T10 League
-
T10 League: ఊతప్ప ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే!
నేషనల్ క్రికెట్ టీ10 లీగ్-2024లో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 27 బాల్స్ ఎదుర్కొని ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 66 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడి స్ట్రైక్‌రేటు 244.44గా నమోదైంది.చికాగో జట్టుకు కెప్టెన్గాఅమెరికా వేదికగా జరుగుతున్న ఈ టీ10 లీగ్‌లో యాక్టివ్ క్రికెటర్లతో పాటు రిటైర్డ్ ప్లేయర్లు కూడా పాల్గొంటున్నారు. టైటిల్ కోసం ఆరు జట్లు పోటీపడుతున్న ఈ పొట్టి లీగ్‌లో రాబిన్ ఊతప్ప చికాగో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం టెక్సాస్ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా పరుగుల వర్షం కురిపించాడు.క్రిస్ లిన్ ధనాధన్ ఇన్నింగ్స్ఓపెనర్గా బరిలోకి దిగిన ఊతప్ప ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. మరో ఓపెనర్ క్రిస్ లిన్ సైతం 23 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో 60 పరుగలోత అజేయంగా నిలిచాడు. వీరితో పాటు మైక్ లూయీస్ 10 బంతుల్లోనే 34 రన్స్‌తో నాటౌట్‌గా నిలవగా.. నిర్ణీత 10 ఓవర్లలో చికాగో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. 41 పరుగుల తేడాతో జయభేరిలక్ష్య ఛేదనలో టెక్సాస్ గ్లాడియేటర్‌కు డేవిడ్ మలన్ శుభారంభమే అందించాడు. 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. మిగిలిన వాళ్లలో జేమ్స్ ఫుల్లర్ 13 బంతుల్లో 37 పరుగులతో మెరవగా.. ఇతరుల నుంచి సహకారం లభించలేదు. దీంతో పది ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి టెక్సాస్ కేవలం 132 పరుగులే చేయగలిగింది. ఫలితంగా చికాగో 41 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.అమెరికా నేషనల్ క్రికెట్ టీ10లీగ్‌లో ఆరుజట్లున్యూయార్క్ లయన్స్, టెక్సాస్ గ్లాడియేటర్స్, చికాగో సీసీ, డల్లాస్ లోన్స్టార్స్, లాస్ ఏంజెలిస్ వేవ్స్, అట్లాంటా కింగ్స్. టీమిండియా మాజీ క్రికెటర్లలో సురేశ్ రైనా న్యూయార్క్‌కు సారథిగా ఉండగా.. చికాగోకు ఊతప్ప నాయకుడు. మిగిలిన జట్లలో టెక్సాస్‌కు షాహిద్ ఆఫ్రిది, డల్లాస్‌కు దినేశ్ కార్తిక్, లాస్ ఏంజెలిస్‌కు షకీబ్ అల్ హసన్, అట్లాంటాకు ఏంజెలో మాథ్యూస్ కెప్టెన్లుగా ఉన్నారు.చదవండి: జైశంకర్‌తో భేటీ కానున్న పీసీబీ చీఫ్?.. టీమిండియా ఇక్కడకు రావాల్సిందే!Begin your morning with some sumptuous Robin Uthappa sixes! 🫶Uthappa and Lynn got Chicago off to a flying start by putting on 112 from just 38 balls.🔥#NCLonFanCode pic.twitter.com/gLVq6E5H4v— FanCode (@FanCode) October 8, 2024 -
సురేష్ రైనా సిక్సర్ల వర్షం.. దద్దరిల్లిన మైదానం(వీడియో)
టీమిండియా మాజీ బ్యాటర్ సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు నాలుగేళ్లు దాటినప్పటకి తనలో ఏ మాత్రం సత్తువ తగ్గలేదని మరోసారి నిరూపించాడు. అమెరికా వేదికగా జరుగుతున్న నేషనల్ క్రికెట్ టీ10 లీగ్‌లో రైనా విధ్వంసం సృష్టించాడు.ఈ లీగ్‌లో న్యూయార్క్ లయన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రైనా.. శనివారం లాస్ ఏంజిల్స్ వేవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే బౌండరీల మోత మోగించాడు. తన ట్రేడ్ మార్క్ సిక్సర్లతో అభిమానులను అలరించాడు.ముఖ్యంగా బంగ్లాదేశ్ స్టార్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్‌ను మిస్టర్ ఐపీఎల్ ఓ ఆట ఆడేసికున్నాడు. షకీబ్ ఓవర్లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో రైనా ఏకంగా 18 పరుగులు పిండుకున్నాడు. దీంతో అతడు మరోసారి బౌలింగ్‌కు కూడా రాలేదు. ఈ మ్యాచ్‌లో 28 బంతులు ఎదుర్కొన్న రైనా.. 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 53 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ య్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూయార్క్ నిర్ణీత 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. రైనాతో పాటు ఉపుల్ తరంగా(40) పరుగులతో రాణించాడు. అనంతరం లాస్ ఏంజిల్స్ 10 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 107 పరుగులకే పరిమితమైంది. దీంతో 20 పరుగుల తేడాతో న్యూయర్క్ లయన్స్ విజయం సాధించింది. Suresh Raina makes a roaring entry on the NCL stage with a stroke-filled half-century that lifted New York Lions to 126. 🔥#NCLonFanCode pic.twitter.com/4IS8waiIdF— FanCode (@FanCode) October 5, 2024 -
జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ విజేత జోబర్గ్ బంగ్లా టైగర్స్
జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ రెండో ఎడిషన్ (2024) విజేతగా జోబర్గ్ బంగ్లా టైగర్స్ అవతరించింది. నిన్న (సెప్టెంబర్ 29) జరిగిన ఫైనల్లో జోబర్గ్ బంగ్లా టైగర్స్.. కేప్‌టౌన్ సాంప్ ఆర్మీపై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా టైగర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. మొహమ్మద్ షెహజాద్ (25 బంతుల్లో 44; 6 ఫోర్లు, సిక్స్), కుసాల్ పెరీరా (11 బంతుల్లో 33; ఫోర్, 4 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సాంప్ ఆర్మీ బౌలర్లలో నికోల్సన్ గోర్డన్ 2, ఖైస్ అహ్మద్, అమిర్ హమ్జా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సాంప్ ఆర్మీ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 124 పరుగులకే పరిమితమైంది. డేవిడ్ మలాన్ (28 బంతుల్లో 62 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో విరుచుకుపడినప్పటికీ సాంప్ ఆర్మీని గెలిపించలేకపోయాడు. బ్రియాన్ బెన్నెట్ 36, జాక్ టేలర్ 23 (నాటౌట్) పరుగులు చేయగా.. రోహన్ ముస్తఫా డకౌటయ్యాడు. టైగర్స్ బౌలర్లలో ఆడమ్ మిల్నేకు రెండు వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్‌లో 44 పరుగులు చేసిన మొహమ్మద్ షెహజాద్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: పూరన్ సుడిగాలి శతకం -
టీ10 క్రికెట్లో సంచలనం.. స్కాట్లాండ్ క్రికెటర్ సుడిగాలి శతకం
టీ10 క్రికెట్లో సంచనలం నమోదైంది. జిమ్ ఆఫ్రో లీగ్-2024లో స్కాట్లాండ్ క్రికెటర్ జార్జ్ మున్సే సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. డర్బన్ వోల్వ్స్తో జరిగిన మ్యాచ్‌లో మున్సే (హరారే బోల్ట్స్) కేవలం 38 బంతుల్లో శతక్కొట్టాడు. ఇందులో 6 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. జిమ్ ఆఫ్రో లీగ్ చరిత్రలో ఇదే తొలి సెంచరీ. మున్సే సెంచరీతో శివాలెత్తడంతో తొలుత బ్యాటింగ్ చేసిన హరారే బోల్ట్స్ నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 173 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. బోల్ట్స్ ఇన్నింగ్స్‌లో మున్సే సెంచరీ తర్వాత ఎక్స్‌ట్రాల రూపంలో (29) అత్యధిక పరుగులు వచ్చాయి. జనిష్క పెరీరా 24, లహీరు మిలంత 13, దసున్ షనక 7 పరుగులు చేశారు. వోల్వ్స్ బౌలర్లలో దౌలత్ జద్రాన్ రెండు వికెట్లు తీశాడు.174 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వోల్వ్స్.. ఏ దశలో గెలుపు దిశగా సాగలేదు. ఆ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 116 పరుగులకే పరిమితమై 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కొలిన్ మున్రో (32), షర్జీల్ ఖాన్ (25), విల్ స్మీడ్ (16), ఇన్నోసెంట్ కాలా (16), రిచ్మండ్ ముతుంబామి (15) రెండంకెల స్కోర్లు చేశారు. బోల్ట్స్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్ 2, బ్రాండన్ మవుటా, దసున్ షనక, జేమ్స్ నీషమ్, అరినెస్టో వెజా తలో వికెట్ పడగొట్టారు.చదవండి: కమిందు మెండిస్.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు..! -
పొట్టి క్రికెట్లో సంచలనం.. 11 బంతుల్లో 66 రన్స్
యూరోపియన్ క్రికెట్ టీ10 టోర్నీలో సంచలనం నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రొమినియాపై ఆస్ట్రియా అద్భుత విజయం సాధించింది. 168 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రియా కేవలం 3 వికెట్లు కోల్పోయి 9. 5 ఓవర్లలో చేధించింది.అయితే ఛేజింగ్‌లో ఆస్ట్రియా 8 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి కేవలం 107 పరుగులు మాత్రమే చేసింది. ఆస్ట్రియా విజయానికి ఆఖరి మూడు ఓవర్లలో 61 పరుగులు అవసరమయ్యాయి. దీంతో ఆస్ట్రియా ఓటమి లాంఛనమే అంతా భావించారు.కానీ సరిగ్గా ఇదే సమయంలో ఆస్ట్రియా బ్యాటర్లు ఇమ్రాన్ ఆసిఫ్, అకిబ్ ఇక్బాల్ అద్భుతం చేశారు. 11 బంతుల్లో ఏకంగా 66 పరుగులు చేసి ఆస్ట్రియాకు సంచలన విజయాన్ని అందించారు. ఆస్ట్రియా బ్యాటర్లు 9వ ఓవర్లో ఏకంగా 41 పరుగులు రాబట్టగా.. 10వ ఓవర్లో తొలి 5 బంతులలో 20 పరుగులు వచ్చాయి. దీంతో లక్ష్య చేధనలో ఆస్ట్రియా 9. 5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆస్ట్రియా బ్యాటర్లలో ఇక్భాల్(19 బంతుల్లో 72, 2 ఫోర్లు,10 సిక్స్‌లు) టాప్ స్కోరర్ నిలవగా.. ఆసిఫ్ 12 బంతుల్లో 22 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. ఆస్ట్రియా బ్యాటర్ల విధ్వంసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. -
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ టీ10 లీగ్ నేటి నుంచి ప్రారంభం
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ టీ10 లీగ్ (ఐఎస్పీఎల్) తొలి ఎడిషన్ నేటి నుంచి (మార్చి 6) ప్రారంభంకానుంది. ఈ కొత్త క్రికెట్ లీగ్ భారత దేశపు నలుమూలల్లో దాగివున్న యంగ్ టాలెంట్‌ను వెలికితీయడమే లక్ష్యంగా రూపొందించబడింది. ఈ లీగ్ ద్వారా పరిచమయ్యే ఆటగాళ్లకు సరైన శిక్షణ ఇచ్చి, తగు ప్రోత్సాహకాలతో పోటీ ప్రపంచంలో నిలబెట్టాలన్నది నిర్వహకుల ఆలోచన. జట్లను కొనుగోలు చేసిన ప్రముఖ సినీ తారలు.. ఐఎస్పీఎల్లో వివిధ ప్రాంతాలకు చెందిన ఆరు జట్లు పోటీపడనున్నాయి. ఈ జట్లను టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ తారలు కొనుగోలు చేశారు. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కొనుగోలు చేయగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మఝీ ముంబైను.. అక్షయ్ కుమార్ శ్రీనగర్ వీర్‌ను.. హృతిక్ రోషన్ బెంగళూరు స్ట్రయికర్స్‌ను.. సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్ టైగర్స్ ఆఫ్ కోల్‌కతాను.. తమిళ సూపర్ స్టార్ సూర్య చెన్నై సింగమ్స్ జట్లను కొనుగోలు చేశారు. చీఫ్ మెంటార్‌గా రవిశాస్త్రి.. ఈ లీగ్‌కు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చీఫ్ మెంటార్‌గా వ్యవహరించనుండగా.. భారత మాజీ ఆటగాళ్లు ప్రవీణ్ ఆమ్రే, జతిన్ పరంజపే సెలెక్షన్ కమిటీ హెడ్లుగా పని చేయనున్నారు. అమితాబ్ వర్సెస్ అక్షయ్.. ఈ లీగ్‌లోని తొలి మ్యాచ్‌లో అమితాబ్ మఝీ ముంబై.. అక్షయ్ కుమార్ శ్రీనగర్ వీర్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో జరుగనుంది. ఈ లీగ్‌లోని అన్ని మ్యాచ్‌లు ఇదే వేదికగా జరుగనున్నాయి. రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ టెన్ 2 టీవీ ఛానెల్లో చూడవచ్చు. అలాగే సోనీ లివ్ యాప్‌లోనూ వీక్షించవచ్చు. సచిన్ జట్టుతో తలపడనున్న అక్షయ్ టీమ్.. ఇవాళ జరుగబోయే ఓపెనింగ్ మ్యాచ్‌కు ముందు ఓ ప్రత్యేక క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని టీమ్ మాస్టర్స్ ఎలెవెన్ జట్టు.. అక్షయ్ కుమార్ నేతృత్వంలోని టీమ్ ఖిలాడీతో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. -
ICC: బంగ్లాదేశ్ క్రికెటర్‌పై రెండేళ్ల నిషేధం.. ఐసీసీ ప్రకటన
Bangladesh all-rounder banned from all cricket: బంగ్లాదేశ్ క్రికెటర్ నాసిర్ హొసేన్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి భారీ షాకిచ్చింది. రెండేళ్ల పాటు క్రికెట్ ఆడకుండా అతడిపై నిషేధం విధించింది. ఐసీసీ అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినందుకుగానూ ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం ప్రకటన విడుదల చేసింది. అబుదాబి టీ10 లీగ్‌లో 2020-21 సీజన్‌కు గానూ పుణె డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన నాసిర్ హుసేన్.. మరో ఏడుగురితో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం సెప్టెంబరు, 2023లో అభియోగాలు నమోదు చేసింది. తప్పు చేశాడని తేలింది ఈ అంశంపై దృష్టి సారించిన ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణ చేపట్టగా నాసిర్ హుసేన్ తప్పు చేసినట్లు తేలింది. ఖరీదైన ఐఫోన్ 12ను బహుమతిగా పొందడం సహా ఫిక్సింగ్‌కు సంబంధించి ఆ ఫోన్లో బుకీలతో మాట్లాడటం.. ఈ విషయాల గురించి ఏ దశలోనూ అవినీతి నిరోధక విభాగంతో సంప్రదించకపోవడం, విచారణలో సహకరించకపోవడం అతడిపై వేటుకు కారణమైంది. మళ్లీ అపుడే రీఎంట్రీ సాధ్యం కాగా తాజా నిషేధం నేపథ్యంలో.. మళ్లీ 2025 ఏప్రిల్ 7 తర్వాతనే నాసిర్ హుసేన్ అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం ఉంటుంది. ఇక స్పిన్ ఆల్‌రౌండర్ అయిన నాసిర్ హుసేన్ బంగ్లాదేశ్ తరఫున 19 టెస్టులు, 65 వన్డేలు, 31 టీ20లు ఆడాడు. ఆఖరిసారిగా 2018లో బంగ్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు ఈ 32 ఏళ్ల ఆల్‌రౌండర్. చదవండి: అతడు ఎవరినీ కాపీ కొట్టడం లేదు.. హార్దిక్ తిరిగొస్తే తలనొప్పి: టీమిండియా దిగ్గజం -
36 బంతుల్లోనే శతకం.. 11 సిక్సర్లు, 5 ఫోర్లు
యూరోపియన్ మహిళల టీ10 లీగ్ 2023లో సంచలనం నమోదైంది. ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ కెప్టెన్ ఐరిస్ జ్విల్లింగ్ 36 బంతుల్లోనే శతక్కొట్టింది. ఈ ఇన్నింగ్స్‌లో జ్విల్లింగ్ 11 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 159 పరుగుల భారీ స్కోర్ చేసింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో జ్విల్లింగ్ ఒక్కరే మూడొంతుల పరుగులు చేయడం విశేషం. మహిళల క్రికెట్ టీ10 ఫార్మాట్లో తొలి సెంచరీ చేసిన క్రికెటర్ జ్విల్లింగే కావడం మరో విశేషం. ఈ మ్యాచ్‌లో జ్విల్లింగ్ ధాటికి ఇద్దరు బౌలర్లు ఓవర్‌కు 23 పరుగుల చొప్పున సమర్పించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రియా.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసి, 100 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నెదర్లాండ్స్ బౌలర్లలో డి లాంజ్, రాబిన్ రిజ్కే, హన్నా తలో 2 వికెట్లు పడగొట్టగా.. కార్లిన్ వాన్ ఓ వికెట్ దక్కించుకుంది. ఆస్ట్రియా ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్కరు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మల్లిక మహదేవ 30 పరుగులు చేసింది. ఆస్ట్రియా ఇన్నింగ్స్‌లో నలుగురు డకౌట్లు అయ్యారు. -
ఐపీఎల్ తరహాలో టీ10 లీగ్.. ప్లాన్ చేస్తున్న బీసీసీఐ
16 సీజన్ల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను (ఐపీఎల్) విజయవంతంగా నిర్వహించిన అనంతరం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మరో కొత్త లీగ్‌ను నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ లీగ్‌ను కూడా ఐపీఎల్ తరహాలోనే భారీ ప్రణాళికతో రూపొందించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ లీగ్‌ను టీ20 ఫార్మాట్లో కాకుండా టీ10 ఫార్మాట్లో నిర్వహించాలని బీసీసీఐ పెద్దలు అనుకుంటున్నారట. ఇందుకు సెప్టెంబర్-అక్టోబర్ మాసాలను పరిశీలిస్తున్నట్లు వినికిడి. భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఈ రెండు నెలల్లో పెద్ద టోర్నీలేవీ లేకపోవడంతో సెప్టెంబర్-అక్టోబర్ మాసాలయితే కొత్త లీగ్ నిర్వహణకు అనువుగా ఉంటాయని బీసీసీఐ పెద్దల చర్చించినట్లు తెలుస్తుంది. కొత్త టీ10 లీగ్ ఆలోచన ఆరంభ దశలోనే ఉన్నప్పటికీ స్పాన్సర్‌షిప్‌ల కోసం బడా కంపెనీలు ఎగబడుతున్నట్లు సమాచారం. కొత్త లీగ్ ప్రతిపాదనను బీసీసీఐ కార్యదర్శి జై షా లేవనెత్తగా బీసీసీఐ పెద్దలందరూ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. కాగా, బీసీసీఐ ఆధ్వర్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో పరుడు పోసుకున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి క్యాష్ రిచ్ లీగ్ నిరంతరాయంగా 16 సీజన్ల పాటు విజయవంతంగా సాగింది. తదుపరి సీజన్ (2024) సన్నాహకాలు కూడా ఇదిరవకే ప్రారంభమయ్యాయి. ఈ సీజన్‌కు సంబంధించిన వేలం ఈనెల 19న దుబాయ్‌లో జరుగనుంది. వేలంలో ఆటగాళ్ల కొనుగోలు విషయంలో ఫ్రాంచైజీలు సైతం ఓ క్లారిటీ కలిగి ఉన్నాయి. -
పది మంది స్కోర్లను ఒక్కడే కొట్టేశాడు.. విధ్వంసం సృష్టించిన ఇంగ్లండ్ బ్యాటర్
అబుదాబీ టీ10 లీగ్ 2023లో ఆసక్తికర గణాంకాలు నమోదయ్యాయి. టీమ్ అబుదాబీ, బంగ్లా టైగర్స్ మధ్య నిన్న (డిసెంబర్ 4) జరిగిన మ్యాచ్‌లో ఓ బ్యాటర్ ప్రత్యర్ధి జట్టులోని పది మంది స్కోర్ల కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ అబుదాబీ నిర్ణీత 10 ఓవర్లలో 65 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లా టైగర్స్ బ్యాటర్, ఇంగ్లండ్ యువ ఆటగాడు జోర్డన్ కాక్స్ ఒక్కడే అజేయమైన 56 పరుగులు (23 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. జోర్డన్ చెలరేగడంతో బంగ్లా టైగర్స్ 4.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. అబుదాబీ ఇన్నింగ్స్‌లో ఇద్దరు డకౌట్లు కాగా.. ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆ జట్టు కెప్టెన్ ప్రిటోరియస్ (15), 11వ నంబర్ ఆటగాడు రయీస్ (8 బంతుల్లో 20 నాటౌట్; 3 సిక్సర్లు) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. రయీస్ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోతే అబుదాబీ టీమ్ ఈ మాత్రం స్కోర్ కూడా చేయలేకపోయేది. టీమ్ అబుదాబీ చేసిన స్కోర్‌లో (65) జోర్డన్ కాక్స్ ఒక్కడే 90 శాతానికి పైగా పరుగులు (56 నాటౌట్) సాధించడం విశేషం. డేనియల్ సామ్స్ (2-0-11-3), గాబ్రియెల్ (2-1-2-2), హోవెల్ (2-0-9-2), డొమినిక్ డ్రేక్స్ (1-0-11-1) బంగ్లా టైగర్స్ పతనాన్ని శాశించారు. అబుదాబీ టీమ్‌లో కైల్ మేయర్స్ (6), అలెక్స్ హేల్స్ (2), టామ్ బాంటన్ (0) లాంటి విధ్వంసకర వీరులు ఉన్నా అతి తక్కువ స్కోర్ల్కే పరిమితమయ్యారు. -
దంచికొట్టిన మిల్లర్.. ఆఫ్ఘన్ ఓపెనర్ పోరాటం వృధా
అబుదాబీ టీ10 లీగ్‌లో బ్యాటర్ల హవా కొనసాగుతుంది. బంగ్లా టైగర్స్-నార్త్ర్న్ వారియర్స్ మధ్య ఇవాళ (డిసెంబర్ 3) జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు చెలరేగిపోయారు. బంగ్లా టైగర్స్ తరఫున డేవిడ్ మిల్లర్ (24 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), జోర్డన్ కాక్స్ (16 బంతుల్లో 35; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. వారియర్స్ తరఫున ఆఫ్ఘన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ (20 బంతుల్లో 57; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), కెన్నార్ లెవిస్ (9 బంతుల్లో 22; 2 ఫోర్లు, 2స సిక్సర్లు) పేట్రేగిపోయారు. 138 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వారియర్స్ ఆటగాళ్లు పోరాడినప్పటికీ, విజయం బంగ్లా టైగర్స్నే వరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా టైగర్స్.. జోర్డన్ కాక్స్, డేవిడ్ మిల్లర్ చెలరేగడంతో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 137 పరుగుల భారీ స్కోర్ చేసింది.టైగర్స్ ఇన్నింగ్స్‌లో అవిష్క ఫెర్నాండో (11), కుశాల్ మెండిస్ (20), షనక (14 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. వారియర్స్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ 2, సుల్తాన్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టారు. 138 పరుగుల లక్ష్య ఛేదనలో వారియర్స్ బ్యాటర్లు ఆది నుంచి దూకుడుగా ఆడినప్పటికీ లక్ష్యానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయారు. వారియర్స్ ఇన్నింగ్స్‌లో హజ్రతుల్లా జజాయ్, కెన్నార్ లెవిస్‌తో పాటు ఆడమ్ హోస్ (17), జేమ్స్ నీషమ్ (23 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేసి తమ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. టైగర్స్ బౌలర్లలో కార్లోస్ బ్రాత్‌వైట్ 2 వికెట్లు పడగొట్టగా.. జాషువ లిటిల్, డేనియల్ సామ్స్, రోహన్ ముస్తఫా తలో వికెట్ దక్కించుకున్నారు. -
నిప్పులు చెరిగిన పాక్ పేసర్.. మ్యాచ్ టై.. సూపర్ ఓవర్‌తో ఫలితం
యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్ 2023 ఎడిషన్ విజేతగా టెక్సస్ ఛార్జర్స్ అవతరించింది. న్యూయార్క్ వారియర్స్‌తో నిన్న (ఆగస్ట్ 27) జరిగిన ఫైనల్లో ఛార్జర్స్ సూపర్ ఓవర్ ద్వారా విజేతగా నిలిచింది. నిర్ణీత ఓవర్ల అనంతరం ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ ద్వారా విజేతను తేల్చాల్సి వచ్చింది. రాణించిన కార్టర్.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూయార్క్ వారియర్స్.. టెయిలెండర్ జోనాథన్ కార్టర్ (17 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. న్యూయార్క్ ఇన్నింగ్స్‌లో కార్టర్ మినహా అందరూ తేలిపోయారు. దిల్షన్ (18), రిచర్డ్ లెవి (17) రెండంకెల స్కోర్లు చేయగా.. మిస్బా ఉల్ హాక్ (5), షాహిద్ అఫ్రిది (1), కమ్రాన్ అక్మల్ (0), అబ్దుల్ రజాక్ (3) తస్సుమన్నారు. టెక్సస్ బౌలర్లలో ఎహసాన్ ఆదిల్ 3, ఫిడేల్ ఎడ్వర్డ్స్, ఇమ్రాన్ ఖాన్, తిసార పెరీరా తలో వికెట్ పడగొట్టారు. నిప్పులు చెరిగిన సోహైల్ ఖాన్.. 93 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టెక్సస్ ఛార్జర్స్.. సోహైల్ ఖాన్ (2-0-15-5), షాహిద్ అఫ్రిది (1-0-8-2), ఉమైద్ ఆసిఫ్ (2-0-14-2), జెరోమ్ టేలర్ (2-0-24-1) ధాటికి 10 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటైంది. ఛార్జర్స్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ హఫీజ్ (46), బెన్ డంక్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. స్కోర్లు సమం కావడంతో ఫలితాన్ని సూపర్ ఓవర్ ద్వారా నిర్ణయించారు. స్కోర్లు సమం.. సూపర్ ఓవర్లో ఫలితం సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛార్జర్స్.. వికెట్ నష్టపోయి 15 పరుగులు చేసింది. డంక్, ముక్తర్ చెరో సిక్సర్ బాది, ఈ స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు. ఛేదనలో వారియర్స్ 13 పరుగులకే పరిమతం కావడంతో టెక్సస్ ఛార్జర్స్ విజేతగా ఆవిర్భవించింది. కార్టర్ సిక్సర్, బౌండరీ బాదినా ప్రయోజనం లేకుండాపోయింది. సోహైల్ తన్వీర్ వారియర్స్‌ను కట్టడి చేశాడు. -
మహ్మద్ హాఫీజ్ ఊచకోత.. కేవలం 17 బంతుల్లోనే!
యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్-2023లో టెక్సాస్ ఛార్జర్స్ ఫైనల్‌కు చేరింది. ఫ్లోరిడా వేదికగా కాలిఫోర్నియా నైట్స్‌తో జరిగిన క్వాలిఫియర్-2లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన టెక్సాస్ ఫైనల్లో అడుగుపెట్టింది. టెక్సాస్ ఫైనల్‌కు చేరడంలో ఆ జట్టు ఆల్‌రౌండర్, పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ హాఫీజ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కాలిఫోర్నియా నైట్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 139 పరుగుల భారీ స్కోర్ చేసింది. కాలిఫోర్నియా ఇన్నింగ్స్‌లో కల్లిస్(56 నాటౌట్), మిలాంద్ కుమార్(41) పరుగులతో అద్భుతంగా రాణించారు. టెక్సాస్ బౌలర్లలో మహ్మద్ హాఫీజ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఇమ్రాన్ ఖాన్ ఒక్క వికెట్ సాధించాడు. హాఫీజ్ విధ్వంసం.. 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టెక్సాస్ ఛార్జర్స్ కేవలం 8.5 ఓవర్లలోనే ఛేదించింది. టెక్సాస్ ఛార్జర్స్ బ్యాటర్లలో హాఫీజ్ విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 17 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను ఈ పాకిస్తానీ ఆటగాడు అందుకున్నాడు. ఓవరాల్‌గా 24 బంతులు ఎదుర్కొన్న హాఫీజ్ 7 సిక్స్‌లు, 3 ఫోర్లతో 68 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ముక్తార్ అహ్మద్(40) కూడా రాణించాడు. ఆదివారం జరగనున్న ఫైనల్లో న్యూయార్క్ వారియర్స్‌తో టెక్సాస్ ఛార్జర్స్ తాడోపేడో తెల్చుకోనుంది. చదవండి: PAK vs AFG: చరిత్ర సృష్టించిన ఆఫ్గాన్ ఆటగాడు.. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ! 40 ఏళ్ల రికార్డు బద్దలు -
రెచ్చిపోయిన శ్రీశాంత్.. చెలరేగిన పాక్ బౌలర్లు
యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్ 2023లో టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ చెలరేగిపోయాడు. మోరిస్విల్లే యూనిటీ తరఫున బరిలోకి దిగిన శ్రీశాంత్.. టెక్సస్ ఛార్జర్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 23) జరిగిన మ్యాచ్‌లో 2 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతనికి సౌతాఫ్రికా మాజీ టెస్ట్ బౌలర్ డేన్ పైడ్ట్ (2/15), విండీస్ నవీన్ స్టివర్ట్ (1/5) తోడవ్వడంతో టెక్సస్ ఛార్జర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులకు పరిమితమైంది. ✌️wickets in his first over for Sreesanth 💪#MVUvTXC #CricketsFastestFormat #USMastersT10 #T10League #SunshineStarsSixes pic.twitter.com/Pm5kAUyimb — US Masters T10 (@USMastersT10) August 23, 2023 ఛార్జర్స్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ మాజీ డారెన్ స్టీవెన్స్ 18 బంతుల్లో 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. బెన్ డంక్ (15), తిసాక పెరీరా (12), ఉపుల్ తరంగ (13) తలో చేయి వేశారు. మహ్మద్ హఫీజ్ (8), ముక్తర్ అహ్మద్ (2), సోహైల్ తన్వీర్ (6) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటయ్యారు. Difference maker in his first outing with the ball 💪 Hafeez, take a bow! 🙇♂️🙇♀️#MVUvTXC #CricketsFastestFormat #USMastersT10 #T10League #SunshineStarsSixes pic.twitter.com/tKfJDx0U2G — US Masters T10 (@USMastersT10) August 23, 2023 K̶e̶y̶ Massive wickets 🤝 Professor Hafeez@MHafeez22#MVUvTXC #CricketsFastestFormat #USMastersT10 #T10League #SunshineStarsSixes pic.twitter.com/erlsKDVEBu — US Masters T10 (@USMastersT10) August 23, 2023 చెలరేగిన పాక్ బౌలర్లు.. 110 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మోరిస్విల్లే యూనిటీ.. పాక్ బౌలర్లు మహ్మద్ హఫీజ్ (2-0-10-3), సోహైల్ తన్వీర్ (2-0-8-2), విండీస్ బౌలర్ ఫిడేల్ ఎడ్వర్డ్స్ (2-0-10-2), లంక బౌలర్ తిసార పెరీరా (2-0-16-1) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 75 పరుగులకే పరిమితమైంది. షెహన్ జయసూర్య (22) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మిగతా బ్యాటర్లలో కోరె ఆండర్సన్ (16 నాటౌట్) ఒక్కడే రెండంకెల స్కోర్ చేశాడు. ఫలితంగా టెక్సస్ ఛార్జర్స్ 34 పరుగుల తేడాతో మోరిస్విల్లేను ఓడించింది. -
వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విధ్వంసం సృష్టించిన ఫించ్.. 4 ఫోర్లు, 5 సిక్సర్లతో..!
యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్ 2023లో ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (కాలిఫోర్నియా నైట్స్) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విధ్వంసం సృష్టించాడు. న్యూజెర్సీ లెజెండ్స్‌తో నిన్న (ఆగస్ట్ 21) జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 8 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో అజేయమైన 75 పరుగులు చేసిన ఫించ్.. ఇవాళ (ఆగస్ట్ 22) మోరిస్విల్లే యూనిటీపై 30 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 63 పరుగులు చేసి, తన భీకర ఫామ్‌ను కొనసాగించాడు. ఫించ్ ఒక్కడే ఒంటరిపోరాటం చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కాలిఫోర్నియా నైట్స్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఫించ్ వరుసగా రెండో మ్యాచ్‌లో అజేయమైన అర్ధశతకం సాధించగా.. జాక్ కలిస్ (9), మిలింద్ కుమార్ (6), సురేశ్ రైనా (6), ఇర్ఫాన్ పఠాన్ (9) విఫలమయ్యారు. మోరిస్విల్లే బౌలర్లలో పియనార్ 3 వికెట్లు పడగొట్టగా.. సావేజ్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సరిపోని ఫించ్ మెరుపులు.. కోరె ఆండర్సన్ ఊచకోత 101 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మోరిస్విల్లే.. మరో 7 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మోరిస్విల్లే బ్యాటర్ కోరె ఆండర్సన్ సుడిగాలి ఇన్నింగ్స్ (5 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ముందు ఫించ్ మెరుపులు సరిపోలేదు. ఛేదనలో ఆరంభంలో నిదానంగా ఆడిన మోరిస్విల్లే.. ఆఖర్లో ఆండర్సన్‌తో పాటు పియనార్ (12 బంతుల్లో 23 నాటౌట్; ఫోర్, సిక్స్), షెహన్ జయసూర్య (17 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో విజయతీరాలకు చేరింది. మోరిస్విల్లే ఇన్నింగ్స్‌లో పార్థివ్ పటేల్్ (9 బంతుల్లో 14; 2 ఫోర్లు), క్రిస్ గేల్ (10 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. కాలిఫోర్నియా బౌలర్లు పవన్ సుయాల్, ఆష్లే నర్స్, రికార్డో పావెల్ తలో వికెట్ పడగొట్టారు. -
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ విధ్వంసం... ఓకే ఓవర్లో 5 సిక్స్‌లు! వీడియో వైరల్
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అడితో ఏ మాత్రం పవర్ తగ్గలేదు. ఫించ్ ప్రస్తుతం యూఎస్ మాస్టర్ లీగ్‌లో కాలిఫోర్నియా నైట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం న్యూజెర్సీ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫించ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 31 బంతుల్లో 8 సిక్స్‌లు, 3 ఫోర్ల సాయంతో 75 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఫించ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినప్పటికీ తన జట్టు మాత్రం 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కాలిఫోర్నియా నైట్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. కాలిఫోర్నియా బ్యాటర్లలో ఫించ్‌తో పాటు మిలాంద్ కుమార్(27) పరుగులతో రాణించాడు. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజెర్సీ లెజెండ్స్ 4 వికెట్లు కోల్పోయి 9.4 ఓవర్లలో ఛేదించింది. న్యూజెర్సీ బ్యాటర్లలో టీమిండియా మాజీ ఆటగాడు యూసుఫ్ పఠాన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 11 బంతుల్లో 4 సిక్స్‌లు, 2 ఫోర్లతో 35 పరుగులు చేసి న్యూజెర్సీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు నమాన్ ఓజా(25) పరుగులతో రాణించాడు. చదవండి: MS Dhoni- Rohit: ఆరోజు రోహిత్ వద్దంటూ.. ధోని అతడి కోసం పట్టుబట్టాడు.. వెంటనే కోచ్ కూడా! మేమేం చేయలేకపోయాం.. Why we call him the Aaronator 👊 Take a bow @AaronFinch5 6️⃣6️⃣6️⃣6️⃣6️⃣#USMastersT10 #NJTvCK #SunshineStarsSixes#CricketsFastestFormat #T10League pic.twitter.com/NUdccQxuKq — US Masters T10 (@USMastersT10) August 21, 2023 -
అఫ్రిది మెరుపులు వృధా.. ఆకాశమే హద్దుగా చెలరేగిన జెస్సీ రైడర్
యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్‌లో వెటరన్ స్టార్ క్రికెటర్లు పోటాపోటీగా రెచ్చిపోతున్నారు. న్యూయార్క్ వారియర్స్-న్యూజెర్సీ లెజెండ్స్ మధ్య నిన్న (ఆగస్ట్ 20) జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూయార్క్.. 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. నూయార్క్ ఇన్నింగ్స్‌లో కమ్రాన్ అక్మల్ (12 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రిచర్డ్ లెవి (5 బంతుల్లో 16; ఫోర్, 2 సిక్సర్లు), అఫ్రిది (12 బంతుల్లో 37 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. న్యూజెర్సీ బౌలర్ ప్లంకెట్ 2 వికెట్లు పడగొట్టాడు. 85 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజెర్సీ.. 4.4 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జెస్సీ రైడర్ (12 బంతుల్లో 38; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), యూసఫ్ పఠాన్ (6 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్సర్లు), క్రిస్ బార్న్‌వెల్ (10 బంతుల్లో 28 నాటౌట్; 4 సిక్సర్లు) సిక్సర్ల మోత మోగించి న్యూజెర్సీని గెలిపించారు. లెజెండ్స్ కోల్పోయిన ఏకైక వికెట్ జెరోమ్ టేలర్‌కు దక్కింది. కాగా, టీమిండిమా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ న్యూజెర్సీ జట్టుకు.. పాక్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హాక్ న్యూయార్క్ జట్టుకు నాయకత్వం వహించారు. -
47 ఏళ్ల వయస్సులో విధ్వంసం.. ఫోర్లు, సిక్సర్ల వర్షం! వీడియో వైరల్
దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాక్వస్ కల్లిస్ తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న యూఎస్ మాస్టర్ లీగ్‌లో కాలిఫోర్నియా నైట్స్‌కు కల్లిస్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా టెక్సాస్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా 47 ఏళ్ల కల్లిస్ చేలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. తన ట్రెడ్‌మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. 31 బంతులు ఎదుర్కొన్న కల్లిస్.. 8 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 64 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మిలాంద్ కుమార్( 28 బంతుల్లో 76 నాటాట్) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దిరి సునామీ ఇన్నింగ్స్ ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన కాలిఫోర్నియా నైట్స్ నిర్ణీత ఓవర్లలో 158 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టెక్సాస్ ఛార్జర్స్ నిర్ఱీత 10 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 110 పరుగులు మాత్రమే చేయగల్గింది. టెక్సాస్ బ్యాటర్లలో ముక్తర్ ఆహ్మద్(33), ఉపుల్ తరంగా(27) పరుగులతో రాణించారు. కాలిఫోర్నియా బౌలర్లలో నర్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. సిడిల్, పావెల్, సుయాల్ తలా వికెట్ సాధించారు. చదవండి: World cup 2023: బీసీసీఐకి హెచ్‌సీఏ షాక్... మరోసారి ప్రపంచ కప్ షెడ్యూల్లో మార్పులు? We've traveled back in time to witness @jacqueskallis75 deliver 🔝 batting performance for today's match 1! Tune-in to #USMastersT10OnStar Tomorrow | 6:30 PM onwards | Star Sports 1 & Star Sports 1 Hindi#Cricket pic.twitter.com/JLdxcH3idf — Star Sports (@StarSportsIndia) August 19, 2023 -
ఆఫ్గాన్ బ్యాటర్ మెరుపులు.. జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ విజేతగా డర్బన్
జింబాబ్వే వేదికగా జరిగిన జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ తొలి ఎడిషన్ విజేతగా డర్బన్ క్వాలండర్స్ నిలిచింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఫైనల్లో జోబర్గ్ బఫెలోస్ను 8 వికెట్ల తేడాతో ఓడించిన డర్బన్ చాంపియన్స్‌గా నిలిచింది. ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ బఫెలోస్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. జోబర్గ్ బ్యాటరల్లో కెప్టెన్ మహ్మద్ హాఫీజ్(32), టామ్ బంటన్(36) పరుగులతో రాణించారు. డర్బన్ బౌలర్లలో అబ్బాస్,లిండే, ఈవెన్స్ తలా వికెట్ సాధించారు. అనంతరం 128 లక్ష్యంతో బరిలోకి దిగిన డర్బన్ క్వాలండర్స్ 9.2 ఓవర్లలోనే ఛేదించింది. డర్బన్ విజయంలో హజ్రతుల్లా జజాయ్(43 నాటౌట్), టిమ్ సైఫర్ట్(30), ఆసిఫ్ అలీ(21 నాటౌట్) కీలక పాత్ర పోషించారు. జోబర్గ్ బఫెలోస్ బౌలర్లలో ఉస్మాన్ షిన్వారి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో అదరగొట్టిన హజ్రతుల్లా జజాయ్ మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కగా.. టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన సీఫర్ట్‌కు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు లభించింది. చదవండి: మేము కసితో ఆడాం.. నాకు ముందే తెలుసు! తర్వాతి మ్యాచ్ కూడా: విండీస్ కెప్టెన్ -
రాబిన్ ఉతప్ప విధ్వంసం.. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో! వీడియో వైరల్
జింబాబ్వే వేదికగా జరుగుతున్న జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌లో ఫైనల్ చేరడంలో హరారే హరికేన్స్ జట్టు విఫలమైంది. డర్బన్ క్వాలండర్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో 4 వికెట్ల తేడాతో డర్బన్ క్వాలండర్స్ ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి హరారే నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్ నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 82 పరుగులు మాత్రమే చేసింది. హరారే బ్యాటర్లలో సమిత్ పటేల్(39) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. డర్బన్ బౌలర్లో ఈవెన్స్ 4 వికెట్లతో చెలరేగాడు. అనంతరం 83 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి డర్బన్ ఛేదించింది. దీంతో తమ ఫైనల్ బెర్త్‌ను డర్బన్ ఖారారు చేసుకుంది. జూలై 29న జరగనున్న ఫైనల్లో జోబర్గ్ బఫెలోస్ , డర్బన్ జట్లు తలపడనున్నాయి. రెచ్చిపోయిన రాబిన్ ఉతప్ప.. ఇక అంతకుముందు కేప్ టౌన్ సాంప్ ఆర్మీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో భారత మాజీ ఆటగాడు, హరారే హరికేన్స్ కెప్టెన్ రాబిన్ ఉతప్ప ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 36 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 88 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఉతప్ప విద్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో.. 146 లక్ష్యాన్ని హరికేన్స్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి ఛేదించింది. అతడితో పాటు ఫెరీరా(35) రాణించాడు. అయితే ఎలిమినేటర్‌లో అద్బుత విజయం సాధించినప్పటికీ.. క్వాలిఫయర్-2లో ఓటమి పాలకావడంతో హరారే టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. కాగా ఉతప్ప ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Ashes 2023 Steve Smith Run Out Video: ఔటని వెళ్లిపోయిన స్మిత్.. ఇంగ్లండ్ కొంపముంచిన బెయిర్ స్టో తప్పిదం! వీడియో వైర -
యూసుఫ్ పఠాన్ ఊచకోత.. కేవలం 26 బంతుల్లోనే! వీడియో వైరల్
జింబాబ్వే వేదికగా జరుగుతున్న జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌లో జోబర్గ్ బఫెలోస్ ఫైనల్‌కు చేరుకుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా క్వాలిఫయర్-1లో తో డర్బన్ క్వాలండర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించిన జోబర్గ్.. ఫైనల్లో అడుగుపెట్టింది. 141 పరుగుల భారీ లక్ష్యాన్ని 9.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి జో బర్గ్ ఛేదించింది.ఇక ఈ మ్యాచ్‌లో జోబర్గ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా మాజీ ఆటగాడు యూసుఫ్ పఠాన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 26 బంతుల్లోనే 80 పరుగులు సాధించిన ఫఠాన్.. ఒంటి చేత్తో తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి. ఆఖరి ఓవర్లో జోబర్గ్ విజయానికి 20 పరుగులు అవసరమవ్వగా.. పఠాన్ వరుసగా రెండు సిక్స్‌లు, ఫోర్లు బాది మ్యాచ్‌ను ముగించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన డర్బన్ క్వాలండర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. డర్బన్ బ్యాటర్లలో ఫ్లెచర్(39), ఆసిఫ్ అలీ(32) పరుగులతో రాణించారు. ఇక ఇది ఇలా ఉండగా.. క్వాలిఫయర్-1లో ఓటమి పాలైన డర్బన్ క్వాలండర్స్.. క్వాలిఫయర్-2లో మాత్రం విజయం సాధించి ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ క్రమంలో జూలై 29న జరగనున్న ఫైనల్లో జోబర్గ్ బఫెలోస్ , డర్బన్ జట్లు తలపడనున్నాయి. Yusuf Pathan smashed 6, 6, 0, 6, 2, 4 in a single over against Amir. What a beast. 🔥pic.twitter.com/8nCf1H8l8c — Johns. (@CricCrazyJohns) July 28, 2023 -
క్యాచ్ విషయంలో నమ్మకం కోల్పోయిన వేళ.. గొడవకు దారి
క్రికెట్ మ్యాచ్‌ల్లో కొన్నిసార్లు క్యాచ్ కోసం ఇద్దరు ఫీల్డర్లు ఒకేసారి పరిగెత్తుకురావడం చూస్తుంటాం. ఒక్కోసారి క్యాచ్ మిస్ కావొచ్చు.. లేదంటే క్యాచ్ అందుకునే సమయంలో ఎవరో ఒకరికి దెబ్బలు తగలడం జరగొచ్చు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్యాచ్ మాత్రం కాస్త వెరైటీ పద్దతిలో ఉంటుంది. యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో భాగంగా ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. ఈసీఎస్ చెకియా టి10 లీగ్‌లో భాగంగా నో క్రికెట్ క్లబ్, పరాగ్ టైగర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టైగర్స్ ఓపెనర్ జిఎమ్ హసంత్ భారీ షాట్ ఆడబోయి బ్యాడ్ ఎడ్జ్ తగిలిన బంతి గాల్లోకి లేచింది. ఫీల్డర్ రహత్ అలీ, బౌలింగ్ చేసిన రియాజ్ అఫ్రిదిలు ఒకేసారి దూసుకొచ్చారు. అయితే రహత్ అలీ క్యాచ్ ఈజీగా అందుకునే చాన్స్ ఉన్నా రిస్క్ చేసిన రియాజ్ అఫ్రిది తానే క్యాచ్ అందుకున్నాడు. అదృష్టవశాత్తూ ఇద్దరిలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ క్రమంలో రహత్ అలీ రియాజ్ వైపు కోపంగా చూస్తూ..''నేను పట్టుకునేవాడిని కదా.. నాపై నమ్మకం లేదా'' అంటూ పేర్కొన్నాడు. దీనిపై రియాజ్ అఫ్రిది స్పందిస్తూ.. ''నమ్మకం లేక కాదు క్యాచ్ అందుకోవాలనే వచ్చాను'' అంటూ బదులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Tag a teammate you wouldn't trust under the high ball...😄 #EuropeanCricket #EuropeanCricketSeries #StrongerTogether pic.twitter.com/oxQx5HMPa7 — European Cricket (@EuropeanCricket) July 26, 2023 చదవండి: అప్పట్లో శుబ్‌మన్.. ఇప్పుడు అర్జున్ టెండుల్కర్.. ఫొటో వైరల్ వెస్టిండీస్‌తో తొలి వన్డే.. టీమిండియా క్రికెటర్ రీఎంట్రీ! 9 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్ -
రెచ్చిపోయిన రాబిన్ ఉతప్ప.. సరిపోని ఫ్లెచర్ మెరుపులు
జింబాబ్వే టీ10 లీగ్‌లో టీమిండియా వెటరన్ ఆటగాడు, హరారే హరికేన్స్ ఓపెనర్ రాబిన్ ఉతప్ప తొలి అర్ధశతకం బాదాడు. డర్బన్ ఖలందర్స్‌తో నిన్న (జులై 26) జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయిన ఉతప్ప.. 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. అతనితో పాటు చకబ్వా (23 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), డొనవాన్ ఫెరియెరా (12 బంతుల్లో 24 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో హరికేన్స్ నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 134 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఖలందర్స్ బౌలర్లలో బ్రాడ్ ఈవాన్స్, అజ్మతుల్లా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 135 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఖలందర్స్.. నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా హరికేన్స్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆండ్రీ ఫ్లెచర్ (25 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్ (28 బంతుల్లో 49; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఖలందర్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. హరికేన్స్ బౌలర్ లూక్ జాంగ్వే 2 వికెట్లు పడగొట్టాడు. మెరిసిన కాలా.. నిన్ననే జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో కేప్‌టౌన్ సాంప్ ఆర్మీపై బులవాయో బ్రేవ్స్.. జోబర్గ్ బఫెలోస్పై కేప్‌టౌన్ విజయాలు సాధించాయి. కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్స్.. ఇన్నోసెంట్ కాలా (52 నాటౌట్), వెబ్‌స్టర్ (23 నాటౌట్) రాణించడంతో 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగా, ఛేదనలో గట్టి పోటీ ఇచ్చిన కేప్‌టౌన్ లక్ష్యానికి 4 పరుగుల దూరంలో (122/4) నిలిచిపోయింది. రాణించిన హఫీజ్, బొపారా.. కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ హఫీజ్ (40 నాటౌట్), రవి బొపారా (30 నాటౌట్) రాణించడంతో జోబర్గ్ బఫెలోస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేప్‌టౌన్.. ముజరబాని (3/7), న్యాయుచి (2/11), డాలా (1/17) ధాటికి 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 89 పరుగులు మాత్రమే చేయగా.. హఫీజ్, బొపారా రాణించడంతో బఫెలోస్ టీమ్ 6.5 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. -
రసవత్తర సమరం.. సౌతాఫ్రికా బ్యాటర్ ఉగ్రరూపం.. పొట్టి క్రికెట్లో అద్భుతం
జింబాబ్వే టీ10 లీగ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదయ్యాయి. బ్యాటింగ్‌లో హరారే హరికేన్స్ ఆటగాడు డొనవాన్ ఫెరియెరా (33 బంతుల్లో 87 నాటౌట్; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) నిర్ణీత బంతుల్లో సగానికిపైగా ఎదుర్కొని బ్యాటింగ్ విశ్వరూపాన్ని ప్రదర్శించగా.. బౌలింగ్‌లో కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ బౌలర్, విండీస్ ఆటగాడు షెల్డన్ కాట్రెల్ తన కోటా 2 ఓవర్లలో ఓ మెయిడిన్ వేసి, మరో ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి మొత్తంగా 3 వికెట్లు తీశాడు. టీ20 క్రికెట్లోనే మెయిడిన్ ఓవర్ వేయడం గగనమైపోయిన ఈ రోజుల్లో టీ10 ఫార్మాట్లో మెయిడిన్ వేసిన కాట్రెల్ రికార్డు సృష్టించాడు. బ్యాటింగ్ విషయానికొస్తే.. 60 బంతుల మ్యాచ్‌లో ఒకే బ్యాటర్ సగానికి పైగా బంతులు (33) ఎదుర్కోవడం ఆషామాషి విషయం కాదు. ఇది ఓ రికార్డు కూడా. గతంలో ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ ఎదుర్కొన్న 32 బంతులే టీ10 క్రికెట్లో ఈ మ్యాచ్‌కు ముందు వరకు అత్యుత్తమం. తొలి ఓవర్ మెయిడిన్ అయ్యాక, ఇన్నింగ్స్ రెండో ఓవర్లో బరిలోకి దిగిన ఫెరియెరా ఆఖరి బంతి వరకు క్రీజ్‌లో నిలబడి టీ10 ఫార్మాట్లో రెండో అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. గుర్తింపు పొందిన టీ10 క్రికెట్లో క్రిస్ లిన్ (30 బంతుల్లో 91; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) పేరిట ఈ రికార్డు ఉంది. Best knock of #ZimAfroT10 💥 Our ZCC Player of the match is Donnovan Ferreira 🤝#CricketsFastestFormat #T10League #InTheWild #CTSAvHH pic.twitter.com/ypG0GZs4MJ — ZimAfroT10 (@ZimAfroT10) July 25, 2023 టీ10 క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్‌కు సంబంధించి అత్యుత్తమ గణాంకాలు ఒకే మ్యాచ్‌లో, ఒకే ఇన్నింగ్స్‌లో నమోదు కావడం విశేషం. హరారే ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్ ఎదుర్కొన్న ఫెరియెరా.. కరీమ్ జనత్ బౌలింగ్‌లో ఏకంగా 5 సిక్సర్లు బాదాడు. తొలి బంతి డాట్ కాగా.. ఆఖరి 5 బంతులను ఫెన్సింగ్ దాటించాడు ఫెరియెరా. A peak at the how our 5️⃣ teams stand at the close of Day 5️⃣! #ZimAfroT10 #CricketsFastestFormat #T10League #InTheWild pic.twitter.com/ZxldzNX3kE — ZimAfroT10 (@ZimAfroT10) July 25, 2023 అంతకుముందు ఓవర్లోనూ హ్యాట్రిక్ బౌండరీలు బాదిన ఫెరియెరా.. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని, ఆతర్వాత 8 బంతుల్లో 35 పరుగులు పిండుకున్నాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన అతని జట్టు హరారే హరికేన్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది.హరికేన్స్ ఇన్నింగ్స్ ఫెరియెరా ఒక్కడే రాణించాడు. మరో ఆటగాడు జాంగ్వే (10 నాటౌట్) రెండంకెల స్కోర్ చేశాడు. కేప్‌టౌన్ బౌలర్లలో కాట్రెల్ 3, నగరవా 2, హాట్జోగ్లూ ఓ వికెట్ పడగొట్టారు. టైగా ముగిసిన మ్యాచ్.. 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేప్‌టౌన్.. ఓపెనర్ రహ్మానుల్లా గుర్భాజ్ (26 బంతుల్లో 56; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ఫలితంగా మ్యాచ్ టైగా ముగిసింది. అంత చేసి, ఆఖరి ఓవర్లో బొక్కబోర్లా పడిన కేప్‌టౌన్.. 116 పరుగుల లక్ష్య ఛేదనలో 9 ఓవర్లలో 108 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉండిన కేప్‌టౌన్, ఆఖరి ఓవర్లో విజయానికి కావల్సిన 8 పరుగులు చేయలేక డ్రాతో సరిపెట్టుకుంది. తొలి 4 బంతులకు 6 పరుగులు వచ్చినా, చివరి 2 బంతుల్లో 2 పరుగులు చేయలేకపోయింది. టీమిండియా మాజీ బౌలర్ శ్రీశాంత్ వేసిన ఈ ఓవర్లో ఐదో బంతికి విలియమ్స్ రనౌట్ కాగా.. ఆఖరి బంతికి లెగ్ బై రూపంలో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. First over in the tournament ☝️ 8 runs to defend 😬@sreesanth36 rolls the clock back to take the game to the Super over 😵💫 🕰️#ZimAfroT10 #CricketsFastestFormat #T10League #InTheWild #CTSAvHH pic.twitter.com/tMjN1FGdJw — ZimAfroT10 (@ZimAfroT10) July 25, 2023 సూపర్ ఓవర్లో హరికేన్స్ విజయం.. స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా.. ఇక్కడ హరికేన్స్ విజయం సాధించింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేప్‌టౌన్.. వికెట్ కోల్పోయి 7 పరుగులు చేయగా.. హరికేన్స్ 5 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. -
శివాలెత్తిన సికందర్ రజా.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. 5 ఫోర్లు, 6 సిక్సర్లతో..!
జింబాబ్వే టీ10 లీగ్‌లో ఆ దేశ స్టార్ ఆల్‌రౌండర్ సికందర్ రజా చెలరేగిపోయాడు. హరారే హరికేన్స్‌తో నిన్న (జులై 24) జరిగిన మ్యాచ్‌లో శివాలెత్తిపోయిన రజా (బులవాయో బ్రేవ్స్ కెప్టెన్).. లీగ్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (15 బంతుల్లో) కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 21 బంతులను ఎదుర్కొన్న రజా.. 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. రజాకు కోబ్ హెఫ్ట్ (23 బంతుల్లో 41; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తోడవ్వడంతో బులవాయో బ్రేవ్స్ 135 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలుండగానే ఊదేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్.. భారత వెటరన్ రాబిన్ ఉతప్ప (15 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), విండీస్ వీరుడు ఎవిన్ లివిస్ (19 బంతుల్లో 49; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), ఫెరియెరా (21 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), ఇర్ఫాన్ పఠాన్ (9 బంతుల్లో 18 నాటౌట్; 4 ఫోర్లు) చెలరేగిపోవడంతో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 134 పరుగుల భారీ స్కోర్ చేసింది. బ్యాట్‌తో విధ్వంసం సృష్టించిన సికందర్ రజా ఓ వికెట్ పడగొట్టగా.. ప్యాట్రిక్ డూలీ 2, తిస్కిన్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 135 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రేవ్స్.. సికందర్ రజా, కోబ్ హెఫ్ట్, వెబ్‌స్టర్ (12 నాటౌట్; ఫోర్, సిక్స్) విజృంభించడంతో 9.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రేవ్స్ ఇన్నింగ్స్‌లో బెన్ మెక్‌డెర్మాట్ (8) నిరాశపరచగా.. హరికేన్స్ బౌలర్లలో మహ్మద్ నబీ, నండ్రే బర్గర్ తలో వికెట్ పడగొట్టారు. ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు యూనివర్సల్ బాస్‌దే.. టీ10 క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. అబుదాబీ టీ10 లీగ్ 2021 సీజన్లో బాస్ 12 బంతుల్లో 50 కొట్టాడు. అంతకుముందు ఇదే లీగ్ 2018 సీజన్లో ఆఫ్ఘన్ క్రికెటర్ మహ్మద్ షెహజాద్ కూడా 12 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించాడు. -
సరిపోని టిమ్ సీఫర్ట్ మెరుపులు.. ఇర్ఫాన్ పఠాన్ ఊచకోత
జింబాబ్వే వేదికగా జరుగుతున్న జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌లో డర్బన్ ఖలందర్స్‌కు ఆడుతున్న న్యూజిలాండ్ ప్లేయర్ టిమ్ సీఫర్ట్ విధ్వంసం సృష్టించాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 భారీ సిక్సర్ల సాయంతో అజేయమైన 71 పరుగులు చేశాడు. కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సీఫర్ట్‌కు నిక్ వెల్చ్ (9 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) తోడవ్వడంతో డర్బన్ ఖలందర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఖలందర్స్ ఇన్నింగ్స్‌లో హజ్రతుల్లా జజాయ్ (3), ఆండ్రీ ఫ్లెచర్ (2) విఫలం కాగా.. ఆసిఫ్ అలీ (18; 2 సిక్సర్లు) కాసేపు అలరించాడు. హరారే బౌలర్లలో మహ్మద్ నబీ 2 వికెట్లు పడగొట్టగా.. సమిత్ పటేల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. Irfan Pathan rolling back the 🕰️ for some Sunday entertainment! #ZimAfroT10 #CricketsFastestFormat #T10League #DQvHH pic.twitter.com/OV44qCpSeG — ZimAfroT10 (@ZimAfroT10) July 23, 2023 అనంతరం 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరారే హరికేన్స్.. కొండంత లక్ష్యాన్ని చూసి ఏమాత్రం వెరవక ఖలందర్స్‌కు ధీటైన సమాధానం ఇచ్చింది. ఆ జట్టు మరో 2 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ రెగిస్ చకబ్వా (22 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విశ్వరూపం ప్రదర్శించాడు. వీరికి డొనవన్ ఫెరియెరా (16; 2 సిక్సర్లు), మహ్మద్ నబీ (19; 2 ఫోర్లు, సిక్స్) సహకరించారు. హరారే ఇన్నింగ్స్‌లో రాబిన్ ఉతప్ప (1), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (2) విఫలమయ్యారు. ఖలందర్స్ బౌలర్లలో మహ్మద్ అమీర్ 2, బ్రాడ్ ఈవాన్స్, జార్జ్ లిండే, టెండాయ్ చటారా తలో వికెట్ పడగొట్టారు. Seifert Storm in Harare! 🌪️#ZimAfroT10 #CricketsFastestFormat #T10League #DQvHH pic.twitter.com/DvxQ84T4hr — ZimAfroT10 (@ZimAfroT10) July 23, 2023 -
రాణించిన ఉతప్ప.. నిరాశపరిచిన పఠాన్ సోదరులు
జింబాబ్వే వేదికగా జరుగుతున్న జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌లో భారత వెటరన్ ఆటగాళ్లు నామమాత్రపు ప్రదర్శనలకే పరిమితమవుతున్నారు. ఈ లీగ్‌లో మొత్తం ఆరుగురు భారత వెటరన్లు పాల్గొంటుండగా.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేకపోయారు. నిన్న (జులై 22) జరిగిన మ్యాచ్‌ల్లో కేప్‌టౌన్ కెప్టెన్ పార్థివ్ పటేల్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలం కాగా.. హరారే ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ బ్యాటింగ్ (4), బౌలింగ్ (1-0-21-0) విభాగాల్లో దారుణంగా నిరాశపరిచాడు. భారత ఆటగాళ్లలో హరారే ఆటగాడు రాబిన్ ఉతప్ప (31) ఒక్కడే పర్వాలేదనిపించాడు. కేప్ హరారే హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టౌన్ సాంప్ ఆర్మీ.. రహ్మానుల్లా గుర్భాజ్ (25) ఓ మోస్తరు స్కోర్ చేయడంతో నిర్ణీత 10 ఓవర్లలో 112/7 స్కోర్ చేయగా.. హరారే హరికేన్స్ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 97/6 స్కోర్ చేసి 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డర్బన్ ఖలందర్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో జోబర్గ్ బఫెలోస్ ఆటగాడు, భారత మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ సైతం తేలిపోయాడు. అతను 8 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ బఫెలోస్.. టామ్ బాంటన్ (55 నాటౌట్) చెలరేగడంతో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేయగా.. డర్బన్ ఖలందర్స్మరో 5 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. హజ్రతుల్లా జజాయ్ (41 నాటౌట్) డర్బన్ను గెలిపించాడు. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ.. బులవాయో బ్రేవ్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్స్.. బెన్ మెక్‌డెర్మాట్ (27) రాణించడంతో 10 ఓవర్లలో 86 పరుగులు చేయగా.. 21 బంతుల్లో 43 పరుగులు చేసిన మరుమాని సాంప్ ఆర్మీని గెలిపించాడు. కాగా, జింబాబ్వే-ఆఫ్రో టీ10 లీగ్‌లో భారత ఆటగాళ్లు పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ (కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ), రాబిన్ ఉతప్ప, ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్ (హరారే హరికేన్స్), యూసఫ్ పఠాన్ (జోబర్గ్ బఫెలోస్) పాల్గొంటున్న విషయం తెలిసిందే. -
చరిత్ర సృష్టించిన పాక్ బౌలర్.. పొట్టి క్రికెట్లో అత్యుత్తమ గణాంకాలు
పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ టీ10 క్రికెట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ పాక్ మాజీ పొట్టి ఫార్మాట్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. జింబాబ్వే ఆఫ్రో టీ10 లీగ్‌లో భాగంగా బులవాయో బ్రేవ్స్‌తో నిన్న (జులై 21) జరిగిన మ్యాచ్‌లో 2 ఓవర్లు బౌల్ చేసిన హఫీజ్ (జోబర్గ్ బఫెలోస్).. కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ట్రిపుల్ వికెట్ మొయిడిన్ ఓవర్ ఉంది. హఫీజ్ వేసిన 12 బంతుల్లో కేవలం ఒకే ఒక బౌండరీ ఇచ్చి 11 డాట్ బాల్స్ వేశాడు. గుర్తింపు పొందిన టీ10 క్రికెట్లో హాఫీజ్‌వే అత్యుత్తమ గణాంకాలు. అంతర్జాతీయ క్రికెట్లో దాదాపు 400 మ్యాచ్‌లు ఆడిన హఫీజ్ 250కిపైగా వికెట్లు తీసినప్పటికీ, ఒక్కసారి కూడా 5 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టలేకపోయాడు. టెస్ట్‌ల్లో 4/16, వన్డేల్లో 4/41, టీ20ల్లో 4/10 హఫీజ్ అత్యుత్తమ గణాంకాలు. Pakistan Chief Selector Got Six Wickets for four runs in his two overs T10 Match. Professor Mohammad Hafeez at his Best🔥♥️.#MohammadHafeez #ZimAfroT10 pic.twitter.com/bOzfgQyguE — Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) July 21, 2023 ఇదిలా ఉంటే, బులవాయో బ్రేవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ బఫెలోస్ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీం (23 బంతుల్లో 46 నాటౌట్; 8 ఫోర్లు) చెలరేగగా.. ఓపెనర్ టామ్ బాంటన్ (18 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. బ్రేవ్స్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫరాజ్, వెబ్‌స్టర్, సికందర్ రజా తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన బ్రేవ్స్.. మహ్మద్ హఫీజ్ (2-1-4-6) ధాటికి 10 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. హఫీజ్ బ్రేవ్స్ పతనాన్ని శాశిస్తే.. వెల్లింగ్టన్ మసకద్జ (2-0-11-3) మరో ఎండ్ నుంచి అతనికి సహకరించాడు. బ్రేవ్స్ ఇన్నింగ్స్‌లో వెబ్‌స్టర్ (22 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలువగా.. బెన్ మెక్‌డెర్మాట్ (13), ర్యాన్ బర్ల్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బ్రేవ్స్ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. వారిలో ముగ్గురు గోల్డన్ డకౌట్లు కావడం విశేషం. -
జింబాబ్వే టీ10 లీగ్ షెడ్యూల్ విడుదల.. బరిలో ఆరుగురు టీమిండియా ప్లేయర్స్
జింబాబ్వే క్రికెట్ మరియు టీ టెన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జింబాబ్వే ఆఫ్రో టీ10 లీగ్ తొలి సీజన్ షెడ్యూల్ విడుదలైంది. జులై 20 నుంచి ప్రారంభంకాబోయే ఈ లీగ్‌లో 5 ప్రాంచైజీలు (బులవాయో బ్రేవ్స్, కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ, డర్బన్ ఖలందర్స్, హరారే హరికేన్స్, జోహనెస్బర్గ్ బఫెలోస్) 24 మ్యాచ్‌ల్లో తలపడతాయి. లీగ్‌లో జరుగబోయే మ్యాచ్‌లన్నిటికీ జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక కానుంది. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం 11:30 గంటలకు, 1:30 గంటలకు.. సాయంత్రం జరిగే మ్యాచ్‌లు 3:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఐపీఎల్ తరహాలోనే ఈ లీగ్‌లో రౌండ్ రాబిన్ మ్యాచ్‌లు (20), రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్ మ్యాచ్, తదనంతరం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. జులై 20: హరారే హరికేన్స్ వర్సెస్ బులవాయో బ్రేవ్స్ (3:30) జులై 21: కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ వర్సెస్ డర్బన్ ఖలందర్స్ (11:30) జులై 21: జోబర్గ్ బఫెలోస్ వర్సెస్ బులవాయో బ్రేవ్స్ (1:30) జులై 21: హరారే హరికేన్స్ వర్సెస్ కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ (3:30) జులై 22: డర్బన్ ఖలందర్స్ వర్సెస్ జోబర్గ్ బఫెలోస్ (11:30) జులై 22: కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ వర్సెస్ బులవాయో బ్రేవ్స్ (1:30) జులై 22: జోబర్గ్ బఫెలోస్ వర్సెస్ హరారే హరికేన్స్ (3:30) జులై 23: డర్బన్ ఖలందర్స్ వర్సెస్ బులవాయో బ్రేవ్స్ (11:30) జులై 23: జోబర్గ్ బఫెలోస్ వర్సెస్ కేప్‌టౌన్ కాంప్ ఆర్మీ (1:30) జులై 23: హరారే హరికేన్స్ వర్సెస్ డర్బన్ ఖలందర్స్ (3:30) జులై 24: బులవాయో బ్రేవ్స్ వర్సెస్ కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ (1:30) జులై 24: డర్బన్ ఖలందర్స్ వర్సెస్ జోబర్గ్ బఫెలోస్ (3:30) జులై 25: కేప్‌టౌన్ వర్సెస్ హరారే హరికేన్స్ (11:30) జులై 25: బులవాయో వర్సెస్ డర్బన్ (1:30) జులై 25: హరారే వర్సెస్ జోబర్గ్ (3:30) జులై 26: బులవాయో వర్సెస్ హరారే (11:30) జులై 26: డర్బన్ వర్సెస్ కేప్‌టౌన్ (1:30) జులై 26: బులవాయో వర్సెస్ జోబర్గ్ (3:30) జులై 27: డర్బన్ వర్సెస్ హరారే (11:30) జులై 27: కేప్‌టౌన్ వర్సెస్ జోబర్గ్ (3:30) జులై 28: క్వాలిఫయర్ 1 (11:30) జులై 28: ఎలిమినేటర్ (1:30) జులై 28: క్వాలిఫయర్ 2 (3:30) జులై 29: ఫైనల్ (1:30) లీగ్‌లో ఆడబోయే భారత ఆటగాళ్లు.. స్టువర్ట్ బిన్నీ పార్థివ్ పటేల్ రాబిన్ ఉతప్ప శ్రీశాంత్ ఇర్ఫాన్ పఠాన్ యూసఫ్ పఠాన్ Squad Check 🗒️ A look at all the rosters after the #ZimAfroT10Draft! 🔥 Which team do you reckon are the early favorites for the inaugural #ZimAfroT10? 🏆#T10League #CricketsFastestFormat pic.twitter.com/JXMx5xnNBU — T10 League (@T10League) July 3, 2023 -
బ్యాట్ పట్టనున్న టీమిండియా మాజీ స్టార్స్.. ఫ్యాన్స్‌కు పండగే
టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్ సహా మరికొంత మంది స్టార్స్ మళ్లీ బ్యాట్ పట్టనున్నారు. యూఎస్ మాస్టర్స్ టి10 లీగ్‌లో ఆడనున్నారు. ఈ లీగ్‌లో భారత్‌తో పాటు మరిన్ని దేశాల మాజీ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. ఆగస్టు 18వ తేదీ నుంచి ఆగస్టు 27వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు తలపడనున్నాయి. అట్లాంటా ఫైర్, కాలిఫోర్నియా నైట్స్, మారిస్విల్లే యూనిటీ, న్యూజెర్సీ లెజెండ్స్, న్యూయార్క్ వారియర్స్, టెక్సాస్ చార్జర్స్ ఉన్నాయి. కాగా నార్త్ కాలిఫోర్నియాలో తాజాగా ఈ టోర్నీ ప్లేయర్స్ డ్రాఫ్ట్ వెల్లడైంది. న్యూజెర్సీ లెజెండ్స్: న్యూజెర్సీ లెజెండ్స్ టీమ్‌లో భారత మాజీ స్టార్లు గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, యుసూఫ్ పఠాన్ ఉన్నారు. వీరితో పాటు స్టువర్ట్ బిన్నీ, ఆర్పీ సింగ్, బిపుల్ శర్మ, లియామ్ ప్లంకెట్, అల్బీ మార్కెల్, నమన్ ఓజా, జెర్రీ రైడర్, క్రిస్ బ్రాన్వెల్, క్రెగ్ మెక్మిలాన్, టిమ్ ఆంబ్రోస్, అభిమన్యు మిథున్, మోంటీ పనేసర్ ఈ జట్టులో ఆడనున్నారు. కాలిఫోర్నియా నైట్స్: కాలిఫోర్నియా నైట్స్ జట్టు తరఫున టీమిండియా మాజీ ఆటగాళ్లు సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, మహమ్మద్ కైఫ్ ఆడనున్నారు. ఆరోన్ ఫించ్, పీటర్ సిడిల్, జాక్వెస్ కలీస్ సహా మరికొందరు ఈ జట్టులో ఉన్నారు. అంట్లాట ఫైర్: అంట్లాట ఫైర్ జట్టులో రాబిన్ ఊతప్ప ఉన్నాడు. ఆసీస్ మాజీ స్టార్ డేవిడ్ హస్సీ కూడా ఈ జట్టు తరఫున ఆడనున్నాడు. శ్రీశాంత్, లెండిల్ సిమండ్స్, డ్వేన్ స్మిత్ సహా మరికొందరు స్టార్ల్ ఉన్నారు. మోరిస్విల్లే యునిటీ: యూనివర్స్ బాస్ క్రిస్ గేల్, భారత మాజీ దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్‌లో మోరిస్విల్లే యునిటీ టీమ్ తరఫున బరిలోకి దిగనున్నారు. పార్థివ్ పటేల్, కెవిన్ ఓబ్రెయిన్, కోరీ ఆండర్సన్, రాహుల్ శర్మ, కెల్విన్ సావేజ్.. మరికొంత మంది ప్లేయర్లు ఈ జట్టులో ఆడనున్నారు. న్యూయార్క్ వారియర్స్: న్యూయార్క్ వారియర్స్ టీమ్‌లో భారత మాజీలు మురళీ విజయ్, మునాఫ్ పటేల్ ఉన్నారు. పాకిస్థాన్ మాజీలు షాహిద్ ఆఫ్రిదీ, మిస్బా ఉల్ హక్, కమ్రాన్ అక్మల్ ఈ జట్టులోనే ఆడనున్నారు. జోహాన్ బోతా, టీఎం దిల్షాన్ సహా మరికొందరు ఉన్నారు. టెక్సాస్ చార్జర్: టెక్సాస్ చార్జర్ టీమ్‌లో ప్రజ్ఞాన్ ఓజా, ప్రవీణ్ కుమార్ ఉన్నారు. బెన్ డక్, హమ్మద్ హఫీజ్, రాస్ టేలర్, ఇసురు ఉదానా, తిషారా పెరీరా, నీల్ బ్రూమ్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, ఉపుల్ తరంగ, జీవన్ మెండిస్ సహా మరికొందరు ప్లేయర్లు ఈ జట్టు తరఫున యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్‌లో బరిలోకి దిగనున్నారు. చదవండి: Kohli-Ishan Kishan Viral Video: కోహ్లిని టీజ్ చేసిన ఇషాన్ కిషన్.. వీడియో వైరల్ R Ashwin Record In Test Cricket: తండ్రీ కొడుకులిద్దరిని ఔట్ చేసిన తొలి భారత బౌలర్‌గా -
టీ10 లీగ్‌లో ఆడనున్న రాబిన్ ఊతప్ప, ఇర్ఫాన్ పఠాన్
జింబాబ్వే క్రికెట్ తొలిసారిగా "జిమ్ ఆఫ్రో టీ10" పేరుతో ఓ ప్రాంఛైజీ లీగ్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ జూలై 20న ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు భాగం కానున్నాయి. డర్బన్ క్వాలండర్స్, కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ, బులవాయో బ్రేవ్స్, జోబర్గ్ లయన్స్, హరారే హరికేన్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. తాజాగా ఆయా ఫ్రాంచైజీలు తమ జట్లను ఖారారు చేశాయి. కాగా ఈ టీ10 లీగ్‌లో రాబిన్ ఊతప్ప, పార్ధివ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్, యూసప్ ఫఠాన్, రాహుల్ చోప్రా, స్టువర్ట్ బిన్నీ, శ్రీశాంత్ వంటి భారత మాజీ క్రికెటర్లు ఆడనున్నారు. రాబిన్ ఊతప్ప, ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్ హరారే హరికేన్స్‌కు ప్రాతినిధ్యం వహించనుండగా.. పార్ధివ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ కేప్‌టౌన్ సాంప్ ఆర్మీకి, రాహుల్ శర్మ, యూసప్ ఫఠాన్ జోహన్నెస్‌బర్గ్ బఫెలోస్ తరపున ఆడనున్నారు. అదే విధంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహ్మద్ హాఫీజ్ కూడా ఈ లీగ్‌లో భాగం కానున్నారు. డర్బన్ క్వాలండర్స్: ఆసిఫ్ అలీ, మహ్మద్ అమీర్, జార్జ్ లిండే, హజ్రతుల్లా జజాయ్, టిమ్ సిఫెర్ట్, సిసంద మగాలా, హిల్టన్ కార్ట్‌రైట్, మీర్జా తాహిర్ బేగ్, తయాబ్ అబ్బాస్, క్రెయిగ్ ఎర్విన్, టెండై చతారా, బ్రాడ్ ఎవాన్స్, క్లైవ్ మదాండే, నిక్ వెల్చ్, ఆండ్రీ ఫ్లెచర్ హరారే హరికేన్స్: మహ్మద్ నబీ, ఎవిన్ లూయిస్, రాబిన్ ఉతప్ప, డోనోవాన్ ఫెరైరా, షాజావాజ్ దహానీ, డువాన్ జాన్సెన్, సమిత్ పటేల్, కెవిన్ కొత్తెగోడ, క్రిస్టోఫర్ మ్ఫోఫు, రెగిస్ చకబ్వా, ల్యూక్ జోన్‌వే, బ్రాండన్ మవుతా, తషింగా ముషివా, ఇర్ఫాన్ పఠాన్, యూసప్ ఫఠాన్,శ్రీశాంత్ జోహన్నెస్‌బర్గ్ బఫెలోస్: ముష్ఫికర్ రహీమ్, ఓడియన్ స్మిత్, టామ్ బాంటన్, యూసుఫ్ పఠాన్, విల్ స్మీద్, నూర్ అహ్మద్, రవి బొపారా, ఉస్మాన్ షిన్వారీ, జూనియర్ డలా, బ్లెస్సింగ్ ముజారబానీ, వెల్లింగ్టన్ మసకద్జా, వెస్లీ మాధేవెరే, విక్టర్ న్యౌచి, మిల్టన్ శుంబా, మొహమ్మద్ హఫీజ్, రాహుల్ చోప్రా. బులవాయో బ్రేవ్స్: సికిందర్ రజా, తస్కిన్ అహ్మద్, ఆష్టన్ టర్నర్, టైమల్ మిల్స్, తిసారా పెరెరా, బెన్ మెక్‌డెర్మాట్, బ్యూ వెబ్‌స్టర్, పాట్రిక్ డూలీ, కోబ్ హెర్ఫ్, రేయన్ బర్ల్, టిమిసెన్ మరుమా, జాయ్‌లార్డ్ గుంబీ, ఇన్నోసెంట్ కైయా, ఫరాజ్ అక్రమ్ , ముజీబ్ ఉర్ రెహ్మాన్. కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ: రహ్మానుల్లా గుర్బాజ్, షాన్ విలియమ్స్, భానుక రాజపక్స, మహేశ్ తీక్షణ, షెల్డన్ కాట్రెల్, కరీం జనత్, చమికా కరుణరత్నే, పీటర్ హజ్లోగౌ, మాథ్యూ బ్రీట్జ్కే, రిచర్డ్‌వాకా న్గరావా, రిచర్డ్‌వాకా న్గరావా, తద్శ్వాని మారుమణి, తినాషే కమునకేవే, పార్థివ్ పటేల్, మొహమ్మద్ ఇర్ఫాన్, స్టువర్ట్ బిన్నీ చదవండి: Ashes 2023: బెయిర్‌స్టో స్టంపౌట్ ఉదంతం.. ప్రధాని సైతం స్పందించారు..! -
క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సంజయ్ దత్..
ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆదరణ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీ20, టీ10 లీగ్‌లు పట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. తాజాగా జింబాబ్వే కూడా ఓ టీ10 లీగ్‌ను నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ లీగ్‌కు జింబాబ్వే క్రికెట్ 'జిమ్ ఆఫ్రో టీ10' అని నామకారణం చేసింది. జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ జూలై 20న ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు భాగం కానున్నాయి. డర్బన్ క్వాలండర్స్, కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ, బులవాయో బ్రేవ్స్, జోబర్గ్ లయన్స్, హరారే హరికేన్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. సంజయ్ దత్ న్యూ జర్నీ.. ఇక ఇందులో హరారే హరికేన్స్ ఫ్రాంచైజీని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కొనుగోలు చేశాడు. ఏరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ సర్ సోహన్ రాయ్‌తో కలిసి హరారే ఫ్రాంచైజీని సంజయ్ దత్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ విషయాన్ని సంజయ్ దత్ కూడా దృవీకరించాడు. "భారత్‌లో క్రికెట్ ఒక మతం వంటింది. అదే విధంగా ప్రపంచక్రికెట్లో భారత్ ఒక ప్రత్యేక గుర్తుంపు ఉంది. ప్రపంచంలో ప్రతీ చోట క్రికెట్‌కు మరింత ఆదరణ పెరగాలని నేను ఎప్పుడూ ఆశిస్తాను. జింబాబ్వే కూడా గొప్ప క్రీడా చరిత్రను కలిగిఉంది. అటువంటి జింబాబ్వే క్రికెట్లో నేను భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. జిమ్ ఆఫ్రో టీ10లో హరారే హరికేన్స్ బాగా రాణిస్తుందని నేను అనుకుంటున్నాను" అని సంజయ్ దత్ పేర్కొన్నాడు. చదవండి: IND Vs WI 2023: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులోకి ఎవరూ ఊహించని ఆటగాడు! -
పాపం తగలరాని చోట తగిలి..
క్రికెట్లో అప్పుడప్పుడు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తే.. మరికొన్నిసార్లు అయ్యో పాపం అనుకుంటాం. తాజాగా ఒక బ్యాటర్ పరుగు తీస్తున్న క్రమంలో ఫీల్డర్ వేసిన బంతి తగలరాని చోట తగిలి నానా ఇబ్బంది పడ్డాడు. ఈ ఘటన యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. బ్రదర్స్ ఎలెవెన్, ఇండియన్ రాయల్స్ మధ్య 10 ఓవర్ల మ్యాచ్ జరిగింది. ఇండియన్ రాయల్స్ ఇన్నింగ్స్ సమయంలో క్రీజులో ఉన్న బ్యాటర్ మిడాన్ దిశగా ఆడాడు. సింగిల్ పూర్తి చేశారు.. అయితే ఫీల్డర్ మిస్ ఫీల్డ్ చేయడంతో రెండో పరుగు కోసం పరిగెత్తారు. ఈ క్రమంలో బంతిని అందుకున్న ఫీల్డర్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరిగెత్తిన బ్యాటర్ వైపు విసిరాడు. అయితే ఎవరు ఊహించని రీతిలో బంతి వచ్చి పొట్ట కింద భాగంలో తగిలింది. దెబ్బ గట్టిగానే తగిలిందనుకుంటా పాపం నొప్పితో కాసేపు విలవిల్లాడాడు. గార్డ్ వేసుకోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన బ్రదర్స్ ఎలెవెన్ నిర్ణీత 10 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. బల్వీందర్ సింగ్ 29 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియన్ రాయల్ ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం కలిగించింది. అయితే వర్షం పడే సమయానికి ఇండియన్ రాయల్స్ మూడు వికెట్ల నష్టానికి 70 పరుగులతో ఆడుతుంది. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఇరుజట్ల స్కోర్లు సమానంగా ఉండడంతో గోల్డెన్ బాల్‌కు అవకాశం ఇచ్చారు. గోల్డెన్ బాల్లో బ్రదర్స్ ఎలెవెన్ జట్టు విజయం సాధించింది. Timeline cleanser. Sound on for maximum dopamine injection. pic.twitter.com/Vk0bw7B71U — Georgie Parker (@georgieparker) March 23, 2023 చదవండి: ఇంగ్లండ్ బౌలర్ చరిత్ర.. డబ్ల్యూపీఎల్‌లో తొలి హ్యాట్రిక్ ఇంగ్లండ్ సంచలనం.. 62 ఏళ్ల తర్వాత గెలుపు -
దగ్గర్నుంచి కొట్టడంలోనూ ఇంత బద్దకమా!
యూరోపియన్ క్రికెట్ అంటేనే ఫన్నీకి పెట్టింది పేరు. అక్కడ ఆడే పిచ్‌లు చాలా చిన్నగా ఉంటాయి. క్లబ్ క్రికెట్‌కు మారుపేరుగా నిలిచే యూరోపియన్ లీగ్‌లో కొన్ని సంఘటనలు నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. తాజాగా బౌలర్.. రనౌట్ చాన్స్‌ను మిస్ చేసిన తీరు నవ్వులు పూయిస్తుంది. చేతికి వచ్చిన బంతితో నేరుగా వికెట్లను కొట్టడంలో బౌలర్ విఫలం కావడం బ్యాటర్‌కు కలిసివచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. యూరోపియన్ క్రికెట్ సిరీస్ టి10 మాల్టా లీగ్‌లో బుగిబ్బా బ్లాస్టర్స్, స్వీకీ యునైటెడ్ మధ్య మ్యాచ్ జరిగింది. బ్లాస్టర్స్ బ్యాటింగ్ సమయంలో విబోర్ యాదవ్ వేసిన బంతిని బ్యాటర్ వదిలేశాడు. దీంతో బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అప్పటికే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ పరిగెత్తే ప్రయత్నం చేశాడు. ఇంతలో కీపర్ బంతిని విబోర్కు విసిరాడు. బంతిని సక్రమంగానే అందుకున్న అతను వికెట్లకు గిరాటేయడంలో మాత్రం విఫలమయ్యాడు. ఏదో దూరం నుంచి మిస్ అయిదంటే పర్వాలేదు.. కానీ ఒక అడుగు దూరం నుంచి కూడా రనౌట్ చేయలేకపోవడం విడ్డూరంగా అనిపించింది. Power ✅ Accuracy ❌ Missed from point-blank range😱 #EuropeanCricket #EuropeanCricketSeries #StrongerTogether #CricketinMalta pic.twitter.com/xTORBNPQx6 — European Cricket (@EuropeanCricket) February 6, 2023 చదవండి: ఫిక్సింగ్ బారిన క్రికెటర్.. రెండేళ్ల నిషేధం -
52 ఏళ్ల వయసులోనూ ఇంజీ పవర్ఫుల్ సిక్సర్.. ఆశ్చర్యపోయిన ఆఫ్రిది!
Inzamam Ul Haq- Shahid Afridi: విజయవంతమైన కెప్టెన్‌గా పేరొందిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికి 15 ఏళ్లకు పైనే అవుతోంది. జింబాబ్వేతో 2007లో జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా పాక్ తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు ఇంజీ! అయితే, యూట్యూబ్ చానెల్ వేదికగా అభిమానులను అలరిస్తున్న ఈ మాజీ సారథి... తాజాగా.. తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించాడు. అదిరిపోయే షాట్ పాకిస్తాన్లో మెగా స్టార్స్ లీగ్ పేరిట ఆరు జట్ల మధ్య టీ10 లీగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా కరాచీ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన ఇంజమామ్.. 16 బంతుల్లో 29 పరుగులు చేశాడు. అయితే, క్రీజులో ఉన్నంత సేపు బంతిని బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు ఇంజీ. ఈ క్రమంలో అతడు కొట్టిన పవర్ఫుల్ సిక్సర్ హైలైట్‌గా నిలిచింది. 52 ఏళ్ల వయసులోనూ పవర్‌హిట్టింగ్ చేసిన ఇంజీని అలా చూస్తూ ఉండిపోయారు అభిమానులు. డగౌట్లో కూర్చున్న మరో మాజీ సారథి షాహిద్ ఆఫ్రిది సైతం ఇంజీ భాయ్ షాట్‌కు ఆశ్చర్యపోయాడు. సోమవారం నాటి మ్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పరుగుల వరద కాగా పాకిస్తాన్ తరఫున ఇంజమామ్ వన్డేల్లో మొత్తంగా 11,701 పరుగులు సాధించాడు. పాక్ తరఫున వన్డేల్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన ఎనిమిదో బ్యాటర్‌గా నిలిచాడు. తన కెరీర్లో మొత్తంగా 120 టెస్టులు, 378 వన్డేలు ఆడాడు. 81 వన్డే మ్యాచ్‌లకు సారథ్యం వహించి 51 గెలిచాడు. చదవండి: Ajinkya Rahane: డబుల్ సెంచరీతో చెలరేగిన రహానే.. రెండో ద్విశతకం! టీమిండియాలో చోటు ఖాయమంటూ.. Babar Azam: ఒక్క మాటతో రమీజ్ రాజా నోరు మూయించిన బాబర్! అది సాధ్యం కాదు.. ప్రతి వాడూ.. Inzi Bhai scores 29 of just 16 and becomes the cricketainer of the day.#KingdomValleyMSL2022 #MSL #KingdomValleyMSL#MegaStarsLeague #Cricketainment #KingdomValley#CricketLeague #Cricket #ShahidAfridi #mediasniffers#Pakola #Daikin #Pindi #islamabad #InzimamUlHaq pic.twitter.com/EdkQVg6GmL — Mega Stars League (@megastarsleague) December 19, 2022 -
ఎలిమినేటర్ మ్యాచ్.. గల్లీ క్రికెట్‌లా ఈ ఆటలేంటి!
మనం చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ముందు బ్యాటింగ్ ఎవరు రావాలనే దానిపై వివిధ పద్దతులు ఆచరించేవాళ్లం. ఒక పిల్లాడు వంగితే.. వాడి వీపుపై చేతులతో సంఖ్యలను చెబుతూ ఏ స్థానంలో ఎవరు ఆడాలనేది నిర్ణయించేవారు. మరికొంతమంది పచ్చాలు వేసేవారు. ఇదంతా గల్లీ క్రికెట్ కాబట్టి మస్తు ఎంజాయ్‌గా అనిపించేది. కానీ ఇదే తీరు ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో జరిగితే ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా అబుదాబి టి10 లీగ్‌లో భాగంగా టీమ్ అబుదాబి జట్టు ఓపెనర్లు అలెక్స్ హేల్స్, క్రిస్ లిన్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఇద్దరిలో ఎవరు స్ట్రైక్ తీసుకోవాలనిదానిపై చిన్న గేమ్ ఆడారు. ఆ గేమ్ పేరు రాక్-పేపర్-సిసర్స్. ఈ గేమ్‌లో గెలిచిన హేల్స్ స్ట్రైక్ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు అభిమానులు.. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గల్లీ క్రికెట్‌లా ఆటలేంటి అంటూ ఫన్నీ కామెంట్స్ చేవారు. ఆ తర్వాత ఒక్క పరుగు మాత్రమే చేసిన హేల్స్ సుల్తాన్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డెక్కన్ గ్లాడియేటర్స్ టీమ్ అబుదాబిని 5 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన డెక్కన్ గ్లాడియేటర్స్ 10 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. ఓడియన్ స్మిత్ 32 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమ్ అబుదాబి 10 ఓవర్లలో వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. జేమ్స్ విన్స్ 21 పరుగులు చేశాడు. క్వాలిఫయర్-2లో మోరిస్విల్లే సాంప్ ఆర్మీతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచిన డెక్కన్ గ్లాడియేటర్స్ ఫైనల్‌కు చేరుకుంది. ఇక డిసెంబర్ 4న(ఆదివారం) న్యూయార్క్ స్ట్రైకర్స్‌తో ఫైనల్లో అమితుమీ తేల్చుకోనుంది. pic.twitter.com/HC34HqTkbQ — Hassam (@Nasha_e_cricket) December 3, 2022 చదవండి: దిగ్గజం పీలే పరిస్థితి అత్యంత విషమం.. -
కిందా మీదా పడి చివరకు ఎలాగోలా!
క్రికెట్లో ఫన్నీ ఘటనలు జరగడం సహజం. కొన్నిసార్లు మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. తాజాగా యురోపియన్ క్రికెట్లో భాగంగా బ్యాటర్ పరుగు తీసిన విధానం సోషల్ మీడియాలో నవ్వులు పూయించింది. మ్యాచ్‌లో భాగంగా స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ ఆఫ్‌సైడ్ అవతల వెళ్తున్న బంతిని మిడాన్ దిశగా ఆడాడు. సింగిల్ వచ్చే అవకాశం ఉండడంతో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌కు పిలుపునిచ్చాడు. అయితే సింగిల్‌ను తొందరగా పూర్తి చేసే క్రమంలో పిచ్ మధ్యలో జారిపడ్డాడు. ఇక రనౌట్ తప్పదనుకున్న తరుణంలో ఫీల్డర్ వేసిన బంతిని బౌలర్ సకాలంలో అందుకోవడంలో విఫలమయ్యాడు. పిచ్ మధ్యలో పడిపోయిన ఏ బ్యాటర్ అయినా లేచి పరిగెత్తడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం పిచ్‌పై దొర్లుకుంటూ మొత్తానికి కిందా మీదా పడి ఎలాగోలా సింగిల్‌ను పూర్తి చేశాడు. కనీసం లేచి పరిగెత్తే టైం లేకపోవడంతోనే ఇలా చేసినట్లు సదరు బ్యాటర్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా వెలుగు చూసినా ప్రస్తుతం సోషల్ మీడియలో మాత్రం ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే అతని కష్టం గుర్తించిన ప్రత్యర్థి ప్లేయర్లు కూడా చప్పట్లతో సదరు బ్యాటర్‌ను అభినందించడం విశేషం. వీలైతే మీరు వీడియోపై ఒక లుక్కేయండి. It's almost like a dream when you're trying to run but you just can't😄 @HCLSoftware#HCLSoftwareVIPExperience pic.twitter.com/RdWgAlwFjX — European Cricket (@EuropeanCricket) October 18, 2022 -
క్రికెట్లో అరుదైన ఘటన.. నోరెళ్లబెట్టడం ఖాయం!
క్రికెట్లో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. మాములుగా స్లిప్‌లో ఇద్దరు లేదా ముగ్గురు.. మహా అయితే నలుగురు ఫీల్డర్లు ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మ్యాచ్‌లో మాత్రం తొమ్మిది మంది స్లిప్ ఫీల్డర్లు కనిపిస్తారు. మాములుగా క్రికెట్ మ్యాచ్‌లో ఒక జట్టులో ఉండేదే 11 మంది ఆటగాళ్లు. కీపర్, బౌలర్‌ను వదిలేస్తే మిగతా తొమ్మిది మంది స్లిప్‌లోనే ఉండడం ఆశ్చర్యంగా అనిపించింది. అందుకే దీనికి సంబంధించిన ఫోటో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ అరుదైన ఘటన యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో జరిగింది. రొమేనియా, నార్వే జట్ల మధ్య టి10 మ్యాచ్ జరిగింది.రొమేనియా ఇన్నింగ్స్ సమయంలో నార్వే స్లిప్‌లో తొమ్మిది మంది ఫీల్డర్లను మోహరించింది. మరి ఇంత మంది ఫీల్డర్లను చూసి కన్ఫ్యూజ్ అయిన సదరు బ్యాటర్ పరుగులు సాధించాడా లేదా అనే అనుమానం వస్తుంది. కానీ ఆ బ్యాటర్ తెలివిగా వాళ్ల మధ్యలో నుంచి షాట్ ఆడి రెండు పరుగులు తీయడం విశేషం. మ్యాచ్ గెలుస్తామన్న ధీమా వచ్చిన తర్వాతే స్లిప్‌లో తొమ్మిది మంది ఫీల్డర్లను ఉంచినట్లు నార్వే కెప్టెన్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు.. ''వార్నీ స్లిప్‌లోనే జట్టు మొత్తం కనిపిస్తుంది.. ఇదేం ఫీల్డింగ్'' అంటూ నోరెళ్లబెట్టారు. మ్యాచ్ విషయానికి వస్తే.. నార్వే జట్టు 43 పరుగులతో ఘన విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన నార్వే 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన రొమేనియా నిర్ణీత 10 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 54 పరుగులు మాత్రమే చేయగలిగింది. View this post on Instagram A post shared by Fox Cricket (@foxcricket) చదవండి: సూర్యకుమార్ ‘ప్రాక్టీస్’ -
క్యాచ్ పట్టగానే చిన్న పిల్లాడిలా మారిపోయిన మాజీ క్రికెటర్
ఇంగ్లండ్ మాజీ స్టార్ స్పిన్నర్ గ్రేమీ స్వాన్ టి10 యూరోపియన్ లీగ్‌లో స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఆటగాడిగా అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే స్వాన్ ఆ క్యాచ్ అందుకుంది ఒక ప్రేక్షకుడిగా. విషయంలోకి వెళితే.. టి10 యూరోపియన్ క్రికెట్లో భాగంగా ఇటలీ, స్విట్జర్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇటలీ ఇన్నింగ్స్ సమయంలో ఆ జట్టు బ్యాటర్ భారీ సిక్సర్ బాదాడు. స్టాండ్స్‌లో ఉన్న గ్రేమీ స్వాన్ డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. ఆ తర్వాత తాను పట్టుకున్న బంతితో స్టాండ్స్ మొత్తం కలియ తిరుగుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గ్రేమీ స్వాన్ ఇంగ్లండ్ తరపున మంచి స్పిన్నర్‌గా పేరు పొందాడు. ఇంగ్లీష్ జట్టు తరపున స్వాన్ 60 టెస్టుల్లో 255 వికెట్లు, 70 వన్డేల్లో 104 వికెట్లు, 39 టి20ల్లో 51 వికెట్లు తీశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇటలీ చేతిలో స్విట్జర్లాండ్ జట్టు 66 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇటలీ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 168 పరుగులు భారీ స్కోరు చేసింది. అమిర్ షరీఫ్ 24 బంతుల్లో 64 నాటౌట్, రాజ్మణి సింగ్ 18 బంతుల్లో 51, బల్జీత్ సింగ్ 17 బంతుల్లో 50 పరుగులతో రాణించారు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్విట్జర్లాండ్ 10 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 102 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలయ్యింది. And @Swannyg66 grabs another one! Absolute scenes in Cartama😄 #EuropeanCricketChampionship #ECC22 #CricketinSpain pic.twitter.com/edTwcCrKPQ — European Cricket (@EuropeanCricket) October 6, 2022 చదవండి: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు భజ్జీ వార్నింగ్.. '110 శాతం ఫిట్‌గా ఉన్నా.. టీమిండియాతో పోరుకు సిద్ధం' -
హతవిధి.. నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని స్థితిలో!
క్రికెట్లో కొన్నిసార్లు మనం ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు అవి నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని సార్లు చిరాకు కలిగిస్తాయి. తాజాగా అలాంటి ఘటనే యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో చోటుచేసుకుంది. కీపర్ బంతిని సక్రమంగా అందుకున్న తర్వాత కూడా ప్రత్యర్థి బ్యాటర్లు మూడు పరుగులు రాబట్టడం ఆసక్తి రేకెత్తింది. విషయంలోకి వెళితే..టి10 లీగ్‌లో భాగంగా ప్రేగ్ బార్బేరియన్, వినోహ్రడీ మధ్య మ్యాచ్ జరిగింది. వర్షం అంతరాయం కలిగించడంతో 10 ఓవర్ల మ్యాచ్ కాస్త ఐదు ఓవర్లకు కుదించారు. తొలుత ప్రేగ్ బార్బేరియన్స్ బ్యాటింగ్ చేసింది. ఆఖరి ఓవర్ మాత్రమే మిగిలి ఉండడంతో హిట్టింగ్ చేయాలని జట్టు భావించింది. అయితే బౌలర్ వేసిన బంతిని ప్రేగ్ బ్యాటర్ మిస్ చేశాడు. దీంతో బంతి వెళ్లి కీపర్ చేతిలో పడింది. అయితే రన్‌కు పరిగెత్తడంతో కీపర్ త్రో విసిరాడు. బంతి స్టంప్స్‌ను తాకడం మిస్ అయింది.. ఒక పరుగు వచ్చింది. ఒక రన్ కదా అని సరిపెట్టుకున్నాం. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. కీపర్ వేసిన బంతిని అవతలి ఎండ్‌లో ఉన్న బౌలర్ అందుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో ప్రత్యర్థి బ్యాటర్లు చకచకా మరో పరుగును పూర్తి చేశారు. దీంతో బౌలర్ మరోసారి బంతిని త్రో విసిరాడు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే మూడో పరుగును కూడా పూర్తి చేశారు. అలా తమ కన్ఫూజన్‌తో ప్రత్యర్థి జట్టుకు అనవసరంగా మూడు పరుగులు సమర్పించుకున్నామా అని చూడడం తప్ప ఏం చేయలేకపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ చేశారు. ''హతవిధి.. మిమ్మల్ని చూసి నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కాని స్థితిలో ఉన్నాం'' అంటూ తెలిపారు. చదవండి: ఫాస్ట్ బౌలర్లతో వచ్చిన సమస్య ఇదే.. రక్తం చిందించిన వేళ SL vs AUS: దురదృష్టమంటే మెండిస్‌దే.. బంతిని కొట్టబోయి పొరపాటున..! View this post on Instagram A post shared by Cricket District (@cricketdistrict) -
నరాలు తెగే ఉత్కంఠ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు
మ్యాచ్ ఆధ్యంతం బ్యాట్స్‌మన్ సిక్సర్ల వర్షం కురిపించడం ఒక ఎత్తు.. కానీ టప్ గేమ్‌ను సిక్సర్లతో ముగించడం మరొక ఎత్తు. ఆ బాధ్యతను విండీస్ క్రికెటర్ ఆండ్రీ ఫ్లెచర్ సమర్థంగా నిర్వహించాడు. 3 బంతుల్లో 16 పరుగులు చేస్తే జట్టు గెలుస్తుంది. ప్రతీ బంతి సిక్సర్ వెళితే గానీ సదరు జట్టు గెలవదు. కానీ ఫ్లెచర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. కాగా ఫ్లెచర్‌కు ''స్పైస్మాన్'' అనే బిరుదు కూడా ఉంది. విషయంలోకి వెళితే.. విన్సీ ప్రీమియర్ లీగ్ 2022లో భాగంగా బొటానికల్ గార్డెన్స్ రేంజర్స్, ఫోర్ట్ చార్లెట్ స్ట్రైకర్స్ మధ్య టి10 మ్యాచ్ జరిగింది. నరాల తెగేంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బొటానికల్ గార్డెన్స్ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఫోర్ట్ చార్లెట్ స్ట్రైకర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 107 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన బొటానికల్ గార్డెన్స్‌కు ఆఖరి ఓవర్లో విజయానికి 21 పరుగులు అవసరం అయ్యాయి. కొర్టోన్ లావియా ఆఖరి ఓవర్ వేయగా.. క్రీజులో ఫ్లెచర్ ఉన్నాడు. అప్పటికే 27 బంతుల్లో 39 పరుగులతో ఆడుతున్నాడు. మొదటి బంతికి ఎలాంటి పరుగు రాలేదు. రెండో బంతికి లెగ్‌బైస్, నో బాల్ రూపంలో బౌండరీతో పాటు ఒక రన్ అదనంగా వచ్చింది. మరుసటి రెండు బంతులు డాట్ బాల్స్. దీంతో చివరి మూడు బంతుల్లో 16 పరుగులు కావాలి. లావియా వేసిన ఫుల్‌టాస్‌ను స్వ్కేర్ లెగ్ దిశగా భారీ సిక్సర్ సంధించాడు. ఆ మరుసటి బంతిని మిడ్‌వికెట్ మీదుగా కళ్లు చెదిరే బౌండరీ బాదాడు. అంతే ఆఖరి బంతికి సిక్స్ కొడితే ఫ్లెచర్ జట్టు విజయాన్ని అందుకుంటుంది. అలా చివరి బంతి వేయగానే ఫ్లెచర్ స్ట్రెయిట్ సిక్స్‌ను సంధించాడు. ఫ్లెచర్ 34 బంతుల్లో మెరుపు అర్థశతకంతో పాటు జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఆ తర్వాత ఫ్లెచర్‌పై సహచరులు అభినందనల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Neymar: 'తాగి వచ్చి జట్టును సర్వనాశనం చేస్తున్నాడు'.. స్టార్ ఫుట్‌బాలర్‌పై ఆరోపణలు PAK vs AUS: స్టీవ్ స్మిత్ అరుదైన ఫీట్.. టెస్టు చరిత్రలో ఎవరికీ సాధ్యం కాలేదు! 16 needed off 3 balls and @AndreFletch delivers! 🔥 📺 Watch the captivating innings on #FanCode 👉 https://t.co/Fg9i08WZLv pic.twitter.com/jn3AmZCQPR — FanCode (@FanCode) March 24, 2022 -
భీకర ఫామ్‌లో కేకేఆర్ ప్లేయర్..8 సిక్సర్లు, 3 ఫోర్లతో విధ్వంసం
కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఆటగాడు, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ భీకరమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్ 2022)లో మొదలైన అతని విధ్వంసకర ప్రదర్శన.. ప్రస్తుతం జరుగుతున్న ట్రినిడాడ్ టీ10 లీగ్‌లోనూ కొనసాగుతుంది. బీపీఎల్‌లో భాగంగా ఓ మ్యాచ్‌లో 16 బంతుల్లో అర్ధశతకం(5 ఫోర్లు, 6 సిక్సర్లతో 57 పరుగులు), ఆమరుసటి మ్యాచ్‌లో 23 బంతుల్లో అర్ధశతకం (5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 57 పరుగులు) సాధించిన నరైన్.. తాజాగా ట్రినిడాడ్ లీగ్‌లో 22 బంతుల్లో 8 సిక్సర్లు, 3 ఫోర్లతో అజేయమైన 68 పరుగులు చేసి ఐపీఎల్ 2022కి ముందు ప్రత్యర్ధి జట్లకు సవాలు విసురుతున్నాడు. ఈ లీగ్‌లో స్కోవా కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నరైన్... కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి తన జట్టుకు భారీ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కోవా కింగ్స్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు చేసింది. లియోనార్డో జూలియన్ 9 బంతుల్లో 21 పరుగులు చేసి ఔటైన అనంతరం.. నరైన్, జేసన్ మహ్మద్ (33 బంతుల్లో 11 సిక్సర్ల సాయంతో 93 పరుగులు)తో కలిసి ప్రత్యర్ధి (కవాలియర్స్) బౌలర్లను ఊచకోత కోశాడు. అనంతరం కవాలియర్స్ జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 107 పరుగులు మాత్రమే చేసి దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. కింగ్స్ బౌలర్లలో రేమండ్ 2 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాశించాడు. ఇదిలా ఉంటే, ఇదే లీగ్‌లో నరైన్ కంటే ముందు విండీస్ హిట్టర్లు నికోలస్ పూరన్, ఎవిన్ లూయిస్ కూడా విధ్వంసం సృష్టించారు. పూరన్.. లెదర్‌బ్యాక్ జెయింట్స్ తరఫున ఆడుతూ కేవలం 37 బంతుల్లో అజేయమైన శతకం (10 సిక్సర్లు, 6 ఫోర్లతో 101 పరుగులు) సాధించగా, మరో మ్యాచ్‌లో ఎవిన్ లూయిస్ 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 17 బంతులు ఎదుర్కొన్న లూయిస్ ఏకంగా 8 సిక్సర్లు బాదాడు.కాగా, విండీస్ బ్యాటర్ల తాజా ఫామ్ చూసి వారిని సొంతం చేసుకున్న ఐపీఎల్ జట్లు తెగ సంబురపడిపోతున్నాయి. విండీస్ యోధులు ఇదే ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగించాలని ఆయా ఫ్రాంచైజీలు ఆకాంక్షిస్తున్నాయి. చదవండి: IPL 2022: సునీల్ నరైన్ ఊచకోత.. సంబురాల్లో కేకేఆర్ -
37 బంతుల్లోనే శతకం.. ఎస్ఆర్హెచ్కు ఊరటనిచ్చే అంశం
వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్ టి10 బ్లాస్ట్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 37 బంతుల్లోనే 10 సిక్సర్లు.. ఆరు ఫోర్ల సాయంతో శతకం బాదాడు. టి10 బ్లాస్ట్‌లో భాగంగా లెథర్బాక్ జెయింట్స్, స్కార్లెట్ స్కార్చర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లెథర్బాక్ జెయింట్స్ పూరన్ దాటికి 8.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. కాగా నికోలస్ పూరన్‌కు ఇటీవలే ముగిసిన ఐపీఎల్ మెగావేలంలో భారీ ధర పలికిన సంగతి తెలిసిందే. ఎస్ఆర్హెచ్ జట్టు ఏరికోరి పూరన్‌ను రూ. 10.75 కోట్లకు సొంతం చేసుకుంది. అసలే వేలంలో తమ చెత్త నిర్ణయాలతో విమర్శలకు గురైన ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీకి ఇది కాస్త ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు. కోట్లు పెట్టు కొన్నందుకు పూరన్ ఇలాంటి ఇన్నింగ్స్ ఐపీఎల్లో ఆడితే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన స్కార్లెట్ స్కార్చర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఓపెనర్ టియోన్ వెబ్‌స్టర్ 54, ఎవార్ట్ నికోల్సన్ 42 పరుగులతో రాణించారు. ఆ తర్వాత నికోలస్ పూరన్(38 బంతుల్లో 101 నాటౌట్, 10 సిక్సర్లు, 6 ఫోర్లు) మెరుపులతో 8.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. కాగా లెథర్బాక్ జెయింట్స్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. చదవండి: Mohammed Shami: 'నన్ను విమర్శించినోళ్లు భారతీయులే కాదు' SA Vs Nz 2nd Test: ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. న్యూజిలాండ్ ఘన విజయం Genius at work! 😱@nicholas_47 hit a ton off just 3️⃣7️⃣ balls including 6️⃣ fours and 1️⃣0️⃣ massive sixes to take the Leatherback Giants to a comfortable 9️⃣-wicket win! 👏 📺 Watch the best moments from this match on #FanCode 👉 https://t.co/c8dKvIy6GE pic.twitter.com/h5G2lrEo8s — FanCode (@FanCode) March 1, 2022 -
దరిద్రం నెత్తిన పెట్టుకోవడం అంటే ఇదే..
క్రికెట్లో ఫన్నీ ఘటనలు జరగడం సహజం. క్యాచ్ పడదామని భావించిన ఆటగాడికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. చేతులో పడుతుందనుకున్న బంతి ఫీల్డర్ తలపైన తగిలి నేరుగా బౌండరీ వెళ్లింది. దీంతో సదరు ఫీల్డర్ బౌలర్ ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చింది. ఈ ఘటన యూరోపియన్ క్రికెట్ టి10 లీగ్‌లో చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా స్టార్ సీసీ, హెల్సెంకీ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. హెల్సెంకీ టైటాన్స్ ఇన్నింగ్స్ సమయంలో.. జతిన్ మదన్ బౌలింగ్ గులామ్ అబ్బాస్ భట్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. బ్యాట్ ఎడ్జ్‌కు తగిలిన బంతి గాల్లోకి లేచింది. బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ క్యాచ్ తీసుకుంటాడని అంతా భావించారు. అయితే ఎవరు ఊహించని విధంగా బంతి అతని తలను తాకి బౌండరీ వెళ్లింది. దీంతో బ్యాట్స్‌మన్ ఔటవ్వాల్సింది పోయి అదనంగా నాలుగు పరుగులు సాధించాడు. అయితే అదే ఓవర్ చివరి బంతికి గులామ్ అబ్బాస్ ఔటవ్వడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన స్టార్ సీసీ 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. జతిన్ మదన్ 20 బంతుల్లో 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన టైటాన్స్ 10 ఓవర్లలో 118 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. గోల్డెన్ బాల్ రూల్ అనివార్యమైంది. గోల్డెన్‌బాల్ రూల్‌లో స్టార్ సీసీ విజయాన్ని అందుకుంది. ఏమిటి గోల్డెన్ బాల్ రూల్.. సాధారణంగా క్రికెట్లో మ్యాచ్‌లు టై అయితే.. సూపర్ ఓవర్, బౌలౌట్ లాగే గోల్డెన్ బాల్ రూల్ ఉంటుంది. ఈ గోల్డెన్ బాల్ రూల్‌లో రెండో బ్యాటింగ్ చేసిన జట్టుకు అదనంగా ఒక బంతిని ఇస్తారు. ఆ బంతికి సదరు జట్టు రెండు పరుగులు.. అంతకంటే ఎక్కువ సాధిస్తే విజయం సాధించినట్టు.. లేదంటే బౌలింగ్ చేసిన జట్టు విజయం వరిస్తుంది. చదవండి: Rohit-Ritika Sajdeh: రోహిత్ నన్ను పట్టించుకో.. ప్లీజ్ ఒకసారి ఫోన్ చేయ్: రితికా శర్మ షం‘షేర్’ అంటున్న సీఎస్కే.. స్పోర్ట్స్ ఫ్రాంచైజీల్లో మరో రికార్డు pain. pic.twitter.com/sMvF2eZFu3 — That’s so Village (@ThatsSoVillage) February 21, 2022 -
మాములు ప్రతీకారం మాత్రం కాదు.. 'అంతకు మించి'
క్రికెట్లో సెండాఫ్స్ ఇచ్చుకోవడం.. దెబ్బకు దెబ్బ తీయడం సర్వ సాధారణం. ఉదాహరణకు.. ఒక బౌలర్ తన బౌలింగ్‌లో పదే పదే సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేసి రివేంజ్ తీర్చుకోవడం ఒక స్టైల్.. లేదంటే అదే బౌలర్ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను అదే పనిగా విసిగిస్తుంటే.. నోటితో కాకుండా కేవలం బ్యాట్‌తోనే సమాధానం ఇవ్వడం మరో స్టైల్ రివేంజ్. అటు నోటితో.. ఇటు బ్యాటుతో సమాధానం ఇవ్వడం మరో రకమైన ప్రతీకారం. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది ''అంతకు మించి'' అనకుండా ఉండలేం. చదవండి: Viral Video: బంగారం లాంటి అవకాశం వదిలేశాడు.. విషయంలోకి వెళితే.. యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో భాగంగా టన్‌బ్రిడ్జ్ వెల్స్, డ్రూక్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టన్‌బ్రిడ్జ్ వెల్స్ ఇన్నింగ్స్ 8వ ఓవర్‌ను వహిద్ అబ్దుల్ వేశాడు. అబ్దుల్ వేసిన అంతకముందు ఓవర్లో టన్‌బ్రిడ్జ్ వెల్స్ ఓపెనర్ ఓ రియోర్డాన్ వరుస బంతుల్లో రెండు బౌండరీలు బాదాడు. ఇది మనసులో పెట్టుకున్న అబ్దుల్ 8వ ఓవర్లో ఒక యార్కర్ డెలివరీతో రియోర్డాన్ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో తన కాలికి ఉన్న షూ తీసి నెంబర్ డయల్ చేసి కాల్ మాట్లాడుతూ.. ''నువ్వు వచ్చిన పని ముగిసింది ఇక వెళ్లు'' అంటూ రియోర్డన్ను ఉద్దేశించి వెటకారంగా మాట్లాడాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న కెప్టెన్ క్రిస్ విలియమ్స్ ఇదంతా గమనించాడు. 'టైం రాకపోతుందా' అని విలియమ్స్ మనుసులో అనుకున్నాడో లేదో.. ఆ అవకాశం రానే వచ్చింది. వహిద్ అబ్దుల్ మరుసటి ఓవర్లో స్ట్రైకింగ్‌లో ఉన్న విలియమ్స్ బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కొట్టాడు. అంతే అబ్దుల్ వహిద్పై ప్రతీకారంగా తన బ్యాట్‌తో నెంబర్ కలిపి ఫోన్ మాట్లాడుతున్నట్లుగా అబ్దుల్ వైపు చూస్తూ..''ఇప్పుడు నీ పని ముగిసింది.. ఇక బౌలింగ్‌కు రాకు'' అంటూ హెచ్చరిక పంపాడు. మొత్తానికి తన జట్టు ఆటగాడిని ఏ విధంగా అయితే అవమానించాడో.. అదే పద్దతిలో కెప్టెన్ విలియమ్స్ ప్రతీకారం తీర్చుకొని దెబ్బకు దెబ్బ తీశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన క్రికెట్ ఫ్యాన్స్.. ఇలాంటి రివేంజ్ ఇంతకముందు చూడలేదు.. వారెవ్వా దెబ్బకు దెబ్బ తీశాడు.. ఇది మాములు ప్రతీకారం మాత్రం కాదు.. అంతకుమించి అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: హిజాబ్ వివాదంపై స్పందించిన గుత్తా జ్వాల ఇక మ్యాచ్‌లో టన్‌బ్రిడ్జ్ వెల్స్ 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టన్బ్రిడ్జ్వెల్ 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 141 పరుగుల భారీ స్కోరు చేసింది. క్రిస్ విలియమ్స్(56), అలెక్స్ విలియమ్స్(58) రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన డ్రూక్స్ 7.2 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌట్ అయింది. జో మెక్కాఫ్రీ 9 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. Banter you WOULD NOT like to miss 😅 C. Williams comes up with a perfect reply to his teammate's dismissal 😎@BET2BALL European Cricket League 2022 | Presented by @KibaInuWorld | @Cricket_Espana pic.twitter.com/Q8H3HMuMO0 — European Cricket (@EuropeanCricket) February 11, 2022 -
బ్యాట్స్‌మన్ వీరబాదుడు.. 20 నిమిషాల్లోనే మ్యాచ్ ఖేల్‌ఖతం
Delhi Bulls Finished Match In 20 Minutes Vs Chennai Braves In T10 League.. అబుదాబి టి10 లీగ్‌లో సంచలన ఇన్నింగ్స్‌లు నమోదవుతున్నాయి. చెన్నై బ్రేవ్స్, ఢిల్లీ బుల్స్ మధ్య మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ 20 నిమిషాల్లోనే ముగిసింది. ఢిల్లీ బుల్స్ బ్యాట్స్‌మన్ రహ్మనుల్లా గుర్బాజ్ వీరబాదుడుతో 81 పరుగుల లక్ష్యాన్ని 4.1 ఓవర్లలో చేధించిన ఢిల్లీ బుల్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. కేవలం 14 బంతుల్లోనే అర్థసెంచరీ మార్క్‌ను అందుకున్న ఓపెనర్ గుర్బాజ్ టి10 లీగ్ చరిత్రలోనే వేగవంతమైన అర్థశతకం సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇక ఓవరాల్‌గా 16 బంతుల్లో 57 పరుగులు చేసిన గుర్బాజ్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ చంద్రపాల్ హేమరాజ్ 9 బంతుల్లో 24 పరుగులతో సహకరించాడు. చదవండి: Abu Dhabi T10 League: సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో.. అయినా ఊచకోతే కాగా ఈ సీజన్లో గుర్బాజ్‌కు ఇది వరుసగా ఐదో అర్థసెంచరీ కావడం విశేషం. టి10 లీగ్ వరుసగా ఐదు అర్థసెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా గుర్బాజ్ చరిత్ర సృష్టించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై బ్రేవ్స్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. కెప్టెన్ పెరీరా 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: Navdeep Saini: కసితో వేశాడు.. స్టంప్ ఎగిరి గాల్లో పల్టీలు -
సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో.. అయినా ఊచకోతే
యూఏఈ వేదికగా టి10 లీగ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్, బెంగాల్ టైగర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. కాగా ఈ మ్యాచ్‌లో బ్యాటర్ కోహ్లర్-కాడ్మోర్ విధ్వంసం సృష్టించాడు. సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో ఔటైనప్పటికి బౌలర్లను ఊచకోత కోశాడు. 39 బంతుల్లోనే 12 ఫోర్లు.. 5 సిక్సర్లతో 96 పరుగులు సాధించాడు. అతని దాటికి నిర్ణీత 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 140 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో టామ్ కోహ్లర్ టి10 చరిత్రలోనే అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆండీ రసెల్ 26, ఒడెయిన్ స్మిత్ 12 పరుగులు చేశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగాల్ టైగర్స్ 8.3 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. ఇసురు ఉడాన 33 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. బౌలింగ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్ బౌలర్ వనిందు హసరంగా 5 వికెట్లతో దుమ్మురేపాడు. చదవండి: T10 League: బంతి గట్టిగా తగిలినట్టుంది.. పాపం అంపైర్ -
Wanindu Hasaranga: వారెవ్వా హసరంగ.. పాదరసంలా కదిలి.. ఎగిరి..
Wanindu Hasaranga Jaw Dropping Effort T10 League Video Goes Viral: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగ ప్రస్తుతం అబుదాబి టీ10 లీగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ టోర్నీలో దక్కన్ గ్లాడియేటర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న హసరంగ.. ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. చెన్నై బ్రేవ్స్‌తో మ్యాచ్‌లో పాదరసంలా కదిలి.. జట్టుకు ఐదు పరుగులు సేవ్ చేశాడు. సిక్సర్ ఖాయమనుకున్న తరుణంలో హసరంగ బంతిని ఆపడంతో కంగుతినడం బ్యాటర్ వంతైంది. అబుదాబిలో షేక్ జాయేద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్కన్ గ్లాడియేటర్స్ చెన్నై బ్రేవ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో డేవిడ్ వీజ్ బౌలింగ్‌లో ఓపెనర్ మహ్మద్ షెహజాద్ భారీ షాట్ ఆడాడు. సిక్స్ ఖాయం అనుకున్న సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హసరంగ మెరుపులా కదిలి బంతిని లోపలికి విసిరాడు. ఎలాగో ఆరు పరుగులు వస్తాయి కదా అనుకున్న చెన్నై బ్రేవ్స్ హసరంగా షాక్‌తో ఒక పరుగు మాత్రమే సాధించగలిగింది. ఇక ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన హసరంగ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌లో దక్కన్ గ్లాడియేటర్స్ 5 వికెట్ల తేడాతో బ్రేవ్స్‌పై గెలుపొందింది. చదవండి: Ind Vs Nz 1st Test Highlights: సూపర్ భరత్... సాహా స్థానంలో వచ్చీరాగానే.. Wow wow Wanindu 😱😱#CBvsDG pic.twitter.com/H7IeUxlVIj — Stay Cricket (@staycricket) November 26, 2021 -
బౌండరీ కొట్టాలని చూశాడు.. దురదృష్టం వెంటాడింది
Batsman Bizzare Dismissal Became Viral In ECS T10 league.. క్రికెట్లో బ్యాట్స్‌మెన్ ఫన్నీవేలో ఔటవ్వడం చాలానే చూసుంటాం. కొన్నిసార్లు నవ్వొస్తో.. మరికొన్ని సార్లు జాలిపడ్డాం. తాజాగా యూరోపియన్ క్రికెట్ సిరీస్ టి10లీగ్‌లోనూ ఇలాంటిదే చోటుచేసుకుంది. మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్ ఫైన్‌లెగ్ దిశగా బౌండరీ కొట్టాలని చూశాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. టైమ్‌లైన్ మిస్ కావడంతో బ్యాట్ ఎడ్జ్ తగిలిన బంతి కీపర్ హెల్మెట్‌కు తాకి థర్డ్‌మన్ దిశగా వెళ్లింది. అక్కడే ఉన్న ఫీల్డర్ క్యాచ్ పట్టడంతో బ్యాట్స్‌మన్ ఔటయ్యాడు. రూల్స్ ప్రకారం బంతి నేలను తాకక ముందు ఎక్కడ తగిలినప్పటికి ఫీల్డర్ క్యాచ్ పడితే అది ఔట్‌గా పరిగణిస్తారు. దీంతో చేసేదేంలేక బ్యాట్స్‌మన్ భారంగా వెనుదిరిగాడు. అయితే అంపైర్లు మాత్రం మొదట బ్యాటర్ ఔట్ కాదనుకున్నారు. కానీ రిప్లైలో చూస్తే ఔట్ అని స్పష్టంగా కనిపించింది. అయితే ఇలాంటి విచిత్రమైన ఔట్ ఎప్పుడు చూడలేదని మ్యాచ్ అనంతరం అంపైర్లు పేర్కొనడం ఫన్నీగా అనిపించంది. దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The @EuropeanCricket League is the gift that just keeps on giving! 😂pic.twitter.com/XW70ldMMjS — That’s so Village (@ThatsSoVillage) November 25, 2021 -
టి10 లీగ్‌లో లివింగ్‌స్టోన్ సంచలన ఇన్నింగ్స్
Liam Livingstone Smash 8 Sixes In T10 League Tourney.. యూఏఈ వేదికగా జరుగుతున్న టి10 లీగ్‌లో భాగంగా శనివారం నార్తన్ వారియర్స్, టీమ్ అబుదాబి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ లియామ్ లివింగ్‌స్టోన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 23 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో లివింగ్‌స్టోన్ 68 పరుగులు సాధించాడు. ఇక మ్యాచ్‌లో టీమ్ అబుదాబి 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ అబుదాబి నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ 68, ఫిలిప్ సాల్ట్ 29 పరుగులు మినహా మిగతావారు విఫలమ్యారు. అనంతరం బ్యాటింగ్ చేసిన నార్తన్ వారియర్స్ 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేయగలిగింది. నార్తన్ వారియర్స్ బ్యాటింగ్‌లో రోవ్‌మన్ పావెల్ 42 టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెన్నర్ లూయిస్ 35 పరుగులు చేశాడు. టీమ్ అబుదాబి బౌలింగ్‌లో నవీన్ ఉల్ హక్, డాని బ్రిగ్స్, మర్చంట్ డీ లాంజ్ తలా రెండు వికెట్లు తీశారు. చదవండి: chris gayle: క్రిస్ గేల్ విధ్వంసం.. కేవలం 23 బంతుల్లోనే.. -
పొట్టి క్రికెట్‌పై దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Faf Du Plessis Says T10 Cricket Format Can Be Used In Olympics: అబుదాబి వేదికగా నవంబర్ 19 నుంచి ప్రారంభంకానున్న టీ10 లీగ్ నేపథ్యంలో ఈ అతి పొట్టి ఫార్మాట్‌పై దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ10 ఫార్మాట్లో తొలిసారి ఆడనున్న డుప్లెసిస్.. అబుదాబి టీ10 టోర్నీలో బంగ్లా టైగర్స్ తరఫున ప్రాతనిధ్యం వహించనున్నాడు. ఈ జట్టుకు సారధ్యం వహించనున్న డెప్లెసిస్.. టోర్నీ ఆరంభానికి ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. క్రికెట్లో గుర్తింపు పొందిన అతి పొట్టి ఫార్మాట్(టీ10)లో ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్నానని అన్నాడు. సమీప భవిష్యత్తులో టీ20 క్రికెట్ మరుగున పడి, టీ10 క్రికెట్ రాజ్యమేలుతుందని జోస్యం చెప్పాడు. స్వల్ప వ్యవధిలో ముగిసే ఈ ఫార్మాట్‌కు ప్రేక్షకులు మరింతగా ఆకర్షితులవుతారని, ఇదే ఫార్మాట్‌ను ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే, 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టాలని ఐసీసీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు బిడ్ వేసేందుకు ఐసీసీ ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసుకుంది. చదవండి: పాక్ క్రికెట్‌కు గుడ్ టైమ్.. రానురానన్న జట్లే క్యూ కడుతున్నాయ్..! -
విచిత్రమైన బౌలర్.. వికెట్ తీసి కామెంటరీ కూడా; వీడియో వైరల్
లండన్: క్రికెట్లో ఒక బౌలర్ వికెట్ తీస్తే సెలబ్రేట్ చేసుకోవడం సాధారణం. అందులో కొంతమంది మాత్రం తాము ఏం చేసినా ప్రత్యేకంగా ఉండాలని భావిస్తుంటారు. ఉదాహరణకు స్టెయిన్ వికెట్ తీస్తే చెయిన్ సా రియాక్షన్ ఇవ్వడం.. ఇమ్రాన్ తాహిర్ వికెట్ తీస్తే గ్రౌండ్ మొత్తం పరుగులు తీయడం.. విండీస్ బౌలర్ కాట్రెల్ వికెట్ తీసిన తర్వాత సెల్యూట్ చేయడం అలవాటు. ఎవరి సెలబ్రేషన్ ఎలా ఉన్నా వాటిని చూసే మనకు మాత్రం వినోదం లభించడం గ్యారంటీ. తాజాగా క్లబ్ క్రికెట్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఈసీఎస్ టీ10 టోర్నీ సందర్బంగా బనేసా, బుకారెస్ట్ గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బుకారెస్ట్ గ్లాడియేటర్స్ స్పిన్నర్ పావెల్ ఫ్లోరిన్ వికెట్ తీసిన ఆనందంలో తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. పావెల్ వేసిన లూప్ డెలివరీని అంచనా వేయడంలో పొరబడ్డ బ్యాట్స్‌మన్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పావెల్ పిచ్‌పై నుంచి పెవిలియన్ వైపు పరిగెత్తాడు. బౌండరీ చివరల్లో ఆగుతాడునుకుంటే ఎవరు ఊహించని విధంగా కామెంటేటరీ సెక్షన్లోకి వెళ్లి.. '' నేను వికెట్ తీశాను.. నా బౌలింగ్ ఎలా ఉంది'' అంటూ గట్టిగా అరిచాడు. ఆ తర్వాత మళ్లీ గ్రౌండ్లోకి వచ్చి బౌలింగ్‌ను కంటిన్యూ చేశాడు. అతని చర్యలకు సహచర ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లు నవ్వుకున్నారు. ఏది ఏమైనా పావెల్ ఫ్లోరిన్ చేసిన పని నెటిజన్లను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఒక వికెట్ తీసినంత మాత్రానా ఇంత చేయాల్సిన అవసరం ఉందా అంటూ కొందరు ఘాటుగా పేర్కొన్నారు. Live the moment #cricket pic.twitter.com/k9cbtmKUrE — Pavel Florin (@PavelFlorin13) July 24, 2021 -
7 పరుగులకే ఆలౌట్.. ఇందులోనూ మూడు ఎక్స్‌ట్రాలు
లండన్: యార్క్‌షైర్ ప్రీమియర్ టీ10 లీగ్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో అత్యంత చెత్త గణాంకాలు నమోదయ్యాయి. ఈస్ట్‌రింగ్‌స్టన్ క్లబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో.. హిల్లమ్ మాన్క్ ఫ్రైస్టన్ జట్టు 8 ఓవర్లలో 7 పరుగులకే ఆలౌటై అప్రతిష్ట మూటగట్టుకుంది. అనంతరం స్వల్ప ఛేదనలో ప్రత్యర్ధి జట్టు కేవలం 8 బంతుల్లోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుని 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో, అత్యంత తక్కువ బంతుల్లో పూర్తయిన మ్యాచ్‌గా చరిత్రలో నిలిచింది. ఈ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లు కేవలం 56 బంతుల్లోనే ముగిసిపోయాయి. తొలుత బ్యాటింగ్‌కు దిగిన హిల్లమ్ మాన్క్ ఫ్రైస్టన్ జట్టు.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏదో పని ఉందన్నట్లుగా క్రీజులోకి వచ్చీరాగానే వికెట్లు సమర్పించుకుని పెవిలియన్‌కు చేరారు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 10మంది బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేయగా, 8 మంది ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. మిగిలిప ఇద్దరు ఆటగాళ్లు అతికష్టం మీద తలో రెండు పరుగులు చేయగా, మిగిలిన మూడు పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. దీంతో ఫ్రైస్టన్ జట్టు 8 ఓవర్లలో 7 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్ధి బౌలర్ నాథన్ క్రీగర్ 4 ఓవర్లలో 3 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 8 పరుగులు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్‌రింగ్‌స్టన్ జట్టు.. కేవలం 1.2 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా టార్గెట్‌ను రీచ్ కావడంతో ఏ ఫార్మాట్టోనైనా అత్యంత తక్కువ సమయంలో, అత్యంత తక్కువ బంతుల్లో ముగిసిన మ్యాచ్‌గా ఈ మ్యాచ్ చరిత్రకెక్కింది. ఈస్ట్‌రింగ్‌స్టన్ ఆటగాడు జేమ్స్ ఒక్కడే 8 బంతులను ఎదుర్కొని బౌండరీ సాయంతో 7 పరుగులు సాధించాడు. మరో పరుగు ఎక్స్ట్రాగా లభించింది. -
ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. సింపుల్‌గా కొట్టేశాడు
లండన్: క్రికెట్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. 2007 టీ20 ప్రపంచకప్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఈ ఘనత అందుకున్నాడు. ఆ తర్వాత ఇలాంటి రికార్డులు చాలానే చూశాం. దక్షిణాఫ్రికా నుంచి హర్షలే గిబ్స్, శ్రీలంక నుంచి తిసార పెరీరా.. ఈ మధ్యనే విండీస్ హార్డ్ హిట్టర్ కీరన్ పొలార్డ్ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. మొన్నటికి మొన్న ఐపీఎల్ 14వ సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఆల్‌రౌండర్ జడేజా ఒకే ఓవర్లో ఐదు వరుస సిక్సర్లు బాది.. ఆఖరిబంతికి ఫోర్ కొట్టడంతో తృటిలో రికార్డును మిస్ అయ్యాడు. తాజాగా ఆ అద్భుతం మరోసారి చోటుచేసుకుంది. అయితే ఈసారి ఇది జరిగింది యూరోపియన్ క్రికెట్ డొమెస్టిక్ లీగ్‌లో. విషయంలోకి వెళితే.. ఈసీఎస్ టీ10 పేరిట జరుగుతున్న టోర్నీలో శుక్రవారం బేయర్ ఉర్డింజిన్ బూస్టర్స్ , కోన్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. బేయర్ ఉర్డింజిన్ బ్యాట్స్‌మన్ అరితరన్ వసీకరణ్ ఆయుష్ శర్మ బౌలింగ్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఈ మ్యాజిక్ చోటుచేసుకుంది. ఆయుష్ శర్మ వేసిన ఆరు బంతులను వరుసగా.. మిడ్ వికెట్, మిడ్ వికెట్,స్క్వేర్‌లెగ్, మిడ్ వికెట్, స్క్వేర్‌లెగ్, మిడాన్ దిశగా ఆరు సిక్సుల బాదాడు. అతను క్రీజులోకి వచ్చేసరికి జట్టు స్కోరు 4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 21 పరుగులతో ఉంది. అతని సిక్సర్ల దెబ్బకు ఒక్క ఓవర్ తిరిగే సరికి బూస్టర్స్ స్కోరు 5 ఓవర్లలో 57/3గా నమోదైంది. మొత్తంగా వసీకరణ్ 25 బంతులెదుర్కొని 61 పరుగులు చేశాడు. ఇందులో 7 సిక్స్‌లు.. మూడు బౌండరీలు ఉన్నాయి. కాగా బూస్టర్స్ 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఎక్కడ దొరకలేదు.. కానీ కొంతమంది నెటిజన్లు తమ ట్విటర్లో ఈ విషయాన్ని పంచుకున్నారు. చదవండి: జడేజా పేసర్ అయితే బాగుండు.. మాకు చాన్స్ వచ్చేది 6 sixes in a single over by Aritharan Vaseekaran in European Cricket series. pic.twitter.com/TzvnfOc36F — Johns. (@CricCrazyJohns) May 21, 2021 Aritharan Vaseekaran, the latest addition to the six-sixes club. #ECST10 pic.twitter.com/nsr5Zf35lX — srikrishna 🏏 (@1998Srikrishna) May 21, 2021 -
దేవుడా.. పెద్ద గండం తప్పింది
దుబాయ్: షాహిద్ అఫ్రిది.. బంతిని ఎంత బలంగా బాదుతాడో .. కోపాన్ని కూడా అంతే వేగంగా చూపిస్తాడు. ఎదుటివారు తప్పు చేసినా.. తాను తప్పు చేసినా అసహనం వ్యక్తం చేయడం అఫ్రిదికి ఉన్న అలవాటు. ఆ అలవాటే అతన్ని చాలాసార్లు ఇబ్బందులు పెట్టింది.. ఒక్కోసారి నవ్వులు కూడా పూయించింది. రెండేళ్ల క్రితం ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన అఫ్రిది ప్రస్తుతం అబుదాబి టీ10 లీగ్‌లో క్యులాండర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శుక్రవారం టీమ్ అబుదాబితో ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు మరింత దగ్గరవుతుంది. దీంతో సిరీయస్‌గా తీసుకున్న ఇరుజట్లు మ్యాచ్‌ను గెలవడానికి ప్రయత్నించాయి. మ్యాచ్ ఫలితం పక్కనపెడితే.. క్యులాండర్ బ్యాటింగ్ సమయంలో అఫ్రిది చర్య సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆఫ్‌స్టంప్ మీదుగా వెళుతున్న బంతిని అఫ్రిది పుష్ చేయాలని చూశాడు. కానీ బంతి బ్యాట్ పైనుంచి వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. దీంతో అతను వింతైన ఎక్స్ప్రెషన్ పెట్టి పంజాబీ భాషలో 'ఓ తెరీ కైయిర్' అనే పదం ఉపయోగించాడు. ఓ తెరీ కైయిర్ అంటే ఓ మై గాడ్ అని అర్థం. అఫ్రిది పలికిన వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్తాన్‌కు 22ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన షాహిద్ అఫ్రిది అనతికాలంలోనే మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందాడు. వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ(37 బంతుల్లో 100 పరుగులు) చేసిన తొలి ఆటగాడిగా అఫ్రిది రికార్డులకెక్కాడు. పాక్ తరపున 27 టెస్టుల్లో 1716 పరుగులు, 398 వన్డేల్లో 8064 పరుగులు, 99 టీ20ల్లో 1416 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో వన్డేల్లో 395 వికెట్లు, టెస్టుల్లో 48 వికెట్లు, టీ20ల్లో 98 వికెట్లు తీశాడు.ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన క్యులాండర్స్ 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. ఆఫ్రిది 24 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమ్ అబుదాబి 8.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. బెన్ డక్కెట్ 27, జో క్లార్క్ 22 పరుగులు చేశారు. చదవండి: సిరాజ్, కుల్దీప్ల గొడవ.. నిజమెంత! కోహ్లి ఫిజియో అవతారం.. చూసి తీరాల్సిందే Shahid Afridi "oh teri khair" #T10League #Cricket pic.twitter.com/zXL3E5DkoT — Saj Sadiq (@Saj_PakPassion) February 5, 2021 -
సిక్సర్ల హోరు.. యునివర్సల్ బాస్ విధ్వంసం
దుబాయ్: యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ మరోసారి విధ్వంసం సృష్టించాడు.40 ఏళ్ల వయసులోనూ మంచినీళ్ల ప్రాయంగా సిక్సర్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో దడ పుట్టిస్తున్నాడు. తాజాగా అబుదాబి టీ10 లీగ్‌లో గేల్ మరోసారి రెచ్చిపోయాడు. కొడితే ఫోర్.. లేదంటే సిక్స్ అన్నట్లుగా సునామీ ఇన్నింగ్స్‌తో విజృంభించాడు. బుధవారం మరాఠా అరేబియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ అబుదాబికి ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్ 22 బంతుల్లోనే 9 సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 84 పరుగులతో అజేయంగా నిలిచి ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. చదవండి: బుమ్రాకు 'తొలి' టెస్టు.. ఐసీసీ ఆల్ ది బెస్ట్ కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గేల్.. టీ10 చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన మహమ్మద్ షహజాద్ రికార్డును సమం చేశాడు. 2018 సీజన్లో షెహజాద్ రాజ్‌పుత్స్ తరఫున 12 బంతుల్లోనే అర్ధ శతకం చేశాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మరాఠా అరేబియన్స్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ అబుదాబి జట్టులో ఓపెనర్ గేల్ విధ్వంసంతో 5.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. గేల్ చేసిన 84 పరుగుల్లో 78 రన్స్ బౌండరీల రూపంలోనే రావడం విశేషం. చదవండి: టీమిండియాకు జో రూట్ వార్నింగ్ -
'నేను కావాలని చేయలేదు.. క్షమించండి'
దుబాయ్: అబుదాబి టీ10 లీగ్‌లో భాగంగా టీమ్ అబుదాబి ఆటగాడు రోహన్ ముస్తఫా ఫీల్డింగ్ సమయంలో షర్ట్ లేకుండా బౌండరీవైపు పరిగెత్తడం తెలిసిందే. సోమవారం రాత్రి నార్తన్ వారియర్స్, టీమ్ అబుదాబి మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ముస్తఫా చర్యపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. తాజాగా రోహన్ ముస్తఫా ఘటనపై స్పందిస్తూ.. అది కావాలని చేయలేదంటూ క్లారిటీ ఇచ్చాడు. 'ముందుగా నేను చేసిన తప్పుకు జట్టు సహచరులతో పాటు అబుదాబి టీ10 లీగ్ చూసినవాళ్లందరికి క్షమాపణలు కోరుకుంటున్నా. అయితే ఆ పని కావాలని చేసింది మాత్రం కాదు.. ఆ తర్వాతి ఓవర్ నేను వేయాల్సి ఉండడంతో జెర్సీని మాత్రమే తీయాలనుకున్నా. కానీ పొరపాటుగా జెర్సీతో పాటు నా షర్ట్ కూడా బయటికి వచ్చేసింది. ఇదంతా గమనించని మా బౌలర్ అప్పటికే బంతి వేయడం.. నావైపు దూసుకురావడం జరిగిపోయింది. బంతి వేగంగా రావడంతో జెర్సీ వేసుకునే సమయం లేకపోవడంతో అలాగే పరిగెత్తాల్సి వచ్చింది. మ్యాచ్ ముగిసిన తర్వాత నేను చేసిన పనికి జట్టుతో పాటు మేనేజ్మెంట్కు కూడా క్షమాపణ చెప్పానంటూ' తెలిపాడు. చదవండి: ధోని గుర్తుగా కోహ్లి హెలికాప్టర్ షాట్ ఈ మ్యాచ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్ 6 వికెట్ల తేడాతో టీమ్ అబుదాబిపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ అబుదాబి 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది.లూక్ రైట్ 25 పరుగులు, జో క్లార్క్ 21 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నార్తన్ వారియర్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కామెరాన్ డెల్పోర్ట్ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కీరన్ పొలార్డ్ 24 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.చదవండి: షర్ట్ లేకుండా పరిగెత్తాడు.. చివరికి Team Abu Dhabi versus Northern Warriors earlier today in the T10 League - the ball goes for 4 as the fielder Rohan Mustafa was too busy changing his jersey #T10League #Cricket pic.twitter.com/GvHZMhl2eq — Saj Sadiq (@Saj_PakPassion) February 1, 2021 -
షర్ట్ లేకుండా పరిగెత్తాడు.. చివరికి
దుబాయ్: అబుదాబి టీ10 లీగ్‌లో సోమవారం రాత్రి నార్తన్ వారియర్స్, టీమ్ అబుదాబి మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమ్ అబుదాబి ఆటగాడు రోహన్ ముస్తఫా చేసిన ఒక పని సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. అసలు విషయంలోకి వెళితే.. నార్తన్ వారియర్స్ బ్యాటింగ్ సమయంలో ఒక ఓవర్లో రోహన్ తన జెర్సీని సరిచేసుకునే పనిలో పడ్డాడు. అయితే ఇది గమనించని బౌలర్ బంతి వేయగా నార్తన్ వారియర్స్ బ్యాట్స్‌మన్.. రోహన్ దిశగా షాట్ ఆడాడు. అప్పటికీ జెర్సీని వేసుకునే పనిలో ఉన్న రోహన్.. బంతి తన దగ్గరికి రావడంతో జెర్సీ చేతిలో పట్టుకుని పరిగెత్తాడు. అయితే బంతి అప్పటికే బౌండరీ దాటేసింది. రోహన్ ముస్తఫా తన జెర్సీని వేసుకుంటున్న దృశ్యం కెమెరాకు చిక్కింది. దీంతో వారియర్స్ కెప్టెన్ నికోలస్ పూరన్ ముస్తఫా వీడియోనూ చూసి నవ్వాపుకోలేకపోయాడు. దీనిని ఒక వ్యక్తి ట్విటర్లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. చదవండి: ఒక్క టెస్ట్.. 3 రికార్డులు.. కోహ్లికి మాత్రమే ఇక మ్యాచ్ విషయానికి వస్తే డెక్కన్ గ్లాడియేటర్స్ 6 వికెట్ల తేడాతో టీమ్ అబుదాబిపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ అబుదాబి 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది.లూక్ రైట్ 25 పరుగులు, జో క్లార్క్ 21 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నార్తన్ వారియర్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కామెరాన్ డెల్పోర్ట్ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కీరన్ పొలార్డ్ 24 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. చదవండి: క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. లాభపడిన కివీస్ Team Abu Dhabi versus Northern Warriors earlier today in the T10 League - the ball goes for 4 as the fielder Rohan Mustafa was too busy changing his jersey #T10League #Cricket pic.twitter.com/GvHZMhl2eq — Saj Sadiq (@Saj_PakPassion) February 1, 2021 -
టి10 లీగ్‌ను ఒలింపిక్స్‌లో చేరిస్తే బాగుంటుంది
జమైకా: ఒలింపిక్స్‌కి టి10 ఫార్మాట్ క్రికెట్ సెట్ అవుతుందని విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రికెట్ క్రిస్ గేల్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయాన్ని శుక్రవారం ట్విట్టర్ ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు. టి 10 ఫార్మాట్ అయితే కేవలం 90 నిమిషాల్లోనే మ్యాచ్ పూర్తయి ఫలితం వస్తుందన్నాడు. అదే టీ20 ఫార్మాట్ అయితే ఒక్కో మ్యాచ్ ముగిసేందుకు కనీసం 3గంటల సమయం పట్టవచ్చన్నాడు. సమయాభావంతోనే క్రికెట్‌కు ఒలింపిక్స్‌లో చోటు దక్కలేదని, అమెరికాలోనూ ఇటీవల టి10 లీగ్ జరగడంతో అక్కడా క్రికెట్‌కు ఆదరణ లభిస్తోందని గేల్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఎనిమిది జట్ల మధ్య అబుదాబి టి10 లీగ్ జనవరి 28నుంచి జరగనుండగా.. క్రిస్ గేల్ అబుదాబి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. -
ఒక్క ఓవర్.. ఐదు వికెట్లు.. సూపర్ కదా
ఒకే ఓవర్లో ఐదు వికెట్లు తీయడం అనేది కొంచెం కష్టమైన పని.. కానీ దానిని సాధ్యం చేసి చూపించాడు శ్రీలంక ఆటగాడు. ఈ మ్యాచ్ జరిగి ఆరు నెలలు పూర్తి కావొస్తున్నా లీగ్‌కు గుర్తింపు లేకపోవడంతో ఈ అరుదైన ఫీట్ వెలుగులోకి రాలేదు. తాజాగా యూరోపియన్ క్రికెట్ లీగ్ ఈ వీడియోనూ ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అసలు విషయంలోకి వెళితే.. డ్రీమ్11 యూరోపియన్ టీ20 క్రికెట్ టోర్నీ పేరిట ప్రతి ఏటా లీగ్‌ను నిర్వహిస్తూ వస్తుంది. ఈ ఏడాది కూడా మే 31 నుంచి జూన్ 7వరకు లీగ్ జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా మొదట 2021కి వాయిదా వేయాలని భావించారు. కానీ లీగ్‌ను నిర్వహించాలని భావించిన డ్రీమ్ 11 జూన్ 22 నుంచి 26 వరకు టీ10 పేరిట నిర్వహించింది. రోజుకు ఐదు మ్యాచ్‌ల చొప్పున 10ఓవర్ల మ్యాచ్‌లు నిర్వహించిన ఈ లీగ్‌ను కేవలం ఐదు రోజుల్లో ముగించారు. అందులో భాగంగానే జూన్ 24న వింటర్థ్‌హర్, వోల్టెన్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. (చదవండి : జడేజా కమ్‌బ్యాక్ ఇవ్వనున్నాడా!) మొదట బ్యాటింగ్ చేసిన వోల్టెన్ 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. 8వ ఓవర్ వరకు ఒక వికెట్ నష్టానికి 75 పరుగులతో పటిష్టంగా కనిపించిన వోల్టెన్ ఒక్క ఓవర్ తేడాలోనే ఆరు వికెట్లు కోల్పోవడం విశేషం. 8వ ఓవర్ వేసిన శ్రీలంక బౌలర్ డీష్ బన్నెహేకా ఓవర్ తొలి బంతికే వికెట్ తీశాడు. అనంతరం రెండో బాల్ డాట్ వేయగా.. ఆ తర్వాత వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇలా ఇంతకముందు ఒకే ఓవర్లో ఐదు వికెట్లు తీసిన ఘనత టీ20 మ్యాచ్‌లో అల్ అమీన్ హొస్సేన్ పేరిట ఉంది.. అయితే ఇది టీ10 మ్యాచ్ కావడంతో ఈ ఫార్మాట్లో తొలి బౌలర్‌గా బన్నెహేకా నిలిచాడు. కానీ ఈ మ్యాచ్‌కు అంతర్జాతీయ గుర్తింపు లేకపోవడంతో బన్నెహెకా సాధించిన రికార్డు క్రికెట్ చరిత్రలో స్థానం సంపాదించలేకపోయింది. (చదవండి : కోహ్లిని ముంచిన పింక్ బాల్ టెస్ట్) 😳 Ever seen 5 wickets in an Over!?! 😳 -🇨🇭 🏏1000 Live & Exclusive European Cricket Matches in 2021 on @SportsFlick Worldwide + @Dream11 & @FanCode in India! 🏏#dream11 #fancode #sportsflick #cricket @CricketSwiss pic.twitter.com/Q3Y4TmJbvR — European Cricket (@EuropeanCricket) December 15, 2020 ఈ మ్యాచ్‌లో మరో ట్విస్ట్ ఏంటంటే బన్నెహేకా మంచి ప్రదర్శన చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. 99 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వింటర్థ్‌హర్ 78 పరుగుల వద్దే ఆగిపోయింది. 5 రోజుల్లో ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో వోల్టెన్ సీసీపై జూరిచ్ నోమాడ్స్ జట్టు 19 పరుగుల తేడాతో గెలిచి కప్‌ను సొంతం చేసుకుంది. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఐదు వికెట్లు తీసిన ఘనత టీమిండియా బౌలర్ దీపక్ చహర్ పేరిట ఉంది. 2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3.2 ఓవర్లు వేసిన చహర్ 7 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. టీ20లో ఐదు వికెట్ల ఘనత అందుకున్న తొలి బౌలర్‌గా చహర్ నిలవడం విశేషం. -
మూడేళ్లు కాదు.. 30 ఏళ్లు: యువీ
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్-హజల్ కీచ్లు వివాహం జరిగే మూడేళ్లు అయ్యింది. 2016, నవంబర్ 30వ తేదీన వీరిద్దరూ వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం(నవంబర్ 30) భార్య హజల్ కీచ్‌కు యువరాజ్ విన్నూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు. ‘ శుభాకాంక్షలు భార్యామణి గారూ.. మనకు పెళ్లి జరిగి మూడేళ్లే అయ్యింది.. కానీ నాకు మాత్రం ముప్పై ఏళ్లు అయినట్లుంది. హ్యాపీ యానివర్సరీ మై లవ్’ అంటూ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. దీనికి హజల్కీచ్తో కలిసి ఉన్న అందమైన ఫోటోను యువరాజ్ షేర్ చేశాడు. యువరాజ్ పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలిపిన వారిలో కేవలం ఫ్యాన్సే కాకుండా పలువురు క్రికెటర్లు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా యువరాజ్‌కు అభినందనలు తెలియజేశారు. ‘ కంగ్రాట్స్ పాజీ అండ్ హజల్కీచ్’ అని శిఖర్ ధావన్ చెప్పగా, ‘ మీ ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు’ అంటూ హర్భజన్ విషెస్ తెలిపాడు. ‘ సో క్యూటీ’ అంటూ డేవిడ్ వార్నర్ కూడా అభినందనలు తెలియజేశాడు. ఇక బాలీవుడ్ నటుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్‌తో పాటు బిపాసా బసూ, సునీల్ గ్రోవర్లు సైతం యువీకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల అబుదాబిలో జరిగిన టీ10 లీగ్‌లో యువరాజ్ పాల్గొన్నాడు. మరాఠా అరేబియన్స్‌కు యువరాజ్ ప్రాతినిథ్యం వహించగా అతని జట్టు టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో డెక్కన్ గ్లాడియేటర్స్‌ను ఓడించిన మరాఠా అరేబియన్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత యువరాజ్ సింగ్ దేశవాళీ లీగ్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగా గ్లోబర్ టీ20 కెనడా లీగ్‌లో సైతం యువరాజ్ పాల్గొన్నాడు. -
25 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు..
దుబాయ్: ఇంగ్లండ్ యువ క్రికెటర్ విల్ జాక్స్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. దుబాయ్ వేదికగా జరిగిన టీ10 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన జాక్స్ కేవలం 25 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఎనిమిది ఫోర్లు, పదకొండు సిక్సర్లతో చెలరేగి ఆడాడు. ఈ క్రమంలోనే ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు. టీ10 మ్యాచ్‌లో భాగంగా సర్రే జట్టుకు ఆడుతున్న జాక్స్.. లాంక్షైర్ జట్టు బౌలర్లపై బ్యాట్‌తో విరుచుకుపడ్డాడు. ఆది నుంచి బౌండరీలే లక్ష్యంగా చెలరేగిన జాక్స్ పరుగుల వరద పారించాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 5వ ఓవర్ ఆరంభానికి ముందు వ్యక్తిగత స్కోరు 62 వద్ద ఉన్న ఈ హిట్టర్.. ఆ ఓవర్ ముగిసే సమయానికి 98 పరుగులతో నిలిచాడు.కేవలం 14 బంతుల్లోనే అర్ధశతకం మైలురాయిని అందుకున్న జాక్స్.. ఆ తర్వాత 25 బంతుల్లో శతకం మార్క్‌ని చేరుకోవడం విశేషం. 30 బంతుల్లో 105 పరుగులు చేసిన అనంతరం జాక్స్ ఔటయ్యాడు. జాన్స్ జోరుతో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నస్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యఛేదనలో తడబడిన లాన్‌షైర్ 9.3 ఓవర్లలోనే 81 పరుగులకి ఆలౌటైంది. ఫలితంగా సర్రే జట్టు 95 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఇటీవల తిరువనంతపురం వేదికగా భారత్-ఎ జట్టుతో తలపడిన ఇంగ్లండ్ లయన్స్ జట్టులో జాక్స్ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. -
క్రికెట్ సవాల్ మొదలు
విశాఖ స్పోర్ట్స్ : గ్రామీణ క్రీడాకారులకు గట్టి సవాలు విసిరి, ఉత్తేజకరమైన బహుమతులను అందించి ప్రోత్సహించే ప్రతిష్టాత్మక ఎంవీవీ టీ10 చాంపియన్స్ లీగ్ క్రికెట్ టోర్నీ ఉత్సాహకర వాతావరణంలో మొదలైంది. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధులలోని జట్లు హోరాహోరీగా తలపడి, వాటిలోని అత్యుత్తమ జట్లు తుది అంచెలో ఢీకొనే ఈ టోర్నీలో.. భీమిలి అంచె పోటీలను వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ శనివారం నగర శివార్లలోని సాంకేతిక ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ నిరంతర సాధనతో సామర్ధ్యాన్ని మె రుగు పరుచుకోవాలని, అలా ఉన్నత స్థాయికి చేరుకోవాలని గ్రామీణ క్రీడాకారులకు పిలుపునిచ్చారు.అందివచ్చిన అవకాశాల్ని వినియోగించుకుని క్రీడాకారులుగా ఎదగాలని దిశానిర్దేశం చేశారు. ఎంవీవీ చాంపియన్‌లీగ్ రాజకీయ కార్యక్రమం కాదని నియోజకవర్గంలో క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించడానికేనని అన్నారు. తొలుత వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో నలభై జట్లు పోటీపడుతున్నాయని వాటిలో ఫైనల్స్ ఆడిన రెండు జట్లకు పార్లమెంట్ నియోజకవర్గ లీగ్ పోటీలకు అర్హత కల్పించనున్నారని తెలి పారు. వైఎస్సార్సీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తైనాల విజయకుమార్ మా ట్లాడుతూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈ పోటీలను నిర్వహిస్తున్నారని ప్రతీ సెగ్మెంట్ పోటీలలో తొలిరెండు స్థానాల్లో నిలిచిన వారు ఫైనల్స్ లీగ్‌కు అర్హత సాధిస్తారని తెలిపారు. పార్టీ సీనియర్ నాయకుడు కొడాలి నాని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేదరికంలో ఉన్న క్రీడాకారులు వెలుగులోకి వచ్చేందుకు ఇలాంటి పోటీల వల్ల ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. తొలుత పోటీల నిర్వాహక కమిటీ చైర్మన్, విశాఖ పార్లమెంట్ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ జనవరి ఐదునుంచి పదోతేదీవరకు సెమీస్, ఫైనల్స్ పోటీలు విశాఖలోని పోర్ట్ స్టేడియంలో జరగనున్నాయన్నారు. తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి రూ. 2 లక్షల ప్రోత్సాహక బహుమతులు అందచేయనున్నామన్నారు. బొత్స సత్యన్నారాయణ గాల్లోకి బెలూన్లను విడిచి పోటీలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం బొత్స బ్యాటింగ్ చేయగా కొడాలి నాని బౌలింగ్ చేసారు. మళ్ల వికెట్ కీపింగ్ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. పోటీల ప్రారంభంలో పార్టీ నాయకులు దివంగత సీఎం రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టీడీపీ పాలనకు అంతిమ ఘడియలు పీఎంపాలెం (భీమిలి): రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు పరచడంలో విఫలమైన టీడీపీ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు దాపురించాయని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. చాంపియన్ లీగ్ టీ10 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీపై విమర్శలు సంధించా రు. కల్లబొల్లి మాటలు చెప్పి అందలమెక్కి ఇచ్చిన వాగ్దానాలు అమలు పరచడంలో విఫలమైన సీఎం చంద్రబాబును రాష్ట్ర ప్రజలు క్షమిం చరన్నారు.హుందాతనానికి మారుపేరైన జననేత జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారన్నారు.టీడీపీ నేతలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈ ప్రభంజనాన్ని నిలువరించడం అసాధ్యమన్నారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో ప్రజా వంచన తప్ప చేసిందేమీ లేదని బొత్స విమర్శించారు. నిరుద్యోగ భృతి పేరుతో లక్షలాది మంది నిరుద్యోగులను చంద్రబాబు నిలువునా మోసం చేసారని విమర్శించారు.రానున్న ఎన్నికలలో టీడీపీ గట్టిగా బుద్ధి చెప్పాలని యువతకు పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో భీమిలి సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, నగర పరిధిలోని నియోజకవర్గాల సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, కేకే రాజు, తిప్పల నాగిరెడ్డి, డాక్టర్ పీవీ రమణమూర్తి, ఎస్‌కోట నియోజకవర్గం సమన్వయ కర్త కడుబండ శ్రీనివాసరావు, అక్కరమాని వెంకటరావు, గాదె రోశిరెడ్డి, పోతిన శ్రీనివాసరావు, స్థానిక నాయకులు జెఎస్ రెడ్డి, గుమ్మడి మధు, వంకాయల మారుతీ ప్రసాద్, గరికిన గౌరి, మల్లువలస జగదీశ్వరరావు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నాయకులు లభిమానులు పాల్గొన్నారు. -
16 బంతుల్లో 8 సిక్సర్లు, 6 ఫోర్లు
షార్జా: దుబాయ్ వేదికగా జరుగుతున్న టీ10 లీగ్‌లో అఫ్గాన్ క్రికెటర్ మహమ్మద్ షెహ్జాద్ రెచ్చిపోయాడు. కేవలం 16బంతుల్లో 8 సిక్సర్లు, 6 ఫోర్లతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో అజేయంగా 74 పరుగులు సాధించిన షెహ్జాద్.. 72 పరుగుల్ని ‘బౌండరీ’ల రూపంలోనే సాధించాడంటే అతని సుడిగాలి ఇన్నింగ్స్ ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు టీ10 లీగ్ రెండో సీజన్లో భాగంగా ఆరంభపు మ్యాచ్‌లోనే షెహ్జాద్ మెరుపులు మెరిపించాడు. సింధిస్ విసిరిన 95 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో షెహజాద్, మెకల్లమ్‌లు ఇన్నింగ్స్ ఆరంభించారు. ఒకవైపు మెకల్లమ్ ఆచితూచి ఆడితే, షెహ్జాద్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 12 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన షెహ్జాద్.. టీ10లీగ్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డును కూడా నమోదు చేశాడు. షేన్ వాట్సన్ మినహా.. ప్రత్యర్థి జట్టు సింధిస్ 94/6 పరుగులతో ఇన్నింగ్స్ ముగించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సింధిస్ జట్టులో షేన్ వాట్సన్ (20 బంతుల్లో 42 పరుగులు) మాత్రమే ఆకట్టుకోగా, మిగిలినవారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. -
టీ10 లీగ్ నుంచి తప్పుకొంటున్నా : షోయబ్
ఈ నెల(నవంబరు) 23 నుంచి ఆరంభం కానున్న టీ10 లీగ్ సెకండ్ సీజన్ నుంచి తప్పుకొంటున్నట్లు పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తెలిపాడు. తన భార్యా, కొడుకుతో కలిసి సమయం గడపాలనుకుంటున్నానని, ఈ కారణంగానే లీగ్ నుంచి వైదొలగుతున్నట్లు పేర్కొన్నాడు. ‘టీ10 లీగ్‌లో భాగం కాలేకపోతున్నాను. నా కుటుంబంతో కలిసి సమయం గడపాలని అనుకుంటున్నాను. ఇది కచ్చితంగా కఠినమైన నిర్ణయమే. సానియా కూడా నేను ఆడాలని కోరుకుంటోంది. కానీ నా భార్యా, కొడుకు కోసం కూడా సమయం కేటాయించాలిగా. వాళ్లిద్దరి కంటే విలువైంది ఇంకేమీ లేదు. మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా’ అంటూ షోయబ్ మాలిక్ ట్వీట్ చేశాడు. కాగా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, షోయబ్‌లకు 2010 ఏప్రిల్ 12న హైదరాబాద్‌లో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. గత నెల (అక్టోబరు) 30న ఈ క్రీడా దంపతులు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇక యూఏఈలోని షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న టీ10 లీగ్ సెకండ్ సీజన్ నవంబరు 23న ప్రారంభమై డిసెంబరు 2న ముగియనుంది. 2017 టీ10 లీగ్‌లో భాగంగా పంజాబీ లెజెండ్స్ టీమ్‌కు షోయబ్ ప్రాతినిథ్యం వహించాడు. మొత్తం ఎనిమిది జట్లు తలపడే ఈ లీగ్ ఫస్ట్ సీజన్లో కేరళ కింగ్స్ టీమ్‌గా విన్నర్‌గా నిలవగా, పంజాబీ లెజెండ్స్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. I announce with mixed feelings that I will be not be part of @PunjabiLegends_ #T10League to spend time with my family. This was a tough decision (sp since my wife thinks I should play) but I want to be with my wife and son more than anything else. Hope you all will understand 🤗 — Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) November 12, 2018 -
మరోసారి క్రికెట్ ఫీల్డ్‌లోకి జహీర్
న్యూఢిల్లీ: ఒకప్పటి భారత క్రికెట్ జట్టు ప్రధాన పేసర్ జహీర్ ఖాన్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. వచ్చే నెలలో షార్జాలో ఆరంభం కానున్న టీ10 లీగ్‌లో జహీర్‌ఖాన్ ఆడనున్నాడు. ఈ టోర్నీ నవంబర్ 23 నుంచి ఆరంభం కానుంది. తొలి ఎడిషన్‌లో వీరేంద్ర సెహ్వాగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఈ లీగ్‌లో భారత్ నుంచి అప్పుడు ఒక్కడే ఆడగా ఈసారి మాత్రం పలువురు భాగస్వామ్యం అవుతున్నారు. జహీర్ ఖాన్, ప్రవీణ్ కుమార్, ఆర్పీ సింగ్, ఆర్ఎస్ సోధి, సుబ్రమణ్యం బద్రీనాథ్‌తో పాటు మరో ముగ్గురు ఆడనున్నారు. ‘టీ10 రెండో ఎడిషన్‌లో హై ప్రొఫైల్ కల్గిన ఎనిమిది మంది భారత క్రికెటర్లు ఆడటం చాలా సంతోషకరం. రానున్న కాలంలో ఈ లీగ్‌లో దేశవిదేశాలకు చెందిన ఎక్కువ ఆటగాళ్లను ఆకర్షించేందుకు ఇది ఉపయోగపడుతుంది’ అని లీగ్ ఛైర్మన్ షాజీ ఉల్ ముల్క్ తెలిపారు.