IND VS IRE 2nd T20: India Records 3 Golden Ducks In T20 For First Time - Sakshi
Sakshi News home page

IND VS IRE 2nd T20: రికార్డు విజయంతో పాటు చెత్త రికార్డునూ మూటగట్టుకున్న హార్ధిక్‌ సేన

Published Wed, Jun 29 2022 3:37 PM | Last Updated on Wed, Jun 29 2022 8:08 PM

IND VS IRE 2nd T20: India Records 3 Golden Ducks In A T20 For First Time - Sakshi

ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో హార్ధిక్‌ పాండ్యా నేతృత్వంలోని యువ భారత జట్టు రికార్డు విజయాన్నినమోదు చేసి రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఆతిధ్య ఐర్లాండ్‌ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించిన భారత్‌.. రికార్డు విజయాన్ని నమోదు చేయడంతో పాటు ఓ చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంది. 

భారత ఇన్నింగ్స్‌లో ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు గోల్డెన్‌ డకౌట్‌(తొలి బంతికే ఔట్‌ కావడం)గా వెనుదిరిగారు. దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌, హర్షల్‌ పటేల్‌లు తాము ఎదుర్కొన్న తొలి బంతికే ఔటై పెవిలియన్‌ బాట పట్టారు. ఓ ఇన్నింగ్స్‌లో టీమిండియా (టీ20ల్లో) తరఫున ఇన్ని(3) గోల్డెన్‌ డకౌట్‌లు రికార్డు కావడం ఇదే తొలిసారి. 

కాగా, దీపక్‌ హుడా (57 బంతుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుతమైన శతకంతో, సంజూ శాంసన్‌ (42 బంతుల్లో 77; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) సుడిగాలి హాఫ్‌ సెంచరీతో చెలరేగడంతో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్‌ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకు తీసుకువచ్చి ఓటమిపాలైంది. చివర్లో ఐర్లాండ్‌ ఆటగాళ్లు జార్జ్‌ డాక్రెల్‌ (16 బంతుల్లో 34 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మార్క్‌ అడైర్‌ (12 బంతుల్లో 23 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) టీమిండియాను బయపెట్టారు. 

ఆఖరి బంతికి 6 పరుగులు కావాల్సి ఉండగా ఉమ్రాన్‌ మాలిక్‌ అద్భుతంగా బౌల్‌ చేసి కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇవ్వడంతో ఐర్లాండ్‌ ఓటమిపాలైంది. నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో పాల్‌ స్టిర్లింగ్‌ (18 బంతుల్లో 49; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్‌ ఆండ్రూ బల్బిర్నీ (37 బంతుల్లో 60; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), హ్యారీ టెక్టార్‌ (28 బంతుల్లో 39; 5 ఫోర్లు) భారీ షాట్లతో టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. 
చదవండి: కేఎల్‌ రాహుల్‌- రోహిత్‌ శర్మ రికార్డు బద్దలు కొట్టిన చిన్ననాటి స్నేహితులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement