దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాక్వస్ కల్లిస్ తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న యూఎస్ మాస్టర్ లీగ్‌లో కాలిఫోర్నియా నైట్స్‌కు కల్లిస్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా టెక్సాస్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా 47 ఏళ్ల కల్లిస్ చేలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
తన ట్రెడ్‌మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. 31 బంతులు ఎదుర్కొన్న కల్లిస్.. 8 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 64 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మిలాంద్ కుమార్( 28 బంతుల్లో 76 నాటాట్) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దిరి సునామీ ఇన్నింగ్స్ ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన కాలిఫోర్నియా నైట్స్ నిర్ణీత ఓవర్లలో 158 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టెక్సాస్ ఛార్జర్స్ నిర్ఱీత 10 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 110 పరుగులు మాత్రమే చేయగల్గింది. టెక్సాస్ బ్యాటర్లలో ముక్తర్ ఆహ్మద్(33), ఉపుల్ తరంగా(27) పరుగులతో రాణించారు. కాలిఫోర్నియా బౌలర్లలో నర్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. సిడిల్, పావెల్, సుయాల్ తలా వికెట్ సాధించారు.
చదవండి: World cup 2023: బీసీసీఐకి హెచ్‌సీఏ షాక్... మరోసారి ప్రపంచ కప్ షెడ్యూల్‌లో మార్పులు?
We've traveled back in time to witness @jacqueskallis75 deliver 🔝 batting performance for today's match 1!
— Star Sports (@StarSportsIndia) August 19, 2023
Tune-in to #USMastersT10OnStar
Tomorrow | 6:30 PM onwards | Star Sports 1 & Star Sports 1 Hindi#Cricket pic.twitter.com/JLdxcH3idf
Comments
Please login to add a commentAdd a comment