
నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా నామామత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఆసీస్ బౌలర్లు రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది. భారత ఇన్నింగ్స్‌లో దీప్తి శర్మ (30) టాప్ స్కోరర్‌గా నిలువగా.. రిచా ఘోష్ (23), స్మృతి మంధన (23), జెమీమా రోడ్రిగెజ్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
షెఫాలీ వర్మ (1), హార్మన్‌ప్రీత్ కౌర్ (6), పూజా వస్త్రాకర్ (9), అమన్‌జోత్ కౌర్ (4) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జార్జీయా వేర్హమ్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, కిమ్ గార్త్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆష్లే గార్డ్‌నర్ ఓ వికెట్ దక్కించుకుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి టీ20లో విజయం సాధించింది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయగా.. ఏకైక టెస్ట్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. ఆసీస్ ప్లేయర్ ఎల్లిస్ పెర్రీకి ఈ మ్యాచ్ 300వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం.