3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం టీమిండియా ఐర్లాండ్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను క్రికెట్ ఐర్లాండ్ (సీఐ) నిన్న (జూన్ 27) విడుదల చేసింది. ఆగస్ట్ 18న తొలి టీ20, ఆగస్ట్ 20, ఆగస్ట్ 23 తేదీల్లో మిగతా రెండు టీ20లు జరుగుతాయని సీఐ సీఈఓ వెల్లడించాడు. ఈ మూడు మ్యాచ్‌లకు డబ్లిన్‌లోని మలహిదే గ్రౌండ్స్ వేదిక కానున్నాయని ఆయన తెలిపాడు. భారత్.. వెస్టిండీస్ పర్యటన ముగిసిన వెంటనే (ఆగస్ట్ 13) ఐర్లాండ్ సిరీస్ మొదలవుతుంది.
కాగా, టీమిండియా.. ఐర్లాండ్‌తో గతేడాది కూడా టీ20 సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. నాటి సిరీస్‌ను హార్దిక్ పాండ్యా నేతృత్వంలోనే టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. 12 ఓవర్లకు కుదించిన తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో 4 పరుగుల స్వల్ప తేడాతో భారత్ గెలుపొందింది. రెండో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన దీపక్ హుడా (104)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.
అంతకుముందు 2018లో కూడా టీమిండియా ఐర్లాండ్‌లో పర్యటించింది. నాటి సిరీస్‌ను కూడా టీమిండియా 2-0 తేడాతో ఊడ్చేసింది. ఓవరాల్‌గా భారత్-ఐర్లాండ్ మధ్య ఇప్పటివరకు మొత్తం 5 మ్యాచ్‌లు జరగ్గా ఐదింటిలో టీమిండియానే గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment