India vs Ireland
-
ఐర్లాండ్‌పై అద్బుత ప్రదర్శన.. హార్దిక్‌పై గవాస్కర్ ప్రశంసలు
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఫామ్‌ను తిరిగి పొందాడు. ఈ ఏడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ సారథిగా దారుణ ప్రదర్శన కనబరిచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్.. ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్-2024లో సత్తాచాటుతున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం న్యూయర్క్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా అదరగొట్టాడు. బ్యాటింగ్ చేసే అవకాశం రానప్పటకి బౌలింగ్‌లో మాత్రం హార్దిక్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. పాండ్యా అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడని గవాస్కర్ కొనియాడాడు."హార్దిక్ పాండ్యా తిరిగి తన రిథమ్‌ను పొందడం చాలా సంతోషంగా ఉంది. హార్దిక్ తన బౌలింగ్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. హార్దిక్ గతంలో రెండు ఓవర్లు వేసి బ్రేక్ తీసుకునే వాడు.కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం వరుసగా తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసి ఔరా అనిపించుకున్నాడు. హార్దిక్‌కు ఐపీఎల్ తర్వాత వరల్డ్‌కప్ అనేది ఒక పరీక్ష వంటి. నా వరకు అయితే ఈ పరీక్షలో హార్దిక్ పాసైడని నేను భావిస్తున్నాని స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు. -
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
టీ20 వరల్డ్‌కప్-2024లో న్యూయర్క్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో అర్షదీప్ సింగ్ భారత బౌలింగ్ ఎటాక్‌ను ప్రారంభించగా.. మహమ్మద్ సిరాజ్ అతడితో పాటు బంతిని పంచుకున్నాడు. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్ ఎటాక్‌కు వచ్చాడు. తన పేస్ బౌలింగ్‌తో ఐరీష్ బ్యాటర్లను బుమ్రా బెంబేలెత్తించాడు. బుమ్రా తన బౌలింగ్ ఎటాక్‌ను మెయిడిన్ ఓవర్‌తో ప్రారంభించాడు. ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసిన బుమ్రా.. ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టార్‌కు చుక్కలు చూపించాడు. బుమ్రా బౌలింగ్ దాటికి ఆ ఓవర్లో టెక్టార్ కనీసం ఒక్క పరుగు కూడా సాధించలేకపోయాడు.ఈ క్రమంలో బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక మెయిడిన్లు (టెస్టు సభ్యత్వ దేశాలు) చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. బుమ్రా ఇప్పటివరకు టీ20ల్లో 11 మెయిడిన్ ఓవర్లు వేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్(10) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో భువీని బుమ్రా అధిగమించాడు. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన బుమ్రా.. 3 ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.ఇక ఓవరాల్‌గా ఈ జాబితాలో ఇద్దరు బౌలర్లు బుమ్రా కంటే ముందు ఉన్నారు. ఈ జాబితాలో ఉగాండా బౌలర్ ఎఫ్ నుసుబుగా 15 మెయిడిన్ ఓవర్లతో తొలి స్ధానంలో ఉండగా.. కెన్యా బౌలర్ షెబ్ ఎన్గోచె 14 రెండు స్దానంలో ఉన్నాడు. -
పిచ్ అస్సలు అర్థం కావడం లేదు.. కానీ వారు మాత్రం అద్బుతం: రోహిత్
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా బోణీ కొట్టిన సంగతి తెలిసిందే. బుధవారం(జూన్ 5)న న్యూయర్క్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఐరీష్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ భారత బౌలర్ల దాటికి కేవలం 96 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు కేవలం 12.2 ఓవర్లలో ఊదిపడేసింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తమ బౌలర్లు అద్బుతంగా రాణించారని హిట్‌మ్యాన్ కొనియాడాడు. అదే విధంగా తన గాయంపై కూడా రోహిత్ అప్డేట్ ఇచ్చాడు. "నా మో చేయి ఇంకా కొంచెం నొప్పిగా ఉంది. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక టాస్ సమయంలోనే నేను చెప్పాను పిచ్‌ను అంచనా వేయడం చాలా కష్టమని. అసలు ఈ వికెట్ నుంచి ఏం ఆశించాలో కూడా అర్థం కావడం లేదు.కేవలం ఐదు నెలల వయసున్న పిచ్‌పై ఎలా ఆడాలో తెలియడం లేదు. మేము సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా పిచ్ ఇంకా అలానే ఉంది. ఇది బౌలర్లకు సరిపోయే వికెట్. ఈ వికెట్‌పై ఫాస్ట్ బౌలర్లు సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తే సరిపోతుంది. మా జట్టులో ఒక్క అర్ష్‌దీప్ సింగ్‌కు తప్ప దాదాపు అంతమంది బౌలర్లకు టెస్టు క్రికెట్లో ఆడిన అనుభవం ఉంది. అయినప్పటికి అర్ష్‌దీప్ ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టి మాకు మంచి శుభారంభాన్ని ఇచ్చాడు. ఈ వికెట్‌పై నలుగురు స్పిన్నర్లతో ఆడాలనుకోలేదు.బ్యాలెన్స్‌గా ఉండే తుది జట్టును ఎంపిక చేశాము. మా తుది జట్టులో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో పాటు, ఇద్దరు పేస్ ఆల్‌రౌండర్లు, ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్లకు చోటిచ్చాము. పిచ్ సీమర్లకు అనుకూలించినందున స్పిన్నర్లతో కేవలం రెండు ఓవర్లు మాత్రం వేయించాను. ఒకవేళ స్పిన్‌కు అనుకూలించి ఉంటే వారితో ఫుల్ కోటాను పూర్తి చేసే వాడిని. పరిస్థితులకు తగ్గ జట్టు మా వద్ద వుంది. ఒకవేళ పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు కూడా పిచ్ ఈ విధంగానే ఉంటే అందుకు తగ్గట్టు మేము సన్నద్దమవుతామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ పేర్కొన్నాడు. -
T20 World Cup 2024: ఆడుతూ పాడుతూ...
భారీ అంచనాలతో టి20 వరల్డ్ కప్ బరిలోకి దిగిన భారత్ తొలి పోరులో తమ స్థాయి ప్రదర్శనతో సత్తా చాటింది. సంచలనాల రికార్డు ఉన్న ఐర్లాండ్‌పై ఏమాత్రం ఉదాసీనత కనబర్చకుండా పూర్తిగా పైచేయి సాధించి భారీ విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌కు అంతగా అనుకూలించని పిచ్‌పై ప్రత్యరి్థని 96 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా ఆ తర్వాత మరో 46 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం చేరింది. మన బౌలర్లలో ఐదుగురు కనీసం ఒక్కో వికెట్‌తో తమ వంతు పాత్ర పోషించారు. అనంతరం రోహిత్, పంత్ చక్కటి బ్యాటింగ్ టీమిండియాను ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలిపించాయి. ఇక ఆదివారం పాకిస్తాన్‌తో మ్యాచ్ రూపంలో తర్వాతి సవాల్‌కు భారత్ సిద్ధమైంది. న్యూయార్క్: టి20 వరల్డ్ కప్‌లో రోహిత్ బృందం శుభారంభం చేసింది. బుధవారం నాసా కౌంటీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. గారెన్ డెలానీ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)దే అత్యధిక స్కోరు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (2/6), అర్‡్షదీప్ చెరో 2 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లకు 97 పరుగులు సాధించి గెలిచింది. రోహిత్ శర్మ (37 బంతుల్లో 52 రిటైర్డ్‌హర్ట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిషభ్ పంత్ (26 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 44 బంతుల్లో 54 పరుగులు జోడించారు. టపటపా... స్వింగ్‌కు అనుకూల వాతావరణం, అనూహ్య బౌన్స్, నెమ్మదైన అవుట్‌ఫీల్డ్... ఇలాంటి స్థితిలో బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ ఏ దశలోనూ భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. మూడో ఓవర్లో కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (2), బల్బర్నీ (5)లను అవుట్ చేసి అర్‡్షదీప్ ముందుగా దెబ్బ కొట్టడంతో మొదలైన ఐర్లాండ్ పతనం వేగంగా సాగింది. పవర్‌ప్లేలో 26 పరుగులు రాగా, వాటిలో 9 ఎక్స్‌ట్రాలే ఉన్నాయి. పాండ్యా తన తొలి రెండు ఓవర్లలో టకర్ (10), కాంఫర్ (12)లను వెనక్కి పంపించగా, టెక్టర్ (4)ను బుమ్రా అవుట్ చేశాడు. సిరాజ్ ఖాతాలో డాక్రెల్ (3) వికెట్ చేరడంతో 10 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ 49/6 వద్ద నిలిచింది. అక్షర్ పటేల్ కూడా తన తొలి ఓవర్లో మెక్‌కార్తీ (0) పని పట్టగా, బుమ్రా బౌలింగ్‌లో లిటిల్ (14) బౌల్డయ్యాడు. అయితే చివర్లో డెలానీ కొన్ని పరుగులు జోడించగలిగాడు. అర్‡్షదీప్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను అదే ఓవర్ చివరి బంతికి రనౌట్ కావడంతో ఐర్లాండ్ ఆట ముగిసింది. ఆకట్టుకున్న పంత్... ఓపెనర్‌గా వచి్చన విరాట్ కోహ్లి (1) ప్రభావం చూపలేకపోగా, మరోవైపు రోహిత్ ధాటిగా ఆడాడు. మూడో స్థానంలో బరిలోకి దిగిన పంత్ కూడా అదే తరహాలో వేగంగా బ్యాటింగ్ చేశాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 39 పరుగులకు చేరింది. లిటిల్ ఓవర్లో రెండు వరుస సిక్స్‌లతో జోరు పెంచిన రోహిత్ 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అంతకుముందు లిటిల్ వేసిన ఓవర్లో బంతి భుజానికి బలం తగిలిన కారణంగా నొప్పితో మైదానం వీడాడు. 21 పరుగులు చేయాల్సిన స్థితిలో బ్యాటింగ్‌కు వచి్చన సూర్యకుమార్ (2) విఫలమైనా... మెక్‌కార్తీ బౌలింగ్‌లో రివర్స్ స్కూప్ సిక్సర్‌తో పంత్ మ్యాచ్ ముగించాడు. ఇటీవలే ఐపీఎల్లో ఆడిన పంత్‌కు ఏడాదిన్నర తర్వాత ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. స్కోరు వివరాలు ఐర్లాండ్ ఇన్నింగ్స్: బల్బర్నీ (బి) అర్‡్షదీప్ 5; స్టిర్లింగ్ (సి) పంత్ (బి) అర్‡్షదీప్ 2; టకర్ (బి) పాండ్యా 10; టెక్టర్ (సి) కోహ్లి (బి) బుమ్రా 4; కాంఫర్ (సి) పంత్ (బి) పాండ్యా 12; డాక్రెల్ (సి) బుమ్రా (బి) సిరాజ్ 3; డెలానీ (రనౌట్) 26; అడెయిర్ (సి) దూబే (బి) పాండ్యా 3; మెక్‌కార్తీ (సి అండ్ బి) అక్షర్ 0; లిటిల్ (బి) బుమ్రా 14; వైట్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (16 ఓవర్లలో ఆలౌట్) 96. వికెట్ల పతనం: 1–7, 2–9, 3–28, 4–36, 5–44, 6–46, 7–49, 8–50, 9–77, 10–96. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–35–2, సిరాజ్ 3–0–13–1, బుమ్రా 3–1–6–2, పాండ్యా 4–1–27–3, అక్షర్ పటేల్ 1–0–3–1, జడేజా 1–0–7–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (రిటైర్డ్‌హర్ట్) 52; కోహ్లి (సి) వైట్ (బి) అడెయిర్ 1; పంత్ (నాటౌట్) 36; సూర్యకుమార్ (సి) డాక్రెల్ (బి) వైట్ 2; దూబే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (12.2 ఓవర్లలో 2 వికెట్లకు) 97. వికెట్ల పతనం: 1–22, 2–91. బౌలింగ్: అడెయిర్ 4–0–27–1, లిటిల్ 4–0–42–0 మెక్‌కార్తీ 2.2–0–8–0, కాంఫర్ 1–0–4–0, వైట్ 1–0–6–1. 600: 600 రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ టెస్టుల్లో 84, వన్డేల్లో 323, టి20ల్లో 193 సిక్స్‌లు బాదాడు. 4000: రోహిత్ అంతర్జాతీయ టి20ల్లో 4 వేల పరుగులు (4026) దాటాడు. కోహ్లి (4038), బాబర్ (4023) తర్వాత ఈ మైలురాయిని చేరిన మూడో ఆటగాడిగా నిలిచాడు. -
రోహిత్, బాబర్ కాదు.. అతడే వరల్డ్‌కప్ టాప్ రన్ స్కోరర్: స్మిత్
టీ20 వరల్డ్‌కప్-2024లో సత్తా చాటేందుకు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సిద్దమయ్యాడు. ఐపీఎల్ 2024లో కనబరిచిన జోరునే ఈ పొట్టి ప్రపంచకప్‌లోనూ కొనసాగించాలని కోహ్లి ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడిన కింగ్ కోహ్లి.. 741 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో బుధవారం న్యూయర్క్ వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది. తొలిపోరు కోసం రోహిత్ సేన అన్ని విధాల సిద్దమైంది. ఇక మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లిపై ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ టోర్నీలో కోహ్లి టాప్ రన్ స్కోరర్‌గా నిలుస్తాడని స్మిత్ జోస్యం చెప్పాడు. "ఈ మెగా ఈవెంట్లో లీడింగ్ రన్ స్కోరర్‌గా విరాట్ కోహ్లి నిలుస్తాడని నేను భావిస్తున్నాడు. అతడు ఐపీఎల్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచి అమెరికాకు వచ్చాడు. విరాట్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆ జోరును ఇక్కడ కూడా కొనసాగిస్తాడని నేను ఆశిస్తున్నానని" ఐసీసీ షేర్ చేసిన వీడియోలో స్మిత్ పేర్కొన్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ టాప్ రన్‌స్కోరర్‌గా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ లేదా విరాట్ కోహ్లి నిలుస్తాడని అంచనా వేశాడు.చదవండి: T20 WC: చరిత్ర సృష్టించిన నేపాల్ కెప్టెన్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా -
ఐర్లాండ్‌ను తేలికగా తీసుకోము.. ఈ వరల్డ్‌కప్‌లో వారిదే పైచేయి: రోహిత్
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా తొలి మ్యాచ్‌కు సిద్దమైంది. న్యూయర్క్ వేదికగా బుధవారం ఐర్లాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. తొలి మ్యాచ్‌లో గెలిచి టోర్నీని శుభారంభం చేయాలని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో పాల్గోన్న టీమిండియా కెప్టెన్ న్యూయర్క్ పిచ్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎటువంటి పరిస్థితులలోనైనా ఆడేందుకు తమ వద్ద బలమైన జట్టు ఉందని రోహిత్ థీమా వ్యక్తం చేశాడు."ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో స్నిన్నర్లు ప్రధాన పాత్ర పోషిస్తారని నేను అనుకుంటున్నాను. మా జట్టులో జడేజా, అక్షర్ పటేల్ రూపంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. జట్టు బ్యాలెన్స్‌గా ఉండాలంటే వారిద్దరూ అవసరమే. అదే విధంగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే కూడా మా వద్ద ఉన్నారు. కాబట్టి ఈ మెగా టోర్నీలో వారి సేవలను అన్ని విధాలగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తాం. న్యూయర్క్ వికెట్ గురించి మాకు ఎటువంటి ఆందోళన లేదు.ఎందుకంటే ఎటువంటి పరిస్థితులలోనైనా సత్తాచాటేందుకు మా బాయ్స్ సిద్దంగా ఉన్నారు. అదే విధంగా ఐర్లాండ్ జట్టును మేము తక్కువగా అంచనా వేయడం లేదు. ఎందుకంటే ఐర్లాండ్ వద్ద కూడా పటిష్టమైన జట్టు ఉంది. వారు కూడా ఎక్కువగా టీ20 క్రికెట్ ఆడుతున్నారు. ఐరీష్ జట్టులో చాలా మంది ఆటగాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా లీగ్ క్రికెట్లో ఆడిన అనుభవం ఉందని" ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ పేర్కొన్నాడు. -
ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు ఇదే!
టీ20 ప్రపంచకప్-2024 ఫీవర్ తారస్థాయికి చేరింది. టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సన్నద్ధమవుతోంది. న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జూన్ 5న ఐర్లాండ్‌తో రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ ఆడనుంది.ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు తోడుగా విరాట్ కోహ్లి భారత ఇన్నింగ్స్ ఆరంభించాలని పేర్కొన్నాడు. యశస్వి జైస్వాల్‌ను వన్‌డౌన్‌లో ఆడించాలని మేనేజ్మెంట్కు సూచించాడు.ఇక తన జట్టులో మిగిలిన స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివం దూబే, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లకు చోటిచ్చాడు గావస్కర్. వికెట్ కీపర్ కోటాలో పంత్‌కు చోటిచ్చిన గావస్కర్ సంజూ శాంసన్‌కు మొండిచేయి చూపాడు.కాగా వరల్డ్‌కప్-2024లో భారత ఓపెనింగ్ జోడీ గురించి చర్చ జరుగుతున్న వేళ.. విరాట్ కోహ్లియే రోహిత్ శర్మకు సరైన జోడీ అని ఇప్పటికే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా గావస్కర్ కూడా ఇదే మాట అన్నాడు.ఇక కోహ్లి ఐపీఎల్-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ 15 మ్యాచ్‌లు ఆడి.. 741 పరుగులు సాధించాడు. టాప్ స్కోరర్‌గా నిలిచి.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు గావస్కర్ ఎంచుకున్న భారత తుది జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివం దూబే, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.#SunilGavaskar opts for experience with @imVkohli & @ImRo45 at the 🔝A surprise inclusion at number 3, plenty of batting options and two pacers! 😮What changes would you make to this team?📺 | #INDvIRE | 5th June, 6 PM | #T20WorldCupOnStar pic.twitter.com/6hQx6EJmhD— Star Sports (@StarSportsIndia) June 4, 2024 -
ఐర్లాండ్‌తో మ్యాచ్.. అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
టీ20 వరల్డ్‌కప్-2024లో తొలి మ్యాచ్‌కు టీమిండియా సన్నద్దమవుతోంది. జూన్ 5న న్యూయర్క్ వేదికగా ఐర్లాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఐరీష్‌ను చిత్తు చేసి మెగా ఈవెంట్‌ను ఘనంగా ఆరంభించాలని టీమిండియా భావిస్తోంది.ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో 3 పరుగులు సాధిస్తే.. టీ20ల్లో ఐర్లాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా రికార్డులెక్కుతాడు.ఇప్పటివరకు ఐర్లాండ్‌పై రోహిత్ శర్మ 3 మ్యాచ్‌లు ఆడి 149 పరుగులు చేశాడు. కాగా ప్రస్తుతం ఈ రికార్డు టీమిండియా ఆల్‌రౌండర్ దీపక్ హుడా పేరిట ఉంది. దీపక్ హుడా ఇప్పటివరకు ఐర్లాండ్‌పై 2 మ్యాచ్‌లు ఆడి 151 పరుగులు చేశాడు.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ -
BCCI: అందుకే తప్పుకొంటున్నా.. ద్రవిడ్ ఫస్ట్ రియాక్షన్
టీమిండియా ప్రధాన కోచ్‌గా తాను కొనసాగబోవడం లేదని రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ కోచ్‌గా తన కెరీర్లో చివరిదని పేర్కొన్నాడు. ఏదేమైనా భారత జట్టు మార్గదర్శకుడిగా వ్యవహరించడం తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని ఈ మాజీ కెప్టెన్ హర్షం వ్యక్తం చేశాడు.కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత ద్రవిడ్ పదవీ కాలం ముగిసినప్పటికీ ఈ మెగా ఈవెంట్ కోసం కొనసాగమని బీసీసీఐ అతడిని కోరిన విషయం తెలిసిందే. ఇందుకు అంగీకరించిన ద్రవిడ్ ప్రస్తుతం టీమిండియాతో కలిసి అమెరికాకు వెళ్లాడు.అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్య ఇస్తున్న వరల్డ్‌కప్-2024 జూన్ 1న మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనున్న తరుణంలో రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు.ఈ సందర్భంగా.. ‘‘ప్రతి టోర్నమెంట్ నాకు ముఖ్యమైనదే. టీమిండియా కోచ్‌గా ప్రతి మ్యాచ్‌లోనూ పూర్తి ఎఫర్ట్ పెట్టాను. టీ20 వరల్డ్‌కప్ కూడా అంతే. అయితే, నేను ఇన్చార్జ్గా ఉన్న సమయంలో ఇదే ఆఖరిది కాబట్టి మరింత ప్రాముఖ్యం ఏర్పడింది.నా పనిని పూర్తి నిష్ఠగా.. ప్రేమతో చేశాను. టీమిండియాకు కోచింగ్ ఇవ్వడం అనేది నా కెరీర్లో ఎంతో ప్రత్యేకమైనది. గొప్ప ఆటగాళ్లున్ను జట్టుతో పని చేయడాన్ని పూర్తిగా ఆస్వాదించాను.అయితే, బిజీ షెడ్యూల్స్, పని ఒత్తిడి కారణంగా తిరిగి ఈ జాబ్‌కు తిరిగి అప్లై చేయాలనుకోవడం లేదు’’ అంటూ తాను హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పుకొనేందుకు సిద్ధమైనట్లు రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు.కాగా ద్రవిడ్ స్థానంలో గౌతం గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా వస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. గౌతీ సైతం తాను ఈ గౌరవప్రదమైన బాధ్యతను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పడం గమనార్హం. -
విరాట్ కోహ్లికి ఏమైంది..? మరోసారి ప్రాక్టీస్ డుమ్మా!
టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీని ఘనంగా ఆరంభించేందుకు టీమిండియా అన్ని విధాల సన్నద్దమవుతోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో జూన్ 5న న్యూయర్క్ వేదికగా తలపడనుంది. ఇప్పటికే న్యూయర్క్ చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. టీమిండియా సోమవారం(జూన్ 3) తమ చివరి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు(జూన్ 4)న ఆటగాళ్లకు టీమ్ మెన్జ్మెంట్ విశ్రాంతి ఇవ్వన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం వీలైనంత ఎక్కువ సమయం పాటు నెట్స్‌లో గడపాలని భారత జట్టు భావిస్తున్నట్లు సమాచారం.కోహ్లి ప్రాక్టీస్ డుమ్మా!ఇక జట్టుతో కాకుండా కాస్త ఆలస్యంగా అమెరికాకు చేరుకున్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఇప్పటివరకు ఒక్క ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనలేదు. జూన్ 1న బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మాప్ మ్యాచ్‌కు దూరమైన కోహ్లి.. ఆదివారం(జూన్ 2)న ప్రాక్టీస్ సెషన్లో పాల్గోంటుడని పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి. కానీ ఆదివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు కూడా కోహ్లి డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. జట్టుతో కలిసినప్పటికి అతడు ఇంకా విశ్రాంతి తీసుకుంటున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. విరాట్ సోమవారం జట్టు ఆఖరి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్-2024లో ఎలిమినేటర్‌లో ఓటమి తర్వాత కోహ్లి రెస్టులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా విరాట్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2024లో కోహ్లి దుమ్మలేపాడు. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 61.75 సగటుతో 741 పరుగులు చేశాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా విరాట్ నిలిచాడు. ఇదే ఫామ్‌ను టీ20 వరల్డ్‌కప్‌లోనూ కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. -
చెలరేగిన భారత బౌలర్లు.. 100 పరుగులకే ఆలౌట్.. ఘన విజయం
ICC Under 19 World Cup 2024- India U19 won by 201 runs: ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్-2024లో యువ టీమిండియా ఘన విజయం సాధించింది. ఐర్లాండ్‌ను ఏకంగా 201 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. సమిష్టి ప్రదర్శనతో ఈ మేరకు భారీ గెలుపు నమోదు చేసింది. సౌతాఫ్రికాలోని బ్లూమ్ఫౌంటేన్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఆదర్శ్ సింగ్ 17, అర్షిన్ కులకర్ణి 32 పరుగులు చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 106 బంతుల్లో 118 పరుగులు సాధించాడు. ఇక ముషీర్‌తో పాటు కెప్టెన్ ఉదయ్ సహారన్ 75 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ అరవెల్లి అవినాష్ రావు 22, సచిన్ ధ్యాస్ 21(నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. భారీ లక్ష్యం విధించి ముషీర్, ఉదయ్ ఇన్నింగ్స్ కారణంగా యవ భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 301 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఐరిష్ జట్టును భారత బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. ఓపెనర్లలో జోర్డాన్ నీల్(11)ను స్పిన్నర్ సౌమీ పాండే పెవిలియన్‌కు పంపి శుభారంభం అందించగా.. పేసర్ నమన్ తివారి ఐరిష్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. నమన్ తివారి దెబ్బకు ఓపెనర్ రియాన్ హంటర్(13)ను అవుట్ చేసిన నమన్.. మిడిలార్డర్‌ను కకావికలం చేశాడు. అతడి దెబ్బకు ఐర్లాండ్ స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోగా.. సౌమీ పాండే సైతం మరోసారి విజృంభించాడు. ఈ నేపథ్యంలో 29.4 ఓవర్లలోనే ఐర్లాండ్ కథ ముగిసింది. బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో వంద పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఏకంగా 201 రన్స్ తేడాతో జయభేరి మోగించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడే భారత బౌలర్లలో నమన్ తివారికి అత్యధికంగా నాలుగు, సౌమీ పాండేకు మూడు వికెట్లు దక్కగా.. ధనుశ్ గౌడ, మురుగన్ అభిషేక్, ఉదయ్ సహారన్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఇక భారత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన సెంచరీ వీరుడు ముషీర్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా ఈ ఐసీసీ ఈవెంట్ తాజా ఎడిషన్‌లో భారత్‌కు ఇది రెండో విజయం. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 84 పరుగుల తేడాతో సహారన్ సేన చిత్తు చేసింది. ఇక తాజా విజయంతో గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచింది యువ భారత జట్టు. చదవండి: INDA& U19 WC: ఒకేరోజు అటు అన్న.. ఇటు తమ్ముడు సెంచరీలతో ఇరగదీశారు! Another huge win, this time by 201 runs, has consolidated India’s position at the top of the Group A table 👏 Match Highlights 🎥 #U19WorldCup pic.twitter.com/U1LucpWNcI — ICC (@ICC) January 25, 2024 -
Ind Vs Ire: ప్రయోగానికి ఆఖరి అవకాశం .. జితేశ్, షహబాజ్‌లకు ఛాన్స్!
డబ్లిన్: వెస్టిండీస్‌తో ఐదు టి20 మ్యాచ్‌లు, ఆ తర్వాత ఐర్లాండ్‌తో మూడు టి20 మ్యాచ్‌లు భారత యువ ఆటగాళ్లను ఈ ఫార్మాట్లో పరీక్షించేందుకు అవకాశం ఇచ్చాయి. వన్డే ప్రపంచకప్ ఏడాది ఎక్కువ మంది సీనియర్లు విరామం తీసుకోగా, కుర్రాళ్లంతా తమకు లభించిన చాన్స్‌ను చక్కగా ఉపయోగించుకున్నారు. ఈ రెండు పర్యటనల్లో కలిపి ఏడు మ్యాచ్‌లలో ఇప్పటికే ఐదుగురు ఆటగాళ్లు అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేశారు. ఇక మరో ఇద్దరు దాని కోసం ఎదురు చూస్తున్నారు. టూర్ చివరి మ్యాచ్‌లో ఆ చాన్స్ దక్కుతుందా అనేది చూడాలి. సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకున్న భారత్ కోణంలో ఇది మాత్రమే ఆసక్తికర అంశం. మరోవైపు వన్డే, టి20 ఫార్మాట్లలో కలిపి భారత్‌తో ఆడిన 10 సార్లూ ఓడిన ఐర్లాండ్ ఈసారైనా సొంతగడ్డపై ఒక్క మ్యాచ్ గెలవాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో నేడు చివరి టి20కి రంగం సిద్ధమైంది. జితేశ్, షహబాజ్‌లకు అవకాశం! ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్లోలనూ రాణించిన కెప్టెన్ బుమ్రా, పేసర్ ప్రసిధ్ కృష్ణ ఫామ్‌లోకి రావడం, ఆసియా కప్‌కు ఎంపిక కావడంతో ఈ సిరీస్ నుంచి భారత్‌కు ఆశించిన ప్రధాన ఫలితం దక్కింది. అయితే మరింత మ్యాచ్ ప్రాక్టీస్ కోసం వీరిద్దరు ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతారు. రవి బిష్ణోయ్ కూడా సిరీస్‌లో తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో రుతురాజ్, సామ్సన్, రింకూ సింగ్ కూడా తమకు లభించిన అవకాశాలు చక్కగా ఉపయోగించుకోగా, శివమ్ దూబే కూడా తన ధాటిని ప్రదర్శించాడు. సిరీస్‌లో విఫలమైన తిలక్ వర్మ చివరి పోరులో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. యశస్వి కూడా మరో మెరుపు ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. ఈ స్థితిలో తుది జట్టులో మూడు మార్పులకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడని వికెట్ కీపర్ జితేశ్ శర్మ, 3 వన్డేలు ఆడిన షహబాజ్ అహ్మద్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వీరిని తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తే సంజు సామ్సన్, వాషింగ్టన్ సుందర్ స్థానాల్లో అవకాశం దక్కుతుంది. మరోవైపు కొంత విరామం తర్వాత టీమ్‌లోకి వచ్చిన అవేశ్ ఖాన్ కూడా టీమ్‌తో పాటు ఉన్నాడు. అతనికీ ఒక మ్యాచ్ ఇవ్వాలనుకుంటే అర్‡్షదీప్‌కు విశ్రాంతినిస్తారు. ఇదే జరిగితే కుర్రాళ్లతో భారత్ ప్రయోగం సంపూర్ణమవుతుంది. స్టిర్లింగ్ ఫామ్‌లోకి వచ్చేనా! రెండు టి20 మ్యాచ్‌లలో ఐర్లాండ్ ఆటతీరు మరీ పేలవంగా లేకున్నా భారత్‌లాంటి బలమైన జట్టుకు పోటీనిచ్చేందుకు సరిపోలేదు. గతంలోనూ కొన్ని చక్కటి ప్రదర్శనలు వచ్చినా టీమిండియాను ఓడించడంలో మాత్రం ఆ జట్టు సఫలం కాలేకపోయింది. ఈ నేపథ్యంలో చివరి పోరులోనైనా ఆ జట్టు గెలుపు బాట పడుతుందేమో చూడాలి. ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ వచ్చిన కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఇక్కడ మాత్రం రెండింటిలోనూ విఫలమయ్యాడు. బల్బిర్నీ మినహా మిగతావారంతా ప్రభావం చూపలేకపోయారు. విజయం సాధించాలంటే జట్టు సమష్టిగా రాణించడం కీలకం. ఐర్లాండ్ కూడా గత మ్యాచ్‌తో పోలిస్తే మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. -
ఐర్లాండ్‌తో మూడో టీ20.. సంజు శాంసన్‌పై వేటు! ఐపీఎల్ హీరో ఎంట్రీ
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ను ఇప్పటికే సొంతం చేసుకున్న టీమిండియా.. నామమాత్రపు మ్యాచ్ అయిన ఆఖరి టీ20లో తలపడేందుకు సిద్దమైంది. బుధవారం డబ్లిన్ వేదికగా భారత్-ఐర్లాండ్ మధ్య మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని బుమ్రా సేన భావిస్తోంది. అదే విధంగా గత రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన ఆటగాళ్లకు ఆఖరి టీ20లో అవకాశం ఇవ్వాలని జట్టు మెన్జ్మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ఆఖరి మ్యాచ్‌కు పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. వీరి ముగ్గురి స్ధానంలో వరుసగా జితేష్ శర్మ, షాబాజ్ అహ్మద్, అవేష్ ఖాన్ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్లో అదరగొట్టి జట్టులోకి వచ్చిన జితేష్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేందుకు అతృతగా ఎదురుచూస్తున్నాడు. గత కొన్ని సిరీస్‌లకు జితేష్ ఎంపికవుతున్నప్పటికీ.. అరంగేట్రం చేసే అవకాశం రావడం లేదు. అయితే ఐర్లాండ్‌తో ఆఖరి టీ20లో జితేష్ అరంగేట్రం దాదాపు ఖాయమన్పిస్తోంది. మరోవైపు అవేష్ ఖాన్ విండీస్‌తో టీ20 సిరీస్ ఎంపికైనప్పటికి ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం రాలేదు. ఈ క్రమంలో అతడికి ఆఖరి టీ20లో ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఐర్లాండ్ కూడా తమ జట్టులో ఒకే ఒక మార్పు చేయనున్నట్లు సమాచారం. ఆల్‌రౌండర్ డాక్రెల్ స్ధానంలో గ్రెత్ డెలానీకి ఛాన్స్ ఇవ్వాలని ఐరీష్ జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. తుది జట్లు(అంచనా) భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, షాబాజ్ , ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రవి బిష్ణోయ్ ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్,గ్రెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్ చదవండి: IND vs IRE: అయ్యో రింకూ.. ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడిన సిక్సర్ల కింగ్! బుమ్రా మంచి మనసు -
అయ్యో రింకూ.. ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడిన సిక్సర్ల కింగ్! బుమ్రా మంచి మనసు
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డబ్లిన్ వేదికగా జరిగిన రెండో టీ20 అనంతరం బుమ్రా తన చర్యతో అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు రింకూ సింగ్ అదరగొట్టాడు. తన తొలి ఇన్నింగ్స్‌లోనే అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన ఈ యూపీ ఆటగాడు అందరిని అకట్టుకున్నాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన రింకూ.. 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి భారత్‌కు మంచి స్కోర్‌ను అందించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రింకూకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. సూపర్ బుమ్రా.. ఈ క్రమంలో పోస్ట్‌మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో సమయంలో రింకూ ఇంగ్లీష్‌లో మాట్లాడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. హిందీలో మాట్లాడితే ఫ్రీగా ఉంటుందని రింకూ ప్రెజెంటర్ అలాన్ విల్కిన్స్కు చెప్పాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న బుమ్రా ముందకు వచ్చి రింకూకు ట్రాన్స్‌లేటర్‌గా మారాడు. విల్కిన్స్ ఇంగ్లీష్‌లో అడుగుతుంటే బుమ్రా దాన్ని హిందీలోకి అనువాదం చేసి రింకూకు అర్దమయ్యేలా చెప్పుకొచ్చాడు. విల్కిన్స్ రింకూను నీవు కెప్టెన్ మాట వింటావా అంటూ ఇంగ్లీష్‌లో ప్రశ్నించాడు. దాన్ని హిందీలోకి బుమ్రా ట్రాన్సలేట్ చేశాడు. అందుకు బదులుగా రింకూ నవ్వుతూ నేను ఎప్పుడూ కెప్టెన్ మాట వింటా అంటూ సమాధానమిచ్చాడు. తన మంచిమనసు చాటుకున్న బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఈ సిరీస్‌లో ఆఖరి టీ20 డబ్లిన్ వేదికగా ఆగస్టు 23న జరగనుంది. చదవండి: Asia Cup 2023: జట్టులో పార్ట్‌టైమ్ బౌలర్స్ లేరా..? అదిరిపోయే రిప్లై ఇచ్చిన రోహిత్! వీడియో వైరల్ -
ఐర్లాండ్ కెప్టెన్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
అంతర్జాతీయ టీ20ల్లో ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ అత్యంత చెత్తరికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు డకౌటైన బ్యాటర్‌గా స్టిర్లింగ్ నిలిచాడు. ఇప్పటివరకు 13 సార్లు స్టిర్లింగ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆదివారం డబ్లిన్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20లో ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో డకౌటైన స్టిర్లింగ్.. ఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఈ చెత్త రికార్డు ఐర్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ఓబ్రియన్‌ను స్టిర్లింగ్ అధిగమించాడు. ఆ తర్వాతి స్ధానాల్లో జింబాబ్వే క్రికెటర్ చకాబ్వా(11), సౌమ్య సర్కార్(11) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ చేతిలో 33 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో ఐరీష్ కోల్పోయింది. భారత్ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఐర్లాండ్ చతికిలపడింది. లక్ష్యఛేదనలో ఐరీష్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఐర్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ అండీ బల్బిర్నీ (51 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో కెప్టెన్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు తీశారు. ఇక ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 ఆగస్టు 23న జరగనుంది. చదవండి: IND vs IRE: జైలర్ సినిమా చూశాడు.. దుమ్ము రేపాడు! అట్లుంటది సంజూతో -
జైలర్ సినిమా చూశాడు.. దుమ్ము రేపాడు! అట్లుంటది సంజూతో
సూపర్ స్టార్ రజనీకాంత్‌కి టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. కేరళలో పుట్టిన సంజూకు చిన్నతనం నుంచే రజనీకాంత్ అంటే ఎంతో ఇష్టం. తలైవాను కలవాలన్న తన చిన్నప్పటి కోరికను సంజూ 28ఏళ్ల వయస్సులో నేరవేర్చుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో రజినీని తన నివాసంలో కలిశాడు. ఇక తాజాగా మరోసారి సూపర్ స్టార్‌పై తన అభిమానాన్ని సంజూ చాటుకున్నాడు. శాంసన్ ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న విషయం విధితమే. ఈ క్రమంలో రజినీ కాంత్ నటించిన 'జైలర్' సినిమాను శనివారం ఐర్లాండ్‌లో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. దీనికి సంజూ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ విషయాన్ని ఐర్లాండ్-భారత్ రెండో టీ20 సందర్భంగా కామేంటేటర్ నైల్ ఓబ్రియన్ వెల్లడించాడు. ఇటీవలే సంజు తన అభిమాన నటుడి సినిమాను చూశాడాని ఓబ్రియన్ చెప్పుకొచ్చాడు. ఇక ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన జైలర్ సినిమా.. రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటి వరకు రూ.500 కోట్ల మేర గ్రాస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐర్లాండ్‌పై 33 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సంజూ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 40 పరుగులు చేశాడు. అయితే వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో విఫలమైన సంజూ.. ఐర్లాండ్‌పై అదరగొట్టడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. జైలర్ సినిమా చూసిన తర్వాత సంజూ రెచ్చిపోయాడని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరోవైపు నేడు ఆసియాకప్ జట్టు ప్రకటన నేపథ్యంలో సంజూకు చోటు దక్కాలని కోరుకుంటున్నారు. చదవండి: #Rinku Singh: టీమిండియాకు నయా ఫినిషర్.. వారెవ్వా రింకూ! వీడియో వైరల్ Just IN : Indian Cricketer #SanjuSamson WATCHED superstar #Rajinikanth's #Jailer movie. ||#JailerHits500cr | #ShivaRajkumar |#Mohanlal ||pic.twitter.com/M59u7eizgu — Manobala Vijayabalan (@ManobalaV) August 20, 2023 -
చాలా సంతోషంగా ఉంది..10 ఏళ్లగా కష్టపడుతున్నా! నా తొలి మ్యాచ్‌లోనే: రింకూ
ఐపీఎల్లో అదరగొట్టి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యూపీ క్రికెటర్ రింకూ సింగ్.. తన తొలి ఇన్నింగ్స్‌లోనే అదరగొట్టాడు. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో రింకూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన రింకూ.. 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి సత్తాచాటాడు. శివబ్ దుబేతో కలిసి టీమిండియా భారీ స్కోర్ సాధించడంలో రింకూ కీలక పాత్రపోషించాడు. ఆఖరి రెండు ఓవర్లలో ఐరీష్ బౌలర్లకు రింకూ చుక్కలు చూపించాడు. కాగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20తో రింకూ సింగ్ అరంగేట్రం చేసినప్పటికీ.. బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ రెండో టీ20లో మాత్రం ఈ కేకేఆర్ సంచలనానికి ఛాన్స్ దక్కింది. అతడు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనకు గాను రింకూకు మ్యాన్ఆఫ్ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక తన ప్రదర్శన పట్ల మ్యాచ్ అనంతరం రింకూ సింగ్ స్పందించాడు. "నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐపీఎల్లో ఏమి చేశానో ఇక్కడ కూడా అదే అదే చేయడానికి ప్రయత్నించాను. నేను చాలా కాన్పడెన్స్తో ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగా. ఎటువంటి ఒత్తిడికి గురవ్వకుండా ఉండటానికి ప్రయత్నించాను. నేను గత 10 ఏళ్లగా క్రికెట్ ఆడుతున్నాను. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ రోజు దక్కింది. నా తొలి ఇన్నింగ్స్‌లో లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రావడం ఆనందంగా ఉందంటూ" రింకూ పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో పేర్కొన్నాడు. చదవండి: వాటిని పట్టించుకోకూడదు.. అది మాకు పెద్ద తలనొప్పి! ప్రతీ ఒక్కరూ: టీమిండియా కెప్టెన్ Achi finish ki chinta kyu jab crease par barkaraar ho Rinku 🤩! 🔥#IREvIND #JioCinema #Sports18 #RinkuSingh #TeamIndia pic.twitter.com/QPwvmPPPxK — JioCinema (@JioCinema) August 20, 2023 -
చరిత్ర సృష్టించిన టీమిండియా స్పీడ్ స్టార్.. తొలి భారత పేసర్‌గా
టీమిండియా ఫాస్ట్‌బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంతవేగంగా 50 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్ రికార్డులకెక్కాడు. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఆండ్రూ బల్బిర్నీని ఔట్ చేసిన అర్ష్‌దీప్ ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అర్ష్‌దీప్ తన 33వ టీ20 మ్యాచ్‌లోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉండేది. బుమ్రా 41 మ్యాచ్‌ల్లో ఈ రికార్డు సాధించాడు. తాజా మ్యాచ్‌తో బుమ్రా రికార్డును అర్ష్‌దీప్ బద్దలు కొట్టాడు. అదే విధంగా ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన రెండో భారత బౌలర్ కూడా అర్ష్‌దీప్ కావడం గమానార్హం. అంతకుముందు వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 30 మ్యాచ్‌ల్లోనే 50 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐర్లాండ్‌పై 33 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో యువ భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. సిరీస్‌లోని చివరిదైన మూడో మ్యాచ్ ఈనెల 23న ఇదే వేదికపై జరుగుతుంది. చదవండి: #Rinku Singh: టీమిండియాకు నయా ఫినిషర్.. వారెవ్వా రింకూ! వీడియో వైరల్ -
టీమిండియాకు నయా ఫినిషర్.. వారెవ్వా రింకూ! వీడియో వైరల్
యూపీ క్రికెటర్, ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్ తన అంతర్జాతీయ కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20తో రింకూ సింగ్ అరంగేట్రం చేసినప్పటికీ.. బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ రెండో టీ20లో మాత్రం ఈ సిక్సర్ల కింగ్‌కు ఛాన్స్ లభించింది. తనకు వచ్చిన అవకాశాన్ని రింకూ అందిపుచ్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రింకూ సంచలన ప్రదర్శన చేశాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన రింకూ.. 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి భారత్‌కు మంచి స్కోర్‌ను అందించాడు. ఆఖరిలో శివమ్ దుబేతో కలిసి ఐర్లాండ్ బౌలర్లను ఆట ఆడుకున్నాడు. ఇక అద్బుత ఇన్నింగ్స్ ఆడిన రింకూ సింగ్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియాకు నయా ఫినిషర్ దొరికాడని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా ఐపీఎల్లో దుమ్మరేపడంతో సెలక్టర్లు నుంచి రింకూకు పిలుపు వచ్చింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన రింకూ 149.9 స్ట్రైక్‌రేట్‌తో 474 పరుగులు చేశాడు. ఈ క్రమంలో చైనా వేదికగా జరగనున్న ఆసియాక్రీడలకు కూడా రింకూను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక రెండో టీ20లో 33 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. ద్వారా మరో మ్యాచ్ మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. సిరీస్‌లోని చివరిదైన మూడో మ్యాచ్ ఈనెల 23న ఇదే వేదికపై జరుగుతుంది. చదవండి: వాటిని పట్టించుకోకూడదు.. అది మాకు పెద్ద తలనొప్పి! ప్రతీ ఒక్కరూ: టీమిండియా కెప్టెన్ Achi finish ki chinta kyu jab crease par barkaraar ho Rinku 🤩! 🔥#IREvIND #JioCinema #Sports18 #RinkuSingh #TeamIndia pic.twitter.com/QPwvmPPPxK — JioCinema (@JioCinema) August 20, 2023 -
వాటిని పట్టించుకోకూడదు.. అది మాకు పెద్ద తలనొప్పి! ప్రతీ ఒక్కరూ
ఐర్లాండ్ గడ్డపై యువ భారత జట్టు సత్తాచాటింది. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగన రెండో టీ20లో 33 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (43 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్), సంజూ సామ్సన్ (26 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రింకూ సింగ్ (21 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిపించారు. ఐరీష్ బౌలర్లలో మెకార్తీ రెండు వికెట్లు, అడైర్, యంగ్, వైట్ తలా వికెట్ సాధించారు. అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐరీష్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఓపెనర్ అండీ బల్బిర్నీ (51 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో కెప్టెన్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు తీశారు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రింకూ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. "సిరీస్ సొంతం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు పిచ్ కొంచెం డ్రైగా ఉంది. మిడిల్ ఓవర్లలో వికెట్ కాస్త నెమ్మదించి బ్యాటింగ్‌కు ఇబ్బంది అవుతందని నేను భావించాను. కానీ మా బ్యాటర్లు అదరగొట్టారు. ఈ మ్యాచ్‌లో మా బాయ్స్ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. అయితే ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవడం కెప్టెన్‌గా చాలా కష్టంగా ఉంది. మాకు అది పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతీ ఒక్కరూ జట్టులో చోటు కోసం అతృతగా ఎదురుచూస్తున్నారు. మేమంతా భారత్ తరఫున ఆడాలని అనుకున్నాం. అయితే మనం నిరంతరం కష్టపడతూ ఉండాలి. ఎదో ఒక రోజు మన శ్రమకు తగ్గ ఫలితం దక్కుతోంది. ఒక ఆటగాడిగా మనపై ఉండే అంచనాలను అస్సలు పట్టించుకోకూడదు. వాటి వల్ల మనం ఒత్తిడికి గురి అవుతాం. వాటిన్నటిని పక్కన పెట్టి జట్టుకు 100 శాతం న్యాయం చేసేందుకు ప్రయత్నించాలని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో బుమ్రా పేర్కొన్నాడు. చదవండి: Asia Cup 2023: ఆసియా కప్‌కు నేడు భారత జట్టు ఎంపిక.. వారిద్దరిలో ఎవరికీ ఛాన్స్? Jasprit Bumrah's 💥 spell is 𝘔𝘖𝘖𝘖𝘖𝘋 😍#IREvIND #JioCinema #Sports18 #TeamIndia pic.twitter.com/dixBumib36 — JioCinema (@JioCinema) August 20, 2023 -
ఐర్లాండ్‌తో రెండో టీ20.. టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్!
ఐర్లాండ్‌తో తొలి టీ20లో విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. డబ్లిన్ వేదికగా ఆదివారం జరగనున్న రెండో టీ20లో ఐర్లాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. కాగా ఈ సిరీస్‌లో యువ భారత జట్టుకు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. బుమ్రా తన రీఎంట్రీ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు అతడితో పాటు ప్రసిద్ద్ కృష్ణ కూడా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇక తొలి టీ20కు అంతరాయం కలిగించిన వరుణుడు.. ఇప్పుడు రెండో టీ20కు కూడా అడ్డు తగిలే అవకాశం ఉంది. ఆదివారం మ్యాచ్ జరిగే సమయంలో 30-50 శాతం వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావారణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా వర్షం కారణంగా తొలి టీ20లో కేవలం 40 ఓవర్లకు 26.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్‌ను విజేతగా నిర్ణయించారు. తుది జట్లు(అంచనా) పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్,గ్రెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్ భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రవి బిష్ణోయ్ చదవండి: Asia Cup 2023: ఆసియాకప్‌కు భారత జట్టు ఇదే.. శాంసన్, అశ్విన్‌కు నో ఛాన్స్! తెలుగోడికి చోటు -
తిలక్ గోల్డెన్ డక్! ఎందుకు అతడిని ప్రమోట్ చేశారు?: మాజీ క్రికెటర్ ఫైర్
Tilak Varma would be disappointed for sure: ‘‘టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంలో తిలక్ వర్మ తనను తాను నిరూపించుకున్నాడు. ఇక సంజూ శాంసన్ వన్‌డౌన్‌లో సరిగ్గా సరిపోతాడు. వీళ్లు లెఫ్టాండర్లా, రైట్హ్యాండర్లా అన్న అంశంతో అసలు సంబంధమే లేదు. నిజానికి జట్టులో ఏకంగా ఐదుగురు లెఫ్టాండ్ బ్యాటర్లు ఉన్నారు. తిలక్‌ను ఎందుకు ప్రమోట్ చేశారు? ప్రత్యర్థి జట్టులో లెఫ్టార్మ్ స్పిన్నర్ ఉన్నాడు. పాల్ స్టిర్లింగ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. అయితే, ఇలాంటి పిచ్‌పై బాల్ టర్న్ అవ్వదు కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి కాంబినేషన్ల పేరిట తిలక్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపాల్సిన అవసరం లేదు. నాలుగో స్థానంలో అతడి ప్రదర్శన మెరుగ్గా ఉంది’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ అన్నాడు. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో తిలక్ వర్మ చక్కగా సరిపోతాడని సహచర హైదరాబాదీకి అండగా నిలిచాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటుతున్న తెలుగు తేజం తిలక్ వర్మ.. వెస్టిండీస్ పర్యటన సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అరంగేట్రంలో సత్తా చాటిన హైదరాబాదీ కరేబియన్ జట్టుతో టీ20 సిరీస్ సందర్భంగా ఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్టాండర్.. ఐదు మ్యాచ్‌లలో కలిపి 173 పరుగులు చేశాడు. 140.65 స్ట్రైక్‌రేటుతో సగటున 57.67 పరుగులు సాధించి సత్తా చాటాడు. దీంతో అతడిపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఐర్లాండ్‌తో తొలి టీ20లో తిలక్ అవుటైన తీరు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. పాపం.. గోల్డెన్ డకౌట్ లక్ష్య ఛేదనలో భాగంగా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ హైదరాబాదీ బ్యాటర్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. రైటార్మ్ పేసర్ క్రెయిగ్ యంగ్ బౌలింగ్‌లో టకర్‌కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ నాయర్ జియో సినిమా షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. తిలక్ కూడా నిరాశకు లోనై ఉంటాడు తిలక్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తేనే మంచి ఫలితాలు రాబట్టవచ్చని చెప్పుకొచ్చాడు. ఇక తాను అవుటైన తీరుకు తిలక్ వర్మ కూడా తీవ్ర నిరాశకు లోనై ఉంటాడని నాయర్ అభిప్రాయపడ్డాడు. యంగ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఐర్లాండ్‌తో తొలి టీ20లో టీమిండియా డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 2 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. చదవండి: ధోని, యువరాజ్ తర్వాత అలాంటి వాళ్లు రాలేదు.. ఇప్పుడు ఇతడు! ఐర్లాండ్‌తో రెండో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! అతడికి ఛాన్స్ Yashasvi Jaiswal and Tilak Varma departed on back-to-back deliveries of Craig Young! Golden duck for Tilak Varma 👀#IREvsIND #TilakVarma #CricketTwitter pic.twitter.com/cvA3TSNWMC — OneCricket (@OneCricketApp) August 18, 2023 -
ధోని, యువరాజ్ తర్వాత అలాంటి వాళ్లు రాలేదు.. ఇప్పుడు ఇతడు!
Rinku Singh can emulate Yuvraj Singh & MS Dhoni as finisher: టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్‌పై మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే ప్రశంసలు కురిపించాడు. మిడిలార్డర్లో రాణించగల సత్తా అతడికి ఉందని.. బెస్ట్ ఫినిషర్‌గా ఎదుగుతాడని అంచనా వేశాడు. కేవలం బ్యాటింగ్ మాత్రమే కాకుండా ఫీల్డింగ్‌లోనూ రింకూ అద్భుతమని కొనియాడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రింకూ సింగ్ తాజా ఎడిషన్‌లో అదరగొట్టిన విషయం తెలిసిందే. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన సందర్భాల్లో తానున్నానంటూ ఆదుకున్నాడు. ఫినిషర్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. సిక్సర్ల రింకూగా.. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రింకూ ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టడం పదహారో ఎడిషన్ హైలైట్లలో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలో టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడిన రింకూ సింగ్.. ఐర్లాండ్‌లో పర్యటించే భారత టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నాడు. డబ్లిన్‌లో ది విలేజ్ మైదానం వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20 సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. ధోని, యువీ తర్వాత రింకూనే! ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కిరణ్ మోరే స్పందిస్తూ.. మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్ తర్వాత మళ్లీ రింకూ వాళ్లంతటి వాడు కాగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. జియో సినిమా షోలో మాట్లాడుతూ.. ‘‘ రింకూ ఎప్పుడెప్పుడు టీమిండియాలో అరంగేట్రం చేస్తాడా అని ఎదురుచూశాను. బ్యాటింగ్ ఆర్డర్లో ఐదు లేదంటే ఆరో స్థానంలో రింకూ రాణించగలడు. అద్భుతమైన ఫినిషర్‌గా పేరు తెచ్చుకోగలడు. మనం ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్‌లను చూశాం. వాళ్లిద్దరి తర్వాత మళ్లీ అలాంటి ప్లేయర్ రాలేదు. అద్భుతమైన ఫీల్డర్ ఇప్పుడు రింకూ రూపంలో మంచి ఆప్షన్ దొరికింది. అతడు అద్భుతమైన ఫీల్డర్ కూడా! దేశవాళీ క్రికెట్లో ఆడేటపుడు తనని దగ్గరగా గమనించాను. ప్రస్తుతం తన ఆట మరింత మెరుగైంది’’ అని కిరణ్ మోరే చెప్పుకొచ్చాడు. కాగా ఉత్తరప్రదేశ్‌కి చెందిన లెఫ్టాండ్ బ్యాటర్ రింకూ. ఐరిష్ జట్టుపై అరంగేట్రం చేసిన అతడికి.. వర్షం ఆటంకం కలిగించిన కారణంగా తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక డబ్లిన్ టీ20లో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. టీమిండియా ఐర్లాండ్‌పై 2 పరుగుల తేడాతో గెలుపొంది 1-0తో సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. చదవండి: కోహ్లిపై షోయబ్ అక్తర్ వ్యాఖ్యలు.. కొట్టిపారేసిన గంగూలీ! ఏమన్నాడంటే? ఐర్లాండ్‌తో రెండో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! అతడికి ఛాన్స్ -
ఐర్లాండ్‌తో రెండో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! అతడికి ఛాన్స్
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్‌పై కన్నేసింది. ఆదివారం డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరగనున్న రెండో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఇప్పటికే తొలి టీ20లో గెలుపొందిన టీమిండియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇక రెండో టీ20లో టీమిండియా ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తొలి టీ20లో విఫలమైన అర్ష్‌దీప్ సింగ్‌పై వేటు వేయాలని జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో మరో పేసర్ అవేష్ ఖాన్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తొలి మ్యాచ్‌లో అర్ష్‌దీప్ తన నాలుగు ఓవర్ల కోటాలో 35 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇక బ్యాటింగ్‌లో టీమిండియా ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు. ఒకవేళ జితీష్ శర్మకు అవకాశం ఇవ్వాలనకుంటే శాంసన్‌ను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. మరోవైపు ఐర్లాండ్ కూడా తమ జట్టులో ఒకే ఒక మార్పు చేయనున్నట్లు సమాచారం. ఆల్‌రౌండర్ డాక్రెల్ స్ధానంలో గ్రెత్ డెలానీకి ఛాన్స్ ఇవ్వాలని ఐరీష్ జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇక ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. తుది జట్లు(అంచనా) పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్,గ్రెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్ భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రవి బిష్ణోయ్ చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు.. ఎవరూ ఊహించని ఆటగాడు ఎంట్రీ! -
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. తొలి భారత క్రికెటర్‌గా!
టీమిండియా స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా తన రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే వికెట్ల వేట మొదలు పెట్టాడు. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో తను వేసిన మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. తద్వారా బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 కెప్టెన్‌గా అరంగేట్రంలోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ ఘనత ఎవరికీ సాధ్యం కాలేదు. కాగా ఈ సిరీస్‌కు సీనియర్లందరూ దూరం కావడంతో బుమ్రానే యువ భారత జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. టీ20ల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన తొలి ఫాస్ట్‌బౌలర్ కూడా బుమ్రానే కావడం గమానర్హం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐర్లాండ్‌పై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 2 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బారీ మెకార్తీ (33 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిపించాడు. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్ ఒక్క వికెట్ పడగొట్టాడు. . తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ వర్షంతో ఆట నిలిచే సమయానికి 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత విజయ సమీకరణం 45 పరుగులుగా ఉంది. రెండు పరుగుల అధిక్యంలో ఉండటంతో డీఎల్ఎస్ ప్రకారం భారత్‌ను విజేతగా నిర్ణయించారు. చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు.. ఎవరూ ఊహించని ఆటగాడు ఎంట్రీ! What a start from the #TeamIndia captain 🤩 Bumrah back to what he does best 💥#IREvIND #JioCinema #Sports18 pic.twitter.com/IryoviTKGo — JioCinema (@JioCinema) August 18, 2023