ఐర్లాండ్‌తో జరిగిన ఉత్కంఠపోరులో టీమిండియా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. 228 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ ఒక దశలో లక్ష్యం వైపుగా సాగింది. అయితే ఆఖర్లో ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ అద్బుతంగా బౌలింగ్ చేయడంతో ఐర్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేయడంతో టీమిండియా తృటిలో ఓటమి నుంచి తప్పించుకుంది.
ఐర్లాండ్ బ్యాటింగ్‌లో ఆండ్రూ బాల్బర్నీ(37 బంతుల్లో 60, 3 ఫోర్లు, 7 సిక్సర్లు), పాల్ స్టిర్లింగ్(18 బంతుల్లో 40, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దాటిగా ఆడారు. హ్యారీ టెక్టర్ 39 పరుగులు చేయగా.. చివర్లో జార్జ్ డాక్‌రెల్ 34 నాటౌట్, మార్క్ ఎడైర్ 23 నాటౌట్‌గా మిగిలారు. టీమిండియా బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, రవి బిష్ణోయి తలా ఒక వికెట్ తీశారు. కాగా రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను టీమిండియా 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
►టీమిండియాతో జరుగుతున్న రెండో టి20లో ఐర్లాండ్ సంచలనం చేస్తుంది. 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. జార్జ్ డాక్‌రెల్ 28, హ్యారీ టెక్టర్ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు.
►228 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 9 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఆండ్రూ బాల్బరిన్ 44, హారి టెక్టర్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.
►ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 104 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. దీపక్ హుడాకు ఓపెనర్ సంజూ శాంసన్(42 బంతుల్లో 77, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) సహకరించాడు.
► పది ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ స్కోరు 97/1. ఆరంభంలో వికెట్ పడినా ఏ మాత్రం తడబడకుండా భారత బ్యాటర్లు ప్రత‍్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం దీపక్ హుడా(58), సంజు సాంసన్(42) క్రీజులో ఉన్నారు.
► ఆరో ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 54/1. క్రీజులో దీపక్ హుడా(28), సంజు సాంసన్(25) ఉన్నారు.
► మూడో ఓవర్లోనే భారత్‌కి ఎదురు దెబ్బ తగిలింది.భారత్ ఓపెనర్ ఇషాన్ కిషన్(3) పెవిలియన్ బాట పట్టాడు. కిషన్ ఔటయ్యే సమయానికి భారత్ స్కోరు 13. ప్రస్తుతం దీపక్ హుడా(0) , సంజు సాంసన్(10) క్రీజులో ఉన్నారు.
ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా ఇవాళ (జూన్ 28) రెండో టీ20 ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో తొలి టీ20లో గెలిచిన టీమిండియా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. గాయపడిన రుతురాజ్ స్థానంలో సంజూ శాంసన్, ఆవేశ్ ఖాన్ స్థానంలో హర్షల్ పటేల్, చహల్ ప్లేస్‌లో రవి బిష్ణోయ్‌లు తుది జట్టులోకి వచ్చారు.
భారత జట్టు: సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దినేశ్ కార్తిక్ (వికెట్‌కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్
ఐర్లాండ్: ఆండ్రూ బల్బిర్నీ(కెప్టెన్), హ్యారీ టెక్టార్, గరేత్ డిలనీ, పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టకర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడేర్, జాషువా లిటిల్, ఆండీ మెక్‌బ్రిన్, కానర్ ఆల్ఫర్ట్, క్రెయిగ్ యంగ్.
చదవండి: టీమిండియా కెప్టెన్ ఎవరని ప్రశ్నించిన ఐసీసీ.. హర్భజన్ ఏమన్నాడంటే..?
Comments
Please login to add a commentAdd a comment