Abdul Samad
-
సన్‌రైజర్స్ వదిలేసింది. . కట్ చేస్తే! అక్కడ సిక్సర్ల వర్షం
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో జమ్మూ కాశ్మీర్ శుభరంభం చేసింది. ఈ టోర్నీలో భాగంగా ముంబై వేదికగా జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో జమ్మూ కాశ్మీర్ విజయం సాధించింది. 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జార్ఖండ్ 9 వికెట్లు కోల్పోయి 199 పరుగుల మాత్రమే చేయగల్గింది.జమ్మూ బౌలర్లలో అబిడ్ ముస్తాక్ 4 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు రషీక్ ధార్ సలీం, మురగన్ అశ్విన్ తలా రెండు వికెట్లు సాధించారు. జార్ఖండ్ బ్యాటర్లలో ఉత్క్రాష్ సింగ్(54), పంకజ్ కిషోర్ కుమార్(56) హాఫ్ సెంచరీలతో మెరిశారు. అయితే మిగితా ఆటగాళ్లు రాణించకపోవడంతో జార్ఖండ్ ఓటమి చవిచూసింది.అబ్దుల్ సమద్ విధ్వంసం..ఇక తొలుత బ్యాటింగ్ చేసిన జమ్మూ కాశ్మీర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ సాధించాడు. జమ్మూ బ్యాటర్లలో ఆల్‌రౌండర్ అబ్దుల్ సమద్ విధ్వంసం సృష్టించాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సమద్ అద్బుతమైన ఫినిషింగ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సమద్ 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 74 పరుగులు చేశాడు. అతడితో పాటు కమ్రాన్ ఇక్బాల్(61) హాఫ్ సెంచరీతో రాణించాడు.సమద్‌ను వదిలేసిన సన్‌రైజర్స్..కాగా ఐపీఎల్లో అబ్దుల్ సమద్ గత కొన్ని సీజన్లగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కానీ ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు అతడిని ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకోలేదు. దీంతో అతడు వేలంలోకి వచ్చాడు. అయితే అతడికి అద్బుతమైన హిట్టింగ్ స్కిల్స్ ఉండడంతో వేలంలో భారీ ధర దక్కినా ఆశ్చర్యపోనక్కర్లలేదు.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా -
చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్
ప్రతిష్టాత్మక దేశవాలీ టోర్నీ రంజీ ట్రోఫీలో జమ్మూ అండ్ కశ్మీర్ ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అబ్దుల్ సమద్ చరిత్ర సృష్టించాడు. ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్‌లో సమద్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి, ఈ ఘనత సాధించిన తొలి జమ్మూ అండ్ కశ్మీర్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో 117 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 127 పరుగులు చేసిన సమద్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 108 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సమద్ ట్విన్ సెంచరీస్‌తో చెలరేగడంతో ఒడిషాతో మ్యాచ్‌లో జమ్మూ అండ్ కశ్మీర్ పటిష్ట స్థితికి చేరింది. జమ్మూ అండ్ కశ్మీర్ ఒడిషా ముందు 269 పరుగల లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు రెండో సెషన్ సమయానికి ఒడిషా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసి ఓటమి దిశగా పయనిస్తుంది. ఇవాళే (అక్టోబర్ 21) ఆటకు చివరి రోజు కాగా.. ఒడిషా ఇంకా 230 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో ఆరు వికెట్లు మాత్రమే ఉన్నాయి. సందీప్ పట్నాయక్ (17), బిప్లబ్ సమంత్రే (4) క్రీజ్‌లో ఉన్నారు. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్లలో ఆబిద్ ముస్తాక్ 2, సాహిల్ లోత్రా, ఉమర్ నజీర్ మిర్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు జమ్మూ అండ్ కశ్మీర్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సమద్ అజేయ సెంచరీతో పోరాడగా.. శుభమ్ ఖజూరియా 43, శుభమ్ పుండిర్ 40 పరుగులు చేశారు. ఒడిషా బౌలర్లలో ప్రధాన్ 3, కార్తీక్ బిస్వాల్ 2, సుమిత్ శర్మ, డి ప్రధాన్ తలో వికెట్ పడగొట్టారు.దీనికి ముందు ఒడిషా తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకు ఆలౌటైంది. ఒడిషా కెప్టెన్ గోవిందా పొద్దార్ అజేయ సెంచరీతో (133) సత్తా చాటాడు. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్లలో ఆబిద్ ముస్తాక్ 4, ఉమర్ నజీర్ 3, ఆకిబ్, యుద్ద్‌వీర్ సింగ్, సాహిల్ లోత్రా తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకు ఆలౌటైంది. జమ్మూ అండ్ కశ్మీర్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్ సమద్ ఒక్కడే సెంచరీతో సత్తా చాటాడు. ఒడిషా బౌలర్లలో సుమిత్ శర్మ ఐదు వికెట్లు తీశాడు. చదవండి: దక్షిణాఫ్రికా బౌలర్ల ఉగ్రరూపం.. 106 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్ -
