Sikander Raza
-
పాకిస్తాన్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం జింబాబ్వే జట్ల ప్రకటన
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం రెండు వేర్వేరు జింబాబ్వే జట్లను ఇవాళ (నవంబర్ 18) ప్రకటించారు. వన్డే జట్టుకు కెప్టెన్‌గా క్రెయిస్ ఎర్విన్.. టీ20 జట్టు సారధిగా సికందర్ రజా ఎంపికయ్యారు. వన్డే జట్టులో కొత్తగా ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు (ట్రెవర్ గ్వాండు, తషింగ ముసెకివా, టినొటెండా మపోసా) చోటు దక్కింది. వన్డే జట్టులో సికందర్ రజా, సీన్ విలియమ్స్, బ్లెస్సింగ్ ముజరబాని, రిచర్డ్ నగరవ లాంటి సీనియర్ ప్లేయర్లు.. క్లైవ్ మదండే, బ్రియాన్ బెన్నెట్, డియాన్ మైర్స్ లాంటి యువ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. టీ20 జట్టులో వన్డే జట్టు కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, సీన్ విలియమ్స్, జాయ్‌లార్డ్ గుంబీకు చోటు దక్కలేదు. పాకిస్తాన్ జట్టు నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో పాక్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌ల కోసం పాక్ జట్లను ఇదివరకే ప్రకటించారు. ఈ సిరీస్‌ల కోసం పాక్ మేనేజ్మెంట్ బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది లాంటి సీనియర్లకు రెస్ట్ ఇచ్చింది.జింబాబ్వే పర్యటనలో పాక్ షెడ్యూల్..నవంబర్ 24- తొలి వన్డే నవంబర్ 26- రెండో వన్డేనవంబర్ 28- మూడో వన్డేడిసెంబర్ 1- తొలి టీ20డిసెంబర్ 3- రెండో టీ20డిసెంబర్ 5- మూడో టీ20మ్యాచ్‌లన్నీ బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరుగనున్నాయి.జింబాబ్వే వన్డే జట్టు: క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, జాయ్‌లార్డ్ గుంబీ, ట్రెవర్ గ్వాండు, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, బ్రాండన్ మవుటా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజరాబనీ, డియాన్ మైర్స్, రిచర్డ్ నగరవ, సికందర్ రజా, సీన్ విలియమ్స్.జింబాబ్వే టీ20 జట్టు: సికందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, ట్రెవర్ గ్వాండు, క్లైవ్ మదాండే, వెస్లీ మాధవెరె, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్రాండన్ మవుటా, తషింగ ముసెకివా, బ్లెస్సింగ్ ముజరాబనీ, డియాన్ మైర్స్, రిచర్డ్ నగరవ -
స్కై, విరాట్లను అధిగమించిన సికందర్ రజా
జింబాబ్వే టీ20 జట్టు కెప్టెన్ సికందర్ రజా ఓ విషయంలో టీమిండియా స్టార్లు సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లిలను అధిగమించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా గాంబియాతో నిన్న (అక్టోబర్ 23) జరిగిన మ్యాచ్‌లో సికందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇది అతని కెరీర్లో 17వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల రికార్డు రజా, స్కై, విరాట్, విరన్‌దీప్ సింగ్‌ల పేరిట సంయుక్తంగా ఉండేది. వీరంతా తలో 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు. తాజాగా రజా.. స్కై, విరాట్, విరన్లను అధిగమించి తన పేరిట సింగిల్‌గా ఈ రికార్డును నమోదు చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో సికందర్ రజా, స్కై, విరాట్, విరన్ తర్వాత రోహిత్ శర్మ (14), మొహమ్మద్ నబీ (14) ఉన్నారు.జింబాబ్వే, గాంబియా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే వరల్డ్ రికార్డు స్కోర్ నమోదు చేసింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఏకంగా 344 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే అత్యధిక టీమ్ స్కోర్. ఈ మ్యాచ్‌లో సికందర్ రజా సుడిగాలి శతకం (43 బంతుల్లో 133 నాటౌట్; 7 ఫోర్లు, 15 సిక్సర్లు) బాదాడు. బ్రియాన్ బెన్నెట్ (26 బంతుల్లో 50; 7 ఫోర్లు, సిక్స్), మరుమణి (19 బంతుల్లో 62; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), మదండే (17 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలు సాధించారు. అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గాంబియా 14.4 ఓవర్లలో 54 పరుగులకే కుప్పకూలి 290 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చదవండి: శ్రీలంక జోరు.. విండీస్ బేజారు -
జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ విజేత జోబర్గ్ బంగ్లా టైగర్స్
జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ రెండో ఎడిషన్ (2024) విజేతగా జోబర్గ్ బంగ్లా టైగర్స్ అవతరించింది. నిన్న (సెప్టెంబర్ 29) జరిగిన ఫైనల్లో జోబర్గ్ బంగ్లా టైగర్స్.. కేప్‌టౌన్ సాంప్ ఆర్మీపై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా టైగర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. మొహమ్మద్ షెహజాద్ (25 బంతుల్లో 44; 6 ఫోర్లు, సిక్స్), కుసాల్ పెరీరా (11 బంతుల్లో 33; ఫోర్, 4 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సాంప్ ఆర్మీ బౌలర్లలో నికోల్సన్ గోర్డన్ 2, ఖైస్ అహ్మద్, అమిర్ హమ్జా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సాంప్ ఆర్మీ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 124 పరుగులకే పరిమితమైంది. డేవిడ్ మలాన్ (28 బంతుల్లో 62 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో విరుచుకుపడినప్పటికీ సాంప్ ఆర్మీని గెలిపించలేకపోయాడు. బ్రియాన్ బెన్నెట్ 36, జాక్ టేలర్ 23 (నాటౌట్) పరుగులు చేయగా.. రోహన్ ముస్తఫా డకౌటయ్యాడు. టైగర్స్ బౌలర్లలో ఆడమ్ మిల్నేకు రెండు వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్‌లో 44 పరుగులు చేసిన మొహమ్మద్ షెహజాద్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: పూరన్ సుడిగాలి శతకం -
సికందర్ రజా ఆల్‌రౌండ్ షో.. నైట్‌రైడర్స్ నిష్క్రమణ
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్ కథ ముగిసింది. వరుసగా రెండో సీజన్లోనూ ఆ జట్టు ఎలిమినేటర్ దశ దాటలేకపోయింది. నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిటల్స్.. నైట్‌రైడర్స్‌ను 85 పరుగుల తేడాతో చిత్తు చేసి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. క్యాపిటల్స్ ఆటగాడు సికందర్ రజా (40, 2/27) ఆల్‌రౌండ్ షోతో నైట్‌రైడర్స్‌ను ఓడించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. టామ్ బాంటన్ (44), ఏబెల్ (41), సామ్ బిల్లింగ్స్ (46 నాటౌట్), సికందర్ రజా (40) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బౌలర్లలో సాబిర్ అలీ 2, విల్లే, జాషువ లిటిల్, ఫేబియన్ లిటిల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 189 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన నైట్‌రైడర్స్.. సికందర్ రజాతో పాటు స్కాట్ కుగ్గెలిన్ (4/17), జహీర్ ఖాన్ (2/25), ఓలీ స్టోన్ (1/18) విజృంభించడంతో 16.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ విల్లే (36) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సామ్ హెయిన్ (29), జో క్లార్క్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, ఈ సీజన్ క్వాలియర్-1కు ఎంఐ ఎమిరేట్స్, గల్ఫ్ జెయింట్స్ ఇదివరకే అర్హత సాధించగా.. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో ఓడిన జట్టు ఫిబ్రవరి 15న జరిగే క్వాలిఫయర్-2లో దుబాయ్ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. ఎమిరేట్స్, గల్ఫ్ జెయింట్స్ మధ్య క్వాలియర్-1 మ్యాచ్ ఇవాళ జరుగనుంది. -
రాణించిన మాథ్యూస్, హసరంగ.. సికందర్ రజా ఆల్‌రౌండ్ షో వృధా
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జింబాబ్వేతో (కొలొంబో వేదికగా) జరిగిన తొలి టీ20లో శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. సికందర్ రజా (62) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. సికందర్ రజా మినహా జింబాబ్వే ఇన్నింగ్స్‌లో అందరూ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. కమున్హుకంవే 26, క్రెయిగ్ ఎర్విన్ 10, సీన్ విలియమ్స్ 14, ర్యాన్ బర్ల్ 5 పరుగులు చేసి ఔట్ కాగా.. బ్రియాన్ బెన్నెట్ 10, జోంగ్వే 13 పరుగులతో అజేయంగా నిలిచారు. లంక బౌలర్లలో తీక్షణ (4-0-16-2), హసరంగ (4-0-19-2), చమీరా (4-0-38-1) వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక సైతం తడబడింది. ఆ జట్టు అతి కష్టం మీద చివరి బంతికి విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో ఏంజెలో మాథ్యూస్ (38 బంతుల్లో 46; 5 ఫోర్లు, సిక్స్) వరుసగా రెండు బౌండరీలు బాది లంక విజయాన్ని ఖరారు చేశాడు. ఆతర్వాత చమీరా ఐదు, ఆరు బంతులకు ఆరు పరుగులు (4, 2) సాధించి లంకను విజయతీరాలకు చేర్చాడు. లంక ఇన్నింగ్స్‌లో మాథ్యూస్, షనక (18 బంతుల్లో 26 నాటౌట్; 4 ఫోర్లు) రాణించగా.. జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా (4-0-13-3) బంతితోనూ సత్తా చాటాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ 2, రిచర్డ్ నగరవ, వెల్లింగ్టన్ మసకద్జ తలో వికెట్ పడగొట్టారు. రెండో టీ20 ఇదే వేదికపై జనవరి 16న జరుగనుంది. -
శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్.. జింబాబ్వే జట్టు ప్రకటన
జనవరి 6 నుంచి శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం జింబాబ్వే జట్టును ఇవాళ (జనవరి 1) ప్రకటించారు. వన్డే, టీ20లకు వేర్వేరు జట్లను ప్రకటించిన జింబాబ్వే క్రికెట్ బోర్డు.. వన్డే సారధిగా క్రెయిగ్ ఎర్విన్‌ను, టీ20 కెప్టెన్‌గా సికందర్ రజాను ఎంపిక చేసింది. గాయం కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఎర్విన్.. తిరిగి జట్టులో చేరడంతో పాటు వన్డే జట్టు పగ్గాలు చేపట్టాడు. మరోవైపు ఈ సిరీస్‌ల కోసం శ్రీలంక సైతం ప్రిలిమినరీ జట్లను ప్రకటించింది. లంక జట్టు సైతం రెండు ఫార్మాట్లలో కెప్టెన్లను మార్చింది. వన్డే జట్టుకు కుశాల్ మెండిస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. టీ20 జట్టుకు హసరంగ సారధిగా ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లలో తొలుత వన్డేలు, ఆతర్వాత టీ20లు జరుగనున్నాయి. జనవరి 6, 8, 11 తేదీల్లో వన్డేలు.. 14, 16, 18 తేదీల్లో టీ20లు జరుగనున్నాయి. అన్ని మ్యాచ్‌లకు కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం వేదిక కానుంది. జింబాబ్వే వన్డే జట్టు: క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), ఫరాజ్ అక్రన్, ర్యాన్ బర్ల్, జాయ్‌లార్డ్ గుంబీ, ల్యూక్ జోంగ్వే, తకుద్జ్వనషే కైతానో, టినాషే కమున్హుకమ్వే, క్లైవ్ మదండే, వెల్లింగ్టన్ మసకద్జ, టాపివా ముఫుద్జా, టోనీ మున్యోంగా, బ్లెస్సింగ్ ముజరబానీ, రిచర్డ్ నగరవ, సికందర్ రజా, మిల్టన్ షుంభ జింబాబ్వే టీ20 జట్టు: సికందర్ రాజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, క్రెయిగ్ ఎర్విన్, జాయిలార్డ్ గుంబీ, ల్యూక్ జాంగ్వే, టినాషే కమున్హుకమ్వే, క్లైవ్ మదండే, వెల్లింగ్టన్ మసకద్జ, కార్ల్ ముంబా, టోనీ మున్యోంగా, బ్లెస్సింగ్ ముజరబానీ, ఐన్స్లీ ఎండిలోవు. రిచర్డ్ నగరవ, మిల్టన్ షుంభ శ్రీలంక వన్డే ప్రిలిమినరీ స్క్వాడ్: కుశాల్ మెండిస్ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, సాహన్ అరాచ్చిగే, నువనిదు ఫెర్నాండో, దసున్ షనక, కమిందు మెండిస్, చమిక కరుణరత్నే, జనిత్ లియనాగే, వనిందు హసరంగ, మషీశ్ తీక్షణ, దిల్షాన్ మదుషంక, దుష్మంత చమీరా, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మదుషన్, అషిత ఫెర్నాండో, అకిల ధనంజయ, జెఫ్రీ వాండర్సే, చమికా గుణశేఖర శ్రీలంక టీ20 ప్రిలిమినరీ స్క్వాడ్: వనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పథుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, సధీర సమరవిక్రమ, దసున్ షనక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వ, మహీశ తీక్షణ, కుశాల్ జనిత్ పెరీరా, భానుక రాజపక్ష, కమిందు మెండిస్, దునిత్ వెల్లలగే, అకిల ధనంజయ, జెఫ్రీ వాండర్సే, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, దిల్షన్ మధుషంక, బినుర ఫెర్నాండో, నుదాన్ తుషార, ప్రమోద్ మధుషన్, మతీష పతిరణ -
సికందర్ రజా ఆల్‌రౌండ్ షో.. ఉత్కంఠ పోరులో జింబాబ్వే గెలుపు
సికందర్ రజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (4-0-28-3, 42 బంతుల్లో 65; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో స్వదేశంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో జింబాబ్వే వికెట్ తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో 11వ నంబర్ ఆటగాడు ముజరబానీ ఆఖరి బంతికి 2 పరుగులు తీసి జింబాబ్వేను గెలిపించాడు. చివరి ఓవర్లలో ఐర్లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను జింబాబ్వే ఆటగాళ్లు ఆఖరి బంతి వరకు తీసుకెళ్లారు. 18 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన దశలో జింబాబ్వే ఆటగాళ్లు తడబడ్డారు. 18వ ఓవర్లో వికెట్ నష్టపోయి 5 పరుగులు, 19వ ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి 4 పరుగులు, ఆఖరి ఓవర్లో వికెట్ కోల్పోయి 9 పరుగులు చేసి అతి కష్టం మీద విజయతీరాలకు చేరారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. సికందర్ రజా, నగరవ (4-0-23-2), ముజరబానీ (4-0-24-2), సీన్ విలియమ్స్ (3-0-18-1) ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఐరిష్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ బల్బిర్నీ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. సికందర్ రజా రాణించడంతో సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. అయితే ఇన్నింగ్స్ ఆఖర్లో ఐర్లాండ్ బౌలర్లు అనూహ్యంగా పుంజుకుని జింబాబ్వేకు గెలుపును అంత ఈజీగా దక్కనీయలేదు. అతి కష్టం మీద జింబాబ్వే చివరి బంతికి విజయం సాధించింది. ఐరిష్ బౌలర్లలో మార్క్ అదైర్, జాషువ లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జార్జ్ డాక్రెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సికందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. రజాకు ఈ ఏడాది టీ20ల్లో ఇది ఎనిమిదో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కావడం విశేషం. కాగా, 3 టీ20లు, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఐర్లాండ్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. -
విరాట్ కోహ్లిని దాటేసిన సికందర్ రజా
జింబాబ్వే ఆటగాడు, ఆ దేశ టీ20 జట్టు కెప్టెన్ సికందర్ రజా ఓ విషయంలో దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లిని అధిగమించాడు. టీ20 వరల్డ్‌కప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో భాగంగా నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న రజా.. ఈ ఏడాది అత్యధిక సార్లు ఈ అవార్డు గెలుచుకున్న ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రజా ఈ రికార్డు సాధించే క్రమంలో విరాట్‌ను వెనక్కునెట్టి అగ్రస్థానానికి చేరాడు. కోహ్లి ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో 6 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకోగా.. సికందర్ రజా 7 అవార్డులతో టాప్‌లో నిలిచాడు. రజా ప్రస్తుత వరల్డ్‌కప్ క్వాలిఫయర్ టోర్నీలోనే మూడుసార్లు (టాంజానియా, రువాండ, నైజీరియా) ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు గెలవడం విశేషం. ఇదిలా ఉంటే, నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో రజా ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్తో (3-1-13-2, 37 బంతుల్లో 65; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగడంతో జింబాబ్వే 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైజీరియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగుల నామమాత్రపు స్కోర్ చేయగా.. జింబాబ్వే కేవలం 14 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో జింబాబ్వే 2024 టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించేందుకు మరింత చేరువైంది. ఇవాళ కెన్యాతో జరిగే మ్యాచ్‌లో ఈ జట్టు గెలిస్తే నమీబియాతో పాటు టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది. -
పసికూన చేతిలో పరాభవం.. కెప్టెన్ మార్పు.. నూతన సారధిగా స్టార్ ఆల్‌రౌండర్
జింబాబ్వే క్రికెట్ బోర్డు తమ టీ20 జట్టుకు నూతన కెప్టెన్‌ను నియమించింది. ఇటీవల స్వదేశంలో పసికూన నమీబియాతో చేతిలో ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు ఆల్ ఫార్మాట్ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్‌పై వేటు వేసింది. ఎర్విన్ స్థానంలో జింబాబ్వే టీ20 జట్టు సారధిగా స్టార్ ఆల్‌రౌండర్ సికందర్ రజా నియమించబడ్డాడు. ఎర్విన్ టెస్ట్, వన్డే జట్లకు కెప్టెన్‌గా పరిమితం చేయబడ్డాడు. వచ్చే నెలలో జరుగబోయే టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌ను దృష్టిలో ఉంచుకుని జింబాబ్వే క్రికెట్ బోర్డు ఈ కీలక మార్పు చేసింది. జింబాబ్వే క్రికెట్ బోర్డు టీ20 జట్టు కెప్టెన్‌ను మార్చడంతో పాటు మరిన్ని కీలక మార్పులు కూడా చేసింది. మాజీ హెడ్ కోచ్ డేవ్ హటన్‌కు మరోసారి అవే బాధ్యతలు అప్పజెప్పింది. అదనంగా హటన్‌కు సెలక్షన్ ప్యానెల్లో చోటు కల్పించింది. హటన్తో పాటు మాజీ కెప్టెన్ ఎల్టన్ చిగుంబరకు కూడా సెలక్షన్ ప్యానెల్లో చోటు దక్కింది. జింబాబ్వే క్రికెట్ కమిటీ నూతన చైర్మన్‌గా బ్లెస్సింగ్ గొండోను నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా హమిల్టన్ మసకద్జ, కెన్యోన్ జెహ్లా, రసెల్ టిఫిన్, జూలియా చిబాబ, డేవ్ హటన్, చిగుంబరలకు చోటు దక్కింది. కాగా, స్వదేశంలో ఇటీవల నమీబియాతో జరిగిన టీ20 సిరీస్‌లో జింబాబ్వే 2-3 తేడాతో ఓటమిపాలైంది. -
పెను సంచలనం.. విండీస్‌ను మట్టికరిపించిన పసికూన
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో పెను సంచలనం నమోదైంది. పసికూన జింబాబ్వే.. టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను మట్టికరిపించింది. హరారే వేదికగా ఇవాళ (జూన్ 24) జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో జింబాబ్వే.. తమకంటే ఎన్నో రెట్లు పటిష్టమైన వెస్టిండీస్‌ను 35 పరుగుల తేడాతో ఓడించింది. సికందర్ రజా (68, 2/45) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో, టెండాయ్ చటార (3/52), బ్లెస్సింగ్ ముజరబాని (2/33), రిచర్డ్ నగరవ (2/25) అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో జింబాబ్వేను విజయతీరాలకు చేర్చారు. ఓ మోస్తరు లక్ష్యఛేదనలో జింబాబ్వే బౌలర్లు మూకుమ్మడిగా రాణించి, తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. 49.5 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటైంది. సికందర్ రజాతో పాటు ర్యాన్ బర్ల్ (50), క్రెయిగ్ ఎర్విన్ (47) రాణించగా.. గుంబీ (26), సీన్ విలియమ్స్ (23) పర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో కీమో పాల్ 3, అల్జరీ జోసఫ్, అకీల్ హొసేన్ చెరో 2, కైల్ మేయర్స్, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 269 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. ఆదిలోనే తడబడింది. ఆ జట్టు 46 పరుగులకే 2 వికెట్లు (బ్రాండన్ కింగ్ (20), జాన్సన్ ఛార్లెస్ (1)) కోల్పోయింది. కైల్ మేయర్స్ (56), షాయ్ హోప్ (30), పూరన్ (34), రోస్టన్ ఛేజ్ (44) విండీస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. జింబాబ్వే బౌలర్లు క్రమంగా వికెట్లు పడగొట్టడంతో విండీస్ ఓటమిని ఎదుర్కోక తప్పలేదు. ఆ జట్టు 44.4 ఓవర్లలో 233 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సికందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. -
సికందర్ రజా మాయాజాలం.. అయినా భారీ స్కోర్ చేసిన నెదర్లాండ్స్
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023 గ్రూప్-ఏలో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (జూన్ 20) జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు విక్రమ్‌జిత్ సింగ్ (88), మ్యాక్స్ ఒడౌడ్ (59), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (83), ఆఖర్లో సకీబ్ జుల్ఫికర్ (34 నాటౌట్) చెలరేగడంతో డచ్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు స్కోర్ చేసింది. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా (4/55), రిచర్డ్ నగరవ (2/40) అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మిగతా బౌలర్లను డచ్ బ్యాటర్లు ఆడుకున్నారు. జింబాబ్వే మొత్తం 8 మంది బౌలర్లను ప్రయోగించినా పరుగులను నియంత్రించలేకపోయింది. నెదర్లాండ్స్ కోల్పోయిన 6 వికెట్లలో 4 క్లీన్ బౌల్డ్ అయినవే కావడం విశేషం. సికందర్ రజా ముగ్గురిని, నగరవ ఒకరిని క్లీన్ బౌల్డ్ చేశారు. షయాన్ జహంగీర్ సూపర్ సెంచరీ.. ఇవాలే జరుగుతున్న మరో గ్రూప్-ఏ మ్యాచ్‌లో యూఎస్ఏ-నేపాల్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ.. 49 ఓవర్లలో 207 పరుగులు చేసి ఆలౌటైంది. వికెట్‌కీపర్ షయాన్ జహంగీర్ (79 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకంతో యూఎస్ఏను ఆదుకున్నాడు. జహంగీర్‌కు సుశాంత్ మొదానీ (42), గజానంద్ సింగ్ (26) ఓ మోస్తరుగా సహకరించడంతో యూఎస్ఏ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. నేపాల్ బౌలర్లలో కరణ్ 4, గుల్షన్ షా 3, దీపేంద్ర సింగ్ 2, లలిత్ రాజబంశీ ఓ వికెట్ పడగొట్టారు. -
ఐపీఎల్ 2023 వేలంలో కోట్లు కొల్లగొట్టబోయే ఆటగాళ్లు వీళ్లే..!
టీ20 వరల్డ్‌కప్-2022లో సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకున్న వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు చెందిన ఫ్రాంచైజీలు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి. కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరిగే ఐపీఎల్-2023 మినీ వేలంలో ఆ ఆటగాళ్ల కొనుగోలు కోసం ఫ్రాంచైజీలు ఎంత సొమ్మునైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటికే తమ మనీ పర్స్ లెక్కలు కూడా సరి చేసుకున్నాయి. మినీ వేలంలో కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉన్న ఆటగాళ్లు ఎవరంటే.. తొలుత ప్రస్తావన వచ్చే పేర్లు బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), సామ్ కర్రన్ (ఇంగ్లండ్), కెమరూన్ గ్రీన్ (ఆస్ట్రేలియా), జాషువ లిటిల్ (ఐర్లాండ్), రిలీ రొస్సో (సౌతాఫ్రికా), అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్), సికందర్ రజా (జింబాబ్వే). ఈ లిస్ట్ చాంతాడంత ఉన్నప్పటికీ వేలంలో వీరిపై మాత్రం కనక వర్షం కురిసే అవకాశం ఉంది. టీ20 వరల్డ్‌కప్-2022లో వీరి ప్రదర్శనను పరిగణలోకి తీసుకునే ఫ్రాంచైజీలు వీరిపై ఎంత ధర అయినా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరే కాక బంగ్లాదేశ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ లిటన్ దాస్, ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాళ్లు హ్యారీ బ్రూక్, ఫిలిప్ సాల్ట్, ఆదిల్ రషీద్, కేశవ్ మహారాజ్ లాంటి ఆటగాళ్ల కోసం కూడా తీవ్రంగా పోటీ నడిచే అవకాశం ఉంది. అత్యధిక ధర పలికే అవకాశం ఉన్న ఆటగాళ్లలో బెన్ స్టోక్స్ కోసం కనీసం 12 కోట్లు, సామ్ కర్రన్ కోసం 10 కోట్లు, కెమరూన్ గ్రీన్ కోసం 8 కోట్లు, ఐర్లాండ్ పేసర్ జాషువ లిటిల్ కోసం 6 కోట్లు, రిలీ రొస్సో, అలెక్స్ హేల్స్, సికందర్ రజాల కోసం తలా 4 కోట్లు వెచ్చించేందుకు ఆయా జట్లు ఇప్పటికే ప్లాన్లు వేసుకున్నట్లు సమాచారం. అలాగే లిటన్ దాస్, హ్యారీ బ్రూక్, ఫిలిప్ సాల్ట్, ఆదిల్ రషీద్, కేశవ్ మహారాజ్‌లపై తలో 2 కోట్లు వెచ్చించే ఛాన్స్ ఉంది. వీరే కాక, ఆయా జట్లు రిలీజ్ చేసిన ఆటగాళ్లలో జేసన్ రాయ్, కేఎస్ భరత్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, జేమ్స్ నీషమ్, డేనియల్ సామ్స్, ఎవిన్ లూయిస్, జేసన్ హోల్డర్, మనీశ్ పాండే కోటి నుంచి 2 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉంది. చదవండి: స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే! -
సికందర్ రజా మెరుపులు.. ఐర్లాండ్‌ను మట్టికరిపించిన జింబాబ్వే
టీ20 వరల్డ్‌కప్ గ్రూప్-బి క్వాలిఫయర్స్‌లో ఇవాళ (అక్టోబర్ 17) జరిగిన రెండో మ్యాచ్‌లో జింబాబ్వే ఐర్లాండ్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. సికందర్ రజా (48 బంతుల్లో 82; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా, ఛేదనలో తడబడిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా జింబాబ్వే 31 పరుగుల తేడాతో గెలుపొందింది. జింబాబ్వే నిర్ధేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్.. 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి 100 లోపే ఆలౌటయ్యేలా కనిపించింది. కర్టిస్ క్యాంఫర్ (27), జార్జ్ డాక్రెల్ (24), గెరాత్ డెలానీ (24), బ్యారీ మెక్ కార్తీ (22 నాటౌట్) ఆ జట్టును ఆదుకునేందుకు విఫలయత్నం చేశారు. జింబాబ్వే బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో ఐర్లాండ్ తలవంచక తప్పలేదు. బ్లెసింగ్ ముజరబానీ 3, రిచర్డ్ నగరవ, టెండాయ్ చటారా తలో 2 వికెట్లు, సీన్ విలియమ్స్, సికందర్ రజా చెరో వికెట్ సాధించి ఐర్లాండ్ నడ్డి విరిచారు. కాగా, ఇదే గ్రూప్‌లో ఇవాళ జరిగిన మరో మ్యాచ్‌లో పసికూన స్కాట్లాండ్.. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్‌పై సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. -
T20 WC 2022: సికందర్ రజా విధ్వంసం.. జింబాబ్వే భారీ స్కోర్
టీ20 వరల్డ్‌కప్ గ్రూప్-బి క్వాలిఫయర్స్ రౌండ్లో ఇవాళ (అక్టోబర్ 17) రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. తొలి మ్యాచ్‌లో పసికూన స్కాట్లాండ్.. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్‌పై సంచలన విజయం నమోదు చేయగా.. మరో మ్యాచ్‌లో జింబాబ్వే- ఐర్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. స్టార్ ప్లేయర్ సికందర్ రజా (48 బంతుల్లో 82; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగుల భారీ స్కోర్ చేసింది. 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జింబాబ్వేను మెద్వెరె (19 బంతుల్లో 22; 4 ఫోర్లు), సికిందర్ రజా ఆదుకున్నారు. ఆఖర్లో జాంగ్వే (10 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు) వేగంగా పరుగులు రాబట్టడంతో జింబాబ్వే ప్రత్యర్ధి ముందు 175 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సికిందర్ రజా ఒక్కడే భారీ షాట్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఐర్లాండ్ బౌలర్లలో జాషువా లిటిల్ (3/24), మార్క్ అదైర్ (2/39), సిమీ సింగ్ (2/31) అద్భుతంగా బౌలింగ్ చేశారు. అనంతరం 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్.. రెండో బంతికే ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (0) వికెట్ కోల్పోయింది. అనంతరం 3వ ఓవర్లో వన్‌డౌన్ బ్యాటర్ లోర్కాన్ టక్కర్ (11) వికెట్‌ను చేజార్చుకుంది. ఈ రెండు వికెట్లు రిచర్డ్ నగరవకే దక్కాయి. 3 ఓవర్లు ముగిసే సరికి ఐర్లాండ్ స్కోర్ 15/2గా ఉంది. -
బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన జింబాబ్వే
ఫ్లవర్ బ్రదర్స్, అలిస్టర్ క్యాంప్‌బెల్, హీత్ స్ట్రీక్ లాంటి స్టార్ ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత కళ తప్పిన జింబాబ్వే క్రికెట్ టీమ్ ఇటీవలి కాలంలో పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుంది. చాలాకాలం తర్వాత ప్రపంచకప్‌కు (టీ20) అర్హత సాధించిన ఆ జట్టు.. తాజాగా స్వదేశంలో తమకంటే మెరుగైన బంగ్లాదేశ్‌కు షాకిచ్చి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ తొలి రెండు మ్యాచ్‌ల్లో చెరో మ్యాచ్ గెలిచి సమానంగా ఉండిన రెండు జట్లు మంగళవారం జరిగిన నిర్ణయాత్మక మూడు మ్యాచ్‌లో హోరాహోరీగా తలపడ్డాయి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జాంబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఆరంభంలో బంగ్లా బౌలర్లు రెచ్చిపోవడంతో ఓ దశలో 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆతిధ్య జట్టు.. ర్యాన్ బుర్ల్ (28 బంతుల్లో 54; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), జాంగ్వే (20 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ల సాయంతో ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్, హసన్ మహమూద్ చెరో 2 వికెట్లు, ముస్తాఫిజుర్, మెసద్దెక్ హొసేన్, నసుమ్ అహ్మద్, మహ్మదుల్లా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో తడబడిన బంగ్లా జట్టు.. లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయి 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. జింబాబ్వే బౌలర్లు విక్టర్ న్యాయుచి (3/29), బ్రాడ్ ఈవాన్స్ (2/26) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమైంది. అఫీఫ్ హొసేన్ (27 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు), మెహిది హసన్ (17 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్) జట్టును గెలిపించేందుకు సాయశక్తులా ప్రత్నించారు. ఈ మ్యాచ్ మినహాయించి తొలి రెండు టీ20ల్లో మెరుపు అర్ధసెంచరీలు సాధించిన సికందర్ రాజా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకోగా.. ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీతో రాణించిన ర్యాన్ బుర్ల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆగస్ట్ 5 నుంచి ప్రారంభంకానుంది. చదవండి: 17 ఏళ్ల తర్వాత పాక్ పర్యటనకు ఇంగ్లండ్.. షెడ్యూల్ విడుదల..! -
ఐదేసిన మొసద్దెక్.. జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకున్న బంగ్లా
తొలి టీ20లో జింబాబ్వే చేతిలో ఎదురైన పరాభవానికి బంగ్లాదేశ్ ప్రతీకారం తీర్చుకుంది. రెండో మ్యాచ్‌లో ఆతిధ్య జట్టును బంగ్లా జట్టు 7 వికెట్ల తేడా ఓడించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. సిరీస్ డిసైడ్ చేసే మూడో టీ20 ఆగస్ట్ 3న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వేను బంగ్లా స్పిన్నర్ మొసద్దెక్ హొసేన్ (5/20) దారుణంగా దెబ్బకొట్టాడు. మొసద్దెక్ ఫైఫర్ దాటికి జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి మ్యాచ్‌లో మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగిన సికందర్ రాజా (53 బంతుల్లో 62; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఈ మ్యాచ్‌లోనూ రాణించడంతో జింబాబ్వే ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ర్యాన్ బర్ల్ (31 బంతుల్లో 32; 3 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించగా.. మిగతా బ్యాటర్లంతా ఒక్కో పరుగు సాధించేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్, హసన్ మహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు. ఛేదనలో ఓపెనింగ్ బ్యాటర్ లిట్టన్ దాస్ (33 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మిడిలార్డర్ ఆటగాడు అఫీఫ్ హొసేన్ (28 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, సిక్స్) రాణించడంతో బంగ్లాదేశ్ మరో 15 బంతులు మిగిలుండగానే (17.3 ఓవర్లలో) లక్ష్యాన్ని (136/3) చేరుకుంది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ ఎంగర్వా, సీన్ విలియమ్స్, సికందర్ రాజా తలో వికెట్ పడగొట్టారు. చదవండి: సికందర్ రాజా ఊచకోత.. బంగ్లాకు షాకిచ్చిన జింబాబ్వే -
సికందర్ రాజా ఊచకోత.. బంగ్లాకు షాకిచ్చిన జింబాబ్వే
Sikander Raja: స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో జింబాబ్వేకు శుభారంభం దక్కింది. శనివారం (జులై 30) జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే సంచలన ప్రదర్శన నమోదు చేసి 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. వెస్లీ మదెవెరె (46 బంతుల్లో 67 రిటైర్డ్ హర్ట్; 9 ఫోర్లు), సికందర్ రాజా (26 బంతుల్లో 65 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలు సాధించి జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. సీన్ విలియమ్స్ (19 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ముఖ్యంగా సికందర్ రాజా బంగ్లా బౌలర్లపై శివాలెత్తి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. దొరికిన బంతిని దొరికినట్లు బాది ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ 2 వికెట్లు పడగొట్టగా.. మొసద్దెక్ హొసేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం ఛేదనలో బంగ్లా ఆటగాళ్లు కూడా గట్టిగానే ప్రయత్నించినప్పటికీ విజయానికి 17 పరుగుల దూరంలోనే (188/6) నిలిచిపోయారు. కెప్టెన్ నరుల్ హసన్ (26 బంతుల్లో 42 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు), లిటన్ దాస్ (19 బంతుల్లో 32; 6 ఫోర్లు) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. జింబాబ్వే బౌలర్లలో లూక్ జాంగ్వి 2 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్ ఎంగరవా, వెల్లింగ్టన్ మసకద్జా, సికందర్ రాజా తలో వికెట్ సాధించారు. సిరీస్‌లో రెండో టీ20 రేపు (జులై 31) జరుగనుంది. అనంతరం ఆగస్ట్ 2న మూడో టీ20.. 5, 7, 10 తేదీల్లో 3 వన్డేలు జరుగనున్నాయి. చదవండి: రోహిత్‌కు జతగా ధవన్ ఉండగ, ఈ ప్రయోగాలు ఎందుకు దండగ..! -
‘క్రికెట్‌కు వీడ్కోలు ఇలా కాదు’
హరారే: జింబాబ్వే జట్టును అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జింబాబ్వే క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ఆ దేశ ప్రభుత్వ జోక్యం మితిమీరినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. సస్పెన్షన్ తక్షణం అమలులోకి వస్తున్నట్లు ప్రకటించింది. ఐసీసీ తీసుకున్న తాజా నిర్ణయంతో జింబాబ్వేకి చెందిన క్రికెట్ జట్లు ఏవీ...ఇక ఐసీసీ నిర్వహించే అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడానికి లేదు. అలాగే జింబాబ్వే క్రికెట్‌కు అందిస్తున్న నిధుల సాయాన్ని కూడా ఐసీసీ పూర్తిగా నిలిపివేసింది. ఐసీసీ నిర్ణయంతో జింబాబ్వేలో క్రికెట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఐసీసీ నిర్ణయం పట్ల జింబాబ్వే క్రికెటర్లు సికందర్ రజా, బ్రెండన్ టైలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేశారు. ‘ఎలా ఒక నిర్ణయం ఉన్నట్లుండి మమ్మల్ని అపరిచితులుగా, నిరుద్యోగులుగా మారుస్తూ, ఎంతో మంది కెరియర్ని ముగిస్తుంది.. ఎలా ఒక నిర్ణయం ఎన్నో కుటుంబాలపై ప్రభావం చూపిస్తుంది.. అంతర్జాతీయ క్రికెట్‌కు నేను వీడ్కోలు చెప్పాలనుకున్న పద్దతి ఇది కాదు కదా’ అంటూ సికిందర్ రజా ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. How one decision has made a team , strangers How one decision has made so many people unemployed How one decision effect so many families How one decision has ended so many careers Certainly not how I wanted to say goodbye to international cricket. @ICC pic.twitter.com/lEW02Qakwx — Sikandar Raza (@SRazaB24) July 18, 2019 ‘జింబాబ్వేను సస్పెండ్ చేస్తూ.. ఐసీసీ తీసుకున్న నిర్ణయం హృదయవిదారకమైనది. మా చైర్మన్ ఎంపీ కాదు.. మా జట్టు వెనక ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. వందలాది మంది నిజాయతీ పరులైన ఆటగాళ్లు, ఉద్యోగులు, సహాయక సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్ దీన్నో ఉద్యోగంలా మాత్రమే కాక బాధ్యతగా భావించి జింబాబ్వే క్రికెట్‌కు అంకితమయ్యారు’ అంటూ బ్రెండన్ టేలర్ ట్వీట్ చేశారు. @ICC It's heartbreaking to hear your verdict and suspend cricket in Zimbabwe. The @ZimbabweSrc has no government back round yet our Chairman is an MP? Hundreds of honest people,players, support staff,ground staff totally devoted to ZC out of a job,just like that. 💔 — Brendan Taylor (@BrendanTaylor86) July 18, 2019 -
బంగ్లాదేశ్ 143 ఆలౌట్
ఢాకా: బౌలర్లు చటారా (3/19), సికిందర్ రజా (3/35), కైల్ జార్విస్ (2/28) చెలరేగడంతో... బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో జింబాబ్వే అదరగొట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులు చేసిన ఆ జట్టు బంగ్లాదేశ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే కుప్పకూల్చింది. ఓవర్‌నైట్ స్కోరు 236/5తో ఆదివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే మరో 46 పరుగులు చేసి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. మూర్ (63 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. తైజుల్ ఇస్లాంకు 6 వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 51 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైంది. ఆరిఫుల్ హఖ్ (41 నాటౌట్), ముష్ఫికర్ రహీమ్ (31)లకు మంచి ఆరంభం లభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే రెండో రోజు ఆట ముగిసేసమయానికి 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 1 పరుగు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిసి ఓవరాల్‌గా 140 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
700 వికెట్ల క్లబ్లో హర్భజన్
న్యూఢిల్లీ : భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 700 వికెట్ల క్లబ్లో చేరాడు. జింబాబ్వేతో మంగళవారం జరిగిన మూడో వన్డేలో సికిందర్ రజా వికెట్ తీసి ఈ ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఓవరాల్‌గా 700 వికెట్లు తీసిన జాబితాలో 12వ స్థానంలో ఉన్న భజ్జీ భారత్ తరఫున రెండో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఇతని కంటే ముందున్నాడు. టాప్-5లో ముత్తయ్య మురళీధరన్ (1347), షేన్ వార్న్ (1001), అనిల్ కుంబ్లే (956), మెక్‌గ్రాత్ (949), వసీమ్ అక్రమ్ (916) ఉన్నారు. 435 ఇన్నింగ్స్‌లో హర్భజన్ ఈ మార్క్‌ను సాధించగా, మురళీధరన్ 308 ఇన్నింగ్స్‌లోనే అందుకున్నాడు.