Sandeep Sharma
-
SRH vs RR: మా ఓటమికి కారణం అదే.. బుమ్రా తర్వాత అతడే: సంజూ
‘‘కీలకమైన మ్యాచ్. తొలి ఇన్నింగ్స్‌లో మా వాళ్లు బౌలింగ్ చేసిన విధానం పట్ల గర్వంగా ఉంది. అయితే, రెండో ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్లలో వారి స్పిన్ వ్యూహాలను ఎదుర్కోవడంలో మేము తడబడ్డాం.అక్కడే మ్యాచ్ మా చేజారింది. ఈ పిచ్‌పై తేమ ఉంటుందా? లేదా అన్నది ముందే ఊహించడం కష్టం. రెండో ఇన్నింగ్స్‌కు వచ్చే సరికి వికెట్ పూర్తి భిన్నంగా మారిపోయింది.బంతి కాస్త టర్న్ కావడం మొదలైంది. ఆ అవకాశాన్ని వాళ్లు సద్వినియోగం చేసుకున్నారు. మిడిల్ ఓవర్లలో మా కుడిచేతి వాటం బ్యాటర్ల కోసం లెఫ్టార్మ్ స్పిన్నర్లను దింపి ఫలితం రాబట్టారు.అక్కడే వాళ్లు మాపై పైచేయి సాధించారు. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్లకు ఎక్కువగా ప్రయత్నించి ఉంటే బాగుండేది. ఏదేమైనా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు’’ అని రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు.ఐపీఎల్-2024 క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని అంగీకరించాడు. అయితే, జట్టు ప్రదర్శన పట్ల మాత్రం తనతో పాటు ఫ్రాంఛైజీ కూడా సంతృప్తిగానే ఉందని సంజూ ఈ సందర్భంగా తెలిపాడు.బుమ్రా తర్వాత అతడేఈ మేరకు.. ‘‘మేము ఈ ఒక్క సీజన్లోనే కాదు.. గత మూడేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాం. మా ఫ్రాంఛైజీ మా ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉంది. ముఖ్యంగా భారత్‌లోని యంగ్ టాలెంట్‌ను మేము వెలికితీయగలుగుతున్నాం.రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ అందుకు ఉదాహరణ. వీళ్లిద్దరు కేవలం రాజస్తాన్‌కే కాదు టీమిండియా తరఫున కూడా రాణిస్తే చూడాలని కోరుకుంటున్నా.ఇక సందీప్ శర్మ.. అతడి బౌలింగ్ తీరు పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. వేలంలో తను మా జట్టులోకి రాకపోయినా వేరొకరి స్థానంలో మాతో చేరాడు. అద్భుత ఆట తీరుతో అందరినీ మెప్పించాడు.గత రెండేళ్లుగా అతడి ప్రదర్శన బాగుంది. బుమ్రా తర్వాత అతడే బెస్ట్!’’ అంటూ రాజస్తాన్ యువ ఆటగాళ్లపై సంజూ శాంసన్ ప్రశంసలు కురిపించాడు. కాగా చెన్నై వేదికగా శుక్రవారం నాటి కీలక మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 36 పరుగుల తేడాతో ఓడిపోయింది.విఫలమైన సంజూ శాంసన్ఈ క్రమంలో సన్‌రైజర్స్ ఫైనల్లో అడుగుపెట్టగా.. రాజస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ పూర్తిగా విఫలమయ్యాడు. 11 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులే చేశాడు. యశస్వి జైస్వాల్(21 బంతుల్లో 42), ధ్రువ్ జురెల్(56 నాటౌట్) మాత్రమే రాణించారు.తిప్పేసిన స్పిన్నర్లుఅంతకు ముందు సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో రాజస్తాన్ పేసర్ సందీప్ శర్మ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 25 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. కాగా ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ అద్బుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.క్వాలిఫయర్-2: సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు:👉టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్👉సన్‌రైజర్స్ స్కోరు: 175/9 (20)👉రాజస్తాన్ స్కోరు: 139/7 (20)👉ఫలితం: రాజస్తాన్‌పై 36 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు దూసుకెళ్లిన సన్రైజర్స్చదవండి: SRH Captain Pat Cummins: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు SRH vs RR: ఓవరాక్షన్.. మూల్యం చెల్లించకతప్పలేదు! Plenty to cheer & celebrate for the @SunRisers 🥳An impressive team performance to seal a place in the all important #Final 🧡Scorecard ▶️ https://t.co/Oulcd2FuJZ… #TATAIPL | #Qualifier2 | #SRHvRR | #TheFinalCall pic.twitter.com/nG0tuVfA22— IndianPremierLeague (@IPL) May 24, 2024 -
టీ20 వరల్డ్‌కప్ జట్టు ఇదే.. హార్దిక్‌కు నో ప్లేస్.. ఓ అనూహ్య ఎంపిక..!
ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ కోసం విశ్లేషకులు, మాజీలు తమతమ ఫేవరెట్ జట్లను ప్రకటిస్తున్నారు. పలానా జట్టులో పలాన ఆటగాడు తుది జట్టులో ఉండాలని ఇప్పటి నుంచి అంచనాలు మొదలయ్యాయి. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా తన ఫేవరెట్ ప్లేయింగ్ ఎలెవెన్‌ను (భారత్) ప్రకటించాడు.సెహ్వాగ్ ఫేవరెట్ జట్టులో అందరూ ఊహించిన చాలామంది ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్, కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా.. ఇలా మెజర్టీ శాతం అంచనా వేస్తున్న ఆటగాళ్లు సెహ్వాగ్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉన్నారు. అయితే సెహ్వాగ్ ఫేవరెట్ ఎలెవెన్‌లో అందరి అంచనాలకు విరుద్దంగా ఒక్క ఆటగాడికి మాత్రం చోటు దక్కలేదు. అతడే హార్దిక్ పాండ్యా. కొందరు హార్దిక్‌కు టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు కష్టమని అంటున్నప్పటికీ భారత సెలెక్టర్లు హార్దిక్‌కు మొండిచెయ్యి చూపించేంత పెద్ద సాహసం చేయకపోవచ్చని అంచనా. అయితే సెహ్వాగ్ మాత్రం ఎవరి అభిమతంతో తనకు పనిలేదన్నట్లు తన ఫేవరెట్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో హార్దిక్‌కు అవకాశం ఇవ్వలేదు. తన ఫేవరెట్ టీమిండియాలో హార్దిక్‌కు చోటివ్వని సెహ్వాగ్ ఓ అనూహ్య ఎంపిక చేసుకున్నాడు. అతడే సందీప్ శర్మ. తాజాగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సందీప్ రాజస్థాన్ తరఫున ఆడుతూ ఇరగదీశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సందీప్ 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. కేవలం ఇదొక్క ప్రదర్శన కారణంగానే సెహ్వాగ్ సందీప్‌కు తన జట్టులో చోటు ఇచ్చి ఉండడు. సందీప్‌కు స్లాగ్ ఓవర్స్‌లో మంచి రికార్డు ఉంది. కీలక సమయాల్లో సందీప్ అద్భుతమైన స్లో యార్కర్లు వేసి ప్రత్యర్దులను ఇరుకున పెట్టాడు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకునే సెహ్వాగ్ సందీప్‌కు తన జట్టులో చోటు కల్పించి ఉంటాడు. సెహ్వాగ్ తన ఫేవరెట్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్, చహల్ లాంటి ఆటగాళ్లుకు చోటు కల్పించలేకపోయాడు. సమీకరణల దృష్ట్యా వీరికి అవకాశం దక్కి ఉండకపోవచ్చు.టీ20 వరల్డ్‌కప్ కోసం సెహ్వాగ్ ఫేవరెట్ ప్లేయింగ్ ఎవెలెన్ (టీమిండియా)..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రింకు సింగ్ లేదా శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, సందీప్ శర్మ -
IPL 2024 RR vs MI: ఐదేసి అదరగొట్టిన అమ్ముడుపోని ఆటగాడు
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 22) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అదిరిపోయే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ 9 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది. వేలంలో అమ్ముడుపోని సందీప్ శర్మ ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ పాలిట గెలుపు గుర్రమయ్యాడు. వేరే ఆటగాడికి రీ ప్లేస్‌మెంట్‌గా రాయల్స్‌లోకి వచ్చిన సందీప్ శర్మ ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి, తన తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో సందీప్ వేసిన స్పెల్ విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఇషాన్ కిషన్ వికెట్ తీసిన సందీప్.. నాలుగో ఓవర్లో అతి భయంకరుడైన సూర్యకుమార్ వికెట్‌ను పడగొట్టాడు. ఆ తర్వాత 15వ ఓవర్లో బంతినందుకున్న సందీప్.. ఆ ఓవర్లో వికెట్ లేకుండా 11 పరుగులు సమర్పించుకున్నాడు. - Unsold in the auction. - Came as a replacement in 2023. - Became the end over specialist.- Injured in the start of IPL 2024. - Came back into the team & got his first five wicket haul. Sandeep Sharma is a hero. 🫡pic.twitter.com/JeMHj5vLH9— Johns. (@CricCrazyJohns) April 22, 2024 ఆఖరి ఓవర్లో మరోసారి బంతినందుకు సందీప్ ఈసారి తన అద్భుతమైన స్లో బాల్స్ టెక్నిక్‌ను ఉపయోగించి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన సందీప్ 18 పరుగులు సమర్పించుకుని 5 వికెట్లు పడగొట్టాడు. సందీప్‌కు ఐపీఎల్ కెరీర్లో ఇదే తొలి ఐదు వికెట్ల ప్రదర్శన. మొత్తంగా ఈ మ్యాచ్‌లో సందీప్ తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో రాయల్స్‌కు భారీ విజయాన్ని అందించాడు. సందీప్ దెబ్బకు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. 179 పరుగులు మాత్రమే చేసింది. తిలక్ వర్మ (65), నేహల్ వధేరా (49) ముంబైని ఆదుకున్నారు. వీరిద్దరు ఆడకపోయుంటే ముంబై పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. రాయల్స్ బౌలర్లలో సందీప్‌తో పాటు బౌల్ట్ (4-0-32-2) కూడా రాణించాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. 18.4 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. యశస్వి జైస్వాల్ (60 బంతుల్లో 104 నాటౌట్) మెరుపు సెంచరీతో రాయల్స్‌ను గెలిపించాడు. బట్లర్ (35), సంజూ శాంసన్ (38 నాటౌట్) రాణించారు. రాయల్స్ కోల్పోయిన ఏకైక వికెట్ (బట్లర్) పియూశ్ చావ్లాకు దక్కింది. -
RR Vs RCB: కోహ్లి ఫాస్టెస్ట్ సెంచరీ అక్కడే.. కానీ!
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ ఐదో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో శనివారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఆర్సీబీ కేవలం ఒకటి మాత్రమే గెలిచింది. ఫలితంగా రెండు పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. మరోవైపు.. రాజస్తాన్ రాయల్స్ హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదుంది. ఆడిన మూడు మ్యాచ్‌లలో మూడూ గెలిచి ఆరు పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే, ఇరుజట్ల మధ్య ముఖాముఖి పోరులో ఆర్సీబీదే పైచేయి. ఆర్సీబీదే పైచేయి.. కానీ ఇప్పటి వరకు రాజస్తాన్‌తో ఆడిన 30 మ్యాచ్‌లలో బెంగళూరు 15సార్లు గెలిచి.. 12 సార్లు ఓటమిపాలైంది. మూడు మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. ఓవరాల్‌గా రాయల్స్‌పై ఆర్సీబీదే పైచేయి అయినప్పటికీ రాజస్తాన్‌తో మ్యాచ్ అంటే ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అభిమానులు వణికిపోతున్నారు. ఇప్పటి వరకు జైపూర్ స్టేడియంలో కోహ్లికి ఉన్న పేలవ రికార్డే(ఐపీఎల్లో) ఇందుకు కారణం. అంతర్జాతీయ మ్యాచ్‌లలో కోహ్లి ఇక్కడ హీరోనే. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడి 195 పరుగులతో అదరగొట్టాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. కోహ్లి ఫాస్టెస్ట్ సెంచరీ ఇక్కడే.. ఐపీఎల్లో మాత్రం వరస్ట్ ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా 2013లో ఇక్కడ వన్డే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు కోహ్లి. కేవలం 52 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. కానీ.. ఐపీఎల్లో మాత్రం ఒక్కసారి కూడా కనీసం యాభై పరుగుల మార్కు అందుకోలేకపోయాడు. సవాయి మాన్సింగ్ స్టేడియంలో మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కోహ్లి సాధించిన పరుగులు కేవలం 149. అత్యధిక స్కోరు 39 నాటౌట్. ఐపీఎల్లో కోహ్లి వరస్ట్ యావరేజ్ కూడా ఇక్కడే. సందీప్ శర్మ బౌలింగ్‌లో ఏడుసార్లు ఇక ఆఖరిగా రాజస్తాన్ రాయల్స్‌తో ఇక్కడ ఆడిన మ్యాచ్‌లో కోహ్లి 19 బంతులు ఎదుర్కొని 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కాగా రాజస్తాన్ పేసర్ సందీప్ శర్మ ఐపీఎల్లో కోహ్లిపై ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు అతడి బౌలింగ్‌లో కోహ్లి 67 బంతులు ఎదుర్కొని కేవలం 87 రన్స్ చేశాడు. ఏడుసార్లు అతడి బౌలింగ్‌లో అవుటయ్యాడు కూడా! ఇక ఈ సీజన్ ఆరంభం నుంచి కోహ్లి ఒక్కడే ఆర్సీబీ టాపార్డర్‌లో రాణిస్తున్నాడు. ఇక్కడ గనుక గత సెంటిమెంట్ రిపీట్ చేస్తూ త్వరగానే పెవిలియన్ చేరితే అంతే సంగతులు!! రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీ తుదిజట్ల అంచనా రాజస్తాన్ జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్/ వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్‌మైర్, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, సందీప్ శర్మ(గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చే ఛాన్స్)/నండ్రీ బర్గర్, ఆవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్. [ఇంపాక్ట్ ప్లేయర్ - శుభమ్ దూబే]. ఆర్సీబీ విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, మయాంక్ దాగర్, రీస్ టాప్లీ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్. [ఇంపాక్ట్ ప్లేయర్ - మహిపాల్ లోమ్రోర్]. చదవండి: జడ్డూ అవుట్ కావాలి కదా? కమిన్స్ ఎందుకు వదిలేశాడు? వీడియో వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అదృష్టం ఎస్‌ఆర్‌హెచ్‌వైపు.. కొంపముంచిన నో బాల్
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఒక అద్బుత విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. అయితే మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్కు అదృష్టం కూడా కలిసి వచ్చింది. 18వ ఓవర్లో గ్లెన్ పిలిప్స్ ఏడు బంతుల్లోనే మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 25 పరుగులతో విధ్వంసం సృష్టించి మ్యాచ్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌వైపు తిప్పాడు. కానీ మరుసటి బంతికే అతను ఔటవ్వడంతో మళ్లీ రాజస్తాన్ వైపు తిరిగింది. కొంపముంచిన నోబాల్.. ఇక ఆఖరి ఓవర్లో ఎస్ఆర్హెచ్ విజయానికి 17 పరుగులు అవసరమైన దశలో సందీప్ శర్మ లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేశాడు. తొలి బంతికి రెండు పరుగులు రాగా.. రెండో బంతిని అబ్దుల్ సమద్ సిక్సర్ తరలించడంతో నాలుగు బంతుల్లో 9 పరుగులు అవసరం అయ్యాయి. ఇక మూడో బంతికి రెండు పరుగులు, నాలుగో బంతికి, ఐదో బంతికి సింగిల్స్ రావడంతో ఆఖరి బంతికి ఎస్ఆర్హెచ్కు ఐదు పరుగులు అవసరం అయ్యాయి. సందీప్ ఆఖరి బంతి వేశాడు. సమద్ లాంగాఫ్ దిశగా గాల్లోకి లేపాడు. అక్కడే ఉన్న బట్లర్ క్యాచ తీసుకోవడంతో ఎస్ఆర్హెచ్ మరో ఓటమి ఎదురైంది అనుకునేలోపే ఊహించని ట్విస్ట్. అంపైర్ నోబాల్ అని ప్రకటించాడు. దీంతో ఒత్తిడిలో పడిన సందీప్ యార్కర్ వేయగా.. అబ్దుల్ సమద్ స్ట్రెయిట్సిక్స్తో ఎస్ఆర్హెచ్కు మరిచిపోలేని విజయాన్ని అందించాడు. ఒక రకంగా మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలవాలని రాసి పెట్టి ఉన్నట్లుంది. అందుకే ఎస్ఆర్హెచ్ను నోబాల్ రూపంలో అదృష్టం వరించింది. This is the best league in the world and you can't change our minds 🔥 Congrats Samad, hard luck, Sandeep!#RRvSRH #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/phHD2NjyYI — JioCinema (@JioCinema) May 7, 2023 చదవండి: మ్యాచ్‌ను మలుపు తిప్పిన గ్లెన్ పిలిప్స్ -
లేటు వయసులో ఇరగదీస్తున్న భారత ఆటగాళ్లు.. ముఖ్యంగా నలుగురు 'శర్మ'లు
ఐపీఎల్-2023లో భారత వెటరన్ ఆటగాళ్లు కుర్రాళ్లతో పోటీపడి మరీ సత్తా చాటుతున్నారు. లేటు వయసులో వీరు అదిరిపోయే ప్రదర్శనలతో ఇరగదీస్తున్నారు. ముఖ్యంగా వయసు పైబడిన రిత్యా సరైన అవకాశాలు లేక చాలాకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. వీరి పెర్ఫార్మెన్స్కు ఫ్యాన్స్‌కు ముగ్దులవుతున్నారు. అవకాశాలు లేవన్న కసితో బౌలింగ్ చేస్తున్న ఈ వెటరన్లు తమ కెరీర్లు పీక్స్‌లో ఉండగా చేయని అద్భుతాలు ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. ముఖ్యంగా నలుగరు 'శర్మ'లు తమతమ జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. బౌలర్లతో పాటు భారత వెటరన్ బ్యాటర్లు సైతం సత్తా చాటుతున్నారు. వీరు కూడా జాతీయ జట్టుకు ఆడే అవకాశాలు లేవన్న కసితోనే తమలోని అత్యుత్తమ ప్రదర్శనను వెలికి తీస్తున్నారు. ప్రస్తుత సీజన్లో ప్రదర్శన కారణంగానే రహానే ఏకంగా జాతీయ జట్టును నుంచి పిలుపునందుకుని జాక్‌పాట్ కొట్టేశాడు. వీరు ఈ సీజన్లో మన్ముందు మరెన్ని అద్భుతాలు చేస్తారో వేచి చూడాలి. ఐపీఎల్-2023లో రఫ్ఫాడిస్తున్న భారత వెటరన్ బౌలర్లు.. ఇషాంత్ శర్మ (ఢిల్లీ, 4 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు) 34 yrs కర్ణ్ శర్మ (ఆర్సీబీ, 4 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు) 35 yrs మోహిత్ శర్మ (గుజరాత్, 6 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు) 34 yrs సందీప్ శర్మ (రాజస్థాన్, 7 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు) 30 yrs అమిత్ మిశ్రా (లక్నో, 6 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు) 40 yrs పియూశ్ చావ్లా (ముంబై, 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు) 34 yrs అశ్విన్ (రాజస్థాన్, 9 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు) 36 yrs ఐపీఎల్-2023లో రెచ్చిపోతున్న భారత వెటరన్ బ్యాటర్లు.. శిఖర్ ధవన్ (పంజాబ్, 6 మ్యాచ్‌ల్లో 148.86 స్ట్రయిక్ రేట్‌తో 65.50 సగటున 262 పరుగులు) 37 yrs అజింక్య రహానే (చెన్నై, 7 మ్యాచ్‌ల్లో 189.83 స్ట్రయిక్ రేట్‌తో 44.80 సగటున 224 పరుగులు) 34 yrs -
Sandeep Sharma: తండ్రి బౌలింగ్ చూసి కేరింతలు కొట్టిన కూతురు
ఐపీఎల్ 16వ సీజన్లో బుధవారం సీఎస్కే, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. ఆఖరి ఓవర్లో 21 పరుగులు అవసరమైన దశలో సీఎస్కే కెప్టెన్ ధోని రెండు భారీ సిక్సర్లతో మ్యాచ్‌ను చెన్నైవైపు మొగ్గాడు. దీంతో సీఎస్కే విజయం సాధించడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ సందీప్ శర్మ ఒత్తిడిని జయించి చివరి మూడు బంతులను అద్భుతంగా బౌలింగ్ చేయడంతో సీఎస్కే విజయానికి మూడు పరుగుల దూరంలో ఆగిపోయింది.దీంతో రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే సందీప్ శర్మ బౌలింగ్‌ను టీవీలో చూసి ఎంజాయ్ చేసింది అతని పది నెలల కూతురు. ఆఖరి ఓవర్లో ధోనీ, జడేజా లాంటి హిట్టర్లకు సందీప్ శర్మ బౌలింగ్ చేస్తుండగా.. నెలల వయసున్న అతడి కూతురు తల్లి ఒడిలో కూర్చొని టీవీలో మ్యాచ్ చూసింది. తండ్రిని గుర్తుపట్టిన ఆ చిన్నారి చిరునవ్వులు చిందింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ జట్ల తరఫున ఆడిన సందీప్ శర్మ.. 2021 ఆగస్టులో తన గర్ల్ ఫ్రెండ్ తషా సాత్విక్‌ను పెళ్లాడాడు. గత ఏడాది జూన్ 20న వారికి కుమార్తె జన్మించింది. గతేడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో సందీప్ శర్మ పట్ల ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. కానీ గాయపడిన ప్రసిధ్ కృష్ణ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ సందీప్ శర్మను జట్టులోకి తీసుకుంది. పది సీజన్ల అనుభవం.. 100కుపైగా వికెట్లు తీసిన బౌలర్‌ను రాజస్థాన్ రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌కే సొంతం చేసుకుంది. యార్కర్లు సంధించడంలో అద్భుత నైపుణ్యం ప్రదర్శించే సందీప్ శర్మ.. ఐపీఎల్లో 106 మ్యాచ్‌ల్లో 116 వికెట్లు తీశాడు. గతంలో సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగంలో భువీతో కలిసి కీలకంగా వ్యవహరించాడు. Sandeep Sharma's newborn watching his final-over heroics against CSK ❤️ (via intoxicatingtash/IG) pic.twitter.com/14qSXjNi9g — ESPNcricinfo (@ESPNcricinfo) April 13, 2023 చదవండి: IPL 2023: మొన్న నోర్జే, నిన్న సందీప్ శర్మ..! -
ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్.. తొలుత ఎవరూ కొనలేదు, ఇప్పుడు తెలిసొచ్చింది..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్లలో ఒకడైన సందీప్ శర్మ, నిన్న (ఏప్రిల్ 12) చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా చాలా రోజుల తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఐపీఎల్ 2023 వేలంలో అమ్ముడుపోని సందీప్‌ను రాజస్థాన్ రాయల్స్ గాయపడిన ప్రసిద్ధ్ కృష్ణకు రీప్లేస్‌మెంట్‌గా ఎంచుకుంది. సీఎస్కేతో నిన్న జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చిన సందీప్, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. గతంలో చాలా సందర్భాల్లో వేర్వేరు ఫ్రాంచైజీలకు తన టాలెంట్‌తో అద్భుత విజయాలనందించిన సందీప్.. నిన్న సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసి ప్రత్యర్ధిని గెలవనీయకుండా చేశాడు. 176 పరుగుల లక్ష్య ఛేదనలో సీఎస్కే ఆఖరి ఓవర్లో 21 పరుగులు చేయాల్సి రాగా.. సందీప్ తొలి రెండు బంతులను వైడ్లుగా, ఆతర్వాత వరుసగా 2 సిక్సర్లు సమర్పించకుని తన జట్టు ఓటమికి కారకుడయ్యేలా కనిపించాడు. అయితే ఈ బ్రిలియంట్ బౌలర్ చివరి 3 బంతులను అద్భుతంగా బౌల్ చేసి క్రీజ్‌లో ఉన్న అరివీర భయంకరులైన ధోని, జడేజాలను కట్టడి చేశాడు. చెన్నై గెలుపుకు 3 బంతుల్లో 7 పరుగులు అవసరం కాగా.. సందీప్ తన అనుభవాన్నంతా రంగరించి, అద్భుతమైన యార్కర్ లెంగ్త్ బంతులను సంధించాడు. అప్పటికే మాంచి ఊపు మీద ఉన్న ధోని, జడేజాలను నిలువరించడం సందీప్‌కు కత్తిమీద సామే అయినప్పటికీ, తన బౌలింగ్ ప్రతిభతో ఎలాగోలా మేనేజ్ చేశాడు. ఫలితంగా రాజస్థాన్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సందీప్ ఒక్క రాత్రిలో తాను కోల్పోయిన స్టార్డమ్నంతా తిరిగి తెచ్చుకున్నాడు. ఫ్యాన్స్ సందీప్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చివరి బంతికి 6 పరుగులు కావాల్సిన తరుణంలో అప్పటికే జోరుమీదున్న ధోనిని అద్భుతంగా కట్టడి చేశాడంటూ అభినందిస్తున్నారు. కెప్టెన్ సంజూ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మ్యాచ్‌ను కాపాడాడంటూ కొనియాడుతున్నారు. ఇలాంటి బౌలర్ 2023 వేలంలో అమ్ముడుపోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిదంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఐపీఎల్లో 2013 నుంచి వివిధ ఫ్రాంచైజీల తరఫున 106 మ్యాచ్‌లు ఆడి 116 వికెట్లు పడగొట్టిన సందీప్‌ను ఈ ఏడాది వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయని విషయం తెలిసిందే. -
IPL 2023: మొన్న నోర్జే, నిన్న సందీప్ శర్మ..!
ఐపీఎల్-2023 సీజన్లో గత నాలుగు రోజులుగా రసవత్తరమైన మ్యాచ్‌లు జరుగుతున్నాయి. క్రికెట్ అభిమానులు ఈ నాలుగు మ్యాచ్‌లు చూడకపోయి ఉంటే అది పెద్ద నేరమని సోషల్‌మీడియాలో మీమ్స్ ట్రోల్ అవుతున్నాయి. ఆ స్థాయి ఈ మ్యాచ్‌లు ఫ్యాన్స్‌కు కావాల్సిన అసలుసిసలు టీ20 మజాను అందించాయి. నరాలు తెగే ఉత్కంఠ నడుమ చివరి బంతి వరకు సాగిన ఈ నాలుగు మ్యాచ్‌ల్లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో బ్యాటర్లు తమ విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో పైచేయి సాధిస్తే.. చివరి రెండు మ్యాచ్‌ల్లో బౌలర్లు తమ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అభిమానుల మనసులు గెలుచుకున్నారు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ ఆఖరి 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టి తన జట్టుకు సంచలన విజయాన్నందించగా.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో స్టోయినిస్, పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ల సాయంతో లక్నో చివరి బంతికి విజేతగా నిలిచింది. ఆ తర్వాత డీసీతో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో ముంబై గెలుపుకు కేవలం 5 పరుగులు మాత్రమే అవసరం కాగా.. నోర్జే అత్యంత పిసినారిగా మారి, మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకు తీసుకొచ్చాడు. ముంబై గెలుపును అడ్డుకునేందుకు నోర్జే చివరి నిమిషం వరకు పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పొయింది. నోర్జే పోరాటం వృధా అయిన ఫ్యాన్స్‌కు అతని బౌలింగ్ పట్ల గౌరవం పెరిగింది. దాదాపుగా ఇలాంటి పోరాటమే నిన్న (ఏప్రిల్ 12) సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ కూడా చేశాడు. క్రితం మ్యాచ్‌లో నోర్జే లాగా సందీప్ తక్కువ స్కోర్‌ను కాకుండా ఓ మోస్తరు స్కోర్‌ను ఆఖరి ఓవర్లో డిఫెండ్ చేసుకుని తన జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. 176 పరుగుల లక్ష్య ఛేదనలో సీఎస్కే ఆఖరి ఓవర్లో 21 పరుగులు చేయాల్సి రాగా.. సందీప్ తొలి రెండు బంతులను వైడ్లుగా, ఆతర్వాత వరుసగా 2 సిక్సర్లు సమర్పించకుని రాజస్థాన్ ఓటమికి కారకుడయ్యేలా కనిపించాడు. అయితే ఈ బ్రిలియంట్ బౌలర్ చివరి 3 బంతులు అద్భుతంగా బౌల్ చేసి క్రీజ్‌లో ఉన్న అరివీర భయంకరులైన ధోని, జడేజాలను కట్టడి చేసి (3 బంతుల్లో 3 సింగల్స్), తన జట్టును గెలిపించుకున్నాడు. సందీప్ లాగే దీనికి ముందు మ్యాచ్‌లో నోర్జే కూడా హార్ఢ్ హిట్టర్లు టిమ్ డేవిడ్, కెమరూన్ గ్రీన్‌లను చివరి బంతి వరకు కట్టడి చేశాడు. అయితే చివరి బంతికి డేవిడ్ 2 పరుగులు సాధించడంతో ముంబై విజయం సాధించింది. మొత్తంగా చూస్తే ప్రస్తుత సీజన్లో గత 4 మ్యాచ్‌ల్లో రెండింటిలో బ్యాటర్ల హవా, ఆఖరి 2 మ్యాచ్‌ల్లో బౌలర్ల డామినేషన్ నడిచింది. -
కోహ్లికి ముచ్చెమటలు పట్టించాడు.. ఇప్పుడు రాజస్తాన్ జట్టులో చోటు కొట్టేశాడు!
ఐపీఎల్-16 సీజన్‌కు రాజస్తాన్ రాయల్స్ స్టార్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ప్రసిద్ధ్ కృష్ణ స్థానాన్ని టీమిండియా పేసర్ సందీప్ శర్మతో రాజస్తాన్ భర్తీ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రాజస్తాన్ వెల్లడించింది. అతడిని కనీస ధర రూ. 50 లక్షలకు సొంతం చేసుకున్నట్లు రాజస్తాన్ తెలిపింది. కాగా సందీప్ శర్మఐపీఎల్లో అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. ఐపీఎల్ పవర్ ప్లేల్లో అత్యధిక వికెట్లు (92 ఇన్నింగ్స్‌ల్లో 53 వికెట్లు) తీసిన రికార్డు ఇప్పటికీ సందీప్ పేరిటే ఉంది. ఐపీఎల్లో ఇప్పటి వరకు 108 మ్యాచ్‌లు ఆడిన సందీప్ 114 వికెట్లు పడగొట్టాడు. 2018 నుంచి నాలుగు సీజన్ల పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సందీప్ ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు ఎస్ఆర్హెచ్ అతడిని విడిచిపెట్టింది. ఈ క్రమంలో వేలంలోకి వచ్చిన అతడిని పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఆ సీజన్లో 5 మ్యాచ్‌లు ఆడిన సందీప్ కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో అతడిని ఐపీఎల్-2023 మినీ వేలంకు ముందు పంజాబ్ కూడా అతడిని విడిచిపెట్టింది. అయితే వేలంలోకి వచ్చిన అతడిని కొనుగోలు చేయలేదు. కాగా ప్రసిద్ధ్ కృష్ణ గాయం కావడంతో మరోసారి ఐపీఎల్లో భాగమయ్యే అవకాశం సందీప్ శర్మకు లభించింది. ఇక టీమిండియా స్టార్ ఆటగాడు, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై సందీప్ శర్మ అద్భుతమైన రికార్డు కలిగిఉన్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో కోహ్లిని 7 సార్లు ఔట్ చేశాడు. ఐపీఎల్లో ఏ బౌలర్ కూడా కోహ్లిని ఇన్ని పర్యాయాలు ఔట్ చేయలేదు. ఇక ఐపీఎల్-16వ సీజన్ మార్చి 31నుంచి ప్రారంభం కానుంది. చదవండి: AFG vs PAK: పాకిస్తాన్ బౌలర్ రాకాసి బౌన్సర్.. దెబ్బకు రక్తం వచ్చేసింది! వీడియో వైరల్ -
కోహ్లికి ముచ్చెమటలు పట్టించిన బౌలర్‌ను తెచ్చుకోనున్న ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. తాజాగా ఇదే జట్టుకు చెందిన మరో ఫాస్ట్ బౌలర్, ఆసీస్ ఆటగాడు జై రిచర్డ్సన్ కూడా గాయం కారణంగా ఐపీఎల్-2023 మొత్తానికి దూరంగా ఉంటాడన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ఫాస్ట్ బౌలర్ల స్థానాలను భర్తీ చేసే పనిలో నిమగ్నమైంది ఎంఐ యాజమాన్యం. ఇందుకోసం 2023 వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాను జల్లెడపట్టడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఎంఐ యజమాన్యానికి అన్‌సోల్డ్ జాబితాలో మిగిలిపోయిన ఓ తురుపుముక్క తారసపడింది. అతని పేరు సందీప్ శర్మ. ఐపీఎల్ పవర్ ప్లేల్లో అత్యధిక వికెట్లు (92 ఇన్నింగ్స్‌ల్లో 53 వికెట్లు) తీసిన రికార్డు కలిగిన సందీప్ శర్మను 2023 వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో అతను అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ముంబై ఇండియన్స్ బుమ్రా స్థానంలో అనుభవజ్ఞుడైన సందీప్ శర్మను తమ జట్టులోని తెచ్చుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది. 2018 నుంచి నాలుగు సీజన్ల పాటు సన్‌రైజర్స్ కీలక బౌలర్‌గా చలామణి అయిన సందీప్‌ను 2022 వేలంలో పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఆ సీజన్లో 5 మ్యాచ్‌లు ఆడిన సందీప్ కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టడంతో పంజాబ్ కింగ్స్ కూడా గడిచిన సీజన్ తర్వాత అతన్ని వేలానికి వదిలేసింది. ఐపీఎల్లో రికార్డు స్థాయిలో 114 వికెట్లు పడగొట్టిన సందీప్‌ను 2023 వేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. 2013లో పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన సందీప్.. తన తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్‌పై కేవలం 21 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. నాటి నుంచి వెనక్కు తిరిగి చూసుకోని సందీప్.. 2017లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో నాటి స్టార్ క్రికెటర్లు క్రిస్ గేల్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ భరతం పట్టాడు. ఈ ముగ్గురు దిగ్గజ క్రికెటర్లను ఓ మ్యాచ్‌లో ఒకే బౌలర్ ఔట్ చేయడం అదే తొలిసారి. ఇక్కడ మరో ఆసక్తికర విషయమేంటంటే.. సందీప్ శర్మ, ఐపీఎల్లో విరాట్ కోహ్లిని ఏకంగా 7 సార్లు ఔట్ చేశాడు. ఐపీఎల్లో ఏ బౌలర్ కూడా కోహ్లిని ఇన్ని పర్యాయాలు ఔట్ చేయలేదు. నెహ్రా 6, బుమ్రా 4 సార్లు కోహ్లిని పెవిలియన్‌కు పంపారు. ఐపీఎల్లో సందీప్ బౌలింగ్‌లో 72 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. కేవలం 55 పరుగులు మాత్రమే చేసి ఏడు సార్లు ఔటయ్యాడు. ఐపీఎల్లో ఓ బౌలర్‌కు వ్యతిరేకంగా కోహ్లికి ఇవి చెత్త గణాంకాలుగా రికార్డయ్యాయి. -
ఐపీఎల్ 2023 ముందు.. ఆ ముగ్గురికి గుడ్‌బై చెప్పనున్న పంజాబ్ కింగ్స్ ..!
ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్ ప్రయాణం లీగ్ దశలోనే ముగిసిన సంగతి తెలిసిందే. నూతన సారథిగా బాధ్యతలు చేపట్టిన మయాంక్ అగర్వాల్ జట్టును నడిపించడంలో విఫలమ్యాడు. ఈ ఏడాది సీజన్లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించిన పంజాబ్.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పరిమితమైంది. ఈ ఏడాది సీజన్లో నిరాశ పరిచిన ఆటగాళ్లను ఐపీఎల్-2023కు ముందు పంజాబ్ కింగ్స్ విడుదల చేసే అవకాశం ఉంది. ఓడియన్ స్మిత్ వెస్టిండీస్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్‌ను మెగా వేలంలో రూ.6 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. అయితే స్మిత్ పంజాబ్ భారీ అంచనాలు పెట్టుకుంది. అయితే పంజాబ్ అంచనాలను అందుకోవడంలో స్మిత్ విఫలమయ్యాడు. అతడు తన పేలవ ప్రదర్శనతో తుది జట్టులో తన చోటును కోల్పోయాడు. ఈ ఏడాది సీజన్లో 6 మ్యాచ్‌లు ఆడిన అతడు 6 వికెట్లతో పాటు,51 పరుగులు సాధించాడు. బౌలింగ్‌లో 11.87 ఏకానమీ రేటుతో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో వచ్చే ఏడాది సీజన్‌కు అతడి స్థానంలో నాణ్యమైన ఆల్‌రౌండర్‌ను తీసుకోవాలని పంజాబ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సందీప్ శర్మ ఐపీఎల్లో అనుభవజ్ఞుడైన సందీప్ శర్మను మెగా వేలంలో రూ.50లక్షలకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. అయితే ఈ సీజన్లో సందీప్ శర్మ పూర్తిగా విఫలమయ్యాడు. 5 మ్యాచ్‌లు ఆడిన సందీప్ కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. సందీప్ శర్మకు పంజాబ్ పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. ఎందుకంటే అతడు ఆడిన తొలి మ్యాచ్‌లోనే భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. గత రెండు సీజన్ల నుంచి అతడు అంతగా రాణించలేకపోతున్నాడు. అయితే పంజాబ్ జట్టులో కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్ వంటి ఫ్రంట్ లైన్ పేసర్లుగా ఉన్నారు. మరో వైపు ఆల్‌రౌండర్ రిషి ధావన్‌ను మూడవ పేసర్‌గా పంజాబ్ ఉపయోగించుకుంటుంది. దీంతో వచ్చే ఏడాది సీజన్‌కు ముందు సందీప్ శర్మను పంజాబ్ విడిచి పెట్టే అవకాశం ఉంది. ప్రభ్సిమ్రాన్ సింగ్ ఐపీఎల్- 2022 మెగా వేలంలో మరోసారి యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ప్రభ్సిమ్రాన్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. జానీ బెయిర్ స్టో, జితేష్ శర్మ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లు ఉండటంతో ప్రభ్సిమ్రాన్ సింగ్‌కు పెద్దగా అవకాశాలు దక్కలేదు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌కు దూరం కావడంతో ప్రభ్‌సిమ్రాన్‌కు ఆ మ్యాచ్‌లో అవకాశం దక్కింది. అయితే ఈ మ్యాచ్‌లో ప్రభ్సిమ్రాన్ కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. జట్టుకు ఇప్పటికే ఇద్దరు వికెట్ కీపర్లు ఉండటంతో వచ్చే ఏడాది సీజన్‌కు ముందు ప్రభ్సిమ్రాన్ను పంజాబ్ విడిచి పెట్టేందుకు సిద్దమైనట్లు సమాచారం. చదవండి: IPL 2022: 'మా జట్టు ప్లేఆఫ్స్ చేరకపోవడం సిగ్గుగా అనిపించింది' -
డికాక్ నిజాయితీని మెచ్చుకొని తీరాల్సిందే!
డీఆర్ఎస్ రూల్ వచ్చాకా ఔట్ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. బ్యాటింగ్ జట్టుకు.. బౌలింగ్ జట్టుకు ఔట్‌పై ఏ మాత్రం సందేహం ఉన్నా వెంటనే రివ్యూకు వెళ్లిపోతున్నారు. కానీ ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వకున్నా బ్యాట్స్‌మన్ తనంతట తానే క్రీజు విడిచి వెళ్లడం అరుదుగా చూస్తున్నాం. తాజాగా ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో అలాంటిదే చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 13వ ఓవర్ సందీప్ శర్మ వేశాడు. ఆ ఓవర్లో సందీప్ వేసిన ఒక బంతి డికాక్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకుతూ కీపర్ జితేశ్ చేతిలో పడింది. పంజాబ్ ఆటగాళ్లు ఔట్‌కు అప్పీల్ చేసినప్పటికి ఫీల్డ్ అంపైర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే డికాక్ మాత్రం తాను ఔట్ అంటూ క్రీజు వీడాడు. ఈ నేపథ్యంలో పెవిలియన్ వెళ్తున్న డికాక్ నిజాయితీని సందీప్ శర్మ మెచ్చుకుంటూ అతని భుజాన్ని తట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Venkatesh Iyer: అప్పుడు హీరోలా కనిపించాడు; ఇప్పుడు విలన్.. ఎందుకిలా! pic.twitter.com/tzk1o22hAf — Vaishnavi Sawant (@VaishnaviS45) April 29, 2022 -
ఇంటివాడైన సన్‌రైజర్స్ బౌలర్ సందీప్ శర్మ
Sandeep Sharma Marriage.. టీమిండియా ఆటగాడు.. సన్‌రైజర్స్ హైదరబాద్ బౌలర్ సందీప్ శర్మ ఒక ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు తాషా సాత్విక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా సన్‌రైజర్స్ యాజమాన్యం సందీప్‌కు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. సందీప్.. అతని భార్య తాషా సాత్విక్ పెళ్లి ఫోటోను షేర్ చేస్తూ.. ''ఎస్ఆర్హెచ్ ఫ్యామిలీకి పెళ్లి కళ వచ్చింది. కంగ్రాట్స్ మిస్టర్ అండ్ మిసెస్ సందీప్ శర్మ.. మీ దాంపత్య జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాం'' అంటూ ట్వీట్ చేసింది. కాగా తాషా సాత్విక్ వృత్తిరిత్యా ఫ్యాషన్,నగల డిజైనర్‌గా పనిచేస్తున్నారు. 2018లోనే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయినప్పటికీ.. కరోనా కారణంగా వీరి పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా సందీప్ శర్మకు అభిమానులు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇక సందీప్ శర్మ 2013 నుంచి ఐపీఎల్లో ఆడుతున్నాడు. ఇప్పటివరకు 95 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన సందీప్ శర్మ 110 వికెట్లు తీశాడు. 2013 నుంచి 2017 వరకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ఆడిన సందీప్ ఆ తర్వాత 2018 నుంచి సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు. ఇక జూలై 17, 2015లో జింబాబ్వేతో జరిగిన T20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. చదవండి: రనౌట్ కోసం థర్డ్ అంపైర్‌కు అప్పీల్; స్క్రీన్‌పై మ్యూజిక్ ఆల్బమ్ (ఫోటో గేలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) A special addition to the #SRHFamily.😍 Congratulations to Mr and Mrs Sharma 🙌🏽 🥂 to a lifelong partnership!#OrangeOrNothing #OrangeArmy pic.twitter.com/gQcLsX9nIL — SunRisers Hyderabad (@SunRisers) August 20, 2021 -
బుమ్రా కంటే ‘ఎక్కువే’.. కానీ
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో అత్యంత గుర్తింపు పొందిన బౌలర్లలో సన్‌రైజర్స్ పేసర్ సందీప్ శర్మ ఒకడు. మొత్తం 11 మ్యాచ్‌లకు గాను 13 వికెట్లు సాధించాడు. ఓవరాల్‌గా 44 ఓవర్లు వేసి 323 పరుగులిచ్చాడు. దాంతో అతని ఎకానమీ 7.34గా నమోదైంది. ఈ సీజన్ అత్యుత్తమ ఎకానమీ నమోదు చేసిన ఆరో బౌలర్‌గా సందీప్ కొనసాగుతున్నాడు ఐపీఎల్ చరిత్రలో కోహ్లిని ఏడోసారి ఔట్ చేసిన రికార్డును సందీప్ సాధించాడు. దాంతో ఐపీఎల్ చరిత్రలో కోహ్లిని అత్యధిక సార్లు ఔట్ చేసిన రికార్డును సందీప్ తన పేరిట లిఖించుకున్నాడు.. సందీప్ శర్మ తనకు వచ్చిన అవకాశాల్ని వినియోగించుకుంటూ ముందుకు వెళుతున్నా అతనికి రావాల్సిన పేరు రాలేదు. టీమిండియా జట్టులో సందీప్ తక్కువ అంచనా వేయబడ్డాడు అనే మాట ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. అది నిజమేనని అతని బౌలింగ్ గణాంకాలు చూస్తే అర్థమవుతోంది. ఆరెంజ్ ఆర్మీ ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయంతో దూరమవడంతో అవకాశం అదుకున్న సందీప్.. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు.ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా సందీప్ చెలరేగాడు. రోహిత్ శర్మ, క్వింటన్ డీకాక్, ఇషాన్ కిషాన్‌లను ఔట్ చేసిన విధానం శభాష్ అనిపించింది. ఇందులో వరుస సిక్సర్లతో దూకుడు కనబర్చిన డీకాక్‌ను క్లీన్ బౌల్డ్ చేయడం మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ సీజన్లో అందరి దృష్టిని ఆకర్షించిన సందీప్ శర్మ.. టీమిండియా యార్కర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా కంటే ఎక్కువ వికెట్లు తీయడం, ఐపీఎల్ కెరీర్ గణంకాలు కూడా ఇద్దరివి దాదాపు దగ్గరగా ఉండటం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఇన్నాళ్లు సందీప్‌ను సరిగా గుర్తించలేదా? అనే సందేహం కలుగుతుంది. ఇక బుమ్రా, సందీప్ ఒకే ఏడాది 2013లో ఐపీఎల్లో అరంగేట్రం చేయగా.. ఇప్పటి వరకు ఇద్దరూ 90 మ్యాచ్‌లు ఆడారు. సందీప్ 24.02 సగటు, 7.75 ఎకానమీతో 108 వికెట్లు తీయగా.. బుమ్రా కూడా 24.22 సగటు 7.46 ఎకానమీతో 105 వికెట్లు మాత్రం తీసాడు. ఇక సందీప్ స్ట్రైక్ రేట్ 18.6 ఉండగా.. బుమ్రాది 19.4 ఉంది. ఇద్దరి గణాంకాలు సరిసమానంగా ఉన్నప్పటికీ పేరు విషయంలో బుమ్రా కంటే చాలా దూరంలో ఉన్నాడు సందీప్. బుమ్రా జాతీయ జట్టులో ప్రధాన బౌలర్‌గా మారిపోతే సందీప్ మాత్రం కేవలం రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. సందీప్ బౌలింగ్‌లో తగినంత పేస్ లేకపోవడమే అతన్నిపరిగణలోకి తీసుకోలేకపోవడనాకి ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. స్లో బౌలింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడే సందీప్.. అందరి దృష్టిని ఆకర్షించడంలో విఫలమవుతున్నాడని వారి అభిప్రాయం. సందీప్ తన కెరీర్లో 2015లో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసి రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఆపై అతనికి మళ్లీ అవకాశం దక్కలేదు.ఈ ఐపీఎల్ అయినా సందీప్ రీఎంట్రీకి దోహదం చేస్తుందో లేదో చూడాలి. -
సూపర్ సన్దీప్.. బెంగళూరు విలవిల
హైదరాబాద్ ప్లే ఆఫ్స్ దారిలో పడింది. ముందుకెళ్లాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సీమర్ సందీప్ శర్మ (2/20) చెలరేగి బెంగళూరు పని పట్టాడు. మరోవైపు కోహ్లి సేన ‘హ్యాట్రిక్’ పరాజయాలతో 14 పాయింట్ల దగ్గరే ఆగిపోయింది. ఇప్పటికైతే రెండో స్థానంలో ఉన్నప్పటికీ ఆఖరి మ్యాచ్ ఫలితంపైనే ఆర్సీబీ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. షార్జా: వారెవ్వా సన్‌రైజర్స్... ఈ మ్యాచ్ టాస్ వేయక ముందు పాయింట్ల పట్టికలో హైదరాబాద్ ఏడో స్థానంలో ఉంది. హోల్డర్ సిక్సర్‌తో విన్నింగ్ షాట్ కొట్టగానే టాప్‌లో నాలుగో స్థానానికి వచ్చేసింది. ఈ ఫలితం జట్టు రాతను ఇంతలా మార్చేసింది. ప్లేఆఫ్స్‌కు చేరువ చేసింది. శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 120 పరుగులు చేసింది. ఫిలిప్ (31 బంతుల్లో 32; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సందీప్ శర్మ (2/20) బెంగళూరును కోలుకోలేనంత దెబ్బతీశాడు. తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ 14.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ సాహా (32 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, చివర్లో జేసన్ హోల్డర్ (10 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్) ధనాధన్‌గా ముగించేశాడు. కోహ్లి విఫలం... టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వార్నర్ నిర్ణయానికి సీమర్ సందీప్ శర్మ న్యాయం చేశాడు. అతని దెబ్బకు బెంగళూరు ఆట ప్రారంభమైన మూడో ఓవర్లో కష్టాల్లో పడింది. మ్యాచ్ సాగే కొద్దీ ఆ కష్టాల్లోనే చిక్కుకుపోయింది. సందీప్ శర్మ లైన్ అండ్ లెంత్‌తో బౌలింగ్ చేసి తొలి ఓవర్లో మూడే పరుగులిచ్చాడు. తన రెండో ఓవర్ (ఇన్నింగ్స్ 3వ)లో ఫామ్‌లో ఉన్న దేవ్‌దత్ పడిక్కల్ (5)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీన్నుంచి రాయల్ చాలెంజర్స్ తేరుకోక ముందే మరో దెబ్బ తీశాడు. సందీపే తన మరుసటి ఓవర్లో కెప్టెన్ కోహ్లి (7)ని కూడా అవుట్ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 28/2. ఇక తర్వాత ఏబీ డివిలియర్స్ (24 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్) వచ్చినా, మోరిస్ (3)) దిగినా, గుర్కీరత్ (24 బంతుల్లో 15 నాటౌట్)) అజేయంగా నిలిచినా చేసేదేమీ లేకపోయింది. ఆడేవారిని నిలువనీకుండా... నిలిచిన వారిని ఆడనీకుండా సన్‌రైజర్స్ బౌలర్లు చక్కగా కట్టడి చేశారు. ఆరంభం నుంచి అందరికంటే మెరుగ్గా ఆడుతున్న ఓపెనర్ ఫిలిప్ పెవిలియన్ చేరాక బెంగళూరు కష్టాలు రెట్టింపు అయ్యాయి. రషీద్‌ఖాన్ బౌలింగ్‌లో భారీషాట్‌కు ప్రయత్నించిన ఫిలిప్ డీప్ మిడ్వికెట్లో మనీశ్ చేతికి చిక్కాడు. వాషింగ్టన్ సుందర్ (18 బంతుల్లో 21; 2 ఫోర్లు), గుర్కీరత్ సింగ్ కాసేపు నిలబడటంతో 17వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది. సుందర్ అవుటయ్యాక సన్‌రైజర్స్ పేసర్ హోల్డర్... ఒకే ఓవర్లో హిట్టర్ మోరిస్ (3)తో పాటు ఉదన (0)ను ఔట్ చేయడంతో ఆఖరి మెరుపులు కరువయ్యాయి. డివిలియర్స్ క్యాచ్ వదిలేసినా... అప్పటికే పడిక్కల్, కోహ్లి అవుటయ్యారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ 4 పరుగుల వద్దే అవుట్ కావాల్సింది. నదీమ్ తన తొలి ఓవర్లోనే (ఇన్నింగ్ 7వ) ఆ అవకాశాన్ని జారవిడిచాడు. ఏడో ఓవర్ ఆఖరి బంతిని ఏబీ నేరుగా బౌలర్ దిశగా ఆడాడు. నదీమ్ ఆ రిటర్న్ క్యాచ్‌ను వదిలేశాడు. తిరిగి 3 ఓవర్ల తర్వాత తనే డివిలియర్స్‌ను పెవిలియన్ చేర్చాడు. ‘మిస్టర్ 360’ బ్యాట్స్‌మన్ ప్రమాదకరంగా మారకముందే అతన్ని 24 పరుగుల వద్ద అవుట్ చేయడంతో సన్‌రైజర్స్ ఊపిరి పీల్చుకుంది. దీంతో ఇన్నింగ్స్‌లోనే కాస్త మెరుగైన 43 పరుగుల భాగస్వామ్యం కూడా ముగిసింది. వార్నర్ అవుటైనా... స్వల్ప లక్ష్యఛేదనే అయినా... కెప్టెన్, ఓపెనర్ వార్నర్ (8) రెండో ఓవర్లోనే అవుటయ్యాడు. సుందర్ అతన్ని పెవిలియన్ చేర్చడంతో బెంగళూరు శిబిరంలో ఎక్కడలేని ఆనందాన్ని నింపింది. కానీ మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే (19 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) బెంగళూరు బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కోవడంతో బెంగళూరు ఆనందం అంతలోనే ఆవిరైంది. 5.2 ఓవర్లలో సన్‌రైజర్స్ స్కోరు 50 పరుగులకు చేరింది. తొలివికెట్‌కు సరిగ్గా 50 పరుగులు జోడించాక జట్టు స్కోరు 60 పరుగుల వద్ద ధాటిగా ఆడే ప్రయత్నంలో పాండే అవుటయ్యాడు. ఇతన్ని స్పిన్నర్ చహల్ పెవిలియన్ చేర్చాడు. విలియమ్సన్ జతకాగా కాసేపటికే కుదురుగా ఆడుతున్న సాహాను కూడా చహలే బోల్తా కొట్టించాడు. ఉదాన 13వ ఓవర్ తొలిబంతికి విలియమ్సన్ (8) అవుటయ్యాడు. 87 పరుగుల వద్ద నాలుగో వికెట్‌గా అతను వెనుదిరిగాడు. అప్పుడు సన్‌రైజర్స్ గెలిచేందుకు 34 పరుగుల దూరంలో ఉన్నా... బంతులు (48) బోలెడున్నాయి. అయితే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ తాలూకు కష్టాలు హైదరాబాద్ కళ్లముందు కదిలాయి. ఈ దశలో వరుసలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హోల్డర్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఉదన బౌలింగ్‌లోనే లాంగాన్‌లో సిక్స్ కొట్టాడు. తర్వాత సైనీ బౌలింగ్‌ను ఓ పట్టుపట్టాడు. హోల్డర్ 6, 4 కొట్టగా, అభిషేక్ శర్మ (8) మరో సిక్సర్ కొట్టి తర్వాత బంతిని కూడా సిక్సర్‌గా మలిచేందుకు భారీ షాట్ ఆడాడు. కానీ లాంగాఫ్‌లో గుర్కీరత్ చేతికి చిక్కాడు. 36 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన తరుణంలో చహల్ వేసిన 15వ ఓవర్ తొలి బంతినే సిక్సర్‌గా తరలించి మ్యాచ్‌ను హోల్డర్ ఎంతో ముందుగానే ముగించేశాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: ఫిలిప్ (సి) పాండే (బి) రషీద్ ఖాన్ 32; దేవదత్ (బి) సందీప్ 5; కోహ్లి (సి) అభిషేక్ (బి) నదీమ్ 24; సుందర్ (సి అండ్ బి) నటరాజన్ 21; గురుకీరత్ సింగ్ (నాటౌట్) 15; మోరిస్ (సి) వార్నర్ (బి) హోల్డర్ 3; ఉదాన (సి) విలియమ్సన్ (బి) హోల్డర్ 0; సిరాజ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 120. వికెట్ల పతనం: 1–13, 2–28, 3–71, 4–76, 5–106, 6–113, 7–114. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–20–2, హోల్డర్ 4–0–27–2, నటరాజన్ 4–0–11–1, నదీమ్ 4–0–35–1, రషీద్ ఖాన్ 4–0–24–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) ఉదాన (బి) సుందర్ 8; సాహా (స్టంప్డ్) డివిలియర్స్ (బి) చహల్ 39; మనీశ్ పాండే (సి) మోరిస్ (బి) చహల్ 26; విలియమ్సన్ (సి) కోహ్లి (బి) ఉదాన 8; అభిషేక్ శర్మ (సి) గురుకీరత్ (బి) సైనీ 20; హోల్డర్ (నాటౌట్) 26; సమద్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (14.1 ఓవర్లలో 5 వికెట్లకు) 121. వికెట్ల పతనం: 1–10, 2–60, 3–82, 4–87, 5–114. బౌలింగ్: మోరిస్ 2–0–19–0, సుందర్ 3–0–21–1, సైనీ 2–0–30–1, సిరాజ్ 1–0–12–0, చహల్ 3.1–0–19–2, ఉదాన 3–0–20–1. -
సన్‌రైజర్స్ గెలిచి నిలిచింది..
షార్జా: ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 121 పరుగుల టార్గెట్‌ను ఆరెంజ్ ఆర్మీ 14.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలవడంతో ప్లేఆఫ్ ఆశల్ని ఇంకా సజీవంగా ఉంచుకుంది. వృద్ధిమాన్ సాహా( 39; 32 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో పాటు మనీష్ పాండే(26; 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), హోల్డర్(26 నాటౌట్; 10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఆకట్టుకోవడంతో సన్‌రైజర్స్ సునాయాసంగా విజయాన్ని కైవసం చేసుకుంది. ఇది సన్‌రైజర్స్ ఆరో విజయం కాగా, పాయింట్ల పట్టికలో నాల్గో స్థానానికి ఎగబాకింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలిస్తే ప్లేఆఫ్ బెర్తుకు ఢోకా ఉండదు.(సందీప్ రికార్డు బౌలింగ్..కోహ్లి మరో ‘సారీ’) సాధారణ లక్ష్య ఛేదనలో ఆదిలోనే సన్‌రైజర్స్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్, కెప్టెన్ డేవిడ్ వార్నర్(8) నిరాశపరిచాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన రెండో ఓవర్ రెండో బంతికి వార్నర్ ఔటయ్యాడు. ఆ తరుణంలో సాహాకు మనీష్ జత కలిశాడు.వీరిద్దరూ 50 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత మనీష్ ఔటయ్యాడు. చాహల్ బౌలింగ్‌లో క్రిస్ మోరిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. విలియమ్సన్(8) విఫలమయ్యాడు. ఉదాన బౌలింగ్‌లో విలియమ్సన్ ఔటైన క్రమంలో సన్‌రైజర్స్‌లో ఆందోళన మొదలైంది. కాగా, హోల్డర్ మ్యాచ్‌ను గట్టెక్కించాడు. అభిషేక్ శర్మ(8; 5 బంతుల్లో 1 సిక్స్)తో కలిసి 27 పరుగులు జత చేయడంతో సన్‌రైజర్స్ ఒత్తిడి క్లియర్ అయ్యింది. ఆర్సీబీ బౌలర్లలో చహల్ రెండు వికెట్లు సాధించగా, వాషింగ్టన్ సుందర్, సైనీ, ఉదానాలకు తలో వికెట్ లభించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 120 పరుగులు చేసింది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఆర్సీబీ బ్యాటింగ్‌కు దిగింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను జోష్ ఫిలెప్పి-దేవదూత్ పడిక్కల్‌లు ఆరంభించారు. అయితే ఆర్సీబీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సందీప్ శర్మ వేసిన మూడో ఓవర్ ఐదో బంతికి పడిక్కల్(5) బౌల్డ్ అయ్యాడు. అనంతరం విరాట్ కోహ్లి(7) కూడా నిరాశపరిచాడు. సందీప్ శర్మ వేసిన మరో ఓవర్లో విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి కోహ్లి ఔటయ్యాడు. ఆ తరుణంలో ఫిలెప్పి- ఏబీ డివిలియర్స్‌లు ఇన్నింగ్స్ చక్కదిద్దే యత్నం చేశారు. ఈ జోడి 43 పరుగులు జత చేసిన తర్వాత డివిలియర్స్(24) పెవిలియన్ చేరాడు. నదీమ్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ క్యాచ్ పట్టడంతో ఏబీ ఇన్నింగ్స్ ముగిసింది. కాసేపటికి ఫిలెప్పి((32) కూడా ఔట్ కావడంతో ఆర్సీబీ 76 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వాషింగ్టన్ సుందర్(21) ఫర్వాలేదనిపించడంతో ఆర్సీబీ వంద పరుగుల మార్కును దాటింది. క్రిస్ మోరిస్(3), ఇసురు ఉదాన(0)లను ఒకే ఓవర్లో హోల్డర్ ఔట్ చేయడంతో ఆర్సీబీ సాధారణ స్కోరుకే పరిమితమైంది. సన్‌రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ, హోల్డర్లు చెరో రెండు వికెట్లు సాధించగా, నటరాజన్, నదీమ్, రషీద్‌ఖాన్‌లు తలో వికెట్ తీశారు. -
సందీప్ రికార్డు బౌలింగ్..కోహ్లి మరో ‘సారీ’
షార్జా: సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ సందీప్ శర్మ రికార్డు సాధించాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి(7) ఔట్ చేయడం ద్వారా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. సందీప్ శర్మ వేసిన ఐదో ఓవర్ నాల్గో బంతికి విలియమ్సన్ క్యాచ్ పట్టడంతో కోహ్లి పెవిలియన్ చేరాడు. అయితే ఐపీఎల్ చరిత్రలో కోహ్లిని ఏడోసారి ఔట్ చేసిన రికార్డును సందీప్ సాధించాడు. ఇది ఐపీఎల్లో కోహ్లిని అత్యధిక సార్లు ఔట్ చేసిన రికార్డును సందీప్ తన పేరిట లిఖించుకున్నాడు. అంతకుముందు ఐపీఎల్లో అత్యధిక సార్లు కోహ్లిని ఔట్ చేసిన రికార్డును సమం చేసిన సందీప్.. దాన్ని తాజాగా అధిగమించాడు. (‘శ్రేయస్ అయ్యర్ గ్యాంగ్‌కు ప్లేఆఫ్స్ చాన్స్ కష్టమే’) ఐపీఎల్లో కోహ్లిని ఆరుసార్లు ఔట్ చేసిన బౌలర్ ఆశిష్ నెహ్రా. ఇప్పుడు నెహ్రాను అధిగమించాడు సందీప్. ఐపీఎల్లో కోహ్లిని అత్యధిక సార్లు ఔట్ చేసిన జాబితాలో సందీప్, నెహ్రాల తర్వాత స్థానంలో మిచెల్ మెక్లీన్గన్, మహ్మద్ షమీలు ఉన్నారు. వీరిద్దరూ తలో మూడుసార్లు కోహ్లిని ఔట్ చేశారు. ఇక ఐపీఎల్లో ఒక ఆటగాడ్ని అత్యధిక సార్లు ఔట్ చేసిన జాబితాలో జహీర్‌ఖాన్‌తో కలిసి సందీప్ శర్మ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనిని జహీర్‌ఖాన్ అత్యధికంగా ఏడుసార్లు ఔట్ చేశాడు. సన్‌రైజర్స్‌తో తాజా మ్యాచ్‌లో ఆర్సీబీ 120 పరుగులే చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లు విజృంభించి బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ సాధారణ స్కోరుకే పరిమితమైంది. -
గర్ల్‌ఫ్రెండ్‌తో సందీప్ శర్మ నిశ్చితార్థం!
పాటియాలా: సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ సందీప్ శర్మ త్వరలో ఇంటివాడు కాబోతున్నాడు. తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని సందీప్ శర్మ తాజాగా వెల్లడించాడు. ఈ మేరకు తన కాబోయే భార్య దిగిన ఫొటోను సందీప్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్ పేరు తాషా సాత్విక్‌గా సందీప్ తెలిపాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తాషా.. తరచుగా సందీప్‌ను అభినందిస్తూ ట్వీట్లు చేస్తుంది. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. గతంలో కింగ్స్ పంజాబ్ తరపున సందీప్ ఆడే క్రమంలో.. తాషా తన ప్రేమను వ్యక్త పరిచినట్లు సమాచారం. అందుకు సందీప్ కూడా అంగీకారం తెలపడంతో ఎట్టకేలకు ఈ జంట కలిసి జీవితాన్ని పంచుకునేందుకు మార్గం సుగమైంది. గతేడాది వరకు కింగ్స్ ఎలెవన్ తరఫున సత్తా చాటిన సందీప్ శర్మ.. ఈ సీజన్ సన్‌రైజర్స్ తరఫున బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. -
ఆ జర్నలిస్ట్ హత్యకు ఎవరు బాధ్యులు?
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం జర్నలిస్ట్ సందీప్ శర్మ (35) హత్య లేదా యాక్సిడెంట్ మృతిపై ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. తన ప్రాణాలతోపాటు తన స్టింగ్ ఆపరేషన్‌లో తనకు సహకరించిన సహచరుడు వికాస్ పురోహిత్ ప్రాణాలకు ముప్పు ఉందని, తమకు రక్షణ కల్పించాలంటూ సందీప్ శర్మ రాష్ట్ర సీనియర్ పోలీసు అధికారులతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు లేఖలు రాసినా వారు స్పందించలేదు. తగిన రక్షణ కల్పించలేదు. ఫలితంగా భిండ్‌లో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు సందీప్ శర్మను ట్రక్కు రూపంలో వచ్చిన మత్యువు కబళించుకుపోయింది. ‘సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్ ఇంద్ర వీర్ సింగ్ భడౌరియా బలమైన మనిషి, ఆయనకు స్థానిక నేరస్థులతో సంబంధాలు ఉన్నాయి. ఆయన నన్ను తప్పుడు కేసుల్లో ఇరికించవచ్చు. లేదా హత్య చేసి యాక్సిడెంట్‌గా చూపించవచ్చు. నాకు స్టింగ్ ఆపరేషన్‌లో సహకరించిన వికాస్ పురోహిత్‌కు తగిన రక్షణ కల్పించండి’ అంటూ సందీప్ శర్మ సీనియర్ పోలీసు అధికారులకు లేఖలు రాశారు. అందులో ఓ లేఖను భిండ్ పోలీస్ సూపరిండెండెంట్ కార్యాలయం నవంబర్ 3వ తేదీన అందుకుంది. దానిపై తేదీ ముద్ర కూడా ఉంది. ఆ లేఖలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు లేఖా ప్రతులు పంపుతున్నట్టు పేర్కొని ఉంది. ఆ తర్వాత నవంబర్ 16వ తేదీన ఆయనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ స్థానిక జర్నలిస్టులు ఎస్పీకి విడిగా లేఖలు రాశారు. సందీప్‌పై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వాటిని జాగ్రత్తగా పరిశీలించాలని కూడా వారు వాటిలో కోరారు. నేషనల్ ఛంబల్ సాంక్చరీ నుంచి అక్రమంగా ఇసుక రవాణాను అనుమతించేందుకు ఇంద్రవీర్ సింగ్ తన నివాసంలో ఇసుక మాఫియా నుంచి 12.500 రూపాయలు తీసుకుంటుండగా సందీప్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా రికార్డు చేశారు. ఆ వీడియో గతేడాది ‘న్యూస్ వరల్డ్’ ఛానల్లో అక్టోబర్ నెలలో ప్రసారం కావడంతో ఉన్నతాధికారులు ఆ అధికారిని అక్కడి నుంచి బదిలీ చేశారు. వీడియో ప్రసారానికి ముందే, ప్రసారాన్ని అడ్డుకునేందుకు ఓ కవర్లో కొంత డబ్బు పెట్టి పోలీసు అధికారి ఇంద్రవీర్ సింగ్, సందీప్‌కు పంపించారని, దాన్ని ఆయన తిరస్కరించారని, ఈ రోజున ఇంత ఘోరం జరిగిపోయిందని పురోహిత్ మంగళవారం భిండ్ ప్రెస్‌క్లబ్ వద్ద వ్యాఖ్యానించారు. సందీప్ హత్యను స్థానిక పోలీసులు నిర్లక్ష్యం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంగానే నమోదు చేశారు. ఈ కేసులో ట్రక్కును నడిపిన రణవీర్ యాదవ్ అనే లారీ క్లీనర్‌ను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎడమ వైపు తన లారీని మలుపు తిప్పగానే ఎదురుగా ఓ మహిళా అడ్డుగా వచ్చిందని, ఆ మహిళను తప్పించబోయి ట్రక్కును మరింత ఎడమకు తిప్పగా ఎడమ నుంచే వస్తున్న సందీప్ బైక్‌కు తగిలి ఉంటుందని రణవీర్ యాదవ్ వివరించారు. సందీప్ బైక్‌ను ఢీకొట్టిన విషయాన్ని కూడా తాను గుర్తించలేనని చెప్పారు. క్లీనర్‌గా ఉన్న వ్యక్తి ట్రక్కును ఎందుకు నడపాల్సి వచ్చిందంటే నడపడంలో తనకు అనుభవం ఉంది కనుక నడిపానని తెలిపారు. టీవీలు ప్రసారం చేసిన యాక్సిడెంట్ ఫుటేజ్ కూడా అనుమానాస్పదంగానే ఉంది. సందీప్ ఎలా మరణించారన్న విషయాన్ని పక్కన పెడితే ఆయన, తోటి జర్నలిస్టులు ఉన్నతాధికారులకు అన్ని లేఖలు రాసినా వారు ఎందుకు స్పందించలేదన్నది సమాధానం లేని ప్రశ్న. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు కచ్చితంగా సమాధానం కావాలంటూ సందీప్ నివాళి ర్యాలీలో తోటి జర్నలిస్టులు డిమాండ్ చేశారు. -
సందీప్ శర్మపై జరిమానా
మొహాలీ: అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకుగాను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేసర్ సందీప్ శర్మ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. ఆదివారం గుజరాత్ లయన్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఇన్నింగ్స్ ఐదోఓవర్లో సందీప్ శర్మ వేరే ఎండ్ నుంచి అంటే రౌండ్ ది వికెట్ నుంచి బౌలింగ్ చేశాడు. ఈ మార్పును తనకు తెలియపర్చలేదని భావించిన అంపైర్ దాన్ని నో బాల్‌గా ప్రకటించాడు. దీనిపై సందీప్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అనంతరం జట్టు కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా సందీప్‌కు మద్దతు పలికాడు. దీంతో ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని సందీప్ అతిక్రమించాడని నిర్ధారించిన మ్యాచ్రిఫరీ ఈ మేరకు జరిమానా విధించాడు. -
‘కింగ్స్’ బౌలర్‌కు షాక్.
-
‘కింగ్స్’ బౌలర్‌కు షాక్
మొహాలీ: ఐపీఎల్ మ్యాచ్‌లో అంఫైర్‌తో వాగ్వాదానికి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ బౌలర్ సందీప్ శర్మపై చర్య తీసుకున్నారు. అతడికి మ్యాచ్ రిఫరీ జరిమానా విధించారు. సందీప్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పెట్టారు. గుజరాత్ లయన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ నంద కిశోర్‌తో అతడు వాదులాటకు దిగాడు. ఇషాన్ కిషాన్ బ్యాటింగ్ చేస్తుండగా తాను వేసిన బంతిని అంపైర్ నోబాల్‌గా ప్రకటించి ఫ్రీ హిట్ సిగ్నల్ ఇచ్చాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంపైర్‌తో సందీప్ వాగ్వాదానికి దిగాడు. అతడికి కింగ్స్ కెప్టెన్ మ్యాక్స్‌వెల్ కూడా తోడయ్యాడు. ఓవర్ ముగిసిన తర్వాత అంపైర్ చేతిలోని తన క్యాప్‌ను కోపంగా లాక్కుని వెళ్లిపోయాడు సందీప్. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలో లెవల్వన్ అతిక్రమణ కింద మ్యాచ్ రిఫరీ అతడిపై చర్య తీసుకున్నారు. -
సందీప్ శర్మదే ఆ రికార్డు : సెహ్వాగ్
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఆర్డర్ నడ్డి విరిచి విజయాన్ని అందించిన కింగ్స్ పంజాబ్ బౌలర్ సందీప్ శర్మ పై ఆ జట్టు మెంటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. ఇక్కడ శుక్రవారం చిన్న స్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో బెంగళూరుపై కింగ్స్ పంజాబ్ 19 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో సందీప్ శర్మ బెంగళూరు కీలక బ్యాట్స్ మెన్స్ విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ ల వికెట్లు పడగొట్టి ఐపీఎల్ లో ఒకే మ్యాచ్ లో ఈ ముగ్గురిని అవుట్ చేసిన తొలి బౌలర్ గా రికార్డు నమోదు చేశాడు. తొలి ఓవర్లో గేల్ ను డక్ అవుట్ చేయగా, తరువాతి ఓవర్ లో విరాట్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులో కి వచ్చిన డివిలియర్స్ వరుస బౌండరీలతో దూకుడు గా ఆడాడు. ఇక సందీప్ శర్మ తన మూడో ఓవర్ లో డివిలియర్స్ ను పెవిలియన్ కు పంపించాడు. బెంగళూరు టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో పంజాబ్ సునాయసంగా గెలవగలిగింది. ప్రతి విషయంపై ట్వీటర్ లో తన ట్వీట్ లతో వ్యంగ్యంగా స్పందించే వీరేంద్ర సేహ్వాగ్ తమ జట్టు బౌలర్ అద్భుత ప్రదర్శన కనబర్చడంతో అతన్నిపొగడ్తలతో ముంచెత్తాడు. ' గొప్ప ప్రదర్శనతో సందీప్ ఒకే మ్యాచ్ లో కోహ్లీ, గేల్, ఏబీడిలను అవుట్ చేసిన తొలి బౌలర్ గా గుర్తింపు పొందాడు. ఇక అక్సర్ పటేల్ బ్రిలియంట్ అని పంజాబ్ జట్టుకు అభినందనలు తెలుపుతూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. Great performance by Sandeep to become the 1st man to get all Gayle,Virat,ABD in a match .Axar Patel was brilliant. Congratulations Team ! — Virender Sehwag (@virendersehwag) 5 May 2017 -
ఢిల్లీ బెంబేలు..
►67 పరుగులకే డేర్‌డెవిల్స్ ఆలౌట్ ►నిప్పులు చెరిగిన సందీప్ ►పంజాబ్ చేతిలో పది వికెట్లతో ఢిల్లీ పరాజయం ►గప్టిల్ మెరుపులు మొహాలీ: 67 పరుగులు... అత్యధిక వ్యక్తిగత స్కోరు కాదు! ఢిల్లీ డేర్‌డెవిల్స్ అందరి స్కోరు!! ఫలితం చెప్పనక్కర్లేదు... పంజాబ్ చేతిలో పరాభవం. లీగ్‌లో వరుసగా ఐదో పరాజయం. ప్లే–ఆఫ్ ఆశలకు దూరమయ్యేందుకు... బెంగళూరు పంచన చేరేందుకు దగ్గరవుతోంది ఢిల్లీ డేర్‌డెవిల్స్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నిర్లక్ష్యాన్ని నిండుగా చూపించింది. 10 వికెట్ల పరాజయాన్ని చక్కగా చవిచూసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 17.1 ఓవర్లలో 67 పరుగులకే కుప్పకూలింది. తర్వాత సునాయాస లక్ష్యాన్ని పంజాబ్ 7.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. తన టి20 కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన పంజాబ్ బౌలర్ సందీప్ శర్మ (4/20)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇలా టపాకట్టేశారు... ఢిల్లీ పతనం ఆరో బంతితోనే మొదలైంది. పిచ్ పరిస్థితుల్ని చక్కగా ఆకళింపు చేసుకున్న కింగ్స్ బౌలర్ సందీప్ శర్మ నిప్పులు చెరిగాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌తోనే ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. మొదట బిల్లింగ్స్ (0)ను, ఆ తర్వాత తన రెండో ఓవర్లో సామ్సన్ (5), మూడో ఓవర్లో శ్రేయస్ అయ్యర్ (6)ను పెవిలియన్ పంపాడు. మరోవైపు అక్షర్ పటేల్ (2/22) కూడా ఓ చేయివేయడంతో ఢిల్లీ 33 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. కరుణ్ నాయర్ (11), మోరిస్ (2) అక్షర్ స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ వికెట్ల ఉత్పాతంలో వరుణ్ ఆరోన్ (2/3) కూడా జతకలవడంతో ఢిల్లీకి పరుగులు రావడమే గగనమైంది. ఏ ఒక్కరూ 20 పరుగులు చేయలేకపోయారు. కోరె అండర్సన్ (18)దే అత్యధిక స్కోరు... వెరసి ఢిల్లీ 67 ఆలౌట్. గప్టిల్ ముగించాడు... అలవోక లక్ష్యాన్ని ఛేదించేదుకు బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్లు గప్టిల్, హషీమ్ ఆమ్లా అజేయంగా ముగించారు. జట్టుకు 10 వికెట్ల ఘనవిజయాన్ని అందించారు. ముఖ్యంగా గప్టిల్ (27 బంతుల్లో 50 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఇతనికి అండగా హషీమ్ ఆమ్లా (20 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్) సహాయపాత్ర పోషించాడు. దీంతో కేవలం 7.5 ఓవర్లలోనే పంజాబ్ లక్ష్యాన్ని చేరుకుంది. ఈ సీజన్లో కింగ్స్‌కిది నాలుగో విజయం.