ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత మహిళల 'ఏ' జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయింది. ఇవాళ (ఆగస్ట్ 11) జరిగిన మూడో టీ20లో ఆసీస్ ఏ టీమ్ భారత ఏ జట్టుపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది.
భారత ఇన్నింగ్స్‌లో కిరణ్ ప్రభు (38), మిన్నూ మణి (22), శ్వేత సెహ్రావత్ (15), ప్రియా పూనియా (11), సంజీవన్ సజనా (10) రెండంకెల స్కోర్లు చేయగా.. శుభ సతీశ్ (0), తనుజా కన్వర్ (7), మేఘన సింగ్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో బ్రౌన్, గ్రేస్ పార్సన్స్ నికోలా హ్యాంకాక్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. తైలా వ్లామ్నిక్, చార్లీ నాట్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
చెలరేగిన తహ్లియా మెక్‌గ్రాత్
121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. తహ్లియా మెక్‌గ్రాత్ (22 బంతుల్లో 51 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో 13.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మెక్‌గ్రాత్‌తో పాటు తహ్లియా విల్సన్ (39) కూడా రాణించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో కేటీ మ్యాక్ 10, చార్లీ నాట్ 19 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మన్నత్ కశ్యప్, షబ్నమ్ షకీల్, మణి మిన్నూ తలో వికెట్ తీశారు. కాగా, ఈ సిరీస్‌లో తొలి రెండు టీ20ల్లోనూ ఆతిథ్య ఆస్ట్రేలియానే విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment