Breadcrumb
బ్యాటర్ల విశ్వరూపం.. భారీ టార్గెట్‌ను ఊదేసిన రోహిత్ సేన
Published Sat, Feb 26 2022 6:16 PM | Last Updated on Sat, Feb 26 2022 10:56 PM
Live Updates
ఇండియా వర్సస్ శ్రీలంక రెండో టీ20 అప్డేట్స్
భారీ టార్గెట్‌ను ఊదేసిన టీమిండియా బ్యాటర్లు
లంక నిర్ధేశించిన 184 పరుగుల భారీ టార్గెట్‌ను టీమిండియా సునాయాసంగా ఛేదించింది. మరో 17 బంతులు ఉండగానే కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో లంకేయులపై వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో చేజిక్కించుకుంది. టీమిండియా బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్(44 బంతుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), సంజూ శాంసన్ (25 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రవీంద్ర జడేజా (18 బంతుల్లో 45 నాటౌట్; 7 ఫోర్లు, సిక్సర్) ఆకాశమే హద్దుగా చెలరేగి టీ20ల్లో టీమిండియాకు వరుసగా 11వ మ్యాచ్‌లో విజయాన్నందించారు.
లంక బౌలర్లలో లహీరు కుమార 2, చమీర ఓ వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. శనక (19 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) సిక్సర్లతో విరుచుకుపడటంతో భారీ స్కోర్ సాధించింది. అతనికి ఓపెనర్ నిస్సంక (53 బంతుల్లో 75; 11 ఫోర్లు) సహకరించడంతో లంక జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు స్కోర్ చేసింది. టీమిండియా బౌలర్లు భువీ, బుమ్రా, హర్షల్ పటేల్, చహల్, జడేజా తలో వికెట్ పడగొట్టారు.
గెలుపు దిశగా టీమిండియా
సంజూ శాంసన్ (25 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఔటయ్యాక క్రీజ్‌లోని వచ్చిన రవీంద్ర జడేజా (15 బంతుల్లో 39; 6 ఫోర్లు, సిక్సర్) కూడా ఏమాత్రం తగ్గకుండా ఆడుతూ బౌండరీ నలువైపులా ఫోర్లు, సిక్సర్లు బాదుతున్నాడు. చమీర వేసిన 16వ ఓవర్లో జడ్డూ వరుసగా 3 బౌండరీలు బాదడంతో పాటు 22 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్‌తో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. టీమిండియా గెలుపుకు 24 బంతుల్లో కేవలం 9 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. మరో ఎండ్‌లో శ్రేయస్ అయ్యర్(40 బంతుల్లో 69) సైతం దూకుడును కొనసాగిస్తున్నాడు.
బినుర కళ్లు చెదిరే క్యాచ్.. శాంసన్ ఔట్
లంక ఆటగాడు బినుర ఫెర్నాండో కళ్లు చెదిరే క్యాచ్ పట్టడంతో సంజూ శాంసన్ (25 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఔటయ్యాడు. లహీరు కుమార వేసిన 13వ ఓవర్లో 3 సిక్సర్లు, బౌండరీ బాది జోష్ మీదున్నట్లు కనిపించిన శాంసన్.. బినుర ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 136/3. క్రీజ్‌లో శ్రేయస్ అయ్యర్(66), జడేజా(6) ఉన్నారు.
శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫిఫ్టి
టీమిండియా మిడిలార్డర్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ బాదాడు. తొలి వన్డేలో ఇన్నింగ్స్ చివర్లో చెలరేగిన అయ్యర్.. ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బరిలోకి దిగి 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 53 పరుగులు స్కోర్ చేశాడు. మరో ఎండ్‌లో సంజూ శాంసన్(18 బంతుల్లో ఫోర్ సాయంతో 16) ఆచి తూచి ఆడుతున్నాడు. 11 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 91/2.
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
ఆరో ఓవర్ తొలి బంతికి టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. లహీరు కుమార బౌలింగ్‌లో శనకకు క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ (15 బంతుల్లో 16; 2 ఫోర్లు) ఔటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 46/2. క్రీజ్‌లో శ్రేయస్ అయ్యర్(24), సంజూ శాంసన్(1) ఉన్నారు.
తొలి ఓవర్లోనే టీమిండియాకు షాక్
184 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. చమీరా బౌలింగ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ (2 బంతుల్లో 1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా టీమిండియా 9 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఇషాన్ కిషన్ (7), శ్రేయస్ అయ్యర్ క్రీజ్‌లో ఉన్నారు.
శనక సిక్సర్ల సునామీ.. టీమిండియాకు భారీ టార్గెట్ నిర్ధేశించిన శ్రీలంక
కెప్టెన్ శనక (19 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆఖర్లో సిక్సర్లతో విరుచుకుపడటంతో లంకేయులు భారీ స్కోర్ సాధించారు. అతనికి ఓపెనర్ నిస్సంక (53 బంతుల్లో 75; 11 ఫోర్లు) సహకరించడంతో లంక జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు స్కోర్ చేసింది. ఓ పక్క క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా ఈ ఇద్దరూ దూకుడుగా ఆడటటంతో లంక జట్టు టీమిండియాకు భారీ స్కోర్ నిర్ధేశించింది. లంక మరో ఓపెనర్ గుణతిలక (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తారుగా రాణించాడు. టీమిండియా బౌలర్లు భువీ, బుమ్రా, హర్షల్ పటేల్, చహల్, జడేజా తలో వికెట్ పడగొట్టారు.
నిస్సంక సూపర్ ఇన్నింగ్స్.. భారీ స్కోర్ దిశగా శ్రీలంక
ఓ పక్క వికెట్లు పడుతున్నా లంక ఓపెనర్ నిస్సంక ఏమాత్రం తగ్గకుండా దూకుడుగా ఆడాడు. 53 బంతుల్లో 11 ఫోర్లు సాయంతో 75 పరుగులు సాధించాడు. 19 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 160/5.
క్యాచింగ్ ప్రాక్టీస్ చేయిస్తున్న లంక బ్యాటర్లు
టీమిండియా బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోతూ తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేలా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా ఫీల్డర్లకు సునాయాసమైన క్యాచ్‌లు అందిస్తూ క్యాచింగ్ ప్రాక్టీస్ చేయిస్తున్నారు. బుమ్రా వేసిన 15వ ఓవర్లో చండీమాల్(9) ఫోర్ బాది ఆ తర్వాతి బంతికే రోహిత్‌కు సునాయాసమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 15 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 103/4.
మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక
11వ ఓవర్లో శ్రీలంక మరో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ వేసిన 11వ ఓవర్ ఆఖరి బంతికి కమిల్ మిశారా (4 బంతుల్లో 1) శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 12 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 80/3. క్రీజ్‌లో నిస్సంక (33), చండీమాల్ (2) ఉన్నారు.
వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయిన శ్రీలంక
జడేజా వేసిన 9వ ఓవర్లో గుణతిలక వికెట్ కోల్పోయిన శ్రీలంక.. చహల్ వేసిన మరుసటి ఓవర్లో రెండో వికెట్ కోల్పోయింది. చహల్ వేసిన గూగ్లి బంతికి అసలంక (5 బంతుల్లో 2) ఎల్బీడబ్యూగా వెనుదిరిగాడు. 9.5 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 71/2. నిస్సంక (27), కమిల్ మిశారా ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక
ఇన్నింగ్స్ ఆరంభంలో ఆచితూచి ఆడిన లంక ఓపెనర్లు.. క్రమంగా దూకుడుగా పెంచారు. ముఖ్యంగా స్పిన్నర్లపై లంక బ్యాటర్లు ఎదురుదాడికి దిగారు. జడేజా వేసిన 9వ ఓవర్లో 2 సిక్సర్లు, ఫోర్ బాది జోరుమీదున్నట్లు కనిపించిన గుణతిలక (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అదే ఓవర్లో వెంకటేశ్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 69/1.
ఆచితూచి ఆడుతున్న లంక ఓపెనర్లు
టాస్ ఓడి టీమిండియా ఆహ్వనం మేరకు బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఆచితూచి ఆడుతుంది. మ్యాచ్‌కు ముందు వర్షం కారణంగా బంతి స్వింగ్ అవుతుండటంతో లంక బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. క్రీజ్‌లో నిస్సంక (15 బంతుల్లో 14; 2 ఫోర్లు), గుణతిలక (21 బంతుల్లో 14; 2 ఫోర్లు) ఉన్నారు. 6 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 32/0.
టీమిండియా పేసర్ల దూకుడు
మ్యాచ్‌కు ముందు వర్షం పడిన నేపథ్యంలో బంతి విపరీతంగా స్వింగ్ అవుతుంది. దీంతో లంక బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. టీమిండియా పేసర్లు భువీ, బుమ్రా దూకుడుగా బౌల్ చేస్తున్నారు. 3 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 13/0. క్రీజ్‌లో నిస్సంక (2), గుణతిలక (7) ఉన్నారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
టీమిండియా మరో టీ20 సిరీస్‌పై కన్నేసింది. ధర్మశాల వేదికగా శ్రీలంకతో రెండో టీ20 మ్యాచ్‌కు భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో మార్పులు ఏమి లేకుండా భారత్ బరిలోకి దిగుతుండగా.. శ్రీలంక రెండు మార్పులతో ఆడనుంది.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, దినేష్ చండిమాల్ (వికెట్ కీపర్), దసున్ షనక (కెప్టెన్), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, ప్రవీణ్ జయవిక్రమ, బినుర ఫెర్నాండో, లహిరు కుమార
Related News By Category
Related News By Tags
-
మూడో వన్డేలోనూ ఓటమి.. సిరీస్ కోల్పోయిన భారత్
శ్రీలంకతో మూడో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడింది. 249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 138 పరుగులకే (26.1 ఓవర్లలో) ఆలౌటైంది. దునిత్ వెల్లలగే ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొ...
-
శ్రీలంకతో రెండో వన్డే.. టీమిండియా ఓటమి
IND VS SL 2nd ODI Updates And Highlights: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో భారత్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 241 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుక...
-
IND Vs AUS: బ్యాటర్ల ఊచకోత.. రెండో టీ20లోనూ టీమిండియాదే విజయం
బ్యాటర్ల ఊచకోత.. రెండో టీ20లో టీమిండియా ఘన విజయం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తిరువనంతపురం వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో త...
-
చెలరేగిన హర్షల్, చహల్.. మూడో టీ20లో టీమిండియా ఘన విజయం
సత్తా చాటిన భారత బౌలర్లు.. మూడో టీ20లో టీమిండియా ఘన విజయం భారత బౌలర్లు హర్షల్ పటేల్ (4/25), చహల్ (3/20) సత్తా చాటడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన కీలకమైన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్...
-
అయ్యర్, జడేజా మెరుపులు.. సిరీస్ మనదే
ఎంతటి భారీ స్కోరైనా భారత్ ముందు తక్కువేనని మరోసారి రుజువైంది. ఓపెనర్లు విఫలమైనా శ్రేయస్ అయ్యర్, సంజు సామ్సన్, రవీంద్ర జడేజా మెరుపు బ్యాటింగ్‌కు జట్టుకు మరో విజయాన్ని, సిరీస్‌ను అందించింది. 60 బంతుల్...
Comments
Please login to add a commentAdd a comment