భారత్, ఆస్ట్రేలియా (మహిళల క్రికెట్) జట్ల మధ్య డిసెంబర్ 5 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించారు.
ఈ జట్టుకు ఎంపికైన యువ వికెట్‌కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా బిగ్‌బాష్ లీగ్ ఆడుతూ (మెల్‌బోర్న్ స్టార్స్) గాయపడింది. యస్తికా మణికట్టు గాయానికి గురైంది. దీంతో యస్తికాను ఆస్ట్రేలియా సిరీస్ నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
యస్తికా స్థానాన్ని 22 ఏళ్ల ఉమా ఛెత్రీ భర్తీ చేస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. ఛెత్రీ ఈ ఏడాది జులైలోనే టీమిండియా అరంగేట్రం చేసింది. భారత్ తరఫున ఈ చిన్నది నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఛెత్రీ వన్డేల్లో అరంగేట్రం చేయాల్సి ఉంది.
కాగా, ఆసీస్ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత్ జట్టులో స్టార్ ప్లేయర్ షఫాలీ వర్మకు చోటు దక్కలేదు. పేలవ ఫామ్ కారణంగా సెలెక్టర్లు షఫాలీ వర్మపై వేటు వేశారు. ఈ సిరీస్‌లో శ్రేయాంక పాటిల్, దయాలన్ హేమలత, సయాలీ సథ్గరే కూడా ఆడటం లేదు.
ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత జట్టు..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, ప్రియా పునియా, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, మిన్ను మణి, ప్రియా మిశ్రా, రాధా యాదవ్, టిటాస్ సాధు, అరుంధతి రెడ్డి, రేణుక సింగ్, సైమా ఠాకోర్, ఉమా ఛెత్రీ (వికెట్ కీపర్)
సిరీస్ షెడ్యూల్..
డిసెంబర్ 5- తొలి వన్డే (బ్రిస్బేన్)
డిసెంబర్ 8- రెండో వన్డే (బ్రిస్బేన్)
డిసెంబర్ 11- మూడో వన్డే (పెర్త్)
Comments
Please login to add a commentAdd a comment