టీ20 వరల్డ్‌కప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో ఇవాళ (జూన్ 5) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. ముఖ్యంగా పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా ఐర్లాండ్ ఇన్నింగ్స్ పేక మేడలా కూలింది.
హార్దిక్ పాండ్యా (4-1-27-3), అర్ష్‌దీప్ సింగ్ (4-0-35-2), సిరాజ్ (3-0-13-1), బుమ్రా (3-1-6-2), అక్షర్ పటేల్ (1-0-3-1) ధాటికి ఐర్లాండ్ 96 పరుగులకే (16 ఓవర్లలో) కుప్పకూలింది.
ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో లోర్గాన్ టక్కర్ (10), కర్టిస్ క్యాంపర్ (12), గెరాత్ డెలానీ (26), జాషువ లిటిల్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో డెలానీ మెరుపులు మెరిపించడంతో ఐర్లాండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్ స్టిర్లింగ్ (2), హ్యారీ టెక్టార్ (4), జార్జ్ డాక్రెల్ (3), మార్క్ అదైర్ (3), బ్యారీ మెక్ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment