Robin Uthappa
-
అంబటి రాయుడు అంటే విరాట్ కోహ్లికి నచ్చేది కాదు.. రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు
టీమిండియా మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై సంచలన ఆరోపణలు చేశాడు. టీమిండియా మాజీ ఆటగాడు, ఆంధ్ర ప్లేయర్ అంబటి రాయుడు అంటే విరాట్ కోహ్లికి నచ్చేది కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ కారణంగానే రాయుడు 2019 వన్డే వరల్డ్‌కప్ జట్టు నుంచి చివరి నిమిషంలో తప్పించబడ్డాడని అన్నాడు. వరల్డ్‌కప్‌కు సంబంధించిన కిట్‌బ్యాగ్‌లు, బట్టలు, సూట్లు రాయుడు ఇంటికి చేరాయని, ఆతర్వాత కోహ్లి జోక్యం చేసుకోవడంతో రాయుడుకు వరల్డ్‌కప్ బెర్త్ దక్కలేదని బాంబు పేల్చాడు.కోహ్లికి ఎవరైనా నచ్చకపోతే జట్టులో చోటు దక్కేది కాదని అన్నాడు. టీమిండియా కెప్టెన్‌గా కోహ్లి తీసుకున్న నిర్ణయాలను ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూ సందర్భంగా ఎండగట్టాడు. అంబటి రాయుడు విషయంలో కోహ్లి చాలా అన్యాయంగా ప్రవర్తించాడని దుయ్యబట్టాడు. రాయుడుకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని వాపోయాడు. రాయుడు వరల్డ్‌కప్ జట్టులో ఉంటానని ఎన్నో కలలు కన్నాడని, అలాంటి వ్యక్తికి చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు. కాగా, 2019 వన్డే వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో అంబటి రాయుడును కాదని చివరి నిమిషంలో తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. విజయ్ శంకర్ త్రీడి ప్లేయర్ అని.. అందుకే రాయుడు స్థానంలో అతన్ని ఎంపిక చేశామని అప్పటి చీఫ్ సెలెక్టర్, తెలుగువాడు ఎంఎస్కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు. దీనిపై రాయుడు త్రీడి అద్దాలు పెట్టుకుని బహిరంగంగా తన అసంతృప్తికి వెల్లగక్కాడు.కోహ్లితో పోలిస్తే రోహిత్ గ్రేట్ లీడర్రాబిన్ ఉతప్ప కోహ్లి కెప్టెన్సీని రోహిత్ శర్మ కెప్టెన్సీతో కంపేర్ చేశాడు. కెప్టెన్‌గా నిర్ణయాలు తీసుకున్న తర్వాత వాటిని అమలు చేయడంలో కోహ్లికి రోహిత్ శర్మకు చాలా తేడా ఉందని అన్నాడు.రాయుడుకు జరిగినట్టే 2024 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు ముందు సంజూ శాంసన్‌కు జరిగిందని గుర్తు చేశాడు. అయితే ఆ సందర్భంలో రోహిత్ సంజూ శాంసన్ దగ్గరికి వెళ్లి అతన్ని ఎందుకు పక్కకు పెట్టాల్సి వచ్చిందో స్పష్టంగా వివరించాడని తెలిపాడు. రోహిత్ సర్ది చెప్పాక శాంసన్ ఆ విషయాన్ని పెద్దగా పట్టంచుకోలేదని పేర్కొన్నాడు. ఇలాంటి విషయాలను హ్యాండిల్ చేయడంలో కోహ్లితో పోలిస్తే రోహిత్ చాలా బెటర్ అని కొనియాడాడు.కాగా, 2024 వరల్డ్‌కప్ ఫైనల్లో సంజూ శాంసన్ ఆడాల్సి ఉండిది. అయితే చివరి నిమిషంలో శాంసన్ స్థానంలో శివమ్ దూబే తుది జట్టులోకి వచ్చాడు. ఫైనల్ మ్యాచ్ టాస్ తర్వాత రోహిత్ శాంసన్ దగ్గరికి పర్సనల్‌గా వెళ్లి అతన్ని ఎందుకు పక్కకు పెట్టాల్సి వచ్చిందో వివరించాడు. రోహిత్ వివరణ తర్వాత శాంసన్ కామ్ అయిపోయాడు. ఈ విషయంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.యువరాజ్ సింగ్ కెరీర్ ముగియడానికి కూడా కోహ్లినే కారణం..!రాయుడు విషయాన్ని ప్రస్తావించడానికి ముందు ఉతప్ప కోహ్లికి వ్యతిరేకంగా సంచలన ఆరోపణలు చేశాడు. సిక్సర్ల వీరుడు, వన్డే, టీ20 వరల్డ్‌కప్ విన్నర్ యువరాజ్ సింగ్ కెరీర్ అర్దంతరంగా ముగిసిపోవడానికి కూడా కోహ్లినే కారణమని అన్నాడు. క్యాన్సర్‌పై విజయం సాధించిన అనంతరం యువరాజ్ కోహ్లి కోరుకున్నట్లు ఫిట్నెస్ సాధించలేకపోయాడని.. ఈ కారణంగానే కోహ్లి యువరాజ్‌కు మెల్లమెల్లగా చెక్ పెట్టాడని వ్యాఖ్యానించాడు. -
'కోహ్లి వల్లే యువీ రిటైర్మెంట్'.. ఉతప్ప సంచలన వ్యాఖ్యలు
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట కోహ్లి(Virat Kohli)పై మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఉతప్ప(Robin Uthappa) సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) తన అంతర్జాతీయ కెరీర్‌ను ముందుగానే ముగించడానికి విరాట్ కోహ్లినే కారణమని ఉతప్ప ఆరోపించాడు.అదేవిధంగా యువరాజ్ క్యాన్సర్‌తో పోరాడి తిరిగి ఎలా కమ్‌బ్యాక్ ఇచ్చాడో ఓ ఇంటర్వ్యూలో రాబిన్ వివరించాడు. కానీ రీ ఎంట్రీలో యువీకి అప్పటి కెప్టెన్‌గా ఉన్న కోహ్లి నుంచి ఎటువంటి సపోర్ట్ లభించలేదని ఈ కర్ణాటక మాజీ క్రికెటర్ వెల్లడించాడు."యువరాజ్ భాయ్ జర్నీ ఎంతో మంది యువ క్రికెటర్లకు స్పూర్తిదాయకం. అతడు ఏకంగా క్యాన్సర్‌ను జయించి, తిరిగి అంతర్జాతీయ క్రికెట్ వైపు రావడానికి ప్రయత్నించాడు. భారత్‌కు ఒంటి చేత్తో వరల్డ్‌కప్ అందించిన వ్యక్తి. అంతేకాకుండా తన కెరీర్లో రెండు ప్రపంచకప్‌లను సొంతం చేసుకున్నాడు. అటువంటి ఆటగాడికి మనం చాలా గౌరవం ఇవ్వాలి. కానీ విరాట్ కోహ్లి నుంచి మాత్రం అతడికి ఎటువంటి మద్దతు లభించలేదు.కెప్టెన్ అయ్యాక కోహ్లి మారిపోయాడు. యువీ ఎలాంటి గడ్డు పరిస్థితుల నుంచి కోలుకున్నాడో దగ్గరుండి చూసిన వ్యక్తులలో కోహ్లి ఒకడు. అలాంటిది ఫిట్నెస్ లేదని యువీని పక్కన పెట్టడం సరికాదు. నాకు ఈ విషయాలు ఎవరూ చెప్పలేదు. నేను అన్ని విషయాలను గమనించాను. కెప్టెన్‌గా ఫిట్నెస్ లెవల్స్‌ను పరిగణలోకి తీసుకోవడాన్ని నేను తప్పుబట్టడం లేదు.కానీ ప్రతీ రూల్‌కు కొన్ని మినహాయింపులు ఉంటాయి. తను సాధించిన విజయాలకు కాదు, క్యాన్సర్‌ను ఓడించినందుకైనా యువీని జట్టులో కొనసాగించాల్సింది. ఆ సమయంలో అతడు నిజంగా కష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా యువీ ఫిట్నెస్ టెస్టులో రెండు పాయింట్లు తనకు తగ్గించమని కూడా అభ్యర్ధించాడు. అందుకు కూడా జట్టు మేనెజ్మెంట్ సానుకూలంగా స్పందించలేదు. దీంతో అతడు ఫిట్నెస్ టెస్టులో ఫెయిల్ అయ్యాడు. ఫిట్నెస్ పరీక్షలో విఫలమకావడంతో జట్టులోకి తీసుకోలేదు. ఆ తర్వాత ఏదో విధంగా ఫిట్నెస్ టెస్టును క్లియర్ చేసి జట్టులోకి వచ్చాడు. కానీ పేలవ ఫామ్‌ను కలిగి ఉన్నాడని పూర్తిగా పక్కన పెట్టేశారు. కనీసం ఆ తర్వాత అయినా అతడికి ఛాన్స్ ఇవ్వలేదు. విరాట్ కోహ్లి సైతం యువీని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నించలేదు. దీంతో అతడు తన కెరీర్‌ను ముగించాడు" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.కాగా 2000లో టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యువరాజ్.. తన కెరీర్లో మొత్తంగా 402 మ్యాచ్‌లు ఆడాడు. 402 మ్యాచ్‌ల్లో ఈ పంజాబ్ ఆటగాడు 11,778 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి. 2007, 2011 వన్డే ప్రపంచకప్‌లను భారత్ సొంతం చేసుకోవడంలో యువీది కీలక పాత్ర.చదవండి: 'డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి'.. భజ్జీ పోస్ట్ వైరల్ -
రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ
టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప చిక్కుల్లో పడ్డాడు. ఎంప్లాయి ప్రొవిడెంట్ ఫంఢ్(EPF) నిధుల మళ్లింపు కేసులో ఇరుక్కున్నాడు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బెంగళూరులో ఉన్న సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఊతప్ప డైరెక్టర్‌గా ఉన్నాడు.రూ. 23 లక్షల మేర మోసం?అయితే, ఈ కంపెనీ ఉద్యోగుల జీతం నుంచి పీఎఫ్ రూపంలో కట్ చేసిన రూ. 23 లక్షలను తిరిగి డిపాజిట్ చేయలేదు. ఈ విషయం తమ దృష్టికి రావడంతో ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్, రికవరీ ఆఫీసర్ అయిన శదక్షర గోపాలరెడ్డి చర్యలు చేపట్టారు. ఊతప్పపై అరెంస్ట్ వారెంట్ జారీ చేయాల్సిందిగా డిసెంబరు 4న తూర్పు బెంగళూరులోని పులకేశ్నగర్ పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు.అయితే, ప్రస్తుతం రాబిన్ ఊతప్ప తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కేఎర్ పురం చిరునామాలో అతడు లేకపోవడంతో తాము ఊతప్పను అరెస్ట్ చేయలేకపోయినట్లు సంబంధిత పోలీస్ ఆఫీసర్ తెలిపారు. ప్రస్తుతం అతడు తమ స్టేషన్ పరిధిలో లేడన్న విషయాన్ని పీఎఫ్ ఆఫీస్ వర్గాలకు తెలియజేశామన్నారు.దుబాయ్‌కు మకాం మార్చిన ఊతప్పకాగా రాబిన్ ఊతప్ప పులకేశినగర్‌లోని వీలర్ రోడ్లో గల అపార్టుమెంట్లో నివాసం ఉండేవాడు. అయితే, ఏడాది క్రితమే ఆ ఫ్లాట్‌ను ఖాళీ చేసినట్లు సమాచారం. ఇక పీఎఫ్ ఫ్రాడ్ కేసులో రాబిన్ ఊతప్పపై ఇంతవరకు అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సీనియర్ పోలీస్ ఆఫీసర్ చెప్పినట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది.కర్ణాటకకు చెందిన రాబిన్ ఊతప్ప 2006- 2015 మధ్య టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తన అంతర్జాతీయ కెరీర్లో 46 వన్డేలు, 13 టీ20 ఆడి.. ఆయా ఫార్మాట్లలో 934, 249 పరుగులు చేశాడు. ఐపీఎల్లో 205 మ్యాచ్‌లు ఆడి 4952 రన్స్ సాధించాడు. కాగా రాబిన్ ఊతప్ప ఇటీవల జరిగిన హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. చదవండి: శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర శతకం.. శివం దూబే మెరుపు ఇన్నింగ్స్ -
సానియా మీర్జా బెస్ట్ ఫ్రెండ్.. టీమిండియా మాజీ క్రికెటర్ భార్య.. ‘మాయచేసే’ విద్య (ఫొటోలు)
-
ఇషాన్ కాదు!.. అత్యధిక ధరకు అమ్ముడుపోయే వికెట్ కీపర్లు వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే నిర్ణయించింది. రెండురోజుల పాటు ఈ వేలం పాట జరుగనుండగా.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ నవంబరు 24, 25 తేదీల్లో ఖరారు చేసింది.ఇక ఈసారి వేలంలో టీమిండియా స్టార్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ తదితరులు హైలెట్‌గా నిలవనున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు ఎవరు ఎంత ధర పలుకుతారనే అంశం మీద తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.ఈ క్రమంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయే వికెట్ కీపర్లు వీరేనంటూ ఐదుగురి పేర్లు చెప్పాడు. అయితే, ఇందులో మాత్రం ఇషాన్ కిషన్‌కు చోటు దక్కలేదు.కాగా వేలానికి ముందే వికెట్ కీపర్లు భారీ ధర పలికిన విషయం తెలిసిందే. అదేనండీ రిటెన్షన్స్‌లో భాగంగా వికెట్ కీపర్ బ్యాటర్లకు ఆయా ఫ్రాంఛైజీలు భారీ మొత్తం ముట్టజెప్పాయి. అతడికి ఏకంగా రూ. 23 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ హెన్రిచ్ క్లాసెన్ కోసం రూ. 23 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ నికోలస్ పూరన్ కోసం రూ. 21 కోట్లు, రాజస్తాన్ రాయల్స్ సంజూ శాంసన్ కోసం రూ. 18 కోట్లు, ధ్రువ్ జురెల్ కోసం రూ. 14 కోట్లు ఖర్చు చేశాయి.ఆ ఐదుగురికే అధిక ధరఈ నేపథ్యంలో రాబిన్ ఊతప్ప స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ఈసారి వికెట్ కీపర్ల కోటాలో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, జోస్ బట్లర్, క్వింటన్ డికాక్, ఫిల్ సాల్ట్ అత్యధిక మొత్తానికి అమ్ముడుపోతారని అంచనా వేశాడు. ముఖ్యంగా కేఎల్ రాహుల్‌ను సొంతం చేసుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కచ్చితంగా ఇతర ఫ్రాంఛైజీలతో పోటీకి వస్తుందని అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ కూడా కేఎల్ వైపు చూసే అవకాశం లేకపోలేదని ఊతప్ప చెప్పుకొచ్చాడు.చదవండి: టాలెంటెడ్ కిడ్.. ఇక్కడ కూడా.. : నితీశ్ రెడ్డిపై కమిన్స్ కామెంట్స్ -
అతడికి రూ. 25- 28 కోట్లు.. ఆ ఫ్రాంఛైజీ సొంతం చేసుకోవడం ఖాయం!
ఐపీఎల్-2025 మెగా వేలంలో రిషభ్ పంత్ భారీ ధర పలకడం ఖాయమని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. ఈ వికెట్ కీపర్ కోసం ఫ్రాంఛైజీలు ఎగబడటం ఖాయమని.. లీగ్ చరిత్రలో అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ నిలుస్తాడని అంచనా వేశాడు.రూ. 25- 28 కోట్ల రూపాయలు కొల్లగొట్టబోతున్నాడుపంజాబ్ కింగ్స్ పంత్‌ను సొంతం చేసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించవచ్చన్న ఊతప్ప.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా పంత్ కోసం పోటీపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా పంత్ వైపు మొగ్గుచూపుతాయని అంచనా వేసిన ఊతప్ప.. ఏదేమైనా ఈసారి అతడు వేలంలో రూ. 25- 28 కోట్ల రూపాయలు కొల్లగొట్టబోతున్నాడని జోస్యం చెప్పాడు.కాగా ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా గతేడాది ఐపీఎల్‌కు దూరమైన పంత్.. కోలుకున్న తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్-2024లో 446 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్.. సారథిగా మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. పంత్ కెప్టెన్సీ ఢిల్లీ ఈసారి పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఏడు గెలిచి.. 14 పాయింట్లతో పట్టికలో ఆరోస్థానంలో నిలిచింది.ఈ నేపథ్యంలో మెగా వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంఛైజీ రిషభ్ పంత్‌ను రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఓ క్రీడా చానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న భారత దిగ్గజం సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి తీసుకునే అవకాశముందని సూచనప్రాయంగా వెల్లడించాడు. ‘ఆటగాళ్ల వేలం ప్రక్రియ పూర్తిగా భిన్నమైంది. అది ఎలా సాగుతుందో ఎవరూ చెప్పలేరు. ఊహించలేరు.కానీ నా అంచనా ప్రకారం పంత్‌ను ఢిల్లీ మళ్లీ తమ జట్టులోకి తీసుకోవచ్చు. ఆటగాళ్ల రిటెన్షన్ అనేది సదరు ప్లేయర్‌కు, ఫ్రాంచైజీ యాజమాన్యానికి సంబంధించిన వ్యవహారం. తాను ఆశించినంత ధర రాకపోతే ఆ ఆటగాడు... తాము చెల్లించే ధరకు ఆడకపోతే ఫ్రాంచైజీ నిర్ణయాలకు విభేదించే జట్లను వీడతారు. పంత్ విషయంలోనూ ఇదే జరిగి ఉంటుందని నేను భావిస్తున్నా. రిటెన్షన్ కుదరకపోయినా... పంత్‌లాంటి కెప్టెన్ అవసరం ఢిల్లీకే ఉంది. అతను లేకపోతే ఫ్రాంచైజీ కొత్త సారథి వేటలో పడాలి. నా అంచనా ప్రకారం ఢిల్లీ కచ్చితంగా పంత్‌ను తీసుకుంటుంది’ అని అభిప్రాయపడ్డారు.అయితే, పంత్ మాత్రం గావస్కర్ వ్యాఖ్యలను కొట్టిపారేశాడు. ఢిల్లీతో కొనసాగకపోవడానికి డబ్బు మాత్రం కారణం కానే కాదని పంత్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే.. పంత్ మెగా వేలానికి అందుబాటులోకి రావడంతో ఫ్రాంచైజీలన్నీ అతడిపై కన్నేశాయి. రూ.24.75 కో ట్లతో రికార్డుఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు రాబిన్ ఊతప్ప సహా ఆకాశ్ చోప్రా, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు పంత్‌కు ఈసారి కళ్లు చెదిరే మొత్తం దక్కుతుందని.. పంజాబ్ కింగ్స్ పంత్‌ను దక్కించుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.ఇదిలా ఉంటే.. క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2024 మినీ వేలంలో అతడి కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏకంగా రూ.24.75 కోట్లు వెచ్చించింది. ఈ క్రమంలో సీజన్ ఆరంభంలో నిరాశపరిచినా.. ఆ తర్వాత విజృంభించిన స్టార్క్.. జట్టును చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు.అయితే, మెగా వేలానికి ముందు కోల్‌కతా స్టార్క్‌తో పాటు తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను విడుదల చేసింది. ఇక పంత్‌తో పాటు అయ్యర్, కేఎల్ రాహుల్ రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలో తమ పేరు నమోదు చేసుకున్నారు. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో నవంబరు 24, 25 తేదీల్లో వేలంపాట జరుగనుంది. -
ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు.. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ! వీడియో వైరల్
హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్లో టీమిండియా కెప్టెన్ రాబిన్ ఉతప్పకు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన ఉతప్ప.. తన ఓవర్లో ఏకంగా 6 సిక్స్‌లు సమర్పించుకున్నాడు.ఇంగ్లండ్ కెప్టెన్ రవి బొపారా ఉతప్ప బౌలింగ్‌ను ఊతికారేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 4 ఓవర్ వేసిన ఉతప్ప బౌలింగ్‌లో బొపారా వరుసగా 6 సిక్స్‌లు బాది ఔరా అన్పించాడు. ఆ ఓవర్లో మొత్తం ఆరు డెలివరీలను లాంగాఫ్, లాంగాన్, డీప్ మిడ్ వికెట్ల దిశగా బొపారా సిక్సర్లగా మలిచాడు. 6 సిక్స్‌లతో పాటు ఊతప్ప ఓ వైడ్ కూడా వేయడంతో ఆ ఓవర్లో ఏకంగా 37 పరుగులు వచ్చాయి.బొపారా విధ్వంసకర ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ క్రమంలో బొపారా కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని అందుకున్నాడు. 14 బంతుల్లో 8 సిక్స్‌లతో 53 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్‌గా అతడు వెనుదిరిగాడు.టీమిండియా మరో ఓటమి..ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బొపారాతో పాటు సమిత్ పటేల్(18 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఆ ఒక్క వికెట్ కూడా రనౌట్ రూపంలో టీమిండియాకు లభించింది. అనంతరం లక్ష్య చేధనలో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 105 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా 15 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. భారత బ్యాటర్లలో కేదార్ జాదవ్(15 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 48 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా ఈ టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కావగడం గమనార్హం.చదవండి: IND vs NZ: 'అదొక చెత్త నిర్ణయం.. రోహిత్, గంభీర్‌కు కొంచెం కూడా తెలివి లేదు' -
టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క పరుగు తేడాతో ఓటమి
హాంకాంగ్ సిక్సస్ టోర్నీలో టీమిండియా ఓటముల పరంపర కొనసాగుతుంది. తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌పై ఓటమి చవిచూసిన భారత జట్టు.. తాజాగా యూఏఈతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియాకు అదృష్టం కలిసిరాలేదు. భారత స్టార్ ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ విరోచిత పోరాటం చేసినప్పటకి తమ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 32 పరుగులు అవసరమవ్వగా.. స్టువర్ట్ బిన్నీ వరుసగా 4, వైడ్, 6, 6, 6, 6, 1 బాదాడు. చివరి బంతికి బిన్నీ అనుహ్యంగా రనౌట్ కావడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో 131 పరుగుల లక్ష్య చేధనలో టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 129 పరుగుల వద్ద అగిపోయింది. భారత బ్యాటర్లలో స్టువర్ట్ బిన్నీ(11 బంతుల్లో 44, 3 ఫోర్లు, 5 సిక్స్‌లు)తో పాటు కెప్టెన్ రాబిన్ ఉతప్ప (10 బంతుల్లో 43) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.యూఏఈ ఇన్నింగ్స్‌లో ఖలీద్ షా(42), జహూర్ ఖాన్(37)లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. భారత్ బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ మూడు వికెట్లు పడగొట్టగా.. భరత్ చిప్లి, షెహ్బాజ్ నదీమ్‌కు చెరో వికెట్ దక్కింది. కాగా ఏడేళ్ల తర్వాత మళ్లీ మొదలైన ఈ హాంకాంగ్ క్రికెట్ సిక్సస్ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. ప్రతీ జట్టులో కేవలం ఆరుగురు ప్లేయర్లే మాత్రమే ఉంటారు. India needed 32 in 6 balls:Stuart Binny - 4,WD,6,6,6,6,1. India lost by just 1 run. 💔 pic.twitter.com/qyhKWWyqe6— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2024 -
Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమి
హాంగ్‌కాంగ్ క్రికెట్ సిక్సర్స్ టోర్నీలో భారత్‌కు శుభారంభం లభించలేదు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా రాబిన్ ఊతప్ప సేనకు ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదురైంది.కాగా 1992లో మొదటిసారిగా హాంకాంగ్ క్రికెట్ సిక్సర్స్ టోర్నీ నిర్వహించగా.. 2017 వరకు కొనసాగింది. అయితే, ఆ తర్వాత వివిధ కారణాల వల్ల 2023 వరకు బ్రేక్ పడగా.. ఈ ఏడాది తిరిగి మళ్లీ మొదలైంది. ఇండియా, సౌతాఫ్రికా, ఆతిథ్య హాంగ్‌కాంగ్, న్యూజిలాండ్, నేపాల్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, యూఏఈ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఒమన్ తదితర 12 జట్లు ఈసారి పోటీలో దిగాయి.భారత బ్యాటర్ల విధ్వంసంఈ క్రమంలో శుక్రవారం టోర్నీ ఆరంభం కాగా.. ఇండియా తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడింది. రాబిన్ ఊతప్ప కెప్టెన్సీలోని భారత జట్టు.. నిర్ణీత ఆరు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. కెప్టెన్ ఊతప్పతో పాటు.. భరత్ చిప్లీ రాణించాడు. ఊతప్ప ఎనిమిది బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేయగా.. భరత్ చిప్లీ 16 బంతుల్లోనే 53 రన్స్ చేశాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నందున నిబంధనల ప్రకారం రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.తప్పని ఓటమిఅయితే, టీమిండియా విధించిన లక్ష్యాన్ని పాకిస్తాన్ సులువుగానే ఛేదించింది. ఆసిఫ్ అలీ 14 బంతుల్లో 55 పరుగులు చేయగా.. మహ్మద్ అఖ్లాక్ 12 బంతుల్లోనే 40 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరికి తోడుగా కెప్టెన్ ఫహిమ్ ఆష్రఫ్ 5 బంతుల్లోనే 22 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఎక్స్ట్రా రూపంలో నాలుగు పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ భారత జట్టుపై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.భారత్: రాబిన్ ఊతప్ప (కెప్టెన్), కేదార్ జాదవ్, మనోజ్ తివారీ, స్టువర్ట్ బిన్నీ, శ్రీవత్స్ గోస్వామి, భరత్ చిప్లీ, షాబాజ్ నదీమ్.పాకిస్తాన్:ఫహీమ్ అష్రఫ్ (కెప్టెన్), మహ్మద్ అఖ్లాక్, ఆసిఫ్ అలీ, డానిష్ అజీజ్, హుస్సేన్ తలాత్, అమీర్ యామిన్, షహబ్ ఖాన్.స్కోర్లు: భారత్- 119/2పాకిస్తాన్- 121/0ఫలితం: భారత్‌పై ఆరు వికెట్ల తేడాతో పాక్ విజయం Bharat Chipli chipped in with a cracking 53 off 16 before he had to retire out according to the #HongKongSixes rules. 💪#HongKongSixesonFanCode #ItsRainingSixes pic.twitter.com/IlePJhuPbP— FanCode (@FanCode) November 1, 2024Simply Sublime by Robin Uthappa 🤌Captain Robin got Team India off to a flying start, scoring 31 off 8 balls!#HongKongSixesonFanCode #ItsRainingSixes pic.twitter.com/BZVA5KUuP5— FanCode (@FanCode) November 1, 2024 -
భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రాబిన్ ఉతప్ప
హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్ మళ్లీ అభిమానులను అలరించేందుకు సిద్దమైంది. సుమారు ఏడేళ్ల తర్వాత ఈ టోర్నీని మళ్లీ నిర్వహించనున్నారు. నవంబర్ 1 నుండి 3 వరకు టిన్ క్వాంగ్ రోడ్ రిక్రియేషన్ గ్రౌండ్లో జరగనుంది. 2024 హాంకాంగ్ సిక్సెస్ ఈవెంట్లో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, హాంకాంగ్, నేపాల్, ఒమన్, యూఏఈ జట్లు భాగం కానున్నాయి. తాజాగా ఈ టోర్నీ కోసం ఏడుగురు సభ్యులతో కూడా భారత జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతడితో పాటు మాజీలు కేదార్ జాదవ్, మనోజ్ తివారీ, షాబాజ్ నదీమ్, శ్రీవత్సవ గోస్వామి, స్టువర్ట్ బిన్నీ, భరత్ చిప్లీలకు చోటు దక్కింది.అసలేంటి హాంకాంగ్ సిక్సెస్?1992లో హాంకాంగ్ క్రికెట్ ఆధ్వర్యంలో మొదలైన హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ.. చివరగా 2017 వరకు జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఈ టోర్నీని నిర్వహించలేదు. అయితే ఈ ఈవెంట్‌కు మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు హాంకాంగ్ క్రికెట్ ముందుకు వచ్చింది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు అత్యధికంగా 5 సార్లు ఈ టోర్నమెంట్ విజేతలగా నిలవగా.. పాకిస్తాన్ 4 సార్లు ఈ హాంకాంగ్ సిక్సెస్ ట్రోఫీని ముద్దాడింది. భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక, విండీస్ జట్లు చెరో ఒక్కసారి ఛాంపియన్స్‌గా నిలిచాయి. గతంలో ఈ టోర్నీలో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం ఆడారు.రూల్స్ ఇవే..ఒక మ్యాచ్‌లో ప్రతీ జట్టు 5 ఓవర్లు మాత్రమే ఆడుతోంది. మ్యాచ్ ఆడే రెండు జట్లలో ఆరుగురు ఆటగాళ్లు ఉండాలి. గ్రూప్ దశలో ఒక్కో ఓవర్‌కు ఆరు బంతులు ఉంటాయి. అదే ఫైనల్లో ఒక్కో ఓవర్లో ఎనిమిది బంతులు ఉంటాయి. . వికెట్ కీపర్ మినహా జట్టులోని ప్రతి ఒక్కరు ఒక్కో ఓవర్ వేయాల్సి ఉంటుంది. ఒక్కో వైడ్, నోబాల్‌కు రెండు పరుగులు వస్తాయి. ఒక వేళ ఐదు వికెట్లు పడితే ఇన్నింగ్స్‌ను ముగిసినట్లు కాదు. వన్ సైడ్ బ్యాటర్ కూడా బ్యాటింగ్ చేయవచ్చు. అదేవిధంగా 31 పరుగులు చేసిన బ్యాటర్ రిటైర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ ఆఖరిలో బ్యాటింగ్ వచ్చే అవకాశముంటుంది.చదవండి: LLC 2024: క్రిస్ గేల్ ఊచకోత.. ధావన్ మెరుపులు (వీడియో) -
T10 League: ఊతప్ప ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే!
నేషనల్ క్రికెట్ టీ10 లీగ్-2024లో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 27 బాల్స్ ఎదుర్కొని ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 66 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడి స్ట్రైక్‌రేటు 244.44గా నమోదైంది.చికాగో జట్టుకు కెప్టెన్గాఅమెరికా వేదికగా జరుగుతున్న ఈ టీ10 లీగ్‌లో యాక్టివ్ క్రికెటర్లతో పాటు రిటైర్డ్ ప్లేయర్లు కూడా పాల్గొంటున్నారు. టైటిల్ కోసం ఆరు జట్లు పోటీపడుతున్న ఈ పొట్టి లీగ్‌లో రాబిన్ ఊతప్ప చికాగో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం టెక్సాస్ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా పరుగుల వర్షం కురిపించాడు.క్రిస్ లిన్ ధనాధన్ ఇన్నింగ్స్ఓపెనర్గా బరిలోకి దిగిన ఊతప్ప ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. మరో ఓపెనర్ క్రిస్ లిన్ సైతం 23 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో 60 పరుగలోత అజేయంగా నిలిచాడు. వీరితో పాటు మైక్ లూయీస్ 10 బంతుల్లోనే 34 రన్స్‌తో నాటౌట్‌గా నిలవగా.. నిర్ణీత 10 ఓవర్లలో చికాగో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. 41 పరుగుల తేడాతో జయభేరిలక్ష్య ఛేదనలో టెక్సాస్ గ్లాడియేటర్‌కు డేవిడ్ మలన్ శుభారంభమే అందించాడు. 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. మిగిలిన వాళ్లలో జేమ్స్ ఫుల్లర్ 13 బంతుల్లో 37 పరుగులతో మెరవగా.. ఇతరుల నుంచి సహకారం లభించలేదు. దీంతో పది ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి టెక్సాస్ కేవలం 132 పరుగులే చేయగలిగింది. ఫలితంగా చికాగో 41 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.అమెరికా నేషనల్ క్రికెట్ టీ10లీగ్‌లో ఆరుజట్లున్యూయార్క్ లయన్స్, టెక్సాస్ గ్లాడియేటర్స్, చికాగో సీసీ, డల్లాస్ లోన్స్టార్స్, లాస్ ఏంజెలిస్ వేవ్స్, అట్లాంటా కింగ్స్. టీమిండియా మాజీ క్రికెటర్లలో సురేశ్ రైనా న్యూయార్క్‌కు సారథిగా ఉండగా.. చికాగోకు ఊతప్ప నాయకుడు. మిగిలిన జట్లలో టెక్సాస్‌కు షాహిద్ ఆఫ్రిది, డల్లాస్‌కు దినేశ్ కార్తిక్, లాస్ ఏంజెలిస్‌కు షకీబ్ అల్ హసన్, అట్లాంటాకు ఏంజెలో మాథ్యూస్ కెప్టెన్లుగా ఉన్నారు.చదవండి: జైశంకర్‌తో భేటీ కానున్న పీసీబీ చీఫ్?.. టీమిండియా ఇక్కడకు రావాల్సిందే!Begin your morning with some sumptuous Robin Uthappa sixes! 🫶Uthappa and Lynn got Chicago off to a flying start by putting on 112 from just 38 balls.🔥#NCLonFanCode pic.twitter.com/gLVq6E5H4v— FanCode (@FanCode) October 8, 2024 -
నరకప్రాయం.. నాకే ఎందుకిలా అనే భావన : ఊతప్ప
ఒకానొక దశలో తాను కూడా తీవ్రమైన ఒత్తిడితో సతమతమయ్యానని టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తెలిపాడు. నిరాశ నిస్పృహలో కూరుకుపోయి.. అసలు ఎందుకు బతికి ఉన్నానో తెలియని మానసిక స్థితిలోకి వెళ్లిపోయానన్నాడు. దాదాపు ఏడాది పాటు తన ముఖాన్ని అద్దంలో చూసుకునేందుకు కూడా భయపడిపోయానంటూ 2011 నాటి తన దుస్థితిని వివరించాడు.కాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహమ్ థోర్ప్ ఇటీవల హఠాన్మరణం చెందిన విషయం విదితమే. అయితే, అతడిది సహజ మరణం కాదని.. బలవన్మరణానికి పాల్పడ్డాడని గ్రాహమ్ భార్య అమెండా వెల్లడించారు. ఒత్తిడిని తట్టుకోలేకే ప్రాణాలు తీసుకున్నాడంటూ ఉద్వేగానికి లోనయ్యారు.డిప్రెషన్.. నరకప్రాయం ఈ నేపథ్యంలో రాబిన్ ఊతప్ప తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. డిప్రెషన్, దాని వల్ల ఎదురయ్యే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో వివరించే ప్రయత్నం చేశాడు. కారణం లేకుండానే తీవ్రమైన ఒత్తిడికి లోనుకావడం నరకప్రాయంగా ఉంటుందని తెలిపాడు. అంతబాగానే ఉన్నా మనల్ని ప్రేమిస్తున్న వారికి భారంగా మారామనే ఆలోచన కుంగిపోయేలా చేస్తుందని వాపోయాడు.అయితే, ఇలాంటి సమయంలో బలహీనపడకుండా కాస్త స్థిమితంగా ఉంటే.. మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు.. మనల్ని ప్రేమించే వాళ్లకూ గుండెకోత లేకుండా చేయగలమని ఊతప్ప పేర్కొన్నాడు. తన జీవితంలోని చేదు అనుభవాలు గుర్తు చేసుకుంటూ.. ‘‘2011... అసలు నేను ఎందుకు మనిషి జన్మ ఎత్తానా? అనే భావనలో ఉండిపోయేవాడిని. నన్ను నేను అద్దంలో చూసుకోవడానికి కూడా ఇష్టపడే వాడిని కాదు.అద్దం చూడలేదుఆ ఏడాదంతా అస్సలు అద్దం వైపే చూడలేదు. నా ఉనికి నా చుట్టూ ఉన్నవాళ్లకు భరించలేనిదిగా మారిందేమోనని సతమతమయ్యేవాడిని. నాకసలు విలువ లేదని అనిపించేది. నిస్సహాయత, నిరాశలో కూరుకుపోయాను. వారాలు.. నెలల.. సంవత్సరాల పాటు నా గదికే పరిమితమైతే బాగుంటుందని అనుకునేవాడిని.త్వరలోనే కష్టకాలం ముగిసిపోతుందిఅయినా.. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బాధ ఒక్కరోజు ఉంటుందేమో!.. ఆ మరుసటి రోజు బాగుండవచ్చు కదా!.. మనం సాగుతున్న దారిలో చివరికంటా వెలుగు ఉండాలని ఆశించకూడదు. మరో అడుగు ముందుకు వేయడానికి దారి కనిపిస్తే చాలనుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. అలాగే.. గడ్డుకాలం ఎల్లకాలం ఉండదు. త్వరలోనే కష్టకాలం ముగిసిపోతుంది అని అనుకుంటూ ముందుకు సాగితే మంచిది’’ అని రాబిన్ ఊతప్ప ఒత్తిడిని అధిగమించే మార్గం కూడా చెప్పాడు. కాగా 2006లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. వన్డేలు, టీ20లకే పరిమితమయ్యాడు.టీమిండియాలో రాని అవకాశాలుటీమిండియా తరఫున 46 వన్డేలు ఆడి 934, 13 టీ20లు ఆడి 249 పరుగులు చేసిన ఊతప్ప.. మొట్టమొదటి టీ20 ప్రపంచకప్-2007 గెలిచిన భారత జట్టులో సభ్యుడు. ఇంటర్నేషనల్ కెరీర్ ఆరంభించిన రెండేళ్లపాటు వరుస అవకాశాలు అందుకున్న ఈ కర్ణాటక క్రికెటర్.. 2009 నుంచి గడ్డుపరిస్థితులు ఎదుర్కొన్నాడు. జట్టులో చోటు కరువుకాగా.. 2015లో భారత్ తరఫున తన ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. అయితే, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన ఊతప్ప రెండుసార్లు టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడు.చదవండి: ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచనే లేదు.. ఒలింపిక్స్‌లో ఆడతా: స్మిత్ -
‘వాళ్లు ఆడుతుంటే గంగూలీ- సచిన్ గుర్తుకువస్తారు’
టీమిండియా టీ20 కొత్త ఓపెనింగ్ జోడీపై మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ జంటను చూస్తుంటే తనకు సౌరవ్ గంగూలీ- సచిన్ టెండుల్కర్ గుర్తుకువస్తున్నారని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ టైటిల్ విజేతగా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ ఐసీసీ టోర్నీల్లో రోహిత్- విరాట్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఫలితంగా.. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ప్రపంచకప్ ప్రధాన జట్టుకు ఎంపికైనా బెంచ్‌కే పరిమితమయ్యాడు. మరోవైపు.. భవిష్య కెప్టెన్ శుబ్‌మన్ గిల్ రిజర్వ్ ప్లేయర్లలో ఒకడిగా జట్టుతో ప్రయాణించాడు. అయితే, దిగ్గజ బ్యాటర్లు కోహ్లి- రోహిత్ రిటైర్మెంట్ తర్వాత పొట్టి ఫార్మాట్లో యశస్వి- గిల్ జోడీ ఓపెనింగ్‌కు వస్తున్నారు.వరల్డ్‌కప్ టోర్నీ తర్వాత భారత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లగా.. శుబ్‌మన్ గిల్ తొలిసారిగా టీమిండియా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో గెలిచాడు. ఈ టూర్లో యశస్వి- గిల్ ఎక్కువసార్లు ఓపెనింగ్ చేశారు. తాజాగా శ్రీలంక పర్యటనలోనూ వీరే టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించారు.టీమిండియా లంకతో టీ20 సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప సోనీ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. యశస్వి- గిల్ జోడీని గంగూలీ- సచిన్‌లతో పోల్చాడు.వాళ్లు ఆడుతుంటే గంగూలీ- సచిన్ గుర్తుకువస్తారు‘‘వీళ్లిద్దరిని చూస్తే నాకు సౌరవ్ గంగూలీ- సచిన్ టెండుల్కర్ గుర్తుకువస్తారు. వాళ్లిద్దరు ఎలా పరస్పరం అవగాహనతో ఆడేవారో.. వీరూ అలాగే చేస్తారు. తమవైన వ్యూహాలు అమలు చేస్తూనే.. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పుతారు. వీళ్లిద్దరు కలిసి బ్యాటింగ్ చేస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. ఇక జైస్వాల్ గురించి చెప్పాలంటే.. త్వరలోనే అతడు వన్డేల్లో కూడా ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలడు.టెస్టు, టీ20 క్రికెట్లో ఇప్పటికే టీమిండియా తరఫున తానేంటో నిరూపించుకున్నాడు. వన్డేల్లోనూ రాణించగలడు. పరుగులు చేయడమే పరమావధిగా ముందుకు సాగుతున్న అతడికి ఇదేమీ అసాధ్యం కాదు’’ అని రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. కాగా యశస్వి గంగూలీ మాదిరే ఎడమచేతి వాటం బ్యాటర్ కాగా.. గిల్ సచిన్‌లా రైట్‌హ్యాండ్ బ్యాటర్. -
గిల్ కంటే అతడే బెటర్.. ఇద్దరినీ ఆడిస్తే తప్పేంటి?
టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు వరుస అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత మేనేజ్మెంట్పై ఉందని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. శుబ్‌మన్ గిల్ జట్టులో ఉన్నాడనే కారణంతో రుతును పక్కనపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డాడు. గిల్‌తో పోలిస్తే రుతురాజ్ ఆటలో నిలకడ ఎక్కువని పేర్కొన్నాడు. కాబట్టి అతడిపై కూడా సెలక్టర్లు కాస్త దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికాడు.ఇద్దరికీ ఆ అర్హతస్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వారసులు కాగల అర్హత ఈ ఇద్దరికీ ఉందని ఊతప్ప పేర్కొన్నాడు. కాగా పంజాబీ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ టీమిండియా టీ20, వన్డే జట్లకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. జింబాబ్వే పర్యటనకు వెళ్లిన ద్వితీయ శ్రేణి జట్టుకు గిల్ సారథ్యం వహించాడు. కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే టీ20 సిరీస్‌ను 4-1తో గెలిచాడు.ఈ క్రమంలో టీమిండియా భవిష్య కెప్టెన్‌గా ప్రశంసలు అందుకుంటున్న గిల్‌కు శ్రీలంక పర్యటన సందర్భంగా బీసీసీఐ బంపరాఫర్ ఇచ్చింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో వైస్ కెప్టెన్‌గా అవకాశమిచ్చింది. టీ20లలో సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో రోహిత్ శర్మకు డిప్యూటీగా నియమించింది. ఇక టీ20లలో గిల్ యశస్వి జైస్వాల్‌తో పాటు ఓపెనింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.రోహిత్ శర్మ రిటైర్మెంట్ నేపథ్యంలో ఓపెనర్లుగా టీ20లలో ఈ జోడీ ఫిక్సయిపోయినట్లే!.. దీంతో రుతురాజ్ గైక్వాడ్ కెరీర్ ప్రమాదంలో పడింది. రుతు కూడా ఓపెనరే కావడంతో ఇప్పటికే జట్టులో పాతుకుపోయిన గిల్- యశస్వితో పోటీలో అతడు వెనుకబడ్డాడు. ఈ నేపథ్యంలో రాబిన్ ఊతప్ప సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ రుతురాజ్‌కు అవకాశాలు ఇవ్వాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశాడు.ఇద్దరూ మూడు ఫార్మాట్ల ఆటగాళ్లే‘‘గిల్, రుతు.. ఇద్దరూ మంచి ప్లేయర్లే. టీ20 క్రికెట్లో తమకు తామే సాటి. వారి బ్యాటింగ్ గణాంకాలే ఈ విషయాన్ని చెబుతున్నాయి. వీరిద్దరిలో ఒకరినే ఎంచుకోవాలంటే కష్టం. అయితే, ఆటలో నిలకడ పరంగా చూస్తే గిల్ కంటే రుతురాజే ముందున్నాడని చెప్పవచ్చు. ఇద్దరిలో ఒకరికే అవకాశం ఇచ్చే బదులు ఇద్దరినీ జట్టులో ఆడిస్తే తప్పేంటి. ఇద్దరూ మూడు ఫార్మాట్ల ఆటగాళ్లే. అలాంటపుడు ఇద్దరికీ సమాన అవకాశాలు ఇస్తే బాగుంటుంది’’ అని భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. అయితే, ఊతప్పతో పాటు ఈ షోలో పాల్గొన్న శ్రీలంక మాజీ క్రికెటర్ రసెల్ ఆర్నాల్డ్ మాత్రం.. తాను ఈ విషయంలో గిల్‌కే ఓటు వేస్తానని చెప్పడం విశేషం.గిల్, రుతు కెరీర్ ఇలాకాగా 2019లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన శుబ్‌మన్ గిల్.. ఇప్పటి వరకు 25 టెస్టులు, 44 వన్డేలు, 20 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 1492, 2271, 539 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో ఓ వన్డే డబుల్ సెంచరీ, ఒక టీ20 సెంచరీ ఉన్నాయి. ఇక మహారాష్ట్రకు చెందిన రుతురాజ్ గైక్వాడ్.. 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 6 వన్డే, 23 టీ20 మ్యాచ్‌లు ఆడి.. 115, 633 పరుగులు సాధించాడు. టీ20లలో రుతు కూడా శతకం బాదడం విశేషం. ఇక శ్రీలంక పర్యటనలో గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. రుతును ఈ టూర్‌కు ఎంపిక చేయలేదు సెలక్టర్లు.చదవండి: భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్న యశస్వి జైస్వాల్.. తొలి బ్యాటర్‌గా రికార్డుManu Bhaker: రూ. 2 కోట్లు ఖర్చు చేశాం.. -
నేనే గనుక హార్దిక్ స్థానంలో ఉంటే?.. ఈపాటికి..
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్‌కు కెప్టెన్సీ ఇవ్వకపోవడమే మంచిదైందని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ విజేతగా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని భావించగా.. అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్‌ను భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ప్రకటించారు. ఫిట్నెస్ సమస్యల నేపథ్యంలోనే హార్దిక్‌ను కాదని, సూర్యకు పగ్గాలు ఇచ్చినట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు.ఈ విషయంపై భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప స్పందించాడు. తాను గనుక హార్దిక్ పాండ్యా స్థానంలో ఉంటే.. ఈపాటికి సంతోషంతో ఎగిరి గంతేసేవాడినని పేర్కొన్నాడు. కెరీర్ పొడిగించుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం మరొకటి లేదని అభిప్రాయపడ్డాడు.‘‘నేను హార్దిక్ పాండ్యా స్థానంలో ఉంటే.. నా గురించి మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారని సంతోషించేవాడిని. ఎందుకంటే.. భారత క్రికెట్ ఎకోసిస్టమ్‌లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అత్యంత అరుదుగా లభించే ఆటగాడు.ఒకవేళ నాకు 34- 35 ఏళ్ల వయసు ఉండి.. తరచూ గాయాల బారిన పడుతూ ఉంటే కెరీర్ ప్రమాదంలో పడుతుంది. అదే ముందు నుంచీ జాగ్రత్తగా ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. మరికొంత కాలం ఆటలో కొనసాగవచ్చు.జాతీయ జట్టుకు సేవలు అందించవచ్చు. కాబట్టి కెప్టెన్సీకి దూరంగా ఉండమన్నా ఆనందంగా సరేనంటాను’’ అని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు. ఈ మేరకు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా జూలై 27 నుంచి టీమిండియా- శ్రీలంక మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది. ఈ పర్యటనలో టీమిండియా కొత్త కోచ్‌గా గౌతం గంభీర్ ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఇందుకోసం ఇప్పటికే భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో అడుగుపెట్టింది. ఇరు జట్ల మధ్య మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు జరుగనున్నాయి. -
చెలరేగిన ఉతప్ప.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఇండియా
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ శుభారంభం చేసింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. 166 పరుగుల లక్ష్యాన్ని ఇండియా 7 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. ఇండియా బ్యాటర్లలో రాబిన్ ఉతప్ప(32 బంతుల్లో 50 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. గుర్క్రీత్ సింగ్(33), నమన్ ఓజా(25) పరుగులతో రాణించారు. కాగా కెప్టెన్ యువరాజ్ సింగ్ మాత్రం నిరాశపరిచాడు. బౌలింగ్‌లో ఒక ఓవర్ వేసి 14 పరుగులిచ్చిన యువీ.. బ్యాటింగ్‌లోనూ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలోక్రిస్ స్కోఫీల్డ్ 4 వికెట్లు పడగొట్టగా.. రవి బపోరా రెండు వికెట్లు సాధించాడు.అంతకముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఇయాన్ బెల్(59), సమిత్ పటేల్(51) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో హార్భజన్ సింగ్ రెండు, కులకర్ణి, ఆర్పీ సింగ్ తలా వికెట్ పడగొట్టారు. -
'ఐర్లాండ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోతుంది'.. ఉతప్ప షాకింగ్ కామెంట్స్
టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ మెగా టోర్నీ సన్నాహాకాల్లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 2-0 తేడాతో పాకిస్తాన్ ఓటమి పాలైంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ రెండు మ్యాచ్‌లు గెలవగా.. మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. అయితే ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లో పాక్ విఫలమైంది. ఇక ఇంగ్లండ్ పర్యటనను ముగించుకుని పాకిస్తాన్ టీ20 వరల్డ్‌కప్ కోసం అమెరికాకు శనివారం చేరుకోనుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి భారత మాజీ ఓపెనర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో ఐర్లాండ్‌పై పాకిస్తాన్ షాకింగ్ ఓటమిని చవిచూస్తుందని ఉతప్ప జోస్యం చెప్పాడు. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ గ్రూపు-ఎలో భారత్, కెనడా, ఐర్లాండ్, అమెరికా జట్లతో కలిసి ఉంది. ఈ మెగా ఈవెంట్లో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో జూన్ 6న యూఎస్ జట్టుతో తలపడనుంది.అనంతరం జూన్ 9న భారత్, జూన్ 11న కెనడా, జూన్ 16న ఐర్లాండ్‌తో పాక్ తలపడనుంది. కాగా రబిన్ ఉతప్ప, భారత వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గోనున్నారు. "ఐర్లాండ్ చిన్న జట్టు అని తక్కువ అంచనా వేయవద్దు. ప్రత్యర్ధి జట్లను ఓడించే సత్తా ఐర్లాండ్‌కు ఉంది. ఐర్లాండ్, పాకిస్తాన్, భారత్, కెనడా, యూఎస్ఎ జట్లు గ్రూపు-ఎలో ఉన్నాయి. ఈ నాలుగు జట్లలో ఐర్లాండ్ ఏ టీమ్‌ను ఓడిస్తుందని? ఉతప్పను అశ్విన్ ప్రశ్నించాడు. ఉతప్ప ఏమి ఆలోచించుకోకుండా వెంటనే పాకిస్తాన్ అంటూ సమాధనమిచ్చాడు."ఐసీసీ టోర్నీల్లో చిన్న చిన్న జట్ల చేతిలో ఓడిపోయే జట్లలో పాకిస్తాన్ ఒకటి. గత వరల్డ్‌కప్‌లో జింబావ్వే చేతిలో పాక్ ఓటమి చవిచూసిన సంగతి తెసిందే. ముఖ్యంగా పాకిస్తాన్ ఫీల్డింగ్ మరి దారుణంగా ఉంటుంది. కీలక సమయాల్లో క్యాచ్‌లను జారవిడుస్తుంటారు. ఆసియాకప్‌లో కూడా అదే జరిగింది. అందుకే శ్రీలంకపై ఓటమి చవిచూశారు. పాకిస్తాన్ ఫీల్డింగ్ రోజురోజుకూ దిగజారిపోతుంది. కాబట్టి పాకిస్తాన్‌కు ఐర్లాండ్ షాక్ ఇస్తుందని నమ్ముతున్నానని" ఉతప్ప పేర్కొన్నాడు. -
శెభాష్ శ్రేయస్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే
ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం చెన్నై వేదికగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించిన కేకేఆర్.. మూడో సారి ట్రోఫీని ముద్దాడింది. కేకేఆర్ మూడో సారి టైటిల్ సాధించడంలో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ది కీలక పాత్ర. అయ్యర్ వ్యక్తిగత ప్రదర్శన పరంగా పర్వాలేదన్పంచటప్పటకి.. సారథిగా మాత్రం జట్టును అద్భుతంగా నడిపించాడు. అయ్యర్ కెప్టెన్సీ 100కు 100 మార్కులు పడాల్సిందే. తన వ్యూహాలతో ప్రత్యర్ధి జట్లను అయ్యర్ చిత్తు చేశాడు. ఈ ఏడాది సీజన్లో కేకేఆర్ కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రం ఓడిపోయిందంటే అయ్యర్ కెప్టెన్సీ ఏ విధంగా ఉందో ఆర్ధం చేసుకోవచ్చు. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు అయ్యర్‌కు ఏది కలిసిరాలేదు. బీసీసీఐ ఆదేశాలను దిక్కరించడంతో జట్టులో చోటుతో పాటు వార్షిక కాంట్రాక్ట్ ను కూడా కోల్పోయాడు. అయితే పడిలేచిన కేరటంలా తన కెప్టెన్సీ మార్క్‌ను చూపించాడు. జట్టును విజయ పథంలో నడిపిస్తూ ఏకంగా టైటిల్‌ను అందించాడు. ఈ ఏడాది సీజన్లో శ్రేయస్ 14 ఇన్నింగ్స్‌ల్లో 351 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అయ్యర్‌పై భారత మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప ప్రశంసల వర్షం కురిపించాడు. శ్రేయస్‌ను కెప్టెన్‌గా చాలా మంది తక్కువగా అంచనా వేశారని ఉతప్ప అభిప్రాయపడ్డాడు. "శ్రేయస్ అయ్యర్‌కు అద్బుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అతడు భవిష్యత్తులో కచ్చితంగా భారత జట్టు కెప్టెన్ అవుతాడు. నా వరకు అయితే ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో శుబ్‌మన్ గిల్ కంటే అయ్యరే ముందుంటాడు. అతడు జట్టును నడిపించే విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడు ఈ ఏడాది సీజన్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాడు. అయ్యర్.. గౌతమ్ గంభీర్, చంద్రకాంత్ పండిట్, అభిషేక్ నాయర్ దిగ్గజాలతో కలిసి పనిచేశాడు. కాబట్టి ఆ అనుభవం శ్రేయస్‌కు కచ్చితంగా కలిసిస్తోంది. ఈ ఏడాది సీజన్‌కు ముందు అయ్యర్ పరిస్ధితి అంతగా బాగోలేదు. ఫిట్నెస్ లోపించడంతో జట్టులో చోటు కూడా కోల్పోయాడు. వెన్ను నొప్పితో బాధపడుతూనే అయ్యర్ ఆడుతున్నాడు. ముఖ్యంగా సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడం, వరల్డ్‌కప్ చోటు దక్కకపోవడం అయ్యర్‌ను మానసికంగా దెబ్బతీశాయి. అయినప్పటకి అయ్యర్ తన బాధను దిగమింగుకుని కేకేఆర్‌ను ఛాంపియన్స్‌గా నిలిపాడని" జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉతప్ప పేర్కొన్నాడు. -
యువరాజ్ సింగ్ పోరాటం వృధా.. లెజెండ్స్ టైటిల్ నెగ్గిన ఉతప్ప జట్టు
శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరుగుతున్న తొలి లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీని రాజస్థాన్ కింగ్స్ కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన ఫైనల్లో రాబిన్ ఉతప్ప సారధ్యం వహిస్తున్న రాజస్థాన్.. యువరాజ్ సింగ్ నాయకత్వంలోని న్యూయార్క్ సూపర్‌స్టార్ స్ట్రయికర్స్‌ను 20 పరుగుల తేడాతో ఓడించింది. రాజస్థాన్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూయార్క్‌ను గెలిపించేందకు యువరాజ్ సింగ్ చివరివరకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. ఆష్లే నర్స్ (41 బంతుల్లో 97), హ్యామిల్టన్ మసకద్జ (30 బంతుల్లో 56) చెలరేగడంతో నిర్ణీత 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. న్యూయార్క్ బౌలర్లలో జేరోమ్ టేలర్ 3 వికెట్లు పడగొట్టగా.. నువాన్ ప్రదీప్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూయార్క్.. యువరాజ్ సింగ్ మెరుపు అర్దశతకంతో (22 బంతుల్లో 54) మెరిసినప్పటికీ ఓటమిపాలైంది. ఈ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూయార్క్ ఇన్నింగ్స్‌లో కపుగెదెర (30), గుణరత్నే (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో పర్విందర్ అవానా, జకాతి, బిపుల్ శర్మ, చతురంగ డిసిల్వ, ఆష్లే నర్స్ తలో వికెట్ పడగొట్టారు. -
సిక్సర్ల మోత మోగించిన రాబిన్ ఉతప్ప.. కేవలం 34 బంతుల్లోనే..!
శ్రీలంకలో జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024లో భాగంగా దుబాయ్ జెయింట్స్‌తో ఇవాళ (మార్చి 17) జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ కింగ్స్ కెప్టెన్ రాబిన్ ఉతప్ప శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఉతప్ప సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 34 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 76 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఉతప్పతో పాటు హమిల్టన్ మసకద్జ (19 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), చతురంగ డిసిల్వ (19 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఏంజెలో పెరీరా (16 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ కింగ్స్ నిర్ణీత 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. దుబాయ్ బౌలర్లలో పవన్ సుయాల్,సెక్కుగే ప్రసన్న, సచిత్ పతిరణ తలో వికెట్ పడగొట్టారు. ఈ లీగ్‌లో రాబిన్ ఉతప్ప భీకర ఫామ్‌లో ఉన్నాడు. 6 మ్యాచ్‌ల్లో నాలుగు అర్దసెంచరీలు సాధించాడు. -
తొందరపాటు తగదు.. మళ్లీ గాయపడితే అంతే సంగతులు!
IPL 2024- Rishabh Pant : టీమిండియా స్టార్ రిషభ్ పంత్ పునరాగమనంపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు. పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాతే పంత్ బరిలోకి దిగాలని.. లేదంటే భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా 2022, డిసెంబరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. దాదాపు ఏడాదిన్నరకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన అతడు.. జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందాడు. క్రమక్రమంగా కోలుకుని నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టిన పంత్.. ఐపీఎల్-2024 సీజన్‌తో రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. అందుకు అనుగుణంగానే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈసారి పంత్ తమ జట్టు కెప్టెన్‌గా తిరిగి పగ్గాలు చేపడతాడని తెలిపింది. అయితే, తొలి అర్ధ భాగంలో కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగుతాడని.. వికెట్ కీపింగ్ చేయడని ప్రకటించింది. ఇదిలా ఉంటే.. పంత్ రీఎంట్రీ విషయంలో హడావుడి వద్దని బీసీసీఐ కూడా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అతడు పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆడించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జట్టుకు దూరంగా ఉండాలంటే కష్టమే.. ఈ నేపథ్యంలో రాబిన్ ఊతప్ప మాట్లాడుతూ.. ‘‘ఏడాదిన్నర కాలంగా జట్టుకు దూరంగా ఉండటం కష్టమే. అయితే, పూర్తిగా కోలుకోకముందే హడావుడిగా మైదానంలో దిగాలని భావిస్తే మళ్లీ గాయపడే అవకాశం ఉంది. అదే జరిగితే భారీ మూల్యం చెల్లించకతప్పదు. అప్పుడు మళ్లీ బెంచ్‌కే పరిమితం కావాలంటే చిరాకుగా ఉంటుంది. కాబట్టి పునరాగమనం విషయంలో ఆచితూచి.. ఆలోచించుకుని.. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటేనే పంత్ మళ్లీ బ్యాట్ పట్టాలి. టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు కోసం! అతడు రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వస్తాడు. నెట్స్‌లో బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ కూడా చేయడం శుభపరిణామం. ఏదేమైనా రీఎంట్రీ విషయంలో తొందరపాటు వద్దు’’ అని పేర్కొన్నాడు. ఈ మేరకు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో రాబిన్ ఊతప్ప తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఐపీఎల్లో సత్తా చాటి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా పంత్ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: టీమిండియా స్టార్ సంచలన నిర్ణయం?! -
రిటైరయ్యాక కూడా విదేశీ లీగ్‌ల్లో ఆడొద్దంటే ఎలా..? బీసీసీఐ అంక్షలపై రాబిన్ ఉతప్ప ఫైర్
రిటైరయ్యాక కూడా భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో పాల్గొనకుండా ఉండేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) త్వరలో ఓ కొత్త నిబంధనను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. కూలింగ్ ఆఫ్ పీరియడ్‌గా పిలువబడే ఈ నిబంధన అమల్లోకి వస్తే భారత ఆటగాళ్లు రిటైరయ్యాక కూడా విదేశీ లీగ్‌ల్లో పాల్గొనడానికి వీలు ఉండదు. ఈ నిబంధనపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ.. దీన్ని త్వరలోనే అమల్లోకి తెస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్, డాషింగ్ ఆటగాడు రాబిన్ ఉతప్ప స్పందించాడు. బీసీసీఐ గనక ఈ నిబంధనను అమల్లో తెస్తే ఇప్పుడిప్పుడే రిటైర్డ్ అయిన క్రికెటర్లు చాలా నష్టపోతారని అన్నాడు. కూలింగ్ ఆఫ్ పీరియడ్ అన్నది రిటైర్డ్ క్రికెటర్లకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుందని, ఇది చాలా అన్యామని తెలిపాడు. భారత రిటైర్డ్ క్రికెటర్లకు బీసీసీఐతో ఎలాంటి కాంట్రాక్ట్ ఉండదు కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏ లీగ్‌లో అయినా పాల్గొనే హక్కు వారికి ఉంటుంది, ఈ విషయంలో బీసీసీఐ కఠినంగా వ్యవహరించదని అనుకుంటున్నా అంటూ ఇటీవల పీటీఐతో మాట్లాడుతూ అన్నాడు. ఈ విషయంలో బీసీసీఐ ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తుందని భావిస్తున్నానని తెలిపాడు. కాగా, ఐపీఎల్ మినహా ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్‌ల్లో పాల్గొనేందుకు బీసీసీఐతో ఒప్పంద ఉన్న భారత క్రికెటర్లకు అనుమతి లేదన్న విషయం తెలిసిందే. విదేశీ లీగ్‌ల్లో పాల్గొనేందుకు ఉన్ముక్త్ చంద్ లాంటి క్రికెటర్లు బీసీసీఐతో తెగదెంపులు చేసుకున్నారు. ప్రస్తుతం బీసీసీఐతో ఎలాంటి అనుబంధం లేని భారత మాజీ క్రికెటర్లు (ఉతప్ప, పఠాన్ సోదరులు, శ్రీశాంత్, పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్ని) పలు విదేశీ లీగ్‌ల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు బీసీసీఐ ఈ విషయంలోనూ కఠినంగా వ్యవహరించాలని భావించాలని తెలుస్తుంది. భారత ఆటగాళ్లు విదేశీ లీగ్‌ల్లో పాల్గొంటే ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ పడిపోతుందని భావిస్తున్న బీసీసీఐ, రిటైర్డ్ ఆటగాళ్లను విదేశీ లీగ్‌ల్లో పాల్గొనకుండా అంక్షలు విధిస్తుంది. ఇందులో భాగంగానే కూలింగ్ ఆఫ్ పీరియడ్ నిబంధనను అమల్లోకి తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, కూలింగ్ ఆఫ్ పీరియడ్‌పై స్పందించిన రాబిన్ ఉతప్ప అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉతప్ప ఇటీవల ముగిసిన జింబాబ్వే టీ10 లీగ్‌లోనూ, అంతకుముందు యూఏఈలో జరిగిన ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లోనూ పాల్గొన్నాడు. -
రాబిన్ ఉతప్ప విధ్వంసం.. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో! వీడియో వైరల్
జింబాబ్వే వేదికగా జరుగుతున్న జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌లో ఫైనల్ చేరడంలో హరారే హరికేన్స్ జట్టు విఫలమైంది. డర్బన్ క్వాలండర్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో 4 వికెట్ల తేడాతో డర్బన్ క్వాలండర్స్ ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి హరారే నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్ నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 82 పరుగులు మాత్రమే చేసింది. హరారే బ్యాటర్లలో సమిత్ పటేల్(39) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. డర్బన్ బౌలర్లో ఈవెన్స్ 4 వికెట్లతో చెలరేగాడు. అనంతరం 83 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి డర్బన్ ఛేదించింది. దీంతో తమ ఫైనల్ బెర్త్‌ను డర్బన్ ఖారారు చేసుకుంది. జూలై 29న జరగనున్న ఫైనల్లో జోబర్గ్ బఫెలోస్ , డర్బన్ జట్లు తలపడనున్నాయి. రెచ్చిపోయిన రాబిన్ ఉతప్ప.. ఇక అంతకుముందు కేప్ టౌన్ సాంప్ ఆర్మీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో భారత మాజీ ఆటగాడు, హరారే హరికేన్స్ కెప్టెన్ రాబిన్ ఉతప్ప ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 36 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 88 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఉతప్ప విద్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో.. 146 లక్ష్యాన్ని హరికేన్స్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి ఛేదించింది. అతడితో పాటు ఫెరీరా(35) రాణించాడు. అయితే ఎలిమినేటర్‌లో అద్బుత విజయం సాధించినప్పటికీ.. క్వాలిఫయర్-2లో ఓటమి పాలకావడంతో హరారే టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. కాగా ఉతప్ప ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Ashes 2023 Steve Smith Run Out Video: ఔటని వెళ్లిపోయిన స్మిత్.. ఇంగ్లండ్ కొంపముంచిన బెయిర్ స్టో తప్పిదం! వీడియో వైర -
రెచ్చిపోయిన రాబిన్ ఉతప్ప.. సరిపోని ఫ్లెచర్ మెరుపులు
జింబాబ్వే టీ10 లీగ్‌లో టీమిండియా వెటరన్ ఆటగాడు, హరారే హరికేన్స్ ఓపెనర్ రాబిన్ ఉతప్ప తొలి అర్ధశతకం బాదాడు. డర్బన్ ఖలందర్స్‌తో నిన్న (జులై 26) జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయిన ఉతప్ప.. 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. అతనితో పాటు చకబ్వా (23 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), డొనవాన్ ఫెరియెరా (12 బంతుల్లో 24 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో హరికేన్స్ నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 134 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఖలందర్స్ బౌలర్లలో బ్రాడ్ ఈవాన్స్, అజ్మతుల్లా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 135 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఖలందర్స్.. నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా హరికేన్స్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆండ్రీ ఫ్లెచర్ (25 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్ (28 బంతుల్లో 49; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఖలందర్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. హరికేన్స్ బౌలర్ లూక్ జాంగ్వే 2 వికెట్లు పడగొట్టాడు. మెరిసిన కాలా.. నిన్ననే జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో కేప్‌టౌన్ సాంప్ ఆర్మీపై బులవాయో బ్రేవ్స్.. జోబర్గ్ బఫెలోస్పై కేప్‌టౌన్ విజయాలు సాధించాయి. కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్స్.. ఇన్నోసెంట్ కాలా (52 నాటౌట్), వెబ్‌స్టర్ (23 నాటౌట్) రాణించడంతో 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగా, ఛేదనలో గట్టి పోటీ ఇచ్చిన కేప్‌టౌన్ లక్ష్యానికి 4 పరుగుల దూరంలో (122/4) నిలిచిపోయింది. రాణించిన హఫీజ్, బొపారా.. కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ హఫీజ్ (40 నాటౌట్), రవి బొపారా (30 నాటౌట్) రాణించడంతో జోబర్గ్ బఫెలోస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేప్‌టౌన్.. ముజరబాని (3/7), న్యాయుచి (2/11), డాలా (1/17) ధాటికి 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 89 పరుగులు మాత్రమే చేయగా.. హఫీజ్, బొపారా రాణించడంతో బఫెలోస్ టీమ్ 6.5 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. -
సరిపోని టిమ్ సీఫర్ట్ మెరుపులు.. ఇర్ఫాన్ పఠాన్ ఊచకోత
జింబాబ్వే వేదికగా జరుగుతున్న జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌లో డర్బన్ ఖలందర్స్‌కు ఆడుతున్న న్యూజిలాండ్ ప్లేయర్ టిమ్ సీఫర్ట్ విధ్వంసం సృష్టించాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 భారీ సిక్సర్ల సాయంతో అజేయమైన 71 పరుగులు చేశాడు. కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సీఫర్ట్‌కు నిక్ వెల్చ్ (9 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) తోడవ్వడంతో డర్బన్ ఖలందర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఖలందర్స్ ఇన్నింగ్స్‌లో హజ్రతుల్లా జజాయ్ (3), ఆండ్రీ ఫ్లెచర్ (2) విఫలం కాగా.. ఆసిఫ్ అలీ (18; 2 సిక్సర్లు) కాసేపు అలరించాడు. హరారే బౌలర్లలో మహ్మద్ నబీ 2 వికెట్లు పడగొట్టగా.. సమిత్ పటేల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. Irfan Pathan rolling back the 🕰️ for some Sunday entertainment! #ZimAfroT10 #CricketsFastestFormat #T10League #DQvHH pic.twitter.com/OV44qCpSeG — ZimAfroT10 (@ZimAfroT10) July 23, 2023 అనంతరం 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరారే హరికేన్స్.. కొండంత లక్ష్యాన్ని చూసి ఏమాత్రం వెరవక ఖలందర్స్‌కు ధీటైన సమాధానం ఇచ్చింది. ఆ జట్టు మరో 2 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ రెగిస్ చకబ్వా (22 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విశ్వరూపం ప్రదర్శించాడు. వీరికి డొనవన్ ఫెరియెరా (16; 2 సిక్సర్లు), మహ్మద్ నబీ (19; 2 ఫోర్లు, సిక్స్) సహకరించారు. హరారే ఇన్నింగ్స్‌లో రాబిన్ ఉతప్ప (1), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (2) విఫలమయ్యారు. ఖలందర్స్ బౌలర్లలో మహ్మద్ అమీర్ 2, బ్రాడ్ ఈవాన్స్, జార్జ్ లిండే, టెండాయ్ చటారా తలో వికెట్ పడగొట్టారు. Seifert Storm in Harare! 🌪️#ZimAfroT10 #CricketsFastestFormat #T10League #DQvHH pic.twitter.com/DvxQ84T4hr — ZimAfroT10 (@ZimAfroT10) July 23, 2023 -
రాణించిన ఉతప్ప.. నిరాశపరిచిన పఠాన్ సోదరులు
జింబాబ్వే వేదికగా జరుగుతున్న జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌లో భారత వెటరన్ ఆటగాళ్లు నామమాత్రపు ప్రదర్శనలకే పరిమితమవుతున్నారు. ఈ లీగ్‌లో మొత్తం ఆరుగురు భారత వెటరన్లు పాల్గొంటుండగా.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేకపోయారు. నిన్న (జులై 22) జరిగిన మ్యాచ్‌ల్లో కేప్‌టౌన్ కెప్టెన్ పార్థివ్ పటేల్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలం కాగా.. హరారే ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ బ్యాటింగ్ (4), బౌలింగ్ (1-0-21-0) విభాగాల్లో దారుణంగా నిరాశపరిచాడు. భారత ఆటగాళ్లలో హరారే ఆటగాడు రాబిన్ ఉతప్ప (31) ఒక్కడే పర్వాలేదనిపించాడు. కేప్ హరారే హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టౌన్ సాంప్ ఆర్మీ.. రహ్మానుల్లా గుర్భాజ్ (25) ఓ మోస్తరు స్కోర్ చేయడంతో నిర్ణీత 10 ఓవర్లలో 112/7 స్కోర్ చేయగా.. హరారే హరికేన్స్ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 97/6 స్కోర్ చేసి 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డర్బన్ ఖలందర్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో జోబర్గ్ బఫెలోస్ ఆటగాడు, భారత మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ సైతం తేలిపోయాడు. అతను 8 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ బఫెలోస్.. టామ్ బాంటన్ (55 నాటౌట్) చెలరేగడంతో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేయగా.. డర్బన్ ఖలందర్స్మరో 5 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. హజ్రతుల్లా జజాయ్ (41 నాటౌట్) డర్బన్ను గెలిపించాడు. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ.. బులవాయో బ్రేవ్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్స్.. బెన్ మెక్‌డెర్మాట్ (27) రాణించడంతో 10 ఓవర్లలో 86 పరుగులు చేయగా.. 21 బంతుల్లో 43 పరుగులు చేసిన మరుమాని సాంప్ ఆర్మీని గెలిపించాడు. కాగా, జింబాబ్వే-ఆఫ్రో టీ10 లీగ్‌లో భారత ఆటగాళ్లు పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ (కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ), రాబిన్ ఉతప్ప, ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్ (హరారే హరికేన్స్), యూసఫ్ పఠాన్ (జోబర్గ్ బఫెలోస్) పాల్గొంటున్న విషయం తెలిసిందే. -
టీ10 లీగ్‌లో ఆడనున్న రాబిన్ ఊతప్ప, ఇర్ఫాన్ పఠాన్
జింబాబ్వే క్రికెట్ తొలిసారిగా "జిమ్ ఆఫ్రో టీ10" పేరుతో ఓ ప్రాంఛైజీ లీగ్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ జూలై 20న ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు భాగం కానున్నాయి. డర్బన్ క్వాలండర్స్, కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ, బులవాయో బ్రేవ్స్, జోబర్గ్ లయన్స్, హరారే హరికేన్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. తాజాగా ఆయా ఫ్రాంచైజీలు తమ జట్లను ఖారారు చేశాయి. కాగా ఈ టీ10 లీగ్‌లో రాబిన్ ఊతప్ప, పార్ధివ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్, యూసప్ ఫఠాన్, రాహుల్ చోప్రా, స్టువర్ట్ బిన్నీ, శ్రీశాంత్ వంటి భారత మాజీ క్రికెటర్లు ఆడనున్నారు. రాబిన్ ఊతప్ప, ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్ హరారే హరికేన్స్‌కు ప్రాతినిధ్యం వహించనుండగా.. పార్ధివ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ కేప్‌టౌన్ సాంప్ ఆర్మీకి, రాహుల్ శర్మ, యూసప్ ఫఠాన్ జోహన్నెస్‌బర్గ్ బఫెలోస్ తరపున ఆడనున్నారు. అదే విధంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహ్మద్ హాఫీజ్ కూడా ఈ లీగ్‌లో భాగం కానున్నారు. డర్బన్ క్వాలండర్స్: ఆసిఫ్ అలీ, మహ్మద్ అమీర్, జార్జ్ లిండే, హజ్రతుల్లా జజాయ్, టిమ్ సిఫెర్ట్, సిసంద మగాలా, హిల్టన్ కార్ట్‌రైట్, మీర్జా తాహిర్ బేగ్, తయాబ్ అబ్బాస్, క్రెయిగ్ ఎర్విన్, టెండై చతారా, బ్రాడ్ ఎవాన్స్, క్లైవ్ మదాండే, నిక్ వెల్చ్, ఆండ్రీ ఫ్లెచర్ హరారే హరికేన్స్: మహ్మద్ నబీ, ఎవిన్ లూయిస్, రాబిన్ ఉతప్ప, డోనోవాన్ ఫెరైరా, షాజావాజ్ దహానీ, డువాన్ జాన్సెన్, సమిత్ పటేల్, కెవిన్ కొత్తెగోడ, క్రిస్టోఫర్ మ్ఫోఫు, రెగిస్ చకబ్వా, ల్యూక్ జోన్‌వే, బ్రాండన్ మవుతా, తషింగా ముషివా, ఇర్ఫాన్ పఠాన్, యూసప్ ఫఠాన్,శ్రీశాంత్ జోహన్నెస్‌బర్గ్ బఫెలోస్: ముష్ఫికర్ రహీమ్, ఓడియన్ స్మిత్, టామ్ బాంటన్, యూసుఫ్ పఠాన్, విల్ స్మీద్, నూర్ అహ్మద్, రవి బొపారా, ఉస్మాన్ షిన్వారీ, జూనియర్ డలా, బ్లెస్సింగ్ ముజారబానీ, వెల్లింగ్టన్ మసకద్జా, వెస్లీ మాధేవెరే, విక్టర్ న్యౌచి, మిల్టన్ శుంబా, మొహమ్మద్ హఫీజ్, రాహుల్ చోప్రా. బులవాయో బ్రేవ్స్: సికిందర్ రజా, తస్కిన్ అహ్మద్, ఆష్టన్ టర్నర్, టైమల్ మిల్స్, తిసారా పెరెరా, బెన్ మెక్‌డెర్మాట్, బ్యూ వెబ్‌స్టర్, పాట్రిక్ డూలీ, కోబ్ హెర్ఫ్, రేయన్ బర్ల్, టిమిసెన్ మరుమా, జాయ్‌లార్డ్ గుంబీ, ఇన్నోసెంట్ కైయా, ఫరాజ్ అక్రమ్ , ముజీబ్ ఉర్ రెహ్మాన్. కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ: రహ్మానుల్లా గుర్బాజ్, షాన్ విలియమ్స్, భానుక రాజపక్స, మహేశ్ తీక్షణ, షెల్డన్ కాట్రెల్, కరీం జనత్, చమికా కరుణరత్నే, పీటర్ హజ్లోగౌ, మాథ్యూ బ్రీట్జ్కే, రిచర్డ్‌వాకా న్గరావా, రిచర్డ్‌వాకా న్గరావా, తద్శ్వాని మారుమణి, తినాషే కమునకేవే, పార్థివ్ పటేల్, మొహమ్మద్ ఇర్ఫాన్, స్టువర్ట్ బిన్నీ చదవండి: Ashes 2023: బెయిర్‌స్టో స్టంపౌట్ ఉదంతం.. ప్రధాని సైతం స్పందించారు..! -
గ్లామర్‌లో తగ్గేదేలే! భారత క్రికెటర్ భార్య.. ఈమె ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
గిల్ దున్నేస్తున్నాడు .. ఇక ఛాంపియన్ CSK
-
ఉతప్ప ఊచకోత.. గంభీర్ గర్జన
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 సీజన్లో ఇండియా మహారాజాస్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ప్రస్తుత ఎడిషన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన మహారాజాస్.. నిన్న (మార్చి 14) ఆసియా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన మహారాజాస్.. లయన్స్‌ను 157 పరుగులకు కట్టడి చేసింది. A great feeling to get the first win under the belt 💪🏾 Always a pleasure to bat along with my brother @GautamGambhir !! pic.twitter.com/uUSU54NMfN — Robin Aiyuda Uthappa (@robbieuthappa) March 14, 2023 ఉపుల్ తరంగ (48 బంతుల్లో 69; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలకరత్నే దిల్షన్ (27 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్), అబ్దుర్ రజాక్ (17 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించడంతో లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లయన్స్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ హఫీజ్ (2), కెప్టెన్ మిస్బా ఉల్ హాక్ (0), అస్ఘర్ అఫ్ఘాన్ (15) విఫలం కాగా.. మహారాజాస్ బౌలర్లలో సురేశ్ రైనా 2, స్టువర్ట్ బిన్నీ, హర్భజన్ సింగ్, ప్రవీణ్ తాంబే తలో వికెట్ పడగొట్టారు. .@GautamGambhir is still on the top for @rariohq Boss Cap Holder for the highest runs. @VisitQatar #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/95wb1UmUn2 — Legends League Cricket (@llct20) March 14, 2023 అనంతరం కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మహారాజస్.. వికెట్ కూడా నష్టపోకుండానే విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు రాబిన్ ఉతప్ప (39 బంతుల్లో 88 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ గౌతమ్ గంభీర్ (36 బంతుల్లో 61 నాటౌట్; 12 ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 12.3 ఓవర్లలోనే ఇండియా మహారాజాస్ విజయం సాధించారు. .@harbhajan_singh bounce back to his top spot for @rariohq Boss Cap Holder for the most wickets after tonight’s game!@VisitQatar #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/f3JVRL10VR — Legends League Cricket (@llct20) March 14, 2023 లయన్స్ బౌలర్లను ఉతప్ప ఊచకోత కోయగా, గంభీర్ ప్రత్యర్ధి బౌలర్లపై సింహగర్జన చేశాడు. గంభీర్‌కు ఈ సీజన్లో ఇది వరుసగా 3వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌లో ఇవాళ (మార్చి 15) వరల్డ్ జెయింట్స్ జట్టు.. ఇండియా మహారాజాస్‌తో తలపడనుంది. Match Day 5: A duel reloaded! ⚡ Will the Maharajas win back-to-back and cease the top spot? Or will the Giants topple the Maharajas back to bottom? Tune in tonight at 8 PM IST to find out! @VisitQatar#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/jRB3xzdu88 — Legends League Cricket (@llct20) March 15, 2023 కాగా, లీగ్‌లో ఇప్పటివరకు జరిగిన 4 మ్యాచ్‌ల్లో రెండింటిలో ఆసియా లయన్స్, ఒక మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ విజయం సాధించగా.. ఇండియా మహారాజాస్ ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓ విజయం సాధించింది. లీగ్ తొలి మ్యాచ్‌లో ఆసియా లయన్స్ చేతిలో ఖంగుతిన్న (9 పరుగుల తేడాతో ఓటమి) మహారాజాస్.. రెండో మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ చేతిలో (2 పరుగుల తేడాతో ఓటమి) ఓటమిపాలయ్యారు. నిన్న ఆసియా లయన్స్‌పై గెలుపొందడంతో మహారాజాస్ టీమ్ బోణీ విజయం సాధించింది. Points Table Update after Match Day 4. The table has changed on the lower half! Maharajas make a majestic leap to second place while Asia Lions hold their ground at the top.@VisitQatar #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/XSHt2svlBK — Legends League Cricket (@llct20) March 14, 2023 -
వరుస మెరుపు ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోతున్న రాబిన్ ఉతప్ప
ఇంటర్నేషనల్ లీగ్ టీ20, 2023 (దుబాయ్) సీజన్లో టీమిండియా మాజీ క్రికెటర్, దుబాయ్ క్యాపిటల్స్ ఓపెనర్ రాబిన్ ఉతప్ప వరుస మెరుపు ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోతున్నాడు. అబుదాబీ నైట్‌రైడర్స్‌తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్‌లో 33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసిన రాబీ.. ఇవాళ (జనవరి 16) గల్ఫ్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 46 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఏకంగా 79 పరుగులు చేశాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహిస్తున్న దుబాయ్ క్యాపిటల్స్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. A brilliant innings by @robbieuthappa some sensational shots on display pic.twitter.com/E15dDxGVef— International League T20 (@ILT20Official) January 16, 2023 దుబాయ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోవమన్ పావెల్ (25 బంతుల్లో 38; ఫోర్, 3 సిక్సర్లు), సికందర్ రజా (19 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించగా.. జో రూట్ (6), భానుక రాజపక్స (3), దసున్ షనక (2), రవి బొపారా (2), ఇసురు ఉడాన (2) నిరాశపరిచారు. ఆఖర్లో హజ్రత్ లుక్మాన్ (3 బంతుల్లో 10) వరుస బంతుల్లో ఫోర్, సిక్సర్ బాదడంతో క్యాపిటల్స్ జట్టు 180 పరుగుల మార్కును దాటింది. గల్ప్ జెయింట్స్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్ గ్లీసన్ 2, సంచిత్ శర్మ, డేవిడ్ వీస్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ సీజన్లో రాబిన్ ఉతప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న దుబాయ్ క్యాపిటల్స్ టీమ్ అద్భుతమ ప్రదర్శనతో ముందుకెళ్తుంది. తొలి మ్యాచ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్‌ను 73 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించిన ఈ జట్టు.. తాజాగా గల్ఫ్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ భారీ స్కోర్ సాధించి, మరో విజయానికి బాటలు వేసుకుంది. -
దుబాయ్ ప్రీమియర్ లీగ్ మొదలైంది.. తొలి మ్యాచ్‌లోనే నైట్ రైడర్స్‌కు షాక్
ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్), బీబీఎల్ (బిగ్‌బాష్ లీగ్, ఆస్ట్రేలియా), బీపీఎల్ (బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్), పీఎస్ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్), ఎస్ఏ 20 (సౌతాఫ్రికా టీ20 లీగ్) తరహాలోనే యూఏఈ వేదికగా మరో టీ20 లీగ్ ప్రారంభమైంది. అంతర్జాతీయ స్టార్లతో నిండిన ఈ లీగ్‌కు ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్ టీ20)గా నామకరణం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్ తరహాలోనే ఈ లీగ్‌లోనూ 6 జట్లు పోటీపడుతున్నాయి. One for the history books 📖@Dubai_Capitals WIN THE FIRST #DPWorldILT20 GAME 👏 #ALeagueApart #DCvADKR pic.twitter.com/l4Z5GXPVxr — International League T20 (@ILT20Official) January 13, 2023 నిన్న (జనవరి 13) జరిగిన లీగ్ ఇనాగురల్ మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిటల్స్, అబుదాబీ నైట్ రైడర్స్ జట్లు తలపడగా.. దుబాయ్ క్యాపిటల్స్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. రాబిన్ ఉతప్ప (33 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ రోవమన్ పావెల్ (29 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. జో రూట్ (21 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సికందర్ రజా (17 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. భానుక రాజపక్స (9), యూసప్ పఠాన్ (6) విఫలమయ్యారు. రవి బొపారా (4 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్), ఇసురు ఉడాన (3 బంతుల్లో 11 నాటౌట్; ఫోర్, సిక్స్) ఆఖర్లో మెరుపులు మెరిపించారు. నైట్ రైడర్స్ బౌలర్లలో రవి రాంపాల్, అలీ ఖాన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్ రైడర్స్.. రజా అకీఫుల్లా ఖాన్ (2/20), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (2/16), రోవమన్ పావెల్ (2/15), ఇసురు ఉడాన (1/14), హజ్రత్ లుక్మా్న్ (1/27), సికందర్ రజా (1/17) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (38 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (12 బంతుల్లో 12; ఫోర్) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా.. కొలిన్ ఇంగ్రామ్ (1), బ్రాండన్ కింగ్ (8), జవార్ ఫరీద్ (9), సునీల్ నరైన్ (4), కాన్నర్ (3), అకీల్ హొస్సేన్ (3), ఫహాద్ నవాజ్ (1) దారుణంగా విఫలమయ్యారు. రవి రాంపాల్ (6), అలీ ఖాన్ (6) అజేయంగా నిలిచారు. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌లో ఇవాళ (జనవరి 14) ముంబై ఎమిరేట్స్ (ముంబై ఇండియన్స్ యాజమాన్యం), షార్జా వారియర్స్ (క్యాప్రి గ్లోబల్) జట్లు తలపడనున్నాయి. About time you plan your schedule as ours is all set. 34 action packed matches from 13th Jan 2023 💥 Teams are ready to duel for the glorious ILT20 trophy. Catch all the action live with @ilt20onzee Check out the #ILT20 schedule.#ALeagueApart pic.twitter.com/dVINE7FIEu — International League T20 (@ILT20Official) November 29, 2022 ఐఎల్ టీ20 లీగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు.. షెడ్యూల్.. జనవరి 13 నుంచి మొదలయ్యే ఈ లీగ్ ఫిబ్రవరి 12న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. 6 జట్లు పాల్గొనే ఈ లీగ్‌లో మొత్తం 34 మ్యాచ్‌లు జరుగుతాయి. Ready to conquer! 🏆 The captains and the trophy, a glimpse of the final destination before the tournament begins 🤩 #DPWorldILT20 #ALeagueApart pic.twitter.com/IC88z9Qu59 — International League T20 (@ILT20Official) January 12, 2023 ఎలా చూడాలి.. ఐఎల్ టీ20 లీగ్‌ను జీ నెట్‌వర్క్స్‌లోని 10 ఛానల్లలో ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో వీక్షించవచ్చు. జీ సినిమా (ఎస్డీ, హెచ్డీ), జీ అన్మోల్ సినిమా, జీ తిరాయ్, జీ బంగ్లా సినిమా, జీ జస్ట్ (ఎస్డీ, హెచ్డీ), పిక్చర్స్ హెచ్డీ, ఫ్లిక్స్ (ఎస్డీ, హెచ్డీ) ఛానల్‌లతో పాటు ఇదే సంస్థకు చెందిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5లో చూడవచ్చు. The BIGGEST movie star in the world meets the BIGGEST T20 League 🤩 2023 will indeed start with a BANG because @iamsrk has joined #ALeagueApart 🔥 Book your tickets now; https://t.co/MXQYHlHN5j#DPWorldILT20 #SRK #ShahRukhKhan pic.twitter.com/fXUP0P6XaV — International League T20 (@ILT20Official) January 7, 2023 టీమ్స్, ఓనర్స్ .. ఎంఐ ఎమిరేట్స్ (ముంబై ఇండియన్స్) అబుదాబి నైట్ రైడర్స్ (కోల్‌కతా నైట్ రైడర్స్) డెసర్ట్ వైపర్స్ (గ్లేజర్ ఫ్యామిలీ) దుబాయ్ క్యాపిటల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) గల్ఫ్ జెయింట్స్ (అదానీ గ్రూప్) షార్జా వారియర్స్ (క్యాప్రి గ్లోబల్) కెప్టెన్లు.. ఎంఐ ఎమిరేట్స్ - కీరన్ పొలార్డ్/ డ్వేన్ బ్రావో అబుదాబి నైట్ రైడర్స్ - సునీల్ నరైన్ డెసర్ట్ వైపర్స్ - కొలిన్ మున్రో దుబాయ్ క్యాపిటల్స్ - రొవమన్ పావెల్ గల్ఫ్ జెయింట్స్ - జేమ్స్ విన్స్ షార్జా వారియర్స్ - మొయిన్ అలీ లీగ్‌లో పాల్గొనే కీలక ఆటగాళ్లు.. సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, రోవమన్ పావెల్, షిమ్రోన్ హెట్మెయర్, ఆండ్రీ రసెల్, పాల్ స్టిర్లింగ్, మొయిన్ అలీ, సికందర్ రజా, రాబిన్ ఉతప్ప, యూసఫ్‌పఠాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, జో రూట్, క్రిస్ జోర్డాన్, జేమ్స్ విన్స్, దసున్ షనక, వనిందు హసరంగ, ట్రెంట్ బౌల్ట్ తదితరులు -
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడనున్న రాబిన్ ఊతప్ప
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023 సీజన్లో ఇండియా మహారాజా తరపున ఆడేందుకు భారత మాజీ ఆటగాళ్లు రాబిన్ ఊతప్ప, శ్రీశాంత్ సిద్దమయ్యారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ఊతప్ప ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. అదే విధంగా గతేడాది లెజెండ్స్ లీగ్ సీజన్లో ఊతప్ప కామేంటేటర్‌గా వ్యవహరించాడు. "లెజెండ్స్ లీగ్ క్రికెట్ చివరి సీజన్లో వాఖ్యతగా వ్యవహరించినప్పడే ఈ టోర్నీలో ఆడాలని నిర్ణయించకున్నాను. ఇప్పుడు నా పాత సహచరులతో ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది" అని రాబిన్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఇక గత సీజన్లో భిల్వారా కింగ్స్ తరపున ఆడిన శ్రీశాంత్.. ఈ ఏడాది సీజన్లో ఇండియా మహారాజాకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. మరోవైపు శ్రీశాంత్ మాట్లాడుతూ.. లెజెండ్స్ లీగ్ సెకెండ్ సీజన్ అద్భుతంగా జరిగిది. ఈ టోర్నీలో పోటీ మా అంచనాలకు మించి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మరి కొంత మంది మాజీ ఆటగాళ్లు ఈ టోర్నీలో భాగం కావాలని నేను ఆశిస్తున్నాను. అయితే భారత్ తరఫున ఆడడం ఎప్పుడూ గర్వంగా భావిస్తాను అని పేర్కొన్నాడు. చదవండి: IND vs SL: శ్రీలంకతో మూడో టీ20.. రుత్‌రాజ్‌కు నో ఛాన్స్! గిల్ వైపే మొగ్గు -
రానున్న పదేళ్లలో టీ20 క్రికెట్లో పంత్‌దే హవా: భారత మాజీ బ్యాటర్
Rishabh Pant- T20 Cricket: టీమిండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్‌ను ఉద్దేశించి మాజీ వికెట్ కీపర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ఫార్మాట్లో రానున్న పదేళ్లలో భారత జట్టులో అతడు కీలక ఆటగాడిగా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు. టాపార్డర్‌లో పంత్‌ను ఆడిస్తే ఉపయోగకరంగా ఉంటుందని.. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా అతడి సొంతమని వ్యాఖ్యానించాడు. డీకే రాకతో పక్కకు పంత్! కాగా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ పునరాగమనం నేపథ్యంలో ఇటీవలి కాలంలో ముఖ్యంగా ప్రపంచకప్-2022 టోర్నీలో పంత్‌కు అవకాశాలు సన్నగిల్లాయి. అనువజ్ఞుడైన డీకే వైపు మొగ్గు చూపిన యాజమాన్యం పంత్‌ను కాదని అతడికి వరుస అవకాశాలు ఇచ్చింది. కేవలం తొమ్మిది పరుగులే ఈ క్రమంలో ఐసీసీ ఈవెంట్లో కేవలం రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కించుకున్న రిషభ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో మూడు పరుగులు, ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్లో 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో పంత్ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీ20 జట్టుకు పంత్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి కీలక ఆటగాళ్ల గైర్హాజరీ నేపథ్యంలో యువ జట్టు కివీస్‌తో పోటీ పడనుంది. రానున్న పదేళ్లలో అతడిదే హవా! ఈ నేపథ్యంలో స్పోర్ట్స్‌కీడాతో ముచ్చటించిన రాబిన్ ఊతప్ప టీ20లలో పంత్ భవిష్యత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రిషభ్ పంత్ ఓపెనర్‌గా రావాలి. పంత్ టాపార్డర్‌లోనే మెరుగ్గా రాణించగలడు. టీ20 క్రికెట్లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరచగలడు. తను మ్యాచ్ విన్నర్. గేమ్ చేంజర్. ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించగల సత్తా ఉన్నవాడు. రానున్న పదేళ్లలో భారత టీ20 జట్టులో అతడు అత్యంత కీలక ప్లేయర్‌గా ఎదుగుతాడు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఎడతెరిపి లేని వర్షం కారణంగా భారత్- న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ20 రద్దైంది. చదవండి: Naseem Shah: అన్న అడుగు పడింది.. ఇప్పుడు తమ్ముడి వంతు ఐపీఎల్లో కప్ సాధిస్తే.. టీమిండియా కెప్టెన్ చేయాలా? ఇదెక్కడి రూల్! అలా అయితే.. -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా డాషింగ్ క్రికెటర్
టీమిండియా డాషింగ్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ట్విటర్ వేదికగా ప్రకటించాడు. టీమిండియాకు, సొంత రాష్ట్రం కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నానని ఉతప్ప ట్వీట్లో పేర్కొన్నాడు. ప్రతి విషయానికి ఏదో ఒక సమయంలో ముగింపు ఉంటుంది. కాబట్టి, నేను కూడా భారత క్రికెట్‌తో ఉన్న అనుబంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నానని ట్వీటాడు. It has been my greatest honour to represent my country and my state, Karnataka. However, all good things must come to an end, and with a grateful heart, I have decided to retire from all forms of Indian cricket. Thank you all ❤️ pic.twitter.com/GvWrIx2NRs — Robin Aiyuda Uthappa (@robbieuthappa) September 14, 2022 తన 20 ఏళ్ల కెరీర్లో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే రాబీ తాను ప్రాతినిధ్యం వహించిన ఐపీఎల్ టీమ్‌లకు (సీఎస్కే, కేకేఆర్, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, పూణే వారియర్స్) సైతం కృతజ్ఞతలు తెలిపాడు. రాబీ తన ఐపీఎల్ కెరీర్లో రెండుసార్లు విజేతగా (సీఎస్కే, కేకేఆర్) నిలిచిన జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. 36 ఏళ్ల ఉతప్ప.. 2006-15 మధ్యలో 46 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. వన్డేల్లో 6 హాఫ్ సెంచరీ సాయంతో 934 పరుగులు, టీ20ల్లో ఓ హాఫ్ సెంచరీ సాయంతో 249 పరుగులు సాధించాడు. ఉతప్ప తన ఐపీఎల్ కెరీర్లో 205 మ్యాచ్‌ల్లో 27 హాఫ్ సెంచరీల సాయంతో 130.3 స్ట్రయిక్ రేట్‌తో 4952 పరుగులు చేశాడు. దూకుడైన బ్యాటింగ్‌కు పేరుగాంచిన ఉతప్ప.. చాలా సందర్భాల్లో వికెట్‌కీపర్‌గానూ సేవలందించాడు. ఉతప్ప ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. -
అప్పుడు కోహ్లీకి చెప్పలేదుగా..ఇప్పుడెందుకు అడుగుతున్నాడు
-
జట్టులో కోహ్లి స్థానం గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు!
Robin Uthappa Comments In Virat Kohli Form: ‘‘విరాట్ కోహ్లి పరుగులు సాధించినపుడు.. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా సెంచరీలు బాదినపుడు.. ఇలా ఆడాలి. అలా ఆడాలి అని ఎవరూ చెప్పలేదు కదా! మరి ఇప్పుడు ఎందుకు జట్టులో అతడి స్థానం గురించి ప్రశ్నిస్తున్నారు. అసలు మనలో ఎవరికీ కోహ్లిని క్వశ్చన్ చేసే హక్కు లేనేలేదు’’ అని టీమిండియా, చెన్నై సూపర్‌కింగ్స్ వెటరన్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. ఈ మేరకు తనదైన శైలిలో కోహ్లి విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. కాగా గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్‌తో సతమవుతున్న భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు కపిల్‌దేవ్ వంటి లెజెండ్స్ అతడిని పక్కనపెట్టాలని సూచిస్తుండగా.. సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సహా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విదేశీ సారథులు కూడా కోహ్లికి మద్దతుగా నిలుస్తున్నారు. రాబిన్ ఊతప్ప(PC: CSK) 70 సెంచరీలు చేశాడు కదా! ఈ నేపథ్యంలో ఈ విషయంపై తాజాగా స్పందించిన ఊతప్ప షేర్‌చాట్ ఆడియో చాట్‌రూమ్ సెషన్లో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘కోహ్లి ఇప్పటికే 70 సెంచరీలు సాధించాడు. ఇంతటి గొప్ప ప్రతిభ కలిగి ఉండి భారత క్రికెట్ పేరును నిలబెట్టిన అతడికి ధన్యవాదాలు చెప్పాలి. ఇప్పుడు కూడా అతడు 30 లేదంటే 35 పరుగులు చేయగలుగుతున్నాడు. కొన్నిరోజులు కోహ్లిని ఒంటరిగా వదిలేయండి. తనదైన శైలిలో క్రికెట్ ఆడే వరకు వేచి చూడండి. తనకు ఏది మంచో మనకంటే తనకే బాగా తెలుసు. తన సమస్య ఏమిటో కూడా తనకే తెలుసు. అంతేకాదు దానిని అధిగమించగల సత్తా కూడా అతడికి ఉంది. అంతవరకు అతడి మానాన అతడిని వదిలేసి కాస్త ఓపికగా ఎదురు చూడటం కంటే మనం చేసేదేమీ లేదు’’ అని ఊతప్ప కోహ్లికి మద్దతుగా నిలిచాడు. అతడు మ్యాచ్ విన్నర్.. ఎవరికీ ఆ హక్కులేదు! అదే విధంగా టీమిండియా వరుస సిరీస్‌ల నేపథ్యంలో విశ్రాంతి పేరిట కోహ్లి జట్టుకు దూరం కావడంపై స్పందిస్తూ.. ‘‘ఒకవేళ తనకు బ్రేక్ కావాలని కోరుకుంటే కోహ్లి తప్పక విశ్రాంతి తీసుకుంటాడు. ఒకవేళ అతడికి ఫలానా సిరీస్ లేదంటే ఫలానా టోర్నీ ఆడాలని ఉందంటే తప్పకుండా ఆడతాడు. అందుకు యాజమాన్యం అంగీకరించాలి. అంతేగానీ.. జట్టులో అతడి స్థానం ఏమిటన్న విషయంపై బయట పెద్దగా చర్చ అవసరం లేదు. అతడు మ్యాచ్ విన్నర్. ప్రపంచంలోని బెస్ట్ మ్యాచ్ విన్నర్ అని ఇప్పటికే రుజువు చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి శక్తిసామర్థ్యాల గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు’’ అని ఊతప్ప ఉద్వేగ పూరితంగా మాట్లాడాడు. కాగా వెస్టిండీస్ పర్యటనకు దూరమైన కోహ్లి.. ఆసియా కప్ టోర్నీ నేపథ్యంలో ఆగష్టులో తిరిగి జట్టుతో చేరే అవకాశం ఉంది. చదవండి: Axar Patel: ఆఖరి ఓవర్లో సిక్సర్ బాది టీమిండియాను గెలిపించింది వీళ్లే! ఎప్పుడెప్పుడంటే? Rohit Sharma Latest Photo: వెస్టిండీస్‌కు చేరుకున్న టీమిండియా కెప్టెన్.. పంత్, డీకేతో పాటు -
రెండోసారి తండ్రైన సీఎస్కే బ్యాటర్.. మా చిన్నారి దేవత అంటూ ఎమోషనల్!
టీమిండియా వెటరన్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప రెండోసారి తండ్రయ్యాడు. ఊతప్ప దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని ఊతప్ప సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. భార్యా, బిడ్డలతో ఉన్న ఫొటోను ఈ సందర్భంగా షేర్ చేశాడు. ‘‘మా జీవితాల్లో అడుగుపెట్టిన చిన్నారి దేవతను మీకు పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ట్రినిటి థియా ఊతప్ప.. మమ్మల్ని నీ తల్లిదండ్రులుగా ఎంచుకున్నందుకు.. నిన్ను ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చే అవకాశం ఇచ్చినందుకు నీకు రుణపడి ఉంటాం. నీకు తల్లిదండ్రులమైనందుకు మేము.. అన్నయ్య అయినందుకు నీ సోదరుడు.. దీనిని మాకు దక్కిన గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాం’’ అని ఊతప్ప ఉద్వేగపూరిత నోట్ రాసుకొచ్చాడు. కాగా కేరళకు చెందిన రాబిన్ వేణు ఊతప్ప వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఎదిగాడు. 2006లో భారత్ తరఫున అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టాడు. ఆ మరుసటి ఏడాది టీ20 ఫార్మాట్లోనూ అరంగేట్రం చేశాడు. ఊతప్ప చివరిసారిగా జింబాబ్వేతో వన్డే మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక ఊతప్ప వ్యక్తిగత విషయానికొస్తే.. 2016లో శీతల్‌ను పెళ్లాడాడు. వీరికి ఇప్పటికే కుమారుడు నీల్ నోలన్ ఊతప్ప ఉన్నాడు. తాజాగా కుమార్తె జన్మించింది. కాగా కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే ఊతప్ప ఎప్పటికప్పుడు తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. చదవండి: Ind Vs Eng 2nd ODI: తుది జట్ల అంచనా, పిచ్, వాతావరణం వివరాలు! రోహిత్ సేన గెలిచిందంటే! View this post on Instagram A post shared by ROBIN UTHAPPA (@robinaiyudauthappa) View this post on Instagram A post shared by ROBIN UTHAPPA (@robinaiyudauthappa) -
Rafael Nadal: ‘సెల్యూట్ ఫరెవర్’.. నాదల్‌పై సచిన్, సెహ్వాగ్ ప్రశంసలు
టెన్నిస్ దిగ్గజం, స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్‌పై భారత మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. ఏకంగా పద్నాలుగవసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన ‘మట్టి కోర్టు మహారాజు’కు శుభాకాంక్షలు తెలియజేశారు. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్.. ‘‘36 ఏళ్ల వయసులో ఫ్రెంచ్ఓపెన్లో రికార్డు స్థాయిలో 14వ టైటిల్.. 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవడం నిజంగా అద్భుతం.. అసాధారణ విజయం. కంగ్రాట్స్ నాదల్’’ అంటూ ట్విటర్ వేదికగా విష్ చేశారు. To go out there and win a record 14th @rolandgarros & 22nd Grand Slam at the age of 36 is an incredible achievement. Congratulations @RafaelNadal! 🏆🎾 pic.twitter.com/MAxsEklfFQ — Sachin Tendulkar (@sachin_rt) June 5, 2022 ఇక భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం.. ‘‘మట్టి కోర్టు రాజు.. గొప్ప ఆటగాడు.. చాంపియన్.. నాదల్.. ఫ్రెంచ్ఓపెన్లో 14వ టైటిల్’’ అంటూ నాదల్ ఫొటోను ట్వీట్ చేస్తూ అతడికి అభినందనలు తెలిపాడు. అదే విధంగా ప్రజ్ఞాన్ ఓజా, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, రాబిన్ ఊతప్ప ట్విటర్ వేదికగా నాదల్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. నాదల్‌ను గ్రీక్ గాడ్ హెర్క్యులస్‌తో పోల్చిన రవిశాస్త్రి.. ఎర్రమట్టి కోర్టులో అతడు 15వ టైటిల్ కూడా గెలవాలని ఆకాంక్షించాడు. సెల్యూట్ ఫరెవర్ అంటూ అతడిని ఆకాశానికెత్తాడు. A modern day Hercules who just will not melt in the hottest Claypot. Starts favourite to make it 15 only. Just insane. Salute forever @RafaelNadal @rolandgarros #Nadal #FrenchOpen pic.twitter.com/XXfMHRgmku — Ravi Shastri (@RaviShastriOfc) June 5, 2022 కాగా ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్-2022 పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాదల్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ప్రత్యర్థి కాస్పర్ రూడ్ (నార్వే)ను 6–3, 6–3, 6–0తో ఓడించాడు. తద్వారా తద్వారా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను 14వసారి గెలిచిన నాదల్.. తన ఖాతాలో 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. మట్టి కోర్టుకు తాను మకుటం లేని మహారాజునని మరోసారి నిరూపించుకుని కితాబులు అందుకుంటున్నాడు. ✅ Rafa 🆚 Ruud ✅ Double delight for France 🇫🇷 ✅ 1️⃣4️⃣ for @RafaelNadal Look back at Day 15 with the Best Moments of the Day by @emirates 🎥#RolandGarros | #EmiratesFlyBetterMoments pic.twitter.com/IPfdgyMB2w — Roland-Garros (@rolandgarros) June 5, 2022 చదవండి: Rafael Nadal: సాటిరారు నీకెవ్వరు.. మట్టికోర్టుకు రారాజు నాదల్.. పలు అరుదైన రికార్డులు! -
IPL 2022: కెప్టెన్‌గా తొలి గెలుపు.. ఆమెకే అంకితం: జడేజా
IPL 2022 CSK Vs RCB- Ravindra Jadeja Comments: వరుసగా నాలుగు పరాజయాల తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్ ఐపీఎల్-2022లో ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. శివమ్ దూబే(94 నాటౌట్), రాబిన్ ఉతప్ప( 89 పరుగులు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలుపు బాట పట్టించారు. కాగా ఐపీఎల్-2022 సీజన్‌తో తొలిసారిగా చెన్నై పగ్గాలు చేపట్టిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు కెప్టెన్‌గా మొదటి విజయం. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం జడేజా మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశాడు. ఈ గెలుపును జట్టు సభ్యులు, తన భార్య రివా సోలంకికి అంకితమిస్తున్నట్లు తెలిపాడు. ‘‘కెప్టెన్‌గా నాకు ఇది తొలి విజయం. ఈ గెలుపు ఎల్లప్పుడూ నాకు ప్రత్యేకమే! గత నాలుగు మ్యాచ్‌లలో మాకు నిరాశే ఎదురైంది. అయితే, మేము పుంజుకున్నాం. బ్యాటింగ్ యూనిట్లో ప్రతి ఒక్కరు తమ బాధ్యతను చక్కగా నెరవేర్చారు. ముఖ్యంగా రాబీ, శివమ్ అద్భుతంగా ఆడారు. బౌలర్లు కూడా మెరుగ్గా రాణించారు. నిజానికి మేనేజ్మెంట్ నాపై ఎప్పుడూ ఒత్తిడి పెట్టలేదు. నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. భార్యతో జడేజా ఇంకా నేను నేర్చుకునే దశలోనే ఉన్నాను. కెప్టెన్ అయినప్పటికీ నేను సీనియర్ల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తూనే ఉన్నాను. మహీ భాయ్ ఉన్నాడు కదా! ఆయనతో ప్రతీ విషయం చర్చిస్తాను. సారథిగా ఎదగడంలో, ఆ పాత్రలో ఒదిగేందుకు.. ఈ సలహాలు పనికివస్తాయి. అయితే, అందుకు కాస్త సమయం పట్టవచ్చు. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండటం మాత్రం నాకు కలిసి వచ్చే అంశం. సానుకూల దృక్పథంతో, కఠిన శ్రమకోరుస్తూ .. విజయాలను కొనసాగిస్తూ ముందుకు వెళ్తాం. కెప్టెన్‌గా నా తొలి విజయాన్ని నా సతీమణికి, జట్టు సభ్యులకు అంకితమిస్తున్నా’’ అని జడేజా పేర్కొన్నాడు. ఇక ఆర్సీబీతో మ్యాచ్‌లో జడేజా వ్యక్తిగత ప్రదర్శన విషయానికొస్తే.. వనిందు హసరంగ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. అయితే, తన బౌలింగ్ కోటా(4 ఓవర్లు)ను పూర్తి చేసిన జడ్డూ.. 39 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ స్కోర్లు: చెన్నై: 216/4 (20) బెంగళూరు: 193/9 (20) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శివమ్ దూబే చదవండి: IPL 2022: థర్డ్ అంపైర్‌కు మతి భ్రమించిందా..? The Jadeja catch celebration 👌👌#TATAIPL #CSKvRCB pic.twitter.com/u3zvE59I3k — IndianPremierLeague (@IPL) April 12, 2022 -
IPL 2022: సిక్సర్ల సునామీతో చెన్నై బోణీ
IPL 2022 Chennai Super Kings Vs Royal Challengers Bangalore- ముంబై: ఈ మ్యాచ్ కంటే ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) నాలుగు మ్యాచ్‌లాడింది. అన్నీంటా ఓటమే! నాలుగుసార్లు విజేత, డిఫెండింగ్ చాంపియన్‌కు ఏమాత్రం రుచించని ఈ ఎదురుగాలికి... సుడిగాలి బ్యాటింగ్‌తో ఫలితం సాధించింది. సూపర్‌కింగ్స్ బ్యాటర్స్ శివమ్ దూబే (46 బంతుల్లో 94 నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు), రాబిన్ ఉతప్ప (50 బంతుల్లో 89; 4 ఫోర్లు, 9 సిక్సర్లు) సిక్సర్ల సునామీతో ఎట్టకేలకు ఐదో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో 23 పరుగులతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై జయభేరి మోగించింది. ముందుగా చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 216 పరుగులు చేసింది. హసరంగకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు చేసింది. షహబాజ్ (27 బంతుల్లో 41; 4 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుగ్గా ఆడారు. స్పిన్నర్లు మహీశ్ తీక్షణ (4/33), జడేజా (3/39) బెంగళూరును దెబ్బ తీశారు. కెప్టెన్‌గా జడేజాకిది తొలి విజయం కావడం విశేషం. మొదట్లో కష్టాలు... తర్వాత చుక్కలు... పవర్ ప్లేలో చెన్నై స్కోరు 35/1. అప్పటికే ఒక ఓపెనర్ రుతురాజ్ (17) పెవిలియన్‌లో ప్రేక్షకుడయ్యాడు. ఇంకో ఓపెనింగ్ బ్యాటర్ ఉతప్పకు మొయిన్ అలీ (3) జతయినా చేసిందేమీ లేదు. దూబే వచ్చాక నెమ్మదిగా 8.4 ఓవర్లో జట్టు స్కోరు 50కి... 10 ఓవర్లలో 2 వికెట్లకు 60 పరుగులకు చేరింది. కానీ ఆ తర్వాతి 10 ఓవర్లలో ఆట ఎవరి ఊహకందని విధ్వంసంగా సాగింది. చెన్నై ఏకంగా 156 పరుగులు చేసింది. శివమ్ దూబే, ఉతప్ప సిక్సర్లతో చుక్కలు చూపించడంతో అప్పటిదాకా భళా అనిపించిన బెంగళూరు బౌలింగ్ డీలా పడింది. హసరంగ 19వ ఓవర్లో ఉతప్ప 2 సిక్సర్లు కొట్టడంతో జట్టు వాయువేగంతో 200 మార్క్ దాటింది. మరో షాట్‌కు ప్రయత్నించి కోహ్లికి క్యాచ్ ఇచ్చి ఉతప్ప నిష్క్రమించడంతో 165 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆఖరి ఓవర్ ఆసాంతం దూబేనే ఆడి 2 సిక్సర్లతో 15 పరుగులు చేశాడు. టాపార్డర్ టపటపా... కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన బెంగళూరు 50 పరుగులకే డుప్లెసిస్, కోహ్లి, అనూజ్ రావత్, మ్యాక్స్‌వెల్ వికెట్లు కోల్పోయి లక్ష్యానికి దూరమైంది. ఈ దశలో షహబాజ్, సుయశ్ ప్రభుదేశాయ్ (18 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడుతూ జట్టు స్కోరును 100 పరుగులు దాటించారు. కానీ కొండను కరిగించేందుకు ఈ కాసేపటి జోరు సరిపోలేదు. ఇద్దర్ని మహీశ్ తీక్షణ క్లీన్‌బౌల్డ్ చేయగా... దినేశ్ కార్తీక్ సిక్సర్లు అంతరాన్ని తగ్గించిందే తప్ప విజయం వైపునకు తీసుకెళ్లలేదు. ఆకాశ్‌దీప్ కొట్టిన షాట్‌ను రాయుడు కళ్లు చెదిరే క్యాచ్‌గా పట్టేశాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హజల్‌వుడ్ 17; ఉతప్ప (సి) కోహ్లి (బి) హసరంగ 88; మొయిన్ అలీ (రనౌట్) 3; శివమ్ దూబే (నాటౌట్) 95; జడేజా (సి) అనుజ్ (బి) హసరంగ 0; ధోని (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 216. వికెట్ల పతనం: 1–19, 2–36, 3–201, 4–201. బౌలింగ్: సిరాజ్ 4–0–37–0, హాజల్‌వుడ్ 4–0–33–1, ఆకాశ్ 4–0–58–0, మ్యాక్స్‌వెల్ 3–0–29–0, షహబాజ్ 2–0–18–0, హసరంగ 3–0–35–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: డుప్లెసిస్ (సి) జోర్డాన్ (బి) తీక్షణ 8; అనూజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) తీక్షణ 12; కోహ్లి (సి) దూబే (బి) ముకేశ్ 1; మ్యాక్స్‌వెల్ (బి) జడేజా 26; షహబాజ్ (బి) తీక్షణ 41; ప్రభుదేశాయ్ (బి) తీక్షణ 34; కార్తీక్ (సి) జడేజా (బి) బ్రేవో 34; హసరంగ (సి) జోర్డాన్ (బి) జడేజా 7; ఆకాశ్ (సి) రాయుడు (బి) జడేజా 0; సిరాజ్ (నాటౌట్) 14; హాజల్‌వుడ్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–14, 2–20, 3–42, 4–50, 5–110, 6–133, 7–146, 8–146, 9–171. బౌలింగ్: మొయిన్ అలీ 3–0–19–0, ముకేశ్ 3–0–40–1, మహీశ్ తీక్షణ 4–0–33–4, రవీంద్ర జడేజా 4–0–39–3, జోర్డాన్ 2–0–20–0, బ్రేవో 4–0–42–1. చదవండి: IPL 2022: థర్డ్ అంపైర్‌కు మతి భ్రమించిందా..? View this post on Instagram A post shared by IPL (@iplt20) View this post on Instagram A post shared by IPL (@iplt20) -
IPL 2022- CSK: డుప్లెసిస్ స్థానంలో టీమిండియా వెటరన్ ఆటగాడే సరైనోడు!
మరికొన్ని రోజుల్లో క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ఆరంభం కానుంది. మార్చి 26న చెన్నై సూపర్‌కింగ్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్‌తో తాజా సీజన్ మొదలు కాబోతుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీసులో తలమునకలై పోయాయి. అయితే, గత సీజన్లో సీఎస్కేను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన స్టార్ పేసర్, వేలంలో భారీ ధర పలికిన దీపక్ చహర్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కావడంతో ధోని సేనకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అంతేగాక అత్యధిక పరుగుల వీరుడు, సీఎస్కే స్టార్ ఓపెనర్ రుతురాజ్‌గైక్వాడ్ ఫిట్నెస్ సాధించడం ఊరట కలిగించినా.. అతడికి జోడీ ఎవరన్నది ఇంకా తేలలేదు. గత సీజన్లో రుతుతో కలిసి ఓపెనింగ్ చేసిన ఫాఫ్ డుప్లెసిస్‌ను వదిలేయగా ఆర్సీబీ వేలంలో అతడిని కొనుగోలు చేసి కెప్టెన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో వీరి స్థానాల్ని భర్తీ చేయగల ఆటగాళ్లు ఎవరన్నా అన్న చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీపక్ చహర్‌ను రీప్లేస్ చేయగల సత్తా అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్ రాజ్వర్ధన్ హంగర్కర్కు ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘దీపక్ చహర్ గొప్ప బౌలర్. అతడు దూరం కావడం సీఎస్కేకు పెద్ద దెబ్బ. నిజానికి శార్దూల్ ఠాకూర్ కూడా ఇప్పుడు సీఎస్కేలో లేడు. చహర్ స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో యువ ఆటగాడు హంగర్కర్ సేవలను సీఎస్కే ఉపయోగించుకుంటే ఫలితం ఉంటుంది. అతడు ప్రతిభావంతుడు. అయితే, హంగర్కర్ చాలా చిన్నవాడు. తనకు అనుభవం తక్కువ. కానీ ధోని వంటి నాయకుడు ఉన్నపుడు ఇలాంటి విషయాలకు భయపడాల్సిన పనిలేదు. యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ ఫలితాలు రాబట్టడం, వారిని సౌకర్యంగా మెదిలేలా చేయడంలో ధోని దిట్ట. కాబట్టి హంగర్కర్ను చహర్ ప్లేస్‌లో జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది’’ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అదే విధంగా.. ‘‘ఇక ఫాఫ్ స్థానం విషయంలో సీఎస్కేకు రెండు ఆప్షన్లు ఉన్నాయి. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే. మరొకరు రాబిన్ ఊతప్ప. ఊతప్ప సైతం ఓపెనర్‌గా రాణించగలడనే నమ్మకం ఉంది. అయితే, సీఎస్కే వ్యూహం ప్రకారం ఓపెనింగ్ జోడీలో కచ్చితంగా ఒక విదేశీ ఓపెనర్ ఉండాలనుకుంటే... కాన్వే మంచి ఆప్షన్’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. చదవండి: IPL 2022: షాట్లతో అలరించిన రిషభ్ పంత్.. రెప్పవాల్చని యువ ఆటగాళ్లు 📹 Slowed to perfection! #Yellove #WhistlePodu 🦁💛 pic.twitter.com/4fS1o9sm3H — Chennai Super Kings (@ChennaiIPL) March 20, 2022 The one with "I'm gonna go with Mahi bhai first!" 💛#WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/YBTevDUJZK — Chennai Super Kings (@ChennaiIPL) March 19, 2022 -
IPL 2022: ఐపీఎల్‌తో పోలికా.. పాక్ జర్నలిస్ట్‌కి కౌంటరిచ్చిన రాబిన్ ఊతప్ప
ఐపీఎల్‌ను తక్కువ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఓ పాక్ జర్నలిస్ట్‌కు టీమిండియా ప్లేయర్, చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాడు రాబిన్ ఊతప్ప చురకలంటించాడు. ఇటీవల ఫిరోజ్ అనే సదరు పాక్ జర్నలిస్ట్.. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను ఆకాశానికెత్తుతూ, ఐపీఎల్‌ని తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. పీఎస్ఎల్తో ఐపీఎల్‌ను పోల్చకండి.. పీఎస్ఎల్ 2016లో ఆరంభమైతే, ఐపీఎల్ 2008లోనే మొదలైంది.. పీఎస్ఎల్, ఐపీఎల్ కంటే వేగంగా పాపులారిటీ దక్కించుకుంది.. ఐపీఎల్ పుట్టినప్పుడు మార్కెట్లో పోటీగా మరో లీగ్ లేదు.. అంటూ ఫిరోజ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై ఊతప్ప స్పందిస్తూ.. నువ్వు అంటున్న ఆ మార్కెట్‌ని క్రియేట్ చేసిందే ఐపీఎల్.. అంటూ గట్టిగా కౌంటరిచ్చాడు. No comparison between PSL and IPL! PSL started in 2016 while IPL inaugurated in 2008. However one has to admit PSL gained worldwide popularity more quicker in an era when other boards had introduced their leagues too whereas there was no competitor in the market when IPL was born — Arfa Feroz Zake (@ArfaSays_) March 18, 2022 ఇదిలా ఉంటే, ఇటీవల పీసీబీ అధ్యక్షుడు రమీజ్ రాజా ఐపీఎల్‌పై తన అక్కసును వెల్లగక్కడంతో ఐపీఎల్ వర్సస్ పీఎస్ఎల్ చర్చ మొదలైంది. ఐపీఎల్ తరహాలో పీఎస్ఎల్లోనూ వేలం పద్ధతి ప్రవేశపెడితే, ఇండియన్ లీగ్ ఆడేందుకు ఏ విదేశీ క్రికెటర్ ముందుకు రాడంటూ రమీజ్ సంచలన కామెంట్లు చేశాడు. ఈ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ఘాటుగా స్పందించాడు. ఓ ఆటగాడిపై 16 కోట్లు ఖర్చు చేసే స్తోమత పీఎస్ఎల్ ఫ్రాంచైజీలకు ఉందా అంటూ ప్రశ్నించాడు. కాగా, పీఎస్ఎల్లో ఆ దేశ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్‌కు ఇచ్చే రూ.3 కోట్లే అత్యధికం. చదవండి: IPL 2022: సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన నేచురల్ స్టార్ నాని -
16 కోట్లు కావాలని పట్టుబట్టాడు!.. అయితే.. అంతకంటే ఎక్కువకే మరి!
Rashid Khan Will Fetch Above 16 Crores In IPL mega Auction: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు 8 జట్ల ఫ్రాంచైజీలు రిటైన్ లిస్ట్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రషీద్ ఖాన్‌ను రీటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో రానున్న మెగా వేలంలో రషీద్‌కు భారీ ధర దక్కనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ ఆటగాడు రాబిన్ ఊతప్ప కూడా ఇటువంటి వాఖ్యలే చేశాడు. "రషీద్ ఖాన్‌కు వచ్చే మెగా వేలంలో తప్పకుండా 16 కోట్లకు పైగా దక్కుతుంది" అని ఊతప్ప పేర్కొన్నాడు. కాగా క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. రషీద్ ఖాన్ తన కోసం 16 కోట్లు వెచ్చిస్తేనే(మొదటి రిటెన్షన్) జట్టులో ఉంటానని పేర్కొన్నట్లు సమాచారం. అయితే రషీద్‌ని కాదు అని ఆజట్టు కెప్టెన్ విలియమ్సన్ వైపే మెగ్గు చూపింది. దీంతో ఆ ప్రాంఛైజీతో రషీద్ ఖాన్‌కు విభేధాలు తలెత్తినట్లు తెలుస్తోంది. కాగా సన్‌రైజర్స్ రషీద్‌ను రెండో రిటెన్షన్‌గా ఉంచాలని భావించింది. అంటే అతడికి 11 కోట్లు చెల్లంచడానికి సిద్దంగా ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. దీన్ని అతడు తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో కొత్త ఫ్రాంఛైజీ లక్నోతో ఇప్పటికే రషీద్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అదే విధంగా ఎస్ఆర్హెచ్.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (14 కోట్లు), అబ్దుల్ సమద్ (4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (4 కోట్లు)లను రీటైన్ చేసుకుంది. చదవండి: IND VS NZ: అతడు టీమిండియా ఓపెనర్‌గా రావాలి... -
'ఓపెనర్లుగా రోహిత్, రాహుల్.. వెంకటేశ్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు నో ఛాన్స్'
Robin Uthappa picks Team Indias best XI: టీ20 ప్రపంచకప్- 2021లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన టీమిండియా.. ఇప్పుడు స్వదేశంలో న్యూజిలాండ్‌ను ఢీకొనబోతున్నది. దీనిలో భాగంగా నవంబర్17 న తొలి టీ20 మ్యాచ్ బారత్-న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో తొలి టీ20లో కివీస్‌తో తలపడే టీమిండియా బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత వెటరన్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఎంచుకున్నాడు. తన జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. మూడో స్ధానంలో రుతురాజ్ గైక్వాడ్‌కు, నాలుగో స్ధానంలో శ్రేయాస్ అయ్యర్‌కు చోటు ఇచ్చాడు. ఐదో స్ధానంలో సూర్యకూమార్ యాదవ్‌కు అవకాశం ఇచ్చాడు. ఆరో స్ధానంతో పాటు,వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను ఎంచుకున్నాడు. ఇక స్పిన్నర్ల కోటాలో రవి ఆశ్విన్కు, యుజ్వేంద్ర చాహల్‌కు చోటు ఇచ్చాడు. జట్టులో ఫాస్ట్ బౌలర్లగా భువనేశ్వర్ కూమార్, హర్షల్ పటేల్, మొహ్మద్ సిరాజ్‌ను ఊతప్ప ఎంపిక చేశాడు. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన వెంకటేశ్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు ఊతప్ప ప్రకటించిన జట్టులో చోటు దక్కలేదు. ఊతప్ప ప్లేయింగ్ ఎలెవన్ జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రవి అశ్విన్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్ -
రెండు జట్లు ఓకే.. అయితే పాకిస్తానే నా ఫేవరెట్: టీమిండియా క్రికెటర్
Robin Uthappa Picks Pakistan As Favourites In Semi Final Clash Against Australia: టీ20 ప్రపంచకప్-2021 చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే తొలి సెమిఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయం సాధించి న్యూజిలాండ్ ఫైనల్లో అడుగు పెట్టింది. ఇక గురువారం(నవంబర్11)న రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో భారత వెటరన్ ఆటగాడు రాబిన్ ఊతప్ప ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఈ కీలక పోరులో పాకిస్తాన్ విజయం సాధించి ఫైనల్‌కు చేరుతుందని ఊతప్ప జోస్యం చెప్పాడు. ఈ టోర్నమెంట్లో ఇరు జట్లు అద్బుతంగా ఆడుతున్నాయని.. అయితే పాక్ మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదని, అందుకే ఫేవరెట్‌గా ఎంచుకున్నానని అతడు తెలిపాడు. "టీ20 ప్రపంచకప్‌లో తదుపరి సమరం పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ మెగా టోర్నమెంట్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని ఏకైక జట్టుగా పాకిస్తాన్ కొనసాగుతుంది. అది వారికి కలిసిసొస్తుందని నేను ఆశిస్తున్నాను. మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఈ టోర్నమెంట్లో ఆద్బుతంగా ఆడుతోంది. ఆసీస్‌ను కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఐసీసీ టోర్నమెంట్లో వాళ్లకు మంచి రికార్డు ఉంది. కానీ టీ20 ప్రపంచకప్‌లో ఒక్కసారి కూడా టైటిల్‌ను అందకోలేకపోయారు. ఈ టోర్నీలో ఆసీస్ ఓపెనర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. కంగారూలు తమదైన రోజున ఏ జట్టునైనా ఓడించగలరు" అని ఊతప్ప పేర్కొన్నాడు. Koo App Can’t wait for the two super exciting semis coming up! #t20worldcup #EngVsNZ #PakVsAus #semifinals #sabsebadastadium View attached media content - Robin Uthappa (@robinuthappa) 10 Nov 2021 -
"నువ్వు సూపరప్పా ఊతప్ప".. సీఎస్కే ప్లేయర్ క్రీడాస్పూర్తికి నెటిజన్లు ఫిదా
Robin Uthappa Viral Video In IPL 2021: ఐపీఎల్-2021 రెండో దశలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్ధేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే 4 వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలోనే ఛేదించి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇది జరిగిన అనంతరం సీఎస్కే 12వ ఆటగాడు రాబిన్ ఊతప్ప చేసిన ఓ పనికి యావత్ క్రీడా ప్రపంచం సలాం అంటుంది. 💛#WhistlePodu#csk pic.twitter.com/fPHWTP1yCZ— Chakri Dhoni (@ChakriDhoni17) September 25, 2021 సీఎస్కేను విజయతీరాలకు చేర్చిన అనంతరం కెప్టెన్ ధోని(11 నాటౌట్), సురేశ్ రైనా(17 నాటౌట్)లు పెవిలియన్‌కు వస్తుండగా ఊతప్ప ఎదురు వెళ్లి వారి బ్యాట్లను, హెల్మెట్లను డ్రెస్సింగ్ రూంకు తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది. దీంతో "నువ్వు సూపరప్పా ఊతప్ప" అసలు సిసలైన క్రీడాస్పూర్తిని చూపావంటూ.. నెటిజన్లు ఉతప్పపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో సీఎస్కేనే విజయం సాధించింది. ముంబై వేదికగా జరిగిన తొలి అంచె పోటీలో సీఎస్కే 69 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. కాగా, యువ బ్యాట్స్మెన్లు జట్టులో ఉండడంతో ప్రస్తుత సీజన్లో ఊతప్పకు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా దక్కలేదు. ఈ సీజన్‌కు ముందే రాజస్థాన్ రాయల్స్ నుంచి సీఎస్కేకు వచ్చిన రాబీ.. తన ఐపీఎల్ కెరీర్లో వివిధ జట్ల(అధికంగా కేకేఆర్) తరఫున 189 మ్యాచ్‌లు ఆడి 4607 పరుగులు చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కేకేఆర్‌ను రెండుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలపడంలో ఊతప్ప కీలకంగా వ్యవహరించాడు. చదవండి: అరుదైన 600 వికెట్ల క్లబ్లో చేరిన టీమిండియా పేసర్ -
అక్తర్ వార్నింగ్.. మళ్లీ అలా ఆడేందుకు ధైర్యం చేయలేదు: ఊతప్ప
పాకిస్థాన్ బౌలర్ షాయబ్ అక్తర్ గతంలో ఒకసారి తనని హెచ్చరించాడని భారత క్రికెటర్ రాబిన్ ఊతప్ప తెలిపాడు. 'వేక్ అప్ విత్ సోరబ్' కార్యక్రమంలో కమెడియన్ సోరబ్ పంత్‌తో మాట్లాడుతూ ఊతప్ప ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. 2007లో పాక్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ సందర్భంగా ఈ ఘటన జరిగిందని చెప్పాడు. ఆ సిరీస్‌లో గువాహటి వన్డే తర్వాత జరిగిన డిన్నర్ సమయంలో అక్తర్ తనతో మాట్లాడిన సంగతిని చెప్పుకొచ్చాడు. గువాహటి వన్డేలో.. నేను క్రీజులో ఉన్న సమయానికి 25 బంతుల్లో 12 పరుగులు కావాలి. ఇర్ఫాన్, నేను క్రీజులో ఉన్నాం. ఆ సమయంలో షాయబ్ అక్తర్ బౌలింగ్ చేస్తున్నాడు. అతనను బంతిని 154 కి.మీ. వేగంతో ఓ యార్కర్ విసిరాడు. దానిని నేను ఆపగలిగాను. ఆ తర్వాత బంతికి మరో యార్కర్ ట్రై చేసి ఫుల్ టాస్ రావడంతో ఆ బంతిని బౌండరీకి తరలించాను. ఇక అక్తర్ తరువాత బంతలను వరుసగా యార్కర్లు వేస్తున్నాడు. ఆ సమయంలో పరుగులు రావలంటే క్రీజు దాటి ఫ్రంట్ ఫుట్‌లో ఆడాలని నిర్ణయించుకున్నా. తరువాత బంతికి క్రీజు బయటికొచ్చి నా బ్యాట్‌ను తాకించా. అది బౌండరీ వెళ్లింది. మేం ఆ మ్యాచ్‌ను గెలిచాం. మ్యాచ్ అనంతరం మేము జట్టు సభ్యులతో కలిసి విందు చేస్తున్నట్లు నాకు గుర్తుంది. అక్తర్ భాయ్ కూడా అక్కడే ఉన్నాడు. అప్పుడు నా వద్దకు వచ్చి రాబిన్.. ఇవాల్టి మ్యాచ్‌లో క్రీజు దాటి బయటకు వచ్చి ఆడావు. కానీ మళ్ళీ అలా ఆడితే.. నీ తలకి గురిపెడుతూ బౌన్సర్‌ను వేస్తా అని హెచ్చరించి వెళ్లిపోయాడు. ఆ తరువాత, నేనతని బౌలింగ్‌లో అలా ఆడటానికి ధైర్యం చేయలేదని ఊతప్ప తెలిపాడు. ( చదవండి: కెప్టెన్ చెప్పిన వాళ్లను ఎంపిక చేయరు.. మా పద్దతి అదే ) -
హెడెన్ నాతో 2-3 ఏళ్లు మాట్లాడలేదు.. బాధేసింది.. కానీ
న్యూఢిల్లీ: ఆటలో గెలుపోటములు సహజం. క్రీడా స్పూర్తితో ముందుకు సాగితే మైదానం వెలుపల ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతోనైనా ఇట్టే కలిసిపోవచ్చు. ముఖ్యంగా సీనియర్ల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటే అవి కెరీర్‌పరంగా కూడా ఉపయోగపడతాయి. కానీ, చిన్న చిన్న పొరపొచ్చాల వల్ల మనకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తికి దూరంగా ఉండాల్సి వస్తే బాధ పడటం సహజం. టీమిండియా వెటరన్ ప్లేయర్ రాబిన్ ఊతప్పకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. టీ20 వరల్డ్ కప్- 2007 నాటి మ్యాచ్‌లో భాగంగా చోటుచేసుకున్న స్లెడ్జింగ్ కారణంగా మ్యాథ్యూ హెడెన్‌తో చాలాకాలం పాటు అతడితో మాట్లాడలేకపోయానని ఊతప్ప తాజాగా వెల్లడించాడు. సౌరభ్ పంత్ యూట్యూబ్ షో.. ‘వేకప్ విత్ సౌరభ్’లో ఊతప్ప మాట్లాడుతూ.. ‘‘ ఆ మ్యాచ్‌లో గౌతీ(గౌతం గంభీర్), నేను.. ఆండ్రూ సైమండ్స్, మిచెల్ జాన్సన్, బ్రాడ్ హాడిన్ స్లెడ్జింగ్‌ను తిప్పికొట్టాం. అయితే, ఒక వ్యక్తిగా, బ్యాట్స్‌మెన్‌గా నాకెంతో స్ఫూర్తిగా నిలిచిన మాథ్యూ హెడెన్‌తో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురుకావడం కాస్త కష్టంగా తోచింది. తను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నన్ను ఉద్దేశించి ఏదో అన్నాడు. నేను కూడా తనకు దీటుగా బదులివ్వాలని నిర్ణయించుకున్నాను. అలా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే, అది అక్కడితో ముగిసిపోలేదు. ఈ ఘటన జరిగిన తర్వాత రెండు, మూడేళ్ల పాటు అతడు నాతో మాట్లాడలేదు. నాకు దూరంగా ఉండేవాడు. అది నన్ను చాలా బాధించింది. ఆ మ్యాచ్‌లో మేం గెలిచాం. కానీ, నా రోల్‌మోడల్‌తో మాట్లాడే అవకాశం కోల్పోయాను’’ అని చెప్పుకొచ్చాడు. అయితే, తన కెరీర్లోనే అత్యంత గొప్పదైన మ్యాచ్ అదేనని, ఆటను పూర్తిగా ఆస్వాదిస్తూనే ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించామని గుర్తుచేసుకున్నాడు. కాగా దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ధోని సేన ఆస్ట్రేలియాను ఓడించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు 46 వన్డేలు, 13 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఊతప్ప వరుసగా 934, 249 పరుగులు చేశాడు. చదవండి: 10-12 ఏళ్లు.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా: సచిన్ -
ఇలా ఆడితే మీ కథ ముగిసినట్లే: గంభీర్
న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్ సీజన్లో వరుసగా విఫలమవుతున్న రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రాబిన్ ఊతప్పపై మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మండిపడ్డాడు. ఎన్నో అంచనాలతో జట్టులోకి తీసుకున్న ఊతప్ప ఏమి చేస్తున్నాడని విమర్శించాడు. వచ్చామా.. వెళ్లామా అన్నట్లే ఊతప్ప బ్యాటింగ్ ఉందని గంభీర్ ధ్వజమెత్తాడు. అసలు ఊతప్ప నుంచి ఏమి ఆశించారో దాన్ని ఇప్పటివరకూ అతను చేయలేదన్నాడు. కనీసం మ్యాచ్‌లో ఊపును తీసుకొచ్చే యత్నం కూడా చేయడం లేకపోవడం కరెక్ట్ కాదన్నాడు. అదే సమయంలో రియాన్ పరాగ్ సరిగా ఆకట్టుకోవడం లేదన్నాడు. వారి ఆట ఇలానే ఉంటే రిజర్వ్ బెంచ్‌లో కూర్చొని మ్యాచ్‌లు చూసే పరిస్థితి వస్తుందన్నాడు. రాజస్తాన్ మేనేజ్మెంట్ అంచనాలను అందుకోవడానికి ఊతప్ప, పరాగ్‌లు యత్నించాల్సి ఉందన్నాడు.(చదవండి: ఆ క్రెడిట్ అంతా వారిదే: డుప్లెసిస్) మిడిల్ ఆర్డర్లో రాజస్తాన్ అంచనాలను అందుకోలేకపోవడంతోనే గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓటమి పాలైందన్నాడు. స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్, జోస్ బట్లర్‌ల పైనే రాజస్తాన్ ఎక్కువగా ఆధారపడతుండటమే వారి ఓటములకు కారణమన్నాడు. ఇక రాజస్తాన్ జట్టుతో బెన్ స్టోక్స్ కలిశాడు కాబట్టి బ్యాటింగ్ కాంబినేషనల్ మార్పులు చూస్తామన్నాడు. స్టోక్స్ రావడంతో రాజస్తాన్ బలం పుంజుకుంటుందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. టాపార్డర్ బ్యాటింగ్‌లో లోటు స్టోక్స్ రాకతో తీరుతుందన్నాడు. జోస్ బట్లర్, స్మిత్, శాంసన్‌లు తొందరగా ఔటైన క్రమంలో మిడిల్ ఆర్డర్ చేతులెత్తేస్తుందని దీన్ని అధిగమిస్తే రాజస్తాన్‌కు తిరుగుండదని ఈసీపీఎన్ క్రిక్ ఇన్ఫోతో మాట్లాడుతూ గంభీర్ పేర్కొన్నాడు.ఈ సీజన్లో 3 కోట్ల రూపాయలకు ఊతప్పను రాజస్తాన్ కొనుగోలు చేసింది. కానీ ఇప్పటివరకూ దానికి ఊతప్ప న్యాయం చేయలేదు. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో (17, 2, 9, 5) దారుణంగా విఫలమయ్యాడు. -
అలవాట్లో పొరపాటు!
దుబాయ్: కరోనా నేపథ్యంలో ఐసీసీ జారీ చేసిన కోవిడ్–19 ప్రొటోకాల్‌ను భారత క్రికెటర్ రాబిన్ ఉతప్ప అతిక్రమించాడు. రాజస్తాన్ రాయల్స్‌కు ఆడుతున్న ఉతప్ప బుధవారం రాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బంతికి లాలాజలం (ఉమ్ము) రుద్దాడు. పొరపాటో లేక అలవాటో గానీ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అతను ఈ పని చేశాడు. ఐదో బంతిని ఆడిన కోల్‌కతా ఓపెనర్ నరైన్ ఇచ్చిన క్యాచ్‌ను రాబిన్ నేలపాలు చేశాడు. తర్వాత బంతికి సలైవా (ఉమ్ము) రుద్దుతూ కెమెరా కంటపడ్డాడు. ఇదేం నిర్వాకమంటూ ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఉమ్మి రుద్దడాన్ని నిషేధించారు. అలా చేస్తే అంపైర్లు బంతిని శానిటైజ్ చేసి నిబంధనలు గుర్తు చేస్తారు. అలాగే మళ్లీ మళ్లీ (రెండుసార్లు) చేస్తే హెచ్చరిస్తారు. అయినా మారకపోతే శిక్షగా ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు అదనంగా ఇస్తారు. -
నిబంధన ఉల్లంఘించిన రాబిన్ ఊతప్ప
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా బుధవారం రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ ఆటగాడు రాబిన్ ఊతప్ప నిబంధనలు మరుస్తూ చిన్న పొరపాటు చేశాడు. కోల్‌కతా ఇన్నింగ్స్ సందర్భంగా మూడో ఓవర్లో సునీల్ నరైన్ బారీ షాట్ కొట్టాడు. ఈ సందర్భంగా గాల్లోకి లేచిన బంతి బౌండరీ లైన్ వద్ద ఊతప్ప చేతిలో పడినా వెంటనే జారి కిందపడిపోయింది. అయితే క్యాచ్‌ను డ్రాప్ చేసిన వెంటనే ఊతప్ప తన నోటి నుంచి ఉమ్మిని తీసి పొరపాటుగా బంతికి రాశాడు. (చదవండి : అప్పుడు సచిన్.. ఇప్పుడు సంజు.. అచ్చం ఒకేలా!) అయితే కరోనా ప్రబలిన తర్వాత బంతికి ఉమ్మిని రుద్దడం అనేది ఐసీసీ బ్యాన్ చేసింది. తాజా నిబంధనల ప్రకారం ఒక ఇన్నింగ్స్‌లో రెండు సార్లు మాత్రమే ఇలాంటి పొరపాట్లకు అవకాశం ఉంటుంది. ఒకవేళ పదేపదే ఇవే పొరపాట్లు చేస్తే బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు అధనంగా 5 పరుగుల ఇచ్చేలా పెనాల్టీ విధిస్తారు. అయితే రాబిన్ ఊతప్ప ఇలా చేయడం తొలిసారి గనుక దీనిపై అతను చేసిన పనికి ఎలాంటి చర్యలు తీసుకోరు. కాగా పలు ఐపీఎల్ సీజన్లలో కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడిన ఊతప్ప ఈసారి మాత్రం రాజస్తాన్ రాయల్స్ జట్టు తరపున ఆడుతూ పూర్తిగా విఫలమవుతూ వస్తున్నాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేక జట్టుకు భారంగా మారాడు. ఇక ఫీల్డింగ్‌లోనూ నాసిరక ప్రదర్శనను కనబరుస్తూ పూర్తిగా విఫలమయ్యాడు. కాగా ఇదే మ్యాచ్ లో రాబిన్ ఊతప్ప ఖాతాలో మరో చెత్త రికార్డు చేరింది. కేకేఆర్ చేతిలో రాజస్తాన్ ఓడిపోవడంతో ఐపీఎల్ లో అత్యధిక ఓటములను చవిచూసిన ఆటగాడిగా ఊతప్ప నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో వున్న ఈ చెత్త రికార్డు తాజాగా ఊతప్ప పేరిట నమోదయ్యింది. ఊతప్ప ప్రాతినిధ్యం వహించిన జట్టు ఓటముల సంఖ్య 91 కి చేరుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో కోహ్లీ, దినేష్ కార్తిక్, రోహిత్ శర్మ, అమిత్ మిశ్రాలు నిలిచారు. కోహ్లీ 90, దినేష్ కార్తిక్ 87, రోహిత్ శర్మ 85, అమిత్ మిశ్రా 57 ఓటములను చవిచూశారు. కాగా వరుసగా రెండు విజయాలతో మంచి ఊపుమీద కనిపించిన రాజస్తాన్ కేకేఆర్ బౌలర్ల దాటికి లక్క్ష్య చేధనలో తడబడి 137 పరుగుల వద్దే ఆగిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.(చదవండి : 'మ్యాక్స్‌వెల్‌ను ఇష్టపడింది నేను.. మీరు కాదు') -
ఇంకా ఆశతోనే ఉన్నా: ఊతప్ప
దుబాయ్: త్వరలో యూఏఈ వేదికగా జరగబోయే ఐపీఎల్-13వ సీజన్లో సత్తాచాటి భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని వెటరన్ ఆటగాడు రాబిన్ ఊతప్ప చూస్తున్నాడు. ఈ ఏడాది రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడబోతున్న ఊతప్ప.. తన అంతర్జాతీయ పునరామనంపై ఎన్నో ఆశలతో ఉన్నాడు. ఈ మేరకు ఐపీఎల్‌ను సన్నాహకంగా ఉపయోగించుకోవాలన్నాడు. ఈ సీజన్ ఐపీఎల్ తన కెరీర్‌కు కీలక మలుపు కాబోతుందని ఊతప్ప ఆశిస్తున్నాడు. రాజస్తాన్ రాయల్స్ ట్వీటర్ వేదికగా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఊతప్ప తన మనసులోని మాటను వెల్లడించాడు. ‘ ఒక చక్కటి ఐపీఎల్ సీజన్ నిన్ను తిరిగి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేలా చేస్తుందని నమ్ముతున్నావా?’ అని అడగ్గా, దానికి అవుననే సమాధానం ఇచ్చాడు రాబిన్.(చదవండి: ‘తప్పు చేశాం.. వరల్డ్‌కప్ చేజార్చుకున్నాం’) ‘ ఇంకా ఆ డ్రీమ్ సజీవంగానే ఉంది’ అని పేర్కొన్నాడు. 2015లో భారత్ తరఫున చివరిసారి ఆడిన ఊతప్ప.. 46 వన్డేలు, 13 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 25.94 యావరేజ్‌తో 934 పరుగులు చేయగా, అంతర్జాతీయ టీ20ల్లో 249 పరుగులు చేశాడు. 2007లో భారత్ జట్టు గెలిచిన టీ20 వరల్డ్‌కప్‌లో ఊతప్ప సభ్యుడు. ఇక ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే 177 మ్యాచ్‌లు ఆడి 4,411 పరుగులు చేశాడు. ఇక్కడ యావరేజ్ 28.83 ఉండగా, స్టైక్‌రేట్ 130.5గా ఉంది. కాగా, కోల్‌కతా గెలిచిన రెండు ఐపీఎల్ టైటిల్స్‌లో ఊతప్ప భాగమయ్యాడు. గతేడాది ఊతప్పను కేకేఆర్ వదులుకోవడంతో అతన్ని రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. (చదవండి: సురేశ్ రైనా.. దుబాయ్ లైఫ్) #AskRobin Q6. 👇@PrabhuKaGyaan: Do you believe that a strong IPL season could bring you back in the reckoning for Team India? "That dream is very much alive." 👇💪 #HallaBol | @robbieuthappa pic.twitter.com/k8NGKoJscg — Rajasthan Royals (@rajasthanroyals) August 23, 2020 -
రాబిన్ ఊతప్పపై శ్రీశాంత్ ఆగ్రహం
హైదరాబాద్ : టీమిండియా బ్యాట్స్‌మన్ రాబిన్ ఊతప్పపై సహచర ఆటగాడు, కేరళ స్పీడస్టర్ శ్రీశాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఊతప్ప.. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ మిస్బావుల్ హక్ ఇచ్చిన క్యాచ్‌ను శ్రీశాంత్ పడతాడనుకోలేదని పేర్కొన్న విషయం తెలిసిందే. శ్రీశాంత్ క్యాచ్‌లు జారవిడుస్తాడనే పేరు కూడా ఉందని, అందుకే ఆ సమయంలో అతడు క్యాచ్ పట్టాలని దేవుడిని ప్రార్థించినట్లు ఆనాటి విషయాలను గుర్తుచేసుకున్నాడు. టీమిండియాకు రాసిపెట్టి ఉండటం వల్లే టీ20 ప్రపంచకప్-2007 గెలిచామనే భావన ఇప్పటికీ ఉందని అతడు పేర్కొన్నాడు. (‘ఆత్మహత్య చేసుకోవాలనిపించేది’) తాజాగా ఊతప్ప వ్యాఖ్యలను ఓ నెటిజన్ శ్రీశాంత్ ముందు తీసుకరాగా అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘ఊతప్ప తన కెరీర్లో ఇప్పటివరకు ఎన్ని క్యాచ్‌లు పట్టాడో నాకైతే తెలియదు. దేశవాళీ క్రికెట్లో గత సీజన్లో అతడు కేరళ తరుపున ఆడాడు. ఆ సమయంలో చాలా క్యాచ్‌లు నేలపాలు చేశాడనే అపవాదు ఉంది. త్వరలోనే నేను కేరళ తరుపున బరిలోకి దిగుతున్నా. ఈ సందర్భంగా అతడికి ఒకటి చెప్పాలనుకుంటున్నా దయచేసి నా బౌలింగ్‌లో క్యాచ్‌లు జారవిడచకు. గత సీజన్లో కేరళ జట్టులో అందరూ నీకన్నా జూనియర్స్ ఉండటంతో నిన్ను ఏం అనలేదు. కానీ నా బౌలింగ్‌లో క్యాచ్‌లు నేలపాలు చేస్తే ఏం చేస్తానో ఊతప్పకు బాగా తెలుసు’ అంటూ శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు. (భారత క్రికెటర్లతో టచ్‌లో ఉన్నా: శ్రీశాంత్) -
‘ఆత్మహత్య చేసుకోవాలనిపించేది’
బెంగళూరు: మానసిక ఆందోళనతో తాను తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నానని భారత క్రికెటర్ రాబిన్ ఉతప్ప అన్నాడు. ఒక దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనే ఆలోచనలు వచ్చినట్లు అతను చెప్పాడు. ఉతప్ప టీమిండియా తరఫున 46 వన్డేలు, 13 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2008లో జట్టులో చోటు కోల్పోయిన సమయంలో తీవ్ర ఒత్తిడి కారణంగా పలు రకాల ఆలోచనలతో తాను సతమతమయ్యేవాడినని ఉతప్ప గుర్తు చేసుకున్నాడు. ‘2009–2011 మధ్య కాలంలో నేను దాదాపు ప్రతీ రోజూ తీవ్రమైన మానసిక వేదనను అనుభవించాను. భారత జట్టులో స్థానం లభించకపోవడం కూడా ఒక కారణం కావచ్చు కానీ క్రికెట్ మాత్రమే కాకుండా ఇతరత్రా కూడా నేను తీవ్ర ఒత్తిడికి లోనయ్యా. ముఖ్యంగా క్రికెట్ జరగని రోజుల్లో నా పరిస్థితి దారుణంగా ఉండేది. అసలు ఈ రోజు గడుస్తుందా, రేపటి వరకు ఉండగలనా అనిపించేది. అలా పరుగెత్తుకుంటూ వెళ్లి బాల్కనీలోంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనే భావన కూడా వచ్చింది. కానీ ఏదోలా అది ఆగిపోయింది.’ అని ఉతప్ప తన అనుభవాన్ని వెల్లడించాడు. -
బాల్కనిలో నుంచి కిందకి దూకేద్దామనిపించింది
-
బాల్కనీ నుంచి దూకేద్దామనుకున్నా: ఊతప్ప
బెంగళూరు: తాను క్రికెట్‌కు దూరమైన ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నానని టీమిండియా వెటరన్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తాజాగా తెలిపాడు. క్రికెట్ మ్యాచ్‌లు ఆడకపోవడంతో ప్రతీ రోజూ నరకం అనుభవించేవాడినని, దాంతో చావే శరణ్యమని భావించేవాడినన్నాడు. రేపు భవిష్యత్తు ఏంటి అనే ఆలోచనలతో తీవ్రంగా సతమతమయ్యేవాడినని, దాంతో ఇంటి బాల్కనీ నుంచి దూకేద్దామని అనుకున్నానన్నాడు. రాయల్ రాజస్తాన్ ఫౌండేషన్ నిర్వహించిన మైండ్, బాడీ, సోల్ కార్యక్రమంలో మాట్లాడిన ఊతప్ప.. ఆత్మహత్య చేసుకునే ఆలోచన ఎలా వచ్చిందో వివరించాడు. ‘నేను 2006లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేశా. అప్పుడు నా గురించి నాకు పెద్దగా తెలియదు. అప్పటి నుండి చాలా నేర్చుకోవడం ఆరంభించా. ప్రస్తుతం నా గురించి నాకు బాగా తెలుసు. నా ఆలోచనల్లో క్లారిటీ ఉంది. నేను కిందికి పడిపోతుంటే ఎలా పైకి వెళ్లాలనే దానిపై అవగాహన ఉంది. (ఇంత ఆటవికమా: రోహిత్ శర్మ) నేను ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్నానంటే చాలా అడ్డంకులు దాటుకుంటూ వచ్చాను. ఒకానొక సమయంలో పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. అప్పుడు సూసైడ్ చేసుకోవాలని అనుకుడేవాడిని. 2009 నుంచి 2011 మధ్యకాలంలో నరకం అనుభవించా. క్రమేపీ నాకు నేనుగా మెరుగుపడుతూ ఆ ఆలోచనలు నుంచి బయటకొచ్చా. ఇప్పుడు కేవలం క్రికెట్‌పైనే దృష్టి పెట్టడం లేదు. పలు విషయాలపై దృష్టి సారిస్తూ నా మనసును ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. నేను వెళ్లే మార్గం సరైనదా.. కాదా అని అన్వేషించుకుంటూ నా రోటీన్ లైఫ్‌లో ముందుకు సాగుతున్నా’ అని ఊతప్ప తెలిపాడు. తన అంతర్జాతీయ కెరీర్లో 46 వన్డేలు, 13 టీ20లు ఆడాడు.(యువీకి సరికొత్త తలనొప్పి) -
‘అతను మరో ధోని కావడం ఖాయం’
న్యూఢిల్లీ: ఏడాది కాలంగా భారత క్రికెట్ జట్టుకు దూరమైన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రీఎంట్రీ ఇప్పట్లో ఉండకపోవచ్చు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్ తర్వాత ధోని ఇప్పటి వరకూ తిరిగి అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు కదా.. కనీసం దేశవాళీ మ్యాచ్‌లో కూడా పాల్గొనలేదు. ఈ సీజన్ ఐపీఎల్ ఆడటానికి ధోని ముందుగానే సిద్ధమైనా అది జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. అన్ని అనుకూలిస్తే టీ20 వరల్డ్‌కప్‌లో ధోని కనిపించవచ్చు. అయితే ఒక గొప్ప మ్యాచ్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తే అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే చర్చ గత కొంతకాలంగా నడుస్తూనే ఉంది. ధోని స్థానాన్ని రిషభ్ పంత్ భర్తీ చేస్తాడని చాలామంది అనుకున్నారు. కానీ అది ఇప్పట్లో మనం చూసేలా కనబడుటం లేదు. కాగా, భారత క్రికెట్ జట్టు ఒక గొప్ప ఫినిషర్‌ను చూడబోతుందని వెటరన్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప జోస్యం చెప్పాడు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడుతున్న లెగ్ స్పిన్నర్, అస్సాం క్రికెటర్ రియాన్ పరాగ్‌లో ధోని తరహా లక్షణాలు ఉన్నాయన్నాడు. (‘నేను టాస్ ఓడిపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేది’ ) బ్యాటింగ్ పరంగా గొప్ప మ్యాచ్ ఫినిషింగ్ లక్షణాలు పరాగ్‌లో ఉన్నాయన్నాడు. తాజాగా క్రిక్‌ఫిట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రాబిన్ ఊతప్ప పలు విషయాలను షేర్ చేసుకున్నాడు. అందులో ధోని తర్వాత మ్యాచ్ ఫినిషర్ పాత్ర ఎవరు పోషించబోతున్నారనే దానికి ఊతప్ప సమాధానం చెప్పాడు. ‘ ధోనికి స్థానానికి రియాన్ పరాగ్ సమాధానం అవుతాడు. ప్రస్తుతం పరాగ్ బ్యాటింగ్ చూస్తుంటే ఒక మంచి అనుభూతి కలుగుతుంది. నెక్స్ట్ ఎంఎస్ ధోని అతడే. త్వరలోనే 18 ఏళ్ల రియాన్ పరాగ్ భారత జట్టులో అరంగేట్రం చేయడం ఖాయం. నా ప్రకారం చూస్తే అతను భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘ కాలం ప్రాతినిథ్యం వహిస్తాడు. అతనిలో గొప్ప ఫినిషింగ్ లక్షణాలున్నాయి’అని ఊతప్ప తెలిపాడు. 2019 ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరుఫున ఈ లీగ్‌లో పరాగ్ అరంగేట్రం చేశాడు. అదే సమయంలో గతేడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో ఊతప్పను రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. (క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్) -
మమ్మల్ని ఆడనివ్వండి.. నిజాయితీగా ఉండండి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికితే కానీ విదేశీ లీగ్‌లు ఆడటానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అనుమతి ఇవ్వకపోవడంపై భారత క్రికెట్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అసలు అంతర్జాతీయ క్రికెట్‌ను వదులుకుంటేనే విదేశీ లీగ్‌లు ఆడటానికి బీసీసీఐ అనుమతి ఇవ్వడాన్ని ఇప్పటికే ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్‌లు వ్యతిరేకించగా, తాజాగా ఆ జాబితాలో వెటరన్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప చేరిపోయాడు. ఎటువంటి షరతులు లేకుండా భారత క్రికెటర్లను విదేశీ లీగ్‌లో ఆడుకోవడానికి అనుమతి ఇవ్వాలని బీసీసీఐని వేడుకున్నాడు. ఒకవైపు భారత క్రికెట్లో చోటు లేకుండా, మరొకవైపు విదేశీ లీగ్‌లు ఆడనివ్వకుండా చేయడం తగదన్నాడు. భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌లు ఆడితే నష్టమేమీ లేనప్పుడు దానికి ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. (‘బౌలౌట్’ విజయం.. పూర్తి క్రెడిట్ అతడికే!) ఇక నుంచైనా ఎటువంటి నిబంధనలు లేకుండా తాము ఎక్కడైనా ఆడుకోవడానికి అనుమతి ఇవ్వాలన్నాడు. ఈ విషయంలో బీసీసీఐ నిజాయితీగా వ్యవహరించాలన్నాడు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్య్యూలో ఊతప్ప మాట్లాడుతూ.. ‘మమ్మల్ని విదేశీ లీగ్‌లు ఆడటానికి వెళ్లనివ్వండి. నిజాయితీగా ఉండండి. భారత క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పకపోతే విదేశీ లీగ్‌లకు బీసీసీఐ నుంచి అనుమతి లేదు. ఇది బాధాకరమే కాదు.. మమ్మ్మల్ని తీవ్రంగా వేధిస్తోంది. మిగతా దేశాల క్రికెటర్లు విదేశీ లీగ్‌లు ఆడుతున్నట్లు మాకు అనుమతి ఇస్తే అది చాలా బాగుంటుంది. ఒక క్రికెటర్‌గా గేమ్‌లో ఏదైనా నేర్చుకోవాలంటే ఆడుతూ ఉండాలి. ఇందుకు విదేశీ లీగ్‌లు ఆడాల్సి ఉంది’ అని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు. గతేడాది యువరాజ్ సింగ్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. కెనడా లీగ్ ఆడే క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికితే కానీ బీసీసీఐ ఎన్ఓసీ ఇవ్వలేదు. ఇదే విషయాన్ని ఇప్పుడు అంతా తప్పుబడుతున్నారు. ఏ దేశ క్రికెట్ బోర్డుకు లేని నిబంధన బీసీసీఐ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ చొరవ తీసుకుని ఈ నిబంధనకు చరమగీతం పాడాలని కోరుతున్నారు. (సఫారీ పర్యటనకు మాటివ్వలేదు: ధుమాల్) -
పాక్‌పై ‘బౌలౌట్’ విజయం.. క్రెడిట్ అతడిదే!
హైదరాబాద్: టీ20 ప్రపంచకప్-2007లో భాగంగా లీగ్దశలో పాకిస్తాన్‌పై ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రత్యేక విజయాన్ని టీమిండియా నమోదు చేసిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ చూడనిది.. ప్రస్తుత క్రికెట్లోనూ కనిపించని ‘బౌలౌట్’ అనే కొత్త విధానంతో ధోని నాయకత్వంలోని అప్పటి యువ భారత జట్టు అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు, వెటరన్ క్రికటెర్ రాబిన్ ఊతప్ప ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరుపున ఆడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ జట్టు నిర్వహించిన ఇన్‌స్టా లైవ్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆనాటి మధుర స్మృతులను గుర్తుచేసుకున్నాడు. ‘బౌలౌట్ విజయం ఎప్పటికీ ప్రత్యేకమనే చెప్పాలి. పాక్‌పై ఈ విధానంతో గెలిచామంటే పూర్తి క్రెడిట్ అప్పటి సారథి, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనికే దక్కుతుంది. ఎందుకంటే టోర్నీ ఆరంభానికి ముందు ధోని అందరిచేత ‘బౌలౌట్’ ప్రాక్టీస్ చేయించాడు. అంతేకాకుండా మ్యాచ్ టై అయి ఫలితం కోసం బౌలౌట్‌కు వెళ్లినప్పుడు వికెట్ల వెనకాల ధోని చేసిన కీపింగ్ విధానం వెరీవెరీ స్పెషల్ అని చెప్పాలి. పాక్ కీపర్ కమ్రాన్ ఆక్మల్ రెగ్యులర్‌గా వికెట్ల వెనకాల నిల్చుంటే.. ధోని మాత్రం విభిన్నంగా వికెట్ల వెనకాల కూర్చొని ఉన్నాడు. దీంతో మేము ధోనిని లక్ష్యంగా చేసుకొని బౌలింగ్ చేసి సులువుగా స్టంప్స్ పడగొట్టాము. అందుకే ఆ విజయం క్రెడిట్ ధోనికే దక్కుతుంది’ అని ఊతప్ప వ్యాఖ్యానించాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్-పాక్ జట్ల స్కోర్లు సమమవ్వడంతో అందరిలో ఒకటే ఉత్కంఠ. అంపైర్లు బౌలౌట్ విధానం ద్వారా ఫలితాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం టీమిండియా సెహ్వాగ్, ఊతప్ప, శ్రీశాంత్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్‌సింగ్ పేర్లను ప్రకటించగా.. పాకిస్థాన్ జట్టు ఉమర్‌గుల్, సోహైల్ తన్వీర్, అరాఫత్, షాహిద్ అఫ్రిది, అసిఫ్‌లను ఎంచుకుంది. తొలి బంతిని సెహ్వాగ్ బౌల్డ్ చేయగా పాక్ బౌలర్ అరాఫత్ మిసయ్యాడు. రెండో బంతిని హర్భజన్‌సింగ్ వేయగా అది కూడా వికెట్లను తాకింది. ఇక ఉమర్‌గుల్ వేసిన రెండో బంతి సైతం వికెట్లను తాకలేదు. రాబిన్ ఊతప్ప మూడో బంతిని బౌల్డ్ చేయగా షాహిద్ అఫ్రిదీ దాన్ని కూడా వృథా చేశాడు. దీంతో ఒక్కసారిగా ధోనీసేనతో పాటు యావత్ భారత దేశం గెలుపు సంబరాల్లో మునిగిపోయింది. చదవండి: 'ఆ నిర్ణయం నా కెరీర్‌ను ముంచేసింది' 'తండ్రిగా నా కోరికలు నెరవేర్చుకుంటున్నా' View this post on Instagram An MSD masterclass & some practice 👉 @indiancricketteam's successful Bowl Out in the 2007 WT20 Watch @robinaiyudauthappa on EP 8 of the Royals Podcast. Airing now on our Facebook page. #HallaBol | #RoyalsFamily | @mahi7781 A post shared by Rajasthan Royals (@rajasthanroyals) on May 19, 2020 at 7:29am PDT -
ధోని కాదు..మరి ఊతప్ప ఫేవరెట్ కెప్టెన్ ఎవరు?
న్యూఢిల్లీ: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో అత్యంత సన్నిహితంగా మెలిగిన వారిలో వెటరన్ ఆటగాడు రాబిన్ ఊతప్ప ఒకడు. ఒకానొక సందర్భంలో ధోని-ఊతప్పలే ఎక్కువగా కనిపించేవారు. ఆపై మెల్లగా ఊతప్ప భారత జట్టుకు దూరం కావడంతో ధోనితో సాన్నిహిత్యాన్ని కూడా తగ్గించేశాడు. 2015లో భారత జట్టులో చివరిసారి కనిపించిన ఊతప్పకు మళ్లీ అవకాశం రాలేదు. కేవలం అడపా దడపా దేశవాళీ మ్యాచ్‌లు ఆడుతున్న ఊతప్ప.. ఐపీఎల్లో మాత్రం కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో కేకేఆర్ అతన్ని వదులు కోగా, రాజస్తాన్ రాయల్స్ రూ. 3 కోట్లకు కొనుగోలుచేసింది. ఇప్పటివరకూ 177 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఊతప్ప 4,411 పరుగులు చేశాడు. ఇందులో 24కు పైగా యాభైకి పైగా స్కోరులు ఉన్నాయి. (ధోని గేమ్ మార్చాడు.. అందుకే పట్టు కోల్పోయాడు) 2014లో కేకేఆర్ జట్టులోకి అడుగుపెట్టిన ఊతప్ప.. 2017 వరకూ గౌతం గంభీర్ సారథ్యంలో కేకేఆర్‌కు ఆడాడు. 2014 సీజన్లో 44 సగటుతో 660 పరుగులు చేసి కేకేఆర్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అదే సమయంలో ఆరంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. అయితే తన ఫేవరెట్ కెప్టెన్ ఎవరని అడిగితే గౌతం గంభీర్ అని ఊతప్ప చెప్పుకొచ్చాడు. ఓవరాల్‌గా రాహుల్ ద్రవిడ్, ధోని, గంభీర్ కెప్టెన్సీల్లో ఆడిన ఊతప్ప.. గంభీర్‌కే ఓటేశాడు. తనకు గంభీర్ కెప్టెన్సీ అంటే అత్యంత ఇష్టమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఈ ముగ్గురిలో మీ ఫేవరెట్ కెప్టెన్ ఎవరు..? అని ప్రశ్నించగా గంభీర్ అని బదులిచ్చాడు. ‘ గౌతీ భాయ్ నా ఫేవరెట్ కెప్టెన్. మైదానంలో అతను చాలా సౌమ్యంగా ఉంటాడు. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడడు. ఎవరి ఏది చెప్పాలో అంత వరకే చెప్తాడు. ఆటగాళ్ల ప్రతిభను వెలికితీయడంలో గంభీర్ దిట్ట. గంభీర్ లాంటి మంచి కెప్టెన్ ఉంటే మనకు ఎటువంటి అభద్రతా భావం ఉండదు’ అని ఊతప్ప తెలిపాడు. 2014 కంటే ముందు గంభీర్ కెప్టెన్సీలో కేకేఆర్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2012లో చెన్నైతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కేకేఆర్ విజయం సాధించి తొలిసారి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. (అక్తర్ వ్యాఖ్యలకు కపిల్ కౌంటర్) -
332 మందిలో ఈసారి ఎవరో?
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 ఆటగాళ్ల వేలానికి రంగం సిద్దమైంది. వచ్చే సీజన్ కోసం నిర్వహించే వేలంలో పాల్గొనడానికి మొత్తం 971 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. 332 మంది షార్ట్‌లిస్ట్ అయ్యారు. రిజిష్టర్ చేసుకున్న ఆటగాళ్ల నుంచి తాము కోరుకుంటున్న 332 మంది ఆటగాళ్ల పేర్లను ఎనిమిది ఫ్రాంచైజీలు ఫైనలైజ్ చేశాయి. ఈ జాబితాలో 43 మంది భారత్‌కు చెందినవారు కాగా మిగతావారు విదేశీ క్రికెటర్లు. ఈ 43 మందిలో 19 మంది టీమిండియా తరుపున ప్రాతినిథ్యం వహించిన వారే ఉండటం విశేషం. ఇక ఎనిమిది ఫ్రాంచైజీలు ఈ జాబితా నుంచి గరిష్టంగా 73 మందిని మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. దీంతో కోల్‌కతా వేదికగా డిసెంబర్ 19న జరగనున్న ఈ వేలంలో 332 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో ఎంతో మంది అనామక క్రికెటర్లను పలు ఫ్రాంచైజీలు భారీ మొత్తంలో ఛేజిక్కించుకున్నాయి. దీంతో ఈసారి ఏ క్రికెటర్‌పై ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపిస్తారో అని ఆసక్తికరంగా మారింది. యూఏఈ వేదికగా జరిగిన టీ10లీగ్‌లో కేవలం 25 బంతుల్లోనే సెంచరీ సాధించిన సర్రే ఆటగాడు విల్ జాక్స్‌పైనే అందరి దృష్టి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సారి వేలంలోకి వచ్చిన క్రికెటర్లలో ఆరోన్ ఫించ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, క్రిస్ లిన్, జాసన్ రాయ్, ఇయాన్ మోర్గాన్, ప్యాట్ కమిన్స్, మిచెల్ మార్స్, ఏంజెలో మాథ్యూస్, హెజిల్వుడ్, స్టెయిన్, ముస్తాఫిజుర్, రాబిన్ ఊతప్ప, పియూష్ చావ్లాలు ఎక్కువ ధర పలికే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా ముగిసిన టీ20 సిరీస్‌లో ఆకట్టుకున్న విలియమ్స్ షార్ట్ లిస్ట్ అయ్యాడు. దీంతో ఈ క్రికెటర్‌పై కూడా ఫ్రాంచైజీలు కన్నేశాయి. -
ఊతప్పదే సన్‌రైజర్స్ అవార్డు..!
ముంబై: వాంఖేడి స్టేడియం వేదికగా ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఐపీఎల్ 12వ సీజన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. నిజానికి ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధిస్తే వేరే జట్లతో పోటీ లేకుండా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించేది.అయితే, కోల్‌కతా ఓటమితో మెరుగైన రన్ రేట్‌ని కలిగి ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. కేవలం 12 పాయింట్లతోనే సన్‌రైజర్స్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఇలా 12 పాయింట్లతో ఒక జట్టు ప్లేఆఫ్‌కు చేరడం ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే మ్యాచ్ కావడంతో కోల్‌కతా ఎలా ఆడుతుందా? అని ప్రతి ఒక్క కేకేఆర్ అభిమాని ఎంతో ఆశగా ఎదురు చూశాడు. అయితే, కోల్‌కతా మాత్రం తన పేలవ ఆటతో ఆశ్చర్యపరిచింది. కనీస ప్రయత్నం కూడా చేయకుండా ఓడిపోయింది. ఈ సీజన్ చివరి లీగ్ మ్యాచ్ ఆడిన కోల్‌కతా అన్ని విభాగాల్లో పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా రాబిన్ ఊతప్ప కారణంగానే కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓడిపోయిందంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ‘సన్‌రైజర్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రాబిన్ ఊతప్పదే. అతను ఒంటిచేత్తో సన్‌రైజర్స్‌ను ప్లేఆఫ్‌కు చేర్చాడు’ అని ఒక అభిమాని సెటైర్ వేయగా, ‘వచ్చే సీజన్లో రాబిన్ ఊతప్పను కేకేఆర్ వదులు కోవడం ఖాయం. అదే సమయంలో ఆర్సీబీ అతన్ని తీసుకుంటుంది. వచ్చే సీజన్లో హోం జట్టుకు రాబిన్ ఆడతాడని ఆశిద్దాం’ అని మరొకరు ట్వీట్ చేశారు. ‘రాబీ చాలా నిర్లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడు. అతను ఎప్పుడైతే బ్యాటింగ్‌కు దిగాడో అప్పుడు ప్రత్యర్థి జట్టుకు అనుకూలంగా మారిపోయింది’ అని మరొక అభిమాని విమర్శించాడు. ‘ ఇక రాబిన్ ఊతప్పకు క్రికెట్‌కు గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైందని, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని’ అభిమానులు మండిపడుతున్నారు. నిన్నటి మ్యాచ్‌లో రాబిన్ ఊతప్ప 47 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. పొట్టి ఫార్మాట్లో ఫస్డ్ డౌన్ వచ్చిన ఆటగాడు స్టైక్ రోటేట్ చేయాలి. ఇది ఊతప్ప విషయంలో జరగలేదు. అసలు బంతిని బ్యాట్‌తో కనీసం టచ్ చేయడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వాంఖేడే స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా ఊతప్ప మాత్రం తన స్థాయికి తగ్గ ఆటను మాత్రం ఆడలేదనేది మ్యాచ్ చూసిన ఎవరికైనా అర్ధమవుతోంది. -
‘దినేశ్ కార్తీక్‌కు న్యాయం జరిగింది’
కోల్‌కతా: వన్డే ప్రపంచకప్‌లో ఆడే భారత క్రికెట్ జట్టుకు దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేయడం పట్ల కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మన్ రాబిన్ ఊతప్ప హర్షం వెలిబుచ్చాడు. దినేశ్ ఎంపికను పూర్తిగా సమర్థిస్తూ అతడికి న్యాయం జరిగిందని వ్యాఖ్యానించాడు. వరల్డ్‌కప్ ఆడేందుకు అన్నివిధాలా దినేశ్ అర్హుడని కితాబిచ్చాడు. గత రెండేళ్లుగా అతడు స్థిరంగా రాణిస్తున్నాడని గుర్తు చేశాడు. ‘ఉత్తమ ప్రతిభ, ప్రదర్శన ఆధారంగా ఈ వరల్డ్‌కప్ జట్టులో ఉండాల్సిన క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది దినేశ్ కార్తీక్. అతడికి న్యాయం జరిగింది. గత రెండేళ్లుగా బెస్ట్ ఫినిషర్‌గా అతడు నిలబడ్డాడ’ని రాబిన్ ఊతప్ప ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. యువ క్రికెటర్ రిషబ్ పంత్‌ను పక్కనపెట్టి దినేశ్ కార్తీను సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. గత మూడేళ్లలో స్వల్ప అవకాశాలు దక్కినా వాటిని సద్వినియోగం చేసుకున్నాడు దినేశ్ కార్తీక్. 2017 నుంచి 20 వన్డేలు ఆడి 46.75 సగటుతో 425 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో టీమిండియా అతడిని నాలుగో స్థానంలో ఆడించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా దినేశ్ వ్యవహరిస్తున్నాడు. -
నైట్‌రైడర్స్ నాలుగో విజయం
-
ఐపీఎల్.. ప్రపంచకప్‌కు మంచి ప్రాక్టీస్
కోల్‌కతా : ప్రపంచకప్ దృష్ట్యా ఐపీఎల్లో కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బౌలర్లు గాయపడే అవకాశం ఉండటంతో ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడకపోవటమే మంచిదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. ఈ మేరకు బీసీసీఐకి మాజీ ఆటగాళ్లు విజ్ఞప్తి చేశారు. అయితే ఫ్రాంచైజీల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన బోర్డు.. ఆటగాళ్లపై అధిక శ్రమ లేకుండా చేయమని కోరింది. అయినప్పటికీ ఐపీఎల్లో ఆటగాళ్లు పాల్గొనడంపై మిశ్రమ స్పందన వస్తోంది. అయితే తాజాగా కోల్‌కత్ నైట్‌రైడర్స్(కేకేఆర్) స్టార్ బ్యాట్స్‌మన్ రాబిన్ ఊతప్ప ఈ వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏ ఆటగాడికైనా దేశం తరుపున ఆడటం కన్న అత్యుత్తమైన గౌరవం మరొకటి ఉండదని ఊతప్ప పేర్కొన్నాడు. అయితే ప్రపంచకప్ దృష్ట్యా ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడకుండా ఉండాల్సిన అవసరం లేదన్నాడు. ఈ మెగా టోర్నీతో క్రికెటర్లకు మంచి ప్రాక్టీస్ లభిస్తుందని అభిప్రాయపడ్డాడు. గాయాలవుతాయనే భయంతో ఈ మెగా టోర్నీకి దూరంగా ఉండవలసిన అవసరంలేదని.. బౌలర్లు నాలుగు ఓవర్లు వేసినంత మాత్రాన గాయాలు కావన్నాడు. ఆటగాళ్లు ఫిట్‌గా ఉన్నంత కాలం గాయాల సమస్య ఉండదని ఊతప్ప వివరించాడు. ఇక ప్రపంచకప్ ప్రాబబుల్స్‌లో కేకేఆర్ సారథి దినేశ్ కార్తీక్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లు ఉన్న నేపథ్యంలో ఊతప్ప వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. (‘ఆటలోనే కాదు.. ఆలోచనలోనూ తోపే’) -
భారత్-పాక్ టీ20.. ఓ అద్భుతం
సాక్షి, స్పోర్ట్స్: క్రికెట్ చరిత్రలో అభిమానులు కొత్త అనుభూతి చెందిన రోజు. టీ20 ఫార్మటే కొత్తగా అనిపిస్తున్న తరుణంలో అందరినీ ఆశ్యర్చపరిచింది.. ఎప్పుడూ వినని, చూడని ‘బౌల్ ఔట్’ . అప్పట్లో మ్యాచ్ టై అయితే ఇరుజట్లకు చెరో పాయింట్.. అదే ఇప్పుడు సూపర్ ఓవర్. కానీ 2007 టీ20 ప్రపంచకప్‌లో ‘బాల్ ఔట్’ అనే కొత్త విధానం క్రీడా జనాలను ఆకట్టుకుంది. ఈ విధానంతో బొక్క బోర్లాపడ్డ జట్టు పాక్ అయితే గెలిచిన జట్టు టీమిండియా. సరిగ్గా 11ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ప్రపంచ కప్‌లో భాగంగా గ్రూప్ దశలో పాకిస్తాన్‌పై టీమిండియా గెలిచింది బాల్ ఔట్ విధానంతోనే. దానికి సంబంధించిన వీడియో ఐసీసీ ట్వీట్ చేసింది. కొత్తగా సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంఎస్ ధోనికి అసలు సవాలు 2007 టీ20 ప్రపంచకప్‌లో ఎదురైంది. కొత్త ఆట, యువ ఆటగాళ్లు, ప్రత్యర్థులకు అప్పటికే అలవాటైన ‘బాదుడు’ ఆట. కానీ పక్కావ్యూహాలు అమలు చేసి టీమిండియా సగర్వంగా విశ్వవిజేతగా నిలిచింది. అయితే గ్రూప్ దశలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ మాత్రం ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది పాక్. మహ్మద్ ఆసిఫ్(4/18) చెలరేగి బౌలింగ్ చేసినా.. ఊతప్ప(50), ధోని(33)లు రాణించటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. అనంతరం 142 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన పాక్.. టీమిండియా బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్లు కోల్పోయి 141 పరుగులే చేసింది. ‘బౌల్ ఔట్’తో విజయం అందరూ మ్యాచ్ టై అయిందని నిరుత్సాపడుతున్న సమయంలో ఐసీసీ కొత్తగా ప్రవేశ పెట్టిన ‘బౌల్ ఔట్’ విధానం అందరినీ ఆకట్టుకుంది. కొత్త విధానం ప్రకారం టీమిండియా ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, రాబిన్ ఊతప్ప, హర్భజన్ సింగ్‌లు నేరుగా బంతి వికెట్లను తాకేలా బౌలింగ్ చేయగా.. పాక్ బౌలర్లు యాసిర్ ఆరాఫత్, ఉమర్ గుల్, షాహిద్ ఆఫ్రిదిలు విఫలమయ్యారు. దీంతో టీమిండియా 3-0 తేడాతో విజయం సాధించింది. ✅ @virendersehwag ❌ @YasArafat12 ✅ @harbhajan_singh ❌ @mdk_gul ✅ @robbieuthappa ❌ @SAfridiOfficial#OnThisDay in 2007 India v Pakistan at #WT20 finished in a tie… and India won the bowl-out! pic.twitter.com/sN2dZMyLN2 — ICC (@ICC) 14 September 2018 -
ధోని ఖాతాలో మరో రికార్డు
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభంలో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డులకెక్కిన ఎంఎస్ ధోని.. సన్‌రైజర్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డును నెలకొల్పాడు. కరణ్ శర్మ బౌలింగ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను స్టంపౌట్ చేయడం ద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్టంపౌట్లు చేసిన వికెట్ కీపర్‌గా ధోని రికార్డు నెలకొల్పాడు. ఇది ధోనికి ఓవరాల్ ఐపీఎల్లో 33 స్టంపింగ్. ఫలితంగా ఐపీఎల్లో అత్యధిక స్టంపింగ్ జాబితాలో ఇప్పటివరకూ అగ్రస్థానంలో ఉన్న రాబిన్ ఉతప్ప(32)ను ధోని అధిగమించాడు. ఆ తర్వాత స్థానాల్లో దినేష్ కార్తీక్(30), సాహా(18)లు ఉన్నారు. రెండేళ్ల నిషేధం తర్వాత రంగంలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ పునరాగమనాన్ని ఘనంగా చాటింది. అసాధారణ ఆటతీరుతో ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఆదివారం ముంబైలో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని ముద్దాడింది. -
కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ముంబై విజయం
-
ముంబైకు మరో విజయం
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై 182 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని గెలుపును అందుకుంది. తొలుత బ్యాటింగ్‌లో ఆకట్టుకున్న రోహిత్ శర్మ గ్యాంగ్.. ఆపై బౌలింగ్‌లో కూడా మెరిసింది. దాంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఇది కేకేఆర్‌కు ఐదో ఓటమి కాగా, ముంబైకు నాల్గో విజయం. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్ ఓపెనర్లు క్రిస్ లిన్(17), శుభ్‌మాన్ గిల్(7) నిరాశపరిచారు. ఆపై రాబిన్ ఉతప్ప(54), నితీష్ రాణా(31), దినేశ్ కార్తీక్(36 నాటౌట్)లు తమ వంతు ప్రయత్నం చేసినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు సాధించగా, కృనాల్ పాండ్యా,బూమ్రా, మెక్లాన్‌గన్, మార్కండేలకు తలో వికెట్ దక్కింది. అంతకముందు ముంబై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు ఓపెనర్లు శుభారంభం అందించారు. సూర్యకుమార్ యాదవ్(59; 39బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్‌లు) మరోసారి మెరవడంతో పాటు ఎవిన్ లూయిస్(43; 23బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్స్‌లు) బాధ్యతాయుతంగా ఆడాడు. తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత లూయిస్ ను రస్సెల్ ఔట్ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్(11) నిరుత్సాహపరిచాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన హార్దిక్‌తో కలిసి మరో ఓపెనర్ సూర్యకుమార్ ఇన్నింగ్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కాగా, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని రస్సెల్ విడదీశాడు. సూర్యకుమార్‌ను ఔట్ చేసి కేకేఆర్‌కు మరో బ్రేక్ ఇచ్చాడు. స్కోరును పెంచే క్రమంలో కృనాల్ పాండ్యా(14) వెనుదిరిగాడు. దాంతో ముంబై స్కోరు బోర్డు నెమ్మదించింది. కాగా, చివర్లో హార్దిక్ పాండ్యా(35 నాటౌట్; 20 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్స్), డుమినీ(13నాటౌట్)లు సమయోచితంగా ఆడటంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు సాధించింది. -
ఐపీఎల్ చరిత్రలో ఆరో క్రికెటర్‌గా..
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు రాబిన్ ఉతప్ప అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో నాలుగు వేల పరుగుల మార్కును దాటిన ఆరో క్రికెటర్‌గా ఉతప్ప నిలిచాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఉతప్ప ఈ ఫీట్‌ను సాధించాడు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో భాగంగా ముంబై బౌలర్ మార్కండే వేసిన ఎనిమిదో ఓవర్ ఐదో బంతికి ఉతప్ప సిక్స్ కొట్టి నాలుగు వేల పరుగుల క్లబ్లో చేరాడు. ఉతప్ప 153 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు వేల పరుగులు సాధించాడు. ఐపీఎల్లో నాలుగు వేల పరుగుల మార్కును దాటిన ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్(114 ఇన్నింగ్స్‌ల్లో), విరాట్ కోహ్లి(128 ఇన్నింగ్స్), సురేశ్ రైనా(140 ఇన్నింగ్స్‌ల్లో), గౌతం గంభీర్( 140 ఇన్నింగ్స్‌ల్లో), రోహిత్ శర్మ(147 ఇన్నింగ్స్‌ల్లో)లు ఉన్నారు. -
గంభీర్ స్థానాన్ని భర్తీ చేసేదెవరు?
న్యూఢిల్లీ: రాబోవు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11సీజన్ కోసం పలు జట్లు తమ జట్ల కెప్టెన్ల పేర్లను ఇప్పటికే ప్రకటించగా, కోల్‌కోతా నైట్‌రైడర్స్ జట్టు మాత్రం ఇంకా కెప్టెన్ అన్వేషణలోనే ఉంది. తొలుత ఆసీస్ పవర్ హిట్టర్ ఆటగాడు క్రిస్ లిన్ కేకేఆర్ సారథ్య బాధ్యతలు చేపడతాడని భావించినా... అతను గతవారం పాకిస్తాన్ సూపర్ లీగ్(పీపీఎల్)లో గాయపడ్డాడు. దాంతో ఐపీఎల్ నాటికి లిన్ ఫిట్ అయినప్పటికీ, అతనికి కెప్టెన్సీని అప్పచెప్పడం మాత్రం కష్టమనే చెప్పాలి. ఈ క్రమంలోనే పలువురు కీలక ఆటగాళ్ల పేర్లను కెప్టెన్సీ పదవి కోసం కేకేఆర్ అన్వేషిస్తోంది. ఇందులో దినేశ్ కార్తీక్‌తో పాటు రాబిన్ ఉతప్పలు ముందు వరుసలో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరికి సారథ్య బాధ్యతల్ని అప్పగించే అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే సునీల్ నరైన్ పేరును కూడా కేకేఆర్ యాజమాన్యం పరిశీలిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ వేలానికి ముందుగానే గౌతం గంభీర్‌ను కేకేఆర్ వదులుకోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఆ ఫ్రాంచైజీ తర్జన భర్జనలు పడుతోంది. దినేశ్ కార్తీక్.. గత సీజన్లో గుజరాత్ లయన్స్‌కు ఆడిన దినేశ్ కార్తీక్.. 14 మ్యాచ్‌ల్లో 361 పరుగులు నమోదు చేశాడు. మొత్తం 152 మ్యాచ్‌ల ఐపీఎల్ అనుభవం ఉన్న దినేశ్ కార్తీక్.. 2,903 పరుగులు సాధించాడు. ఇందులో 14 హాఫ్ సెంచరీలున్నాయి. ఇతనొక నమ్మకదగిన బ్యాట్స్‌మన్ కావడంతో పాటు వికెట్ కీపర్‌గా కూడా ప్రభావం చూపే క్రికెటర్. దాంతో దినేశ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. రాబిన్ ఉతప్ప... గత ఐపీఎల్ సీజన్లో ఉతప్ప 388 పరుగులు చేశాడు. కేకేఆర్ తరపున 14 మ్యాచ్‌ల్లో ఆడి ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మొత్తం 149 మ్యాచ్‌ల్లో 3,735 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలున్నాయి. 2014లో కేకేఆర్ టైటిల్ గెలవడంలో ఉతప్పది ప్రధాన పాత్ర. ఆ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడి 660 పరుగులు సాధించాడు. సునీల్ నరైన్.. మిస్టరీ స్పిన్నర్‌గా పేరున్న సునీల్ నరైన్.. 2012 నుంచి కేకేఆర్ జట్టుకు ఆడుతున్నాడు. ఆ సీజన్లో 24 వికెట్లు సాధించిన నరైన్.. కేకేఆర్ తొలి ఐపీఎల్ టైటిల్‌ను అందుకోవడం ముఖ్య పాత్ర వహించాడు. ఇక 2013లో 22 వికెట్లు సాధించిన నరైన్.. 2014లో 21వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. 2015లో 7, 2016లో 11, 2017లో 10 వికెట్ల చొప్పున నరైన్ సాధించాడు. -
ఉతప్ప అనూహ్య నిర్ణయం
న్యూఢిల్లీ: సొంత టీమ్ కర్ణాటకతో 15 ఏళ్లు అనుబంధాన్ని క్రికెటర్ రాబిన్ ఉతప్ప తెంచుకోనున్నాడు. హోమ్ టీమ్‌ను వీడాలని నిర్ణయించుకోవడంతో అతడికి కర్ణాటక క్రికెట్ సంఘం(కేఎస్‌సీఏ) నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) ఇచ్చింది. ఇక అతడు వేరే రాష్ట్ర జట్టుకు ఆడినా ఇబ్బంది ఉండదు. రానున్న రంజీ సీజన్లో వేరే జట్టుకు ఆడనున్నాడు. ఉతప్ప నిర్ణయానికి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని కేఎస్‌సీఏ కార్యదర్శి సుధాకర్‌రావు తెలిపారు. ‘ ఉతప్ప నిర్ణయం బాధాకరం. ఏ జుట్టుకు ఆడినా అతడు బాగా రాణించాలని కోరుకుంటున్నాం. అండర్-14 స్థాయి నుంచి కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. వేరే టీమ్ తరపున ఆడేందుకు అతడు ఉత్సాహం చూపించాడు. మేము అతడి నిర్ణయానికి అడ్డుచెప్పలేద’ని సుధాకర్‌రావు అన్నారు. గత వారమే అతడికి ఎన్వోసీ ఇచ్చినట్టు వెల్లడించారు. 31 ఏళ్ల ఉతప్ప 130 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 46 వన్డేలు, 13 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అతడు ఏ రాష్ట్ర జట్టు తరపున ఆడేది ఇంకా స్పష్టం కాలేదు. రెండు రాష్ట్రాలు అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సుధాకర్‌రావు వెల్లడించారు. కేరళ తరపున ఉతప్ప ఆడే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. -
ఉతప్ప ఉతికేశాడు
-
ఉతప్ప ఉతికేశాడు
⇒47 బంతుల్లో 7 ఫోర్లు 6 సిక్సర్లతో 87 ⇒పుణేపై కోల్‌కతా ఘనవిజయం ⇒గంభీర్ అర్ధసెంచరీ పుణే: రాబిన్ ఉతప్ప (47 బంతుల్లో 87; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరబాదుడుకు కెప్టెన్ గౌతమ్ గంభీర్ (46 బంతుల్లో 62; 6 ఫోర్లు, 1 సిక్స్) సొగసైన ఇన్నింగ్స్ తోడవడంతో... బుధవారం రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో కోల్‌కతా 12 పాయింట్లతో అగ్ర స్థానానికి చేరుకుంది. గౌతీ, ఉతప్పల జోరుకు రెండో వికెట్‌కు 158 పరుగుల భారీ భాగస్వామ్యం సమకూరింది. మరోవైపు ఇక్కడ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ కోల్‌కతా నెగ్గడం విశేషం. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది. కెప్టెన్ స్మిత్ (37 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), రహానే (41 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ త్రిపాఠి (23 బంతుల్లో 38; 7 ఫోర్లు) రాణించారు. కుల్దీప్యాదవ్కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బరిలోకి దిగిన కోల్‌కతా 18.1 ఓవర్లలో మూడు వికెట్లకు 184 పరుగులు చేసి నెగ్గింది. ఉతప్పకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవానులకు సంతాప సూచకంగా ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఆటగాళ్లు భుజాలకు నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. గురువారం జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ లయన్స్ తలపడుతుంది. స్మిత్ జోరు... మొదట బ్యాటింగ్‌కు దిగిన పుణేకు ఓపెనర్లు రహానే, త్రిపాఠి మరోసారి శుభారంభాన్ని అందించారు. మూడో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన త్రిపాఠి.. ఆరో ఓవర్లో మూడు ఫోర్లతో జోరును కనబరిచాడు. దీంతో జట్టు పవర్ ప్లేలో 57 పరుగులు సాధించింది. అంతకుముందు ఓవర్లో రహానే భారీ సిక్సర్ బాదాడు. ఏడో ఓవర్లో త్రిపాఠి ఇచ్చిన క్యాచ్‌ను యూసుఫ్ వదిలేసినా మరుసటి ఓవర్లోనే తనను పీయూశ్ చావ్లా బౌల్డ్ చేశాడు. దీంతో తొలి వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత రహానేతో కలిసి కెప్టెన్ స్మిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. అయితే అర్ధ సెంచరీ వైపు సాగుతున్న రహానే... నరైన్ బౌలింగ్‌లో స్టంప్ అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులో ఉన్నంతసేపు ధోని (11 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్సర్లు) బ్యాట్‌ను ఝుళిపించాడు. 15వ ఓవర్లో వరుసగా 4,6 బాదిన తను మరుసటి ఓవర్లో మరో భారీ సిక్స్‌తో చెలరేగాడు. అయితే కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. అదే ఓవర్లో మనోజ్ తివారి (1) కూడా అదే రీతిన అవుట్ అయినా... క్రిస్టియాన్ (6 బంతుల్లో 16; 2 సిక్సర్లు), స్మిత్ చివరి రెండు ఓవర్లలో 30 పరుగులు రాబట్టారు. ఉతప్ప, గంభీర్ నిలకడ... లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్‌లో దాదాపు మ్యాచ్ అంతా ఉతప్ప, గంభీర్ జోరే కనిపించింది. నరైన్ (11 బంతుల్లో 16; 3 ఫోర్లు) మూడో ఓవర్లోనే రనౌట్ అయినా ఉన్నంత సేపు వేగంగా ఆడాడు. ఆ తర్వాత గంభీర్, ఉతప్ప కలిసి పుణే బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. వీరి జోరుకు పుణే ఫీల్డింగ్లోపం కూడా జత కలిసింది. ఏడో ఓవర్లో ఉతప్ప ఇచ్చిన క్యాచ్‌ను ఉనాద్కట్ వదిలేయడంతో జట్టు తగిన మూల్యం చెల్లించుకుంది. ఆ తర్వాతి ఓవర్లో తను 4,6,6తో చెలరేగాడు. ఇదే జోరుతో 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 11వ ఓవర్లో గంభీర్ క్యాచ్‌ను వాషింగ్టన్ సుందర్ వదిలేయగా 35 బంతుల్లో తను కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. 16వ ఓవర్లో ఉతప్ప రెండు భారీ సిక్సర్లు సంధించడంతో లక్ష్యం మరింత తగ్గింది. అయితే వరుస ఓవర్లలో గంభీర్, ఉతప్ప అవుటైనా అప్పటికే కోల్‌కతా విజయం ఖాయమైంది. ఐపీఎల్లో గంభీర్‌కు కెప్టెన్‌గా ఇది 100వ మ్యాచ్ కావడం విశేషం. -
సన్‌రైజర్స్ ఐదో‘సారీ’
-
సన్‌రైజర్స్ ఐదో‘సారీ’
♦ ఈడెన్‌లో వరుసగా ఐదోసారి ఓడిన హైదరాబాద్ ♦ 17 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం ఉతప్ప మెరుపులు డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఈడెన్ గార్డెన్స్ మైదానం మరోసారి అచ్చి రాలేదు. ఈ వేదికపై గతంలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన హైదరాబాద్ తలరాత ఐదో మ్యాచ్‌లోనూ మారలేదు. కోల్‌కతా నైట్‌రైడర్స్ విధించిన 173 పరుగుల లక్ష్యం హైదరాబాద్‌కు అసాధ్యమైన సవాలేమీ కాదు. స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, హెన్రిక్స్, యువరాజ్ సింగ్‌లలో ఒక్కరు భారీ ఇన్నింగ్స్ ఆడినా ఫలితం అనుకూలంగా వచ్చేది. కానీ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఎవరూ క్రీజులో ఎక్కువసేపు నిలువలేకపోయారు. ఫలితంగా ఐపీఎల్–10లో హైదరాబాద్ జట్టు ఖాతాలో వరుసగా రెండో ఓటమి చేరింది. మరోవైపు అన్ని విభాగాల్లో రాణించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ మూడో విజయంతో పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరింది. కోల్‌కతా: సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు దుమ్మురేపింది. ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 17 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 172 పరుగులు సాధించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రాబిన్ ఉతప్ప (39 బంతుల్లో 68; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులకు తోడు మనీశ్ పాండే (35 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ (3/20) చెలరేగాడు. అనంతరం హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసి ఓడిపోయింది. వార్నర్ (30 బంతుల్లో 26; 4 ఫోర్లు), యువరాజ్ (16 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. ఉతప్ప ఉతికేశాడు... పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో మెరుపు ఆరంభా న్నిచ్చిన సునీల్ నరైన్ (6) ఈసారి తొందరగానే వెనుదిరిగాడు. భువనేశ్వర్ అద్భుతమైన యార్కర్‌కు నరైన్ పెవి లియన్ చేరాడు. ఈ సీజన్లో భీకరమైన ఫామ్‌లో ఉన్న గంభీర్ (16 బంతుల్లో 15; 2 ఫోర్లు) కూడా తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. ఈ దశలో కర్ణాటక సహచరులు మనీశ్ పాండే, రాబిన్ ఉతప్పల భాగస్వామ్యం జట్టును ఆదుకుంది. వీరిద్దరూ ధాటిగా ఆడి 52 బంతుల్లో 77 పరుగులు జోడించారు. చివర్లో యూసుఫ్ పఠాన్ (15బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 1సిక్స్) మెరవడంతో కోల్‌కతా మంచి స్కోరు సాధించింది. మిడిలార్డర్ వైఫల్యం... ఛేజింగ్‌లో సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. వార్నర్‌తో తొలి వికెట్‌కు 46 పరుగుల్ని జోడించాక పఠాన్ బౌలింగ్‌లో ధావన్ (22 బంతుల్లో 23; 4 ఫోర్లు) అవుటయ్యాడు. మరికాసేపటికే వార్నర్ కూడా పెవిలియన్ చేరాడు. వచ్చీ రాగానే రెండు బౌండరీలను బాదిన హెన్రిక్స్ (13) బౌలర్‌కే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత దీపక్ హుడా (7 బంతుల్లో 13; 1 ఫోర్, 1 సిక్సర్), యువరాజ్ సింగ్ ధాటిగా ఆడే ప్రయత్నంలో అవుటయ్యారు. చివరి 30 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన దశలోనూ ఆటగాళ్లు పుంజుకోలేకపోయారు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: నరైన్ (బి) భువనేశ్వర్ 6; గంభీర్ (బి) రషీద్ ఖాన్ 15; ఉతప్ప (సి) రషీద్ (బి) కటింగ్ 68; మనీశ్ పాండే (సి) వార్నర్ (బి) భువనేశ్వర్ 46; యూసుఫ్ పఠాన్ నాటౌట్ 21; సూర్య కుమార్ యాదవ్ (సి) ఓజా (బి) నెహ్రా 4; గ్రాండ్‌హోమ్ (బి) భువనేశ్వర్ 0; వోక్స్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–10, 2–40, 3–117, 4–153, 5–163, 6–170. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–20–3, నెహ్రా 4–0–35–1, కటింగ్ 4–0–41–1, రషీద్‌ఖాన్ 4–0–29–1, హెన్రిక్స్ 2–0–26–0, బిపుల్ శర్మ 2–0–20–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) వోక్స్ (బి) కుల్దీప్ యాదవ్ 26; ధావన్ (సి) గ్రాండ్‌హోమ్ (బి) పఠాన్ 23; హెన్రిక్స్ (సి అండ్ బి) వోక్స్ 13; యువరాజ్ సింగ్ (సి) సబ్–రిషి ధావన్ (బి) వోక్స్ 26; హుడా (స్టంప్డ్) ఉతప్ప (బి) నరైన్ 13; కటింగ్ (సి) గ్రాండ్‌హోమ్ (బి) బౌల్ట్ 15; ఓజా నాటౌట్ 11; బిపుల్ శర్మ 21 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–46, 2–59, 3–65, 4–96, 5–112, 6–129. బౌలింగ్: ఉమేశ్ 3–0–27–0, బౌల్ట్ 4–0–33–1, నరైన్ 4–0–18–1, కుల్దీప్ 4–0–23–1, పఠాన్ 1–0–2–1, వోక్స్ 4–0–49–2. -
రాబిన్ ఊతప్ప భారీ సెంచరీ
హుబ్బాలీ:టీమిండియా మాజీ ఓపెనర్, కర్ణాటక ఆటగాడు రాబిన్ ఊతప్ప రంజీ ట్రోఫీ మ్యాచ్ లో చెలరేగిపోయాడు. గ్రూప్-ఏలో భాగంగా సోమవారం ఢిల్లీతో ఆరంభమైన మ్యాచ్ లో తనదైన శైలిలో విరుచుకుపడిన ఊతప్ప(148) భారీ సెంచరీ నమోదు చేశాడు. ఊతప్ప 16 ఫోర్లు, 6 సిక్సర్లతో ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఢిల్లీ పార్ట్ టైమ్ బౌలర్ ధ్రువ్ షోరే వేసిన ఒక ఓవర్ లో 32 పరుగులు చేసి సెంచరీ నమోదు చేశాడు. మరో ఆటగాడు మయాంక్ అగర్వాల్(118;209 బంతుల్లో 19 ఫోర్లు) శతకం సాధించడంతో కర్ణాటక భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేయడానికి కర్ణాటకను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన కర్ణాటకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఆర్ సమర్థ్(17) తొలి వికెట్ గా పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు. అనంతరం అగర్వాల్ -ఊతప్పల జోడీ ఢిల్లీ బౌలర్లకు చుక్కులు చూపెట్టింది. తమ వికెట్లను కాపాడుకుంటూనే ఢిల్లీని చీల్చి చెండాడింది. ఈ జంట రెండో వికెట్ కు 236 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక ఆద్యంతం ఆధిపత్యం కొనసాగించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక 90 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో సూర్యల్ రెండు వికెట్లు తీయగా, సంగ్వాన్ కు ఒక వికెట్ దక్కింది. -
శీతల్ గౌతమ్ తో రాబిన్ నిశ్చితార్థం
బెంగళూరు: ఇటీవల ముప్ఫైవ పుట్టినరోజు జరుపుకున్న భారత మాజీ ఓపెనర్, కర్ణాటక ఆటగాడు రాబిన్ ఊతప్ప త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. గత ఏడు సంవత్సరాలుగా ప్రేమాయణం సాగిస్తున్న తన చిన్ననాటి స్నేహితురాలు, టెన్నిస్ క్రీడాకారిణి శీతల్ గౌతమ్ తో రాబిన్ ఏడు అడుగులు నడవనున్నాడు. ఈ మేరకు వారిద్దరి నిశ్చితార్థం తాజాగా జరిగిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రాబిన్ .. తాము అతి త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశాడు. గత కొన్నిరోజులుగా రంజీ ట్రోఫీ మ్యాచ్ లకు దూరంగా ఉండటంతో శీతల్ వద్ద పెళ్లి ప్రస్తావన తేవడానికి సమయం దొరికినట్లు రాబిన్ తెలిపాడు. తమ సుదీర్ఘ ప్రేమకు శీతల్ కూడా వెంటనే అంగీకారం తెలపడంతో నిశ్చితార్థం కార్యక్రమం కూడా వెంటనే జరిగిపోయినట్లు వెల్లడించాడు. ఎప్పట్నుంచో తన ప్రేమను పెళ్లిగా మార్చుకుందామని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇదిలా ఉండగా, తమ పెళ్లికి సంబంధించిన ప్రపోజల్ కోసం రాబిన్ నెలలుగా నిరీక్షిస్తున్నవిషయం తనకు తెలియదని శీతల్ తెలిపింది. ఈ మధ్య కాలంలో టీమిండియా జట్టులో స్థానం దొరకని క్రికెటర్లు పెళ్లికి సిద్ధమవుతున్నారు. గత నెల్లోఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్-గీతా బస్రాల పెళ్లి జరగగా, కొన్ని రోజుల క్రితం హజిల్ వుడ్ -యువరాజ్ సింగ్ ల నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. తన తండ్రి యోగరాజ్ సింగ్ అంగీకారంతో బ్రిటీష్ నటి హజిల్ తో పెళ్లికి యువీ సిద్ధమయ్యాడు. వీరి పెళ్ళి వచ్చే ఫిబ్రవరిలో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కాగా, రాబిన్ -శీతల్ ల వివాహానికి సంబంధించి ఇంకా తేదీ ఖరారు కాలేదు. -
నవంబర్ 11న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: డికాప్రియో (హాలీవుడ్ నటుడు), రాబిన్ ఉతప్ప (క్రికెటర్) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 3. ఇది దేవగురువైన బృహస్పతి సంఖ్య కావడం వల్ల నిశిత పరిశీలన, కుశాగ్రబుద్ధి, సృజనాత్మకత కలిగి ఉండి, మేధావిగా గుర్తింపబడతారు. ఈ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. మంచి పనిమంతులుగా పేరుతెచ్చుకుంటారు. ఆర్థికంగా మంచి అభివృద్ధి సాధిస్తారు. రచయితలు, వక్తలు, సంగీత క ళాకారులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. కొత్త కొత్త కోర్సులు చేస్తారు. అర్ధంతరంగా ఆపేసిన చదువును కొనసాగిస్తారు. బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారి కల ఫలిస్తుంది. న్యాయకోవిదులకు, వైద్యులకు, యూనిఫారం ధరించే ఉద్యోగులకు మంచి పేరు వస్తుంది. వీరు పుట్టిన తేదీ 11. ఇది న్యూమరాలజీలో మాస్టర్ నంబర్. దీని వల్ల ఊహాశక్తి, ఆదర్శభావాలు, ధైర్యసాహసాలు, నాయకత్వ లక్షణాలు స్వతఃసిద్ధంగా అబ్బుతాయి. సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. గత సంవత్సరం చేపట్టిన ప్రాజెక్టులు, ప్రణాళికలనుంచి లాభాలను ఆర్జిస్తారు. కొత్త ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానంతో పనులను చురుకుగా చేస్తారు. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే నేత్రవ్యాధులు, హృద్రోగాలు, మానసిక అస్థిరత ఉండే అవకాశం ఉన్నందువల్ల తగిన జాగ్రత్త తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,2,3, 5,6,7; లక్కీ కలర్స్: పర్పుల్, గ్ల్రే, ఎల్లో, బ్లూ, వైట్, సిల్వర్, క్రీమ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: సోమ, గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: గురుశ్లోకం చదవటం, దక్షిణామూర్తిని ఆరాధించటం, మతగురువులను, పెద్దలను గౌరవించటం, వృద్ధులను, అనాథలను ఆదుకోవడం. దర్గాలు, చర్చ్‌లలో అన్నదానం చేసి, పిల్లలకు, వృద్ధులకు తీపి తినిపించడం. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్