second T20
-
తిలక్ తడాఖా.. చెపాక్ టీ20లో భారత్ విజయం
భారత్ ముందున్న లక్ష్యం 166. స్కోరేమో 15 ఓవర్లలో 126/7. అంటే ఈ పాటికే అర్థమై ఉంటుంది. మిగిలిందల్లా టెయిలెండర్లే అని! గెలుపు కష్టమని!! కానీ వారితో పాటు ఒకడు మిగిలాడు. అతడే తెలుగు తేజం నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ. 30 బంతుల్లో 40 పరుగులు... ఇది గెలుపు సమీకరణం. సరిజోడు లేకపోయినా, బ్యాటింగ్ చేయగలిగే ఆటగాడు కరువైనా... వెన్నుచూపలేదు. ఇంగ్లండ్ బౌలింగ్‌కు తమ సహచరుల్లా తలొంచలేదు. ఆర్చర్ 16వ ఓవర్లో 0, 6, 6, 1, 4, 2లతో 19 పరుగులొచ్చాయి. ఇందులో 2 సిక్స్‌లు, 1 పరుగు తిలకే చేశాడు.ఇక 24 బంతుల్లో 21 పరుగులు కావాలి. ఇది భారత్‌ను ఊరించింది. కానీ ఆదిల్ రషీద్ 17వ ఓవర్లో 1 పరుగిచ్చి అర్ష్‌దీప్‌ను అవుట్ చేయడంతో మళ్లీ టెన్షన్... టెన్షన్... అప్పుడు రవి బిష్ణోయ్ (5 బంతుల్లో 9 నాటౌట్; 2 ఫోర్లు) ఆపద్భాంధవుడిలా వచ్చాడు. అతనిది సింగిల్ డిజిట్ స్కోరే కావొచ్చు. కానీ తిలక్‌తో అమూల్యమైన, అబేధ్యమైన విజయానికి ఆ పరుగులు, ఆ భాగస్వామ్యమే (తొమ్మిదో వికెట్‌కు 20 పరుగులు) టీమిండియాను గెలిపించింది. సిరీస్‌లో 2–0తో పైచేయి సాధించేలా చేసింది. చెన్నై: ఓపెనర్ల దూకుడు లేదు. సూర్యకుమార్ యాదవ్ జోరు కనిపించలేదు. హార్దిక్ పాండ్యా అనుభవం కలిసిరాలేదు. కానీ... ఇన్ని ప్రతికూలతల మధ్య భారత్ రెండో టి20లో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలో నిలిచింది. కారణం ఒకేఒక్కడు తిలక్ వర్మ. అసలు ఆశలే లేని చోట... స్పెషలిస్టు బ్యాటర్లే కరువైన వేళ... పరుగుల వేటలో గెలుపుబాట పరిచాడు. 20వ ఓవర్ రెండో బంతికి బౌండరీతో విన్నింగ్షాట్ కొట్టేదాకా క్రీజులో కడదాకా నిలిచి భారత్‌ను గట్టెక్కించాడు. ఆఖరిదాకా విజయం కోసం పట్టుబిగించిన ఇంగ్లండ్ చివరకు 2 వికెట్ల తేడాతో భారత్ చేతిలో పరాజయం పాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కెపె్టన్ జోస్ బట్లర్ (30 బంతుల్లో 45; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), బ్రైడన్ కార్స్ (17 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు. అక్షర్, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 19.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తిలక్ వర్మ (55 బంతుల్లో 72 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. వాషింగ్టన్ సుందర్ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. మెరిపించిన బట్లర్, కార్స్ ఆరంభంలోనే ఓపెనింగ్ జోడీ సాల్ట్ (4)ను అర్ష్‌దీప్, డకెట్ (3)ను సుందర్ పెవిలియన్ చేర్చారు. సొంత ప్రేక్షకుల మధ్య తొలి ఓవర్ (ఇన్నింగ్స్ 4వ) వేసేందుకు దిగిన సుందర్ తొలి బంతికే డకెట్‌ను బోల్తాకొట్టించాడు. హ్యారీ బ్రూక్ (13), లివింగ్‌స్టోన్ (13)లను వరుణ్, అక్షర్ కుదురుకోనివ్వలేదు. చెప్పుకోదగిన భాగస్వామ్యం లేకపోయినా... ధాటైన ఇన్నింగ్స్ ఏ ఒక్కరు ఆడలేకపోయినా... ఇంగ్లండ్ ఆఖరుకొచ్చే సరికి పుంజుకుంది. కెపె్టన్ బట్లర్ మెరుపులతో స్కోరు మోస్తరుగా సాగిపోగా... అరంగేట్రం హీరో జేమీ స్మిత్ (12 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కార్స్‌ల వేగంతో స్కోరు వేగం పెరిగింది. అర్ష్‌దీప్, పాండ్యా, సుందర్, అభిషేక్‌లకు తలా ఒక వికెట్ దక్కింది. తిలక్... అంతా తానై... ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లాగే మనకూ మంచి ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు అభిషేక్ (12)కు మార్క్ వుడ్, సామ్సన్ (5)కు ఆర్చర్ చెక్ పెట్టారు. తిలక్ వర్మ అడపాదడపా మెరుపులతో భారత్ స్కోరు 50 దాటింది. కానీ ఈ దశలో కెపె్టన్ సూర్యకుమార్ (12), ధ్రువ్ జురేల్ (4), హార్దిక్ పాండ్యా (7)లు స్వల్పవ్యవధిలో అదికూడా 10 ఓవర్లలోపే అవుటవడం భారత్ ఇన్నింగ్స్‌కు పెద్దకుదుపు... 9.1 ఓవర్లు 78/5 స్కోరు! గెలుపు చాలా దూరంలో ఉంటే మిగిలిన స్పెషలిస్టు బ్యాటర్ తిలక్ వర్మ ఒక్కడే! సుందర్, అక్షర్ పటేల్ (2) బ్యాటింగ్ చేయగలరు కానీ గెలిపించేదాకా నిలుస్తారా అన్న సందేహాలు భారత శిబిరాన్ని, స్టేడియంలోని ప్రేక్షకుల్ని కలవరపెట్టాయి. ఊహించినట్లే వారిద్దరు కలవరపెట్టే నిష్క్రమించారు. ఈ దశలో తిలక్‌వర్మ గెలిచేదాకా బాధ్యతను భుజానవేసుకొని విజయమాల భారత జట్టు మెడలో వేశాడు.స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) సుందర్ (బి) అర్ష్‌దీప్ 4; డకెట్ (సి) జురేల్ (బి) సుందర్ 3; బట్లర్ (సి) తిలక్ వర్మ (బి) అక్షర్ 45; బ్రూక్ (బి) వరుణ్ 13; లివింగ్‌స్టోన్ (సి) సబ్–హర్షిత్ (బి) అక్షర్ 13; స్మిత్ (సి) తిలక్ వర్మ (బి) అభిõÙక్ 22; ఓవర్టన్ (బి) వరుణ్ 5; కార్స్ (రనౌట్) 31; ఆర్చర్ (నాటౌట్) 12; రషీద్ (సి) సామ్సన్ (బి) పాండ్యా 10; మార్క్ వుడ్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–6, 2–26, 3–59, 4–77, 5–90, 6–104, 7–136, 8–137, 9–157. బౌలింగ్: అర్ష్‌దీప్ 4–0–40–1, హార్దిక్ పాండ్యా 2–0–6–1, వాషింగ్టన్ సుందర్ 1–0–9–1, అక్షర్ 4–0–32–2, రవి బిష్ణోయ్ 4–0–27–0, వరుణ్ 4–0–38–2, అభిషేక్ 1–0–12–1. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) కార్స్ (బి) ఆర్చర్ 5; అభిõÙక్ (ఎల్బీ) (బి) వుడ్ 12; తిలక్ వర్మ (నాటౌట్) 72; సూర్యకుమార్ (బి) కార్స్ 12; జురేల్ (సి) సబ్–రేహన్ (బి) కార్స్ 4; పాండ్యా (సి) సాల్ట్ (బి) ఓవర్టన్ 7; సుందర్ (బి) కార్స్ 26; అక్షర్ (సి) డకెట్ (బి) లివింగ్‌స్టోన్ 2; అర్ష్‌దీప్ (సి) ఆర్చర్ (బి) రషీద్ 6; బిష్ణోయ్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–15, 2–19, 3–58, 4–66, 5–78, 6–116, 7–126, 8–146. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 4–0–60–1, మార్క్ వుడ్ 3–0–28–1, కార్స్ 4–0–29–3, ఆదిల్ రషీద్ 4–0–14–1, ఓవర్టన్ 2.2–0–20–1, లివింగ్‌స్టోన్ 2–0–14–1. -
రెండో టి20: జోరు మీదున్న టీమిండియా
ఇంగ్లండ్‌తో బోణీ అదిరింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో టీమిండియా సత్తా చాటుకుంది. ఇక సిరీస్‌లో పైచేయే మిగిలింది. వరుస మ్యాచ్‌ల విజయాలతో ప్రత్యర్థిని దెబ్బతీయాలని ఆతిథ్య భారత్ చూస్తోంది. తద్వారా సిరీస్ ఫలితం కోసం ఆఖరి పోరు (ఐదో టి20) దాకా లాక్కెళ్లడం ఎందుకని భావిస్తోంది. అయితే ఇది టి20 ఫార్మాట్.ఇందులో సొంతగడ్డ అనుకూలతలు, పర్యాటక జట్టుకు ప్రతికూలతలంటూ ఉండవు. ఒక్క ఓవర్ మార్చేస్తుంది. ఇక మెరుపు ఇన్నింగ్స్ తేల్చేస్తుంది. అలాంటి స్పీడ్ గేమ్‌లో మనదే ఆధిపత్యమనుకొని ఆదమరిస్తే అంతే సంగతి! ఐసీసీ ర్యాంకింగ్‌తో సంబంధం లేకుండా అంతర్జాతీయ క్రికెట్లోనే ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్ జట్లు ఎప్పుడైనా సరే టాప్–3 జట్లే! కాబట్టి బట్లర్ బృందాన్ని ఏమాత్రం తక్కువ అంచనా వేసినా భారత్ మూల్యం చెల్లించుకోక తప్పదు. పైగా ఐపీఎల్లో హార్డ్ హిట్టర్‌గా ఇక్కడి పిచ్‌లపై కెప్టెన్ బట్లర్‌కు చక్కని అవగాహన ఉంది. ఆ సంగతి సూర్యకుమార్ బృందం మర్చిపోకూడదు. ఈ నేపథ్యంలో నేడు జరిగే రెండో టి20లో భారత్, ఇంగ్లండ్ జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. చెన్నై: కోల్‌కతాలో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ బోల్తా పడింది. అలాగని ఒక్క మ్యాచ్‌తోనే పటిష్టమైన ఇంగ్లండ్‌ను తేలిగ్గా తీసుకోలేం. ఓపెనింగ్‌లో ఫిల్ సాల్ట్, మిడిలార్డర్లో హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్‌లు బ్యాట్ ఝుళిపిస్తే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. ఈ ముగ్గురితో పాటు జోస్ బట్లర్‌కు ఇక్కడి పిచ్‌లు కొట్టిన పిండే! అతని విధ్వంసం కొన్ని ఓవర్లపాటే ఉన్నా ఆ ప్రభావం ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను గణనీయంగా మార్చేస్తుంది. బౌలింగ్‌లో పేస్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్ మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అట్కిన్సన్, మార్క్ వుడ్‌లతో పార్ట్‌టైమ్ బౌలర్‌గా లివింగ్‌స్టోన్ కూడా బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. గత మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన జట్టు వెనుకబడదు. కచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచేందుకు, 1–1తో సమం చేసేందుకు బట్లర్ బృందం గట్టి పోరాటమే చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. షమీ ఆడేనా? భారత వెటరన్ సీమర్ షమీ గాయాల తర్వాత దేశవాళీ క్రికెట్లో బరిలోకి దిగాడు. ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. అయితే అంతర్జాతీయ పోటీలకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు. ‘ఈడెన్’లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన భారత బృందం స్పిన్‌కు స్వర్గధామమైన ‘చెపాక్’లోనూ అదే ఎత్తుగడను కొనసాగిస్తే సీనియర్ పేసర్ డగౌట్‌కే పరిమితం కావొచ్చు. ఒకవేళ ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ సిరీస్‌లో అతన్ని దించాలనుకుంటే మాత్రం ‘ఈడెన్’లో ప్రభావం చూపలేకపోయిన స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ని పక్కనబెట్టే అవకాశమైతే ఉంది. ఈ మార్పు మినహా గత జట్టే యథాతథంగా కొనసాగుతుంది. ఓపెనర్లు సంజూ సామ్సన్, అభిషేక్ శర్మ మంచి ఆరంభమే ఇచ్చారు. తక్కువ లక్ష్యమే కావడంతో మిగతా వారు పెద్దగా రాణించే చాన్స్ రాలేదు. సంజూ కూడా అభిషేక్లాగే భారీ ఇన్నింగ్స్ ఆడితే భారత బ్యాటింగ్ ఆర్డర్‌కు ఏ ఢోకా ఉండదు. నితీశ్ రెడ్డి, అక్షర్ పటేల్ దాకా అంతా దంచేసే వాళ్లే ఉన్నారు. ఓవర్‌కు పది పైచిలుకు పరుగులిచ్చినా హార్దిక్ పాండ్యా రెండు వికెట్లతో సత్తా చాటాడు. అర్ష్ దీప్ సింగ్ ఈ ఫార్మాట్లో తన ప్రాధాన్యం పెంచుకునే ప్రదర్శన చేస్తున్నాడు. స్పిన్‌తో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ఇంగ్లండ్ బలగాన్ని తిప్పేస్తుండటంతో బౌలింగ్ దళం కూడా దీటుగానే ఉంది.2 చెన్నైలో ఇప్పటి వరకు భారత జట్టు రెండు టి20లు ఆడింది. ఒక మ్యాచ్‌లో గెలిచి (2018లో వెస్టిండీస్‌పై ఆరు వికెట్ల తేడాతో)... మరో మ్యాచ్‌లో (2012లో న్యూజిలాండ్ చేతిలో ఒక పరుగు తేడాతో) ఓడిపోయింది.పిచ్, వాతావరణం గత ఈడెన్ పిచ్ సీమర్లకు, స్పిన్నర్లకు సమాన అవకాశమిచ్చిoది. కానీ ఇక్కడి చెపాక్ వికెట్ అలా కాదు. ఇది ఎప్పట్నుంచో స్పిన్ ఫ్రెండ్లీ పిచ్. వరుణ్, అక్షర్‌లతో పాటు రవి బిష్ణోయ్‌కు కలిసొచ్చే వేదికని చెప్పొచ్చు. మంచు ప్రభావం తప్ప వాన ముప్పయితే లేదు. -
హేలీ మాథ్యూస్ మెరుపులు
ముంబై: వెస్టిండీస్‌తో గత టి20 మ్యాచ్ ప్రదర్శనను భారత మహిళలు పునరావృతం చేయలేకపోయారు. సమష్టి వైఫల్యంతో రెండో టి20 మ్యాచ్‌ను పర్యాటక జట్టుకు అప్పగించారు.మంగళవారం జరిగిన ఈ పోరులో విండీస్ మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. తాజా ఫలితంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1–1తో సమం కాగా, చివరి టి20 రేపు జరుగుతుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా... వెస్టిండీస్ 15.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 160 పరుగులు చేసి విజయాన్నందుకుంది. భారత్ ఇన్నింగ్స్‌లో స్మృతి మంధాన (41 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, వికెట్ కీపర్ రిచా ఘోష్ (17 బంతుల్లో 32; 6 ఫోర్లు) దూకుడుగా ఆడింది. స్మృతి ఇచ్చిన మూడు సునాయాస క్యాచ్‌లను (30, 40, 40 పరుగుల వద్ద) విండీస్ ఫీల్డర్లు వదిలేయడం కూడా ఆమెకు కలిసొచ్చింది. 37 బంతుల్లో ఆమె అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. అయితే మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో జట్టు భారీ స్కోరు సాధించలేకపోయింది. ఛేదనలో వెస్టిండీస్ కెపె్టన్ హేలీ మాథ్యూస్ (47 బంతుల్లో 85 నాటౌట్; 17 ఫోర్లు), ఖియానా జోసెఫ్ (22 బంతుల్లో 38; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 40 బంతుల్లోనే 66 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఖియానా వెనుదిరిగినా...మాథ్యూస్, షిమైన్ క్యాంప్‌బెల్ (26 బంతుల్లో 29 నాటౌట్; 4 ఫోర్లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు అభేద్యంగా 55 బంతుల్లోనే 94 పరుగులు జత చేయడంతో మరో 26 బంతులు మిగిలి ఉండగానే విండీస్ విజయం ఖాయమైంది. మోకాలికి స్వల్ప గాయంతో బాధపడుతున్న కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రెండో టి20కి దూరం కావడంతో స్మృతి సారథిగా వ్యవహరించింది. ఆమె స్థానంలో ఉత్తరాఖండ్‌కు చెందిన 20 ఏళ్ల రాఘ్వీ బిస్త్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) ఫ్లెచర్ (బి) మాథ్యూస్ 62; ఉమా ఛెత్రి (బి) డాటిన్ 4; జెమీమా (ఎల్బీ) (బి) మాథ్యూస్ 13; రాఘ్వీ (ఎల్బీ) (బి) ఫ్లెచర్ 5; దీప్తి శర్మ (రనౌట్) 17; రిచా (సి) క్యాంప్‌బెల్ (బి) డాటిన్ 32; సజన (ఎల్బీ) (బి) ఫ్లెచర్ 2; రాధ (సి) డాటిన్ (బి) హెన్రీ 7; సైమా (సి) డాటిన్ (బి) హెన్రీ 6; టిటాస్ (నాటౌట్) 1; రేణుక (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–6, 2–35, 3–48, 4–104, 5–108, 6–113, 7–144, 8–149, 9–155. బౌలింగ్: చినెల్ హెన్రీ 4–0–37–2, డాటిన్ 4–0–14–2, హేలీ మాథ్యూస్ 4–0–36–2, కరిష్మా 3–0–19–0, ఫ్లెచర్ 3–0–28–2, అష్మిని 2–0–25–0. వెస్టిండీస్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (నాటౌట్) 85; ఖియానా జోసెఫ్ (సి) రిచా (బి) సైమా 38; క్యాంప్‌బెల్ (నాటౌట్) 29; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (15.4 ఓవర్లలో వికెట్ నష్టానికి) 160. వికెట్ల పతనం: 1–66. బౌలింగ్: రేణుకా సింగ్ 3–0–29–0, టిటాస్ సాధు 2–0–32–0, దీప్తి శర్మ 3–0–26–0, సైమా ఠాకూర్ 3–0–28–1, రాధ యాదవ్ 2–0–27–0, సజీవన్ సజన 2.4–0–17–0. -
విజయాన్ని వదిలేశారు
పోర్ట్ ఎలిజబెత్: భారత్ చేసింది 124/6. తక్కువ స్కోరే! దక్షిణాఫ్రికా ముందున్న లక్ష్యం 125. సులువైందే! కానీ భారత ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (4–0–17–5) బిగించిన ఉచ్చు సఫారీని ఓటమి కోరల్లో పడేసింది. ఈ దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రిస్టన్ స్టబ్స్ (41 బంతుల్లో 47 నాటౌట్; 7 ఫోర్లు) చేసిన పోరాటం ఆతిథ్య జట్టును గెలిపించింది.ఆదివారం జరిగిన రెండో టి20లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. దాంతో నాలుగు టి20ల సిరీస్‌లో రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. 13న సెంచూరియన్‌లో మూడో టి20 జరుగనుంది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (45 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడంతే! అనంతరం లక్ష్యఛేదనకు దిగిన సఫారీ జట్టు 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసి గెలిచింది. కొయెట్జీ (9 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) చేసిన కీలక పరుగులు, స్టబ్స్ పోరాటంతో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. కష్టాలతో మొదలై... ఇన్నింగ్స్ మొదలైన తొలి ఓవర్లోనే జాన్సెన్ మూడో బంతికి సంజూ సామ్సన్ (0) క్లీన్‌బౌల్డయ్యాడు. తర్వాతి కొయెట్జీ ఓవర్ మూడో బంతికి అభిషేక్ శర్మ (4) కీపర్ క్యాచ్ నుంచి రివ్యూకెళ్లి బతికిపోయినా... మరో రెండు బంతులకే భారీ షాట్‌కు ప్రయతి్నంచి జాన్సెన్కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో 5 పరుగులకే భారత్ ఓపెనర్లను కోల్పోయింది. ఈ కష్టాలు చాలవన్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ (4) సిమ్‌లేన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 15 పరుగులకే టాపార్డర్ కూలిపోగా... పవర్‌ప్లేలో భారత్ 34/3 స్కోరు చేసింది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ జోడీ ఠాకూర్ తిలక్ వర్మ (20 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్), అక్షర్ పటేల్ (21 బంతుల్లో 27; 4 ఫోర్లు) నిలదొక్కుకోకుండా మార్క్రమ్ చేశాడు. అతని బౌలింగ్‌లో తిలక్ షాట్ ఆడగా బుల్లెట్లా దూసుకొచ్చిన బంతిని మిల్లర్ గాల్లో ఎగిరి ఒంటిచేత్తో అందుకున్నాడు. అక్షర్ పటేల్ (21 బంతుల్లో 27; 4 ఫోర్లు) దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. పీటర్ వేసిన 12వ ఓవర్లో హార్దిక్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడగా... అది నేరుగా వెళ్లి నాన్–స్ట్రయిక్ ఎండ్‌లోని వికెట్లకు తగిలింది. ఈ లోపే బంతిని అడ్డుకోబోయిన పీటర్ చేతికి టచ్ అయ్యింది. అక్షర్ రీప్లే వచ్చేవరకు వేచిచూడకుండా పెవిలియన్ వైపు నడిచాడు. దీంతో 70 పరుగులకే టీమిండియా సగం వికెట్లను కోల్పోయింది. తర్వాత వచ్చిన రింకూ (9)ను పీటరే అవుట్ చేశాడు. రింకూ ఆడిన షాట్‌ను షార్ట్‌ఫైన్ లెగ్‌లో కొయెట్జీ అందుకున్నాడు. ఎట్టకేలకు 17వ ఓవర్లో పాండ్యా బౌండరీతో జట్టు స్కోరు వందకు చేరింది. జాన్సెన్ వేసిన 18వ ఓవర్లో పాండ్యా 2 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. చివరి రెండు డెత్ ఓవర్లను కొయెట్జీ, జాన్సెన్ చక్కగా నియంత్రించారు. పాండ్యా ఆఖరిదాకా క్రీజులో ఉన్నప్పటికీ కొయెట్జీ 19వ ఓవర్లో 3 పరుగులే ఇవ్వగా, జాన్సన్ ఆఖరి ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. వరుణ్ తిప్పేసినా... సొంతగడ్డపై ప్రత్యర్థి స్వల్ప లక్ష్యమే నిర్దేశించినా... దక్షిణాఫ్రికా ఆపసోపాలు పడి గెలిచింది. హెండ్రిక్స్, కెపె్టన్ మార్క్రమ్ (3), జాన్సెన్ (7), క్లాసెన్ (2), మిల్లర్ (0)లను అవుట్ చేసిన వరుణ్ చక్రవర్తి ఆశలు రేపాడు. ఒక దశలో 64/3 వద్ద పటిష్టంగా కనిపించిన సఫారీ అంతలోనే వరుణ్ స్పిన్ ఉచ్చులో పడి 66 పరుగులకే 6 వికెట్లను కోల్పోయి ఓటమి ప్రమాదాన్ని తెచ్చుకుంది. కాసేపటికే సిమ్‌లేన్ (7)ను రవి బిష్ణోయ్ బౌల్డ్ చేయడంతో భారత్ శిబిరం ఆనందంలో మునిగితేలింది. 24 బంతుల్లో 37 పరుగులు చేయాల్సి ఉండగా, అర్ష్ దీప్ 17వ ఓవర్లో కొయెట్జీ 6, స్టబ్స్ 4 బాదారు. దీంతోనే సఫారీ జట్టు స్కోరు 100కు చేరింది. ఇక 18 బంతుల్లో 24 పరుగుల సమీకరణం వద్ద అవేశ్ బౌలింగ్‌కు దిగడంతో మ్యాచ్ స్వరూపమే మారింది. చెత్త బంతులేసిన అవేశ్ ఖాన్ రెండు ఫోర్లు సహా 12 పరుగులు సమర్పించుకున్నాడు. తర్వాతి ఓవర్ అర్ష్ దీప్ వేయగా స్టబ్స్ 4, 4, 0, 0, 4, 4లతో ఇంకో ఓవర్ మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (బి) జాన్సెన్ 0; అభిషేక్ (సి) జాన్సెన్ (బి) కొయెట్జీ 4; సూర్యకుమార్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిమ్‌లేన్ 4; తిలక్ (సి) మిల్లర్ (బి) మార్క్రమ్ 20; అక్షర్ (రనౌట్) 27; పాండ్యా (నాటౌట్) 39; రింకూ (సి) కొయెట్జీ (బి) పీటర్ 9; అర్ష్ దీప్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 124. వికెట్ల పతనం: 1–0, 2–5, 3–15, 4–45, 5–70, 6–87. బౌలింగ్: జాన్సెన్ 4–1–25–1, కొయెట్జీ 4–0–25–1, సిమ్‌లేన్ 3–0–20–1, కేశవ్ 4–0– 24–0, మార్క్రమ్ 1–0–4–1, పీటర్ 4–0–20–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) రింకూ (బి) అర్ష్ దీప్ 13; హెండ్రిక్స్ (బి) వరుణ్ 24; మార్క్రమ్ (బి) వరుణ్ 3; స్టబ్స్ (నాటౌట్) 47; జాన్సెన్ (బి) వరుణ్ 7; క్లాసెన్ (సి) రింకూ (బి) వరుణ్ 2; మిల్లర్ (బి) వరుణ్ 0; సిమ్‌లేన్ (బి) బిష్ణోయ్ 7; కొయెట్జీ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో 7 వికెట్లకు) 128. వికెట్ల పతనం: 1–22, 2–33, 3–44, 4–64, 5–66, 6–66, 7–86. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–41–1, అవేశ్ 3–0–23–0, హార్దిక్ 3–0–22–0, వరుణ్ 4–0–17–5, రవి బిష్ణోయ్ 4–0–21–1, అక్షర్ 1–0–2–0. -
మరో విజయం లక్ష్యంగా...
జిఖెబెర్హా (పోర్ట్ ఎలిజబెత్): టి20 క్రికెట్లో జోరు కొనసాగించాలని పట్టుదలగా ఉన్న భారత జట్టు మరో పోరుకు సన్నద్ధమైంది. నేడు దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టి20లో భారత్ తలపడుతుంది. తొలి మ్యాచ్‌లో నెగ్గిన టీమిండియా ఇక్కడా విజయం సాధిస్తే 2–0తో ముందంజ వేస్తుంది. నాలుగు మ్యాచ్‌ల ఈ సమరంలో ఆపై సిరీస్ కోల్పోయే అవకాశం మాత్రం ఉండదు. మరో వైపు స్వదేశంలో కూడా ప్రభావం చూపలేక సమష్టి వైఫల్యంతో చిత్తయిన దక్షిణాఫ్రికాపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తమ అవకాశాలు కాపాడుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. ఇక్కడి పిచ్‌పై చక్కటి బౌన్స్ ఉండటంతో అటు బ్యాటింగ్‌కు, ఇటు పేస్ బౌలింగ్‌కు అనుకూలం కాబట్టి ఆసక్తికర పోరు జరగవచ్చు. మ్యాచ్ రోజున వర్షం పడే అవకాశం తక్కువ. అంతర్జాతీయ టి20ల్లో వరుసగా 11 మ్యాచ్‌లు గెలిచిన భారత్ ఈ సారి కూడా విజయం సాధిస్తే తమ రికార్డు (12 మ్యాచ్‌లు)నే సమం చేస్తుంది. అందరూ చెలరేగితే... తొలి టి20లో భారత్ బ్యాటింగ్ పదునేమిటో కనిపించింది. ఇన్నింగ్స్ చివర్లో కాస్త తడబాటుకు గురైనా స్కోరు 200 దాటడం విశేషం. సంజు సామ్సన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతుండటం సానుకూలాశం కాగా మరో ఓపెనర్ అభిషేక్ శర్మ అంచనాలను అందుకోవాల్సి ఉంది. వరుసగా విఫలమవుతున్న అతనికి ఇది చివరి అవకాశం కావచ్చు. సూర్యకుమార్ ఎప్పటిలాగే తనదైన శైలిలో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించడం ఖాయం. తిలక్ వర్మ కూడా తొలి పోరులో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. చివరి ఓవర్లలో వేగంగా ఆడే క్రమంలో పాండ్యా, రింకూ సింగ్ తొందరగానే అవుటైనా వారు తమ స్థాయికి తగినట్లు ఆడితే భారత్‌కు తిరుగుండదు. ఏడో స్థానంలో అక్షర్ పటేల్ లాంటి ఆల్‌రౌండర్ అందుబాటులో ఉండటం జట్టు బ్యాటింగ్ లోతును చూపిస్తోంది. బౌలింగ్‌లో కూడా వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ స్పిన్‌ను అర్థం చేసుకోవడంతో సఫారీలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పేసర్ అర్‡్షదీప్ కూడా సత్తా చాటుతుండగా...పునరాగమనంలో అవేశ్ ఆకట్టుకున్నాడు. ఇలాంటి లైనప్ ఉన్న జట్టు మరోసారి చెలరేగితే వరుసగా రెండో విజయం జట్టు ఖాతాలో చేరడం ఖాయం. గెలిపించేది ఎవరు... సొంతగడ్డపై ఇటీవలే విండీస్ చేతిలో 0–3తో టి20 సిరీస్‌ను చేజార్చుకున్న దక్షిణాఫ్రికా ఈ ఫార్మాట్లో ఇంకా తడబడుతూనే ఉంది. తొలి పోరులో బౌలర్ల వైఫల్యంతో ముందుగా భారీగా పరుగులిచ్చుకున్న జట్టు...ఆ తర్వాత బ్యాటింగ్‌లో సాధారణ ప్రదర్శన కూడా చూపించలేదు. మార్క్రమ్ మళ్లీ విఫలం కాగా...రికెల్టన్, స్టబ్స్ కూడా నిలబడలేకపోయారు. క్లాసెన్, మిల్లర్ జోడీపై జట్టు అతిగా ఆధారపడుతున్నట్లు అనిపిస్తోంది. వీరిద్దరు వెనుదిరిగితే చాలు ప్రత్యర్థి చేతికి మ్యాచ్ అప్పగించినట్లే కనిపిస్తోంది. పేరుకే ఆల్‌రౌండర్ అయినా మార్కో జాన్సెన్ ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. కొయెట్జీతో పాటు ఇతర బౌలర్లు కూడా రాణిస్తేనే భారత్‌ను సఫారీలు నిలువరించగలరు. పీటర్, సిమ్‌లేన్ గత మ్యాచ్‌లో విఫలమైనా... మరో మ్యాచ్‌లో అవకాశం దక్కవచ్చు. స్పిన్నర్‌గా కేశవ్ మహరాజ్ కూడా రాణించాల్సి ఉంది. -
IND vs BAN: న్యూఢిల్లీలో నితీశ్ ‘షో’.. సిరీస్ భారత్ సొంతం
అందివచ్చి న అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పడుతూ... ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో విజృంభించిన వేళ... బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. నితీశ్, రింకూ సింగ్ అర్ధశతకాలతో టీమిండియా భారీ స్కోరు చేయగా... బంగ్లాదేశ్ కనీస ప్రతిఘటన లేకుండానే పరాజయం పాలైంది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత జట్టు టి20 సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. సిరీస్‌లోని చివరిదైన మూడో టి20 మ్యాచ్ శనివారం హైదరాబాద్‌లో జరుగుతుంది. న్యూఢిల్లీ: టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత జట్టు... టి20ల్లోనూ అదే జోరు కనబర్చింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో సిరీస్ పట్టేసింది. స్వదేశంలో టీమిండియాకు ఇది వరుసగా 16వ సిరీస్ విజయం కావడం విశేషం. ఆంధ్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండ్ ప్రదర్శన ఫలితంగా... మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన రెండో టి20లో భారత్ 86 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. పరుగుల తేడా పరంగా బంగ్లాపై టీమిండియాకిదే అతిపెద్ద విజయం. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నితీశ్ (34 బంతుల్లో 74; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరిపించాడు. రింకూ సింగ్ (29 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా... హార్దిక్ పాండ్యా (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా దూకుడుగా ఆడాడు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. మహ్ముదుల్లా (39 బంతుల్లో 41; 3 సిక్సర్లు) మినహా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. వైజాగ్ కుర్రాడి వీరవిహారం... టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. రెండు బౌండరీలతో జోరు కనబర్చిన ఓపెనర్ సంజూ సామ్సన్ (10) రెండో ఓవర్ చివరి బంతికి ఔట్ కాగా.. కాసేపటికే మరో ఓపెనర్ అభిõÙక్ శర్మ (15) అతడిని అనుసరించాడు. కెప్టెన్ సూర్యకుమార్ (8) కూడా వెనుదిరగడంతో టీమిండియా 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో విశాఖపట్నం కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఫలితం రాబట్టాడు. మహ్ముదుల్లా బౌలింగ్‌లో 6,4తో మోత ప్రారంభించిన నితీశ్... రిషాద్ వేసిన 10వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి భారత స్కోరు 100 పరుగులు దాటింది. ఆడుతున్న రెండో మ్యాచ్‌లోనే భారీ సిక్సర్లతో విరుచుకుపడిన నితీశ్ 27 బంతుల్లో తొలి అంతర్జాతీయ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మిరాజ్ వేసిన 13వ ఓవర్లో నితీశ్ 6,4,2,6,6 బాది మొత్తం 26 పరుగులు రాబట్టాడు. ఇదే జోష్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి నితీశ్ ఔట్ కాగా.. ఆ తర్వాత బాదే బాధ్యత రింకూ, పాండ్యా తీసుకున్నారు. వీరిద్దరూ విజృంభించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. ఆది నుంచి తడబాటే! ఛేదన ఏ దశలోనూ బంగ్లాదేశ్ లక్ష్యం దిశగా సాగలేదు. భారత్ తరఫున బౌలింగ్ చేసిన ఏడుగురు ప్రభావవంతంగా బంతులు వేయగా... పరుగులు రాబట్టేందుకు బంగ్లా బ్యాటర్లు అష్టకష్టాలు పడ్డారు. మూడో ఓవర్లో పర్వేజ్ హుస్సేన్ (16)ను ఔట్ చేసి అర్ష్ దీప్ వికెట్ల పతనానికి తెరలేపగా... అది చివరి వరకు కొనసాగింది. వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ కూడా ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. బ్యాట్‌తో సంచలన ఇన్నింగ్స్ ఆడిన నితీశ్ కుమార్ రెడ్డి బంతితోనూ చెలరేగి తన కోటా 4 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) నజ్ముల్ (బి) తస్కీన్ 10; అభిషేక్ (బి) తన్జీమ్ 15; సూర్య (సి) నజు్మల్ (బి) ముస్తఫిజుర్ 8; నితీశ్ కుమార్ రెడ్డి (సి) మిరాజ్ (బి) ముస్తఫిజుర్ 74; రింకూ సింగ్ (సి) జాకిర్ అలీ (బి) తస్కీన్ 53; పాండ్యా (సి) మిరాజ్ (బి) రిషాద్ 32; రియాన్ పరాగ్ (సి) మహ్ముదుల్లా (బి) తన్జీమ్ 15; సుందర్ (నాటౌట్) 0; వరుణ్ చక్రవర్తి (సి) పర్వేజ్ (బి) రిషాద్ 0; అర్ష్ దీప్ (సి) లిటన్ దాస్ (బి) రిషాద్ 6; మయాంక్ యాదవ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–17, 2–25, 3–41, 4–149, 5–185, 6–213, 7–214, 8–214, 9–220, బౌలింగ్: మిరాజ్ 3–0–46–0; తస్కీన్ 4–0–16–2; తన్జీమ్ 4–0–50–2; ముస్తఫిజుర్ 4–0–36–2; రిషాద్ 4–0–55–3; మహ్ముదుల్లా 1–0–15–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: పర్వేజ్ (బి) అర్ష్ దీప్ 16; లిటన్ దాస్ (బి) వరుణ్ 14; నజ్ముల్ (సి) పాండ్యా (బి) సుందర్ 11; తౌహిద్ (బి) అభిõÙక్ 2; మిరాజ్ (సి) (సబ్) రవి బిష్ణోయ్ (బి) రియాన్ 16; మహ్ముదుల్లా (సి) రియాన్ (బి) నితీశ్ 41; జాకీర్ అలీ (సి) సుందర్ (బి) మయాంక్ యాదవ్ 1; రిషాద్ (సి) పాండ్యా (బి) వరుణ్ 9; తన్జీమ్ (సి) పాండ్యా (బి) నితీశ్ 8; తస్కీన్ (నాటౌట్) 5; ముస్తఫిజుర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1–20, 2–40, 3–42, 4–46, 5–80, 6–83, 7–93, 8–120, 9–127, బౌలింగ్: అర్ష్ దీప్ 3–0–26–1; నితీశ్ కుమార్ రెడ్డి 4–0–23–2; వాషింగ్టన్ సుందర్ 1–0–4–1; వరుణ్ చక్రవర్తి 4–0–19–2; అభిషేక్ 2–0–10–1; మయాంక్ యాదవ్ 4–0–30–1; రియాన్ పరాగ్ 2–0–16–1. -
సిరీస్ విజయంపై భారత్ గురి
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌పై తొలి టి20లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ మరో విజయంపై గురి పెట్టింది. గత మ్యాచ్ జోరును కొనసాగించి సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే రెండో టి20లో భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. తొలి మ్యాచ్ ప్రదర్శనను బట్టి చూస్తే మరో మాట లేకుండా భారతే ఫేవరెట్‌గా కనిపిస్తుండగా... బంగ్లా ఈసారైనా పోటీనిస్తుందా అనేది చూడాలి. దూకుడుకు మారుపేరుగా... తొలి టి20లో భారత జట్టు ఆటతీరు చూస్తే మరో గెలుపు కూడా కష్టం కాకపోవచ్చు. అర్‡్షదీప్, వరుణ్ చక్రవర్తి తమ బౌలింగ్‌తో బంగ్లాదేశ్ పని పట్టగా... ఇతర బౌలర్లు మయాంక్, సుందర్ కూడా ఒక చేయి వేశారు. వైవిధ్యమైన ఈ బౌలింగ్ దళానికి ప్రత్యర్థిని కట్టిపడేయగల సామర్థ్యం ఉంది. ఇక బ్యాటింగ్‌లోనైతే అందరూ చెలరేగిపోయారు. నాటౌట్‌గా నిలిచిన నితీశ్ కుమార్ రెడ్డి మినహా మిగతా నలుగురు బ్యాటర్లు 150కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించారు.ఈ ఫార్మాట్లో సూర్యకుమార్ ఎంత ప్రమాదకరమైన బ్యాటరో అందరికీ తెలిసిందే. రనౌట్ కాకపోయింటే అభిõÙక్ శర్మ కూడా విధ్వంసం సృష్టించేవాడే. ఇలాంటి స్థితిలో భారత్ మరోసారి పైచేయి సాధించేందుకు అన్ని విధాలా అవకాశం ఉంది. యువ పేసర్ హర్షిత్ రాణా రిజర్వ్‌లో ఉన్నా... వెంటనే మయాంక్‌ను తప్పించి అతడిని ఆడించే అవకాశాలు తక్కువ. అయితే నితీశ్ స్థానంలో తిలక్ వర్మకు చాన్స్ ఉంది. గెలిపించేదెవరు? టి20ల్లో బంగ్లాదేశ్ ఆట ఎప్పుడో దశాబ్దం క్రితం స్థాయిలోనే ఆగిపోయింది. ఇది గత మ్యాచ్‌లో మరోసారి కనిపించింది. బ్యాటర్ల నుంచి ఎలాంటి ధాటి కనిపించకపోగా... అనుభవం ఉన్న ప్రధాన ప్లేయర్లు సైతం తేలిపోతున్నారు. కెప్టెన్ నజు్మల్, మిరాజ్ కేవలం వంద పరుగుల స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించడం ఆ జట్టు పరిస్థితిని చూపించింది. ఇక జట్టు తరఫున అందరికంటే ఎక్కువగా 139 టి20లు ఆడిన అనుభవం ఉన్న మహ్ముదుల్లా కూడా ఇటీవల ఎలాంటి ప్రభావం చూపించలేకపోతున్నాడు. ఈ సిరీస్ తర్వాత రిటైర్ కానున్న అతను ఈ మ్యాచ్‌లోనైనా ప్రభావం చూపిస్తే బంగ్లా పరువు దక్కుతుంది. పిచ్, వాతావరణం ఫిరోజ్‌షా కోట్లా మైదానం బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్. ఐపీఎల్లో భారీ స్కోర్లు వచ్చాయి. ఈసారీ అదే జరగవచ్చు. అనుకూల వాతావరణం ఉంది. మ్యాచ్ రోజున వర్ష సూచన లేదు. 2 ఫిరోజ్‌షా కోట్లా (అరుణ్ జైట్లీ స్టేడియం) మైదానంలో ఇప్పటి వరకు భారత జట్టు 3 టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 1 మ్యాచ్‌లో గెలిచి, 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 2017లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 53 పరుగులతో నెగ్గిన భారత్... 2019లో బంగ్లాదేశ్ చేతిలో 7వికెట్ల తేడాతో... 2022లో దక్షిణాఫ్రికా చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. -
టీమిండియాకు షాక్.. రెండో వన్డేలో శ్రీలంక సంచలన విజయం
శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో భారత్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 241 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ను లంక స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే (10-0-33-6) దారుణంగా దెబ్బతీశాడు. వాండర్సేకు అసలంక (6.2-2-20-3) కూడా తోడవ్వడంతో టీమిండియా 208 పరుగులకు (42.2 ఓవర్లలో) ఆలౌటైంది. ఛేదనలో రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో (44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టీమిండియాకు శుభారంభాన్ని అందించాడు. దీన్ని భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్‌తో పాటు శుభ్‌మన్ గిల్ (35), అక్షర్ పటేల్ (44) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విరాట్ (14), శివమ్ దూబే (0), శ్రేయస్ అయ్యర్ (7), కేఎల్ రాహుల్ (0) దారుణంగా విఫలమయ్యారు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12, వెల్లలగే 37, కమిందు మెండిస్ 40, అఖిల ధనంజయ 15 పరుగులు చేసి ఔట్ కాగా.. జెఫ్రీ వాండర్సే 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో శ్రీలంక మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి వన్డే టైగా ముగిసిన విషయం తెలిసిందే. సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే ఆగస్ట్ 7న జరుగనుంది. -
అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన శాంసన్
టీమిండియాలో మోస్ట్ అన్ లక్కీ క్రికెటర్‌గా సంజూ శాంసన్‌కు పేరుంది. ఈ విషయాన్ని అతను మరోసారి నిరూపించాడు. శుభ్‌మన్ గిల్‌కు మెడ పట్టేయడంతో శ్రీలంకతో రెండో టీ20లో అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చిన సంజూ.. ఈ మ్యాచ్‌లో తానెదుర్కొన్న తొలి బంతికే క్లీన్ బౌల్డై అందరినీ నిరాశపరిచాడు. సంజూ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడంతో నెటిజన్లు అతన్ని ఘోరంగా ఆడుకుంటున్నారు. pic.twitter.com/t5KrrijCqt— hiri_azam (@HiriAzam) July 28, 2024అవకాశాలు రాకపోతే ఇవ్వలేదంటారు.. వస్తే ఇలా చేస్తాడంటూ కామెంట్లు చేస్తున్నారు. సంజూ గోల్డెన్ డకౌటైన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ మ్యాచ్‌లో సంజూ మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో ఔటయ్యాడు.మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా (53) అర్ద సెంచరీతో రాణించగా.. పథుమ్ నిస్సంక (32), కమిందు మెండిస్ (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. శ్రీలంక చివరి ఏడు వికెట్లు 31 పరుగుల వ్యవధిలో కోల్పోయి భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. రవి బిష్ణోయ్ (4-0-26-3), అర్ష్‌దీప్ సింగ్ (3-0-24-2), అక్షర్ పటేల్ (4-0-30-2), హార్దిక్ పాండ్యా (2-0-23-2) లంకేయులను భారీగా దెబ్బేశారు.అనంతరం భారత్ ఛేదనకు దిగే సమయానికి వర్షం మొదలైంది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులకు కుదించారు. ఛేదనలో భారత్ ఆదిలోనే సంజూ శాంసన్ వికెట్ కోల్పోయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేసింది. యశస్వి జైస్వాల్ (15 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (12 బంతుల్లో 26; 4 ఫోర్లు, సిక్స్), హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపించారు. ఆఖర్లో హార్దిక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస బౌండరీలు, సిక్సర్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు. బంతితో రాణించిన హార్దిక్ బ్యాట్‌తోనూ చెలరేగాడు. ఫలితంగా భారత్ 6.3 ఓవరల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది (3 వికెట్ల నష్టానికి). ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 రేపు (జులై 30) జరుగనుంది. -
మరో విజయం... సిరీస్ భారత్ సొంతం
పల్లెకెలె: చినుకులు పడినా... ఆట చాలాసేపు ఆగినా... భారత బ్యాటర్ల మెరుపుల్ని , విజయాన్ని ఎవరూ ఆపలేకపోయారు. దీంతో ఆదివారం జరిగిన రెండో టి20లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ 7 వికెట్ల తేడాతో లంకను ఓడించింది. ఇంకా 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా... ఇంకో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. మొదట శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.టాపార్డర్‌లో కుశాల్ పెరీరా (34 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించగా, ఓపెనర్ నిసాంక (24 బంతుల్లో 32; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రవి బిష్ణోయ్ (3/26) కీలక వికెట్లు తీసి లంక ఇన్నింగ్స్‌కు అడ్డుకట్ట వేశాడు. అర్‡్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ లక్ష్యఛేదనకు దిగగానే వానొచ్చి మ్యాచ్‌ను ఆటంక పరచడంతో లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా సవరించారు. దీన్ని టీమిండియా 6.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసి ఛేదించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (15 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్ (12 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) గెలిచేందుకు అవసరమైన మెరుపులు మెరిపించారు. సిరీస్‌లో చివరిదైన మూడో టి20 మ్యాచ్ మంగళవారం జరుగుతుంది. పెరీరా ఫిఫ్టీ తొలి మ్యాచ్‌లో చెలరేగిన ఓపెనర్లు కుశాల్ మెండిస్ (10), నిసాంకలను భారత బౌలర్లు ఈసారి కట్టడి చేశారు. అయితే వన్‌డౌన్ బ్యాటర్ పెరీరా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. నిసాంక, కమిండు మెండీస్ (23 బంతుల్లో 26; 4 ఫోర్లు)లతో కలిసి జట్టు స్కోరు పెంచాడు. 31 బంతుల్లో పెరీరా అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాండ్యా ఒకే ఓవర్లో మెండిస్, పెరీరాలను అవుట్ చేస్తే... రవి బిష్ణోయ్ కూడా తర్వాతి ఓవర్లో షనక (0), హసరంగ (0)లను డకౌట్ చేయడంతో లంక తడబడింది. తర్వాత రమేశ్ (12) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. సులువుగా దంచేశారు! వాన తర్వాత భారత లక్ష్యం 8 ఓవర్లలో 78 పరుగులుగా మారింది. అప్పటికే 3 బంతులు పడటంతో 45 బంతుల్లో 72 పరుగుల సమీకరణం భారత్‌కు ఏమంత కష్టం కాలేదు. సంజూ సామ్సన్ (0) డకౌటైనా... కెపె్టన్ సూర్యకుమార్, ఓపెనర్ యశస్వి దంచేసే పనిలో పడ్డారు. హసరంగ మూడో ఓవర్లో జైస్వాల్ 6, 4 కొడితే సూర్య మరో బౌండరీ బాదడంతో 16 పరుగులు వచ్చాయి. తీక్షణ మరుసటి ఓవర్లో సూర్యకుమార్ ‘హ్యాట్రిక్’ ఫోర్లు కొట్టి మరో 15 పరుగులు రాబట్టాడు. ఇదే ఊపులో పతిరణ ఐదో ఓవర్లో భారీ సిక్సర్ బాదిన సూర్య తర్వాతి బంతికే అవుటయ్యాడు. 5 ఓవర్లలో భారత్ 54/2 స్కోరు చేసింది. ఇక 18 బంతుల్లో 24 పరుగులు చేయాల్సివుండగా, 6వ ఓవర్లో సిక్స్‌కొట్టి యశస్వి అవుటైనా... హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) దంచేయడంతో 18 పరుగులొచ్చాయి. మరుసటి ఓవర్లో పాండ్యా రెండు బౌండరీలతో మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (ఎల్బీడబ్ల్యూ) (బి) బిష్ణోయ్ 32; కుశాల్ మెండిస్ (సి) బిష్ణోయ్ (బి) అర్‡్షదీప్ 10; పెరీరా (సి) రింకూ సింగ్ (బి) పాండ్యా 54; కమిండు మెండిస్ (సి) రింకూ సింగ్ (బి) పాండ్యా 26; అసలంక (సి) సంజూ సామ్సన్ (బి) అర్‡్షదీప్ 14; షనక (బి) బిష్ణోయ్ 0; హసరంగ (బి) బిష్ణోయ్ 0; రమేశ్ మెండిస్ (స్టంప్డ్) పంత్ (బి) అక్షర్ 12; తీక్షణ (బి) అక్షర్ 2; పతిరణ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–26, 2–80, 3–130, 4–139, 5–140, 6–140, 7–151, 8–154, 9–161. బౌలింగ్: సిరాజ్ 3–0–27–0, అర్శ్‌దీప్ 3–0–24–2, అక్షర్ 4–0–30–2, రవి బిష్ణోయ్ 4–0–26–3, పరాగ్ 4–0–30–0, పాండ్యా 2–0–23–2. భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) షనక (బి) హసరంగ 30; సంజూ సామ్సన్ (బి) తీక్షణ 0; సూర్యకుమార్ (సి) షనక (బి) పతిరణ 26; పాండ్యా (నాటౌట్) 22; పంత్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (6.3 ఓవర్లలో 3 వికెట్లకు) 81. వికెట్ల పతనం: 1–12, 2–51, 3–65. బౌలింగ్: షనక 1–0–12–0, తీక్షణ 2–0–16–1, హసరంగ 2–0–34–1, పతిరణ 1.3–0–18–1. -
లంకతో రెండో టీ20.. టాస్ గెలిచిన భారత్.. సంజూ శాంసన్ ఎంట్రీ
పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరగాల్సిన రెండో టీ20లో భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ 45 నిమిషాలు ఆలస్యమైంది. ఈ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక చెరో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. లంక తరఫున దిల్షన్ మధుషంక స్థానంలో రమేశ్ మెండిస్.. భారత్ తరఫున శుభ్‌మన్ గిల్ స్థానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి వచ్చారు. గిల్ మెడ పట్టేయడంతో ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. భారతకాలమానం ప్రకారం రాత్రి 7:45 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిన్న జరిగిన తొలి టీ20లో టీమిండియా 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో టీ20 ఇదే వేదికగా జులై 30న జరుగనుంది. తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుసల్ మెండిస్(వికెట్‌కీపర్), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక(కెప్టెన్), దసున్ షనక, వనిందు హసరంగ, రమేష్ మెండిస్, మహేశ్ తీక్షణ, మతీష పతిరణ, అసిత ఫెర్నాండో -
అభిషేక్ అదరహో...
హరారే: అంతర్జాతీయ వేదికపై తన ఆగమనాన్ని అదరగొట్టే ఇన్నింగ్స్‌తో అభిషేక్ శర్మ చాటుకున్నాడు. జింబాబ్వేతో ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ సెంచరీ సాధించాడు. శనివారం జరిగిన తొలి టి20లో ‘సున్నా’కే అవుటైన ఈ పంజాబ్ బ్యాటర్ రెండో టి20లో మాత్రం ‘శత’క్కొట్టాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో చెలరేగిపోయిన అభిõÙక్ సరిగ్గా 100 పరుగులు చేసి అవుటయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77; 11 ఫోర్లు, 1 సిక్స్), రింకూ సింగ్ (22 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా మెరిపించడంతో భారత జట్టు 100 పరుగుల తేడాతో జింబాబ్వేపై ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. టి20ల్లో జింబాబ్వేపై ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే. అనంతరం 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. మధెవెరె (39 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్), జోంగ్వి (26 బంతుల్లో 33; 4 ఫోర్లు) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ (3/37), అవేశ్ ఖాన్ (3/15), రవి బిష్ణోయ్ (2/11) రాణించారు. అభిõÙక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (2) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. గిల్ అవుటయ్యాక అభిõÙక్, రుతురాజ్ భారత ఇన్నింగ్స్‌ను నడిపించారు. వ్యక్తిగత స్కోరు 27 పరుగులవద్ద అభిõÙక్ ఇచ్చిన క్యాచ్‌ను మసకద్జా వదిలేశాడు. ఆ తర్వాత అభిõÙక్ చెలరేగిపోయాడు. మైర్స్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో అభిషేక్ 2,4,6,4,6,4తో 28 పరుగులు సాధించాడు. దాంతో భారత స్కోరు 100 పరుగులు దాటింది.మసకద్జా వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో అభిõÙక్ వరుసగా 3 సిక్స్‌లు కొట్టి 46 బంతుల్లోనే తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే మైర్స్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ పెవిలియన్ చేరుకన్నాడు. రుతురాజ్‌తో కలిసి అభిõÙక్ రెండో వికెట్‌కు 137 పరుగులు జోడించాడు. అభిషేక్ నిష్క్రమించాక వచ్చిన రింకూ సింగ్ కూడా దూకుడుగా ఆడటంతో భారత స్కోరు 200 పరుగులు దాటింది. భారత్ చివరి 10 ఓవర్లలో 160 పరుగులు చేయడం విశేషం. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. మూడో మ్యాచ్ బుధవారం జరుగుతుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: శుబ్‌మన్ గిల్ (సి) బెనెట్ (బి) ముజరబాని 2; అభిషేక్ శర్మ (సి) మైర్స్ (బి) మసకద్జా 100; రుతురాజ్ గైక్వాడ్ (నాటౌట్) 77; రింకూ సింగ్ (నాటౌట్) 48; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 234. వికెట్ల పతనం: 1–10, 2–147. బౌలింగ్: బెనెట్ 2–0–22–0, ముజరబాని 4–1–30–1, చటారా 4–0–38–0, సికందర్ రజా 3–0–34–0, జోంగ్వి 4–0–53–0, మైర్స్ 1–0–28–0, మసకద్జా 2–0–29–1. జింబాబ్వే ఇన్నింగ్స్: ఇన్నోసెంట్ కాయా (బి) ముకేశ్ కుమార్ 4; మధెవెరె (బి) రవి బిష్ణోయ్ 43; బెనెట్ (బి) ముకేశ్ కుమార్ 26; మైర్స్ (సి) రింకూ సింగ్ (బి) అవేశ్ ఖాన్ 0; సికందర్ రజా (సి) ధ్రువ్ జురేల్ (బి) అవేశ్ ఖాన్ 4; క్యాంప్‌బెల్ (సి) రవి బిష్ణోయ్ (బి) సుందర్ 10; మదాండె (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 0; మసకద్జా (రనౌట్) 1; జోంగ్వి (సి) రుతురాజ్ (బి) ముకేశ్ కుమార్ 33; ముజరబాని (సి) సుందర్ (బి) అవేశ్ ఖాన్ 2; చటారా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 134. వికెట్ల పతనం: 1–4, 2–40, 3–41, 4–46, 5–72, 6–73, 7–76, 8–117, 9–123, 10–134. బౌలింగ్: ముకేశ్ 3.4–0– 37–3, అభిషేక్ శర్మ 3–0–36–0, అవేశ్ 3–0– 15–3, రవి బిష్ణోయ్ 4–0–11–2, వాషింగ్టన్ సుందర్ 4–0– 28–1, పరాగ్ 1–0–5–0. -
రెండో టి20 వర్షార్పణం
చెన్నై: భారీ వర్షం కారణంగా భారత్, దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్ల మధ్య ఆదివారం రెండో టి20 మ్యాచ్ రద్దయింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు సాధించింది. తజీ్మన్ బ్రిట్స్ (39 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్), అనెక్ బోష్ (32 బంతుల్లో 40; 6 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో పూజా వస్త్రకర్, దీప్తి శర్మ రెండు వికెట్ల చొప్పున తీశారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగియగానే వర్షం మొదలైంది. రాత్రి 10 దాటినా వాన తగ్గుముఖం పట్టకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలి టి20లో నెగ్గిన దక్షిణాఫ్రికా 1–0తో ఆధిక్యంలో ఉంది. చివరిదైన మూడో టి20 మ్యాచ్ మంగళవారం జరుగుతుంది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: లౌరా వొల్వార్ట్ (సి) రాధా యాదవ్ (బి) పూజా వస్త్రకర్ 22; తజీ్మన్ బ్రిట్స్ (స్టంప్డ్) ఉమా ఛెత్రి (బి) దీప్తి 52; మరిజన్ కాప్ (సి) సజన (బి) దీప్తి శర్మ 20; అనెక్ బోష్ (బి) శ్రేయాంక 40; చోల్ టైరన్ (సి అండ్ బి) రాధా యాదవ్ 12; నదినె డి క్లెర్క్ (సి) సజన (బి) పూజా వస్త్రకర్ 14; డెర్సెక్సన్ (నాటౌట్) 12; ఎలీజ్ మార్క్స్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–43, 2–75, 3–113, 4–131, 5–164, 6–164. బౌలింగ్: పూజా వస్త్రకర్ 4–0–37–2, సజన సజీవన్ 1–0–13–0, అరుంధతి రెడ్డి 4–0–37–0, శ్రేయాంక పాటిల్ 4–0–37–1, రాధా యాదవ్ 3–0–31–1, దీప్తి శర్మ 4–0–20–2. -
రెండో టి20లోనూ భారత మహిళల గెలుపు
సిల్హెట్: బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం జరిగిన రెండో టి20కి వర్షం అంతరాయం కలిగించగా.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 19 పరుగులతో బంగ్లాదేశ్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 119 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ ముర్షిదా ఖాటున్ (49 బంతుల్లో 46; 5 ఫోర్లు) రాణించగా, రీతూ మోని (18 బంతుల్లో 20; 2 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. రాధా యాదవ్ 3, శ్రేయాంక, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు వర్షంతో ఆట నిలిచే సమయానికి 5.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్ షఫాలీ వర్మ (0) డకౌట్ కాగా, స్మృతి మంధాన (5 నాటౌట్) నింపాదిగా ఆడింది. కానీ హేమలత దయాళన్ (24 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగింది. మైదానం చిత్తడిగా మారడంతో మళ్లీ మ్యాచ్ కొనసాగించే అవకాశం లేకపోయింది. హేమలతకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది. -
శ్రీలంకకు షాకిచ్చిన బంగ్లాదేశ్
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (మార్చి 6) జరిగిన రెండో మ్యాచ్‌లో పర్యాటక శ్రీలంకకు ఆతిథ్య బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. అన్ని విభాగాల్లో తమకంటే మెరుగైన శ్రీలంకను బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ ఆడుతూ పాడుతూ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో అజేయ అర్దసెంచరీతో (53), తౌహిద్ హ్రిదోయ్ అజేయమైన 32 పరుగులతో బంగ్లాదేశ్‌ను విజయతీరాలకు చేర్చారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో లిటన్ దాస్ (36), సౌమ్య సర్కార్ (26) కూడా ఓ మోస్తరుగా రాణించారు. బంగ్లాదేశ్ కోల్పోయిన రెండు వికెట్లు మతీశ పతిరణ ఖాతాలోకి వెళ్లాయి. అంతకుముందు శ్రీలంక ఇన్నింగ్స్‌లో కనీసం ఒక్క భారీ స్కోర్ కూడా నమోదు కాలేదు. అవిష్క ఫెర్నాండో 0, కుశాల్ మెండిస్ 36, కమిందు మెండిస్ 37, సమరవిక్రమ 7, అసలంక 28, మాథ్యూస్ 32 నాటౌట్, షనక 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, మెహిది హసన్, ముస్తాఫిజుర్, సౌమ్య సర్కార్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో శ్రీలంక గెలుపొందింది. నిర్ణయాత్మక మూడో టీ20 మార్చి 9న జరుగనుంది. -
నిప్పులు చెరిగిన ఫెర్గూసన్.. అయినా చిత్తుగా ఓడిన న్యూజిలాండ్
ఆక్లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ చిత్తుగా ఓడింది. ఫెర్గూసన్ నిప్పులు చెరిగినప్పటికీ (3.5-0-12-4) న్యూజిలాండ్ ఓటమిపాలైంది. ఫెర్గూసన్ ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో చేతులెత్తేసిన న్యూజిలాండ్ 17 ఓవర్లలో 102 పరుగులకే చాపచుట్టేసి, 72 పరుగుల తేడాతో ఓడి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నిప్పులు చెరిగిన ఫెర్గూసన్.. ఫెర్గూసన్‌తో పాటు ఆడమ్ మిల్నే (2/40), బెన్ సియర్స్ (2/29), మిచెల్ సాంట్నర్ (2/35) రాణించడంతో ఆస్ట్రేలియా ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రవిడ్ హెడ్ (45) కాస్త పర్వాలేదనిపించాడు. కమిన్స్ (28), మార్ష్ (26), టిమ్ డేవిడ్ (17), స్టీవ్ స్మిత్ (11), నాథన్ ఇల్లిస్ (11 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మ్యాక్స్‌వెల్ (6), ఇంగ్లిస్ (5), మాథ్యూ వేడ్ (1), జంపా (1), హాజిల్‌వుడ్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. జంపా మాయాజాలం.. 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఆడమ్ జంపా (4-0-34-4) మాయాజాలం దెబ్బకు 102 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లలో ఇల్లిస్ (2/16), హాజిల్‌వుడ్ (1/12), కమిన్స్ (1/19), మార్ష్ (1/18) కూడా రాణించారు. కివీస్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ (42) చేశాడు. ఫిలిప్స్‌తో పాటు జోష్ క్లార్క్సన్ (10), బౌల్ట్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఫిన్ అలెన్ (6), విల్ యంగ్ (5), సాంట్నర్ (7), చాప్మన్ (2), మిల్నే (0), ఫెర్గూసన్ (4) దారుణంగా విఫలమయ్యారు. ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ డెవాన్ కాన్వే బ్యాటింగ్‌కు దిగలేదు. ఈ సిరీస్‌లోని నామమాత్రపు మూడో మ్యాచ్ ఫిబ్రవరి 25న ఇదే ఆక్లాండ్‌లో జరుగనుంది. -
రాణించిన సమరవిక్రమ.. చెలరేగిన హసరంగ, మాథ్యూస్
డంబుల్లా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక జట్టు ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవరల్లో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. మిడిలార్డర్ ఆటగాడు సమరవిక్రమ (42 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్దసెంచరీతో రాణించాడు. ఆఖర్లో హసరంగ (9 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (22 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. ఓపెనర్లు పథుమ్ నిస్సంక (11 బంతుల్లో 25; 5 ఫోర్లు), కుశాల్ మెండిస్‌లకు (14 బంతుల్లో 23; 4 ఫోర్లు) శుభారంభం లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ధనంజయ డిసిల్వ 14, అసలంక 4 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఫ్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా, మొహమ్మద్ నబీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఫజల్ హాక్ ఫారూకీ, నవీన్ ఉల్ హాక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్ (1), ఇబ్రహీం జద్రాన్ (10) ఔట్ కాగా.. రహ్మానుల్లా గుర్బాజ్ (9), గుల్బదిన్ నైబ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లో చెలరేగిన ఏంజెలో మాథ్యూస్ బౌలింగ్‌లోనూ సత్తా చాటి రెండు వికెట్లు పడగొట్టాడు. మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో శ్రీలంక తొలి మ్యాచ్‌లో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
మ్యాక్స్‌వెల్ మెరుపు శతకం.. విండీస్‌ను చిత్తు చేసిన ఆసీస్
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అడిలైడ్ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగిన రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాక్స్‌వెల్ విధ్వంకర శతకంతో (55 బంతుల్లో 120; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో టిమ్ డేవిడ్ (14 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (19 బంతుల్లో 22; 3 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ మిచెల్ మార్ష్ (12 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. జోష్ ఇంగ్లిస్ (4) విఫలం కాగా.. స్టోయినిస్ 15 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో జేసన్ హొల్డర్ 2, అల్జరీ జోసఫ్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ చివరి వరకు పోరాడినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేయగలిగింది. విండీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (63) అర్దసెంచరీతో రాణించగా.. ఆండ్రీ రసెల్ (37), జేసన్ హోల్డర్ (28 నాటౌట్), జాన్సన్ చార్లెస్ (24) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. విండీస్ ఇన్నింగ్స్‌లో అందరూ తలో చేయి వేసినా లక్ష్యం పెద్దది కావడంతో ఓటమి తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో స్టోయినిస్ 3 వికెట్లతో చెలరేగగా.. హాజిల్‌వుడ్, స్పెన్సర్ జాన్సన్ చెరో 2 వికెట్లు, బెహ్రెన్‌డార్ఫ్, జంపా తలో వికెట్ పడగొట్టారు. నామమాత్రపు మూడో టీ20 ఫిబ్రవరి 13న జరుగనుంది. -
మ్యాక్స్‌వెల్ మహోగ్రరూపం.. విధ్వంసకర శతకం
అడిలైడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆసీస్ స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 50 బంతుల్లోనే 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం చేశాడు. ఫలితంగా ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టీ20ల్లో మ్యాక్స్‌వెల్‌కు ఇది ఐదో శతకం. అంతర్జాతీయ టీ20ల్లో కేవలం రోహిత్ శర్మ మాత్రమే ఇన్ని శతకాలు చేశాడు. మ్యాక్సీ ఊచకోత ధాటికి విండీస్ బౌలర్లు విలవిలలాడిపోయారు. మ్యాక్స్‌వెల్ వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్‌లోకి తరలించాడు. ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ 120 పరుగులు (55 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (14 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మ్యాక్సీకి జతయ్యాడు. వీరిద్దరూ విండీస్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. SWITCH HIT FOR SIX BY MAXWELL 🤯🔥pic.twitter.com/wZ73ZsmhBm — Johns. (@CricCrazyJohns) February 11, 2024 వార్నర్ (19 బంతుల్లో 22; 3 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ మిచెల్ మార్ష్ (12 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తమదైన శైలిలో మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడగా.. జోష్ ఇంగ్లిస్ (4) విఫలమయ్యాడు. స్టోయినిస్ 15 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. మొత్తంగా ఆసీస్ బ్యాటర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో విండీస్ బౌలింగ్ లైనప్ కకావికలమైంది. ఆ జట్టు బౌలర్లలో జేసన్ హోల్డర్ 2, అల్జరీ జోసఫ్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. అల్జరీ జోసఫ్ ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో విండీస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరిదైన మూడో టీ20 పెర్త్ వేదికగా ఫిబ్రవరి 13న జరుగనుంది. -
రోహిత్, పంత్‌లను అధిగమించిన యశస్వి జైస్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓ విషయంలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌లను అధిగమించాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20 అనంతరం యశస్వి సాధించిన ఈ ఘనతకు సంబంధించిన విశేషాలు బయటికి వచ్చాయి. టీ20ల్లో 23 ఏళ్లు దాటక ముందే అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన భారత బ్యాటర్‌గా యశస్వి రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో అతను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు రిషబ్ పంత్, అప్ కమింగ్ ప్లేయర్ తిలక్ వర్మల పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును అధిగమించాడు. రోహిత్, పంత్, తిలక్ ముగ్గురూ 23 ఏళ్లు దాటకముందు రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేయగా.. యశస్వి ఏకంగా నాలుగు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ బాదాడు. 22 ఏళ్ల యశస్వి 16 టీ20ల్లోనే 163.83 స్ట్రయిక్‌రేట్‌తో 498 పరుగులు చేశాడు. Young and unstoppable! Yashasvi Jaiswal notches up five fifties in T20Is before turning 23, setting a new record for the most by an Indian player. pic.twitter.com/IFNTeB35iW— CricTracker (@Cricketracker) January 16, 2024 కాగా, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో 34 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేసిన యశస్వి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. యశస్వితో పాటు శివమ్ దూబే (63 నాటౌట్) కూడా మెరుపులు మెరిపించడంతో ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. గుల్బదిన్ (57) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. అర్ష్‌దీప్ 3, అక్షర్, భిష్ణోయ్ తలో 2 వికెట్లు, శివమ్ దూబే ఓ వికెట్ పడగొట్టారు. ఛేదనలో దూబే, జైస్వాల్ భారత్ ఘన విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 బెంగళూరు వేదికగా జనవరి 17న జరుగనుంది. -
Viral Video: విరాట్ క్రేజ్ అట్లుంటది మరి..!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కోహ్లి ప్రపంచంలోని ఏ మూలలో ఉన్నా జనాలు అతని దర్శనం కోసం ఎగబడతారు. భారత్‌లో అయితే పరిస్థితి ఇంకోలా ఉంటుంది. విరాట్ ఎక్కడ ఉంటే అక్కడ జాతరను తలపిస్తుంది. రన్ మెషీన్‌ను చూసేందుకు జనాలు పోటెత్తుతారు. ఈ మధ్యకాలంలో అయితే కోహ్లి ఆన్ ద ఫీల్డ్ ఉన్నా అభిమానులు వదిలిపెట్టడం లేదు. మైదానంలోకి దూసుకొచ్చి మరీ తమ ఆరాధ్య క్రికెటర్‌ను కలుస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా మరొకటి జరిగింది. The moment when a fan touched Virat Kohli's feet and hugged him. - King Kohli, the crowd favourite. 😍pic.twitter.com/NfShGwtF8I — Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 2024 ఇండోర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న (జనవరి 14) జరిగిన రెండో టీ20 సందర్భంగా ఓ అభిమాని కోహ్లిని కలిసేందుకు మైదానంలోకి చొచ్చుకొచ్చాడు. సదరు ఫ్యాన్ గ్రౌండ్ సిబ్బంది కళ్లు కప్పి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి వద్దకు వచ్చి కాళ్లు మొక్కి, కౌగిలించుకున్నాడు. తొలుత ఆ అభిమాని తనవైపు వస్తున్నప్పుడు కాస్త అసౌకర్యంగా కనిపించిన కోహ్లి ఆ తర్వాత అతన్ని హత్తుకున్నాడు. ఈలోపు సిబ్బంది వచ్చి ఆ అభిమానికి ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన కారణంగా మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే, 429 సుదీర్ఘ విరామం తర్వాత నిన్నటి మ్యాచ్‌తోనే విరాట్ తిరిగి అంతర్జాతీయ టీ20ల్లోకి అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో కింగ్ 16 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ (68), శివమ్ దూబే (63 నాటౌట్) చెలరేగడంతో భారత్.. ఆఫ్ఘనిస్తాన్ నిర్ధేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ను భారత బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్ (3/32), అక్షర్ పటేల్ (2/17), రవి భిష్ణోయ్ (2/39), శివమ్ దూబే (1/36) కట్టడి చేశారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. -
ధనాధన్ దూబే.. కోహ్లితో సమానంగా.. హార్దిక్ స్థానానికి ఎసరు పెట్టేలా..!
టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఆల్‌రౌండర్‌గా సత్తా చాటిన దూబే.. భావి భారత కెప్టెన్‌గా అనుకుంటున్న హార్దిక్ పాండ్యా స్థానానికే ఎసరు పెట్టాడు. హార్దిక్ పాండ్యాలా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన దూబే.. హార్దిక్ గైర్హాజరీలో అద్భుతంగా రాణిస్తూ అతని స్థానాన్నే ప్రశ్నార్థకంగా మార్చాడు. ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణిస్తున్న దూబే.. ఇలాగే తన మెరుపులు కొనసాగిస్తే టీమిండియాలో హార్దిక్ స్థానం గల్లంతవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. తరుచూ గాయపడే హార్దిక్ కన్నా దూబే చాలా బెటర్ అని వారు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ హార్దిక్‌ను తీసుకున్నా దూబేని టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 30 ఏళ్ల దూబే ఆటతీరులో ఇటీవలికాలంలో చాలా మార్పులు వచ్చాయి. ఐపీఎల్ 2023 తర్వాత అతను బాగా రాటుదేలాడు. దేశవాలీ క్రికెట్లోనూ దూబే సత్తా చాటాడు. చాలాకాలంగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోసం ఎదురు చూస్తున్న టీమిండియాకు దూబే కరెక్ట్ మ్యాచ్ అని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో అజేయమైన అర్ధసెంచరీ (60 నాటౌట్) సహా వికెట్ (2-0-9-1) తీసి టీమిండియాను గెలిపించిన దూబే.. రెండో మ్యాచ్‌లోనూ ఇంచుమించు అదే ప్రదర్శనతో (32 బంతుల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు, 3-0-36-1) భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. కోహ్లి సరసన.. రెండో టీ20 ప్రదర్శనతో దూబే ఏకంగా లెజెండ్ విరాట్ కోహ్లి సరసన చేరాడు. విరాట్ టీ20ల్లో రెండు సార్లు అర్ధసెంచరీతో పాటు వికెట్ తీయగా.. దూబే సైతం అన్నే సార్లు ఈ ఘనత సాధించాడు. భారత్ తరఫున అత్యధిక సార్లు ఈ ప్రదర్శన నమోదు చేసిన ఆటగాడిగా యువరాజ్ సింగ్ నిలిచాడు. యువీ మూడుసార్లు ఓ మ్యాచ్‌లో 50 పరుగులతో పాటు వికెట్ తీశాడు. భారత్ తరఫున హార్ధిక్, అక్షర్ పటేల్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ తలోసారి 50 స్కోర్‌తో పాటు వికెట్ తీశారు. కాగా, దూబేతో పాటు యశస్వి జైస్వాల్ (34 బంతుల్లో 68; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో రెండో టీ20లో భారత్ ఆఫ్ఘనిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఫలితంగా టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. సిరీస్ గెలుపుతో భారత్ స్వదేశంలో తమ అజేయ యాత్రను కొనసాగించింది. సొంతగడ్డపై టీమిండియాకు గత 15 టీ20 సిరీస్‌ల్లో (2019 నుంచి) ఓటమిలేదు. -
సత్తా చాటిన అలెన్, మిల్నే.. పాక్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్
ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ పాకిస్తాన్‌ను వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడించింది. తొలి మ్యాచ్‌లో పర్యాటక జట్టును 46 పరుగుల తేడాతో చిత్తు చేసిన కివీస్.. హ్యామిల్టన్ వేదికగా ఇవాళ (జనవరి 14) జరిగిన రెండో టీ20లో పాక్‌ను 21 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఫలితంగా సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. ఫిన్ అలెన్ (41 బంతుల్లో 74; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో అలెన్ మినహా ఎవరూ భారీ స్కోర్లు చేయలేకపోయారు. విలియమ్సన్ (26 రిటైర్డ్ హర్ట్), సాంట్నర్ (25), కాన్వే (20), డారిల్ మిచెల్ (17), గ్లెన్ ఫిలిప్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3 వికెట్లు పడగొట్టగా.. అబ్బాస్ అఫ్రిది 2, ఆమిర్ జమాల్, ఉసామా మిర్, షాహీన్ అఫ్రిది తలో వికెట్ దక్కించుకున్నారు. లక్ష్య ఛేదనలో తడబడిన పాక్.. 19.3 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. కివీస్ పేసర్ ఆడమ్ మిల్నే (4-0-33-4) పాక్ పతనాన్ని శాశించగా.. సౌథీ, బెన్ సియర్స్, సోధి తలో రెండు వికెట్లతో రాణించారు. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (66), ఫకర్ జమాన్ (50) అర్ధసెంచరీలతో రాణించగా.. షాహీన్ అఫ్రిది (22) రెండంకెల స్కోర్ చేశాడు. ఈ ముగ్గురు మినహా పాక్ ఆటగాళ్లు మొత్తం విఫలమయ్యారు. సైమ్ అయూబ్ 1, రిజ్వాన్ 7, ఇఫ్తికార్ అహ్మద్ 4, ఆజం ఖాన్ 2, ఆమిర్ జమాల్ 9, అబ్బాస్ అఫ్రిది 7, ఉసామా మిర్ 0, హరీస్ రౌఫ్ 2 నాటౌట్ పరుగులు చేశారు. ఇరు జట్ల మధ్య మూడో టీ20 జనవరి 17న డెనెడిన్ వేదికగా జరుగుతుంది. -
ఫిన్ అలెన్ ఊచకోత.. పాక్ బౌలర్లపై మెరుపుదాడి
న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాటర్ ఫిన్ అలెన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డాడు. స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 15 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసిన అలెన్.. తాజాగా జరుగుతున్న రెండో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 41 బంతులను ఎదుర్కొన్న అలెన్ 7 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ మార్కును కేవలం 24 బంతుల్లోనే అందుకున్న అలెన్ ఆతర్వాత కాస్త నెమ్మదించాడు. మరో భారీ షాట్‌కు ప్రయత్నించే క్రమంలో ఉసామా మిర్ అలెన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మొత్తంగా పాక్ బౌలర్లను ఊచకోత కోసిన అలెన్.. క్రీజ్‌లో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. అలెన్ ధాటికి న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3 వికెట్లు పడగొట్టగా.. అబ్బాస్ అఫ్రిది 2, ఆమిర్ జమాల్, ఉసామా మిర్, షాహీన్ అఫ్రిది తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే (15 బంతుల్లో 20; 3 ఫోర్లు), ఫిన్ అలెన్ కివీస్‌కు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 5.1 ఓవర్లలో 59 పరుగులు జోడించారు. కాన్వే ఔటయ్యాక బరిలోకి దిగిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్రీజ్‌లో ఉన్నంతసేపు అసౌకర్యంగా కనిపించాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్ సాయంతో 26 పరుగులు చేసిన అతను ఇన్నింగ్స్ 10 ఓవర్ తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. తొలి మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన డారిల్ మిచెల్ 17 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. తొలి మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన మార్క్ చాప్మన్ 4 పరుగులకే ఔటయ్యాడు. ఆడమ్ మిల్నే, ఐష్ సోధి డకౌట్లు కాగా.. గ్లెన్ ఫిలిప్ 13, సాంట్నర్ 25 పరుగులు చేశారు. భారీ స్కోర్ దిశగా పయనిస్తున్న కివీస్‌ను హరీస్ రౌఫ్ 19వ ఓవర్లో దెబ్బకొట్టాడు. ఈ ఓవర్ 1, 2, 4 బంతులకు వికెట్లు పడగొట్టిన రౌఫ్.. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి కివీస్ భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు. కాగా, ఈ సిరీస్‌లో కివీస్ తొలి మ్యాచ్‌లో పాక్‌ను 46 పరుగుల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. -
ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20.. భారీ రికార్డుపై కన్నేసిన కోహ్లి
భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఇండోర్ వేదికగా ఇవాళ (జనవరి 14) రెండో టీ20 జరుగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20ల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కోహ్లి చివరిసారిగా 2022 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తిరిగి 429 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లి మళ్లీ పొట్టి క్రికెట్లోకి పునరాగమనం చేయనున్నాడు. వాస్తవానికి ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే విరాట్ ఆడాల్సి ఉండింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల అతను ఆ మ్యాచ్‌కు దూరమయ్యాడు. మొహాలీ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్.. 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆఫ్ఘన్‌తో రెండో టీ20కి ముందు విరాట్‌ను ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి 35 పరుగులు చేస్తే.. టీ20ల్లో 12000 పరుగుల మార్కును అందుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ (14562) పేరిట ఉంది. ఈ జాబతాలో పాకిస్తాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ (12993), విండీస్ టీ20 స్పెషలిస్ట్ కీరన్ పోలార్డ్ (12430) గేల్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
సిరీస్ గెలిచే లక్ష్యంతో...
ఇండోర్: బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్, వేగవంతమైన అవుట్‌ఫీల్డ్, చిన్న బౌండరీలు...ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో పరుగుల వరదకు రంగం సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇక్కడ జరిగే రెండో టి20 మ్యాచ్‌లో భారత్, అఫ్గనిస్తాన్ తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌ను గెలిచి 1–0తో ముందంజలో ఉన్న భారత్ ఈ మ్యాచ్‌నూ సొంతం చేసుకొని సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. భారత తుది జట్టులో స్వల్ప మార్పులు జరగనున్నాయి. గత మ్యాచ్ ఆడని విరాట్ కోహ్లి ఇప్పుడు బరిలోకి దిగుతున్నాడు. మరో 35 పరుగులు చేస్తే కోహ్లి టి20 క్రికెట్లో 12 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా నిలుస్తాడు. కోహ్లి రాకతో గిల్‌ను పక్కన పెట్టడం ఖాయం. అయితే ఓపెనర్ యశస్వి గాయంనుంచి కోలుకుంటే జట్టులోకి వస్తాడు. లేదంటే గిల్‌కు మరో అవకాశం దక్కుతుంది. బౌలింగ్‌లో కూడా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు బదులుగా కుల్దీప్ యాదవ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. పేస్ విభాగంలోనూ మార్పు అవసరం అనుకుంటే ముకేశ్‌ను పక్కన పెట్టి టీమ్ మేనేజ్మెంట్ అవేశ్‌కు చాన్స్ ఇవ్వవచ్చు. మరో వైపు అఫ్గనిస్తాన్ మరో సారి తమ స్పిన్నే బలంగా నమ్ముకుంటోంది. ముజీబ్, నబీలు కొనసాగనుండగా ముగ్గురు పేసర్లు ఫజల్, నవీన్, గుల్బదిన్‌లు భారత్ బలమైన బ్యాటింగ్ లైనప్‌ను ఎంత వరకు నిలువరిస్తారనేది చూడాలి. మిడిలార్డర్లో రహ్మత్ స్థానంలో దూకుడైన బ్యాటర్ అయిన హజ్రతుల్లా జట్టులోకి వస్తాడు. సంచలన ప్రదర్శనతో సిరీస్‌ను సమం చేయాలని అఫ్గన్ జట్టు భావిస్తోంది. -
ఆసీస్‌తో రెండో టీ20.. టీమిండియా ఆల్‌రౌండర్ అరుదైన రికార్డు
నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అరుదైన రికార్డు సాధించింది. పొట్టి ఫార్మాట్లో 1000 పరుగులతో పాటు 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్‌గా దీప్తికి ముందు ఈ ఘనతను మరో ముగ్గురు మహిళా క్రికెటర్లు సాధించారు. పాకిస్తాన్‌కు చెందిన నిదా దార్ (1839 పరుగులు, 130 వికెట్లు), ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లిస్ పెర్రీ (1750 పరుగులు, 123 వికెట్లు), న్యూజిలాండ్‌కు చెందిన సోఫీ డివైన్ (3107 పరుగులు, 113 వికెట్లు) టీ20ల్లో అరుదైన డబుల్‌ను సాధించారు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. దీప్తి శర్మ (30) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో దీప్తితో పాటు రిచా ఘోష్ (23), స్మృతి మంధన (23), జెమీమా రోడ్రిగెజ్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో జార్జీయా వేర్హమ్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, కిమ్ గార్త్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆష్లే గార్డ్నర్ ఓ వికెట్ దక్కించుకుంది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అలైసా హీలీ 26, బెత్ మూనీ 20, తహిల మెక్‌గ్రాత్ 19, ఎల్లిస్ పెర్రీ 34 నాటౌట్, ఆష్లే గార్డ్నర్ 7, లిచ్‌ఫీల్డ్ 18 నాటౌట్ తలో చేయి వేసి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. బ్యాట్‌తో రాణించిన దీప్తి బంతితోనూ సత్తా చాటింది. 4 ఓవర్లు వేసి 22 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్ తలో వికెట్ పడగొట్టారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్ నెగ్గగా.. ఆసీస్ రెండో టీ20 గెలిచింది. నిర్ణయాత్మక మూడో మ్యాచ్ జనవరి 9న జరుగనుంది. -
IND-W Vs AUS-W 2nd T20I: బ్యాటర్ల వైఫల్యంతో...
నవీ ముంబై: వరుసగా రెండో విజయంతో టి20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఆశించిన భారత మహిళల క్రికెట్ జట్టుకు నిరాశ ఎదురైంది. బ్యాటర్ల వైఫల్యంతో సాధారణ స్కోరుకే పరిమితమైన హర్మన్‌ప్రీత్ బృందానికి ఓటమి తప్పలేదు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆ్రస్టేలియా ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల టి20ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. సిరీస్ విజేతను తేల్చే నిర్ణాయక మూడో మ్యాచ్ మంగళవారం ఇదే వేదికపై జరుగుతుంది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హర్మన్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. టాపార్డర్‌లో షఫాలీ వర్మ (1), స్మృతి మంధాన (23; 2 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (13) సహా కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (6) విఫలమయ్యారు. దీంతో 54 పరుగులకే కీలకమైన 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. ఈ దశలో రిచా ఘోష్ (19 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్); దీప్తి శర్మ (27 బంతుల్లో 30; 5 ఫోర్లు) కాసేపు కుదురుగా ఆడారు. కానీ రిచా అవుటయ్యాక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పూజ వస్త్రకర్ (9), అమన్‌జోత్ కౌర్ (4)లు కూడా విఫలమవడంతో డెత్ ఓవర్లలో పరుగుల వేగం పుంజుకోలేదు. ప్రత్యర్థి బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కిమ్ గార్త్ (2/27), అనాబెల్ సదర్లాండ్ (2/18), జార్జియా వేర్హమ్ (2/17) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆ్రస్టేలియా 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు అలీసా హీలీ (21 బంతుల్లో 26; 4 ఫోర్లు), బెత్ మూనీ (29 బంతుల్లో 20; 2 ఫోర్లు) తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించి విజయానికి అవసరమైన పునాది వేశారు. తర్వాత తాలియా మెక్‌గ్రాత్ (19; 3 ఫోర్లు), ఎలైస్ పెరీ (21 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుగైన స్కోరు చేయడంతో ఆ్రస్టేలియా ఒక ఓవర్ మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు తీయగా, శ్రేయాంక పాటిల్, పూజ చెరో వికెట్ పడగొట్టారు. -
ఆసీస్‌తో రెండో టీ20.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన టీమిండియా
నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా నామామత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఆసీస్ బౌలర్లు రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది. భారత ఇన్నింగ్స్‌లో దీప్తి శర్మ (30) టాప్ స్కోరర్‌గా నిలువగా.. రిచా ఘోష్ (23), స్మృతి మంధన (23), జెమీమా రోడ్రిగెజ్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. షెఫాలీ వర్మ (1), హార్మన్‌ప్రీత్ కౌర్ (6), పూజా వస్త్రాకర్ (9), అమన్‌జోత్ కౌర్ (4) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జార్జీయా వేర్హమ్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, కిమ్ గార్త్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆష్లే గార్డ్నర్ ఓ వికెట్ దక్కించుకుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి టీ20లో విజయం సాధించింది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయగా.. ఏకైక టెస్ట్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. ఆసీస్ ప్లేయర్ ఎల్లిస్ పెర్రీకి ఈ మ్యాచ్ 300వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. -
IND VS SA 2nd T20: రింకూ సింగ్ భారీ సిక్సర్.. బాక్సులు బద్దలు
సెయింట్ జార్జ్స్ పార్క్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా యంగ్ డైనమైట్ రింకూ సింగ్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న రింకూ 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మార్క్రమ్ వేసిన ఇన్నింగ్స్ 19 ఓవర్లో ఒక్కసారిగా పేట్రేగిపోయిన రింకూ.. ఆ ఓవర్ చివరి రెండు బంతులను భారీ సిక్సర్లుగా మలిచి భారత ఇన్నింగ్స్‌కు ఊపుతెచ్చాడు. మార్క్రమ్ బౌలింగ్‌లో రెండో సిక్సర్ ఏకంగా మీడియా బాక్స్ అద్దాలను ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. Rinku Singh's six broke media box glass. 🔥- Rinku is insane...!!!!pic.twitter.com/hJazne80PU— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2023 అనంతరం భారత ఇన్నింగ్స్ మరో 3 బంతుల్లో ముగుస్తుందనగా వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. 19.3 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 180/7గా ఉంది. గెరాల్డ్ కొయెట్జీ బౌలింగ్‌లో చివరి ఓవర్ రెండు, మూడు బంతుల్లో రవీంద్ర జడేజా (19), అర్షదీప్ సింగ్(0) ఔటయ్యారు. రింకూ సింగ్ (68)తో పాటు సిరాజ్ క్రీజ్‌లో ఉన్నాడు. Rinku Singh's six broke the glass of the media box. (Rajal Arora). pic.twitter.com/juEYkJV5Lk— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2023 భారత ఇన్నింగ్స్‌లో రింకూతో పాటు సూర్యకుమార్ యాదవ్ (56) విధ్వంసం సృష్టించగా.. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, అర్షదీప్ సింగ్ డకౌట్లు అయ్యారు. తిలక్ వర్మ (29), రవీంద్ర జడేజా (19) క్రీజ్‌లో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్.. సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. -
IND VS SA 2nd T20: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్
సెయింట్ జార్జ్స్ పార్క్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద టీ20ల్లో 2000 పరుగుల మార్కును తాకిన స్కై.. బంతుల పరంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా ఈ మార్కును తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. పొట్టి ఫార్మాట్లో స్కై కేవలం 1164 బంతుల్లోనే 2000 పరుగుల మార్కును తాకగా.. అంతకుముందు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ పేరిట ఉండింది. ఫించ్ 1283 బంతుల్లో 2000 పరుగుల మార్కును దాటాడు. ఈ రికార్డుతో పాటు స్కై మరో రెండు రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నింగ్స్‌ల పరంగా అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. స్కై 56 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్కును అందుకోగా.. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్, అదే దేశానికి చెందిన మొహమ్మద్ రిజ్వాన్ (52 ఇన్నింగ్స్‌ల్లో) ఈ విభాగంలో అందరి కంటే ముందున్నారు. స్కైతో పాటు విరాట్ కోహ్లి కూడా 56 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కును అందుకోగా.. కేఎల్ రాహుల్ (58 ఇన్నింగ్స్‌ల్లో) వీరిద్దరి తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 2000 అంతర్జాతీయ టీ20 పరుగులు పూర్తి చేసిన స్కై.. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. స్కైకు ముందు విరాట్ కోహ్లి (107 ఇన్నింగ్స్‌ల్లో 4008 పరుగులు), రోహిత్ శర్మ (140 ఇన్నింగ్స్‌ల్లో 3853 పరుగులు), కేఎల్ రాహుల్ (68 ఇన్నింగ్స్‌ల్లో 2256 పరుగులు) భారత్ తరఫున ఈ ఫీట్‌ను సాధించారు. కాగా, ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ (55 నాటౌట్) జోరుమీదుండటంతో భారత్ 13 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. స్కైతో పాటు రింకూ సింగ్ (32) క్రీజ్‌లో ఉన్నాడు. భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ డకౌట్లు కాగా.. తిలక్ వర్మ 29 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్.. సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. -
IND VS SA 2nd T20: టీ20ల్లో రెండోసారి ఇలా..!
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా సెయింట్ జార్జ్స్ పార్క్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో ఇద్దరు టీమిండియా ఓపెనర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. యశస్వి జైస్వాల్ మూడు బంతుల్లో.. శుభ్‌మన్ గిల్ రెండు బంతులు ఎదుర్కొని సున్నా పరుగులకే ఔటయ్యారు. టీ20ల్లో భారత్ తరఫున ఓపెనర్లు ఇలా డకౌట్ కావడం ఇది రెండోసారి మాత్రమే. 2016 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో (మీర్పుర్) నాటి ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్య రహానేలు ఇలానే డకౌట్లు అయ్యారు. టీ20ల్లో భారత ఓపెనర్లు ఇద్దరూ డకౌట్లు కావడం అదే తొలిసారి. తాజాగా గిల్, యశస్వి ఇద్దరూ డకౌట్లై అనవసరపు అప్రతిష్టను మూటగట్టుకున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు ఇద్దరూ డకౌట్లయ్యాక కూడా భారత ఆటగాళ్లు జోరు తగ్గించలేదు. సూర్యకుమార్ యాదవ్ (21), తిలక్ వర్మ ధాటిగా ఆడటంతో టీమిండియా 5 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది. అనంతరం తిలక్ 29 పరుగుల వద్ద ఔట్ కావడంతో భారత స్కోర్‌లో కాస్త వేగం తగ్గింది. 8 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 69/3గా ఉంది. స్కై (30)తో పాటు రింకూ సింగ్ (6) క్రీజ్‌లో ఉన్నాడు. -
SA VS IND 2nd T20: భారత్‌పై సౌతాఫ్రికా విజయం
భారత్‌పై సౌతాఫ్రికా విజయం భారత్‌పై ఐదు వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. సౌతాఫ్రికా స్కోరు 154-5 ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 139 పరుగుల వద్ద సౌతాఫ్రికా తమ ఐదో వికెట్ కోల్పోయింది. మిల్లర్ ఔటయ్యాడు. నాలుగవ వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 108 పరుగుల వద్ద సౌతాఫ్రికా నాలుగవ వికెట్ కోల్పోయింది. హేఇన్రిచ్ క్లాసేన్ ఔటయ్యాడు. టార్గెట్ 152.. 22 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసిన సౌతాఫ్రికా 152 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 22 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకుంది. 4 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 56/1గా ఉంది. మార్క్రమ్ (14), హెండ్రిక్స్ (21) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 42 పరుగుల వద్ద (2.5 ఓవర్) సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. అనవసర పరుగుకు ప్రయత్నించి బ్రీట్జ్కీ (16) రనౌటయ్యాడు. టార్గెట్ 152.. 2 ఓవర్లలోనే 38 పరుగులు బాదిన సౌతాఫ్రికా 152 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా శరవేగంగా పరుగులు సాధిస్తుంది. ఆ జట్టు 2 ఓవర్లలోనే 38 పరుగులు పిండుకుంది. హెండ్రిక్స్ (19), బ్రీట్జ్కీ (14) క్రీజ్‌లో ఉన్నారు. తగ్గిన వర్షం.. సౌతాఫ్రికా లక్ష్యం ఎంతంటే..? వర్షం తగ్గిన అనంతరం అంపైర్లు ఓవర్లను కుదించారు. భారత ఇన్నింగ్స్‌ను 19.3 ఓవర్ల వద్దనే ముగించిన అంపైర్లు.. డక్‌వర్త్ లూయిస్ పద్దతిన సౌతాఫ్రికా లక్ష్యాన్ని 15 ఓవర్లలో 152 పరుగులకు మార్చారు. వర్షం అంతరాయం భారత ఇన్నింగ్స్ మరో 3 బంతుల్లో ముగుస్తుందనగా వర్షం మొదలైంది. 19.3 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 180/7గా ఉంది. గెరాల్డ్ కొయెట్జీ బౌలింగ్‌లో చివరి రెండు బంతుల్లో రవీంద్ర జడేజా (19), అర్షదీప్ సింగ్(0) ఔటయ్యారు. రింకూ సింగ్ (68)తో పాటు సిరాజ్ క్రీజ్‌లో ఉన్నాడు. రింకూ మెరుపు అర్ధశతకం రింకూ సింగ్ కేవలం 30 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో తన కెరీర్లో తొలి అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీనికి ముందు జితేశ్ శర్మ (1) మార్క్రమ్ బౌలింగ్‌లో స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 125 పరుగుల వద్ద (13.5 ఓవర్లలో) టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. షంషి బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (56) ఔటయ్యాడు. రింకూ (34), జితేశ్ శర్మ క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 55 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. కొయెట్జీ బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి తిలక్ వర్మ (29) ఔటయ్యాడు. ధాటిగా ఆడుతున్న తిలక్, స్కై ఓపెనర్లు గిల్, యశస్వి డకౌట్లు అయ్యాక తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడుతున్నారు. వీరి ధాటికి భారత్ 5 ఓవర్లలోనే 50 పరుగుల మార్కు (53) దాటింది. స్కై (21), తిలక్ (28) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. గిల్ డకౌట్ 6 పరుగులకే టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. రెండో ఓవర్ ఆఖరి బంతికి శుభ్‌మన్ గిల్ కూడా సున్నా పరుగులకే ఔటయ్యాడు. లిజాడ్ విలియమ్స్ బౌలింగ్‌లో గిల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మూడో బంతికే వికెట్ కోల్పోయిన టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మూడో బంతికే వికెట్ కోల్పోయింది. జన్సెన్ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి యశస్వి జైస్వాల్ డకౌటయ్యాడు. సెయింట్ జార్జ్స్ పార్క్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. స్వల్ప అనారోగ్యం కారణంగా రుతురాజ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడని భారత కెప్టెన్ సూర్యకుమార్ ప్రకటించాడు. భారత జట్టులో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు కూడా అవకాశం దక్కలేదు. తిలక్ వర్మ, జితేశ్ శర్మ వీరి స్థానాల్లో జట్టులోకి వచ్చారు. టీమిండియా: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ముకేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్. సౌతాఫ్రికా: రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్కే, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, అండిల్ ఫెహ్లుక్వాయో, గెరాల్డ్ కొయెట్జీ, లిజాడ్ విలియమ్స్, తబ్రేజ్ షంసీ. -
సిరీస్ అప్పగించేశారు!
ముంబై: భారత మహిళల జట్టు ఆఖరి మ్యాచ్ మిగిలుండగానే టి20 సిరీస్‌ను ఇంగ్లండ్‌కు అప్పజెప్పింది. శనివారం జరిగిన రెండో టి20లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో ఇంగ్లండ్ 2–0తో సిరీస్ కైవసం చేసుకుంది. టాస్ నెగ్గిన ఇంగ్లండ్ ఫీల్డింగ్‌కు మొగ్గు చూపగా ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత అమ్మాయిల జట్టు 16.2 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూలింది. జెమీమా రోడ్రిగ్స్ (33 బంతుల్లో 30; 2 ఫోర్లు) మాత్రమే ఇంగ్లండ్ బౌలింగ్‌ను కొంత వరకు ఎదుర్కోగలిగింది. స్మృతి మంధాన (10) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా... మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ చార్లి డీన్ (2/16), లారెన్ బెల్, సోఫీ ఎకిల్‌స్టోన్, సారా గ్లెన్ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయి కాస్త తడబడింది. అయితే చివరకు 11.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు డాని వైట్ (0), సోఫియా డన్‌క్లీ (9) విఫలమైనా... అలైస్ కాప్సీ (21 బంతుల్లో 25; 4 ఫోర్లు), నట్ సీవర్ (16) కాసేపు క్రీజులో నిలవడంతో విజయం దక్కింది. సిరీస్‌లో నామమాత్రమైన చివరి టి20 మ్యాచ్ నేడు ఇదే వేదికపై జరుగుతుంది. -
గెలిస్తేనే... సిరీస్‌లో నిలిచేది
ముంబై: మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ గెలవాలన్నా... రేసులో నిలవాలన్నా భారత మహిళల జట్టు ఈ రెండో మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే. లేదంటే ఇంకో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ బృందం కీలకమైన మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. గతితప్పిన బౌలింగ్‌ను, నిలకడ లోపించిన టాపార్డర్‌ను మెరుగుపర్చుకొని ఇంగ్లండ్‌ను ఓడించాలనే లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగుతోంది. తొలి టి20లో ఓపెనర్ షఫాలీ వర్మ తప్ప ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోరే చేయలేదు. హిట్టర్లు స్మృతి మంధాన, వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ గత మ్యాచ్ వైఫల్యాన్ని అధిగమించి తాజాగా ఈ మ్యాచ్‌లో చెలరేగితే భారత బ్యాటింగ్ కష్టాలు తీరతాయి. ఎందుకంటే మిడిలార్డర్‌ను కెపె్టన్ హర్మన్‌ప్రీత్ ఆదుకోగలదు. జట్టు మేనేజ్మెంట్ బెంగ ఏదైనా ఉందంటే అది బౌలింగే! సీమర్ రేణుక సింగ్ మినహా మొత్తం బౌలింగ్ విభాగం చేతులెత్తేసింది. దీప్తి శర్మ, పూజ ఒక్క వికెట్ తీయకపోగా... పరుగుల్ని అతిగా సమర్పించుకున్నారు. వికెట్లు తీసిన శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్‌లు కూడా పరుగుల వేగాన్ని అడ్డుకోలేకపోయారు. మరోవైపు తొలిమ్యాచ్‌లో శుభారంభం చేసిన ఇంగ్లండ్ అమ్మాయిల బృందం వరుస విజయంతో ఏకంగా సిరీస్‌పైనే కన్నేసింది. బ్యాటర్లు, బౌలర్లు ఫామ్‌లో ఉండటంతో ఇంగ్లండ్ ఆత్మ విశ్వాసంతో ఉంది. ఇక వేదిక (వాంఖెడె) ఒక్కటే కావడంతో పిచ్ గత మ్యాచ్‌కు భిన్నంగా ఉండదు. బ్యాటింగ్‌కు కలిసొచ్చే వికెట్ కావడంతో బౌలర్లకు కఠిన పరీక్ష తప్పదు. -
విధ్వంసానికి పరాకాష్టగా నిలిచిన రింకూ.. నయా మ్యాచ్ ఫినిషర్ అంటూ జేజేలు
టీమిండియా యువ సంచలనం రింకూ సింగ్ పొట్టి ఫార్మాట్లో పేట్రేగిపోతున్నాడు. భారత జట్టుకు ఆడే అవకాశం వచ్చిన ప్రతిసారి తన మార్కు ఊచకోతతో విరుచుకుపడుతున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో ఐదు బంతుల్లో 5 సిక్సర్ల ఫీట్‌తో రాత్రికిరాత్రి హీరో అయిపోయిన ఈ కేకేఆర్ బ్యాటర్.. టీమిండియాలోకి వచ్చిన అనతి కాలంలోనే మ్యాచ్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తిరువనంతపురం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో ఆడిన ఇన్నింగ్స్‌తో (9 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) భారత క్రికెట్ అభిమానులందరూ రింకూని ధోనితో పోలుస్తున్నారు. టీమిండియాకు నయా మ్యాచ్ ఫినిషర్ దొరికాడని కొనియాడుతున్నారు. చివరి ఓవర్లలో రింకూ ఆడే షాట్లు చూస్తే మతి పోతుందని జేజేలు కొడుతున్నారు. నిన్నటి మ్యాచ్‌లో రింకూ స్ట్రయిక్‌రేట్ (344.44) చూసి విధ్వంసానికి ఇది పరాకాష్ట అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్ 19వ ఓవర్లో సీన్ అబాట్ బౌలింగ్‌ను తుత్తినియలు (4, 0, 6, 4, 4, 6) చేసిన వైనాన్ని కొనియాడుతున్నారు. రింకూ భవిష్యత్తులో ధోని అంతటి వాడవుతాడని జోస్యం చెబుతున్నారు. రింకూ.. లోయర్ మిడిలార్డర్లో టీమిండియాకు దొరికిన తురుపుముక్క అంటూ ఆకాశానికెత్తుతున్నారు. తాజాగా ఆసీస్‌తో జరిగిన తొలి టీ20ని ఉదహరిస్తూ (ఆఖరి బంతికి సిక్సర్) నయా మ్యాచ్ విన్నర్ అంటూ కితాబునిస్తున్నారు. రింకూ ఆడిన నాలుగు టీ20 ఇన్నింగ్స్‌లను ప్రస్తావిస్తూ భారత క్రికెట్ భవిష్యత్తు స్టార్ అంటూ జేజేలు పలుకుతున్నారు. ఈ యువ కెరటం ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ రాణిస్తుండటం శుభపరిణామమని అంటున్నారు. రింకూ తన టీ20 కెరీర్లో చేసిన స్కోర్లు.. 38 (21) 37* (15) 22* (14) 31* (9) ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో రింకూ విధ్వంసానికి ముందు భారత టాపార్డర్ బ్యాటర్లు సైతం ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రుతురాజ్ (43 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ (10 బంతుల్లో 19; 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ఆసీస్ ఆదిలో కాస్త పోటీనిచ్చినప్పటికీ.. ఆతర్వాత చేతులెత్తేసింది. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా భారత్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో భిష్ణోయ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 3 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్, అర్షదీప్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
IND VS AUS 2nd T20: చరిత్ర సృష్టించిన టీమిండియా.. పాక్‌తో సమానంగా..!
పొట్టి క్రికెట్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో నిన్న (నవంబర్ 26) జరిగిన రెండో టీ20లో విజయం సాధించడం ద్వారా పాక్‌తో సమానంగా టీ20ల్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. టీ20ల్లో పాక్ 226 మ్యాచ్‌ల్లో 135 విజయాలు సాధించగా.. నిన్నటి మ్యాచ్‌లో గెలుపుతో భారత్ ఈ రికార్డును సమం చేసింది. పాక్ 226 మ్యాచ్‌ల్లో ఈ ఘనతను సాధిస్తే, భారత్ 211 మ్యాచ్‌ల్లోనే 135 విజయాల మార్కును అందుకుంది. పొట్టి క్రికెట్లో 100 విజయాల మార్కును భారత్, పాక్‌లతో పాటు న్యూజిలాండ్ జట్టు మాత్రమే అందుకోగలిగింది. కివీస్ జట్టు 200 టీ20ల్లో 102 విజయాలు నమోదు చేసింది. సౌతాఫ్రికా (171 మ్యాచ్‌ల్లో 95 విజయాలు), ఆస్ట్రేలియా (179 మ్యాచ్‌ల్లో 94 విజయాలు), ఇంగ్లండ్ (177 మ్యాచ్‌ల్లో 92 విజయాలు) జట్లు భారత్, పాక్, కివీస్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే, తిరువనంతపురం వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రుతురాజ్ (43 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ (10 బంతుల్లో 19; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (9 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (2 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆదిలో కాస్త పోరాడినప్పటికీ.. ఆతర్వాత భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో భిష్ణోయ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 3 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్, అర్షదీప్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
IND Vs AUS: బ్యాటర్ల ఊచకోత.. రెండో టీ20లోనూ టీమిండియాదే విజయం
బ్యాటర్ల ఊచకోత.. రెండో టీ20లో టీమిండియా ఘన విజయం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తిరువనంతపురం వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. బ్యాటర్లంతా రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. యశస్వి (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రుతురాజ్ (43 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ (10 బంతుల్లో 19; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (9 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (2 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. అనంతరం 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆదిలో కాస్త పోరాటపటిమ కనబర్చినప్పటికీ.. ఆతర్వాత భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో భిష్ణోయ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 3 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్, అర్షదీప్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో కూడా టీమిండియానే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఓటమి అంచుల్లో ఆసీస్ 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆదిలో కాస్త పోరాడినప్పటికీ, ఆతర్వాత భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఆ జట్టు 155 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది.అర్షదీప్ బౌలింగ్‌లో ఆడమ్ జంపా (1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నిప్పులు చెరుగుతున్న ప్రసిద్ద్ కృష్ణ టీమిండియా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ నిప్పులు చెరుగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను మూడో వికెట్ పడగొట్టాడు. 152 పరుగుల వద్ద నాథన్ ఇల్లిస్ (1)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఓటమి దిశగా ఆసీస్.. సీన్ అబాట్ క్లీన్ బౌల్డ్ ఆసీస్ జట్టు ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు 149 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో సీన్ అబాట్ (1) క్లీన్ బౌల్డయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్ 148 పరుగుల వద్ద ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. గుర్తింపు పొందిన ఆఖరి బ్యాటర్ స్టోయినిస్ (45) ఔటయ్యాడు. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి స్టోయినిస్ పెవిలియన్‌కు చేరాడు. ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్ 139 పరుగుల వద్ద ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్ (37) ఔటయ్యాడు. 14 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 142/5గా ఉంది. స్టోయినిస్ (43), వేడ్ (2) క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 236.. భారత్‌కు ధీటుగా బదులిస్తున్న ఆసీస్ 236 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆసీస్.. టీమిండియాకు ధీటుగా బదులిస్తుంది.12 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. స్టోయినిస్ (40), టిమ్ డేవిడ్ (31) చెలరేగి ఆడుతున్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్ 53 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ (12) ఔటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 53/3గా ఉంది. స్టోయినిస్, స్టీవ్ స్మిత్ (17) క్రీజ్‌లో ఉన్నారు టార్గెట్ 236.. రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ 236 పరుగుల అతి భారీ లక్ష్యఛేదనకు దిగిన ఆసీస్ 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. రవి భిష్ణోయ్.. జోస్ ఇంగ్లిస్ (2), మాథ్యూ షార్ట్‌ను (19) పెవిలియన్‌కు పంపాడు. టీమిండియా బ్యాటర్ల మహోగ్రరూపం.. సిక్సర్ల సునామీ ఆసీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బ్యాటర్లు మహోగ్రరూపం దాల్చారు. టాప్-3 బ్యాటర్లు మెరుపు అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. యశస్వి (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రుతురాజ్ (43 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సూర్యకుమార్ (10 బంతుల్లో 19; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (9 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) , తిలక్ వర్మ (2 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) సైతం మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో ఇల్లిస్ 3 వికెట్లు పడగొట్టగా.. స్టోయినిస్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఇషాన్ ఔట్ 52 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. స్టోయినిస్ బౌలింగ్‌లో ఇల్లిస్‌కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన స్కై తొలి బంతికే సిక్సర్ బాదాడు. దంచికొడుతున్న ఇషాన్ యశస్వి జైస్వాల్ ఔటయ్యాక కూడా భారత బ్యాటర్లు జోరు కొనసాగిస్తున్నారు. ఇషాన్ కిషన్ (52) విధ్వంసం ఓ రేంజ్లో కొనసాగుతుండగా.. రుతురాజ్ (47) ఆచితూచి ఆడుతున్నాడు. 15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 164/1గా ఉంది. 10 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసిన భారత్ టీమిండియా 10 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసింది. యశస్వి ధాటిగా ఆడి ఔటైనా రుతురాజ్ (29), ఇషాన్ కిషన్ (10) కూడా ఓ మోస్తరు షాట్లు ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 10 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 101/1గా ఉంది. విధ్వంసం సృష్టించి ఔటైన యశస్వి యశస్వి జైస్వాల్ క్రీజ్‌లో ఉన్నంత సేపు విధ్వంసం సృష్టించాడు. అయితే ఐదో ఓవర్ ఆఖరి బంతికి అతనికి అడ్డుకట్ట పడింది. ఇల్లిస్ బౌలింగ్ యశస్వి (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాడు. 5.5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 77/1గా ఉంది. రుతురాజ్ (15), ఇషాన్ క్రీజ్‌లో ఉన్నారు. యశస్వి ఊచకోత.. 24 బంతుల్లోనే..! యశస్వి జైస్వాల్ ఉగ్రరూపం దాల్చాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు ఎడాపెడా బాదేస్తున్నాడు. కేవలం 24 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ ఉగ్రరూపం సీన్ అబాట్ వేసిన నాలుగో ఓవర్లో యశస్వి జైస్వాల్ ఉగ్రరూపం దాల్చాడు. వరుసగా మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. తొలి బంతికే ఫోర్ బాదిన రుతురాజ్ తొలి టీ20లో బంతిని ఎదుర్కోకుండానే డైమండ్ రనౌట్‌గా వెనుదిరిగిన రుతురాజ్ ఈ మ్యాచ్‌లో తానెదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాదాడు. తొలి ఓవర్ తర్వాత టీమిండియా స్కోర్ 10/0గా ఉంది. రుతురాజ్ (5), యశస్వి జైస్వాల్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తిరువనంతపురం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 26) రెండో టీ20 జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించగా.. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. బెహ్రాన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ స్థానాల్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా ఆసీస్ జట్టులోకి వచ్చారు. టీమిండియా: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ ఆస్ట్రేలియా: స్టీవెన్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ వేడ్(కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ -
టాస్ ఓడిన టీమిండియా.. ఆసీస్ విధ్వంసకర వీరుడి రీఎంట్రీ
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తిరువనంతపురం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 26) రెండో టీ20 జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించగా.. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. బెహ్రాన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ స్థానాల్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా ఆసీస్ జట్టులోకి వచ్చారు. టీమిండియా: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ ఆస్ట్రేలియా: స్టీవెన్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ వేడ్(కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ -
మరో విజయంపై భారత్ కన్ను
తిరువనంతపురం: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో శుభారంభం చేసిన ఉత్సాహంతో ఉన్న భారత్ ఇప్పుడు సిరీస్‌లో ఆధిపత్యం చాటేందుకు సిద్ధమైంది. ఆదివారం జరిగే రెండో టి20లో ఆ్రస్టేలియాపై వరుసగా విజయం సాధించాలనే లక్ష్యంతో సూర్యకుమార్ సేన బరిలోకి దిగుతోంది. మరో వైపు విశాఖపట్నంలో ఎదురైన పరాజయానికి ఇక్కడ బదులుతీర్చుకొని సిరీస్‌లో సమంగా నిలవాలనే పట్టుదలతో ఆ్రస్టేలియా ఉంది. అనుభవం లేని ఆతిథ్య బౌలింగ్‌ను ఆసరా చేసుకొని రెచ్చి పోయే ప్రదర్శన కనబరచాలని కంగారూ సేన ఆశిస్తోంది. అయితే ఇక్కడి గ్రీన్‌ఫీల్డ్ పిచ్ పేస్‌కు అనుకూలం కావడంతో తొలి టి20లా ఇక్కడ భారీ స్కోర్ల మజా ఉండకపోవచ్చు. మెరుపులు తక్కువైనా... పోరు మాత్రం ఆసక్తికరంగా జరిగే అవకాశముంది. బౌలర్లపైనే బెంగంతా! సీనియర్ బ్యాటర్లు లేకపోయినా... బ్యాటింగ్‌లో మాత్రం భారత్ పటిష్టంగా ఉంది. యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్‌లు కంగారు పెట్టించే ఆసీస్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్నారు. లక్ష్య ఛేదనలోనూ ధాటిని కొనసాగించారు. తొలి మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ రనౌటైన రుతురాజ్ గైక్వాడ్ కూడా తనవంతు మెరుపులు మెరిపిస్తే తర్వాత వచ్చే కెప్టెన్ సూర్యకుమార్, తిలక్‌వర్మ, రింకూ సింగ్‌లు భారత ఇన్నింగ్స్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లగలరు. లోయర్ ఆర్డర్లో అక్షర్ పటేల్ రూపంలో స్పిన్ ఆల్‌రౌండర్ ఉండటం, భారీ షాట్లతో విరుచుకుపడే సత్తా ఉండటం బ్యాటింగ్ దళానికి అదనపు బలమవుతుంది. ఏ రకంగా చూసిన బ్యాటర్లపై జట్టు మేనేజ్మెంట్కు ఏ అపనమ్మకం లేదు. ఎటొచ్చి అనుభవంలేని బౌలింగ్‌తోనే సమస్యంతా! గత మ్యాచ్‌నే పరిశీలిస్తే ఒక్క ముకేశ్ కుమార్ మినహా ప్రధాన బౌలర్లుగా బరిలోకి దిగిన అర్ష్ దీప్, ప్రసిధ్కృష్ణలతో పాటు రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్‌లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం కలవరపెడుతోంది. అయితే ఇక్కడ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై పట్టుసాధిస్తే మరో విజయం సులువవుతుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనపై ఆసీస్ గురి తొలి టి20లో ఆ్రస్టేలియా చక్కగా పరుగులు చేసింది. భారత్ లక్ష్య ఛేదనకు దిగితే ఆరంభంలోనే వికెట్లు తీసింది. కానీ ఆ తర్వాతే సూర్యకుమార్ నిలదొక్కుకోవడంతో కష్టాలపాలైంది. ప్రపంచకప్‌లో చెలరేగిన హెడ్, మ్యాక్స్‌వెల్ ఈ మ్యాచ్ బరిలోకి దిగే అవకాశముంది. దీంతో ఆ్రస్టేలియా బ్యాటింగ్ దళం మరింత విధ్వంసంగా మారిపోనుంది. అనుభవజ్ఞుడైన స్మిత్, ఇంగ్లిస్, టి20 స్పెషలిస్టు టిమ్ డేవిడ్‌లతో భారత బౌలర్లకు ఇబ్బందులు తప్పవు. అయితే భారత్‌లాగే గతి తప్పిన బౌలింగ్‌తో మూల్యం చెల్లించుకున్న ఆ్రస్టేలియా ఈ సారి మళ్లీ ఆ పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్త పడాలనుకుంటోంది. కలిసొచ్చే వికెట్‌పై స్టొయినిస్, అబాట్, ఎలిస్, తన్విర్ సంఘా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే తప్పకుండా అనుకున్న ఫలితం సాధించవచ్చు. జట్లు (అంచనా): భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), రుతురాజ్, ఇషాన్ కిషన్, యశస్వి, తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్శ్‌దీప్, ముకేశ్, ప్రసిధ్ కృష్ణ. ఆ్రస్టేలియా: మాథ్యూ వేడ్ (కెపె్టన్), స్మిత్, షార్ట్ / హెడ్, ఇన్‌గ్లిస్, స్టొయినిస్ / మ్యాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, అరోన్ హార్డి, అబాట్, నాథన్ ఎలిస్, బెహ్రెన్‌డార్‌్ఫ, తన్వీర్ సంఘా. పిచ్–వాతావరణం గ్రీన్‌ఫీల్డ్ వికెట్ పేసర్లకు అనుకూలం. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. ఆదివారం మ్యాచ్‌కు వానముప్పు అయితే లేదు. -
రుతురాజ్, సామ్సన్ మెరుపులు.. సిరీస్ మనదే
డబ్లిన్: సీనియర్లంతా విశ్రాంతి తీసుకున్న ఐర్లాండ్ పర్యటనలో యువ ఆటగాళ్లు బాధ్యతగా ఆడి టీమిండియాను గెలిపించారు. రెండో టి20లో 33 పరుగులతో గెలుపొందిన బుమ్రా బృందం మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. సిరీస్‌లోని చివరిదైన మూడో మ్యాచ్ ఈనెల 23న ఇదే వేదికపై జరుగుతుంది. రెండో టి20లో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (43 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్), సంజూ సామ్సన్ (26 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రింకూ సింగ్ (21 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిపించారు. మెకార్తీ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్ అండీ బల్బిర్నీ (51 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు తీశారు. రాణించిన గైక్వాడ్ భారీ షాట్లు ఆడే క్రమంలో బంతిని గాల్లోకి లేపిన టాపార్డర్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (11 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్), వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ (1) అవుటయ్యారు. విండీస్ పర్యటనలో రాణించిన తిలక్ ఈ సిరీస్‌లోని రెండు మ్యాచ్‌ల్లో నిరాశ పరిచాడు. మెకార్తీ షార్ట్‌పిచ్ బంతిని తిలక్ పుల్ చేయగా అదికాస్తా అక్కడే చాలా ఎత్తుకు లేచింది. డీప్స్కే్వర్ లెగ్‌లో ఉన్న డాక్రెల్ క్యాచ్‌ను అందుకున్నాడు. 34 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయిన జట్టును రుతురాజ్, సంజూ సామ్సన్ ధాటిగా నడిపించారు. మూడో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. వేగంగా ఆడుతున్న సామ్సన్ బంతిని వికెట్ల మీదికి ఆడుకొని నిష్క్రమించగా, అర్ధసెంచరీ అనంతరం రుతురాజ్ అవుటయ్యాడు. ఆఖర్లో రింకూ సింగ్, శివమ్ దూబే (16 బంతుల్లో 22 నాటౌట్, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. బల్బిర్నీ పోరాటం... తొలి మ్యాచ్‌లో బుమ్రా పడగొట్టినట్లే ఈసారి ప్రసిధ్ కృష్ణ ఒకే ఓవర్లో (3వ) కెపె్టన్ స్టిర్లింగ్ (0), టక్కర్ (0)లను డకౌట్ చేశాడు. టెక్టర్ (7), క్యాంఫర్ (18)లను రవి బిష్ణోయ్ స్పిన్‌తో బోల్తా కొట్టించాడు. దాంతో 10 ఓవర్లలో ఐర్లాండ్ స్కోరు 63/4. ఈ దశలో ఐర్లాండ్‌కు గెలుపుపై ఆశలేమీ లేవు. అయితే బల్బిర్నీ వీరవిహారం భారత శిబిరాన్ని వణికించింది. డాక్రెల్ (13; 1 సిక్స్)తో కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించాడు. కాసేపటికే డాక్రెల్ లేని పరుగుకు యత్నించి రనౌట్ కాగా... సిక్సర్ల మోత మోగిస్తున్న బల్బిర్నీ జోరుకు అర్ష్‌దీప్ బ్రేక్ వేలేశాడు. ఆ తర్వాత మ్యాచ్ పూర్తిగా భారత్ పక్షాన నిలిచింది. మార్క్ అడైర్ (15 బంతుల్లో 23; 3 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అయితే బంతులకి, పరుగులకి మధ్య కొండంత అంతరాన్ని ఈ సిక్సర్లు తగ్గించలేకపోయాయి. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) క్యాంఫర్ (బి) యంగ్ 18; రుతురాజ్ (సి) టెక్టర్ (బి) మెకార్తీ 58; తిలక్ వర్మ (సి) డాక్రెల్ (బి) మెకార్తీ 1; సంజూ సామ్సన్ (బి) వైట్ 40; రింకూ సింగ్ (సి) యంగ్ (బి) అడైర్ 38; దూబే (నాటౌట్) 22; సుందర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 185. వికెట్ల పతనం: 1–29, 2–34, 3–105, 4–129, 5–184. బౌలింగ్: మార్క్ అడైర్ 4–0–36–1, జోష్ లిటిల్ 4–0–48–0, మెకార్తీ 4–0–36–2, క్రెయిగ్ యంగ్ 4–0–29–1, బెన్ వైట్ 4–0–33–1. ఐర్లాండ్ ఇన్నింగ్స్: బల్బిర్నీ (సి) సామ్సన్ (బి) అర్ష్‌దీప్ 72; స్టిర్లింగ్ (సి) అర్ష్‌దీప్ (బి) ప్రసిధ్ కృష్ణ 0; టక్కర్ (సి) రుతురాజ్ (బి) ప్రసిధ్ కృష్ణ 0; టెక్టర్ (బి) రవి బిష్ణోయ్ 7; క్యాంఫర్ (సి) దూబే (బి) రవి బిష్ణోయ్ 18; డాక్రెల్ (రనౌట్) 13; అడైర్ (సి) తిలక్ వర్మ (బి) బుమ్రా 23; మెకార్తీ (సి) రవి బిష్ణోయ్ (బి) బుమ్రా 2; యంగ్ (నాటౌట్) 1; జోష్ లిటిల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 152. వికెట్ల పతనం: 1–19, 2–19, 3–28, 4–63, 5–115, 6–123, 7–126, 8–148. బౌలింగ్: బుమ్రా 4–1–15–2, అర్ష్‌దీప్ 4–0–29–1, ప్రసిధ్ కృష్ణ 4–0–29–2, రవి బిష్ణోయ్ 4–0–37–2, వాషింగ్టన్ సుందర్ 2–0–19–0, శివమ్ దూబే 2–0–18–0. -
IND VS IRE 2nd T20: ఐర్లాండ్‌పై భారత్ ఘన విజయం
ఐర్లాండ్‌తో జరిగిన రెండో టి20లో టీమిండియా అదరగొట్టింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 33 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ (ఆగస్ట్ 20) జరుగుతున్న రెండో మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ గైక్వాడ్ (43 బంతుల్లో 57; 6 ఫోర్లు, సిక్స్), సంజూ శాంసన్ (26 బంతుల్లో 40; 5 ఫోర్లు, సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (18), తిలక్ వర్మ (1) విఫలం కాగా.. ఆఖర్లో శివమ్ దూబే (16 బంతుల్లో 22 నాటౌట్; 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెక్‌కార్తీ 2 వికెట్లు పడగొట్టగా.. క్రెయిగ్ యంగ్, బెంజమిన్ వైట్, మార్క్ అడైర్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఐర్లాండ్‌తో రెండో టీ20.. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రుతురాజ్
హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రుతురాజ్ ఓపెనర్ రుతరాజ్ గైక్వాడ్ 39 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రుతురాజ్‌కు జతగా రింకూ సింగ్ (10) క్రీజ్‌లో ఉన్నాడు. 15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 129/3గా ఉంది. యశస్వి (18), తిలక్ వర్మ (1), సంజూ శాంసన్ (40) ఔటయ్యారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా డబ్లిన్‌లోని ద విలేజ్ మైదానం వేదికగా ఇవాళ (ఆగస్ట్ 20) రెండో టీ20 ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వనం మేరకు తొలుత బ్యాటింగ్ చేయనుంది. తొలి మ్యాచ్‌లో ఆడిన జట్లతోనే ఇరు జట్లు ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతున్నాయి. టీమిండియా: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్ ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, మార్క్ అడైర్, కర్టిస్ క్యాంఫర్, జార్జ్ డాక్రెల్, జోష్ లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్ -
సిరీస్‌పై భారత్ కన్ను
డబ్లిన్: ఐర్లాండ్ పర్యటనలో శుభారంభం చేసిన భారత జట్టు మరో విజయంతో సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. నేడు జరిగే రెండో టి20లో ఐర్లాండ్‌పై గెలుపే లక్ష్యంగా బుమ్రా సేన బరిలోకి దిగుతోంది. వాన అడ్డుకున్న గత మ్యాచ్‌లో మన బౌలర్లు తమను తాము నిరూపించుకున్నారు. ముఖ్యంగా చాన్నాళ్ల తర్వాత మైదానంలోకి దిగిన సీనియర్ సీమర్ బుమ్రా మునుపటి వాడితో అదరగొట్టాడు. ప్రసిధ్ కృష్ణ, స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా సత్తా చాటారు. ఇప్పుడు బ్యాటర్ల వంతు వచ్చింది. ఈ మ్యాచ్‌లో కుర్రాళ్లకు చక్కని బ్యాటింగ్ అవకాశమివ్వాలనుకుంటే మాత్రం భారత్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. ఓపెనింగ్‌లో యశస్వి జైస్వాల్ ఉన్నంత సేపు బాగానే ఆడాడు. రుతురాజ్ మెరుగనిపించాడు. కానీ కరీబియన్ పర్యటనలో అందరికంటే బాగా ఆడిన తెలుగుతేజం తిలక్‌వర్మ డకౌట్ కావడం కాస్త నిరాశపరిచింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ బ్యాటర్ చెలరేగితే స్కోరు బోర్డు ఉరకలెత్తడం ఖాయం. అనుభవజు్ఞల్లేకపోయినా... భారత జట్టులోని ఆటగాళ్లందరికి ఐపీఎల్లో మెరిపించిన అనుభవం ఎంతో ఉంది. కాబట్టి వరుస విజయం, సిరీస్ కైవసం ఏమంత కష్టం కాకపోవచ్చు. గెలిపించేదెవరు..? మరోవైపు ఒత్తిడిలో ఉన్న ఆతిథ్య జట్టు సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవక తప్పదు. టాపార్డర్‌లో బల్బిర్నీ , కెప్టెన్ స్టిర్లింగ్, టకర్ బాధ్యత కనబరిస్తేనే ప్రత్యర్థికి దీటైన స్కోరు చేయొచ్చు. లేదంటే తొలి టి20లాగే ఓ మోస్తరు స్కోరుకే పరిమితమయ్యే ప్రమాదముంది. బౌలింగ్‌లో యంగ్ వైవిధ్యమైన బంతులతో భారత్‌ను కంగారు పెట్టించాడు. జోష్ లిటిల్, మార్క్ అడైర్లు కూడా నిలకడగా బౌలింగ్ చేస్తే భారత కుర్రాళ్ల జట్టును ఇబ్బంది పెట్టవచ్చు. ఆదివారం వాన ముప్పు లేదు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. జట్లు (అంచనా) భారత్.. బుమ్రా (కెప్టెన్ ), యశస్వి, రుతురాజ్, తిలక్ వర్మ, సామ్సన్, రింకూసింగ్, దూబే, సుందర్, అర్ష్‌దీప్, బిష్ణోయ్, ప్రసిధ్ కృష్ణ. ఐర్లాండ్.. స్టిర్లింగ్ (కెప్టెన్ ), బల్బిర్నీ, టక్కర్, టెక్టర్, క్యాంపర్, డాక్రెల్, మార్క్ అడైర్, మెకార్తీ, యంగ్, జోష్ లిటిల్, బెన్వైట్. -
గెలుపు మలుపు విండీస్‌దే
ప్రావిడెన్స్ (గయానా): బ్యాటింగ్‌లో తిలక్‌వర్మ (41 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) ప్రతాపం చూపినా, బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా (3/35) నిప్పులు చెరిగినా, చహల్ (2/19) స్పిన్‌తో తిప్పినా... భారత్‌కు పరాజయం తప్పలేదు. ఆదివారం రెండో టి20లో విండీస్ 2 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో 2–0తో ఆధిక్యాన్ని పెంచుకుంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ కెరీర్లో తొలి అర్ధసెంచరీ సాధించాడు. అకిల్ హోసీన్, అల్జారి జోసెఫ్, షెఫర్డ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. ఆరంభంలోనే పాండ్యా ప్రత్యర్థిని దెబ్బ తీసినా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికోలస్ పూరన్ (40 బంతుల్లో 67; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) గెలుపుబాట వేశాడు. రేపు మూడో టి20 కూడా ఇదే వేదికపై జరుగుతుంది. తిలక్ ఫిఫ్టీతో... అరంగేట్రం చేసిన తొలి టి20లోనే ఆకట్టుకున్న హైదరాబాద్ యువ సంచలనం ఠాకూర్ తిలక్‌వర్మ ఈ రెండో మ్యాచ్‌లో అయితే భారత జట్టును ఆదుకున్నాడు. 18 పరుగులకే భారత్ కీలకమైన శుబ్‌మన్ గిల్ (7), సూర్యకుమార్ (1) వికెట్లను కోల్పోగా, కాసేపటికే ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సంజూ సామ్సన్ (7)లు వికెట్లను పారేసుకున్నాడు. ఈ దశలో తిలక్ తనశైలి స్కూప్, స్వీప్ షాట్లతో మైదానంతా ఫీల్డర్లను పరుగు పెట్టించాడు. కెప్టెన్ పాండ్యాతో కలిసి స్కోరుబోర్డులో వేగం పెంచిన వర్మ 39 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. అతనితో పాటు హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 24; 2 సిక్సర్లు) స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో డెత్ ఓవర్లలో దంచికొట్టే బ్యాటరే కరువయ్యాడు. భారీషాట్లు బాదే అక్షర్ (14) ఆట కూడా ఎంతోసేపు నిలువలేదు. దీంతో భారత్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. పూరన్ ధనాధన్ లక్ష్యఛేదన మొదలు పెట్టగానే పాండ్యా వికెట్ల భరతం పట్టడంతో తొలి ఓవర్లోనే కింగ్ (0), చార్లెస్ (2) వికెట్లను కోల్పోయిన విండీస్ కష్టాలపాలైంది. మేయర్స్ (15)ను అర్ష్ దీప్ అవుట్ చేయడంతో భారత శిబిరంలో ఎక్కడలేని ఉత్సాహం కానీ... తర్వాత పూరన్ ఉత్పాతంలా వచ్చిపడ్డాడు. భారీ సిక్సర్లు, బౌండరీలతో బంతుల అంతరాన్ని అమాంతం తగ్గించేశాడు. 126/4 స్కోరు వద్ద గెలుపుబాటలో కనిపించింది. కానీ ఆ స్కోరువద్దే పూరన్ జోరుకు ముకేశ్ కళ్లెం వేశాడు. ఈ దశలో చహల్ స్పిన్ మ్యాజిక్‌తో హెట్‌మైర్ (22 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్), హోల్డర్ (0)లను అవుట్ చేశాడు. 3 పరుగుల వ్యవధిలో 4 వికెట్లను కోల్పోవడంతో మ్యాచ్ ఫలితం భారత్‌వైపు మలుపు తిరిగేలా కనిపించింది. కానీ హోసీన్ (16 నాటౌట్; 2 ఫోర్లు), జోసెఫ్ (10 నాటౌట్; 1 సిక్స్) తొమ్మిదో వికెట్‌కు అజేయంగా 26 పరుగులు జోడించి టీమిండియాకు గెలుపు అవకాశమివ్వకుండా ఇంకా 7 బంతులు మిగిలుండగానే విండీస్‌ను విజయతీరానికి చేర్చారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (బి) షెఫర్డ్ 27; గిల్ (సి) హెట్‌మైర్ (బి) జోసెఫ్ 7; సూర్యకుమార్ (రనౌట్) 1; తిలక్ వర్మ (సి) మెకాయ్ (బి) హోసీన్ 51; సంజూ సామ్సన్ (స్టంప్డ్) పూరన్ (బి) హోసీన్ 7; పాండ్యా (బి) జోసెఫ్ 24; అక్షర్ (సి) పూరన్ (బి) షెఫర్డ్ 14; రవి బిష్ణోయ్ (నాటౌట్) 8; అర్ష్ దీప్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1–16, 2–18, 3–60, 4–76, 5–114, 6–129, 7–139. బౌలింగ్: మెకాయ్ 4–0–25–0, హోసీన్ 4–0–29–2, జోసెఫ్ 4–0–28–2, హోల్డర్ 4–0–29–0, షెఫర్డ్ 3–0–28–2, మేయర్స్ 1–0–12–0. వెస్టిండీస్ ఇన్నింగ్స్: కింగ్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 0; మేయర్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్ష్ దీప్ 15; చార్లెస్ (సి) తిలక్ వర్మ (బి) పాండ్యా 2; పూరన్ (సి) సామ్సన్ (బి) ముకేశ్ 67; పావెల్ (సి) ముకేశ్ (బి) పాండ్యా 21; హెట్‌మైర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్ 22; షెఫర్డ్ (రనౌట్) 0; హోల్డర్ (స్టంప్డ్) ఇషాన్ (బి) చహల్ 0; హోసీన్ (నాటౌట్) 16; జోసెఫ్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (18.5 ఓవర్లలో 8 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–2, 3–32, 4–89, 5–126, 6–128, 7–128, 8–129. బౌలింగ్: హార్దిక్ పాండ్యా 4–0–35–3 అర్ష్ దీప్ 4–0–34–1, ముకేశ్ 3.5–0–35–1, బిష్ణోయ్ 4–0–31–0, చహల్ 3–0–19–12. -
విండీస్‌తో రెండో టీ20.. టాస్ గెలిచిన టీమిండియా, ఒక్క మార్పు
5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గయానా వేదికగా విండీస్‌తో ఇవాళ (ఆగస్ట్ 6) జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్‌లో తొలి టీ20 ఓడి 0-1తో వెనుకపడిన భారత్.. ఈ మ్యాచ్‌లో ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది. తొలి టీ20 ఆడిన కుల్దీప్ యాదవ్ స్థానంలో రవి బిష్ణోయ్ బరిలోకి దిగనున్నాడు. మరోవైపు విండీస్ తొలి మ్యాచ్ ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ (w), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్ (సి), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్ భారత్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), సంజు శాంసన్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ -
వెస్టిండీస్‌తో రెండో టీ20.. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా?
ప్రావిడెన్స్ (గయానా): వెస్టిండీస్‌పై టెస్టు, వన్డే సిరీస్ నెగ్గిన భారత్‌కు తొలి టి20లో అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. సాధారణ లక్ష్యాన్నీ ఛేదించలేక చతికిలపడిన జట్టు ఓటమిని కొనితెచ్చుకుంది. ఈ నేపథ్యంలో మళ్లీ కోలుకొని స్థాయికి తగినట్లుగా సత్తా చాటడం అవసరం. ఇలాంటి స్థితిలో నేడు విండీస్‌తో రెండో టి20 మ్యాచ్‌కు హార్దిక్ సేన సిద్ధమైంది. తొలి టి20లా ఆదమరిస్తే మాత్రం ఇక్కడ కుదరదు. అందుకోసం నిలకడలేని బ్యాటింగ్ ఆర్డర్ మారాలి. స్పిన్ మ్యాజిక్, పేస్ పదును పెరగాలి. గత మ్యాచ్‌లా తేలిగ్గా తీసుకోకూడదు. సీనియర్లు రోహిత్, కోహ్లిలు ఆడకపోవడం వల్లే ఓటమంటే కుదరదు. ఎందుకంటే గత మ్యాచ్ బరిలోకి దిగినవారంతా ఐదారేళ్లుగా ఐపీఎల్లో విశేషంగా రాణిస్తున్నవారే! ఐపీఎల్లో అతి తక్కువ అనుభవమున్న తిలక్వర్మే మొదటి మ్యాచ్‌లోనే చక్కగా ఆడితే... ఐపీఎల్ హిట్లర్లు ఇషాన్ కిషన్, గిల్, సూర్యకుమార్, సంజూ సామ్సన్, అక్షర్, హార్దిక్ పాండ్యా ఇంకెలా ఆడాలి. కాబట్టి సాకులు వెతక్కుండా బ్యాటర్లు తమ శైలిలో మెరుపులు మెరిపిస్తే పరుగులు, విజయం కష్టం కానేకాదు. ఇక విండీస్ విషయానికొస్తే చెసిన తక్కువ స్కోరునే నిలబెట్టుకొని మరీ ఈ సిరీస్‌లో శుభారంభం చేసింది. ప్రపంచశ్రేణి టి20 స్పెషలిస్టులున్న విండీస్ ఇప్పుడు మరింత ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఒత్తిడంతా భారత్‌పైనే ఉంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కానీ మ్యాచ్‌కు వాన ముప్పు ఉంది. -
PAK VS NZ 2nd T20: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. ధోని, రోహిత్ రికార్డులు బద్దలు
పాకిస్తాన్ సారధి బాబర్ ఆజమ్ టీ20ల్లో మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. లాహోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో విజయం సాధించడం ద్వారా టీ20ల్లో అత్యధిక విజయాలు (42) సాధించిన కెప్టెన్‌గా ఇంగ్లండ్ మాజీ సారధి ఇయాన్ మోర్గాన్ (42), ఆఫ్ఘనిస్థాన్ మాజీ కెప్టెన్ అస్గర్ స్టానిక్జాయ్ (42) సరసన నిలిచాడు. ఈ క్రమంలో అతను టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును(41) అధిగమించాడు. తన కెరీర్లో మొత్తంగా 101 టీ20లు ఆడిన బాబర్ కెప్టెన్‌గా 68 మ్యాచ్‌ల్లో 42 విజయాలు సాధించాడు. ఇదే మ్యాచ్‌లో బాబర్ ఈ రికార్డుతో పాటు మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌తో రెండో టీ20లో శతక్కొట్టిన బాబర్ (58 బంతుల్లో 101; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్‌గా మూడు సెంచరీలు సాధించి, టీ20ల్లో అత్యధిక సార్లు ఈ మార్కును అందుకున్న కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో బాబర్ తర్వాతి స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (2), స్విట్జర్లాండ్ సారధి ఫహీమ్ నజీర్ (2) ఉన్నారు. ఇక ఇదే మ్యాచ్‌లో పాక్ ఓపెనింగ్ జోడీ బాబర్-మహ్మద్ రిజ్వాన్ సంయుక్తంగా ఓ రికార్డును నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో తొలి వికెట్‌కు 99 పరుగులు జోడించిన బాబర్-రిజ్వాన్ జోడీ టీ20ల్లో 19వ సారి 50 ప్లస్ పార్ట్నర్షిప్ నమోదు చేసిన జోడీగా రికార్డుల్లోకెక్కింది. టీ20ల్లో ఏ ఇతర జోడీ కూడా ఇన్ని సార్లు ఈ ఘనత సాధించలేదు. టీమిండియా ఓపెనింగ్ పెయిర్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ టీ20ల్లో 15 సార్లు 50 ప్లస్ భాగస్వామ్యాలు నమోదు చేశారు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో బాబర్ (101 నాటౌట్), రిజ్వాన్ (34 బంతుల్లో 50; 6 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో పాకిస్తాన్ 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి టీ20లో 4 వికెట్లతో న్యూజిలాండ్ వెన్ను విరిచిన హరీస్ రౌఫ్ ఈ మ్యాచ్‌లోనూ 4 వికెట్లతో చెలరేగాడు. -
NZ VS SL 2nd T20: సీఫర్ట్ విధ్వంసం.. నిప్పులు చెరిగిన మిల్నే
డునెడిన్ వేదికగా శ్రీలంకతో ఇవాళ (ఏప్రిల్ 5) జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిధ్య జట్టు 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 ఏప్రిల్ 8న క్వీన్స్ టౌన్లో జరుగనుంది. కాగా, సిరీస్‌లో భాగంగా రసవత్తరంగా జరిగిన తొలి టీ20లో శ్రీలంక సూపర్ ఓవర్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. 142 to win in Dunedin! 🎯 Adam Milne (5-26) leading an all-round performance in the field. Follow the chase LIVE in NZ on @sparknzsport 📺 or Rova 📻 LIVE scoring https://t.co/wA3XiQ80si #NZvSL #CricketNation pic.twitter.com/S5Fv3eFdhd — BLACKCAPS (@BLACKCAPS) April 5, 2023 నిప్పులు చెరిగిన ఆడమ్ మిల్నే.. రెండో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కివీస్.. ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే (4-0-26-5) నిప్పులు చెరగడంతో శ్రీలంకను 19 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ చేసింది. మిల్నేతో పాటు బెన్ లిస్టర్ (4-0-26-2), షిప్లే (1/25), రచిన్ రవీంద్ర (1/24), జిమ్మీ నీషమ్ (1/20) తలో చేయి వేయడంతో శ్రీలంక మరో ఓవర్ మిగిలుండగానే చాపచుట్టేసింది. లంక ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (10), కుశాల్ పెరీరా (35), ధనంజయ డిసిల్వ (37), అసలంక (24) మత్రమే రెండంకెల స్కోర్ సాధించగలిగారు. 50 up for Tim Seifert. His sixth in international T20 cricket 🏏 Follow play LIVE in NZ on @sparknzsport 📺 or with Rova 📻 LIVE scoring https://t.co/2BMmCgLarp #NZvSL #CricketNation pic.twitter.com/u149v2xJW7 — BLACKCAPS (@BLACKCAPS) April 5, 2023 టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. 142 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. టిమ్ సీఫర్ట్ (43 బంతుల్లో 79 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోవడంతో అలవోకగా విజయం సాధించింది. సీఫర్ట్‌కు జతగా చాడ్ బోవ్స్ (15 బంతుల్లో 31; 7 ఫోర్లు), టామ్ లాథమ్ (30 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్) కూడా రాణించడంతో కివీస్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి మరో 32 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. చాడ్ బోవ్స్ వికెట్ కసున్ రజితకు దక్కింది. -
జగజ్జేత ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం.. పసికూనల చేతిలో దారుణ ఓటమి
టీ20 వరల్డ్ ఛాంపియన్, 2022 పొట్టి ప్రపంచకప్ విన్నర్ ఇంగ్లండ్‌కు పసికూన బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలవడం ద్వారా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఢాకా వేదికగా ఇవాళ (మార్చి 12) జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో జగజ్జేతను మట్టికరిపించిన బంగ్లాదేశ్.. వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవానికి (1-2) ప్రతీకారం తీర్చుకుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో ఓటమిపాలైన బంగ్లా పులులు.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని ఆఖరి వన్డేలో, తొలి రెండు టీ20ల్లో వరుస విజయాలు సాధించారు. సొంతగడ్డపై ప్రత్యర్ధి ఎంతటి వారైనా తిరుగులేని ఆధిప్యతం ప్రదర్శించే బంగ్లా టైగర్స్..అండర్ డాగ్స్‌గా తమపై ఉన్న ముద్రను కొనసాగించారు. మ్యాచ్ విషయానికొస్తే.. రెండో టీ20లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఇంగ్లండ్‌ను 117 పరుగులకే ఆలౌట్ చేసింది. మొత్తం 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన బట్లర్ సేన.. ఒక్కో పరుగు రాబట్టేందుకు నానా తంటాలు పడింది. బంగ్లా సంచలన స్పిన్నర్ మెహిది హసన్ మీరజ్ (4-0-12-4) ఇంగ్లండ్ పతనాన్ని శాశించగా.. తస్కిన్ అహ్మద్ (1/27), ముస్తాఫిజుర్ (1/19), షకీబ్ అల్ హసన్ (1/13), హసన్ మహమూద్ (1/10) తలో చేయి వేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో సాల్ట్ (25), మొయిన్ అలీ (15), బెన్ డక్కెట్ (28), సామ్ కర్రన్ (12), రెహాన్ అహ్మద్ (11) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. నజ్ముల్ షాంటో (46 నాటౌట్), తౌహిద్ హ్రిదోయ్ (17), మెహిది హసన్ (20) రాణించడంతో సునాయాసంగా విజయతీరాలకు (18.5 ఓవర్లలో 120/6) చేరింది. స్వల్ప లక్ష్యంగా కావడంతో బంగ్లా టైగర్స్ ఏమాత్రం బెరుకు లేకుండా ఆడారు. ఫలితంగా మ్యాచ్ గెలవడంతో పాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా.. సామ్ కర్రన్, మొయిన్ అలీ, రెహాన్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు. బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించిన మెహిది హసన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
ఆసీస్‌తో టెస్ట్ సిరీస్.. పని మొదలుపెట్టిన సూర్యకుమార్ యాదవ్
Surya Kumar Yadav: న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 29) జరిగిన రెండో టీ20లో టీమిండియా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తన సహజ శైలికి భిన్నంగా ఆచితూచి ఆడి, జట్టుకు ఎంతో అవసరమైన విజయంలో ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. స్కై ఇలా నిదానంగా ఇన్నింగ్స్‌ను కొనసాగించడం, ఏ ఫార్మాట్లోనైనా బహుశా ఇదే మొదటిసారి అయ్యుండవచ్చు. బంతి నాట్యం చేస్తున్న పిచ్‌పై సూర్యకుమార్ ఎంతో సంయమనం పాటించి, కెప్టెన్ హార్ధిక్ పాండ్యా సహకారంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతుచిక్కని పిచ్‌పై వికెట్ కాపాడుకుంటూ, ఇటుకలు పేర్చిన చందంగా ఒక్కో పరుగు రాబట్టి సూర్య ఇన్నింగ్స్‌ను నిర్మించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మ్యాచ్ అనంతరం తన మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్‌పై సూర్య మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ రోజు నేను బ్యాటింగ్ చేసిన తీరు.. తనలోని మరో వెర్షన్ అంటూ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు ముందు తన సన్నద్దతను పరోక్షంగా చాటాడు. ఇదే సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. నేను బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయడం చాలా ముఖ్యం. అప్పటికే నా తప్పిదం కారణంగా వాషింగ్టన్ సుందర్ వికెట్‌ను కోల్పోయాం. ఛాలెంజింగ్ వికెట్‌పై జట్టును విజయతీరాలకు చేర్చాలని నేను, హార్ధిక్ ప్రణాళిక వేసుకున్నాం. అందుకే నేను చాలా సంయమనంతో బ్యాటింగ్ చేశా. ఇది నాలోని డిఫరెంట్ వెర్షన్ అంటూ సూర్యకుమార్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు విన్న తరువాత అభిమానులు సోషల్‌మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. గురువు గారూ.. అప్పుడే టెస్ట్ క్రికెట్ మోడ్‌లోకి వెళ్లిపోయాడంటూ ఆసీస్‌తో సిరీస్‌ను ఉద్దేశిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఆసీస్‌తో త్వరలో జరుగబోయే టెస్ట్ సిరీస్ కోసం ప్రకటించిన టీమిండియాలో సూర్యకుమార్ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు టీమిండియా తరఫున పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాత్రమే ప్రాతినిధ్యం వహించిన సూర్య భాయ్.. ఆసీస్‌తో సిరీస్‌లో టెస్ట్ అరంగేట్రం చేయడం దాదపుగా ఖరారైంది. ఇదిలా ఉంటే, నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఆపసోపాలు పడి 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేయగా.. భారత్ 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఒక్క సిక్సర్ కూడా నమోదు కాని మ్యాచ్‌లో సూర్యకుమార్ 31 బంతులు ఆడి ఒక్క బౌండరీ సాయంతో 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (20 బంతుల్లో 15 నాటౌట్; ఫోర్) సూర్యకు సహకరించాడు. -
IND VS SL 2nd T20: అలా చేయడం పెద్ద నేరం, అందువల్లే ఓడాం..హార్ధిక్
పూణే వేదికగా జరిగిన రెండో టీ20లో శ్రీలంక చేతిలో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫార్మాట్ ఏదైనా బౌలర్లు నో బాల్స్ వేయడం పెద్ద నేరమని అన్నాడు. ఈ మ్యాచ్‌లో నో బాల్సే తమ కొంపముంచాయని పేర్కొన్నాడు. కేవలం నో బాల్స్ కారణంగా తాము ఓటమిపాలయ్యామని తెలిపాడు. అర్షదీప్ సింగ్ వేసిన నో బాల్స్ (2 ఓవర్లలో 5 నో బాల్స్) వల్లే తాము ఓడామని చెప్పడం తన ఉద్దేశం కాదంటూనే పదేపదే అదే విషయాన్ని ప్రస్తావించాడు. యువకుడైన అర్షదీప్ తన బేసిక్ ఎరర్స్ను సరిదిద్దుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. బౌలింగ్, బ్యాటింగ్ పవర్ ప్లేల్లో కొన్ని అనవసర తప్పిదాలు చేశామని, ఈ స్థాయిలో ఇలా చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. ఆటలో అన్నీ మనం అనుకున్నట్లు జరగకపోవడం వాస్తవమే అయినప్పటికీ.. ప్రాధమిక సూత్రాలు మరవడం క్షమించరాని నేరమని అన్నాడు. అక్షర్, స్కై, శివమ్ మావీల పోరాటపటిమను ఈ పందర్భంగా అభినందించాడు. కాగా, లంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో పోరాడి ఓటమిపాలైన విషయం తెలిసిందే. 207 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 65; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్ మావీ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతంగా పోరాడినా టీమిండియాకు విజయం దక్కలేదు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జనవరి 7న రాజ్‌కోట్ వేదికగా జరుగనుంది. -
అపజయమెరుగని హార్ధిక్.. హిట్‌మ్యాన్ రికార్డు బద్దలు
IND VS SL 2nd T20: భారత టీ20 కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత క్రికెట్ చరిత్రలో మరే ఇతర కెప్టెన్‌కు సాధ్యంకాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భారత కెప్టెన్‌గా తొలి 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు (న్యూజిలాండ్‌తో మ్యాచ్ టై గా ముగిసింది) సాధించి, అపజయమెరుగని కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో హార్ధిక్.. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బద్ధలు కొట్టాడు. రోహిత్ కూడా కెప్టెన్‌గా తన తొలి 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించినప్పటికీ.. అతని సారధ్యంలో టీమిండియా మధ్యలో ఓ మ్యాచ్‌లో (5వ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమి) ఓడింది. After 1st 6 T20Is Indian Captain with Most Wins 5 - Hardik Pandya* 5 - Rohit Sharma 4 - Virat Kohli 4 - MS Dhoni#INDvSL — 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) January 3, 2023 అయితే రోహిత్ టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ అయ్యాక వెనుదిరిగి చూడలేదు. శ్రీలంక చేతిలో ఓటమి తర్వాత హిట్‌మ్యాన్ టీమిండియాను వరుసగా 7 మ్యాచ్‌ల్లో విజేతగా నిలిపాడు. ఆ తర్వాత 4 మ్యాచ్‌ల్లో 3 ఓటముల తర్వాత రోహిత్ మళ్లీ పుంజుకన్నాడు. ఈసారి వరుసగా 14 మ్యాచ్‌ల్లో టీమిండియాను విజేతగా నిలిపాడు. టీ20ల్లో వరుస అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా ఈ రికార్డు ఇప్పటికీ హిట్‌మ్యాన్ పేరిటే ఉంది. పూణే వేదికగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 5) జరుగనున్న రెండో టీ20, కెప్టెన్‌గా హార్ధిక్‌కు 7వ మ్యాచ్. ఈ మ్యాచ్‌లోనూ హార్ధిక్ టీమిండియాను విజయపధంలో నడిపిస్తే.. హిట్‌మ్యాన్ వరుస విజయాల రికార్డుకు మరింత చేరువవుతాడు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ కాకుండానే హార్ధిక్ ఈ రికార్డులు తన ఖాతాలో వేసుకోవడం కొసమెరుపు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో ఇవాళ జరుగనున్న రెండో టీ20లో గెలిచి, మరో మ్యాచ్ మిగిలుండగానే ఎలాగైనా సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. మరోవైపు లంక సైన్యం సైతం ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలని భావిస్తుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాను సంజూ శాంసన్ దెబ్బేశాడు. గాయం కారణంగా అతను ఈ సిరీస్ మొత్తానికే దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. అతని స్థానంలో కొత్త కుర్రాడు జితేశ్ శర్మ జట్టులో చేరాడు. భారత్-శ్రీలంక మధ్య రెండో టీ20 రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది. -
శ్రీలంకతో రెండో టీ20.. టీమిండియాలో జరుగబోయే మార్పులు ఏవంటే..?
IND VS SL 2nd T20: పూణే వేదికగా రేపు (జనవరి 5) శ్రీలంకతో జరుగబోయే రెండో టీ20లో టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. వాంఖడేలో జరిగిన తొలి మ్యాచ్‌లో సంజూ శాంసన్ గాయపడ్డాడని, అతని స్థానంలో రాహుల్ త్రిపాఠి అరంగేట్రం చేస్తాడని ఓ ప్రముఖ వెబ్సైట్ పేర్కొంది. ఓపెనింగ్ బెర్తులకు అవకాశం లేకపోవడంతో రుతురాజ్ గైక్వాడ్ పేరును పరిశీలించరని, అందుకే రాహుల్ త్రిపాఠిని ప్రయోగించే ఛాన్స్ ఉంటుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. తొలి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ (7) విఫలమైనప్పటికీ.. అతడిని తొలిగించే అవకాశం లేదు. గత కొంతకాలంగా గిల్ ప్రదర్శన నేపథ్యంలో ఒక్క మ్యాచ్‌కే అతడిని పక్కకు పెట్టే సాహసం టీమిండియా యాజమాన్యం చేయకపోవచ్చు. మరోవైపు బౌలింగ్ విభాగంలోనూ రెండు మార్పులు ఆస్కారం ఉంటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. తొలి టీ20లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న హర్షల్ పటేల్ స్థానంలో జ్వరం నుంచి కోలుకున్న అర్షదీప్ సింగ్‌కు ఛాన్స్ ఇచ్చే ఆస్కారం ఉందని తెలుస్తోంది. అలాగే తొలి మ్యాచ్‌లో 2 ఓవర్లు వేసి 26 పరుగులు సమర్పించుకున్న స్పెషలిస్ట్ స్పిన్నర్ చహల్ స్థానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు. పై పేర్కొన్న ఒక్క మార్పుతో (సంజూ స్థానంలో త్రిపాఠి) పాటు ఈ రెండు మార్పులు మినహా టీమిండియా మరో మార్పు చేసేందుకు సాహసించకపోవచ్చు. ప్రస్తుత భారత జట్టులో రాహుల్ త్రిపాఠి, అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్ మాత్రమే బెంచ్‌పై ఉన్నారు. ఇదిలా ఉంటే, లంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా బ్యాటింగ్‌లో కాస్త తడబడినా బౌలింగ్‌లో పర్వాలేదనిపించి. అరంగేట్ర కుర్రాడు శివమ్ మావి (4/22), కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ (2/27) చెలరేగగా, హర్షల్ పటేల్ (2/41) ఓకే అనిపించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దీపక్ హుడా (41 నాటౌట్, ఆఖరి ఓవర్లో రెండు రనౌట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బ్యాట్‌తో పర్వాలేదనిపించిన (31 నాటౌట్) అక్షర్ పటేల్.. కీలక సమయంలో (ఆఖరి ఓవర్) బంతినందుకుని ఓకే అనిపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఇషాన్ కిషన్ (37), హార్ధిక్ (29), దీపక్ హుడా (41 నాటౌట్), అక్షర్ పటేల్ (31 నాటౌట్) రెండంకెల స్కోర్లు సాధించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన శ్రీలంక 20 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటై, 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
లంకతో రెండో టీ20.. సంజూ శాంసన్ ఔట్
IND VS SL 2nd T20: భారత్-శ్రీలంక జట్ల మధ్య పూణే వేదికగా రేపు (జనవరి 5) జరుగబోయే రెండో టీ20 నుంచి వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్ ఔటయ్యాడని తెలుస్తోంది. వాంఖడేలో జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా సంజూ మోకాలికి గాయమైందని, వైద్యుల సలహా తీసుకునే నిమిత్తం అతను జట్టుతో పాటు పూణేకు కూడా రాలేదని ఓ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ పేర్కొంది. స్కానింగ్‌ల కోసం సంజూ ప్రస్తుతం (జనవరి 4) ముంబైలోనే ఉన్నట్లు సదరు వెబ్సైట్ తెలిపింది. తొలి టీ20 సందర్భంగా ఓ క్యాచ్ కోసం విఫలయత్నం చేసి సంజూ గాయపడ్డాడని, ఆ తర్వాత అతను మ్యాచ్‌లో కొనసాగినప్పటికీ మోకాలి భాగంలో వాపు ఉందని తెలుస్తోంది. కాగా, లంకతో జరిగిన తొలి టీ20లో సంజూ బ్యాట్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ దారుణంగా నిరాశపర్చాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని ఈ కేరళ బ్యాటర్.. ఫీల్డింగ్‌లోనూ క్యాచ్‌ను జారవిడిచి విమర్శలెదుర్కొన్నాడు. భారత దిగ్గజ ఆటగాడు, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్.. శాంసన్ చెత్త షాట్ సెలెక్షన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. అమవాస్యకో పున్నానికో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోకుంటే ఎలా అంటూ ఘాటు స్వరంతో వ్యాఖ్యానించాడు. తొలి టీ20లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన సంజూ.. కేవలం ఆరు బంతులు మాత్రమే ఆడి (5 పరుగులు) దారుణంగా నిరాశపరిచాడు. ధనంజయ డిసిల్వ వేసిన ఏడో ఓవర్ నాలుగో బంతికి క్యాచ్ మిస్ కావడంతో బతికిపోయిన సంజూ.. ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేక అదే ఓవర్ ఆఖరి బంతికి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తేలిపోయిన సంజూ.. ఫీల్డింగ్ చేస్తూ కీలక క్యాచ్ జారవిడిచాడు. లంక ఇన్నింగ్స్‌లో హార్ధిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్లో నిస్సంక ఇచ్చిన క్యాచ్‌ను వదిలిపెట్టి కెప్టెన్ ఆగ్రహానికి గురయ్యాడు. -
Surya Kumar Yadav: ఏ గ్రహం నుంచి వచ్చాడో దేవుడికే తెలియాలి..!
టీమిండియా డాషింగ్ ఆటగాడు, నయా మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌పై భారత మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో స్కై ఆటకు ముగ్దుడైన అతను.. సూర్య బ్యాటింగ్ విన్యాసాలను వేనోళ్లతో పొగిడాడు. ముఖ్యంగా రెండో టీ20లో సూర్యప్రతాపాన్ని ఆకాశ్ ఆకాశానికెత్తాడు. ఆ మ్యాచ్‌లో అతను ఆడిన షాట్లు నమ్మశక్యంగా లేవని, అసలు అలాంటి షాట్లు ఆడటం భూమిపై ఎవరికైనా సాధ్యపడుతుందా అని నోరెళ్ల పెట్టాడు. ఆ ఇన్నింగ్స్‌లో భారీ షాట్లతో అతను అలరించిన తీరు అత్యద్భుతమని, అతని బ్యాటింగ్ విన్యాసాలు చూసేందుకు రెండు కళ్లు చాల లేదని ప్రశంసలతో ముంచెత్తాడు. ఆ మ్యాచ్‌లో సూర్యకుమార్ ఆడిన షాట్లు మనిషి అనే వాడు ఆడలేడని, కొన్ని షాట్లు చూసాక అతను మనిషా లేక గ్రహాంతర వాసా అన్న డౌట్లు వచ్చాయని తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో పేర్కొన్నాడు. ఒకవేళ సూర్యకుమార్ గ్రహాంతర వాసే అయితే, అతను ఏ గ్రహం నుంచి వచ్చాడో దేవుడికే తెలియాలని అన్నాడు. ఇటీవలి కాలంలో అతని బ్యాటింగ్ శైలిలో చాలా మార్పు వచ్చిందని, ఇది టీమిండియాకు ఎంతో లాభదాయకమని తెలిపాడు. మౌంట్ మాంగనూయ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో కేవలం 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో విరుచుకుపడిన సూర్య.. గ్రౌండ్ నలుమూలలా షాట్లు ఆడి మిస్టర్ 360 డిగ్రీస్ ట్యాగ్‌కు నిజమైన అర్హుడని అనిపించుకున్నాడని అన్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను ఆడిన షాట్లు చూస్తే నమ్మశక్యంగా లేవని, టీ20ల్లో సూర్య టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లంతా అతనికి ఎదురుపడాలంటే జంకుతున్నారని, అంతలా అతను బౌలర్లను భయపెడతున్నాడన్నాడు. అయితే, అతను షాట్లు ఆడే రిస్కీ విధానం చూస్తే.. ఏదో ఒక సమయంలో ఫామ్ కోల్పోవడం ఖాయమని, ఒకవేళ అలా జరిగినా అది ఎక్కువ కాలం కొనసాగదని జోస్యం చెప్పాడు. -
న్యూజిలాండ్‌పై సెంచరీ.. రికార్డుల మోత మోగించిన సూర్యకుమార్
పొట్టి క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. ఆడింది తక్కువ మ్యాచ్‌లే (41) అయినా రికార్డుల రారాజుగా తయారయ్యాడు. మౌంట్ మాంగనుయ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్ 20) జరిగిన రెండో టీ20లో విధ్వంసకర శతకం (51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 111 నాటౌట్) బాదిన సూర్య.. మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్లో రెండో శతకం బాదిన సూర్యకుమార్.. ఒకే క్యాలెండర్ ఇయర్లో రెండు సెంచరీలు సాధించిన రెండో టీమిండియా బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. హిట్‌మ్యాన్ 2018లో ఈ ఘనత సాధించాడు. న్యూజిలాండ్ గడ్డపై టీ20ల్లో శతకం సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు (11) సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో స్కై.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (10)ను అధిగమించాడు. ఈ జాబితాలో మహ్మద్ రిజ్వాన్ (13) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ రికార్డును సమం చేశాడు. రాహుల్ 72 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు చేయగా, సూర్యకుమార్ 41 మ్యాచ్‌ల్లోనే 2 శతకాలు బాదాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (4 సెంచరీలు) వీరిద్దరి కంటే ముందున్నాడు. సూర్య.. తన తొలి సెంచరీని సైతం విదేశీ గడ్డపైనే చేశాడు. అతను ఇంగ్లండ్‌పై నాటింగ్హమ్లో మొదటి సెంచరీ (117 పరుగులు) బాదాడు. ఇలా టీ20ల్లో చేసిన రెండు శతాకలు కూడా విదేశీ గడ్డపైనే నమోదు కావడం కూడా ఓ రికార్డే. సూర్యకుమార్.. తన టీ20 కెరీర్లో 39 ఇన్నింగ్స్‌ల్లో 181.64 స్ట్రయిక్ రేట్‌తో 45 సగటున 1395 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలతో పాటు 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, సూర్యకుమార్ విధ్వంసకర శతకంతో చెలరేగడంతో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 65 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వర్షం కారణంగా తొలి టీ20 పూర్తిగా రద్దైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. సూర్యకుమార్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఛేదనలో ఆది నుంచే తడబడిన కివీస్.. దీపక్ హుడా (4/10), చహల్ (2/26), సిరాజ్ (2/24), సుందర్ (1/24), భువనేశ్వర్ (1/12) ధాటికి 18.5 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది. -
Pant: ఓపెనర్‌గా అవకాశం ఇచ్చినా మళ్లీ విఫలం.. ఇతన్ని టీమిండియా కెప్టెన్ చేయాలట..!
మౌంట్ మాంగనుయ్‌లోని బే ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్ 20) జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే వాతావవరణ శాఖ ముందుగా హెచ్చరించినట్లుగానే వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షం మొదలయ్యే సమయానికి (6.4 ఓవర్ల తర్వాత) టీమిండియా వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన పంత్ (6) మరోసారి నిరాశపర్చగా.. ఇషాన్ కిషన్ (28), సూర్యకుమార్ యాదవ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్‌గా అవకాశం ఇచ్చిన మళ్లీ విఫలమైన పంత్.. న్యూజిలాండ్ పర్యటనలో టీ20, వన్డే జట్లకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన రిషబ్ పంత్ పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు రావడంతో తనను తాను ప్రూవ్ చేసుకోలేకపోతున్నాని వాపోతున్న పంత్‌ను మేనేజ్మెంట్ ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా పంపింది. అయితే పంత్ ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేక కేవలం 6 పరుగులకే ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో 13 బంతులు ఎదుర్కొన్న పంత్.. ఒక్క బౌండరీ బాది, ఫెర్గూసన్ బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. కాగా, ఈ మ్యాచ్‌లో పంత్‌కు ఓపెనర్‌గా అవకాశం వచ్చినా మళ్లీ విఫలం కావడంతో అతని ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇంక ఎప్పుడయ్యా నువ్వు ఆడేది అంటూ వాపోతున్నారు. పంత్ అంటే సరిపడిని వాళ్లయితే ఒకింత డోస్ పెంచి.. ఇచ్చిన అవకాశాలన్నీ నిర్లక్ష్యపు ఆటతో చేజార్చుకుంటున్న ఇతన్ని టీమిండియా కెప్టెన్ చేయాలట అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ముందు ఇతన్ని జట్టు నుంచి తప్పించి, వికెట్‌కీపర్‌గా శాంసన్, ఇషాన్ కిషన్‌లలో ఒకరికి అవకాశం కల్పించాలని సెలెక్టర్లను కోరుతున్నారు. పంత్‌కు ఇచ్చినన్ని అవకాశాలు భారత క్రికెట్ చరిత్రలో ఏ క్రికెటర్‌కు ఇవ్వలేదని, పక్కకు పెడితే తప్ప ఇతను దారిలోకి రాడని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పంత్ వ్యతిరేక పోస్ట్‌లతో ప్రస్తుతం సోషల్‌మీడియా హోరెత్తుతుంది. కాగా, మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు అనే అంశం కొత్తగా తెరపైకి రావడంతో టెస్ట్ జట్టుకు పంత్‌ను కెప్టెన్ చేయాలని అతని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. -
సూర్యకుమార్ విధ్వంసకర శతకం.. కివీస్‌పై టీమిండియా ఘన విజయం
సూర్యకుమార్ విధ్వంసకర శతకం.. కివీస్‌పై టీమిండియా ఘన విజయం సూర్యకుమార్ విధ్వంసకర శతకంతో చెలరేగడంతో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 65 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వర్షం కారణంగా తొలి టీ20 పూర్తిగా రద్దైన విషయం తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. సూర్యకుమార్ (51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 111 నాటౌట్) సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఛేదనలో ఆది నుంచే తడబడిన కివీస్.. దీపక్ హుడా (4/10), చహల్ (2/26), సిరాజ్ (2/24), సుందర్ (1/24), భువనేశ్వర్ (1/12) ధాటికి 18.5 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది. 19వ ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టిన హుడా 19వ ఓవర్లో దీపక్ హుడా మాయ చేశాడు. ఏకంగా 3 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ ఓటమిని ఖరారు చేశాడు. ఈ మ్యాచ్‌లో హుడా 4 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ వెన్నువిరిచాడు. ఏడో వికెట్ డౌన్ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఓటమి అంచుల్లో నిలిచింది. సిరాజ్ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ ఔట్ కావడంతో కివీస్ కథ దాదాపుగా సమాప్తమైంది. హాఫ్ సెంచరీ సాధించిన విలియమ్సన్‌ను (61) సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 18 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 125/7. ఆరో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ 99 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో సాంట్నర్ (2) అతనికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 99/6. 89 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ న్యూజిలాండ్ జట్టు ఓటమి దిశగా పయనిస్తుంది. 89 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి గెలుపుపై ఆశలు వదులుకుంది. చహల్ బౌలింగ్‌లో నీషమ్ (0) ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. 14 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 91/5. నాలుగో వికెట్ డౌన్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. దీపక్ హుడా బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి డారిల్ మిచెల్ (10) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. డేంజరెస్ ఫిలిప్స్ ఔట్ డేంజరెస్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్‌ను (12) చహల్ బోల్తా కొట్టించాడు. 10వ ఓవర్ తొలి బంతికే సిక్సర్ బాది జోరుమీద ఉండిన ఫిలిప్స్‌ను చహల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ తొలి ఓవర్లో 17 పరుగులు సమర్పించుకున్న తర్వాత, ఆమరుసటి ఓవర్ తొలి బంతికే వికెట్ పడగొట్టాడు వాషింగ్టన్ సుందర్. సుందర్ బౌలింగ్‌లో అర్షదీప్‌కు క్యాచ్ ఇచ్చి కాన్వే (25) ఔటయ్యాడు. 8.1 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 56/2. 7 ఓవర్ల తర్వాత కివీస్ స్కోర్ ఎంతంటే..? 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెండో బంతికే వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. ఆతర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. 7 ఓవర్ల తర్వాత కివీస్ స్కోర్ వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. కాన్వే (20), విలియమ్సన్ (24) క్రీజ్‌లో ఉన్నారు. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. రెండో బంతికే ఫిన్ అలెన్ (0)ను భవనేశ్వర్ కుమార్ పెవిలియన్‌కు పంపాడు, అర్షదీప్ క్యాచ్ అందుకోవడంతో అలెన్ ఔటయ్యాడు. సూర్యకుమార్ సుడిగాలి శతకం. టీమిండియా భారీ స్కోర్ న్యూజిలాండ్‌తో రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 49 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో కెరీర్లో రెండో సెంచరీ బాదాడు. సూర్యకుమార్ ధాటికి టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ మొత్తంగా 51 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖరి ఓవర్లో సౌథీ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. శతక్కొట్టిన సూర్యకుమార్ టీమిండియా నయా సంచలనం సూర్యకుమార్ యాదవ్ అద్బుత సెంచరీతో మెరిశాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టి20లో చెలరేగిన సూర్యకుమార్ 49 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. సూర్య ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ టీమిండియా తరపున రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా అదే జోరును న్యూజిలాండ్ గడ్డమీద కూడా చూపించాడు. దంచుతున్న సూర్య.. భారీ స్కోరు దిశగా టీమిండియా ►సూర్యకుమార్ యాదవ్ దాటిగా ఆడుతుండడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం టీమిండియా 17 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. సూర్యకుమార్ 72, పాండ్యా 8 పరుగులతో ఆడుతున్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సూర్యకుమార్ ►సూర్యకుమార్ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. టీ20ల్లో మరో హాఫ్ సెంచరీని బాదాడు. సూర్య.. 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్లో 13వ హాఫ్ సెంచరీ బాదాడు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 12.4వ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ (13) హిట్ వికెట్‌గా ఔటయ్యాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో కాలు వికెట్లకు తగిలి అయ్యర్ పెవిలియన్‌కు చేరాడు. 13 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 110/3. క్రీజ్ సూర్యకుమార్ (43), హార్ధిక్ పాండ్యా ఉన్నారు. ఆట మళ్లీ మొదలు, రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా ►వరుణుడు శాంతించాడు. ఆట మళ్లీ మొదలైంది. అప్పటి దాకా ధాటిగా ఆడుతున్న ఇషాన్ కిషన్ (31 బంతుల్లో 36) ఆటకు బ్రేక్ పడటంతో లయ తప్పి ఔటయ్యాడు. 9.1వ ఓవర్లో సోధి బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఇషాన్ ఔటయ్యే సమయానికి టీమిండియా స్కోర్ 69/2. సూర్యకుమార్ (17), శ్రేయస్ అయ్యర్ క్రీజ్‌లో ఉన్నారు. అనుకున్నదే అయ్యింది.. వర్షం స్టార్ట్ అయ్యింది ►వాతావరణ శాఖ హెచ్చరికలే నిజమయ్యాయి. రెండో టీ20కి వరుణుడు ఆటంకం కలిగించాడు. టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తుండగా, 6.4 ఓవర్లు ముగిశాక వర్షం మొదలైంది. ఆ సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. పంత్ (6) మరోసారి నిరాశపర్చగా.. ఇషాన్ కిషన్ (28),సూర్యకుమార్ యాదవ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. అంపైర్లు మ్యాచ్‌ను నిలిపి వేశారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. పంత్ మళ్లీ విఫలం ►టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. 6వ ఓవర్ తొలి బంతికే రిషబ్ పంత్ (6) ఔటయ్యాడు. ఓపెనర్‌గా అవకాశం ఇచ్చినా పంత్ మరోసారి విఫలమయ్యాడు. 5.1 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 36/1. క్రీజ్‌లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ ఉన్నారు. 2 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 14/0 ► 2 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. పంత్ 4, ఇషాన్ కిషన్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మౌంట్ మాంగనుయ్‌లోని బే ఓవల్ వేదికగా ఇవాళ (నవంబర్ 20) జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్లు.. టీమిండియా : హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్ న్యూజిలాండ్ : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోది, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్ -
IND VS NZ 2nd T20: గుడ్ న్యూస్.. వరుణుడి ముప్పు లేనట్టే..!
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మౌంట్ మాంగనుయ్‌లోని బే ఓవల్ వేదికగా ఇవాళ (నవంబర్ 20) జరగాల్సిన రెండో టీ20 సజావుగా సాగేలా కనిపిస్తుంది. నిన్న వెదర్ ఫోర్‌కాస్ట్‌లో ఇవాళ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించడంతో.. క్రికెట్ ప్రేమికులంతా ఆందోళన చెందారు. అయితే, బే ఓవల్‌లో తాజా వాతావరణ పరిస్థితి చూస్తుంటే మ్యాచ్ సజావుగా సాగేలా కనిపిస్తుంది. ఆకాశం క్లియర్‌గా ఉండి, ఎండ కాసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే వాతావరణం కంటిన్యూ అయితే మ్యాచ్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా 20 ఓవర్ల పాటు సాగే అవకాశం ఉంది. కాగా, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నవంబర్ 18న జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. -
కోహ్లిని మించిన కెప్టెన్ లేడు.. కింగ్‌ను ఆకాశానికెత్తిన రైజింగ్ స్టార్
Shubman Gill On Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై రైజింగ్ స్టార్ శుభ్‌మన్ గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు. తాను ఆడిన కెప్టెన్లలో కోహ్లిని మించిన కెప్టెన్ లేడని కింగ్‌ను ఆకాశానికెత్తాడు. తాను వ్యక్తిగతంగా కోహ్లి కెప్టెన్సీని బాగా ఎంజాయ్ చేశానని, అతను జట్టు సభ్యులను మోటివేట్ చేసే విధానం తనకు బాగా నచ్చుతుందని, కోహ్లి.. ఆటగాళ్లలో కసి రగుల్చుతాడని, అందుకే తనకు కోహ్లి కెప్టెన్సీ అంటే ఇష్టమని కింగ్‌పై అభిమానాన్ని చాటుకున్నాడు. Shubman Gill said - "Virat Kohli is the Best Captain I have played under". — CricketMAN2 (@ImTanujSingh) November 19, 2022 కాగా, శుభ్‌మన్ గిల్ 2019లో కోహ్లి కెప్టెన్‌గా ఉండగానే టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. అయితే అతను అరంగేట్రానికి ఏడాది పాటు వేచి చూడాల్సి వచ్చింది. 2020 ఆస్ట్రేలియా పర్యటనలో గిల్.. అజింక్య రహానే కెప్టెన్సీలో టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్‌లో జరిగిన నాలుగో టెస్ట్‌లో 91 పరుగులు చేసిన గిల్.. టీమిండియా చారిత్రక గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అనంతరం గిల్.. తానాడిన 11 మ్యాచ్‌ల్లోనే కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రా, కేఎల్ రాహుల్ సారధ్యంలో టీమిండియాకు ఆడాడు. ఇదిలా ఉంటే, గిల్ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇప్పటివరకు టెస్ట్‌లు (11), వన్డేలు (12) మాత్రమే ఆడిన గిల్‌కు ఈ సిరీస్‌లో టీ20 అరంగేట్రం చేసే అవకాశం దొరకవచ్చు. 2018 అండర్-19 వరల్డ్‌కప్‌తో వెలుగులోకి వచ్చిన గిల్.. ఆతర్వాత దేశవాలీ, ఐపీఎల్లో సత్తా చాటి టీమిండియాలోకి వచ్చాడు. టెస్ట్‌లు, వన్డేలు కలిపి ఇప్పటివరకు గిల్ ఖాతాలో సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గిల్.. ఐపీఎల్లో 74 మ్యాచ్‌ల్లో 125 స్ట్రయిక్ రేట్‌తో 1900 పరుగులు చేశాడు. ఇందులో 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. -
న్యూజిలాండ్‌తో రెండో టీ20.. మళ్లీ అదే బ్యాడ్ న్యూస్..!
IND VS NZ 2nd T20: 3 టీ20లు, 3 వన్డేల సిరీస్ కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న టీమిండియాను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే నవంబర్ 18న వెల్లింగ్టన్లోని స్కై స్టేడియం వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. రేపు (నవంబర్ 20) మౌంట్ మౌంగనుయ్‌లోని బే ఓవల్‌లో జరగాల్సిన రెండో మ్యాచ్‌పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. వర్షం కారణంగా ఈ మ్యాచ్ కూడా సాధ్యపడే అవకాశం లేదని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ సమయానికి (భారతకాలమానం ప్రకారంమధ్యాహ్నం 12 గంటలకు) ఆకాశం పూర్తిగా మేఘావృతం అయ్యి ఉంటుందని, 90 శాతం వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వెదర్ ఫోర్‌కాస్ట్‌లో పేర్కొంది. అయితే వాతావరణంలో అనూహ్య మార్పులు జరిగితే మాత్రం కొద్ది ఓవర్ల ఆట సాధ్యపడే అవకాశాలు కూడా లేకపోలేదని తెలిపింది. కాగా, టీ20 వరల్డ్‌కప్-2022 అనంతరం సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ రెస్ట్ తీసుకోవడంతో టీమిండియా యువ జట్లతో (టీ20, వన్డే సిరీస్‌లకు వేర్వేరు జట్లు) న్యూజిలాండ్ పర్యటనకు బయల్దేరిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో టీ20 సిరీస్‌కు హార్ధిక్ పాండ్యా, వన్డే సిరీస్‌కు శిఖర్ ధవన్ టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నారు. వరుణుడు కరుణించి ఆట సాధ్యపడితే భారత తుది జట్టు ఎలా ఉండే అవకాశం ఉందంటే.. యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, ఉమ్రాన్ మాలిక్‌లకు తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్లు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ముగ్గురికి తుది జట్టులో ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. వరల్డ్‌కప్‌లో అవకాశాలు దక్కని దీపక్ హుడా, హర్షల్ పటేల్ మరోసారి బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఛాన్స్ కోసం ఎదురు చూడాల్సి రావచ్చు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. పేసర్ల కోటాలో స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ స్థానాలు పక్కా కాగా.. ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్‌ల మధ్య పోటీ ఉండే ఛాన్స్ ఉంది. తుది జట్టు (అంచనా).. శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్/చహల్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్/మహ్మద్ సిరాజ్. టీ20 సిరీస్‌కు భారత జట్టు.. హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. చదవండి: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీ20 సారధిగా హార్దిక్ కన్ఫర్మ్, వన్డే, టెస్ట్‌లకు..? -
సూపర్ మ్యాన్‌లా స్టోక్స్.. కళ్లు చెదిరే విన్యాసం చూసి ఔరా అంటున్న నెటిజన్లు
ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇవాళ (అక్టోబర్ 12) జరిగిన రెండో టీ20లో ఓ అద్భుత విన్యాసం ఆవిష్కృతమైంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ బౌండరీ లైన్ వద్ద సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి తన జట్టుకు నాలుగు పరుగులు ఆదా చేశాడు. బెన్ స్టోక్స్ చేసిన ఈ విన్యాసం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. సిక్సర్ సేవ్ చేయాలన్న స్టోక్స్ అంకితభావానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వారెవ్వా స్టోక్స్ అంటూ కితాబునిస్తున్నారు. స్టోక్స్‌పై ప్రశంసలతో ట్విటర్ హోరెత్తుతుంది. ప్రస్తుత తరం క్రికెటర్లలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా చలామణి అవుతున్న బెన్ స్టోక్స్ బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ తానే బెస్ట్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇవాళ ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తో మెప్పించలేకపోయిన స్టోక్స్ (11 బంతుల్లో 7).. బౌలింగ్ (1/10), ఫీల్డింగ్‌లో అదరగొట్టాడు. ముఖ్యంగా స్టోక్స్ ఇవాళ ఫీల్డ్‌లో పాదరసంలా కదిలాడు. తాను చేసిన పరుగుల కంటే ఎక్కువగా సేవ్ చేశాడు. Simply outstanding! Ben Stokes saves six with some acrobatics on the rope! #AUSvENG #PlayOfTheDay | #Dettol pic.twitter.com/5vmFRobfif— cricket.com.au (@cricketcomau) October 12, 2022 సామ్ కర్రన్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో మిచెల్ మార్ష్ భారీ షాట్ ఆడాడు. ఆ షాట్ తప్పక బౌండరీ ఆవల (సిక్స్) పడుతుందని బౌలర్‌తో పాటు అంతా ఫిక్స్ అయ్యారు. క్రీజ్‌లో ఉన్న బ్యాటర్లు సైతం ఇలాగే అనుకుని పరుగు తీయడం కూడా మానుకున్నారు. ఈ లోపు బౌండరీ లైన్ వద్ద స్టోక్స్ పక్షిలా గాల్లోకి ఎగిరి రోప్ బయట పడాల్సిన బంతిని లోపలికి నెట్టేశాడు. కళ్లు చెదిరే ఈ విన్యాసం చూసి గ్రౌండ్లో ఉన్న వాళ్లంతా నోరెళ్లబెట్టారు. ఈలోపు క్రీజ్‌లో ఉన్న బ్యాటర్లు స్టోక్స్ విన్యాసం చూసిన షాక్‌లోనే రెండు పరుగులు పూర్తి చేశారు. ఈ విన్యాసానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉంటే, కాన్బెర్రా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పర్యాటక ఇంగ్లండ్.. ఆసీస్‌పై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలుండగానే 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా.. ఛేదనలో ఆసీస్ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 9 పరుగుల దూరంలో (170) నిలిచిపోయింది. ఇంగ్లండ్ బ్యాటర్లు డేవిడ్ మలాన్ (48 బంతుల్లో 82; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), మొయిన్ అలీ (27 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించగా.. ఛేదనలో మిచెల్ మార్ష్ (29 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (23 బంతుల్లో 40; 5 ఫోర్లు, సిక్స్) ఆసీస్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. -
చెలరేగిన వార్నర్.. నిప్పులు చెరిగిన స్టార్క్
టీ20 వరల్డ్‌కప్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లభించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆ జట్టు ఆటగాళ్లు స్థాయి మేరకు సత్తా చాటారు. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆసీస్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇవాళ (అక్టోబర్ 7) జరిగిన రెండో మ్యాచ్‌లో ఆసీస్ 31 పరుగుల తేడాతో పర్యాటక జట్టును మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (41 బంతుల్లో 75; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాటర్ టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసెఫ్ 3 వికెట్లు పడగొట్టగా.. ఓబెద్ మెక్కాయ్ 2, ఓడియన్ స్మిత్ ఓ వికెట్ సాధించారు. అనంతరం 179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. మిచెల్ స్టార్క్ (4/20) నిప్పులు చెరగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులకే పరిమితమైంది. విండీస్ బ్యాటర్లలో జాన్సన్ చార్లెస్ (29), బ్రాండన్ కింగ్ (23), అకీల్ హొసేన్ (25) ఓ మోస్తరుగా రాణించగా.. మిగతావారంతా చేతులెత్తేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్‌కు జతగా పాట్ కమిన్స్ (2/32), కెమరూన్ గ్రీన్ (1/35), ఆడమ్ జంపా (1/34) రాణించారు. బ్యాటింగ్‌లో చెలరేగిన వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా దక్కింది. సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లోనూ ఆసీస్ పేస్ త్రయం స్టార్క్, కమిన్స్, హేజిల్‌వుడ్ చెలరేగి బౌలింగ్ చేయగా.. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (58) బాధ్యతాయుతమైన అర్ధసెంచరీతో, వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్ కీలక ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చారు. -
IND vs SA 2nd T20: పరుగుల వర్షంలో తేడా పదహారే!
గువహటి: మ్యాచ్ ఆరంభానికి కొద్దిసేపు ముందు వరకు కూడా వాన ఆటకు అంతరాయం కలిగించేలా కనిపించింది. అయితే ఆపై అసలు వర్షమైతే రాలేదు కానీ ‘బర్సపారా’ మైదానంలో పరుగుల వర్షం కురిసింది. ముందుగా భారత్ మెరుపు బ్యాటింగ్‌తో భారీ స్కోరు నమోదు చేయగా... అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా చివరి వరకు పోరాడింది. చివరకు 16 పరుగుల తేడాతో గెలిచిన భారత్ స్వదేశంలో దక్షిణాఫ్రికాపై 2–0తో తొలిసారి ద్వైపాక్షిక సిరీస్ సొంతం చేసుకుంది. సిరీస్‌లో చివరిదైన మూడో టి20 మంగళవారం ఇండోర్‌లో జరుగుతుంది. ఆదివారం జరిగిన రెండో టి20లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. టి20ల్లో ఇది భారత్‌కు నాలుగో అత్యధిక స్కోరు. సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 61; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేఎల్ రాహుల్ (28 బంతుల్లో 57; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీలు సాధించగా, కోహ్లి (28 బంతుల్లో 49 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ శర్మ (37 బంతుల్లో 43; 7 ఫోర్లు, 1 సిక్స్) అదే స్థాయిలో చెలరేగారు. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 221 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (47 బంతుల్లో 106 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు), డి కాక్ (48 బంతుల్లో 69 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) నాలుగో వికెట్‌కు 84 బంతుల్లోనే అభేద్యంగా 174 పరుగులు జోడించినా జట్టును గెలిపించలేకపోయారు. ఒకరితో పోటీ పడి మరొకరు... గత మ్యాచ్‌లో డకౌటైన రోహిత్ ఈసారి కొన్ని చక్కటి షాట్లతో శుభారంభం చేయగా, మరో ఎండ్ లో రాహుల్ మొదటినుంచే దూకుడు ప్రదర్శించాడు. పార్నెల్ ఓవర్లో అతను వరుసగా 6, 4 కొట్టగా రోహిత్ మరో ఫోర్ సాధించాడు. పవర్‌ప్లేలో భారత్ 57 పరుగులు చేసింది. ఆ తర్వాత నోర్జే వేసిన 9వ ఓవర్లో భారత్ పండగ చేసుకుంది. రాహుల్ వరుసగా 4, 6 బాదగా, రోహిత్ మరో రెండు ఫోర్లు కొట్టడంతో ఆ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. తొలి వికెట్‌కు 59 బంతుల్లో 96 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ వెనుదిరగ్గా... 24 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత రాహుల్ అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత సూర్య విధ్వంసం దక్షిణాఫ్రికాను అచేతనంగా మార్చేసింది. తొలి నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు కొట్టిన అతను రబడ ఓవర్లో చెలరేగిపోయాడు. అతను 2 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 22 పరుగులు వచ్చాయి. పార్నెల్ వేసిన బంతిని మరో భారీ సిక్సర్‌గా మలచిన సూర్య 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. మరోవైపు తన తొలి 14 బంతుల్లో 18 పరుగులు చేసిన కోహ్లి, తర్వాతి 14 బంతుల్లో 31 పరుగులు సాధించాడు. ఎట్టకేలకు సూర్య రనౌటైనా... చివరి ఓవర్లో దినేశ్ కార్తీక్ (7 బంతుల్లో 17 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మరిన్ని పరుగులు జోడించాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (ఎల్బీ) (బి) మహరాజ్ 57; రోహిత్ (సి) స్టబ్స్ (బి) మహరాజ్ 43; కోహ్లి (నాటౌట్) 49; సూర్యకుమార్ (రనౌట్) 61; కార్తీక్ (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 237. వికెట్ల పతనం: 1–96, 2–107, 3–209. బౌలింగ్: రబడ 4–0–57–0, పార్నెల్ 4–0–54–0, ఇన్‌గిడి 4–0–49–0, మహరాజ్ 4–0–23–2, నోర్జే 3–0–41–0, మార్క్రమ్ 1–0–9–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: బవుమా (సి) కోహ్లి (బి) అర్‡్షదీప్ 0; డికాక్ (నాటౌట్) 69; రోసో (సి) కార్తీక్ (బి) అర్‡్షదీప్ 0; మార్క్రమ్ (బి) అక్షర్ 33; మిల్లర్ (నాటౌట్) 106; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–47. బౌలింగ్: చహర్ 4–1–24–0, అర్‡్షదీప్ 4–0–62–2, అశ్విన్ 4–0–37–0, అక్షర్ 4–0–53–1, హర్షల్ 4–0–45–0. -
India vs South Africa 2nd T20: గెలిచేది ఇక్కడేనా!
గువాహటి: తొలి టి20లో బౌలర్ల అద్భుత ప్రదర్శనతో శుభారంభం చేసిన టీమిండియా ఇప్పుడు వరుస విజయంతో వరుసగా మరో సిరీస్‌పై కన్నేసింది. ప్రధాన సీమర్ బుమ్రా అనూహ్యంగా గాయంతో వైదొలిగినప్పటికీ భారత బౌలింగ్ ఇప్పుడు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌కు అదనపు బలగంగా మారడం జట్టు మేనేజ్మెంట్లో ఎక్కడలేని ఉత్సాహం నింపింది. మరోవైపు భారత సొంతగడ్డపై 20 ఫార్మాట్లో మంచి రికార్డు కలిగిన దక్షిణాఫ్రికా జట్టు తిరువనంతపురంలో పేలవమైన ఆటతీరుతో డీలాపడింది. సిరీస్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఈ మ్యాచ్‌కు సిద్ధమైంది. బౌలింగ్‌పై బెంగ లేకపోయినా... బ్యాటింగ్ దళంపై సఫారీ ఆందోళన చెందుతోంది. మ్యాచ్ వేదికైన బర్సాపారా స్టేడియంలో భారత్ రెండు టి20 మ్యాచ్‌లు ఆడింది. 2017లో ఆస్ట్రేలియా చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ ఓడిపోయింది. 2020లో భారత్, శ్రీలంక మ్యాచ్ టాస్ వేశాక వర్షం కారణంగా రద్దయింది. నేటి మ్యాచ్‌కు కూడా వాన గండం పొంచి ఉంది. సిరాజ్‌ని ఆడిస్తారా సిరీస్‌లో ఘనమైన శుభారంభంతో భారత జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ వారి ఫామ్‌పై ఎలాంటి అనుమానాలు లేవు. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. త్వరలో జరిగే టి20 ప్రపంచకప్‌కు ముందు రోహిత్ బృందానికి అతని సూపర్ ఫామ్ కొండంత బలాన్నిస్తోంది. అతను ఆడే కచ్చితమైన షాట్లు, టైమింగ్, ప్లేసింగ్ ఎలాంటి బౌలర్‌కైనా కలవరపెట్టక మానదు. అతని ఇన్నింగ్స్లవల్లే పంత్, దినేశ్ కార్తీక్‌లకు క్రీజులో సరైన అవకాశాలు రావట్లేదనే చెప్పాలి. ఇక బౌలింగ్ విషయానికొస్తే బుమ్రా స్థానంలో వచ్చిన హైదరాబాద్ స్పీడ్‌స్టర్ సిరాజ్‌ను తుదిజట్టుకు ఆడిస్తారో లేదో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే సీమర్లు చహర్, అర్‡్షదీప్, హర్షల్ పటేల్ వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. ఒత్తిడిలో సఫారీ గత మ్యాచ్ ఫలితం కంటే ప్రదర్శనే దక్షిణాఫ్రికాకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. ప్రత్యేకించి పరిమిత ఓవర్ల స్పెషలిస్టులు, హిట్టర్లు అందుబాటులో ఉన్న సఫారీ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిన తీరు ఆ జట్టును తీవ్రంగా కలవరపెడుతోంది. మూడు ఓవర్లు ముగియకముందే బ్యాటింగ్ బలగమంతా కకావికలమైంది. టెయిలెండర్ కేశవ్ మహరాజ్ పుణ్యమాని వంద దాటింది. లేదంటే ఆరంభ ఓవర్ల ఆటచూస్తే దక్షిణాఫ్రికాకు 50 పరుగులే కష్టమనిపించింది. ఇప్పుడు భారత బౌలర్లనే కాదు... తప్పక గెలవాల్సిన ఒత్తిడిని ఆ జట్టు ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. నోర్జే, రబడ, పార్నెల్, షమ్సీలతో కూడిన బౌలింగ్ విభాగం మెరుగ్గానే ఉంది. బౌలర్లు పట్టుబిగించాలంటే పోరాడే స్కోర్లు నమోదు కావాలి. లేదంటే గువాహటిలోనే సిరీస్‌ను కోల్పోవాల్సి వస్తుంది. -
IND vs AUS 2nd T20: భారత్ గెలుపు మెరుపులు
నాగ్‌పూర్: తడిసిన మైదానంలో ఆలస్యమైన ఆటలో భారత్ 6 వికెట్లతో ఘన విజయం సాధించింది. రెండో టి20లో ఆస్ట్రేలియాపై నెగ్గిన టీమిండియా 1–1తో సమం చేసి... సిరీస్ వేటలో నిలిచింది. వర్షం వల్ల 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్ (20 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. ఓపెనర్, కెప్టెన్ ఫించ్ (15 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. అనంతరం భారత్ 7.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (20 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఆటతో గెలిపించాడు. జంపాకు 3 వికెట్లు దక్కాయి. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి టి20 ఆదివారం హైదరాబాద్‌లో జరుగుతుంది. వేడ్ దూకుడు తక్కువ ఓవర్లు కావడంతో టాస్ నెగ్గగానే భారత కెప్టెన్ రోహిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో కోహ్లి అద్భుత ఫీల్డింగ్‌కు గ్రీన్ (5) రనౌట్ కాగా... అదే ఓవర్లో మ్యాక్స్‌వెల్ (0)ను అక్షర్ బౌల్డ్ చేశాడు. టి20 స్పెషలిస్ట్ హిట్టర్ టిమ్ డేవిడ్ (2)ను కూడా అక్షరే తన తదుపరి ఓవర్లో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ప్రమాదకరమైన బ్యాటర్లిద్దరిని తేలిగ్గా అవుట్ చేసినప్పటికీ కెప్టెన్ ఫించ్, మాథ్యూ వేడ్ ధాటిగా ఆడి స్కోరు పెంచారు. హర్షల్ పటేల్ బౌలింగ్‌నైతే వేడ్ ఉతికి ఆరేశాడు. అతను వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో 2 బౌండరీలతో 12 పరుగులు రాగా... ఆఖరి ఓవర్ (8)లో అయితే చుక్కలే చూపించాడు. డీప్ మిడ్ వికెట్, కవర్స్, డీప్ స్క్వేర్ లెగ్ దిశగా కొట్టిన మూడు సిక్సర్లు ప్రేక్షకుల చేతుల్లో పడ్డాయి. దీంతో ఆ ఒక్క ఓవర్లోనే 19 పరుగులు ఇవ్వడంతో ఆస్ట్రేలియా 91 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. బ్యాటింగ్ జోరు... హాజల్‌వుడ్ తొలి ఓవర్లోనే రోహిత్ 2, రాహుల్ ఒక సిక్సర్ బాదేయడంతో 20 పరుగుల వచ్చాయి. ఇద్దరు పుల్, హెలికాప్టర్ షాట్లతో దంచేశారు. కమిన్స్ వేసిన రెండో ఓవర్లో ‘హిట్‌మ్యాన్’ హుక్ షాట్‌తో మరో సిక్స్ కొట్టాడు. మూడో ఓవర్లో స్పిన్నర్ జంపాను దింపగా అతనికి సిక్సర్ ధాటిని చూపాడు. ఈ ఓవర్లో రాహుల్ (10)ను అవుట్ చేసిన జంపా తన మరుసటి ఓవర్లో కోహ్లి (11)ని, సూర్యకుమార్ (0)ను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. మరోవైపు రోహిత్ తన పనిని బౌండరీలతో యథేచ్చగా కానిచ్చేయడంతో జట్టు లక్ష్యం వైపు సాగింది. హార్దిక్ పాండ్యా (9) అవుటైనా... ఆఖరి ఓవర్లో 10 పరుగులు అవసరమైన దశలో దినేశ్ కార్తీక్ రెండు బంతుల్లోనే సిక్స్, ఫోర్ల తో ముగించాడు. దీంతో 4 బంతులు మిగిలుండగానే భారత్ లక్ష్యాన్ని చేరుకుంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ (బి) బుమ్రా 31; గ్రీన్ రనౌట్ 5; మ్యాక్స్‌వెల్ (బి) అక్షర్ 0; డేవిడ్ (బి) అక్షర్ 2; వేడ్ నాటౌట్ 43; స్మిత్ రనౌట్ 8; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (8 ఓవర్లలో 5 వికెట్లకు) 90. వికెట్ల పతనం: 1–14, 2–19, 3–31, 4–46, 5–90. బౌలింగ్: పాండ్యా 1–0–10–0, అక్షర్ 2–0–13–2, చహల్ 1–0–12–0, బుమ్రా 2–0–23–1, హర్షల్ 2–0–32–0. భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) జంపా 10; రోహిత్ నాటౌట్ 46; కోహ్లి (బి) జంపా 11; సూర్యకుమార్ (ఎల్బీ) (బి) జంపా 0; పాండ్యా (సి) ఫించ్ (బి) కమిన్స్ 9; దినేశ్ కార్తీక్ నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (7.2 ఓవర్లలో 4 వికెట్లకు) 92. వికెట్ల పతనం: 1–39, 2–55, 3–55, 4–77. బౌలింగ్: హాజల్‌వుడ్ 1–0–20–0, కమిన్స్ 2–0–23–1, జంపా 2–0–16–3, సామ్స్ 1.2–0–20–0, అబాట్ 1–0–11–0. -
IND vs AUS 2nd T20: సిరీస్ కాపాడుకునేందుకు...
నాగ్‌పూర్: రేసులో నిలవాలంటే... హైదరాబాద్‌లో సిరీస్‌ను తేల్చుకోవాలంటే... టీమిండియా ఇక్కడ ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. తొలి మ్యాచ్ ఓటమితో వెనుకబడిన రోహిత్ సేన శుక్రవారం జరిగే రెండో టి20లో ఆస్ట్రేలియాపై గెలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు సిరీస్‌లో శుభారంభం చేసిన కంగారూ సేన వరుస విజయాలతో ఏకంగా సిరీస్‌పైనే కన్నేసింది. ఈ నేపథ్యంలో నాగపూర్‌లో సమరం ఆసక్తికరంగా మారింది. పొట్టి ఫార్మాట్లో కచ్చితమైన ఫేవరెట్, సొంతగడ్డ అనుకూలతలేవీ ఉండవు. ఎవరు మెరిపిస్తే ఆ జట్టే గెలుస్తుంది. ఇక్కడ బంతికంటే బ్యాట్ ఆధిపత్యమే కొనసాగుతుంది. గత మ్యాచ్‌లో 200 పైచిలుకు పరుగులు చేసినా భారత్‌కు ఓటమి తప్పలేదు. కారణం చేజింగ్‌లో మనకన్న ప్రత్యర్థి మెరుపులే మెరిశాయి. డెత్ ఓవర్లపైనే దృష్టి ఒత్తిడంతా ఆతిథ్య భారత జట్టుపైనే ఉంది. బ్యాటింగ్ బాగున్నా... బౌలింగ్ ఆందోళన పెంచుతోంది. డెత్ ఓవర్లు మన భారీ స్కోరును సులభంగా ఛేదించేలా చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 33 మంది బౌలర్లు 20 డెత్ ఓవర్లు వేశారు. సగటున ప్రతి ఒక్కరు ఓవర్‌కు 10 పరుగులకంటే ఎక్కువే ఇచ్చారు. కలవరపెడుతున్న గణాంకాల నేపథ్యంలో జట్టు మేనేజ్మెంట్ కూడా ప్రత్యేకించి బౌలింగ్ విభాగంపైనే దృష్టి సారించింది. పూర్తి ఫిట్నెస్గా ఉన్న బుమ్రాను ఈ మ్యాచ్‌లో ఆడించే ప్రయత్నం చేయొచ్చు. బ్యాటింగ్ దళం పటిష్టంగానే ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ కోహ్లి గత మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ ఆసియా కప్‌తో ఫామ్‌లోకి వచ్చారు. సూర్యకుమార్ తన పాత్రకు న్యాయం చేయగా, హార్దిక్ పాండ్యా తన బ్యాటింగ్ సత్తాను చుక్కలతో చూపించాడు. ఇదే జోరు నాగ్‌పూర్‌లోనూ కొనసాగితే భారత్ భారీస్కోరుకు తిరుగుండదు. ఉత్సాహంగా కంగారూ సేన శుభారంభం తాలుకు ఉత్సాహం పర్యాటక జట్టులో తొణికిసలాడుతోంది. టి20 ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా సొంతగడ్డపై జరిగే మెగా ఈవెంట్‌కు ముందు ఈ సిరీస్‌ను తీసుకెళ్లాలని ఆశిస్తోంది. మొహాలిలో ఆసీస్ బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ క్రీజులోకి దిగిన బ్యాట్స్‌మెన్‌లో ఒక్క మ్యాక్స్‌వెల్ (1) మినహా అందరు వేగంగానే పరుగులు చేశారు. ఫించ్ (13 బంతుల్లో 22), గ్రీన్ (30 బంతుల్లో 61), ఇంగ్లిస్ (10 బంతుల్లో 17), వేడ్ (21 బంతుల్లో 45 నాటౌట్) ఇలా అందరూ బ్యాట్‌కు పనిచెప్పడంతో ఆతిథ్య బౌలింగ్ చెదిరింది. కొండంత లక్ష్యం చకచకా కరిగిపోయింది. అయితే బౌలింగ్‌కు సహకరించే నాగ్‌పూర్ పిచ్‌పై పరుగుల మోత ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఈ వేదికపై 12 టి20 మ్యాచ్‌లు జరిగితే మొదట బ్యాటింగ్ జట్టు చేసిన సగటు స్కోరు 151 పరుగులే! ఈ నేపథ్యంలో ఇక్కడ బ్యాటే కాదు బంతి కూడా ప్రభావం చూపుతుంది. -
ఇంగ్లండ్‌తో అమీతుమీకి సిద్ధమైన భారత్
సిరీస్‌లో నిలిచేందుకు నేడు ఇంగ్లండ్‌తో జరిగే రెండో టి20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. డెర్బీషైర్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం గెలిస్తే సిరీస్‌ను సమం చేస్తుంది. ఓడితే సిరీస్ ను కోల్పోతుంది. తొలి మ్యాచ్‌లో దీప్తి శర్మ మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
అర్షదీప్‌లో 'ఆ' ప్రత్యేక సామర్థ్యం ఉంది.. యువ పేసర్‌ను ఆకాశానికెత్తిన టీమిండియా కోచ్
Paras Mhambrey Lauds Arshdeep Singh: విండీస్‌తో జరిగిన రెండో టీ20లో కీలక సమయంలో (ఆఖరి 4 ఓవర్లలో 31 పరుగులు చేయాల్సిన దశలో) పొదుపుగా (17, 19 ఓవర్లలో 4, 6 పరుగులు) బౌలింగ్ చేసి టీమిండియాను గెలిపించేందుకు విఫలయత్నం చేసిన యువ పేసర్ అర్షదీప్ సింగ్‌పై బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ప్రశంసల వర్షం కురిపించాడు. అర్షదీప్‌కు ఒత్తిడిలో ప్రశాంతంగా బౌలింగ్ చేయగల ప్రత్యేక సామర్థ్యం ఉందని కొనియాడాడు. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలో ఒత్తిడిని అధిగమించి సత్ఫలితాలు రాబట్టగల సత్తా అర్షదీప్‌కు ఉందంటూ ఆకాశానికకెత్తాడు. అర్షదీప్‌లో ఈ సామర్థ్యాన్ని చాలాకాలంగా గమనిస్తున్నానని, రెండో టీ20లో అతను స్థాయి మేరకు రాణించడం సంతోషాన్ని కలిగించిందని అన్నాడు. భవిష్యత్తులో అర్షదీప్ టీమిండియాలో కీలక బౌలర్‌గా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. టీమిండియా తరఫున మూడు టీ20లు ఆడిన అర్షదీప్ 5.91 సగటున ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ పంజాబ్ బౌలర్ స్వల్ప వ్యవధిలోనే తన అత్యుత్తమ ప్రదర్శనతో జట్టులో కీలక బౌలర్‌గా మారాడు. వెస్టిండీస్‌తో ప్రస్తుత టీ20 సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో 6.25 సగటున మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. రెండో మ్యాచ్‌లో పొదుపుగా (4 ఓవర్లలో 1/26) బౌలింగ్ చేయడంతో పాటు ఓ వికెట్ (రోవ్‌మన్ పావెల్) పడగొట్టిన అర్షదీప్.. అంతకుముందు జరిగిన తొలి టీ20లోనూ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ (4 ఓవర్లలో 2/24) చేసి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే, రెండో టీ20లో అర్షదీప్ టీమిండియాను గెలిపించేందుకు తన వంతు ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఒబెడ్ మెక్కాయ్ ఆరు వికెట్లతో చెలరేగడంతో 19.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో విండీస్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. చదవండి: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్..! -
రెండో టీ20కి ముందు రోహిత్‌ను ఊరిస్తున్న ప్రపంచ రికార్డు
వెస్టిండీస్‌తో రెండో టీ20కి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తుంది. సెయింట్ కిట్స్ వేదికగా ఇవాళ (ఆగస్ట్ 1) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో రోహిత్ మరో 57 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో 3500 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 3443 పరుగులు (129 మ్యాచ్‌ల్లో) ఉన్నాయి. తాజా ఫామ్ (తొలి టీ20లో 64 పరుగులు) ప్రకారం చూస్తే.. రోహిత్ ఈ మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ మరో రెండు రికార్డులపై కూడా కన్నేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) 16000 పరుగుల మైలురాయిని చేరుకునేందుకు 44 పరుగుల దూరంలో ఉన్నాడు. అలాగే ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 11 సిక్సర్లు బాదగలిగితే అంతర్జాతీయ టీ20ల్లో కివీస్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్ (169) పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును అధిగమిస్తాడు. ఇక ఇదే మ్యాచ్‌లో ఇరు జట్లలోని పలువురు ఆటగాళ్లను కూడా పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఆ రికార్డులు ఏవంటే.. అంతర్జాతీయ టీ20ల్లో 50 వికెట్ల మైలురాయిని చేరుకునేందుకు రవీంద్ర జడేజా వికెట్ దూరంలో, హార్దిక్ పాండ్యా రెండు వికెట్ల దూరంలో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్‌కు టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేయడానికి 69 పరుగులు కావాలి. అంతర్జాతీయ క్రికెట్లో 100 ఫోర్లు పూర్తి చేయడానికి సూర్యకుమార్ యాదవ్ (95)కు ఐదు ఫోర్లు అవసరం. నికోలస్ పూరన్ అంతర్జాతీయ టీ20ల్లో 100 ఫోర్ల మార్కుకు ఐదు ఫోర్ల దూరంలో ఉన్నాడు. షిమ్రోన్ హెట్‌మైర్‌కు మూడు ఫార్మాట్లలో 3000 పరుగులు పూర్తి చేసేందుకు 35 పరుగులు కావాలి. అంతర్జాతీయ క్రికెట్లో 100 ఫోర్ల మార్కుకు బ్రాండన్ కింగ్ (95) ఐదు ఫోర్ల దూరంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 150 వికెట్లు సాధించడానికి ఆల్జారీ జోసెఫ్‌కు మరో 4 వికెట్లు కావాలి. ఇదిలా ఉంటే, విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 68పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా ఆధిపత్యం కొనసాగేనా..? రెండో టీ20లో విండీస్‌తో 'ఢీ'కి రెడీ అయిన రోహిత్ సేన -
టీమిండియా ఆధిపత్యం కొనసాగేనా..? రెండో టీ20లో విండీస్‌తో 'ఢీ'కి రెడీ అయిన రోహిత్ సేన
తొలి టీ20లో విండీస్‌పై 68 పరుగుల భారీ తేడా గెలుపొంది జోరుమీదున్న టీమిండియా.. నేడు జరిగే రెండో టీ20లోనూ గెలిచి మరో క్లీన్‌స్వీప్‌కు బాటలు వేయాలని పట్టుదలతో ఉంది. గెలిచిన జట్టును మార్చేందుకు సుముఖంగా లేని భారత టీమ్ మేనేజ్మెంట్ తొలి మ్యాచ్ ఆడిన జట్టునే కొనసాగించనుంది. మరోవైపు వన్డే సిరీస్‌ను కోల్పోయిన కరీబియన్ జట్టు టీ20ల్లోనైనా సత్తా చాటుకోవాలని భావిస్తోంది. సెయింట్ కిట్స్ వేదికగా భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ డీడీ స్పోర్ట్స్ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. తుది జట్ల అంచనా.. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ వెస్టిండీస్: కైల్ మేయర్స్, షమ్రా బ్రూక్స్, జేసన్ హోల్డర్, నిక్ పూరన్, రోవ్‌మన్ పావెల్, షిమ్రోన్ హెట్‌మైర్, అకీల్ హోసీన్, ఓడియన్ స్మిత్, కీమో పాల్, అల్జరీ జోసెఫ్, ఓబెద్ మెక్కాయ్ -
ఐదేసిన మొసద్దెక్.. జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకున్న బంగ్లా
తొలి టీ20లో జింబాబ్వే చేతిలో ఎదురైన పరాభవానికి బంగ్లాదేశ్ ప్రతీకారం తీర్చుకుంది. రెండో మ్యాచ్‌లో ఆతిధ్య జట్టును బంగ్లా జట్టు 7 వికెట్ల తేడా ఓడించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. సిరీస్ డిసైడ్ చేసే మూడో టీ20 ఆగస్ట్ 3న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వేను బంగ్లా స్పిన్నర్ మొసద్దెక్ హొసేన్ (5/20) దారుణంగా దెబ్బకొట్టాడు. మొసద్దెక్ ఫైఫర్ దాటికి జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి మ్యాచ్‌లో మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగిన సికందర్ రాజా (53 బంతుల్లో 62; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఈ మ్యాచ్‌లోనూ రాణించడంతో జింబాబ్వే ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ర్యాన్ బర్ల్ (31 బంతుల్లో 32; 3 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించగా.. మిగతా బ్యాటర్లంతా ఒక్కో పరుగు సాధించేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్, హసన్ మహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు. ఛేదనలో ఓపెనింగ్ బ్యాటర్ లిట్టన్ దాస్ (33 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మిడిలార్డర్ ఆటగాడు అఫీఫ్ హొసేన్ (28 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, సిక్స్) రాణించడంతో బంగ్లాదేశ్ మరో 15 బంతులు మిగిలుండగానే (17.3 ఓవర్లలో) లక్ష్యాన్ని (136/3) చేరుకుంది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ ఎంగర్వా, సీన్ విలియమ్స్, సికందర్ రాజా తలో వికెట్ పడగొట్టారు. చదవండి: సికందర్ రాజా ఊచకోత.. బంగ్లాకు షాకిచ్చిన జింబాబ్వే -
అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లి-రోహిత్
బర్మింగ్‌హామ్ వేదికగా ఇవాళ (జులై 9) ఇంగ్లండ్‌తో జరుగనున్న రెండో టీ20లో టీమిండియా ప్రస్తుత, మాజీ సారధులు రోహిత్, విరాట్లు ఓ అరుదైన రికార్డుపై కన్నేశారు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ మరో రెండు బౌండరీలు బాదితే టీ20 ఫార్మాట్లో 300 ఫోర్ల అరుదైన మైలురాయిని చేరుకుంటారు. ప్రస్తుతం వీరిద్దరి ఖాతాలో 298 బౌండరీలు ఉన్నాయి. పొట్టి ఫార్మాట్లో 300 బౌండరీల రికార్డు ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ పేరిట ఉంది. స్టిర్లింగ్.. 104 టీ20ల్లో 325 బౌండరీలు బాదాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ నెగ్గిన టీమిండియా 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలి మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్తో రెచ్చిపోవడంతో టీమిండియా 50 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించింది. చదవండి: దినేశ్ కార్తీక్‌కు వింత అనుభవం.. తన డెబ్యూ మ్యాచ్‌లో ప్లేయర్ ఇప్పుడు..! -
రోవ్‌మన్ పావెల్ ఊచకోత.. రెండో టీ20లో విండీస్ ఘన విజయం
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సిరీస్‌లో వెస్టిండీస్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన ఆ జట్టు.. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ హవా కొనసాగిస్తుంది. వర్షం కారణంగా తొలి మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగియగా.. ఆదివారం జరిగిన రెండో టీ20లో కరీబియన్ జట్టు 35 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు.. రోవ్‌మన్ పావెల్ (28 బంతుల్లో 61 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ సాయంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. పావెల్ సహా బ్రాండన్ కింగ్ (43 బంతుల్లో 57; 7 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ పూరన్ (30 బంతుల్లో 34; 3 ఫోర్లు, సిక్స్) రాణించారు. Powell power on display 💪 Shakib heroics can't save Bangladesh 🙌 West Indies eye T20 World Cup 👀 Talking points from the second #WIvBAN T20I 👇https://t.co/HmQoL9E7Hy — ICC (@ICC) July 4, 2022 అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లా జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. షకీబ్ అల్ హసన్ (52 బంతుల్లో 68 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) బంగ్లాదేశ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. విండీస్ బౌలర్లలో ఒబెడ్ మెక్ కాయ్, రొమారియో షెపర్డ్ తలో 2 వికెట్లు.. ఓడియన్ స్మిత్, అకీల్ హోసేన్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. నిర్ణయాత్మక మూడో టీ20 గయానా వేదికగా జులై 7న జరుగనుంది. చదవండి: హర్షల్ ఆల్‌రౌండ్ షో.. రెండో మ్యాచ్‌లోనూ టీమిండియాదే విజయం -
IND VS IRE 2nd T20: హార్దిక్ సేన ఖాతాలో చెత్త రికార్డు
ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో హార్ధిక్ పాండ్యా నేతృత్వంలోని యువ భారత జట్టు రికార్డు విజయాన్నినమోదు చేసి రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఆతిధ్య ఐర్లాండ్‌ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించిన భారత్.. రికార్డు విజయాన్ని నమోదు చేయడంతో పాటు ఓ చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంది. భారత ఇన్నింగ్స్‌లో ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు గోల్డెన్ డకౌట్(తొలి బంతికే ఔట్ కావడం)గా వెనుదిరిగారు. దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్‌లు తాము ఎదుర్కొన్న తొలి బంతికే ఔటై పెవిలియన్ బాట పట్టారు. ఓ ఇన్నింగ్స్‌లో టీమిండియా (టీ20ల్లో) తరఫున ఇన్ని(3) గోల్డెన్ డకౌట్లు రికార్డు కావడం ఇదే తొలిసారి. కాగా, దీపక్ హుడా (57 బంతుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుతమైన శతకంతో, సంజూ శాంసన్ (42 బంతుల్లో 77; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) సుడిగాలి హాఫ్ సెంచరీతో చెలరేగడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకు తీసుకువచ్చి ఓటమిపాలైంది. చివర్లో ఐర్లాండ్ ఆటగాళ్లు జార్జ్ డాక్రెల్ (16 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మార్క్ అడైర్ (12 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) టీమిండియాను బయపెట్టారు. ఆఖరి బంతికి 6 పరుగులు కావాల్సి ఉండగా ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌల్ చేసి కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇవ్వడంతో ఐర్లాండ్ ఓటమిపాలైంది. నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో పాల్ స్టిర్లింగ్ (18 బంతుల్లో 49; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ (37 బంతుల్లో 60; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), హ్యారీ టెక్టార్ (28 బంతుల్లో 39; 5 ఫోర్లు) భారీ షాట్లతో టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. చదవండి: కేఎల్ రాహుల్- రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన చిన్ననాటి స్నేహితులు -
IND VS IRE 2nd T20: ఉత్కంఠపోరులో భారత్ విజయం
-
ఆఖరి వరకు ఉత్కంఠ.. టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం
ఐర్లాండ్‌తో జరిగిన ఉత్కంఠపోరులో టీమిండియా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. 228 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ ఒక దశలో లక్ష్యం వైపుగా సాగింది. అయితే ఆఖర్లో ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ అద్బుతంగా బౌలింగ్ చేయడంతో ఐర్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేయడంతో టీమిండియా తృటిలో ఓటమి నుంచి తప్పించుకుంది. ఐర్లాండ్ బ్యాటింగ్‌లో ఆండ్రూ బాల్బర్నీ(37 బంతుల్లో 60, 3 ఫోర్లు, 7 సిక్సర్లు), పాల్ స్టిర్లింగ్(18 బంతుల్లో 40, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దాటిగా ఆడారు. హ్యారీ టెక్టర్ 39 పరుగులు చేయగా.. చివర్లో జార్జ్ డాక్రెల్ 34 నాటౌట్, మార్క్ ఎడైర్ 23 నాటౌట్‌గా మిగిలారు. టీమిండియా బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, రవి బిష్ణోయి తలా ఒక వికెట్ తీశారు. కాగా రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను టీమిండియా 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ►టీమిండియాతో జరుగుతున్న రెండో టి20లో ఐర్లాండ్ సంచలనం చేస్తుంది. 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. జార్జ్ డాక్రెల్ 28, హ్యారీ టెక్టర్ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు. ►228 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 9 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఆండ్రూ బాల్బరిన్ 44, హారి టెక్టర్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ►ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 104 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. దీపక్ హుడాకు ఓపెనర్ సంజూ శాంసన్(42 బంతుల్లో 77, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) సహకరించాడు. ► పది ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ స్కోరు 97/1. ఆరంభంలో వికెట్ పడినా ఏ మాత్రం తడబడకుండా భారత బ్యాటర్లు ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం దీపక్ హుడా(58), సంజు సాంసన్(42) క్రీజులో ఉన్నారు. ► ఆరో ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 54/1. క్రీజులో దీపక్ హుడా(28), సంజు సాంసన్(25) ఉన్నారు. ► మూడో ఓవర్లోనే భారత్‌కి ఎదురు దెబ్బ తగిలింది.భారత్ ఓపెనర్ ఇషాన్ కిషన్(3) పెవిలియన్ బాట పట్టాడు. కిషన్ ఔటయ్యే సమయానికి భారత్ స్కోరు 13. ప్రస్తుతం దీపక్ హుడా(0) , సంజు సాంసన్(10) క్రీజులో ఉన్నారు. ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా ఇవాళ (జూన్ 28) రెండో టీ20 ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో తొలి టీ20లో గెలిచిన టీమిండియా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. గాయపడిన రుతురాజ్ స్థానంలో సంజూ శాంసన్, ఆవేశ్ ఖాన్ స్థానంలో హర్షల్ పటేల్, చహల్ ప్లేస్‌లో రవి బిష్ణోయ్‌లు తుది జట్టులోకి వచ్చారు. భారత జట్టు: సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దినేశ్ కార్తిక్ (వికెట్‌కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్ ఐర్లాండ్: ఆండ్రూ బల్బిర్నీ(కెప్టెన్), హ్యారీ టెక్టార్, గరేత్ డిలనీ, పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టకర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడేర్, జాషువా లిటిల్, ఆండీ మెక్‌బ్రిన్, కానర్ ఆల్ఫర్ట్, క్రెయిగ్ యంగ్. చదవండి: టీమిండియా కెప్టెన్ ఎవరని ప్రశ్నించిన ఐసీసీ.. హర్భజన్ ఏమన్నాడంటే..? -
India vs Ireland: సిరీస్‌పై కన్నేసిన భారత్.. వరుణుడు కరుణించేనా..?
డబ్లిన్: తొలి టి20లో ఐర్లాండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ నేడు జరిగే రెండో టి20లోనూ విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అయితే గత మ్యాచ్‌లాగే ఈ సారి కూడా ఆటకు వాన అంతరాయం కలిగించే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ తొలి పోరులాగే మ్యాచ్‌ను కుదించాల్సి వచ్చినా... టీమిండియా ఆధిపత్యాన్ని ఐర్లాండ్ ఎంత వరకు నిలువరించగలదనేది చూడాలి. ఇప్పటి వరకు జరిగిన నాలుగు టి20ల్లోనూ ఐర్లాండ్‌ను చిత్తు చేయడం భారత్ పైచేయిని చూపిస్తోంది. వర్షం కురిస్తే పిచ్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉండగా... వానతో అంతరాయం ఏర్పడకపోతే బ్యాటింగ్‌లో పరుగుల వరుద పారవచ్చు. సామ్సన్ లేదా త్రిపాఠి... 12 ఓవర్ల మ్యాచ్‌లో భారత్ ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాస విజయాన్ని అందుకుంది. కాబట్టి అదే జట్టును కొనసాగించాలని మేనేజ్మెంట్ భావించడం సహజం. అయితే రుతురాజ్ గాయంతో బాధపడుతుండటంతో ఒక స్థానం ఖాళీగా కనిపిస్తోంది. ఓపెనర్‌గా అనుభవం ఉన్న రాహుల్ త్రిపాఠి లేదా పునరాగమనం చేసిన సంజు సామ్సన్లలో ఒకరికి చోటు దక్కవచ్చని అంచనా. మిగతా ఆటగాళ్లంతా గత మ్యాచ్‌లో తమ వంతు పాత్రను పోషించారు. అరంగేట్ర మ్యాచ్‌లో వేసిన ఒకే ఒక ఓవర్లో తడబడిన ఉమ్రాన్ మలిక్‌కు కూడా మరో అవకాశం దక్కవచ్చు. భువనేశ్వర్, చహల్‌ల బౌలింగ్ ముందు ఐర్లాండ్ నిలబడలేకపోయింది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే హార్దిక్ పాండ్యా ఆకట్టుకున్నాడు. మొత్తంగా చూస్తే టాప్ ఆటగాళ్లు లేకపోయినా ప్రత్యర్థి ముందు భారత్ ఏ రకంగా చూసినా మెరుగైన జట్టే. జోరును కొనసాగిస్తే సిరీస్ గెలుపు ఖాయం. టెక్టర్‌పై దృష్టి... గత మ్యాచ్‌లో ఐర్లాండ్ సంతోషించే అంశం ఏదైనా ఉందీ అంటే అది హ్యారీ టెక్టర్ బ్యాటింగే. 6 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగిన అతని బ్యాటింగ్ భారత శిబిరాన్ని కూడా ఆకట్టుకుంది. టెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ హార్దిక్ తన బ్యాట్‌ను అతనికి బహుమతిగా కూడా ఇచ్చాడు. పెద్ద జట్టుపై సత్తాను చాటేందుకు అతనికి ఇది మరో మంచి అవకాశం. తొలి పోరులో విఫలమైన సీనియర్లు పాల్ స్టిర్లింగ్, ఆండీ బల్బర్నీ, డాక్రెల్ బాధ్యతగా ఆడాల్సి ఉంది. సొంతగడ్డపై చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించేందుకు ఐర్లాండ్‌కు ఇదే మంచి అవకాశం. అయితే పేలవ బౌలింగ్‌తో జట్టు ఇబ్బంది పడుతోంది. టీమిండియాను నిలువరించడం వారికి కష్టం కావచ్చు. -
అయ్యర్, జడేజా మెరుపులు.. సిరీస్ మనదే
ఎంతటి భారీ స్కోరైనా భారత్ ముందు తక్కువేనని మరోసారి రుజువైంది. ఓపెనర్లు విఫలమైనా శ్రేయస్ అయ్యర్, సంజు సామ్సన్, రవీంద్ర జడేజా మెరుపు బ్యాటింగ్‌కు జట్టుకు మరో విజయాన్ని, సిరీస్‌ను అందించింది. 60 బంతుల్లో 104 పరుగులు చేయాల్సిన స్థితిలో లక్ష్యం కష్టంగా అనిపించినా... మన బ్యాటర్లు అలవోకగా పరుగులు బాదేశారు. ముందుగా భారీ స్కోరు చేయడంతో పాటు ఆరంభంలో భారత్‌ను నిలువరించగలిగిన లంక ఆ తర్వాత పూర్తిగా చేతులెత్తేసింది. సిరీస్ ఫలితం తేలిపోగా, మిగిలిన మూడో మ్యాచ్ లాంఛనం నేడు పూర్తి కానుంది. ధర్మశాల: శ్రీలంకతో జరిగిన రెండో టి20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. పతుమ్ నిసాంకా (53 బంతుల్లో 75; 11 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, గుణతిలక (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. చివర్లో షనక (19 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగిపోవడంతో లంకకు భారీ స్కోరు సాధ్యమైంది. అనంతరం భారత్ 17.1 ఓవర్లలో 3 వికెట్లకు 186 పరుగులు చేసి అంతర్జాతీయ టి20ల్లో వరుసగా 11వ విజయం నమోదు చేసుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (44 బం తుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), జడేజా (18 బంతుల్లో 45 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), సామ్సన్ (25 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లు జట్టును గెలిపించాయి. చివరి టి20 నేడు ఇదే మైదానంలో జరుగుతుంది. 4 ఓవర్లలో 72 పరుగులు... ఓపెనర్లు నిసాంకా, గుణతిలక జాగ్రత్తగా ఇన్నింగ్స్ ను ప్రారంభించడంతో పవర్‌ప్లేలో శ్రీలంక 32 పరుగులే చేయగలిగింది. జడేజా వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో తొలి మూడు బంతుల్లో వరుసగా 6, 4, 6 బాది దూకుడు ప్రదర్శించిన గుణతిలక నాలుగో బంతికి అవుట్ కావడంతో 67 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం (52 బంతుల్లో) ముగిసింది. ఆ తర్వాత వరుస ఓవర్లలో అసలంక (2), మిషారా (1) వెనుదిరగ్గా, చండిమాల్ (9) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో నిసాంకా, షనక భాగస్వామ్యం జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించింది. వీరిద్దరు 26 బంతుల్లోనే 58 పరుగులు జోడించారు. ముఖ్యంగా చివరి నాలుగు ఓవర్లలో భారత బౌలర్లపై లంక విరుచుకుపడింది. హర్షల్ వేసిన 17 ఓవర్లో షనక 2 సిక్స్‌లు బాదగా నిసాంకా ఫోర్ కొట్టాడు. బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లో నిసాంకా మూడు ఫోర్లతో చెలరేగగా, భువీ ఓవర్లో షనక వరుసగా 6, 4తో చెలరేగాడు. నిసాంకా వెనుదిరిగిన తర్వాత హర్షల్ వేసిన 20వ ఓవర్లోనూ షనక సత్తా చాటాడు. ఈ నాలుగు ఓవర్లలో లంక వరుసగా 19, 14, 16, 23 పరుగులు సాధించడం విశేషం. భారీ లక్ష్య ఛేదనలో భారత్‌కు సరైన ఆరంభం లభించలేదు. రోహిత్ (1) తొలి ఓవర్లోనే వెనుదిరగ్గా, ఇషాన్ (15) కూడా పవర్‌ప్లేలోనే అవుటయ్యాడు. అయితే శ్రేయస్, సామ్సన్ భాగస్వామ్యం జట్టును విజయం దిశగా నడిపించింది. ముందుగా బినూరా ఓవర్లో మూడు ఫోర్లతో జోరు మొదలు పెట్టిన శ్రేయస్ దానిని కొనసాగించాడు. జయవిక్రమ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన అతను కరుణరత్నే బౌలింగ్‌లో మరో సిక్సర్‌తో 30 బంతుల్లోనే సిరీస్‌లో వరుసగా రెండో అర్ధ సెంచరీ సాధించాడు. ఆరంభంలో తడబడిన సామ్సన్... కుమార ఓవర్లో చెలరేగిపోయాడు. ఒక ఫోర్, 3 భారీ సిక్సర్లు బాదిన అనంతరం అదే ఓవర్లో బినూరా అద్భుత క్యాచ్‌కు నిష్క్రమించాడు. 42 బంతుల్లో 56 పరుగులు చేయాల్సిన ఈ దశలో జడేజా దాదాపు ఒంటి చేత్తో మ్యాచ్‌ను ముగించాడు. చమీరా ఓవర్లో వరుసగా కొట్టిన 6, 4, 4, 4 అతని ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. జడేజా, శ్రేయస్ నాలుగో వికెట్‌కు 26 బంతుల్లోనే అభేద్యంగా 58 పరుగులు జత చేశారు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంకా (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 75; గుణతిలక (సి) వెంకటేశ్ (బి) జడేజా 38; అసలంక (ఎల్బీ) (బి) చహల్ 2; మిషారా (సి) శ్రేయస్ (బి) హర్షల్ 1; చండీమాల్ (సి) రోహిత్ (బి) బుమ్రా 9; షనక (నాటౌట్) 47; కరుణరత్నే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 183. వికెట్ల పతనం: 1–67, 2–71, 3–76, 4–102, 5–160. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–36–1, బుమ్రా 4–0–24–1, హర్షల్ పటేల్ 4–0–52–1, చహల్ 4–0–27–1, రవీంద్ర జడేజా 4–0–37–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) చమీరా 1; ఇషాన్ కిషన్ (సి) షనక (బి) కుమార 16; శ్రేయస్ (నాటౌట్) 74; సామ్సన్ (సి) బినూరా (బి) కుమార 39; జడేజా (నాటౌట్) 45; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (17.1 ఓవర్లలో 3 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–9, 2–44, 3–128. బౌలింగ్: చమీరా 3.1–0–39–1, బినూరా 4–0–47–0, కుమార 3–0–31–2, జయవిక్రమ 2–0–19–0, కరుణరత్నే 3–0–24–0, షనక 2–0–24–0.