ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ కోలకతా నైట్‌రైడర్స్ కొత్త మెంటార్ వేటలో పడింది. ఈ ఏడాది సీజన్‌లో కేకేఆర్ మెంటార్ పనిచేసిన గౌతం గంభీర్.. భారత హెడ్‌కోచ్‌గా వెళ్లిపోవడంతో ఆ పోస్ట్ ఖాళీ అయింది. దీంతో గంభీర్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు కేకేఆర్ యాజమాన్యం తమ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
అయితే మెంటార్ రేసులో ఇప్పటికే కుమార సంగర్కర, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్లు వినిపించగా.. తాజాగా ఈ లిస్ట్‌లోకి దక్షిణాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కల్లిస్ పేరు చేరింది. ‘సంగ్‌బాద్ ప్రతిదిన్’ రిపోర్ట్ ప్రకారం.. కేకేఆర్ మెంటార్ రేసులో సంగర్కకర, పాంటింగ్ కంటే కల్లిస్ ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తోంది.
కల్లిస్‌కు కేకేఆర్ ఫ్రాంచైజీతో మంచి అనుబందం ఉంది. ఈ దిగ్గజ ఆల్‌రౌండర్ గతంలో గంభీర్ కెప్టెన్సీలో కేకేఆర్ తరపున రెండు సీజన్ల పాటు ఆడాడు. అంతేకాకుండా కేకేఆర్ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గానూ కల్లిస్ పనిచేశాడు. ఈ నేపథ్యంలోనే కేకేఆర్ యాజమాన్యం కల్లిస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
చదవండి: IPL 2025: డుప్లెసిస్‌పై వేటు..? ఆర్సీబీ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ఆటగాడు!
Comments
Please login to add a commentAdd a comment