టీ20 వరల్డ్‌కప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ (జూన్ 5) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా పేసర్లు చెలరేగిపోతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఐర్లాండ్‌కు చుక్కలు చూపిస్తుంది. టీమిండియా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా చాలాకాలం తర్వాత బంతితో ఇరగదీస్తున్నాడు.
హార్దిక్ ధాటికి ఐర్లాండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలుతుంది. హార్దిక్ 4 ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మెయిడిన్ ఉంది. హార్దిక్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్ (3-0-18-2), సిరాజ్ (3-0-13-1), బుమ్రా (2-1-4-1), అక్షర్ పటేల్ (0.2-0-1-1) కూడా విజృంభించడంతో ఐర్లాండ్ 13 ఓవర్లలో 66 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు కోల్పోయింది.
ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్ స్టిర్లింగ్ (2), లోర్కాన్ టక్కర్ (10), హ్యారీ టెక్టార్ (4), కర్టిస్ క్యాంపర్ (12), జార్జ్ డాక్రెల్ (3), మార్క్ అదైర్ (3), బ్యారీ మెక్ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు. జాషువ లిటిల్ (8), గారెత్ డెలానీ (9) క్రీజ్‌లో ఉన్నారు.
What a ball from Vice Captain Hardik Pandya. 💪 pic.twitter.com/rk76b8Dbdj
— Johns. (@CricCrazyJohns) June 5, 2024
హార్దిక్ సూపర్ డెలివరీ..
చాలాకాలం తర్వాత బంతితో మెరిసిన హార్దిక్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పడగొట్టిన ఓ వికెట్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. హార్దిక్ సూపర్ డెలివరీతో హ్యారీ టెక్టార్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా, న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment