Zim Afro T10: Five squads of tournament get confirmed - Sakshi
Sakshi News home page

Zim Afro T10: టీ10 లీగ్‌లో ఆడనున్న రాబిన్‌ ఊతప్ప, ఇర్ఫాన్‌ పఠాన్‌

Published Tue, Jul 4 2023 10:26 AM | Last Updated on Tue, Jul 4 2023 10:50 AM

Zim Afro T10: Five squads of tournament get confirmed - Sakshi

జింబాబ్వే క్రికెట్‌ తొలిసారిగా "జిమ్‌ ఆఫ్రో టీ10" పేరుతో ఓ ప్రాంఛైజీ లీగ్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జిమ్‌ ఆఫ్రో టీ10 లీగ్‌ జూలై 20న ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు భాగం కానున్నాయి. డర్బన్ క్వాలండర్స్, కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ, బులవాయో బ్రేవ్స్, జోబర్గ్ లయన్స్‌, హరారే హరికేన్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి.

తాజాగా ఆయా ఫ్రాంచైజీలు తమ జట్లను ఖారారు చేశాయి. కాగా ఈ టీ10 లీగ్‌లో రాబిన్‌ ఊతప్ప, పార్ధివ్‌ పటేల్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసప్‌ ఫఠాన్‌, రాహుల్‌ చోప్రా, స్టువర్ట్‌ బిన్నీ, శ్రీశాంత్‌ వంటి భారత మాజీ క్రికెటర్‌లు ఆడనున్నారు.

రాబిన్‌ ఊతప్ప, ఇర్ఫాన్‌ పఠాన్‌, శ్రీశాంత్‌ హరారే హరికేన్స్‌కు ప్రాతినిధ్యం వహించనుండగా.. పార్ధివ్‌ పటేల్‌, స్టువర్ట్‌ బిన్నీ కేప్‌టౌన్ సాంప్ ఆర్మీకి, రాహుల్‌ శర్మ, యూసప్‌ ఫఠాన్‌ జోహన్నెస్‌బర్గ్ బఫెలోస్‌ తరపున ఆడనున్నారు. అదే విధంగా ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు మహ్మద్‌ హాఫీజ్‌ కూడా ఈ లీగ్‌లో భాగం కానున్నారు.

డర్బన్ క్వాలండర్స్: ఆసిఫ్ అలీ, మహ్మద్ అమీర్, జార్జ్ లిండే, హజ్రతుల్లా జజాయ్, టిమ్ సిఫెర్ట్, సిసంద మగాలా, హిల్టన్ కార్ట్‌రైట్, మీర్జా తాహిర్ బేగ్, తయాబ్ అబ్బాస్, క్రెయిగ్ ఎర్విన్‌, టెండై చతారా, బ్రాడ్ ఎవాన్స్, క్లైవ్ మదాండే, నిక్ వెల్చ్, ఆండ్రీ ఫ్లెచర్

హరారే హరికేన్స్: మహ్మద్ నబీ, ఎవిన్ లూయిస్, రాబిన్ ఉతప్ప, డోనోవాన్ ఫెరైరా, షాజావాజ్ దహానీ, డువాన్ జాన్సెన్, సమిత్ పటేల్, కెవిన్ కొత్తెగోడ, క్రిస్టోఫర్ మ్ఫోఫు, రెగిస్ చకబ్వా, ల్యూక్ జోన్‌వే, బ్రాండన్ మవుతా, తషింగా ముషివా,  ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసప్‌ ఫఠాన్‌,శ్రీశాంత్‌

జోహన్నెస్‌బర్గ్ బఫెలోస్‌: ముష్ఫికర్ రహీమ్, ఓడియన్ స్మిత్, టామ్ బాంటన్, యూసుఫ్ పఠాన్, విల్ స్మీద్, నూర్ అహ్మద్, రవి బొపారా, ఉస్మాన్ షిన్వారీ, జూనియర్ డలా, బ్లెస్సింగ్ ముజారబానీ, వెల్లింగ్టన్ మసకద్జా, వెస్లీ మాధేవెరే, విక్టర్ న్యౌచి, మిల్టన్ శుంబా, మొహమ్మద్ హఫీజ్, రాహుల్ చోప్రా.

బులవాయో బ్రేవ్స్‌: సికిందర్ రజా, తస్కిన్ అహ్మద్, ఆష్టన్ టర్నర్, టైమల్ మిల్స్, తిసారా పెరెరా, బెన్ మెక్‌డెర్మాట్, బ్యూ వెబ్‌స్టర్, పాట్రిక్ డూలీ, కోబ్ హెర్ఫ్, రేయన్ బర్ల్, టిమిసెన్ మరుమా, జాయ్‌లార్డ్ గుంబీ, ఇన్నోసెంట్ కైయా, ఫరాజ్ అక్రమ్ , ముజీబ్ ఉర్ రెహ్మాన్.

కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ: రహ్మానుల్లా గుర్బాజ్, షాన్ విలియమ్స్, భానుక రాజపక్స, మహేశ్ తీక్షణ, షెల్డన్ కాట్రెల్, కరీం జనత్, చమికా కరుణరత్నే, పీటర్ హజ్‌లోగౌ, మాథ్యూ బ్రీట్జ్‌కే, రిచర్డ్‌వాకా న్గరావా, రిచర్డ్‌వాకా న్గరావా, తద్శ్వాని మారుమణి, తినాషే కమునకేవే, పార్థివ్ పటేల్, మొహమ్మద్ ఇర్ఫాన్, స్టువర్ట్ బిన్నీ
చదవండి: Ashes 2023: బెయిర్‌స్టో స్టంపౌట్‌ ఉదంతం.. ప్రధాని సైతం స్పందించారు..!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement