ఐపీఎల్ 2023లో మరో మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. పంజాబ్ కింగ్స్‌తో నిన్న (మే 8) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ చివరి బంతికి విజయం సాధించి, ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ సీజన్‌లో ఆఖరి బంతివరకు సాగిన మ్యాచ్‌ల్లో (6) ఇది వరుసగా రెండవది.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. కెప్టెన్ శిఖర్ ధవన్ (47 బంతుల్లో 57; 9 ఫోర్లు,సిక్స్), ఆఖర్లో షారుక్ ఖాన్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ (8 బంతుల్లో 12), లివింగ్‌స్టోన్ (9 బంతుల్లో 15), జితేశ్ శర్మ (18 బంతుల్లో 21), రిషి ధవన్ (11 బంతుల్లో 19), హర్ప్రీత్ బ్రార్ (9 బంతుల్లో 17 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. భానుక రాజపక్ష (0), సామ్ కర్రన్ (9 బంతుల్లో 4) విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, హర్షిత్ రాణా 2, సుయాశ్ శర్మ, నితీశ్ రాణా తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. జేసన్ రాయ్ (24 బంతుల్లో 38; 8 ఫోర్లు), నితీశ్ రాణా (38 బంతుల్లో 51; ఫోర్, సిక్స్), ఆండ్రీ రసెల్ (23 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్ 10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రహ్మానుల్లా గుర్భాజ్ (15), వెంకటేశ్ అయ్యర్ (11) రెండంకెల స్కోర్ చేశారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ 2, నాథన్ ఇల్లిస్, హర్ప్రీత్ బ్రార్ తలో వికెట్ పడగొట్టారు.
మొన్న ఫిలిప్స్.. నిన్న రసెల్.
ఛేదనలో కేకేఆర్ ఆరంభంలో దూకుడుగానే ఆడినప్పటికీ మధ్యలో స్కోర్ కాస్త నెమ్మదించడంతో మ్యాచ్ ఆఖరి బంతి వరకు సాగింది. మొన్న రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లు గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్‌లు ఏ పాత్ర అయితే పోషించారో.. నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్ ప్లేయర్స్ రసెల్, రింకూ సింగ్ కూడా అదే పాత్ర పోషించారు. క్లిష్ట సమయంలో ఫిలిప్స్ మెరుపు ఇన్నింగ్స్ (7 బంతుల్లో 25; ఫోర్, 3 సిక్సర్లు) ఆడి గెలుపుపై ఆశలు లేని ఎస్‌ఆర్‌హెచ్‌ను గేమ్‌లోకి తేగా.. ఆఖరి బంతికి అబ్దుల్ సమద్ (7 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు) సిక్సర్ బాది గెలిపించాడు.
ఇంచుమించు అలాగే పంజాబ్‌తో మ్యాచ్‌లో రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కేకేఆర్‌ను గెలుపు ట్రాక్‌లో పెడితే, రింకూ సింగ్ ఆఖరి బంతికి బౌండరీ బాది మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఫిలిప్స్ తరహాలోనే నిన్నటి మ్యాచ్‌లో రసెల్ కూడా 19వ ఓవర్‌లో శివాలెత్తిపోయాడు. ఆ మ్యాచ్‌లో ఫిలిప్స్.. కుల్దీప్ బౌలింగ్‌లో 3 సిక్సర్లు, ఓ ఫోర్ బాదితే.. నిన్నటి మ్యాచ్‌లో సామ్ కర్రన్ బౌలింగ్‌లో రసెల్ 3 సిక్సర్లతో విరుచుకుపడి, మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఫిలిప్స్, రసెల్ సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడకపోయుంటే రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్ధులు గెలిచేవారు. అలాగే సన్‌రైజర్స్, కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించేవి.
చదవండి: ఐపీఎల్‌లో ధావన్ అరుదైన రికార్డు.. కోహ్లి, వార్నర్ సరసన
Comments
Please login to add a commentAdd a comment