ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ కోసం విశ్లేషకులు, మాజీలు తమతమ ఫేవరెట్ జట్లను ప్రకటిస్తున్నారు. పలానా జట్టులో పలాన ఆటగాడు తుది జట్టులో ఉండాలని ఇప్పటి నుంచి అంచనాలు మొదలయ్యాయి. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా తన ఫేవరెట్ ప్లేయింగ్ ఎలెవెన్‌ను (భారత్) ప్రకటించాడు.
సెహ్వాగ్ ఫేవరెట్ జట్టులో అందరూ ఊహించిన చాలామంది ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్, కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా.. ఇలా మెజర్టీ శాతం అంచనా వేస్తున్న ఆటగాళ్లు సెహ్వాగ్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉన్నారు. అయితే సెహ్వాగ్ ఫేవరెట్ ఎలెవెన్‌లో అందరి అంచనాలకు విరుద్దంగా ఒక్క ఆటగాడికి మాత్రం చోటు దక్కలేదు. అతడే హార్దిక్ పాండ్యా.
కొందరు హార్దిక్‌కు టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు కష్టమని అంటున్నప్పటికీ భారత సెలెక్టర్లు హార్దిక్‌కు మొండిచెయ్యి చూపించేంత పెద్ద సాహసం చేయకపోవచ్చని అంచనా. అయితే సెహ్వాగ్ మాత్రం ఎవరి అభిమతంతో తనకు పనిలేదన్నట్లు తన ఫేవరెట్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో హార్దిక్‌కు అవకాశం ఇవ్వలేదు.
తన ఫేవరెట్ టీమిండియాలో హార్దిక్‌కు చోటివ్వని సెహ్వాగ్ ఓ అనూహ్య ఎంపిక చేసుకున్నాడు. అతడే సందీప్ శర్మ. తాజాగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సందీప్ రాజస్థాన్ తరఫున ఆడుతూ ఇరగదీశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సందీప్ 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
కేవలం ఇదొక్క ప్రదర్శన కారణంగానే సెహ్వాగ్ సందీప్‌కు తన జట్టులో చోటు ఇచ్చి ఉండడు. సందీప్‌కు స్లాగ్ ఓవర్స్‌లో మంచి రికార్డు ఉంది. కీలక సమయాల్లో సందీప్ అద్భుతమైన స్లో యార్కర్లు వేసి ప్రత్యర్దులను ఇరుకున పెట్టాడు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకునే సెహ్వాగ్ సందీప్‌కు తన జట్టులో చోటు కల్పించి ఉంటాడు.
సెహ్వాగ్ తన ఫేవరెట్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్, చహల్ లాంటి ఆటగాళ్లుకు చోటు కల్పించలేకపోయాడు. సమీకరణల దృష్ట్యా వీరికి అవకాశం దక్కి ఉండకపోవచ్చు.
టీ20 వరల్డ్‌కప్ కోసం సెహ్వాగ్ ఫేవరెట్ ప్లేయింగ్ ఎవెలెన్ (టీమిండియా)..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రింకు సింగ్ లేదా శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, సందీప్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment