Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఒక అద్బుత విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. అయితే మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు అదృష్టం కూడా కలిసి వచ్చింది. 18వ ఓవర్లో గ్లెన్ పిలిప్స్ ఏడు బంతుల్లోనే మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 25 పరుగులతో విధ్వంసం సృష్టించి మ్యాచ్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌వైపు తిప్పాడు. కానీ మరుసటి బంతికే అతను ఔటవ్వడంతో మళ్లీ రాజస్తాన్ వైపు తిరిగింది.
కొంపముంచిన నోబాల్..
ఇక ఆఖరి ఓవర్లో ఎస్‌ఆర్‌హెచ్ విజయానికి 17 పరుగులు అవసరమైన దశలో సందీప్ శర్మ లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేశాడు. తొలి బంతికి రెండు పరుగులు రాగా.. రెండో బంతిని అబ్దుల్ సమద్ సిక్సర్ తరలించడంతో నాలుగు బంతుల్లో 9 పరుగులు అవసరం అయ్యాయి. ఇక మూడో బంతికి రెండు పరుగులు, నాలుగో బంతికి, ఐదో బంతికి సింగిల్స్ రావడంతో ఆఖరి బంతికి ఎస్‌ఆర్‌హెచ్‌కు ఐదు పరుగులు అవసరం అయ్యాయి.
సందీప్ ఆఖరి బంతి వేశాడు. సమద్ లాంగాఫ్ దిశగా గాల్లోకి లేపాడు. అక్కడే ఉన్న బట్లర్ క్యాచ తీసుకోవడంతో ఎస్‌ఆర్‌హెచ్ మరో ఓటమి ఎదురైంది అనుకునేలోపే ఊహించని ట్విస్ట్. అంపైర్ నోబాల్ అని ప్రకటించాడు. దీంతో ఒత్తిడిలో పడిన సందీప్ యార్కర్ వేయగా.. అబ్దుల్ సమద్ స్ట్రెయిట్‌సిక్స్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌కు మరిచిపోలేని విజయాన్ని అందించాడు. ఒక రకంగా మ్యాచ్ ఎస్‌ఆర్‌హెచ్ గెలవాలని రాసి పెట్టి ఉన్నట్లుంది. అందుకే ఎస్‌ఆర్‌హెచ్‌ను నోబాల్ రూపంలో అదృష్టం వరించింది.
This is the best league in the world and you can't change our minds 🔥
— JioCinema (@JioCinema) May 7, 2023
Congrats Samad, hard luck, Sandeep!#RRvSRH #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/phHD2NjyYI
Comments
Please login to add a commentAdd a comment