టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం తొలిసారి తన సొంత పట్టణమైన వడోదరకు వచ్చిన టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. హార్దిక్‌ను ఎయిర్‌పోర్ట్ నుంచి ర్యాలీగా తీసుకెళ్లేందుకు భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. హార్దిక్ ఓపెన్ టాప్ వాహనంలో వడోదర వీధుల గుండా తన స్వగృహానికి చేరకున్నాడు. హార్దిక్ విజయోత్సవ ర్యాలీకి ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు.
A HERO'S WELCOME FOR HARDIK PANDYA IN VADODARA. 😍🏆 pic.twitter.com/LFY0g1ZgOX
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 15, 2024
హార్దిక్ నామస్మరణతో వడోదర వీధులు మార్మోగిపోయాయి. హార్దిక్ ఓపెన్ టాప్ వాహనంపై నుంచి అభిమానులకు అభివాదం చేస్తూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. హార్దిక్ విజయోత్సవ ర్యాలీకి చెందిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ర్యాలీ అనంతరం పట్టణంలోని ఓ బహిరంగ ప్రదేశంలో హార్దిక్‌కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి హార్దిక్‌తో పాటు అతని సోదరుడు కృనాల్ పాండ్యా కూడా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో "చక్‌దే ఇండియా" పాట ప్లే చేయగా జనాలు ఉర్రూతలూగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది.
Hardik Pandya and Krunal Pandya dancing on Chak De India. 🇮🇳 pic.twitter.com/Q2S8OMuCSv
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 15, 2024
కాగా, హార్దిక్ పాండ్యా టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం ముంబైలో జరిగిన టీమిండియా విజయోత్సవ ర్యాలీలో పాల్గొని అక్కడే ఉండిపోయాడు. అనంతరం హార్దిక్ అనంత అంబానీ వివాహా వేడుకలో సందడి చేసి ఇవాళ (జులై 15) వడోదరకు చేరుకున్నాడు.
ఇదిలా ఉంటే.. యూఎస్‌ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. జూన్ 29న సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్.. ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి రెండోసారి జగజ్జేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో హార్దిక్ చివరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment