విరాట్‌ కోహ్లిని దాటేసిన సికందర్‌ రజా | Sikandar Raza Won Most International POTM Awards In 2023 - Sakshi
Sakshi News home page

విరాట్‌ కోహ్లిని దాటేసిన సికందర్‌ రజా

Published Thu, Nov 30 2023 11:22 AM | Last Updated on Thu, Nov 30 2023 12:18 PM

Sikandar Raza Now Leads The Race For Most International POTM Awards In 2023 - Sakshi

జింబాబ్వే ఆటగాడు, ఆ దేశ టీ20 జట్టు కెప్టెన్‌ సికందర్‌ రజా ఓ విషయంలో దిగ్గజ ఆటగాడు విరాట్‌ కోహ్లిని అధిగమించాడు. టీ20 వరల్డ్‌కప్‌ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో భాగంగా నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్న రజా.. ఈ ఏడాది అత్యధిక సార్లు ఈ అవార్డు గెలుచుకున్న ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రజా ఈ రికార్డు సాధించే క్రమంలో విరాట్‌ను వెనక్కునెట్టి అగ్రస్థానానికి చేరాడు.

కోహ్లి ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో 6 మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకోగా.. సికందర్‌ రజా 7 అవార్డులతో టాప్‌లో నిలిచాడు. రజా ప్రస్తుత వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ టోర్నీలోనే మూడుసార్లు (టాంజానియా, రువాండ, నైజీరియా) ప్లేయర్‌ ఆఫ్‌ మ్యాచ్‌ అవార్డులు గెలవడం విశేషం.

ఇదిలా ఉంటే, నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో రజా ఆల్‌రౌండ్‌ పెర్ఫార్మెన్స్‌తో (3-1-13-2, 37 బంతుల్లో 65; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగడంతో జింబాబ్వే 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నైజీరియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగుల నామమాత్రపు స్కోర్‌ చేయగా.. జింబాబ్వే కేవలం 14 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో జింబాబ్వే 2024 టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించేందుకు మరింత చేరువైంది. ఇవాళ కెన్యాతో జరిగే మ్యాచ్‌లో ఈ జట్టు గెలిస్తే నమీబియాతో పాటు టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement