ఐదేసిన మొసద్దెక్‌.. జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకున్న బంగ్లా | Mosaddek Hossain Fifer Help Bangladesh To Beat Zimbabwe In 2nd T20 | Sakshi
Sakshi News home page

BAN VS ZIM 2nd T20: ఐదేసిన మొసద్దెక్.. జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకున్న బంగ్లా

Published Sun, Jul 31 2022 8:03 PM | Last Updated on Sun, Jul 31 2022 8:03 PM

Mosaddek Hossain Fifer Help Bangladesh To Beat Zimbabwe In 2nd T20 - Sakshi

తొలి టీ20లో జింబాబ్వే చేతిలో ఎదురైన పరాభవానికి బంగ్లాదేశ్‌ ప్రతీకారం తీర్చుకుంది. రెండో మ్యాచ్‌లో ఆతిధ్య జట్టును బంగ్లా జట్టు 7 వికెట్ల తేడా ఓడించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. సిరీస్‌ డిసైడ్‌ చేసే మూడో టీ20 ఆగస్ట్‌ 3న జరుగనుం‍ది. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వేను బంగ్లా స్పిన్నర్‌ మొసద్దెక్‌ హొసేన్‌ (5/20) దారుణంగా దెబ్బకొట్టాడు. మొసద్దెక్‌ ఫైఫర్‌ దాటికి  జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి మ్యాచ్‌లో మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగిన సికందర్‌ రాజా (53 బంతుల్లో 62; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఈ మ్యాచ్‌లోనూ రాణించడంతో జింబాబ్వే ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ర్యాన్‌ బర్ల్‌ (31 బంతుల్లో 32; 3 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించగా.. మిగతా బ్యాటర్లంతా ఒక్కో పరుగు సాధించేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్‌, హసన్‌ మహ్మద్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

ఛేదనలో ఓపెనింగ్‌ బ్యాటర్‌ లిట్టన్‌ దాస్‌ (33 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మిడిలార్డర్‌ ఆటగాడు అఫీఫ్‌ హొసేన్‌ (28 బంతుల్లో 30 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌) రాణించడంతో బంగ్లాదేశ్‌ మరో 15 బంతులు మిగిలుండగానే (17.3 ఓవర్లలో) లక్ష్యాన్ని (136/3) చేరుకుంది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్‌ ఎంగర్వా, సీన్‌ విలియమ్స్‌, సికందర్‌ రాజా తలో వికెట్‌ పడగొట్టారు. 
చదవండి: సికందర్‌ రాజా ఊచకోత.. బంగ్లాకు షాకిచ్చిన జింబాబ్వే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement