ స్టార్లు ఈ వేలంలో పాల్గొనడం లేదు. వేలం బరిలో 814 మంది భారత ఆటగాళ్లు (21 అంతర్జాతీయ క్రికెటర్లు, 793 అన్క్యాప్డ్ ప్లేయర్లు) ఉన్నారు. 283 మంది విదేశీ ఆటగాళ్లు ఫ్రాంచైజీల కంటపడేందుకు బోర్డు వద్ద తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆటగాళ్ల నమోదుకు గడువు గురువారంతో ముగియడంతో బీసీసీఐ వేలం జాబితాను శుక్రవారం విడుదల చేసింది. విదేశాల నుంచి అందుబాటులో ఉన్న క్రికెటర్లలో వెస్టిండీస్ ఆటగాళ్లే (56 మంది) ఎక్కువ ఉన్నారు. ఆ తర్వాత సంఖ్య ఆస్ట్రేలియా (42), దక్షిణాఫ్రికా (38) ఆటగాళ్లది. ప్రస్తుతమున్న 61 ఖాళీల్లో విదేశీ ఆటగాళ్లతోనే 22 స్థానాల్ని భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. రూ. 2 కోట్ల ధరలో... హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్ (భారత్), స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్ (ఆస్ట్రేలియా), షకీబుల్ హసన్ (బంగ్లాదేశ్), మొయిన్ అలీ, బిల్లింగ్స్, ప్లంకెట్, జేసన్ రాయ్, మార్క్ వుడ్ (ఇంగ్లండ్), ఇంగ్రామ్ (దక్షిణాఫ్రికా). ఏ దేశం నుంచి ఎందరంటే... వెస్టిండీస్ (56), ఆస్ట్రేలియా (42), దక్షిణాఫ్రికా (38), శ్రీలంక (31), అఫ్గానిస్తాన్ (30), న్యూజిలాండ్ (29), ఇంగ్లండ్ (21), యూఏఈ (9), నేపాల్ (8), స్కాట్లాండ్ (7), బంగ్లాదేశ్ (5), ఐర్లాండ్ (2), అమెరికా (2), జింబాబ్వే (2), నెదర్లాండ్స్ (1). -
ఏడేళ్ల తర్వాత తొలి వికెట్.. ఏడ్చేసిన శ్రీశాంత్
టీమిండియాలో కోపానికి కేరాఫ్ అడ్రస్ ఎవరంటే టక్కున గుర్తుచ్చే పేరు కేరళ స్పీడస్టర్ శ్రీశాంత్. 2005లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్ మొదటి నుంచే అగ్రెసివ్ క్రికెటర్‌గా పేరు పొందాడు. తన కెరీర్ మొత్తంలో ఎక్కువశాతం గొడవలతోనే ఫేమస్ అయ్యాడు. తాను వేసే బంతుల కన్నా చూపులతోనే ప్రత్యర్థి బ్యాట్స్మన్లను భయపెట్టడానికి ప్రయత్నించేవాడు. తాజాగా ఏడేళ్ల నిషేధం పూర్తి చేసుకొని ముస్తాక్ అలీ ట్రోపీతో రీఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్ తొలి మ్యాచ్‌లోనే వికెట్ పడగొట్టి తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. మొత్తం 4 ఓవర్ల కోటాలో 29 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఆ ఆనంద సమయంలో కన్నీరు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను శ్రీశాంత్ స్వయంగా ట్విటర్లో పంచుకున్నాడు. ఏడేళ్ల తర్వాత సొంత జట్టు తరపున వికెట్ తీయడం ఆనందంగా ఉంది. నా జీవితంలో చీకటి రోజులు ముగిసిన తర్వాత ఆడుతున్న తొలి మ్యాచ్ ఇది. ఇన్నాళ్ల తర్వాత కూడా అభిమానులు నాపై చూపించిని ప్రేమ, మద్దతుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశాడు. టీమిండియా తరపున 27 టెస్టులు, 57 వన్డేలు, 10 టీ20లు ఆడిన శ్రీశాంత్ 2013 ఐపీఎల్ సీజన్ సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అప్పట్లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడుతున్న శ్రీశాంత్ తన సహచర క్రికెటర్లైన అంకిత్ చవాన్, అజిత్ చండీలాతో కలిసి బుకీలను కలిసినట్లు తేలడంతో బీసీసీఐ శ్రీశాంత్‌తో పాటు మిగతా ఇద్దరి ఆటగాళ్లపైన జీవితకాల నిషేదం విధించింది. అయితే తాను నిర్దోషినంటూ శ్రీశాంత్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. దోషిగానే గుర్తించిన సుప్రీం.. జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్‌మన్ డీకే జైన్ 2019లో నిర్ణయం తీసుకున్నాడు. దాంతో గతేడా ఏడాది సెప్టెంబర్‌తో శ్రీశాంత్ శిక్షాకాలం పూర్తయింది. దీంతో కేరళ తరపున ముస్తాక్ అలీ ట్రోపీలో ఆడేందుకు శ్రీశాంత్‌కు లైన్ క్లియర్ అయింది. కొన్ని వారాల క్రితం ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌పై కోపంగా చూడడం.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏడేళ్ల తర్వాత కూడా శ్రీశాంత్ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు లేదంటూ నెటిజన్లు కామెంట్లు కూడా పెట్టారు. Thanks a lot for all the support and love ..it’s just the beginning..with all of ur wishes and prayers many many many more to go..❤️🇮🇳🏏lots of respect to u nd family .. #blessed #humbled #cricket #bcci #kerala #love #team #family #india #nevergiveup pic.twitter.com/bMnXbYOrHm — Sreesanth (@sreesanth36) January 11, 2021 -
బంతి పట్టనున్న శ్రీశాంత్.. రైనా శుభాకాంక్షలు
తిరువనంతపురం: ఏడేళ్ల నిషేధం తర్వాత మళ్లీ బంతి పట్టనున్న టీమిండియా ఆటగాడు శ్రీశాంత్‌కు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా శుభాకాంక్షలు తెలిపాడు. దాదాపు ఏడేళ్ల విరామం అనంతరం శ్రీశాంత్ కేరళ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ప్రెసిడెంట్స్ కప్ టీ20 టోర్నమెంటులో ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీశాంత్ ట్విటర్ ద్వారా తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఏడేళ్ల తర్వాత తన చేతులను మళ్లీ తిప్పే అవకాశం వచ్చిందని.. ఎంతగానో ఇష్టపడే క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేస్తానని ట్వీట్లో పేర్కొన్నాడు. శ్రీశాంత్ ట్వీట్‌కు సురేశ్ రైనా స్పందిస్తూ.. ‘గుడ్ లక్ మై బ్రదర్’ అని బదులిస్తూ శుభాకాంక్షలు తెలిపాడు. 2013 ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో చిక్కుకొని శ్రీశాంత్ క్రికెట్‌కు దూరమయ్యాడు. అతడితో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడిన సహచరులు అజిత్ చండేలా, అంకిత్ చవాన్‌లు నిషేధానికి గురయ్యారు. శ్రీశాంత్‌పై విధించిన నిషేధాన్ని గత సంవత్సరం ఏడేళ్లకు కుదించగా, ఈ ఏడాది సెప్టెంబరుతో ఆ గడువు ముగిసింది. ప్రెసిడెంట్స్ కప్ టీ 20 టోర్నీ వచ్చే నెల 17న ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో కేసీఏ రాయల్స్, కేసీఏ టైగర్స్, కేసీఏ టస్కర్స్, కేసీఏ ఈగల్స్, కేసీఏ పాంథర్స్, కేసీఏ లయన్స్ జట్లు తలపడనున్నాయి. -
ఆడి చూపిస్తాడు
శ్రీశాంత్‌పై నిషేధం ముగిసింది. రీ ఎంట్రీకి నేను సిద్ధం అన్నాడు. ఇంకేం ఆడతావ్‌లే అన్నారెవరో! ఆడి చూపిస్తాడు అన్నారు శ్రీశాంత్ భార్య. భార్యగా ఆ మాట అనలేదు. శ్రీశాంత్ అభిమానిగా అన్నారు. ఆటను చూసి ప్రేమించి.. ఆట నుంచి నిషేధించారని తెలిసీ.. శ్రీశాంత్‌ని చేసుకున్నారు భువనేశ్వరి. స్టోరీలే లేని లవ్.. వీళ్ల లవ్ స్టోరీ!! ఆదివారం జైలు నుంచి విడుదలైనట్లే అయ్యాడు శ్రీశాంత్! అవును జైలే. 149 కి.మీ. వేగంతో బంతిని విసరగల పేసర్ అతడు. ఏడేళ్లుగా అసలు బంతిని విసిరే అవకాశమే లేకుండా గడిపాడు. ఐపీఎల్ స్పాట్–ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధాన్ని అనుభవిస్తూ, శిక్ష కుదింపునకు సుప్రీంకోర్టు చేసిన చొరవతో ఈ సెప్టెంబర్ 13న విముక్తుడైన 37 ఏళ్ల ఈ క్రికెటర్‌కు అదృష్టవశాత్తూ ఇంకా ఐదారేళ్ల ‘జీవితకాలం’ మిగిలే ఉంది. ఆటే అతడి జీవితం. ‘ఇక ప్రతి బంతినీ సంధిస్తాను చూడండి’ అన్నాడు పగ్గాలు తెగిన ఆనందంలో. ‘ఏం సంధిస్తావ్, వృద్ధుడివైపోలా! నీ మీద పడిన మరక పోతుందేమిటి? కామెంటరీ చెప్పుకుంటూ కాలం గడిపేయ్..’ అని తూటాలా ఓ మాట! ఎవరో అజ్ఞాత వ్యక్తి ట్వీట్ చేశాడు. వెంటనే ఆ వ్యక్తికి బదులు వెళ్లింది. ‘విచారించకండి. శ్రీశాంత్ యంగ్‌గా ఫిట్‌గా ఉన్నారు. క్రికెట్లోకి వచ్చిన రోజు ఎంత ఫాస్ట్‌గా ఉన్నారో ఇప్పుడూ అంతే ఫాస్ట్‌గా ఉన్నారు. దేశం పట్ల ఆయన ప్రేమ కూడా అలాగే ఉంది. ముందు మీరు మగవారిలా మీ గుర్తింపును బయటపెట్టుకుని మాట్లాడండి’ అని శ్రీశాంత్ భార్య భువనేశ్వరి ట్వీట్ చేశారు. అయితే ఆమె శ్రీశాంత్ భార్యగా ఆ ట్విటిజన్కి వడ్డించలేదు. శ్రీశాంత్ అభిమానిగా మాత్రమే ఒక బౌన్సర్ వేశారు. భార్యగా ఎప్పుడూ ఆమె చేసేది ఒక్కటే. శ్రీశాంత్‌కి విమర్శలను ఎదుర్కొనే శక్తిని ఇవ్వడం. 2013 సెప్టెంబర్ 13. శ్రీశాంత్‌పై బి.సి.సి.ఐ. జీవితకాల నిషేధం మొదలైన రోజు. అప్పటికి అతడి పక్కన భువనేశ్వరి లేరు. ఈ దివాన్పుర్ రాజకుమారితో శ్రీశాంత్ పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగానే ఆ నిషేధ ప్రకటన వెలువడింది. శ్రీశాంత్ తల్లిదండ్రులు మౌనంగా అయిపోయారు. భువనేశ్వరి తల్లిదండ్రులే జైపుర్ నుంచి కొచ్చి వెళ్లి వాళ్ల మౌనాన్ని పోగొట్టారు. ‘‘ఈ పెళ్లి ఆగిపోవడం లేదు’’ అని చేతుల్లో చేతులు వేసి చెప్పారు. ఒకవేళ శ్రీశాంత్, భువనేశ్వరిలది ప్రేమ వివాహం కాకపోయుంటే ఒకే ఒక కారణంతో ఆ పెళ్లి ఆగిపోయి ఉండేది. శ్రీశాంత్‌పై నిషేధం విధించడానికి ముందు అతడిని నెలరోజుల విచారణ కోసం తీహార్ జైల్లో ఉంచారు. అయితే రాజస్థాన్ రాచకుటుంబం దాన్నొక విషయంగానే భావించలేదు. కూతురి ప్రేమే ముఖ్యం అనుకుంది. పైగా ఆ సమయంలోనే, తనింకా శ్రీశాంత్‌కి భార్య కాకుండానే అతyì కి అండగా నిలిచారు భువనేశ్వరి! అప్పటికి ఆరేళ్ల ప్రేమ వారిది! ఇరవై నాలుగేళ్ల వయసులో శ్రీశాంత్ మ్యాచ్ ఆడేందుకు జైపుర్ వెళ్లినప్పుడు భువనేశ్వరి స్కూల్ విద్యార్థిని. టెన్త్ చదువుతోంది. మ్యాచ్‌లో శ్రీశాంత్‌ని చూస్తూ చూస్తూ ప్రేమలో పడిపోయింది. శ్రీశాంత్ అరెస్ట్ అయిన ఏడాదే, బి.సి.సి.ఐ. అతడిపై జీవితకాల నిషేధం విధించిన ఏడాదే.. డిసెంబర్ 12న వాళ్ల పెళ్లి జరిగింది. శ్రీశాంత్ ఆటను చూసి ప్రేమలో పడిన అమ్మాయి శ్రీశాంత్ ఇక జీవితంలో ఆడలేని తెలిసీ అతడిని చేసుకుందంటే.. ‘ప్రేమంటే ఇదేరా..’ అనుకోవాలి. ఆటే జీవితం అనుకున్న ప్లేయర్‌కి నిషేధం వల్ల ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేయడానికా అన్నట్లు భువనేశ్వరి శ్రీశాంత్ జీవితంలోకి వచ్చారు. మానసికంగా అతడికి బలాన్ని ఇచ్చారు. ఆమె అతడికి ఎంత సపోర్టుగా ఉండేవారో హిందీ బిగ్‌బాస్ షోలో వారాంతంలో అతడిని ఆమె కలవడానికి వచ్చినప్పుడు అందరికీ తెలిసింది. గట్టి ఎమోషనల్ బాండేజ్ ఉంది వాళ్ల మధ్య. అప్పుడే వాళ్ల లవ్ స్టోరీ గుట్టును విప్పారు. భువనేశ్వరి తన పదిహేనవ యేట అతడిని ప్రేమిస్తే, శ్రీశాంత్ ఆమెకు 20వ యేడు వచ్చే వరకు ఆగి అప్పుడు ఆమెను ప్రేమించడం మొదలు పెట్టాడు. అప్పటి వరకు వాళ్లిద్దరి మధ్య ఉన్నవి ఫోన్ సంభాషణలే. అప్పటివరకు అని కాదు. పెళ్లయ్యే వరకు కూడా! శ్రీశాంత్ మొదటిసారి భువనేశ్వరి చెయ్యి తాకింది.. పెళ్లిలో మామగారు తన కూతురి చేతిని అతడి చేతిలో పెట్టినప్పుడే! అది కూడా శ్రీశాంత్ ఆమె చెయ్యి పట్టుకున్నట్లు లేదు. ఆమే అతడి చేతిని పట్టుకున్నారు. ఈరోజు వరకూ ఆ చేతిని అలా పట్టుకునే ఉన్నారు భువనేశ్వరి. శ్రీశాంత్‌పై విమర్శలు వచ్చినప్పుడు ఆమె చెయ్యి మరింత భద్రంగా అతడిని పట్టుకుంటుంది. భార్య భువనేశ్వరి, కూతురు శాన్విక, కొడుకు సూర్యశ్రీలతో శ్రీశాంత్. -
‘అలా అయితే ఈ ఏడాది ఐపీఎల్‌లోనే ఆడతా’
న్యూఢిల్లీ: ఐపీఎల్–2013లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఏడేళ్ల శిక్షా కాలాన్ని ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగించుకోబోతున్న భారత వెటరన్ పేసర్ శ్రీశాంత్ రీఎంట్రీ దాదాపు షురూ అయ్యింది. కేరళ ఆటగాడైన శ్రీశాంత్‌ను ఆ జట్టు రంజీ ట్రోఫీల్లో తీసుకోవడానికి ఇప్పటికే సుముఖంగా ఉన్న నేపథ్యంలో అతని పునరాగమనం ఖాయమైంది. కాగా, వచ్చే ఏడాది ఐపీఎల్‌తో పాటు వరల్డ్‌కప్‌ల్లో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్న శ్రీశాంత్ తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాడు. దీనిలో భాగంగా వచ్చే ఏడాది ఐపీఎల్‌కు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. (‘భజ్జీపై నిషేధం వద్దని ఏడుస్తూ వేడుకున్నా’) క్రిక్ ట్రేకర్‌తో ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో మాట్లాడిన శ్రీశాంత్.. ఐపీఎల్లో ఏయే జట్లకు ఆడాలనే ఉందనే విషయాన్ని వెల్లడించాడు. తన తొలి ప్రాధాన్యత ముంబై ఇండియన్స్‌గా శ్రీశాంత్ పేర్కొన్నాడు. గతంలో ముంబైకు ఆడిన సందర్భంలో తనకు లభించిన మద్దతు కారణంగానే ఆ జట్టుకు మొదటి ప్రాముఖ్యత ఇస్తున్నట్లు తెలిపాడు. సచిన్ టెండూల్కర్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్ నుంచి తనకు ఎంతగానో సహకారం లభించిన విషయాన్ని శ్రీశాంత్ ప్రస్తావించాడు. మరొకవైపు విరాట్ కోహ్లి నేతృత్వం వహించే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో పాటు, ఎంఎస్ ధోని సారథ్యం వహించే చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)కు కూడా ఆడాలని ఉందన్నాడు. ఈ మూడు జట్లలో ఒకదానికి ఆడాలని అనుకుంటన్నట్లు శ్రీశాంత్ మనసులోని మాటను వెల్లడించాడు. కాగా, చివరకు ఏ జట్టు తనను తీసుకున్నా ఆడతానన్నాడు. ‘ ముంబైకు తొలి ప్రాధాన్యత. ఆ తర్వాత ఆర్సీబీ, సీఎస్కేలకు ఆడాలనుకుంటున్నా. ఒక వేళ ఆ మూడు జట్లు కాకపోతే ఏ జట్టు తీసుకున్నా ఆడతా. క్రికెట్ అభిమానిగా ముంబై ఇండియన్స్ అంటే బాగా ఇష్టం. దిగ్గజ క్రికెటర్ సచిన్ పాజీని కలిసే అవకాశం ఉంటుంది. సచిన్ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అవకాశం వస్తే ముంబైకు ఆడటానికి సిద్ధంగా ఉన్నా’ అని శ్రీశాంత్ తెలిపాడు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్ జరిగితే చాలా మంది విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవచ్చన్న శ్రీశాంత్.. అప్పుడు మరింతమంది భారత ఆటగాళ్లకు అవకాశం లభిస్తుందన్నాడు. అలా జరిగితే తనకు కూడా చాన్స్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ అరంగేట్రంలోనే ముంబై ఇండియన్స్‌కు శ్రీశాంత్ ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. -
‘భజ్జీపై నిషేధం వద్దని ఏడుస్తూ వేడుకున్నా’
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)చరిత్రలో మనకు బాగా గుర్తుండిపోయే వివాదాస్పద ఘటనల్లో హర్భజన్ సింగ్-శ్రీశాంత్‌ల మధ్య రగడ. 2008 సీజన్లో శ్రీశాంత్‌ను హర్భజన్ సింగ్ బహిరంగంగా చెంపపై కొట్టడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఐపీఎల్ ఆరంభపు సీజన్లోనే కింగ్స్ పంజాబ్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోయిన తర్వాత శ్రీశాంత్ చెంపను భజ్జీ చెల్లుమనిపించాడు. అయితే ఆ తర్వాత వెంటనే శ్రీశాంత్‌కు భజ్జీ క్షమాపణలు చెప్పడం, అదే రాత్రి ఇద్దరూ కలిసి డిన్నర్ చేయడంతో దానికి ముగింపు పలకాలనుకున్నారు. కాగా, ఈ వ్యవహారాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సీరియస్‌గా తీసుకుంది. ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. అయితే బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిషన్ విచారణకు హాజరైన క్రమంలో భజ్జీపై ఎటువంటి నిషేధం విధించవద్దని శ్రీశాంత్ వేడుకున్నాడట. (‘టీమిండియా.. పేస్ బౌలింగ్‌తో భయపెడితేనే’) ఈ విషయాన్ని శ్రీశాంత్ తాజాగా వెల్లడించాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌తో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై నిషేధాన్ని ముగించుకోనున్న శ్రీశాంత్.. తన రీఎంట్రీపై ఆసక్తిగా ఉన్నాడు. ఐపీఎల్‌తో పాటు వరల్డ్‌కప్‌ల్లో ఆడాలనే లక్ష్యంగా పెట్టుకున్నానన్నాడు. తాజాగా క్రికెట్ ఎడిక్టర్‌తో మాట్లాడిన శ్రీశాంత్.. భజ్జీతో వివాదాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘ ఆ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్(సచిన్ పాజీ) ఉన్న జట్టులోనే నేను, భజ్జీ ఉన్నాం. నా చెంపపై భజ్జీ కొట్టిన తర్వాత సచిన్ మా మధ్య వివాదాన్ని సద్దుమణిగేలా చేశాడు. అందుకు సచిన్‌కు థాంక్స్ చెప్పాలి. ఆ రోజు రాత్రి మేమంతా కలిసి డిన్నర్ చేశాం. కానీ మీడియా మాత్రం మా మధ్య జరిగిన గొడవను పెద్దదిగా చేసి చూపించింది. దాంతో బీసీసీఐ విచారణకు ఆదేశించింది. నానావతీ సర్ నన్ను విచారించారు. వీడియో క్లిప్పింగ్ చూపించి ఏమి జరిగిందని అడిగారు. నేను ఏడుస్తూ భజ్జీపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని వేడుకున్నాను. మా మధ్య వివాదం ముగిసిందని చెప్పా. మేమిద్దరం కలిసే ఆడతామని తెలిపా. మా నుంచి భజ్జీని వేరు చేయొద్దని విన్నవించా. అతనొక మ్యాచ్ విన్నర్. భారత్ తరఫున హ్యాట్రిక్ సాధించిన బౌలర్లలో భజ్జీ ఒకడు. నాకు భజ్జీ సోదర సమానుడు. ఆ వివాదాన్ని పెద్దది చేయొద్దని చెప్పా. అది ముగిసిన అధ్యాయమని విచారణలో తెలిపా. భజ్జీ ఎప్పుడూ ఒక లెజెండ్‌గానే ఉంటాడు’ అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.(233 ఏళ్ల ఎంసీసీ చరిత్రలో..) -
ఆ క్షణం సుశాంత్‌లో నన్ను చూసుకున్నా: క్రికెటర్
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. సుశాంత్ మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నట్లు ముంబై పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. అప్పటీ నుంచి పలువురు బాలీవుడ్ నటులు తాము కూడా ఒత్తిడికి గురయ్యామంటూ తమకు ఎదురైన చేదు అనుభవనాలు పంచుకుంటున్నారు. తాజాగా బిగ్‌బాస్ 12 కంటెస్టెంట్, క్రికెటర్ శ్రీశాంత్.. సుశాంత్ ఆత్మహత్యపై స్పందించాడు. సుశాంత్ మరణ వార్త తనను బాగా ప్రభావితం చేసిందన్నాడు. (సుశాంత్ మృతిపై విచారణకు ఎల్జేపీ నేత డిమాండ్) గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణాలకు పాల్పడినట్లు శ్రీశాంత్‌పై ఆరోపణలు రావడంతో అతడిపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. అయితే గతేడాది దానిని బీసీసీఐ అంబుడ్స్‌మన్ జస్టిస్ డీకే జైన్ ఏడేళ్లకు కుదించారు. దాంతో అతడి నిషేధం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనుండటంతో అతని రీఎంట్రీ ఖాయమైంది. ఫలితంగా కేరళ తరఫున ఆడటానికి రంగం సిద్ధం చేసుకున్న శ్రీశాంత్.. ‘ఒకప్పుడు నేను చీకటిని చుశానని మీకు తెలుసు. ఆ సమయంలో నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను. ఇంటి నుంచి అసలు బయటకు వచ్చేవాడిని కాదు. అలా ఒంటరిగా గడపుతున్న క్రమంలో ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చాయి’ అంటూ తాను ఎదుర్కొన్నా చేదు అనుభవాన్ని ఈ సందర్భంగా శ్రీశాంత్ గుర్తుచేసుకున్నాడు. (‘ఆ సినిమా నుంచి సుశాంత్ అభిమానిగా మరాను’) ‘‘నేను ఒంటరిగా నా గదిలో ఉన్నప్పుడు నిరాశ, ఒత్తిడికి లోనయ్యేవాడిని. కానీ రూమ్ నుంచి చిరునవ్వుతో బయటకు వచ్చేవాడిని. ఎందుకంటే నా బలహీనతను, నిరాశను నా తల్లిదండ్రులు చూపించాలనుకోలేదు. ఎందుకంటే బయటి ప్రపంచానికి నేను శ్రీశాంత్‌ని కానీ నా పేరెంట్స్‌కి మాత్రం గోపుని. కానీ నా గదిలో నేను ఏంటన్నది నాకు కూడా తెలియదు. ఇది నేను 2013లో నిరంతరాయంగా పోరాడిన చీకిటి కాలం. అందుకే సుశాంత్ సింగ్ మరణ వార్త నన్ను బాగా ప్రభావితం చేసింది. తన మరణానికి కారణం తెలియగానే ఆ క్షణం సుశాంత్‌లో నన్ను చూసుకున్నాను’’ అంటు చెప్పుకొచ్చాడు. -
ప్రపంచకప్‌లో ఆడటమే నా లక్ష్యం
కొచ్చి : వన్డే ప్రపంచకప్-2023లో ఆడటమే తన లక్ష్యమని భారత వివాదస్పద క్రికెటర్ శ్రీశాంత్ స్పష్టం చేశాడు. రంజీల్లో రాణించి త్వరలోనే టీమిండియాకు ఎంపిక అవుతాననే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో శ్రీశాంత్‌పై బీసీసీఐ ఏడేళ్ల నిషేధాన్ని విధించింది. ఆ నిషేధం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగుస్తుండటంతో శ్రీశాంత్‌తో పాటు అతడి అభిమానుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నిషేధం ముగియగానే కేరళ తరుపున రంజీల్లో ఆడిస్తామని అక్కడి అసోసియేషన్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఫిట్నెస్ పరీక్షలో నెగ్గితేనే రెగ్యులర్‌గా అవకాశాలు ఇస్తామని కేరళ జట్టు కోచ్ తెలిపారు. (శ్రీశాంత్.. నీ కోసమే వెయిటింగ్) కేరళ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన శ్రీశాంత్ తానేంటో నిరూపించుకుంటానని, తనలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉందనే విషయాన్ని రుజువు చేసుకుంటానన్నాడు. ‘2023 వన్డే ప్రపంచకప్‌ను నేను ఆడగలనని బలంగా విశ్వసిస్తున్నా. నా లక్ష్యాలు ఎప్పుడూ అందనంత ఎత్తులో ఉంటాయి. వాస్తవానికి ప్రతి అథ్లెట్ టార్గెట్స్ కూడా అలానే ఉంటాయి. ఉండాలి కూడా. ఒకవేళ అథ్లెట్ చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటే సాధారణంగా మారిపోతాడు' అని 37 ఏళ్ల శ్రీశాంత్ పేర్కొన్నాడు. భారత్ తరఫున 27 టెస్టులు ఆడిన శ్రీశాంత్ 87 వికెట్లు పడగొట్టాడు. 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టి20ల్లో 7 వికెట్లు తీశాడు. 2007లో టి20 ప్రపంచ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ నెగ్గిన జట్లలో అతను సభ్యుడు కావడం విశేషం. (రాబిన్ ఊతప్పపై శ్రీశాంత్ ఆగ్రహం) -
శ్రీశాంత్.. నీ కోసమే వెయిటింగ్
తిరువనంతపురం: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఏడేళ్ల పాటు నిషేధానికి గురైన శ్రీశాంత్ తన రీఎంట్రీపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌తో శ్రీశాంత్‌పై నిషేధం ముగియనుండటంతో క్రికెట్ పునరాగమనం కోసం యత్నాలు ఆరంభించాడు. దేశవాళీ సీజన్లో భాగంగా తన రాష్ట్ర రంజీ జట్టు కేరళతో ఆడాలనే యత్నంలో ఉన్నాడు. దీనిపై కేరళ బ్యాట్స్‌మన్ సచిన్ బేబీ మాట్లాడుతూ. శ్రీశాంత్ కోసం నిరీక్షిస్తున్నట్లు తెలిపాడు. గత ఏడేళ్లుగా శ్రీశాంత్ కేరళ జట్టుకు దూరమైన విషయాన్ని కాస్త బాధగా చెప్పిన సచిన్ బేబీ.. అతను ఎప్పుడూ జట్టుకు సలహాలు ఇస్తూ ఉండేవాడనే విషయాన్ని వెల్లడించాడు. గతంలో ప్రాక్టీస్ సెషన్లో కూడా శ్రీశాంత్ బౌలింగ్ చేసేవాడన్నాడు. (శ్రీశాంత్ మళ్లీ వస్తున్నాడు...) శ్రీశాంత్ పేస్‌లో స్వింగ్ ఎక్కువగా ఉండటంతో తాను ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడేవాడినని సరదాగా వ్యాఖ్యానించాడు. టెలివిజన్ కామేంటేటర్, ప్రజెంటర్ అరుణ్ వేణుగోపాల్‌తో ఇన్‌స్టా లైవ్ సెషన్లో అనేక విషయాలను సచిన్ బేబీ షేర్ చేసుకున్నాడు. ‘ నాకు శ్రీశాంత్ సోదరుడు లాంటివాడు. కేరళ తరఫున మళ్లీ ఆడతాడని ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా.మా జట్టులోని ఆటగాళ్లంతా శ్రీశాంత్ రీఎంట్రీ ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు. మేమిద్దరం గత కొన్నేళ్లుగా కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాం. నాకు శ్రీశాంత్ చాలా సాయం చేశాడు. ఇప్పుడు కూడా కలిసే పని చేస్తున్నాం. శ్రీశాంత్‌తో ప్రాక్టీస్ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. కేరళ జట్టుకు సలహాలు ఇస్తూ సహకరిస్తున్నాడు. అతను నెట్స్‌లో బౌలింగ్ అమోఘంగా వేస్తున్నాడు. ఇది వరకు శ్రీశాంత్ బౌలింగ్ ప్రాక్టీస్ వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఇక శ్రీశాంత్ తన ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపించాల్సి ఉంది’ అని కేరళ మాజీ కెప్టెన్ సచిన్ బేబీ తెలిపాడు. భారత్ తరఫున 27 టెస్టులు ఆడిన శ్రీశాంత్ 87 వికెట్లు పడగొట్టాడు. 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టి20ల్లో 7 వికెట్లు తీశాడు. 2007లో టి20 ప్రపంచ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ నెగ్గిన జట్లలో అతను సభ్యుడు కావడం విశేషం. 2013 ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతూ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో దోషిగా తేలడంతో బీసీసీఐ ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడకుండా అతనిపై జీవిత కాల నిషేధం విధించింది. శ్రీశాంత్ దీనిని సవాల్ చేస్తూ కోర్టులో పోరాడాడు. హైకోర్టు కూడా అతనిపై నిషేధాన్ని సమర్థించింది. అయితే సుప్రీం కోర్టులో మాత్రం ఈ కేరళ పేసర్‌కు ఊరట లభించింది. శ్రీశాంత్‌ను దోషిగానే గుర్తించిన సుప్రీం... జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్‌మన్ డీకే జైన్ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరుతో అతని శిక్షా కాలం పూర్తి కానుంది. (‘చాలాసార్లు చనిపోవాలనుకున్నా’) -
మళ్లీ జట్టులోకి క్రికెటర్ శ్రీశాంత్
తిరువనంతపురం : క్రికెటర్ శ్రీశాంత్(37)ను తిరిగి కేరళ రంజీ జట్టులోకి తీసుకోవాలని కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ) నిర్ణయించింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై శ్రీశాంత్‌పై విధించిన నిషేధం గడువు సెప్టెంబర్‌తో ముగియనుంది. అయితే అతను అన్ని ఫిట్నెస్ పరీక్షల్లో నెగ్గితేనే నిషేధం గడువు ముగిసిన తర్వాత తిరిగి జట్టులో అవకాశం లభించనుంది. ‘నాకు అవకాశం ఇచ్చినందుకు కేరళ క్రికెట్ అసోసియేషన్‌కి రుణపడి ఉంటాను. నా ఫిట్నెస్ను నిరూపించుకుని తిరిగి మైదానంలో అడుగుపెడతాను. ఇప్పటికైనా అన్ని వివాదాలకు పుల్స్టాప్పడుతుంది అనుకుంటున్నాను’ అని శ్రీశాంత్ అన్నాడు. శ్రీశాంత్ పునరాగమనంతో కేరళ రంజీ జట్టుకు మరింత బలం చేకూరుతుందని కేసీఏ కార్యదర్శి శ్రీత్ నాయర్ అన్నారు. (అవన్నీ తప్పుడు వార్తలు: ఆఫ్రిది) స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో 2013లో శ్రీశాంత్తోపాటూ రాజస్థాన్ రాయల్స్ జట్టులో అతని సహచరులు అజిత్ చంఢీలా, అంకిత్ చవాన్‌లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడ్డాడనే ఆరోపణలతో అతనిపై బీసీసీఐ జీవిత కాలం నిషేధం విధించింది. తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని తగ్గించాలని శ్రీశాంత్ సుదీర్ఘ పోరాటం చేశాడు. దీనిపై పలుమార్లు సుప్రీంకోర్టుకు వెళ్లి తనపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరాడు. దానిలో భాగంగానే శ్రీశాంత్‌కు శిక్ష తగ్గించే విషయంపై ఆలోచించాలని బీసీసీఐకి సూచించిన సుప్రీం కోర్టు ఆ అధికారాన్ని అంబుడ్స్‌మన్‌కు అప్పగించింది. (సచిన్ కెప్టెన్సీ వైఫల్యంపై మదన్‌లాల్ కామెంట్స్) సుప్రీంకోర్టు ఆదేశాలతో శ్రీశాంత్‌పై ఉన్న జీవిత కాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదిస్తూ బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్ నిర్ణయం తీసుకున్నారు. నిషేధం ఎదుర్కొంటున్న శ్రీశాంత్ ప్రవర్తన బాగుందని భావించిన అంబుడ్స్‌మన్ అతనిపై ఉన్న జీవిత కాల నిషేధాన్ని రద్దు చేశారు. ఈ క్రమంలోనే ఏడేళ్ల నిషేధం సరిపోతుందని స్పష్టం చేశారు. టీం ఇండియా తరఫున శ్రీశాంత్ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ-20 మ్యాచులు ఆడాడు. (‘2007లోనే సచిన్ ఆటను వదిలేద్దామనుకున్నాడు’) -
రాబిన్ ఊతప్పపై శ్రీశాంత్ ఆగ్రహం
హైదరాబాద్ : టీమిండియా బ్యాట్స్‌మన్ రాబిన్ ఊతప్పపై సహచర ఆటగాడు, కేరళ స్పీడస్టర్ శ్రీశాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఊతప్ప.. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ మిస్బావుల్ హక్ ఇచ్చిన క్యాచ్‌ను శ్రీశాంత్ పడతాడనుకోలేదని పేర్కొన్న విషయం తెలిసిందే. శ్రీశాంత్ క్యాచ్‌లు జారవిడుస్తాడనే పేరు కూడా ఉందని, అందుకే ఆ సమయంలో అతడు క్యాచ్ పట్టాలని దేవుడిని ప్రార్థించినట్లు ఆనాటి విషయాలను గుర్తుచేసుకున్నాడు. టీమిండియాకు రాసిపెట్టి ఉండటం వల్లే టీ20 ప్రపంచకప్-2007 గెలిచామనే భావన ఇప్పటికీ ఉందని అతడు పేర్కొన్నాడు. (‘ఆత్మహత్య చేసుకోవాలనిపించేది’) తాజాగా ఊతప్ప వ్యాఖ్యలను ఓ నెటిజన్ శ్రీశాంత్ ముందు తీసుకరాగా అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘ఊతప్ప తన కెరీర్లో ఇప్పటివరకు ఎన్ని క్యాచ్‌లు పట్టాడో నాకైతే తెలియదు. దేశవాళీ క్రికెట్లో గత సీజన్లో అతడు కేరళ తరుపున ఆడాడు. ఆ సమయంలో చాలా క్యాచ్‌లు నేలపాలు చేశాడనే అపవాదు ఉంది. త్వరలోనే నేను కేరళ తరుపున బరిలోకి దిగుతున్నా. ఈ సందర్భంగా అతడికి ఒకటి చెప్పాలనుకుంటున్నా దయచేసి నా బౌలింగ్‌లో క్యాచ్‌లు జారవిడచకు. గత సీజన్లో కేరళ జట్టులో అందరూ నీకన్నా జూనియర్స్ ఉండటంతో నిన్ను ఏం అనలేదు. కానీ నా బౌలింగ్‌లో క్యాచ్‌లు నేలపాలు చేస్తే ఏం చేస్తానో ఊతప్పకు బాగా తెలుసు’ అంటూ శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు. (భారత క్రికెటర్లతో టచ్‌లో ఉన్నా: శ్రీశాంత్) -
భారత క్రికెటర్లతో టచ్‌లో ఉన్నా: శ్రీశాంత్
న్యూఢిల్లీ: వివాదాస్పద పేసర్ శ్రీశాంత్ తన రీఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌తో అతనిపై ఉన్న ఏడేళ్ల నిషేధం తొలగిపోవడంతో పునరాగమనం కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలోనే పలువురు భారత క్రికెటర్లతో టచ్‌లో ఉన్నట్లు శ్రీశాంత్ తాజాగా వెల్లడించాడు. ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం విధించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ). రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై శ్రీశాంత్ నిషేధం విధించారు. అయితే దీనిపై కోర్టులకెళ్లి సుదీర్ఘ పోరాటం చేసి పలుమార్లు తన జీవిత కాల నిషేధంపై అనుకూలంగా తీర్పులు తెచ్చుకున్నా బీసీసీఐకి అవకాశం ఇవ్వలేదు. అలానే అతనిపై ఉన్న జీవితకాల నిషేధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. కాగా, గతేడాది శ్రీశాంత్‌పై విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్‌మన్ డీకే జైన్ ఆదేశాలిచ్చారు. దాంతో అతనిపై ఏడేళ్ల నిషేధ కాలం ఈ సెప్టెంబర్‌తో పూర్తి కానుంది. దీనిలో భాగంగా మాట్లాడిన శ్రీశాంత్.. ‘ పలువుర భారత క్రికెటర్లు నాతో టచ్‌లో ఉన్నారు. (ఆసీస్‌కు నంబర్‌వన్ ర్యాంక్ ఎలా ఇచ్చారు?) చాలా మంది క్రికెటర్లు నాతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. కానీ వీరూ(సెహ్వాగ్) భాయ్, లక్ష్మణ్ భాయ్ నాతో మాట్లాడుతూనే ఉన్నారు. ముగ్గురు నుంచి-నలుగురు ప్లేయర్లు నాతో మాట్లాడున్నారు. వీరిలో సచిన్ టెండూల్కర్, గౌతం గంభీర్ కూడా ఉన్నారు. ఇటీవలే గంభీర్‌ను కలిశాను. మొన్నా మధ్య హర్భజన్ సింగ్(భజ్జీ)ని ఎయిర్‌పోర్ట్‌లో కలిశాను. ఆ సమయంలో భజ్జీకి ఒక విషయం చెప్పా. నేను తిరిగి క్రికెట్ ఆడినప్పుడు భజ్జీ స్పోర్ట్స్ కంపెనీ తయారు చేసిన బ్యాట్‌ను వాడతానని చెప్పాను. ఇంకా నాలో ఆశ చావలేదు. మళ్లీ భారత్‌కు ఆడతాననే ఆశ ఉంది. నా తొలి టార్గెట్ కేరళ జట్టులో ఆడటం. ఏదొక రోజు మెన్ ఇన్ బ్లూలో నన్ను నేను చూసుకుంటా’ అని శ్రీశాంత్ తెలిపాడు.2013 ఐపీఎల్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్లపై బోర్డు క్రమశిక్షణ కమిటీ జీవిత కాలం నిషేధం విధించింది. అయితే, గతేడాది మార్చి 15న సుప్రీంకోర్టు దానిని పక్కన పెట్టింది. ఈ కేసు గత ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు వెళ్లింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన బెంచ్... డీకే జైన్‌ను బీసీసీఐ అంబుడ్స్‌మన్‌గా నియమించింది.(టీమిండియా ఫీల్డింగ్ మాతోనే పోయింది!) దీనిలో భాగంగానే శ్రీశాంత్‌పై నిషేధాన్ని జైన్ ఏడేళ్లకు పరిమితం చేశారు. శ్రీశాంత్ 36 ఏళ్ల వయసుకు రావడం, అది ఒక పేసర్ కెరీర్ ముగింపు దశ కావడమే తన నిర్ణయానికి కారణమని ఉత్తర్వుల్లో జైన్ పేర్కొన్నారు. స్పాట్ ఫిక్సింగ్‌ను ప్రోత్సహించిన రీత్యా శ్రీశాంత్‌పై విధించిన నిషేధాన్ని బోర్డు గతంలో కోర్టు ఎదుట గట్టిగా సమర్థించుకుంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన రెండో ఓవర్లో 14 పరుగులు ఇచ్చేలా శ్రీశాంత్ ఫిక్సింగ్‌కు ఒప్పుకొన్నాడని, రూ.10 లక్షలు కూడా తీసుకున్నాడని బోర్డు న్యాయవాది పరాగ్ త్రిపాఠి కోర్టుకు టెలిఫోన్ సంభాషణల రికార్డును అందజేశారు. అయితే, ఇందుకు బలమైన ఆధారాలేమీ లేవంటూ క్రికెటర్ తరఫు న్యాయవాది ఖండించారు. శ్రీశాంత్ భారత్‌కు 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2007 టి20, 2011 వన్డే ప్రపంచ కప్‌లు గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. -
స్పందిస్తే చాలా సిల్లీగా ఉంటుంది: డీకే
హైదరాబాద్: కాంట్రవర్సీస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన కేరళ స్పీడస్టర్ శ్రీశాంత్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. గతంలో(బీసీసీఐ నిషేధం విధించక ముందు) టీమిండియాలో తనకు చోటు దక్కకపోవడానికి దినేశ్ కార్తీక్ కారణమంటూ శ్రీశాంత్ సంచలన ఆరోపణలు చేశాడు. అయితే ఆసమయంలో కార్తీక్ టీమిండియా కెప్టెన్ కాదు, కనీసం అప్పటికీ జట్టులో రెగ్యులర్ ఆటగాడు కూడా కాదు. ఈ క్రమంలో శ్రీశాంత్‌ను ఎంపిక కాకుండా కార్తీక్ అడ్డుకున్నాడన్న శ్రీశాంత్ వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారి తీశాయి. అయితే తాజాగా శ్రీశాంత్ వ్యాఖ్యలపై దినేశ్ కార్తీక్ స్పందించాడు. ‘శ్రీశాంత్ నాపై చేసిన ఆరోపణల గురించి విన్నాను. అయితే ఈ ఆరోపణలపై స్పందించడం కూడా చాలా సిల్లీగా ఉంటుంది’అంటూ దినేశ్ కార్తీక్ సెటైరికల్‌గా సమాధానమిచ్చాడు. ఇక కొద్ది రోజుల క్రితం చెన్నై సూపర్‌కింగ్స్‌పై శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. రాజస్తాన్ రాయల్స్ మాజీ కోచ్ పాడీ ఆప్టన్ రాసుకున్న తన ఆత్మకథలో శ్రీశాంత్ గురించి ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌కు శ్రీశాంత్‌ను ఎంపిక చేయకపోవడంతో తనను అసభ్యంగా దూషించాడని ఆప్టన్ పేర్కొన్నాడు. అయితే దీనిపై స్పందించిన శ్రీశాంత్ తనకు చెన్నై సూపర్ కింగ్స్ అంటే ఎంత అసహ్యమో అందరికీ తెలుసని, అయితే దానికి కారణం ధోని కాదని తెలిపాడు. తనకు పసుపు రంగు నచ్చదని అందుకే సీఎస్కేతో పాటు ఆస్ట్రేలియా జట్టు అంటే ఇష్టముండదని తెలిపాడు. అందుకే సీఎస్కేపై తప్పక ఆడించాలని మాత్రమే కోరానని ఎలాంటి దూషణలకు దిగలేదని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా ఆప్టన్ వ్యాఖ్యలపై రాహుల్ ద్రవిడ్ తప్పక స్పందించాలని శ్రీశాంత్ కోరాడు. ఇక శ్రీశాంత్ కెరీర్ మొత్తం వివాదాలతోనే గడిచింది. దీంతో అతడు కింగ్ ఆఫ్ కాంట్రవర్సీస్గా గుర్తింపు పొందాడు. ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు అతడి జీవితాన్నే తలికిందులు చేశాయి. శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. అయితే సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసిన శ్రీశాంత్‌కు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. లైఫ్ బ్యాన్ కాకుండా నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించింది. దీంతో నిషేధ కాలం వచ్చే ఏడాది సెప్టెంబర్‌తో ముగుస్తోంది. ఈ క్రమంలో శ్రీశాంత్‌పై బీసీసీఐ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
హన్సిక సినిమాలో శ్రీశాంత్ విలన్
చెన్నై: ఇటీవల తన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించడంతో క్రికెటర్ శ్రీశాంత్ మరోసారి సినిమాల్లో బిజీ అయిపోయాడు. రెండు నెలల క్రితం బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్.. శ్రీశాంత్‌పై ఉన్న నిషేధాన్ని ఏడేళ్లకు కుదించిన నేపథ్యంలో వచ్చే ఏడాదితో అతనిపై ఉన్న నిషేధం గడువు ముగిసిపోనుంది. అయితే కొన్నాళ్లుగా వెండితెరపై దృష్టి సారించిన శ్రీశాంత్ కోలీవుడ్‌లో అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. హారర్, కామెడీతో రూపొందనున్న తమిళ సినిమాలో శ్రీశాంత్ నటించనున్నాడు. హరి- హరీశ్ ద్వయం దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ముద్దుగుమ్మ హన్సికా లీడ్ రోల్లో చేస్తుండగా, అదే సమయంలో శ్రీశాంత్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. వీరిద్దరి మధ్య ఒక ఫైట్ సీన్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. అన్ని ఎలిమెంట్లు గల కలిసిన ఈ మసాలా ఎంటర్టైన్మెంట్ను శ్రీవారి ఫిల్మ్స్ బ్యానర్లో పి రంగనాథన్ నిర్మించనున్నారు. -
‘వంద కోట్లు ఇచ్చినా ఆ పని చేయను’
న్యూఢిల్లీ: గత నెలలో భారత పేసర్ శ్రీశాంత్‌పై ఉన్న నిషేధాన్ని తగ్గిస్తూ బీసీసీఐ అంబుడ్స్‌మన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అతనిపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదిస్తూ అంబుడ్స్‌మన్ డీకే జైన్ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఇప్పటికే ఆరేళ్లుగా నిషేధం ఎదుర్కొంటున్న శ్రీశాంత్.. వచ్చే ఏడాది ఆగస్టు నెలతో నిషేధాన్ని పూర్తి చేసుకోనున్నాడు. అయితే తాజాగా శ్రీశాంత్ మీడియాతో మాట్లాడుతూ.. తనపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణల్ని మరోసారి ఖండించాడు. ఈ క్రమంలోనే ఉద్వేగానికి లోనయ్యాడు. ‘ నా పిల్లలు మీద, మా నాన్నపై ఒట్టేసి చెబుతున్నా. నేను ఎటువంటి ఫిక్సింగ్‌కు పాల్పడలేదు. నాకు ఎప్పుడూ ఆ ఆలోచన రాలేదు. రాబోదు. ఇప్పుడు మా నాన్న మంచాన పడ్డాడు. గత ఐదున్నరేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మా అమ్మ ఆరోగ్యం కూడా బాలేదు. వారిద్దరూ కనీసం నా మ్యాచ్‌ను చూసే స్థితిలో కూడా లేరు. నేను ఎప్పుడూ స్పాట్ ఫిక్సింగ్ అనేది చేయలేదు. రూ. 100 కోట్లు ఇచ్చినా ఆ పని చేయను’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మన దేశంలో చాలా లీగ్‌లు ఉన్నాయని, తన కుటుంబాన్ని చూసుకోవాలంటే క్రికెట్లో పునరాగమనం చేయాల్సి ఉందన్నాడు. -
శ్రీశాంత్ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం
కొచ్చి: భారత క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున కొచ్చిలోని శ్రీశాంత్ నివాసంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కలకలం రేగింది. తొలుత గ్రౌండ్ ఫ్లోర్ వ్యాపించిన మంటలు.. బెడ్ రూమ్ వరకూ వ్యాపించాయి. ఈ ఘటనలో బెడ్ రూమ్ పూర్తిగా దగ్థమైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనలో ఎవరకూ గాయపడలేదు. శ్రీశాంత్ భార్యా పిల్లలు సురక్షితంగా బయటకు వచ్చారు. స్థానికుల సాయంతో అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటీనా అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. శ్రీశాంత్ భార్యా పిల్లలు ఫస్ట్ ఫ్లోర్ చిక్కుకుపోవడంతో గ్లాస్‌ను బద్దలు కొట్టి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆ సమయంలో శ్రీశాంత్ ఇంట్లో లేడు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. కొన్ని రోజుల క్రితం శ్రీశాంత్‌పై ఉన్న జీవిత కాల నిషేధాన్ని బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే ఏడేళ్లకు కుదించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలుప ఇప్పటికే ఆరేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న శ్రీశాంత్ ఇంకా ఏడాది పాటు నిషేధం ఎదుర్కోనున్నాడు. ఈ క్రమంలోనే డీకే జైన్ ఎదుట హాజరైన శ్రీశాంత్ ఫిక్సింగ్ ఆరోపణలతో తన కెరీర్ నాశనమైందని మొరపెట్టుకున్నాడు. భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయడమే తన అంతిమ లక్ష్యమని, తన కెరీర్ ముగిసే సరికి కనీనం వంద వికెట్లు తీయాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. -
శ్రీశాంత్‌పై నిషేధం కుదింపు
న్యూఢిల్లీ: వివాదాస్పద పేసర్ శంతకుమరన్ శ్రీశాంత్‌కు ఊరట. ఈ కేరళ క్రికెటర్‌పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గతంలో విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్‌మన్ డీకే జైన్ ఆదేశాలిచ్చారు. 2013 ఐపీఎల్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్లపై బోర్డు క్రమశిక్షణ కమిటీ జీవిత కాలం నిషేధం విధించింది. అయితే, ఈ ఏడాది మార్చి 15న సుప్రీంకోర్టు దానిని పక్కన పెట్టింది. ఈ కేసు గత ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు వెళ్లింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన బెంచ్... మూడు నెలల్లో డీకే జైన్ సమీక్ష చేపడతారని పేర్కొంది. తాజాగా ఆగస్టు 7న జారీ చేసిన ఆదేశాల్లో జైన్... శ్రీశాంత్‌పై నిషేధాన్ని ఏడేళ్లకు పరిమితం చేశారు. వచ్చే ఏడాది ఆగస్టుతో ఆ వ్యవధి ముగియనుంది. శ్రీశాంత్ 36 ఏళ్ల వయసుకు రావడం, అది ఒక పేసర్ కెరీర్ ముగింపు దశ కావడమే తన నిర్ణయానికి కారణమని ఉత్తర్వుల్లో జైన్ పేర్కొన్నారు. స్పాట్ ఫిక్సింగ్‌ను ప్రోత్సహించిన రీత్యా శ్రీశాంత్‌పై విధించిన నిషేధాన్ని బోర్డు గతంలో కోర్టు ఎదుట గట్టిగా సమర్థించుకుంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన రెండో ఓవర్లో 14 పరుగులు ఇచ్చేలా శ్రీశాంత్ ఫిక్సింగ్‌కు ఒప్పుకొన్నాడని, రూ.10 లక్షలు కూడా తీసుకున్నాడని బోర్డు న్యాయవాది పరాగ్ త్రిపాఠి కోర్టుకు టెలిఫోన్ సంభాషణల రికార్డును అందజేశారు. అయితే, ఇందుకు బలమైన ఆధారాలేమీ లేవంటూ క్రికెటర్ తరఫు న్యాయవాది ఖండించారు. శ్రీశాంత్ భారత్‌కు 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2007 టి20, 2011 వన్డే ప్రపంచ కప్‌లు గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. -
శ్రీశాంత్‌కు భారీ ఊరట
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని తగ్గించాలని సుదీర్ఘ పోరాటం చేస్తున్న భారత పేసర్ శ్రీశాంత్‌కు భారీ ఊరట లభించింది. అతనిపై ఉన్న జీవిత కాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదిస్తూ బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్ నిర్ణయం తీసుకున్నారు. ఆరేళ్లుగా నిషేధం ఎదుర్కొంటున్న శ్రీశాంత్ ప్రవర్తన బాగుందని భావించిన అంబుడ్స్‌మన్ అతనిపై ఉన్న జీవిత కాల నిషేధాన్ని రద్దు చేశారు. ఈ క్రమంలోనే ఏడేళ్ల నిషేధం సరిపోతుందని స్పష్టం చేశారు. ఫలితంగా వచ్చే ఏడాది ఆగస్టు నెలకు శ్రీశాంత్‌పై ఉన్న నిషేధం తొలగిపోనుంది. ‘నిషేధ కాలంలో శ్రీశాంత్ ఎటువంటి క్రికెట్ పరమైన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దాంతో పాటు బీసీసీఐ యాక్టివిటీలకు కూడా దూరంగా ఉన్నాడు. దాంతో అతనిపై నిషేధాన్ని ఏడేళ్లకు పరిమితం చేశాం. ఇది 2013 సెప్టెంబర్ట్ 13వ తేదీ నుంచి వర్తిస్తుంది’ అని డీకే జైన్ తెలిపారు. ప్రస్తుతం 36వ ఒడిలో ఉన్న శ్రీశాంత్ తనపై అన్యాయంగా ఫిక్సింగ్ ఆరోపణలు మోపి ఇరికించారని పోరాడుతూనే ఉన్నాడు. దీనిపై పలుమార్లు సుప్రీంకోర్టుకు వెళ్లి తనపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరాడు. దానిలో భాగంగానే శ్రీశాంత్‌కు శిక్ష తగ్గించే విషయంపై ఆలోచించాలని బీసీసీఐకి సూచించిన సుప్రీం కోర్టు ఆ అధికారాన్ని అంబుడ్స్‌మన్‌కు అప్పగించింది. ఎట్టకేలకు తనపై ఉన్న నిషేధం తగ్గడంతో శ్రీశాంత్‌కు భారీ ఊరట లభించినట్లయ్యింది. 2013 ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
శ్రీశాంత్‌కు శిక్ష ఎంత?
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన పేసర్ శ్రీశాంత్‌కు శిక్ష తగ్గించే విషయంపై ఆలోచించాలని బీసీసీఐకి సూచించిన సుప్రీం కోర్టు ఆ అధికారాన్ని అంబుడ్స్‌మన్‌కు అప్పగించింది. మూడు నెలల్లోగా శ్రీశాంత్ శిక్ష విషయంలో బీసీసీఐ అంబుడ్స్‌మన్ జస్టిస్ డీకే జైన్ నిర్ణయం తీసుకుంటారని శుక్రవారం సుప్రీం కోర్టు వెల్లడించింది. 2013 ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవిత కాల నిషేధం విధించింది. దీనిపై అతను కోర్టుకెక్కగా... ఇటీవలే శిక్ష తగ్గించే విషయం ఆలోచించాలని బీసీసీఐకి సుప్రీం కోర్టు సూచించింది. -
శ్రీశాంత్‌కు ఊరట
న్యూఢిల్లీ: ఐపీఎల్–2013లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న భారత మాజీ పేసర్ శాంతకుమారన్ శ్రీశాంత్‌కు సుప్రీం కోర్టులో కొంత ఊరట లభించింది. తనపై బీసీసీఐ క్రమశిక్షణా కమిటీ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ అతను వేసిన పిటిష¯Œ పై సుప్రీం తీర్పునిచ్చింది. శ్రీశాంత్‌పై విధించిన జీవిత కాల నిషేధాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన ద్విసభ్య బెంచీ శుక్రవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోగా శ్రీశాంత్ శిక్షా కాలాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని కూడా బీసీసీఐకి నిర్దేశించింది. అయితే శిక్షా కాలం తగ్గించమని మాత్రమే ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం ఇతర అంశాల జోలికి వెళ్లలేదు. స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించి శ్రీశాంత్‌పై ఢిల్లీ హైకోర్టులో నమోదైన క్రిమినల్ అభియోగాల విచారణపై తమ తీర్పు ప్రభావం ఉండదని కూడా స్పష్టం చేసింది. అంటే అతడిని పూర్తిగా నిర్దోషిగా ప్రకటించలేదని అర్థమవుతోంది. అయితే తాజా తీర్పు పట్ల కేరళ క్రికెట్ సంఘం మాజీ అధ్యక్షుడు టీసీ మాథ్యూ సంతోషం వ్యక్తం చేశారు. నిషేధం కారణంగా శ్రీశాంత్ ఆరేళ్లు కోల్పోయాడని, దానిని తొలగిస్తే అతను ఇప్పటికి ప్పుడు క్రికెట్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నా... క్రికెట్‌కు సంబంధించి ఏదో ఒక రంగంలో మళ్లీ కెరీర్‌ను వెతుక్కోగలడని ఆయన అన్నారు. పరిశీలిస్తాం: సీఓఏ శ్రీశాంత్ నిషేధం విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పుపై తాము వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకుంటామని క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ అన్నారు. త్వరలో జరిగే సీఓఏ సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామని ఆయన వెల్లడించారు. క్రికెట్‌నే జీవితంగా భావించిన నేను ఇన్నేళ్లుగా ఆటకు దూరమయ్యాను. సుప్రీం తీర్పును గౌరవించి బీసీసీఐ మళ్లీ ఆడే అవకాశం నాకు ఇస్తుందని ఆశిస్తున్నా. మైదానంలో నీకు అనుమతి లేదంటూ ఎవరైనా అడ్డుకోకుండా ఇప్పటికైనా నేను ప్రాక్టీస్ చేయగలిగితే చాలు. కష్టకాలంలో హర్భజన్, సెహ్వాగ్, రైనా తదితరులు కూడా నాకు అండగానిలిచారు. నా జీవితంలో ఎంతో కొంత మిగిలి ఉన్న ఆటను ఆడాలనుకుంటున్నా. అయినా 42 ఏళ్ల వయసులో లియాండర్ పేస్ గ్రాండ్‌స్లామ్ సాధించగా లేనిది నేను క్రికెట్ ఆడలేనా. – శ్రీశాంత్ -
క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉంది: శ్రీశాంత్
న్యూఢిల్లీ : ‘42 ఏళ్ల వయసులో లియాండ్ పేస్ గ్రాండ్ స్లామ్ గెలిచాడు. 36 ఏళ్ల వయసులో కనీసం కొంతవరకైనా మంచి క్రికెట్ ఆడలేనా’అంటూ క్రికెటర్ శ్రీశాంత్ ప్రశ్నించాడు. అతడిపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తి వేయాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్(బీసీసీఐ)ను సుప్రీం కోర్టు ఆదేశించడంతో శ్రీశాంత్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అతడు.. క్రికెట్ ఆడే సత్తా తనలో ఇంకా ఉందన్నాడు. వయసు అసలు సమస్యే కాదన్న శ్రీశాంత్.. ఫిట్‌గా ఉన్నంత కాలం క్రికెట్ ఆడొచ్చన్నాడు. ఈ ఆరు సంవత్సరాలు తన జీవితంలో చీకటి రోజులుగా మిగిలిపోతాయన్నాడు. తాను నిర్దోషినని తెలిసి కూడా బీసీసీఐ నిషేధం విధించిందన్నాడు. ఇప్పటికైనా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీసీసీఐ గౌరవిస్తుందని భావిస్తున్నానని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. (శ్రీశాంత్‌కు భారీ ఊరట) వాళ్లు టచ్‌లో ఉన్నారు.. తనపై నిషేధం విధించడంతో కనీసం క్లబ్ క్రికెట్ కూడా ఆడలేకపోయానని శ్రీశాంత్ వాపోయాడు. కౌంటీ క్రికెట్ ఆడటానికి కూడా బీసీసీఐ అనుమతి నిరాకరించిందని గుర్తుచేశాడు. క్రికెట్ ఆడకున్నా తన సహచర క్రికెటర్లతో సంబంధాలు తెగిపోలేదని వివరించాడు. హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, రాబిన్ ఊతప్ప, రైనాలతో టచ్‌లో ఉన్నట్లు తెలిపాడు. ఈ గడ్డుకాలంలో తనకు తోడుగా నిలిచిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, లాయర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక టీమిండియా గెలిచిన 2007, 2011 ప్రపంచకప్‌లలో శ్రీశాంత్ సభ్యుడన్న విషయం తెలిసిందే. టీమిండియా తరుపున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లకు శ్రీశాంత్ ప్రాతినిథ్యం వహించాడు. (పోలీస్ టార్చర్ భరించలేకే ఒప్పుకున్నా: శ్రీశాంత్) అసలేం జరిగిందంటే.. 2013లో జరిగిన ఐపీఎల్–6 సీజన్లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల కేరళ హైకోర్టును శ్రీశాంత్ ఆశ్రయించాడు. 2017 ఆగస్టులో శ్రీశాంత్‌పై నిషేధాన్ని కేరళ సింగిల్ బెంచ్ హైకోర్టు ఎత్తివేయగా, ఆపై బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై 2017 అక్టోబర్‌లో శ్రీశాంత్‌పై నిషేధాన్ని కొనసాగించేందుకు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేసిన శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. -
శ్రీశాంత్‌కు భారీ ఊరట
న్యూఢిల్లీ: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ గత కొన్నేళ్లుగా పోరాడుతున్న క్రికెటర్ శ్రీశాంత్‌కు భారీ ఊరట లభించింది. శ్రీశాంత్‌పై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ శ్రీశాంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఆశోక భూషణ్-జస్టిస్ కేఎమ్ జోసెఫ్‌లతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం శ్రీశాంత్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా బీసీసీఐ క్రమశిక్షణా కమిటీ విధానాన్ని సుప్రీం తప్పుబట్టింది. శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం నిర్ణయాన్ని మూడు నెలల్లో పునః సమీక్షించుకోవాలని పేర్కొంది. ఈ రోజు విచారణ సందర్భంగా శ్రీశాంత్‌పై నిషేధం అనేది చట్ట పరంగానే జరిగిందంటూ బీసీసీఐ వాదించింది. అయితే శ్రీశాంత్ తరఫు న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ మాత్రం తన వాదనను బలంగా వినిపించారు. కేవలం మ్యాచ్ ఫిక్సర్లు శ్రీశాంత్‌ను కలిసిన విషయాన్ని బోర్డుకు చెప్పని కారణంగా అతనిపై జీవిత కాల నిషేధం విధించడం తగదంటూ వాదించారు.ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం సరైనది కాదని, దాన్ని పునరాలోచించుకోవాలంటూ బీసీసీఐకి స్పష్టం చేసింది. 2013లో జరిగిన ఐపీఎల్–6 సీజన్లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల కేరళ హైకోర్టును శ్రీశాంత్ ఆశ్రయించాడు. 2017 ఆగస్టులో శ్రీశాంత్‌పై నిషేధాన్ని కేరళ సింగిల్ బెంచ్ హైకోర్టు ఎత్తివేయగా, ఆపై బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై 2017 అక్టోబర్‌లో శ్రీశాంత్‌పై నిషేధాన్ని కొనసాగించేందుకు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేసిన శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. -
ఐపీఎల్ వచ్చేసింది
వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్ స్టంప్స్‌ను గాల్లో గిరాటేస్తే గానీ తాను వరల్డ్ బెస్ట్ బౌలర్‌ను కాలేనంటున్నాడు బుమ్రా... కెప్టెన్‌నే స్లెడ్జ్ చేస్తావా, ఎలాగైతేనేం అదీ నేర్చుకున్నావు అంటూ కోహ్లి జవాబు... మీ జట్టుపైనే విరుచుకు పడతానంటూ గురువుకే సవాల్విసురుతున్న పంత్... అప్పట్లో నేనూ నీలాగే ఉండేవాడిని, చూసుకుందాం రమ్మంటూ ధోని పిలుపు... ప్రకటనలు, థీమ్ సాంగ్‌లు, ప్రమోషన్లు... ఒకవైపు భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ నడుస్తుండగానే మరో వైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందడి మొదలైంది. రేపు ఆఖరి మ్యాచ్ ముగిస్తే చాలు... టీమిండియా సభ్యులు తమ సహచరులపైనే కత్తులు దూసేందుకు ప్రతీ ఏడాదిలాగే సిద్ధమైపోతారు. జయహో అంటూ భారత్ విశ్వ సమరానికి వెళ్లే ముందే ఈనెల 23 నుంచి వేసవి వినోదం అందించేందుకు మరోసారి క్రికెట్ అభిమానుల పండగ ఐపీఎల్ వచ్చేసింది. అన్ని జట్లు అందుబాటులో ఉన్న క్రికెటర్లతో ఇప్పటికే జోరుగా సన్నాహాలు సాగిస్తుండగా, స్టార్ ఆటగాళ్లు కూడా వారితో చేరితే అందరి కళ్లూ లీగ్ వైపే నిలుస్తాయి. మరో 11 రోజుల్లో ‘ఆట తప్ప మాటలొద్దు’ అంటూ లీగ్ సంబరాలు షురూ కానున్న నేపథ్యంలో గత 11 ఐపీఎల్ టోర్నీల ఫలితాల విశేషాలు.... బిగ్ బ్యాంగ్... ఏప్రిల్ 18, 2008... ఐపీఎల్ చరిత్రలో మరచిపోలేని తేదీ. ఒక కొత్త టోర్నీకి ఎలాంటి ఆరంభం లభిస్తే అది సూపర్ డూపర్ హిట్ అవుతుందో ఆ రోజు అలాంటి మ్యాచ్‌తోనే లీగ్ మొదలైంది. బెంగళూరుతో మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ 73 బంతుల్లోనే 10 ఫోర్లు, 13 సిక్సర్లతో అజేయంగా 158 పరుగులు చేసి ప్రేక్షకులకు మజా అందించాడు. ఈ ఇన్నింగ్స్‌తో టి20 రుచిమరిగిన అభిమానులను ఇప్పటికీ ఐపీఎల్ మత్తులోనే ముంచెత్తుతోంది. మరచిపోలేని చెంపదెబ్బ! తొలి ఐపీఎల్లో ఆటతో పాటు అత్యంత వివాదంగా నిలిచిన అంశం శ్రీశాంత్‌ను హర్భజన్ సింగ్ చెంపదెబ్బ కొట్టడం... అతను చిన్న పిల్లాడిలా భోరున ఏడ్వడం! లీగ్‌లో పంజాబ్, ముంబై మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటగాళ్లు ఒకరికి మరొకరు షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో శ్రీశాంత్ నుంచి ఎలాంటి కవ్వింపు లేకుండా భజ్జీ కొట్టాడని విచారణలో రిఫరీ నిర్ధారించారు. దాంతో మిగిలిన 11 లీగ్ మ్యాచ్‌లు ఆడకుండా భజ్జీపై నిషేధం విధించారు. ఘట న జరిగిన మ్యాచ్ ఫీజు లో కూడా 100 శాతం కోత విధించారు. కేవలం తొలి రెండు మ్యాచ్‌లకే ఫీజు అందుకున్న భజ్జీఈ ఘటనతో భారీగా నష్టపోయాడు కూడా. ఫైనల్ ఫలితం... సెమీస్‌లో పంజాబ్‌ను ఓడించి చెన్నై, ఢిల్లీని ఓడించి రాజస్తాన్ ఫైనల్ చేరాయి. ముందుగా చెన్నై 5 వికెట్లకు 163 పరుగులు చేయగా, రాజస్తా న్ 7 వికెట్లకు 164 పరుగులు చేసి గెలిచింది. చివరి ఓవర్లో విజయానికి 8 పరుగులు చేయాల్సి ఉండగా ఆఖరి బంతికి రాయల్స్‌కు గెలుపు దక్కింది. బ్యాటింగ్‌లో 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు తీసిన యూసుఫ్ పఠాన్ ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్’గా నిలిచాడు. చార్జర్స్ అట్టడుగున... టోర్నీలో హైదరాబాద్ జట్టు దక్కన్ చార్జర్స్ ఘోరంగా విఫలమైంది. ఆడిన 14 లీగ్ మ్యాచ్‌లలో కేవలం 2 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చిట్ట చివరన నిలిచింది. జట్టు తరఫున గిల్‌క్రిస్ట్ (436), రోహిత్ శర్మ (404) పరుగుల పరంగా టాపర్లుగా నిలవగా... ఆర్పీ సింగ్ 15, ప్రజ్ఞాన్ ఓజా 11 వికెట్లు తీశారు. రాజస్తాన్ రాయల్స్ రాజసం 2008 నుంచి 2018 వరకు 11 ఐపీఎల్ టోర్నీలు జరిగాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ చెరో 3 సార్లు టైటిల్ సొంతం చేసుకొని తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండు సార్లు విజేతగా నిలవగా... రెండు వేర్వేరు పేర్లతో హైదరాబాద్ జట్లు దక్కన్ చార్జర్స్, సన్‌రైజర్స్ జట్లు ఒక్కోసారి టోర్నీని గెలుచుకున్నాయి. అయితే అనూహ్యంగా, అంచనాలు లేకుండా, స్టార్ ఆటగాళ్ల బలగం లేకుండా రాజస్తాన్ 2008 టైటిల్ సాధించడం విశేషం. పొట్టి క్రికెట్‌కు కొత్త ఊపు తెచ్చిన టోర్నమెంట్ తొలి టైటిల్‌ని సొంతం చేసుకున్న టీమ్‌గా షేన్ వార్న్ నాయకత్వంలోని రాయల్స్ ఘనత వహించింది. ఈ టోర్నీ విశేషాలను గుర్తు చేసుకుంటే... టీమ్ గుర్తుందా! రాజస్తాన్ టైటిల్ గెలిచిన జట్టు సభ్యులలో 19 మంది లీగ్‌లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడారు. వీరిలో అంతర్జాతీయ క్రికెటర్లు షేన్ వార్న్, గ్రేమ్ స్మిత్, షేన్ వాట్సన్, కమ్రాన్ అక్మల్, సొహైల్ తన్వీర్, డారెన్ లీమన్, మస్కరెన్హాస్, యూనిస్ ఖాన్‌లను వదిలిస్తే... యూసుఫ్ పఠాన్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ కైఫ్, మునాఫ్ పటేల్ భారత్ తరఫున తమ ముద్ర చూపించిన ఆటగాళ్లు. పంకజ్ సింగ్ 2 టెస్టులు, 1 వన్డే ఆడగా... నీరజ్ పటేల్, స్వప్నిల్ అస్నోడ్కర్, దినేశ్ సాలుంఖే, మహేశ్ రావత్, తరువర్ కోహ్లి, సిద్ధార్థ్ త్రివేది ఎప్పుడూ జాతీయ జట్టులోకి ఎంపిక కాలేకపోయారు. శతకవీరులు లీగ్‌లో మొత్తం ఆరు సెంచరీలు నమోదైతే నాలుగు ఆస్ట్రేలియన్లే చేశారు. మెకల్లమ్, సైమండ్స్, హస్సీ, షాన్ మార్‡్ష, గిల్‌క్రిస్ట్‌లతో పాటు సనత్ జయసూర్య సెంచరీ సాధించాడు. టోర్నీలో జయసూర్య మొత్తం 31 సిక్సర్లతో టాపర్‌గా నిలవడం విశేషం. పాకిస్తాన్ ఒకే ఒక్కసారి... తొలి ఐపీఎల్లో పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు. అయితే అదే ఏడాది 9/11 ముంబై దాడి తర్వాత వారు లీగ్‌లో పాల్గొనకుండా నిషేధం విధించారు. దాంతో 2008లో ఆడిన షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్, మొహమ్మద్ ఆసిఫ్, సల్మాన్ బట్, ఉమర్ గుల్, మొహమ్మద్ హఫీజ్, షోయబ్ అక్తర్, కమ్రాన్ అక్మల్, సొహైల్ తన్వీర్, యూనిస్ ఖాన్, మిస్బావుల్ హక్ మళ్లీ ఐపీఎల్లో కనిపించలేదు. -
నా భార్యను తిట్టినందుకే.. : శ్రీశాంత్
ముంబై : హిందీ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్-12లో పాల్గొని రన్నరప్‌గా నిలిచిన నిషేదిత క్రికెటర్ శ్రీశాంత్.. షో ఆసాంతం వివాదాలతో సావసం చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. అయితే హౌస్‌లో తనకు అండగా ఉంటూ.. వివాదాల్లో మద్దతుగా నిలిచిన తోటి కంటెస్టెంట్, నటి దీపికా కాకర్‌ను అతను చెల్లిగా ట్రీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ఈ రియాల్టీ షోలో సొంత అన్న-చెల్లెల్లా వ్యవహరించారు. ఒకరిపై ఒకరు ఈగ వాలకుండా ప్రేమ కనబర్చుకున్నారు. అయితే వీరి బంధం షో అనంతరం కూడా ఇలానే కొనసాగుతుందని ఇద్దరి అభిమానులు భావించారు. కానీ ఎక్కడ చెడిందో ఏమో కానీ.. అనూహ్యంగా వీరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీపికా కాకర్ ఇన్‌స్టాగ్రామ్‌ను శ్రీశాంత్ అన్ ఫాలో చేయడంతో ఈ విషయం స్పష్టమైంది. దీనిపై శ్రీశాంత్ వివరణ కూడా ఇచ్చాడు. ‘అవును.. నేను దీపికాను అన్‌ఫాలో చేశాను. ఎందుకంటే ఆమె నాభార్యను అన్‌ఫాలో చేసింది. నా భార్యను గౌరవించలేనివారు.. నన్ను కూడా గౌరవించలేరు. నా భార్యే నా శక్తి. నా బలం. దీపికా అభిమానులు నా భార్య, పిల్లలను అభ్యంతకరమైన భాషతో దూషిస్తున్నారు. అలా చేయవద్దని ఆమెకు నా భార్య చెప్పింది. అయినా ఈ ట్రోల్స్ ఆగలేదు. ఆమె కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆమెపై నా అభిమానులు ట్రోల్ చేసినప్పుడు నేను అడ్డుకున్నాను. అయితే ఈ వ్యవహారంపై నేను ఆమెతో చర్చించలేదు.. చర్చించాలనుకోవడం లేదు. ఎందుకంటే ఆమె నా చెల్లిలాంటిది. నేను ఆ బంధాన్ని గౌరవిస్తాను. ప్రజలకు వాస్తవం తెలియడం కోసమే నేను ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను.’ అని చెప్పుకొచ్చాడు. ఇక శ్రీశాంత్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగా అతని భార్య భువనేశ్వరి ప్రతి విషయంలో మద్దతుగా నిలిచింది. ప్రతి వివాదాన్ని సోషల్ మీడియా వేదికగా వివరిస్తూ క్యాంపెయిన్ నిర్వహించింది. ముఖ్యంగా శ్రీశాంత్ రన్నరప్‌గా నిలవడంతో కీలక పాత్ర పోషించింది. -
పోలీసుల చిత్రహింసలు తప్పించుకునేందుకే...
న్యూఢిల్లీ: దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసుల చిత్రహింసల నుంచి తప్పించుకునేందుకే స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఒప్పుకున్నానని... తాను మాత్రం ఏ తప్పూ చేయలేదని భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సుప్రీం కోర్టుకు తెలిపాడు. 2013 ఐపీఎల్లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో అతనిపై క్రికెట్ బోర్డు జీవితకాల నిషేధం విధించింది. దీనిపై కేరళకు చెందిన ఈ మాజీ పేసర్ న్యాయపోరాటం చేస్తున్నాడు. బుధవారం జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్‌లతో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ కేసును విచారించింది. పోలీస్ టార్చర్ నుంచి తప్పించుకోవడానికే శ్రీశాంత్ నిందను మోశాడని అతని లాయర్ కోర్టుకు వివరించారు. శ్రీశాంత్‌ను బుకీలు సంప్రదించిన మాట నిజమేనని అయితే తను మాత్రం బుకీల బుట్టలో పడలేదని దీనికి సంబంధించి మలయాళంలో బుకీ–శ్రీశాంత్‌ల మధ్య జరిగిన సంభాషణను లాయర్ కోర్టుకు అందజేశాడు. మైదానంలో టవల్‌తో తుడుచుకోవడం, ఆడించడమనేది సహజమని, ఇలా అందరు క్రికెటర్లు చేస్తారని దీన్ని ఫిక్సింగ్‌కు సంజ్ఞగా భావించడం తగదని శ్రీశాంత్ తరఫు న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ వాదించారు. దీనిపై న్యాయమూర్తులు స్పందిస్తూ... బుకీలు ఫిక్సింగ్‌కు పాల్పడమని సంప్రదించినపుడు క్రికెటర్ ఆ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఎందుకు తెలపలేదని లాయర్ ఖుర్షీద్‌ను ప్రశ్నించారు. దీన్నిబట్టి శ్రీశాంత్ ప్రవర్తన ఎలాంటిదనే విషయం తేటతెల్లమవుతోందని బెంచ్ స్పష్టం చేసింది. -
పోలీస్ టార్చర్ భరించలేకే ఒప్పుకున్నా: శ్రీశాంత్
న్యూఢిల్లీ: దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసుల టార్చర్ భరించలేకే స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఒప్పుకున్నానని... తాను మాత్రం ఏ తప్పు చేయలేదని మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సుప్రీం కోర్టుకు తెలిపారు. 2013 ఐపీఎల్లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో అతనిపై క్రికెట్ బోర్డు జీవితకాల నిషేధం విధించింది. దీనిపై మాజీ పేసర్ న్యాయపోరాటం చేస్తున్నాడు. బుధవారం జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ కె.ఎమ్.జోసెఫ్‌లతో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ కేసును విచారించింది. పోలీస్ టార్చర్ నుంచి తప్పించుకోవడానికే శ్రీశాంత్ నిందను మోసాడాని అతని లాయర్ కోర్టుకు వివరించారు. శ్రీశాంత్‌ను బుకీలు సంప్రదించినమాట నిజమేనని అయితే తను మాత్రం బుకీల బుట్టలో పడలేదని దీనికి సంబంధించిన మలయాళంలో బుకీ–శ్రీశాంత్‌ల మధ్య జరిగిన సంభాషణను లాయర్ కోర్టుకు అందజేశాడు. మైదానంలో టవల్‌తో తుడుచుకోవడం, ఆడించడమనేది సహజమని, ఇలా అందరు క్రికెటర్లు చేస్తారని దీన్ని ఫిక్సింగ్‌కు సంజ్ఞగా భావించడం తగదని శ్రీశాంత్ తరఫు న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ వాదించారు. దీనిపై న్యాయమూర్తులు స్పందిస్తూ... బుకీలు ఫిక్సింగ్‌కు పాల్పడమని సంప్రదించినపుడు క్రికెటర్ ఆ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఎందుకు తెలపలేదని లాయర్ ఖుర్షీద్‌ను ప్రశ్నించారు. దీన్నిబట్టి శ్రీశాంత్ క్యారెక్టర్ ఎలాంటిదనే విషయం తేటతెల్లమవుతోందని బెంచ్ స్పష్టం చేసింది. -
పాండ్యా, రాహుల్‌ల వివాదంలో అతని బాధ్యత లేదా?
ముంబై : మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలతో సస్పెన్షన్‌కు గురైన టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లను వివాదస్పద క్రికెటర్, బిగబాస్ సీజన్ 12 రన్నరప్ శ్రీశాంత్ మరోసారి వెనకేసుకొచ్చాడు. పెద్ద దుమారం రేపిన ఈ వివాదంలో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్‌కు బాధ్యత లేదా? అని ఈ క్రికెటర్ కమ్ యాక్టర్ ప్రశ్నించారు. ఈ వివాదానికి మూల కారణం కరణేనని అభిప్రాయపడ్డాడు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘క్రికెటర్లు సోయి మరిచి తప్పుగా మాట్లాడితే.. షో హోస్ట్ కరణ్‌కు ఏమైంది? వారు తప్పు మాట్లాడుతుంటే టీవీ హోస్ట్‌గా అడ్డుకోవాల్సిన బాధ్యత అతనిపై లేదా? అతను కచ్చితంగా అడ్డుకోవాల్సింది. ఈ వివాదానికి మూల కారణం కరణ్ జోహరే. అతను అడిగిన పిచ్చి ప్రశ్నల వల్లే క్రికెటర్లు నోరు జారారు. ఈ వివాదంలో కరణ్ కూడా భాగస్వామియే.’ అని శ్రీశాంత్ మండిపడ్డాడు. ఈ యువ క్రికెటర్లపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్న సందర్భంలో కూడా శ్రీశాంత్ మద్దతు పలికాడు. వారు మాట్లాడింది తప్పేనని, కానీ దాన్ని ఇంత వివాదం చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఇంత కంటే పెద్ద తప్పులు చేసిన వారు స్వేచ్ఛగా క్రికెట్ ఆడుతున్నారని, వారిపై ఎలాంటి చర్యలు లేవని చెప్పుకొచ్చాడు. ఇలాంటి తప్పులు జరగడం సహజమని, కేవలం క్రికెట్లోనే కాకుండా అన్ని రంగాల్లో ఇలాంటివి చోటుచేసుకుంటాయని ఈ యువ ఆటగాళ్లను శ్రీశాంత్ వెనకేసుకొచ్చిన విషయం తెలిసిందే. నిషేధం కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమైన పాండ్యా, రాహుల్‌లు మళ్లీ ఎప్పుడు క్రికెట్లో అడుగు పెడతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. బీసీసీఐ నియమావళి ప్రకారం ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే తుది అధికారం బోర్డు నియమించిన అంబుడ్స్‌మన్‌కే ఉంది. ఇద్దరు క్రికెటర్లపై విచారణ అనంతరం బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి కూడా తన నివేదికను అంబుడ్స్‌మన్‌కే ఇవ్వాలి. అయితే ఇప్పటికిప్పుడు అంబుడ్స్‌మన్‌ను నియమించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అంబుడ్స్‌మన్‌ను నియమించే అధికారం కేవలం బోర్డుకే ఉందని...అది ఎన్నికలు నిర్వహించి కార్యవర్గం ఏర్పడిన తర్వాత మాత్రమే సాధ్యమని తెలిపింది. దీంతో పాండ్యా, రాహుల్‌ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చదవండి: బయటకు వచ్చిన పాండ్యా ! -
పాండ్యా, రాహుల్‌లకు శ్రీశాంత్ మద్దతు
ముంబై : మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కు గురైన టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లకు నిషేధిత క్రికెటర్ శ్రీశాంత్ మద్దతు తెలిపారు. కాఫీ విత్ కరణ్ షోలో సోయితప్పి మాట్లాడిన ఈ యువఆటగాళ్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతుండగా.. శ్రీశాంత్ మీడియా ముందుకు వచ్చి మద్దతు పలకడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా పాండ్యా, రాహుల్‌లు మ్యాచ్ విన్నర్లని, ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారతజట్టుకు వారి సేవలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డాడు. వారు దూరమైతే జట్టుకు తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పుకొచ్చాడు. వారు మాట్లాడింది తప్పే అయినప్పటికి, వారికంటే పెద్ద తప్పులు చేసిన వారు చాలా మంది ఉన్నారని తెలిపాడు. వారంతా యధేచ్చగా వారి పనులు వారు చేసుకుంటున్నారని పేర్కొన్నాడు. ఇక త్వరలోనే బీసీసీఐ తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తుందని, తన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు మార్గం సుగమం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్‌కు దూరమైన శ్రీశాంత్.. హిందీ బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొని రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. -
వెక్కివెక్కి ఏడ్చిన శ్రీశాంత్!
ముంబై : హిందీ బిగ్‌బాస్ సీజన్-12లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌కు మంచి ఫ్యాన్‌ఫాలోయింగ్ లభిస్తోంది. అసలే కోపిష్టి అయిన శ్రీశాంత్‌కు ఓపిక కూడా కొంచెం తక్కువ.. ఈ తరహా ప్రవర్తనతో హౌస్‌లో అతను చేసే ప్రతిపని వివాదాస్పదం అవుతూ వస్తోంది. ఈ యాటిట్యూడ్‌తో అతనికి అభిమానులు బాగా కనెక్ట్ అయ్యారు. శ్రీశాంత్ ప్రవర్తనతో ఈ రియాల్టీషో పై కూడా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సల్మాన్‌ఖాన్.. వీకెండ్ ఎపిసోడ్లో భాగంగా విడుదల చేసిన ప్రోమోలో శ్రీశాంత్ కన్నీటి పర్యంతమైనట్లు తెలుస్తోంది. లగ్జరీ బడ్డెట్ టాస్క్‌లో భాగంగా హౌస్మెట్స్ శ్రీశాంత్ పట్ల వ్యవహరించిన తీరుపై సల్మాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. శ్రీశాంత్ క్రికెటర్‌గా భారత జట్టుకు ఎంతో చేశాడని, అతని గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారని రోహిత్, సురభిలపై మండిపడ్డాడు. అతనికి బిగ్‌బాస్‌లో ఎదురైన అనుభవాలను గుర్తుచేస్తూ.. అతనితో హౌస్మేట్స్ వ్యవహరించిన తీరును చూపిస్తూ.. ఓ వ్యక్తిగా వాటిని తట్టుకోవడం చాలా కష్టామని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలతో శ్రీశాంత్ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అనేక మంది అభిమానులు శ్రీశాంత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. చదవండి: బిగ్‌బాస్‌లో గలాట : ఆసుపత్రిపాలైన శ్రీశాంత్! -
బిగ్‌బాస్‌లో గలాట : ఆసుపత్రిపాలైన శ్రీశాంత్!
ముంబై : వివాదాస్పద క్రికెటర్ శ్రీశాంత్.. అనూహ్యంగా హిందీ బిగ్‌బాస్ సీజన్-12లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. అసలే కోపిష్టి అయిన శ్రీశాంత్‌కు ఓపిక కూడా కొంచెం తక్కువ.. ఈ తరహా ప్రవర్తనతో హౌస్‌లో అతను చేసే ప్రతిపని వివాదాస్పదం అవుతూ వస్తోంది. ఈ యాటిట్యూడ్‌తో అతనికి అభిమానులు బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఇటీవల హౌస్‌లో చోటుచేసుకున్న పరిణామాలతో శ్రీశాంత్ ఆసుపత్రిపాలైనట్లు తెలుస్తోంది. ఈ విషయం అతని సతీమణి భువనేశ్వరే సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇటీవల తోటీ హౌస్ మేట్ అయిన సురభి రానాతో అతను తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఓ దశలో ఈ ఇద్దరు వ్యక్తిగతంగా దూషించుకున్నారు. ఈ విషయంలో ఇద్దరిపై హోస్ట్ సల్మాన్ ఖాన్ గుస్సా అయ్యాడు. వాళ్లు వాడిన పదజాలంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. శ్రీశాంత్ ఛీటర్ అని, మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడ్డాడని సురభి తిట్టగా.. ఆమో ఓ వ్యభిచారని శ్రీశాంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంలో తన తప్పును తెలుసుకున్న శ్రీశాంత్ ఆమెకు క్షమాపణలు కూడా తెలియజేశాడు. అనంతరం మహిళలను అగౌరవ పరిచేలా మాట్లాడానా? అని కుంగిపోయిన శ్రీశాంత్.. వాష్‌రూంలోకి వెళ్లి డోర్ పెట్టుకున్నాడు. ఇది గమనించిన తోటి హౌస్మేట్స్.. అతన్ని బయటకు రమ్మని కోరగా అతను నిరాకరించాడు. అనంతరం తన తలను గోడకేసి బాదుకోవడంతో గాయపడ్డాడు. వెంటనే నిర్వాహకులు అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారని, శ్రీశాంత్ తిరిగి హౌస్‌లోకి వచ్చారని అతని భార్య ట్విటర్లో స్పష్టం చేశారు. ఇక శ్రీశాంత్‌కు భారీ స్థాయిలో ఫ్యాన్పాలోయింగ్ పెరిగింది. సురభితో గొడవ నేపథ్యంలో అతనికి మద్దతుగా #WeStandBySreesanth అనే హ్యాష్ టాగ్‌తో మద్దతుగా నిలిచారు. ఒక అభిమాని అయితే ఏకంగా హౌస్ నుంచి బయటకు రాగానే సురభి గ్యాంగ్ రేప్‌కు గురవుతుందని హెచ్చరిస్తూ ట్వీట్ చేశాడు. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో సదరు అభిమాని ఆ ట్వీట్ తొలిగించి క్షమాపణలు కోరాడు. -
న్యాయం చేయండి: శ్రీశాంత్ భార్య
న్యూఢిల్లీ: తన భర్తకు న్యాయం చేయాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి లేఖ రాశారు టీమిండియా వెటరన్ పేసర్ శ్రీశాంత్ భార్య భువనేశ్వరి. 2013 ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ శ్రీశాంత్‌పై బోర్డు జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే తన భర్తపై వచ్చినవన్నీ నిరాధార ఆరోపణలేనని, అతడు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని భువనేశ్వరి బీసీసీఐకి రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణల కారణంగా తన భర్త జీవితం నాశనమైందని ఆమె అందులో పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. అన్యాయమనేది ఎక్కడైనా ముప్పును తెచ్చిపెడుతుందని లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిసార్లు తప్పుచేయని తన భర్తని చూస్తే గుండె బద్ధలైనట్లు ఉంటుందని పేర్కొన్నారు. 2015లో ఢిల్లీ కోర్టు శ్రీశాంత్‌పై ఉన్న స్పాట్‌ఫిక్సింగ్ ఆరోపణలను కొట్టేసినప్పటికీ, బోర్డు మాత్రం నిషేధం ఎత్తేయడానికి అంగీకరించలేదు.తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. శ్రీశాంత్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన చీప్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎమ్ కన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల నేతృత్వంలోని బెంచ్ శ్రీశాంత్‌పై జీవితకాలం నిషేధం విధించడంపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని బీసీసీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2013 ఐపీఎల్ సీజన్లో శ్రీశాంత్‌తోపాటు ఇద్దరు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌లను స్పాట్‌ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బోర్డు శ్రీశాంత్‌పై నిషేధం విధించింది. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దీంతో ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినప్పటికీ, బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. దీంతో అతను కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో కేరళ హైకోర్టులో అతడికి ఊరట లభించింది. కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని బీసీసీఐ సవాల్ చేసింది. శ్రీశాంత్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయని అందుకే తాము నిషేధం విధించామని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కేరళ హైకోర్టు మళ్లీ నిషేధాన్ని పునరుద్ధరిస్తూ అక్టోబరు 17న నిర్ణయం తీసుకుంది. దీంతో అతడు చేసేదేమీ లేక సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. -
రాజస్తాన్ ఓనర్‌పై శ్రీశాంత్ భార్య ఫైర్!
ముంబై : బిగ్‌బాస్-12 రియాల్టీ షోలో పాల్గొని టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ అందరి దృష్టిని ఆకర్షించాడు. షో ఆరంభం నుంచే హౌస్‌లో ఎప్పుడు ఎదో గొడవపడుతూ.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాడు. అయితే ఈ సారి తనపై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై హౌస్ మేట్స్‌తో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటనతో తాను పూర్తిగా కుంగిపోయానని, ఆత్మహత్య చేసుకుందామని చాలాసార్లు అనుకున్నట్లు శ్రీశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను క్రికెట్ మైదానం వద్ద కూడా కనిపించవద్దన్నారని, తన కొడుకు ఆటను చూడటానికి కూడా రావద్దన్నారని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆధారాలు లేకపోయినా తనపై నింద మోపారని కన్నీరు పెట్టుకున్నాడు. ఈ వీడియో క్లిప్‌ను కలర్స్ టీవీ తమ సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేయగా వైరల్ అయింది. అయితే ఈ వీడియోపై రాజస్తాన్ రాయల్స్ జట్టు సహయజమాని రాజ్‌కుంద్రా ఫన్నీ ఎమోజీతో స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఓ వైపు శ్రీశాంత్ తన బాధను వెళ్లగక్కుతుంటే నీకు ఫన్నీగా ఉందా? అని అతని అభిమానులు మండిపడుతున్నారు. ఈ కామెంట్ స్క్రీన్ షాట్‌ను ట్వీటర్లో షేర్ చేయడంతో.. రాజ్‌కుంద్రాపై శ్రీశాంత్ సతీమణి భువనేశ్వరి కుమారి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ ఈ మనిషికి శ్రీశాంత్ వివాదం గురించి స్పష్టత రానట్టుంది. బెట్టింగ్ పాల్పడినట్లు కోర్టే తీర్పునిచ్చిన సదరు వ్యక్తి కూడా కామెంట్ చేస్తున్నాడు. శ్రీశాంత్‌పై వచ్చిన ఆరోపణలు నిరాధారణమైనవని కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలియనట్టుంది’ అని ట్వీట్ చేసింది. 2013 ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన శ్రీశాంత్.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్ దూరమయ్యాడు. ఈ విషయంలో ఎలాంటి సాక్ష్యాలు లభించకపోవడంతో 2015లో ఢిల్లీ కోర్టు శ్రీశాంత్‌పై వచ్చిన అభియోగాలను కొట్టేసింది. అయినా బీసీసీఐ శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తేయలేదు. -
శ్రీశాంత్ నాతో సహజీవనం చేశాడు : హీరోయిన్
మరి తన సంగతేంటి అని క్రికెటర్ శ్రీశాంత్‌పై మండి పడుతోంది నికీషాపటేల్. ఈ అమ్మడి కథేంటో చూద్దాం. ఈ పంజాబీ బ్యూటీ దక్షిణాదిలో తొలిసారిగా తెలుగులో పవన్‌కల్యాణ్‌తో కొమరం పులి చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత కోలీవుడ్‌కు ఎన్నమో ఏదో చిత్రంతో దిగుమతై ఇక్కడ చాలా చిత్రాలు చేసింది. అయినా స్టార్ ఇమేజ్‌కు ఇంకా ఎదగలేదు. మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్న నికీషాపటేల్‌పై వదంతులు చాలానే ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి క్రికెటర్ శ్రీశాంత్‌తో చెట్టాపట్టాల్ అన్నది ఒకటి. క్రికెట్ రంగంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కొని, కొంతకాలం ఆ క్రీడకు దూరమైన శ్రీశాంత్ నటుడిగా రంగప్రవేశం చేశాడు. ఈయనతో నటి నికీషాపటేల్ ప్రేమ వ్యవహారం మీడియాల్లో పెద్ద ఎత్తున షికారు చేసింది. వీరిద్దరూ ప్రేమలో పడి సహజీవనం చేశారనే ప్రచారం చాలా కాలం క్రితమే హోరెత్తింది. అయితే దీని గురించి అప్పట్లో ఈ సంచలన జంట నోరు మెదపలేదు. కొంతకాలం క్రితం భువనేశ్వరి అనే యువతిని శ్రీశాంత్ వివాహం చేసుకున్నాడు. ఇది జరిగిన చాలా కాలం తరువాత ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశాంత్ తాను భువనేశ్వరిని ఏడేళ్లుగా ప్రేమించి పెళ్లిచేసుకున్నానని చెప్పాడు. ఆయన భేటీని చూసిన నికీషాపటేల్ ఆగ్రహానికి గురైంది. దీంతో శ్రీశాంత్‌తో ఉన్న తన బంధాన్ని బట్టబయలు చేసింది. దీని గురించి నికీషాపటేల్ మాట్లాడుతూ వేరే అమ్మాయిని ఏడేళ్లుగా ప్రేమిస్తూ వచ్చిన శ్రీశాంత్ తనతో ఒక ఏడాది సహజీవనం చేసిన సంగతి గురించి ఏం చెబుతాడని ప్రశ్నించింది. అంతే కాదు తాను శ్రీశాంత్‌తో బ్రేకప్ చేసుకున్న తరువాత ఏడేళ్లుగా ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటున్నానని చెప్పింది. అయితే శ్రీశాంత్ నిజాన్ని దాచడం మాత్రం తాను సహించలేకపోతున్నానని నికీషా పటేల్ అంటోంది. -
సచిన్ నా పేరు చెప్పగానే ఏడ్చేశా : శ్రీశాంత్
ముంబై : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్ రియాల్టీ షోలో టీమిండియా వివాదస్పద క్రికెటర్ శ్రీశాంత్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘సచిన్ టెండూల్కర్‌కు సంబంధించిన ఓ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. 2011 ప్రపంచకప్ గెలిచిన రెండు మూడేళ్లకు జట్టంతా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇంటర్వ్యూయర్ ప్రపంచకప్ గెలిచిన సందర్భాన్ని గొప్పగా వివరిస్తూ విజేత జట్టు సభ్యులందరి పేర్లు చెప్పాడు. కానీ నా పేరు ప్రస్తావించలేదు. అయినా నేనూ మధ్యలో మాట్లాడలేదు. ఇంటర్వ్యూ ముగిసే వరకు మౌనంగానే ఉన్నా. చివరి నిమిషం వరకూ కూడా ఆ జర్నలిస్ట్ నా పేరు ప్రస్తావించలేదు. అప్పడు సచిన్ కలుగ జేసుకుని, ఈ విజయంలో శ్రీశాంత్ కూడా కీలక పాత్ర పోషించాడని తెలిపాడు. ఆ మాటలు విన్నప్పుడు నాకు కన్నీళ్లు ఆగలేదు. నేను చాలా సేపటి వరకు ఏడ్చాను.’ అని శ్రీశాంత్ బిగ్‌బాస్ సహచరుడు అనుప్ జలోటకు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ షో ఆరంభం నుంచి శ్రీశాంత్ వైఖరి హాట్ టాపిక్ అయింది. హౌస్‌లో శ్రీశాంత్ చేసే ప్రతి పని చర్చనీయాంశమవుతోంది. 2013 ఐపీఎల్లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడటంతో బీసీసీఐ అతనిపై జీవితకాల నిషేధం విధించింది. సుమారు ఐదేళ్లు క్రికెట్‌కు దూరమైన శ్రీశాంత్ ప్రస్తుతం సినిమాలు, రియాల్టీ షోలు చేస్తున్నారు. -
ఆ క్యాచ్ శ్రీశాంత్ వదిలేస్తే.. చెంప పగిలేది: హర్భజన్
ముంబై: భారత్ గెలిచిన తొలి టీ20 ప్రపంచకప్( 2007) ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠకరంగా సాగింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన తుదిపోరులో పేసర్ శ్రీశాంత్ అద్భుత క్యాచ్‌తో భారత్ ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్యాచ్‌ను శ్రీశాంత్ వదిలేసి ఉంటే అతనిపై చేయిచేసుకునేవాడినని టీమిండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. ఇండియా టుడే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న హర్భజన్ నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. అయితే ఈ టోర్నీ గెలిచినప్పుడు కలిగిన అనుభూతి 2011 ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా కలగలేదని అభిప్రాయపడ్డాడు. ‘అదో అద్భుత సందర్భం. ఆ ప్రపంచకప్ గెలిచినప్పుడు కలిగిన అనుభూతి.. 2011 ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా అనిపించలేదు. ఈ విజయంతో భారత్ చేరుకున్నప్పుడు ముంబై వీధుల్లో జనాలు నిలబడి స్వాగతం పలకడం ఇంకా కళ్ల ముందే కదలుతోంది. ఎయిర్పోర్ట్ నుంచి వాంఖెడే స్టేడియం చేరుకోవడానికి 6 గంట ల సమయం పట్టింది. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీశాంత్ ఆ క్యాచ్‌ను అందుకోవడం నిజంగా లక్కే. మిస్బా తన షాట్‌ను సరిగ్గా ఆడలేదు. ఆ అవకాశాన్ని శ్రీశాంత్ అందిపుచ్చుకున్నాడు. ఒకవేళ శ్రీశాంత్ ఆ క్యాచ్ వదిలేసి ఉంటే.. ఈ టోర్నీ అనంతరం ఐపీఎల్లో జరిగిన ఘటన ముందే చోటుచేసుకునేది’ అని హర్భజన్ పేర్కొన్నాడు. 2008 ఐపీఎల్ సందర్భంగా హర్భజన్ సహనం కోల్పోయి శ్రీశాంత్‌పై మైదానంలోనే చేయిచేసుకున్న విషయం తెలిసిందే. అత్యంత ఉత్కంఠగా సాగిన నాటి ఫైనల్ మ్యాచ్ భారత్-పాక్ అభిమానులు మరిచిపోలేరు. ఇరు జట్లను కడదాక ఊరించిన విజయం చివరకు భారత్ వశం అయ్యింది. -
బిగ్‌బాస్‌లో శ్రీశాంత్?
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశమంతటా ఎంతో పాపులారిటీ సంపాదించిన బుల్లితెర రియాలిటీ షో 'బిగ్‌బాస్'. ఈ షో హిందీ వర్షన్లో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు 11 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న హిందీ 'బిగ్‌బాస్'.. మరికొద్ది రోజుల్లో అలరించడానికి సిద్ధమైంది. హిందీలో జరిగే ఈ షోలో పాల్గొనే వారెవరా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, అనధికారికంగా బయటకు వచ్చిన పేర్లలో ఓ భారత క్రికెటర్ ఉన్నాడంటూ ప్రచారం జరుగుతుంది. మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న కేరళ పేసర్ శ్రీశాంత్.. బిగ్‌బాస్ షో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన శ్రీశాంత్ మ్యాచ్ ఫిక్సింగ్ స్కామ్‌లో జైలు జీవితం కూడా గడిపాడు. యాంగ్రీ మ్యాన్‌గా పేరున్న శ్రీ.. షోలో చేరితే అది మరింత వివాదాస్పదంగా మారే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఆ కంటెస్టెంట్‌కు వారానికి 30 లక్షలు -
శ్రీశాంత్ సంగతి జూలైలోగా తేల్చండి: సుప్రీం
న్యూఢిల్లీ: ఇంగ్లిష్ కౌంటీల్లో ఆడేందుకు అనుమతించాలంటూ కేరళ క్రికెటర్ శ్రీశాంత్ దాఖలు చేసిన అభ్యర్థనను మంగళవారం సుప్రీం కోర్టు విచారణకు తిరస్కరించింది. అయితే, అతనితో సహా స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతరుల సంగతిని జూలైలోగా తేల్చాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖాన్విల్కర్ నేతృత్వంలోని బెంచ్... క్రికెట్ ఆడాలన్న శ్రీశాంత్ తపనను అర్థం చేసుకుంటున్నామని, ఢిల్లీ పోలీసులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు వచ్చే దాకా వేచి చూడాలని పేర్కొంది. 2013లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మరో 33 మందిపై అభియోగాలు మోపారు. కానీ, వీటిని పాటియాలా హౌస్ కోర్టు 2015లో కొట్టివేసింది. దీంతో ఢిల్లీ పోలీసులు హైకోర్టుకు వెళ్లారు. -
క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: బాల్ ట్యాంపరింగ్ వివాదం నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ తీవ్రంగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాల్ ట్యాంపరింగ్ అనేది ఇప్పుడే కనిపెట్టిన విషయమే కాదని, దశాబ్దాల నుంచి ఇది కొనసాగుతుందన్నాడు. టీమిండియాకు కూడా బాల్ ట్యాంపరింగ్ తెలుసునని, వారికి ఇది కొత్తేమీ కాదన్నాడు శ్రీశాంత్. ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, బెన్‌క్రాఫ్ట్ పాల్పడ్డ బాల్ ట్యాంపరింగ్ వివాదంపై స్పందించిన భారత క్రికెటర్లు, మాజీలు ఓ సారి తన వివాదంపై కూడా స్పందిస్తే మంచిదన్నాడు. ట్యాంపరింగ్‌కు పాల్పడిన స్టీవ్ స్మిత్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ నుంచి అతడిని తొలగిస్తూ అజింక్యా రహానేకు బాధ్యతలు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఐపీఎల్ సమయం ఆసన్నమైంది కనుక.. ఇప్పుడైనా తనపై విధించిన క్రికెట్ బ్యాన్పై నిర్ణయం తీసుకోవాలన్నాడు. ఐసీసీ, బీసీసీఐ పెద్దలు తనకు క్రికెట్ మళ్లీ ఆడే అవకాశం ఇవ్వాలని కోరాడు. బాల్ ట్యాంపరింగ్ క్లబ్ స్థాయి క్రికెట్లోనూ ఉందని, ఆసీస్ జట్టు చేసిన ట్యాంపరింగ్ తనను ఆశ్చర్యానికి గురిచేయలేదని తెలిపాడు. శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం టీమిండియాకు, ఐపీఎల్‌లోనూ ఆడుతున్న వారిలో ఆరుగురు నుంచి 10 మంది టాప్ ప్లేయర్లకు ఫిక్సింగ్‌తో సంబంధం ఉందని శ్రీశాంత్ గతంలో ఆరోపించాడు. కానీ బీసీసీఐ తన ఒక్కడిపైనే కక్ష సాధించిందని.. కొందరు క్రికెటర్లపై ఢిల్లీ పోలీసులు ఇది వరకే కేసులు కూడా నమోదు చేశారని చెప్పాడు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడితే ఫిక్సింగ్‌కు పాల్పడిన అందరి పేర్లు బయటకొస్తాయని శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు. 2013 జూలైలో ఐపీఎల్-6 సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం భారత క్రికెట్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై బీసీసీఐ జీవితకాలం నిషేధించింది. అప్పటి నుంచి క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టు ద్వారా పోరాటం చేస్తున్నాడు శ్రీశాంత్. -
శ్రీశాంత్‌పై మీ వైఖరేంటి?
న్యూఢిల్లీ: జీవితకాల నిషేధానికి గురైన వివాదాస్పద పేసర్ శ్రీశాంత్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి వైఖరేంటో తెలపాలని సుప్రీం కోర్టు కోరింది. తనపై బోర్డు విధించిన నిషేధాన్ని శ్రీశాంత్ సర్వోన్నత న్యాయస్థానంలో సవాలు చేయగా... చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ సోమవారం విచారించింది. అనంతరం నాలుగు వారాల్లో స్పందన తెలపాలని బోర్డుతో పాటు, సుప్రీం నియమించిన పరిపాలక కమిటీని త్రిసభ్య బెంచ్ ఆదేశించింది.క్రికెటర్ తరఫున సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ వాదనలు వినిపించారు. శ్రీశాంత్ ఆడేందుకు మధ్యంతర తీర్పు ఇవ్వాలని కోరారు. అయితే సుప్రీం బెంచ్ మాత్రం అలాంటి ఆదేశాలివ్వలేమని ఆ వినతిని తిరస్కరించింది. -
'శ్రీశాంత్‌ను కొట్టాలనుకున్నా'
జోహెనెస్బర్గ్: దాదాపు పదేళ్ల క్రితం జరిగిన సంఘటనను దక్షిణాఫ్రికా మాజీ పేస్ బౌలర్ ఆండ్రీ నెల్ మరోసారి గుర్తు చేసుకున్నాడు. 2006లో జోహెనెస్‌బర్గ్‌లో తమతో జరిగిన టెస్టు మ్యాచ్ సందర్బంగా శ్రీశాంత్‌ను తలపై బలంగా కొట్టాలన్న కసి వచ్చిందనే విషయాన్ని నెల్ తాజాగా వెల్లడించాడు. ఈ మేరకు ఓ క్రీడా వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆనాటి జ్ఞాపకాల్ని నెమరవేసుకున్నాడు. 'నేను బ్యాట్స్‌మన్‌ను కవ్వించే క్రమంలో శ్రీశాంత్‌తో ముందుగా స్లెడ్డింగ్కు దిగా. అయితే అప్పుడు నేను ఏమని వ్యాఖ్యానించానో కచ్చితంగా గుర్తులేదు. కాకపోతే శ్రీశాంత్‌ను బాగా రెచ్చగొట్టా. నేను రెచ్చగొట్టిన తర్వాత బంతిని శ్రీశాంత్ స్టైట్‌గా సిక్స్‌గా మలిచాడు. అదే క్రమంలో పిచ్ మధ్యకు వచ్చిన శ్రీశాంత్ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తరహా సెలబ్రేషన్‌ను అంతకుముందెన్నడూ నేను చూడలేదు. ఆ సమయంలో శ్రీశాంత్ తలపై బలంగా కొడదామనేంత ఆవేశం వచ్చింది. ఆపై కూల్‌గా కావడంతో ఎటువంటి వివాదం జరగలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీశాంత్ దగ్గరకు వెళ్లి షేక్‌హ్యాండ్ ఇచ్చా. ఆ క్రమంలో మేమిద్దరం నవ్వుకున్నాం. ఇటువంటి ఘటనలు కనీసం చెప్పకోవడానికి ఉండాలి. దూకుడుగా ఉండటం నాకు కూడా ఇష్టమే. నేను కవ్వించిన తర్వాత బంతిని సిక్స్‌గా కొట్టడాన్ని శ్రీశాంత్ బాగా ఎంజాయ్ చేసుంటాడు. నిజంగా చాలా సరదాగా ఉండే మనస్తత్వం శ్రీశాంత్‌ది' అని నెల్ గత స్మృతుల్ని గుర్తుచేసుకున్నాడు. -
ధోని, ద్రవిడ్లపై శ్రీశాంత్ అసహనం..
సాక్షి, న్యూఢిల్లీ: వివాదస్పద క్రికెటర్, నిషేదిత బౌలర్ శ్రీశాంత్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్లపై అసహనం వ్యక్తం చేశాడు. రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనపై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్న ద్రవిడ్‌కు తెలియజేశానని, కానీ అతను నాకు మద్దతివ్వక పోవడంతో చాల బాధ పడ్డానని తెలిపాడు. ఇక ఎంఎస్ ధోనికి ఎమోషనల్‌గా మెసేజ్ చేశానని..కానీ అతను కూడా స్పందించలేదని శ్రీశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం టీమిండియాకు, ఐపీఎల్ లో ఆడుతున్న వారిలో ఆరుగురు నుంచి 10 మంది టాప్ ప్లేయర్లకు ఫిక్సింగ్‌తో సంబంధం ఉందని ఆరోపించాడు. కానీ బీసీసీఐ నా ఒక్కడిపైనే కక్ష సాధించిందని తెలిపాడు. కొందరు క్రికెటర్లపై ఢిల్లీ పోలీసులు ఇది వరకే కేసులు కూడా నమోదు చేసిన విషయం అందరికీ తెలుసిందేనని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడితే ఫిక్సింగ్‌కు పాల్పడిన అందరి పేర్లు బయటకొస్తాయని' శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు. నా మీద కేవలం బీసీసీఐ నిషేధం విదించింది. కానీ ఐసీసీ కాదుగా' అందుకే భారత్‌లో ఆడే అవకాశం ఇవ్వకపోతే వేరే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని ఇటీవల శ్రీశాంత్ తెలిపిన విషయం తెలిసిందే. ఇటీవల కేరళ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పును బీసీసీఐ ఉన్నత ధర్మాసనం ముందు సవాల్ చేసింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో దొరికిపోయిన పేసర్ శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేయడం సరికాదని బీసీసీఐ వాదనలు వినిపించింది. 2013 జూలైలో ఐపీఎల్-6 సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం భారత క్రికెట్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై బీసీసీఐ జీవితకాలం నిషేధించింది. ఇక క్రికెట్ ఆడటం నా హక్కు. ఆ హక్కు కోసం నేను సుప్రీం కోర్టులో పోరాడతా అని శ్రీశాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
నిరూపించుకో శ్రీశాంత్: కపిల్ దేవ్
ఫిక్సింగ్‌కు సంబంధించి శిక్ష విధించే విషయంలో బీసీసీఐ తనపై కత్తిగట్టినట్లుగా పేసర్ శ్రీశాంత్ భావిస్తే దాన్ని అతను రుజువు చేయాలని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. బీసీసీఐ ఫిక్సింగ్ ఉదంతంలో ఉన్న మిగతా 13 మందిని ఒకలా తనను మరోలా పరిగణిస్తోందని శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు. ‘బీసీసీఐ తనపట్ల పక్షపాతంగా వ్యవహరిస్తుందనేది శ్రీశాంత్ వ్యక్తిగత అభిప్రాయం. దానిపై నేనేమీ మాట్లాడను. కానీ అదే నిజమైతే రుజువులతో రావాలని శ్రీశాంత్‌ను కోరుతున్నాను’ అని కపిల్ అన్నారు. -
సుప్రీం కోర్టుకి వెళ్తా: శ్రీశాంత్
భారత వివాదాస్పద బౌలర్ శ్రీశాంత్ జీవితకాల నిషేధం అంశాన్ని సుప్రీం కోర్టులో తేల్చుకుంటానని అన్నాడు. ‘నాకు ఇక ఉన్న ఒక్క అవకాశం సుప్రీం కోర్టుని ఆశ్రయించడమే. ఏదైనా ఇక అక్కడే తేల్చుకుంటా. క్రికెట్ మినహా నా జీవితంలో అన్నీ సవ్యంగా సాగుతున్నాయి. క్రికెట్ ఆడటం నా హక్కు. ఆ హక్కు కోసం నేను సుప్రీం కోర్టులో పోరాడతా. ఈ పోరాటం కేవలం దేశానికి ఆడటం కోసం మాత్రమే కాదు. నా పరువు ప్రతిష్టల్ని తిరిగి పొందడానికి. ఈ నాలుగేళ్లు వేచి చూశా. కానీ ఇక మౌనంగా ఉండలేను’ అని శ్రీశాంత్ తెలిపాడు. -
శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ : టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'నా మీద కేవలం బీసీసీఐ నిషేధం విదించింది.. కానీ ఐసీసీ కాదుగా' అందుకే భారత్‌లో ఆడే అవకాశం ఇవ్వకపోతే వేరే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని ఇటీవల చెప్పిన శ్రీశాంత్.. ఫిక్సింగ్ కు సంబంధించిన పలు అంశాలను వెల్లడించినట్లు సమాచారం. 'ప్రస్తుతం టీమిండియాకు, ఐపీఎల్ లో ఆడుతున్న వారిలో నలుగురైదుగురికి ఫిక్సింగ్‌తో సంబంధం ఉంది. కానీ బీసీసీఐ నా ఒక్కడిపైనే కక్ష సాధించింది. కొందరు క్రికెటర్లపై ఢిల్లీ పోలీసులు ఇది వరకే కేసులు నమోదు చేసిన విషయం అందరికీ తెలుసు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడితే ఫిక్సింగ్‌కు పాల్పడిన అందరి పేర్లు బయటకొస్తాయని' శ్రీశాంత్ వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్, ఇతర ట్రోఫీలలో ఫిక్సింగ్ కు పాల్పడిన క్రికెటర్లు ఇప్పటీకి ఆడుతున్నారని శ్రీశాంత్ అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముద్గల్ రిపోర్టులో ఆ క్రికెటర్ల పేర్లు ఉన్నట్లు సమాచారం. ఇటీవల కేరళ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పును బీసీసీఐ ఉన్నత ధర్మాసనం ముందు సవాల్ చేసింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో దొరికిపోయిన పేసర్ శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేయడం సరికాదని బీసీసీఐ వాదనలు వినిపించింది. 2013 జూలైలో ఐపీఎల్-6 సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం భారత క్రికెట్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై బీసీసీఐ జీవితకాలం నిషేధించింది. -
క్రికెట్ క్రీడపై కుహనా దేశభక్తి క్రీనీడ
అవలోకనం ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌కు వెళ్లిపోవాలనుకుంటే దాన్ని దేశద్రోహంగా చూడం. మన క్రికెటర్ల విషయంలో ఇది ఎందుకు భిన్నంగా ఉండాలి? ఒక ప్రైవేట్ సంస్థ అయిన బీసీసీఐకి తన తరఫున ఎవరు ఆడాలో, ఆడరాదో నిర్ణయించే హక్కు ఉంది. కానీ, శ్రీశాంత్ తన వృత్తి విషయంలో, క్రీడా నైపుణ్యం విషయంలో ఏమి చేయాలో చెప్పే హక్కు మనకు ఎవరికీ లేదు. ముప్పయ్యేళ్ల క్రితం క్లయివ్ లాయిడ్ నేతృత్వంలోని వెస్ట్ ఇండీస్ క్రికెట్ జట్టు ప్రాబల్యం క్షీణించడం ప్రారంభించింది. దీంతో అలన్ బోర్డర్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ప్రపంచంలోకెల్లా బలమైన జట్టుగా మారింది. ఆస్ట్రేలియా జట్టులో చాలా మంది ఎడమ చేతి ఆటగాళ్లు ఉండేవారు. అలన్ బోర్డర్, ఓపెనింగ్ బ్యాట్స్‌మేన్ కెప్లర్ వెసల్ కూడా ఆ బాపతే. నిజానికి కెప్లర్ దక్షిణ ఆఫ్రికా దేశస్తుడు. దక్షిణ ఆఫ్రికా జాతి వివక్షను పాటిస్తూ నల్ల జాతీయులకు, ఆసియా సంతతి, మిశ్రమ జాతుల వారికి ఓటింగ్ హక్కును నిరాకరించింది. దీంతో ప్రపంచ క్రికెట్, ఆ దేశంతో క్రీడా సంబంధాలపై నిషేధం విధించింది. అందువల్ల సొంత దేశం తరఫున ఆడలేని కెప్లర్ తన జాతీయతను మార్చుకున్నాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు జింబాబ్వే దేశస్తుడైన గ్రేమ్ హిక్ ఇంగ్లండు జట్టు తరఫున ఆడాడు. ఆస్ట్రేలియా జట్టులో ఆడాలని నిర్ణయించుకున్న దక్షిణ ఆఫ్రికా క్రీడాకారులలో కెవిన్ పీటర్సన్ కూడా ఒకడు. లూక్ రోంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు రెండింటి తరఫునా ఆడాడు. ఇయాన్ మోర్గాన్ కూడా ఐర్లాండ్, ఇంగ్లండ్ జట్లు రెండింటిలోనూ ఆడాడు. ఇతర దేశాలకు చెందిన ఈ వ్యక్తులు తమ జట్లలో చేరి ఆడటం పట్ల ఈ దేశాలకు ఎలాంటి అభ్యంతరాలు లేవనేది స్పష్టమే. అలాగే తమ మాతృ దేశం తమను కోరుకోవడం లేదని లేదా అవసరం లేదనుకుంటోందని భావించిన పౌరులు మరో దేశానికి వెళ్లి క్రికెట్ ఆడాలని కోరుకోవడంలో ఆయా దేశాలకు సైతం ఎలాంటి అభ్యంతరాలూ లేవనేది కూడా స్పష్టమే. ఈ వారం, భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఎస్ శ్రీశాంత్, బీసీసీఐకి తను అక్కర్లేకపోతే మరే ఇతర దేశం తరఫునైనా ఆడతానని అన్నాడు. శ్రీశాంత్ విషయంలో ఇచ్చిన మునుపటి ఆదేశాలను ఒక న్యాయస్థానం కొట్టివేసి, అతనికి క్రికెట్ ఆడే హక్కు లేదని చెప్పింది. ఆ తర్వాతనే శ్రీశాంత్ ఈ మాట అన్నారు. 2013 ఐపీఎల్ సీజన్లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో అతన్ని క్రికెట్ నుంచి నిషేధించారు. అప్పుడు అతని వయసు 29 ఏళ్లు. ఒక్కో బంతిపై పందెం కాయడాన్ని స్పాట్ ఫిక్సింగ్ అంటారు. ఫలానా బంతికి ఒక బౌలర్ వికెట్ తీసుకుంటాడని లేదా నో బాల్ వేస్తాడని లేదా బాట్స్‌మేన్ బౌండరీ కొడతాడని పందెం కాయమని బుకీలు పిలుస్తారు. బుకీ, బౌలర్‌తో లాలూచీ పడగలిగితే అతను ఏదైనా ఒక బంతిని ఎలా బౌల్ చేస్తాడనే విషయంపై ముందుగానే అంచనాకు రాగలుగుతాడు. గెలుపు లేదా ఓటమి అంటూ పందేలు కాసి విసిగిపోయి, ఏదైనా మరింత ఉద్విగ్నభరితమైనదాని కోసం ఎదురుచూసే వారికి (మన దేశంలో అలాంటి వారు చాలావరకు గుజరాతీలే) ఆ బుకీలు స్పాట్ బెట్టింగ్ అవకాశాన్ని కల్పిస్తారు. బుకీకి, క్రీడాకారులకు మధ్య లాలూచీ ఉన్నా ఇలాంటి పందేలలో హస్తలాఘవాన్ని ప్రదర్శించడం తేలికేం కాదు. కొన్నేళ్ల క్రితం కొందరు పాకిస్తానీ క్రికెటర్లు ఇలా చేస్తూ బ్రిటిష్ మీడియాకు దొరికిపోయారు. శ్రీశాంత్ పై వచ్చిన ఆరోపణలు కూడా అ కాలం నాటివే. అతనిపై నిషేధం విధించినా, న్యాయస్థానం ఆ ఆరోపణలను కొట్టేసింది. గత నాలుగేళ్లుగా అతను క్రికెట్ ఆడలేకపోయాడు. దీంతో శ్రీశాంత్ ఎంతగా అసంతృప్తితో ఉన్నాడంటే, తాజా కోర్టు ఆదేశాల తర్వాత ‘‘నిషేధం విధించినది బీసీసీఐ తప్ప ఐసీసీ కాదు. భారత జట్టు తరఫున కాకపోతే నేను మరే దేశం తరఫునైనా ఆడవచ్చు. నాకు ఇప్పుడు 34 ఏళ్లు. మహా అయితే మరో ఆరేళ్లు మాత్రమే ఆడగలను. క్రికెట్ ప్రేమికునిగా నేను క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నా. అంతేకాదు, బీసీసీఐ ఒక ప్రైవేటు సంస్థ. దాని జట్టును భారత్ క్రికెట్ జట్టు అంటున్నది మనమే. అయినా అది ఒక ప్రైవేటు సంస్థ మాత్రమేనని మీకు తెలుసు.’’ అతని దృక్కోణం ఏమిటో సులువుగానే తెలుస్తోంది. తన జీవితాన్నంతటినీ పెట్టుబడిగా పెట్టిన క్రీడలో అతన్ని భారత్‌లో ఆడనివ్వడం లేదు. అలాంటప్పుడు మరో దేశం తరఫున ఎందుకు ఆడకూడదు? అతను ఆ పని చేయడం పూర్తిగా సరైనదేనని నాకు అనిపిస్తోంది. దీని వల్ల తలెత్తే జాతీయతను మార్చుకోవడం వంటి ఆచరణాత్మక సమస్యలను పక్కన పెట్టండి. ఒక భారతీయుడు మరో దేశస్తుడు కావడం కంటే ఒక దక్షిణ అఫ్రికా దేశీయుడు ఆస్ట్రేలియా పౌరుడు కావడం చాలా తేలిక. ఏది ఏమైనా శ్రీశాంత్ విదేశాల్లో తాను ఆడేది టీ–20 క్రికెట్ మాత్రమేనని సూచించాడు. అతని నిర్ణయం ఏదైనా కానివ్వండి, సొంత దేశం వద్దంటున్నా, దాని పట్ల విధేయతను ప్రదర్శించి మరో దేశం తరఫున ఆడవద్దని అతన్ని కోరడం అన్యాయం అంటాను. క్రికెట్ క్రీడను ఇంత తీవ్రంగా పట్టించుకునేది మన భారతీయులం మాత్రమే. మనం బోలెడంత జాతీయవాదాన్ని ఆ క్రీడలో పెట్టుబడిగా పెట్టాం. బీసీసీఐ జట్టు, పాకిస్తాన్ క్రికెట్ అసోసియేషన్ నియంత్రణలోని జట్టును ఓడిస్తే ‘‘పాకిస్తాన్’’ను ‘‘భారత్’’ ఓడించినట్టు లెక్క. క్రికెట్ క్రీడలోని గెలుపు, ఓటముల విషయంలో వ్యక్తమయ్యే మన ఉద్వేగాలు ప్రబలమైనవి. జనాదరణ గల మన మరే సాంస్కృతిక రూపంలోనూ అంత బలంగా ఉద్వేగాలు వ్యక్తం కావడం కనిపించదు. ప్రియాంకా చోప్రా లాంటి హీరో లేదా హీరోయిన్ బాలివుడ్‌ను వదిలేసి హాలీవుడ్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటే.. ఆమె చర్యలను మనం దేశద్రోహంగా చూడం. పైగా భారతీయులలో ఒకరు హాలీవుడ్లో విజయాలను సాధిం చడం గొప్పని భావిస్తాం. ఇది మన క్రికెటర్ల విషయంలో మాత్రం ఎందుకు భిన్నంగా ఉండాలి? దీన్ని అర్థం చేసుకోవడం తేలికేం కాదు. ఈ విషయంలో ఎవరైనాగానీ శ్రీశాంత్ పట్ల సానుభూతిని చూపవచ్చు. ఒక ప్రైవేట్ సంస్థ అయిన బీసీసీఐకి తన తరఫున ఎవరు ఆడాలి లేదా ఎవరు ఆడరాదు అని నిర్ణయించే హక్కు పూర్తిగా ఉంది. ఆ సంస్థ ప్రపంచంలోనే అత్యంత అవినీతిగ్రస్తమైన క్రీడా సంస్థ అనే విషయాన్ని ఇప్పటికి పక్కన పెడదాం. శ్రీశాంత్ తన వృత్తి విషయంలో, క్రీడా నైపుణ్యం విషయంలో ఏమి చేయాలో చెప్పే హక్కు మనలో ఎవరికీ లేదు. అతను మన బూటకపు క్రికెట్ దేశభక్తి జ్యోతిని ఎత్తిపట్టాలని ఆశించడం అల్పత్వం, బాల్య చాపల్యం. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత‘ aakar.patel@icloud.com -
మరో దేశం తరఫున ఆడతా: శ్రీశాంత్
-
మరో దేశం తరఫున ఆడతా: శ్రీశాంత్
ముంబై: బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని కేరళ హైకోర్టు సమర్థించడంతో డీలా పడిన పేసర్ శ్రీశాంత్... తన కెరీర్‌ను మరో దేశం తరఫున కొనసాగించాలని ఆలోచిస్తున్నాడు. ‘నా మీద నిషేధం బీసీసీఐ విధించిందే కానీ ఐసీసీ కాదు. భారత్‌లో ఆడలేకపోతే వేరే ఏ దేశం నుంచైనా ఆడగలను. .బీసీసీఐ అనేది ప్రైవేట్ సంస్థ మాత్రమే. అది భారత జట్టుకు సంబంధించినది. నేను వేరే దేశం తరఫున ఆడితే వీరికి సంబంధం ఉండదు’ అని శ్రీశాంత్ స్పష్టం చేశాడు. మరోవైపు బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి స్పందిస్తూ ‘ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక దేశం ఏ ఆటగాడిపైనైనా నిషేధం విధిస్తే అతను ఏ దేశం తరఫున కూడా ఆడలేడు. బీసీసీఐకి న్యాయపరమైన అంశాలపై పూర్తి అవగాహన ఉంది’ అని వివరించారు. -
ఊరట.. ఇంతలోనే భారీ షాక్!
సాక్షి, కొచ్చి: క్రికెటర్ ఎస్ శ్రీశాంత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో శ్రీశాంత్‌పై విధించిన జీవితకాల నిషేధాన్ని పునరుద్ధరిస్తూ.. కేరళ హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు వెలువరించింది. శ్రీశాంత్‌పై భారత క్రికెట్ సంఘం (బీసీసీఐ) విధించిన జీవితకాల నిషేధాన్ని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇటీవల ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఏకసభ్య ధర్మాసనం తీర్పును బీసీసీఐ ఉన్నత ధర్మాసనం ముందు సవాల్ చేసింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో దొరికిపోయిన శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేయడం సరికాదని బీసీసీఐ వాదనలు వినిపించింది. 2013 జూలైలో ఐపీఎల్-6 సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం భారత క్రికెట్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై బీసీసీఐ జీవితకాలం నిషేధించింది. ఊరట.. ఇంతలోనే షాక్! తనపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ అవిశ్రాంతంగా పోరాడుతున్న శ్రీశాంత్‌కు గత ఆగస్టు నెలలో ఊరట లభించింది. శ్రీశాంత్‌పై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ కేరళ హైకోర్టు ఆగస్టు 7న తీర్పునిచ్చింది. నిషేధాన్ని తొలగించాలంటూ బీసీసీఐ క్రమశిక్షణా కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. 2013లో జరిగిన ఐపీఎల్-6లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా కేరళ హైకోర్టును శ్రీశాంత్ ఆశ్రయించాగా.. అతనికి ఊరట లభించింది. అయితే, కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ బీసీసీఐ.. ఉన్నత ధర్మాసనాన్ని ఆశ్రయించింది. అతడికి వ్యతిరేకంగా ఆధారాలు ఉండటంతోనే తాము నిషేధం విధించామని పేర్కొంటూ.. గతనెల పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన ఉన్నత ధర్మాసనం.. బీసీసీఐ వాదనను సమర్థిస్తూ.. అతడిపై నిషేధాన్ని పునరుద్ధరించింది. -
శ్రీశాంత్ నిషేధంపై హైకోర్టులో బీసీసీఐ పిటిషన్
కొచ్చి: పేసర్ శ్రీశాంత్‌పై విధించిన నిషేధం ఎత్తివేతను సవాల్ చేస్తూ కేరళ హైకోర్టులో బీసీసీఐ పిటిషన్ దాఖలు చేసింది. అతడికి వ్యతిరేకంగా ఉన్న ఆధారాల కారణంగానే తాము నిషేధం విధించినట్టు బోర్డు పేర్కొంది. 2013 ఐపీఎల్ సీజన్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపిస్తూ శ్రీశాంత్‌పై బోర్డు జీవితకాల నిషేధం విధించింది. అయితే కేరళ హైకోర్టుకు చెందిన సింగిల్ బెంచ్ గత నెల 7న ఈ నిషేధాన్ని కొట్టివేస్తూ తీర్పునిచ్చింది -
క్రికెటర్ శ్రీశాంత్ కు భారీ ఊరట
కొచ్చి:తనపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ అవిశ్రాంతంగా పోరాడుతున్న క్రికెటర్ శ్రీశాంత్ కు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. శ్రీశాంత్ పై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ సోమవారం కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు శ్రీశాంత్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై తుది తీర్పును హైకోర్టు వెలువరించింది. దానిలో భాగంగా బీసీసీఐ క్రమశిక్షణా కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. 2013లో జరిగిన ఐపీఎల్–6 సీజన్లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల కేరళ హైకోర్టును శ్రీశాంత్ ఆశ్రయించాడు. ఆ క్రమంలోనే మే నెలలో బీసీసీఐకి కేరళ హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని కోర్టు ఎత్తివేస్తున్నట్లు తాజా తీర్పు ద్వారా ప్రకటించింది. గతంలో కోర్టు చెప్పినా.. ఫిక్సింగ్ వ్యవహారంలో తనకు ఢిల్లీ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారని, దాంతో తనపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధం తొలగించాలని శ్రీశాంత్ కేరళ హైకోర్టును కోరాడు. తాను నిర్దోషిగా తేలినా , బీసీసీఐ కావాలనే నిషేధాన్ని కొనసాగిస్తుందని కోర్టుకు పిటిషన్ లో విన్నవించాడు. దానిపై స్పందించిన కోర్టు.. శ్రీశాంత్ పై ఉన్న నిషేధాన్ని తొలగించాలంటూ బీసీసీఐకి నోటీసులు పంపింది. అయితే బీసీసీఐ మాత్రం తన వైఖరిని మార్చుకోకుండా అతనిపై నిషేధాన్ని యథావిధిగా కొనసాగించింది. అతనిపై తాము తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదని కూడా బీసీసీఐ పెద్దలు తేల్చిచెప్పారు. ఆ క్రమంలోనే శ్రీశాంత్ పై నిషేధాన్ని ఎందుకు ఎత్తివేయారో చెప్పాలంటూ బీసీసీఐకి కోర్టు మరోసారి నోటీసులు పంపింది. ఆపై ఈ కేసును పలుమార్లు విచారించిన కోర్టు.. శ్రీశాంత్ పై నిషేధాన్ని ఎత్తివేస్తూ తుది ఆదేశాలు జారీ చేసింది. గాడ్ ఈజ్ గ్రేట్.. కేరళ హైకోర్టు తీర్పుపై శ్రీశాంత్ హర్షం వ్యక్తం చేశాడు. గాడ్ ఈజ్ గ్రేట్ అని ట్విట్టర్ లో పేర్కొన్న శ్రీశాంత్.. తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశాడు. God is great..thanks for the all the love and support pic.twitter.com/THyjfbBSFv — Sreesanth (@sreesanth36) 7 August 2017 -
ఆమె చెల్లెలు లాంటిది!
