స్కై, విరాట్‌లను అధిగమించిన సికందర్‌ రజా | Sikandar Raza Breaks Kohli Record, Holds The Record For The Most Player Of The Match Awards In T20Is | Sakshi
Sakshi News home page

స్కై, విరాట్‌లను అధిగమించిన సికందర్‌ రజా

Published Thu, Oct 24 2024 7:55 AM | Last Updated on Thu, Oct 24 2024 10:39 AM

Sikandar Raza Holds The Record For The Most Player Of The Match Awards In T20Is

జింబాబ్వే టీ20 జట్టు కెప్టెన్‌ సికందర్‌ రజా ఓ విషయంలో టీమిండియా స్టార్లు సూర్యకుమార్‌ యాదవ్‌, విరాట్‌ కోహ్లిలను అధిగమించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 

టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ పోటీల్లో భాగంగా గాంబియాతో నిన్న (అక్టోబర్‌ 23) జరిగిన మ్యాచ్‌లో సికందర్‌ రజాకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఇది అతని కెరీర్‌లో 17వ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు టీ20ల్లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుల రికార్డు రజా, స్కై, విరాట్‌, విరన్‌దీప్‌ సింగ్‌ల పేరిట సంయుక్తంగా ఉండేది. 

వీరంతా తలో 16 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్నారు. తాజాగా రజా.. స్కై, విరాట్‌, విరన్‌లను అధిగమించి తన పేరిట సింగిల్‌గా ఈ రికార్డును నమోదు చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో సికందర్‌ రజా, స్కై, విరాట్‌, విరన్‌ తర్వాత రోహిత్‌ శర్మ (14), మొహమ్మద్‌ నబీ (14) ఉన్నారు.

జింబాబ్వే, గాంబియా మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే వరల్డ్‌ రికార్డు స్కోర్‌ నమోదు చేసింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఏకంగా 344 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే అత్యధిక టీమ్‌ స్కోర్‌. ఈ మ్యాచ్‌లో సికందర్‌ రజా సుడిగాలి శతకం (43 బంతుల్లో 133 నాటౌట్‌; 7 ఫోర్లు, 15 సిక్సర్లు) బాదాడు. 

బ్రియాన్‌ బెన్నెట్‌ (26 బంతుల్లో 50; 7 ఫోర్లు, సిక్స్‌), మరుమణి (19 బంతుల్లో 62; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), మదండే (17 బంతుల్లో 53 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలు సాధించారు. అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గాంబియా 14.4 ఓవర్లలో 54 పరుగులకే కుప్పకూలి 290 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 

చదవండి: శ్రీలంక జోరు.. విండీస్‌ బేజారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement