ఢాకా: బౌలర్లు చటారా (3/19), సికిందర్ రజా (3/35), కైల్ జార్విస్ (2/28) చెలరేగడంతో... బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో జింబాబ్వే అదరగొట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులు చేసిన ఆ జట్టు బంగ్లాదేశ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే కుప్పకూల్చింది. ఓవర్‌నైట్ స్కోరు 236/5తో ఆదివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే మరో 46 పరుగులు చేసి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. మూర్ (63 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
తైజుల్ ఇస్లాంకు 6 వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 51 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైంది. ఆరిఫుల్ హఖ్ (41 నాటౌట్), ముష్ఫికర్ రహీమ్ (31)లకు మంచి ఆరంభం లభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే రెండో రోజు ఆట ముగిసేసమయానికి 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 1 పరుగు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిసి ఓవరాల్‌గా 140 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment