మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (డిసెంబర్ 5) తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా భారత్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మెగాన్ షట్ (6.2-1-19-5) దెబ్బకు 34.2 ఓవర్లలోనే 100 పరుగులకే ఆలౌటైంది. కిమ్ గార్త్, ఆష్లే గార్డ్‌నర్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, అలానా కింగ్ తలో వికెట్ తీశారు. భారత ఇన్నింగ్స్‌లో జెమీమా రోడ్రిగెజ్ (23) టాప్ స్కోరర్‌గా నిలువగా.. హర్లీన్ డియోల్ (19), హర్మన్‌ప్రీత్ కౌర్ (17), రిచా ఘోష్ (14) రెండంకెల స్కోర్లు చేశారు. ప్రియా పూనియా (3), స్మృతి మంధన (8), దీప్తి శర్మ (1), సైమా ఠాకోర్ (4), టిటాస్ సాధు (2), ప్రియా మిశ్రా (0) విఫలమయ్యారు.
101 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆడుతూ పాడుతూ విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (35), జార్జియా వాల్ (46 నాటౌట్) రాణించడంతో ఆ జట్టు కేవలం 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది (5 వికెట్లు కోల్పోయి).
ఆసీస్‌ను మధ్యలో రేణుకా సింగ్ (2-0-45-3), ప్రియా మిశ్రా (2-0-11-2) భయపెట్టారు. అయితే తహిళ మెక్‌గ్రాత్ (4 నాటౌట్) సాయంతో జార్జియా వాల్ ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఎల్లిస్ పెర్రీ (1), బెత్ మూనీ (1), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (6), ఆష్లే గార్డ్‌నర్ (8) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఈ సిరీస్‌లో రెండో వన్డే బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 8న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment