IPL 2023, RR Vs SRH: Glenn Phillips-Hitting 25 Runs-7 Balls Turning Point Of Game Gets SRH Win - Sakshi
Sakshi News home page

#GlennPhilips: మ్యాచ్‌ను మలుపు తిప్పిన గ్లెన్‌ పిలిప్స్‌

Published Sun, May 7 2023 11:37 PM | Last Updated on Mon, May 8 2023 11:22 AM

Glenn Phillips-Hitting 25 Runs-7Balls Turning Point Of Game Gets SRH Win - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో మరో ఆసక్తికర పోరు జరిగింది. టి20 క్రికెట్‌లో ఉండే అసలైన మజా ఎలా ఉంటుందో ఆదివారం ఎస్‌ఆర్‌హెచ్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ నిరూపించింది. ఆద్యంతం ఉ‍త్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి ఎస్‌ఆర్‌హెచ్‌ థ్రిల్లింగ్‌ విజయాన్ని నమోదు చేసింది. 215 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి బంతికి అందుకొని నాలుగు వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.

మలుపు తిప్పిన గ్లెన్‌ పిలిప్స్‌
ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌ మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పొచ్చు. అప్పటికే 174 పరుగులకు ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. ఎస్‌ఆర్‌హెచ్‌ విజయానికి 12 బంతుల్లో 41 పరుగులు కావాలి. దాదాపు గెలుపు అసాధ్యమనుకున్న దశలో  గ్లెన్‌ పిలిప్స్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడాడు. ఒక్క ఓవర్‌తో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌ను చీల్చి చెండాడిన పిలిప్స్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లతో పాటు ఒక బౌండరీ బాది మొత్తంగా 22 పరుగులు పిండుకున్నాడు. ఓవరాల్‌గా ఏడు బంతుల్లోనే మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 25 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఒకవేళ పిలిప్స్‌ ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడకపోయుంటే ఎస్‌ఆర్‌హెచ్‌కు మరో ఓటమి ఎదురయ్యేది. అందుకే మ్యాచ్‌ హీరో గ్లెన్‌ పిలిప్స్‌ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇ‍న్నాళ్లు హ్యారీ బ్రూక్‌ను నమ్ముకున్న ఎస్‌ఆర్‌హెచ్‌ ఇకనైనా గ్లెన్‌ పిలిప్స్‌కు అవకాశం ఇస్తుందేమో చూడాలి.

చదవండి: చహల్‌ చరిత్ర.. టీమిండియా తరపున తొలి బౌలర్‌గా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement