
KKR vs SRH Live Updates:
ఎస్ఆర్‌హెచ్ ఘోర ఓటమి..
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 80 పరుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఓటమి పాలైంది. 201 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఎస్ఆర్‌హెచ్ 16.4 ఓవర్లలో కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(33), మెండిస్(27) పర్వాలేదన్పించగా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ(2), హెడ్(4), ఇషాన్ కిషన్(2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, వరుణ్ చక్రవర్తి తలా మూడు వికెట్లు సాధించగా.. రస్సెల్ రెండు, హర్షిత్ రాణా, నరైన్ ఒక్క వికెట్ సాధించారు. ఈ మెగా టోర్నీలో ఎస్ఆర్‌హెచ్‌కు వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం.
ఎస్ఆర్‌హెచ్ ఏడో వికెట్ డౌన్.. క్లాసెన్ ఔట్
హెన్రిచ్ క్లాసెన్ రూపంలో ఎస్ఆర్‌హెచ్ ఏడో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన క్లాసెన్.. వైభవ్ ఆరోరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్‌హెచ్..7 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. క్రీజులో ప్యాట్ కమ్మిన్స్(14), హర్షల్ పటేల్(1) ఉన్నారు.
12 ఓవర్లకు ఎస్ఆర్‌హెచ్ స్కోర్: 84/6
12 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్‌హెచ్ 6 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజులో హెన్రిచ్ క్లాసెన్(13), ప్యాట్ కమ్మిన్స్(6) ఉన్నారు.
ఎస్ఆర్‌హెచ్ నాలుగో వికెట్ డౌన్
నితీశ్ కుమార్ రూపంలో ఎస్ఆర్‌హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన నితీశ్ కుమార.. రస్సెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.7 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్‌హెచ్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజులో కమిందు మెండిస్(22), క్లాసెన్(1) ఉన్నారు.
కష్టాల్లో ఎస్ఆర్‌హెచ్.. 9 పరుగులకే 3 వికెట్లు
కష్టాల్లో ఎస్ఆర్‌హెచ్.. 9 పరుగులకే 3 వికెట్లు 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్ తడబడుతోంది. కేవలం 9 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ట్రావిస్ హెడ్(4), ఇషాన్ కిషన్(2), అభిషేక్ శర్మ(2) తీవ్ర నిరాశపరిచారు. ఇంపాక్ట్ ప్లేయర్ వైభవ్ ఆరోరా రెండు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా ఓ వికెట్ సాధించారు.
ఎస్ఆర్‌హెచ్ తొలి వికెట్ డౌన్.. హెడ్ ఔట్
201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్‌కు భారీ షాక్ తగిలింది. 4 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. తొలి ఓవర్‌లోనే వైభవ్ ఆరోరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ఇషాన్ కిషన్ వచ్చాడు.
చెలరేగిన కేకేఆర్ బ్యాటర్లు.. ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ ఎంతంటే?
ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కోత్‌కతా బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రఘువంశీ(50), రింకూ సింగ్(32), రహానే(38) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో కమ్మిన్స్, షమీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్ తలా వికెట్ సాధించారు.
దూకుడుగా ఆడుతున్న కేకేఆర్..
17 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేశ్ అయ్యర్(20), రింకూ సింగ్(24) ఉన్నారు.
కేకేఆర్ నాలుగో వికెట్ డౌన్
రఘువన్షి రూపంలో కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన రఘువన్షి.. కమిందు మెండిస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 4 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేష్ అయ్యర్(5), రింకూ సింగ్(3) ఉన్నారు.
కేకేఆర్ మూడో వికెట్.. రహానే ఔట్
అజింక్య రహానే రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన రహానే.. జీషన్ అన్సారీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో రఘువన్షి(49), వెంకటేష్ అయ్యర్(1) ఉన్నారు.
నిలకడగా ఆడుతున్న రహానే, రఘువంశీ
ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ నిలకడగా ఆడుతోంది. 8 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. క్రీజులో అంగ్క్రిష్ రఘువంశీ(26), అజింక్య రహానే(29) ఉన్నారు.
కేకేఆర్‌కు ఆదిలోనే భారీ షాక్..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కేకేఆర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో క్వింటన్ డికాక్(1) ఔట్ కాగా.. రెండో ఓవర్‌లో మహ్మద్ షమీ బౌలింగ్‌లో సునీల్ నరైన్(7) ఔటయ్యాడు. మూడు ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజులో రహానే(1), రఘువంశీ(1) ఉన్నారు.
ఐపీఎల్-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. తుది జట్టులోకి కమిందు మెండిస్, సిమర్‌జీత్ సింగ్ వచ్చారు.
తుది జట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), కమిందు మెండిస్, సిమర్‌జీత్ సింగ్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ.
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి