లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023 సీజన్‌లో ఇండియా మహారాజా తరపున ఆడేందుకు భారత మాజీ ఆటగాళ్లు రాబిన్ ఊతప్ప, శ్రీశాంత్ సిద్దమయ్యారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ఊతప్ప ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. అదే విధంగా గతేడాది లెజెండ్స్ లీగ్ సీజన్‌లో ఊతప్ప కామేంటేటర్‌గా వ్యవహరించాడు.
"లెజెండ్స్ లీగ్ క్రికెట్ చివరి సీజన్‌లో వాఖ్యతగా వ్యవహరించినప్పడే ఈ టోర్నీలో ఆడాలని నిర్ణయించకున్నాను. ఇప్పుడు నా పాత సహచరులతో ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది" అని రాబిన్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఇక గత సీజన్‌లో భిల్వారా కింగ్స్ తరపున ఆడిన శ్రీశాంత్.. ఈ ఏడాది సీజన్‌లో ఇండియా మహారాజాకు ప్రాతినిథ్యం వహించనున్నాడు.
మరోవైపు శ్రీశాంత్ మాట్లాడుతూ.. లెజెండ్స్ లీగ్ సెకెండ్ సీజన్ అద్భుతంగా జరిగిది. ఈ టోర్నీలో పోటీ మా అంచనాలకు మించి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మరి కొంత మంది మాజీ ఆటగాళ్లు ఈ టోర్నీలో భాగం కావాలని నేను ఆశిస్తున్నాను. అయితే భారత్ తరఫున ఆడడం ఎప్పుడూ గర్వంగా భావిస్తాను అని పేర్కొన్నాడు.
చదవండి: IND vs SL: శ్రీలంకతో మూడో టీ20.. రుత్‌రాజ్‌కు నో ఛాన్స్! గిల్ వైపే మొగ్గు
Comments
Please login to add a commentAdd a comment