టీ20 వరల్డ్‌కప్-2024లో సత్తా చాటేందుకు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సిద్దమయ్యాడు. ఐపీఎల్ 2024లో కనబరిచిన జోరునే ఈ పొట్టి ప్రపంచకప్‌లోనూ కొనసాగించాలని కోహ్లి ఉవ్విళ్లూరుతున్నాడు.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన కింగ్ కోహ్లి.. 741 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ మెగా ఈవెంట్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో బుధవారం న్యూయర్క్ వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది.
తొలిపోరు కోసం రోహిత్ సేన అన్ని విధాల సిద్దమైంది. ఇక మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లిపై ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ టోర్నీలో కోహ్లి టాప్ రన్ స్కోరర్‌గా నిలుస్తాడని స్మిత్ జోస్యం చెప్పాడు.
"ఈ మెగా ఈవెంట్‌లో లీడింగ్ రన్ స్కోరర్‌గా విరాట్ కోహ్లి నిలుస్తాడని నేను భావిస్తున్నాడు. అతడు ఐపీఎల్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచి అమెరికాకు వచ్చాడు. విరాట్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆ జోరును ఇక్కడ కూడా కొనసాగిస్తాడని నేను ఆశిస్తున్నానని" ఐసీసీ షేర్ చేసిన వీడియోలో స్మిత్ పేర్కొన్నాడు.
మరోవైపు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ టాప్ రన్‌స్కోరర్‌గా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ లేదా విరాట్ కోహ్లి నిలుస్తాడని అంచనా వేశాడు.
చదవండి: T20 WC: చరిత్ర సృష్టించిన నేపాల్ కెప్టెన్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
Comments
Please login to add a commentAdd a comment