జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ రెండో ఎడిషన్ (2024) విజేతగా జోబర్గ్ బంగ్లా టైగర్స్ అవతరించింది. నిన్న (సెప్టెంబర్ 29) జరిగిన ఫైనల్లో జోబర్గ్ బంగ్లా టైగర్స్.. కేప్‌టౌన్ సాంప్ ఆర్మీపై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా టైగర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. మొహమ్మద్ షెహజాద్ (25 బంతుల్లో 44; 6 ఫోర్లు, సిక్స్), కుసాల్ పెరీరా (11 బంతుల్లో 33; ఫోర్, 4 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సాంప్ ఆర్మీ బౌలర్లలో నికోల్సన్ గోర్డన్ 2, ఖైస్ అహ్మద్, అమిర్ హమ్జా తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సాంప్ ఆర్మీ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 124 పరుగులకే పరిమితమైంది. డేవిడ్ మలాన్ (28 బంతుల్లో 62 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో విరుచుకుపడినప్పటికీ సాంప్ ఆర్మీని గెలిపించలేకపోయాడు. బ్రియాన్ బెన్నెట్ 36, జాక్ టేలర్ 23 (నాటౌట్) పరుగులు చేయగా.. రోహన్ ముస్తఫా డకౌటయ్యాడు. టైగర్స్ బౌలర్లలో ఆడమ్ మిల్నేకు రెండు వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్‌లో 44 పరుగులు చేసిన మొహమ్మద్ షెహజాద్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
చదవండి: పూరన్ సుడిగాలి శతకం
Comments
Please login to add a commentAdd a comment