తమిళసినిమా: నటి నిక్కీగల్రాణి తనకు చెల్లెలు లాంటిదని అన్నారు నటుడిగా రంగప్రవేశం చేస్తున్న సంచలన క్రికెట్ కీడాకారుడు శ్రీశాంత్. ఈయన హీరోగా నటిస్తున్న తొలి చిత్రం టీమ్ 5. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రెడ్ కార్పెట్ ఫిలింస్ పతాకంపై రాజ్ జక్కారియాజ్ నిర్మిస్తున్నారు. సురేశ్ గోవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీశాంత్‌కు జంటగా నటి నిక్కీగల్రాణి నటిస్తున్నారు. ముఖ్య పాత్రలో మరాఠి నటుడు దేశ్‌పాండే నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతాన్ని, సైజిత్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.చిత్రం గురించి కథానాయకుడిగా పరిచయం అవుతున్న శ్రీశాంత్ తెలుపుతూ ఈ చిత్రంలో తాను బైక్ రేసర్‌గా నటిస్తున్నానని తెలిపారు.అందుకోసం ప్రత్యేక శిక్షణ పొందానని చెప్పారు. తనకిది తొలి చిత్రం అని, నటి నిక్కీగల్రాణి 25 చిత్రాలకు పైగా నటించారని అందువల్ల నటనలో ఆమె తనకు చాలా నేర్పించారని చెప్పారు. నిక్కీగల్రాణి తనకు చెల్లెలు లాంటిదని అన్నారు. తను చిన్నతనం నుంచి తనకు తెలుసన్నారు.తన కుటుంబంలో అమ్మ, నాన్న, చెల్లెలు, అన్నయ్య అందరూ సినిమాకు చెందిన వారేనని తెలిపారు. తాను మాత్రమే క్రికెట్ రంగంలోకి వెళ్లానని, ఇప్పుడు మళ్లీ సినిమారంగంలోకి వచ్చానని అన్నారు.తనకు సినిమా, క్రికెట్ రెండూ ఇష్టమేనన్నారు. త్వరలోనే భారత క్రికెట్ జట్టుతో కలిసి క్రికెట్ ఆడనున్నట్లు చెప్పారు.తాను రజనీకాంత్, కమలహాసన్‌లను చూసి పెరిగిన వాడినని అన్నారు. విజయ్, అజిత్‌లతో కలిసి నటిస్తారా అని అడుగుతున్నారని, వారితో ఒక్క సన్నివేశంలో నటించడానికైనా సిద్ధమేనని శ్రీశాంత్ అన్నారు. -
ఆమె చెల్లెలు లాంటిది: క్రికెటర్ శ్రీశాంత్
తమిళసినిమా: నటి నిక్కీగల్రాణి తనకు చెల్లెలు లాంటిదని నటుడిగా రంగప్రవేశం చేస్తున్న సంచలన క్రికెట్ కీడాకారుడు శ్రీశాంత్ అన్నారు. ఈయన హీరోగా నటిస్తున్న తొలి చిత్రం టీమ్ 5. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రెడ్ కార్పెట్ ఫిలింస్ పతాకంపై రాజ్ జక్కారియాజ్ నిర్మిస్తున్నారు. సురేశ్ గోవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీశాంత్‌కు జంటగా నటి నిక్కీగల్రాణి నటిస్తున్నారు. ముఖ్య పాత్రలో మరాఠి నటుడు దేశ్‌పాండే నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతాన్ని, సైజిత్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం గురించి శ్రీశాంత్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తాను బైక్ రేసర్‌గా నటిస్తున్నానని తెలిపారు. అందుకోసం ప్రత్యేక శిక్షణ పొందానని చెప్పారు. తనకిది తొలి చిత్రం అని, నటి నిక్కీగల్రాణి 25 చిత్రాలకు పైగా నటించారని అందువల్ల నటనలో ఆమె తనకు చాలా నేర్పించారని చెప్పారు. నిక్కీగల్రాణి తనకు చెల్లెలు లాంటిదని అన్నారు. తను చిన్నతనం నుంచి ఆయనకు తెలుసన్నారు. తన కుటుంబంలో అమ్మ, నాన్న, చెల్లెలు, అన్నయ్య అందరూ సినిమాకు చెందిన వారేనని తెలిపారు. తాను మాత్రమే క్రికెట్ రంగంలోకి వెళ్లానని, ఇప్పుడు మళ్లీ సినిమారంగంలోకి వచ్చానని అన్నారు. తనకు సినిమా, క్రికెట్ రెండూ ఇష్టమేనని చెప్పారు. త్వరలోనే భారత క్రికెట్ జట్టుతో కలిసి క్రికెట్ ఆడనున్నట్లు చెప్పారు. తాను రజనీకాంత్, కమలహాసన్‌లను చూసి పెరిగిన వాడినని అన్నారు. కొందరు విజయ్, అజిత్‌లతో కలిసి నటిస్తారా అని అడుగుతున్నారని, వారితో ఒక్క సన్నివేశంలో నటించడానికైనా సిద్ధమేనని శ్రీశాంత్ అన్నారు. -
బైక్ రేస్...
ఇండియన్ మాజీ క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా సురేష్ గోవింద్ తెరకెక్కిం చిన చిత్రం ‘టీమ్ 5’. నిక్కీ గర్లాని కథనాయిక. రాజ్ జకారియస్ నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ నెల 21న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాతలు దాము, రాజ్ కందుకూరి లాంచ్ చేశారు. పాటలు ‘మధుర’ ఆడియో ద్వారా మార్కెట్లోకి విడుదలయ్యాయి. రాజ్ జకారియస్ మాట్లాడుతూ– ‘‘ఐదుగురు స్నేహితులు, బైక్ రేసింగ్ పై నడిచే కథ ఇది. శ్రీశాంత్ యాక్టింగ్, డ్యాన్స్ సూపర్‌గా చేశారు’’ అన్నారు. ‘‘క్రికెటర్‌గా నన్ను అభిమానించినవారు, యాక్టర్‌గా కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి సందేశం ఇస్తుంది’’ అన్నారు శ్రీశాంత్. ఈ చిత్రానికి సహ నిర్మాత: అన్సార్ రషీద్. -
బీసీసీఐకి కేరళ హైకోర్టు నోటీసు
కొచ్చి: పేసర్ శ్రీశాంత్ నిషేధం వ్యవహారంలో బీసీసీఐకి కేరళ హైకోర్టు లీగల్ నోటీసులను జారీ చేసింది. 2013లో వెలుగు చూసిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో శ్రీశాంత్‌పై బోర్డు జీవితకాల నిషేధాన్ని విధించింది. అయితే గతంలోనే స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి విముక్తి దొరికినా బోర్డు పట్టించుకోవడం లేదని తను కోర్టుకెక్కాడు. దీంతో ఈ పిటిషన్‌పై స్పందించాల్సిందిగా పరిపాలక కమిటీ (సీఓఏ)కి జస్టిస్ పీబీ సురేశ్ కుమార్‌తో కూడిన బెంచ్ నోటీసును పంపింది. తదుపరి విచారణ జూన్ 19న జరుగుతుంది. -
నిషేధం ఎత్తివేయం
శ్రీశాంత్‌కు తేల్చి చెప్పిన బీసీసీఐ న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి జీవిత కాల నిషేధానికి గురైన పేసర్ శ్రీశాంత్ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. బీసీసీఐలో పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఏర్పడిన తర్వాత తనపై నిషేధాన్ని తొలగించాలంటూ కొన్నాళ్ల క్రితం శ్రీ ప్రత్యేకంగా బోర్డుకు లేఖ రాశాడు. స్కాట్లాండ్లో లీగ్ మ్యాచ్‌లు ఆడుకునేందుకు అనుమతి ఇవ్వాలని కూడా కోరాడు. అయితే అతనిపై విధించిన నిషేధాన్ని తొలగించే ప్రశ్నే లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని బోర్డు అధికారులు శ్రీశాంత్‌కు తెలియజేశారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని బోర్డు తేల్చి చెప్పింది. ‘శ్రీశాంత్‌పై జీవిత కాలం నిషేధం కొనసాగుతుంది. అతను ఎలాంటి పోటీ క్రికెట్లోనూ పాల్గొనేందుకు అనుమతించం. ఇదే విషయాన్ని అతనికి తెలియజేశాం. ఫిక్సింగ్ విషయంలో శ్రీశాంత్ తప్పు లేదంటూ ఏ కోర్టు కూడా తీర్పు ఇవ్వలేదు’ అని బోర్డు ప్రతినిధి స్పష్టం చేశారు. -
'శ్రీశాంత్‌పై నిషేధాన్ని తొలగించం'
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా తనపై విధించిన జీవిత కాల నిషేధాన్ని ఎత్తివేయాలని పోరాడుతున్న క్రికెటర్ శ్రీశాంత్ కు మరోసారి చుక్కెదురైంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై అతనిపై కొనసాగుతున్న నిషేధాన్ని తొలగించడం కుదరదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) స్పష్టం చేసింది. ఈ మేరకు కేరళ హైకోర్టుకు తన అభిప్రాయాన్ని బీసీసీఐ వెల్లడించింది. శ్రీశాంత్ వ్యవహారంలో తమ మాజీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చలేమని పేర్కొంది. తనపై ఉన్న కేసులను ఢిల్లీలోని సెషన్ కోర్టు కొట్టివేసిన తరువాత బీసీసీఐ కూడా జీవిత కాల నిషేధాన్ని తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిలోభాగంగా హైకోర్టుకు బీసీసీఐ తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ ఓ నివేదిక సమర్పించింది. ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో 2013 మేలో శ్రీశాంత్‌తో పాటు, మరో ఇద్దరు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లను అరెస్ట్ చేశారు. ఆ క్రమంలోనే శ్రీశాంత్ పై జీవిత కాల నిషేధాన్ని విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. -
శ్రీశాంత్‌పై నిషేధాన్ని ఎత్తివేయండి
బీసీసీఐకి కేరళ హైకోర్టు నోటీసు న్యూఢిల్లీ: తనపై విధించిన జీవితకాల నిషేధం తొలగింపుపై అవిశ్రాంతంగా పోరాడుతున్న పేస్ బౌలర్ ఎస్.శ్రీశాంత్‌కు ఇది ఊరటనిచ్చే విషయమే. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విధించిన ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ బుధవారం అతడు కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ విచారణలో 34 ఏళ్ల కేరళ స్పీడ్‌స్టర్‌కు హైకోర్టు సాంత్వన కలిగించింది. వెంటనే అతడిపై ఉన్న జీవితకాల నిషేధాన్ని ఎత్తేయాల్సిందిగా బీసీసీఐకి కోర్టు నోటీస్ పంపింది. 2013లో జరిగిన ఐపీఎల్–6 సీజన్లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. గత నెల 16న శ్రీశాంత్ లీగల్ నోటీస్ పంపినా బీసీసీఐ పట్టించుకోలేదు. అయితే స్కాటిష్ క్లబ్ తరఫున లీగ్ క్రికెట్ ఆడేందుకు అతను ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతకంటే ముందుగా ఏప్రిల్‌లో జరిగే ఈ టోర్నీలో ఆడేందుకు బోర్డు నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకోవడం తప్పనిసరి. కానీ బోర్డు నుంచి స్పందన కనిపించకపోవడంతో శ్రీశాంత్ కోర్టుకెక్కాడు. -
'నాపై నిషేధం ఎత్తివేయమని ఆదేశాలివ్వండి'
కొచ్చి: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)చే జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న కేరళ పేసర్ శ్రీశాంత్ తన ప్రయత్నాల్ని ముమ్మరం చేశాడు. ఇటీవల తనపై నిషేధం ఎత్తివేయాలని బీసీసీఐ కొత్త పరిపాలన కమిటికీ లేఖ రాసిన శ్రీశాంత్ కు అక్కడ నిరాశే ఎదురుకావడంతో తాజాగా కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేరళ హైకోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. స్కాట్లాండ్ లీగ్ తరపున ఆడేందుకు శ్రీశాంత్ ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో అతనికి క్లియరెన్స్ లభించాల్సి ఉంది. ఏప్రిల్ తొలి వారంలో స్కాట్లాండ్ ప్రీమియర్ లీగ్ ఆరంభం కానున్నతరుణంలో తనకు ఎన్ఓసీ కావాలంటూ బీసీసీఐకి శ్రీశాంత్ విన్నవించాడు. అయితే దీనికి బీసీసీఐ నిరాకరించడంతో శ్రీశాంత్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాడు. దీనిలో భాగంగా కేరళ హైకోర్టును శ్రీశాంత్ ఆశ్రయించాడు. 2013లో శ్రీశాంత్ పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో అతనిపై జీవితకాలం నిషేధం విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే 2015లో అతడు ఏ తప్పు చేయలేదంటూ ఢిల్లీ కోర్టులో క్లీన్చిట్ లభించింది. కాగా, అతనికి కోర్టు నుంచి క్లీన్ చిట్ లభించినా,బీసీసీఐ పెద్దలు మాత్రం అతనిపై నిషేధాన్ని కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా పలుమార్లు బీసీసీఐకి శ్రీశాంత్ విజ్ఞప్తి చేసి విఫలమయ్యాడు. కొన్ని రోజుల క్రితం బీసీసీఐ పాలన వ్యవహారాలను చూస్తున్న వినోద్ రాయ్ కు శ్రీశాంత్ ఓ లేఖ రాసినా ఉపయోగం లేకుండా పోయింది. దాంతో శ్రీశాంత్ కోర్టు మెట్లెక్కాడు. -
నిషేధం తొలగించండి
కొచ్చి: బీసీసీఐచే జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న పేసర్ శ్రీశాంత్ తిరిగి క్రికెట్ మైదానంలో అడుగుపెట్టేందుకు తన ప్రయత్నాలను మానుకోవడం లేదు. ఇటీవలే స్కాట్లాండ్ క్రికెట్ లీగ్‌లో ఆడేందుకు బోర్డు అతడికి ఎన్వోసీ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ఇప్పటికే నాలుగేళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నానని, తగిన న్యాయం చేయాల్సిందిగా ప్రస్తుత పరిపాలక కమిటీని పర్యవేక్షిస్తున్న వినోద్ రాయ్‌కు శ్రీశాంత్ లేఖ రాశాడు. 2013లో జరిగిన ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయినా ఢిల్లీ పోలీసులచే క్లీన్చిట్ పొందానని, అయినా గత బోర్డు పెద్దలు ఇంకా తనపై కక్ష సాధిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందాడు. దీంతో గతంలో చాలాకాలం కేరళలో ఐఏఎస్‌గా పనిచేసిన వినోద్ రాయ్ జోక్యం కోసం శ్రీశాంత్ ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడా విఫలమైతే తనపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాల్సిందిగా కోర్టుకెక్కే ఆలోచనలో ఉన్నాడు. -
నేనేమైనా వెధవనా?: శ్రీశాంత్
తిరువనంతపురం:తనను స్కాట్లాండ్ క్రికెట్ లీగ్ లో ఆడకుండా అడ్డుకున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవిత కాల నిషేధం ఎదుర్కొంటున్న మాజీ బౌలర్ శ్రీశాంత్ తీవ్రంగా ధ్వజమెత్తాడు. అసలు తన జీవితకాల నిషేధంపై ఎటువంటి అధికారికి పత్రం ఇవ్వని బీసీసీఐ.. ఏ రకంగా తనను క్రికెట్ ఆడకుండా అడ్డుకుంటుందని శ్రీశాంత్ విమర్శించాడు. అసలు తనను క్రికెట్ ఆడకుండా అడ్డుకునే అధికారం బీసీసీఐకి లేదని శ్రీశాంత్ మండిపడ్డాడు. 'నా జీవిత కాల నిషేధంపై బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక లేఖ లేదు. మరి అటువంటప్పుడు నన్ను ఆడొద్దని అంపైర్లు ఎలా అడ్డుకుంటారు. ఫిక్సింగ్ ఆరోపణలపై నేను తిహార్ జైలుకు వెళ్లినప్పుడు కేవలం సస్పెన్షన్ లెటర్ మాత్రమే ఇచ్చారు. ఆ సస్పెన్షన్ లెటర్ కూడా 90 రోజుల పాటు మాత్రమే చెల్లుతుంది. నాపై జీవితకాల నిషేధం విధిస్తూ మీడియాకు మాత్రమే బీసీసీఐ చెప్పింది. ఇప్పటివరకూ దానికి సంబంధించి ఎటువంటి అధికారిక లేఖ ఇవ్వలేదు. సుదీర్ఘకాలం క్రికెట్ ఆడకుండా ఉండటానికి నేను ఏమైనా వెధవనా?, నా పట్ల బీసీసీఐ చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది. ఉగ్రవాది తరహాలో నన్ను చూస్తుంది' అని శ్రీశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. త్వరలో ఎర్నాకుళం క్రికెట్ క్లబ్ తరపున రెండు రోజుల గేమ్ ను ఆడనున్నట్లు శ్రీశాంత్ ఈ సందర్భంగా తెలిపాడు. ఇటీవల స్కాట్లాండ్ క్రికెట్ లీగ్‌లో ఆడాలనుకున్న ఈ కేరళ స్పీడ్‌స్టర్‌కు నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) మంజూరు చేయడానికి బీసీసీఐ నిరాకరించింది. 2013 ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు తమ విచారణలో తేలిందని, అందుకే అతడిపై జీవితకాల నిషేధం విధించామని బోర్డుకు చెందిన అధికారి తెలిపారు. 2015లో ఢిల్లీ కోర్టు నుంచి అతడికి క్లీన్చిట్ లభించించింది.