అది నోబాల్.. థర్డ్ అంపైర్ చీటింగ్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా శనివారం ఎస్ఆర్హెచ్, లక్నో సూపర్‌జెయింట్స్(LSG)మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. నో బాల్ విషయంలో థర్డ్ అంపైర్ వ్యవహరించిన తీరుపై స్టేడియానికి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవ్వడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఆవేశ్ ఖాన్ వేశాడు. ఓవర్ మూడో బంతి హైఫుల్ టాస్‌గా వెళ్లింది. నడుము పై భాగంలో వెళ్లడంతో ఫీల్డ్ అంపైర్ నోబాల్‌కు కాల్ ఇచ్చాడు. అయితే లక్నో సూపర్‌జెయింట్స్ అంపైర్ కాల్‌ను చాలెంజ్ చేశారు. దీంతో అల్ట్రాఎడ్జ్‌లో పరిశీలించిన థర్డ్ అంపైర్ బంతి సమద్ బ్యాట్ ఎడ్జ్‌కు తాకి వెళ్లిందని.. నో బాల్ కాదని చెప్పాడు. దీంతో క్లాసెన్ సహా అబ్దుల్ సమద్‌లు షాక్‌కు గురయ్యారు. వాస్తవానికి నడుము పై నుంచి బంతి వెళితే నోబాల్ ఇవ్వడం జరుగుతుంది. అంత క్లియర్‌గా నోబాల్ అని కనిపిస్తున్నా థర్డ్ అంపైర్ కరెక్ట్ బాల్‌గా కౌంట్ చేయడం ఆసక్తి కలిగించింది. ఇదే ఎస్ఆర్హెచ్ అభిమానులకు కోపం తెప్పించింది. థర్డ్ అంపైర్‌ని తిడుతూనే ఎల్ఎస్జీ డగౌట్ వైపు కొంతమంది అభిమానులు నట్స్, బోల్ట్‌లు విసిరికొట్టారు. అవి వచ్చి డగౌట్లో పడడంతో గందరగోళం నెలకొంది. దీంతో లక్నో ఆటగాళ్లంతా డగౌట్వైపుగా రావడం.. క్లాసెన్, క్వింటన్ డికాక్‌లు నోబాల్ వ్యవహారంపై సీరియస్‌గా చర్చించడం కనిపించింది. అయితే ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని కంగారు పడిన వేళ అంపైర్లు కలగజేసుకొని డగౌట్ నుంచి ఆటగాళ్లను పంపించేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన తర్వాత క్లాసెన్ ఏకాగ్రత కోల్పోయాడు. 47 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్న క్లాసెన్ అదే ఓవర్లో చివరి బంతికి భారీ షాట్‌కు యత్నించి ప్రేరక్ మన్కడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పెవిలియన్ వెళ్లే సమయంలో క్లాసెన్ మొహం బాధతో నిండిపోవడం కనిపించింది. 3rd Umpire gives this as a fair delivery. - The Hyderabad crowd starts chanting 'Kohli, Kohli'.#SRHvLSGpic.twitter.com/2vY2YkxKQa — runmachinevi143 (@runmachinevi143) May 13, 2023 After a controversial reversal of no ball decision by the third umpire, the SRH fans in the stadium are showing their frustrations at the LSG dugout. The crowd were also heard chanting, "Kohli, Kohli" with Gambhir in the dugout 👀 📸 JioCinema#SRHvLSG #SRH #SRHvsLSG pic.twitter.com/jPti6MyaFe — 12th Khiladi (@12th_khiladi) May 13, 2023 A blunder from the third umpire? 📸: Jio Cinema#IPL2023 | #SRHvLSG pic.twitter.com/pyQk6IzUoj — CricTracker (@Cricketracker) May 13, 2023 చదవండి: సైబర్‌క్రైమ్‌ను ఆశ్రయించిన సచిన్ టెండూల్కర్ -
ఎస్ ఆర్ హెచ్ టీంకి బాహుబలి అతను... జీరో టు హీరో అంటే ఇదే
-
PBKS VS KKR: మొన్న ఫిలిప్స్.. నిన్న రసెల్
ఐపీఎల్ 2023లో మరో మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. పంజాబ్ కింగ్స్‌తో నిన్న (మే 8) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ చివరి బంతికి విజయం సాధించి, ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ సీజన్లో ఆఖరి బంతివరకు సాగిన మ్యాచ్‌ల్లో (6) ఇది వరుసగా రెండవది. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. కెప్టెన్ శిఖర్ ధవన్ (47 బంతుల్లో 57; 9 ఫోర్లు,సిక్స్), ఆఖర్లో షారుక్ ఖాన్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ (8 బంతుల్లో 12), లివింగ్‌స్టోన్ (9 బంతుల్లో 15), జితేశ్ శర్మ (18 బంతుల్లో 21), రిషి ధవన్ (11 బంతుల్లో 19), హర్‌ప్రీత్ బ్రార్ (9 బంతుల్లో 17 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. భానుక రాజపక్ష (0), సామ్ కర్రన్ (9 బంతుల్లో 4) విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, హర్షిత్ రాణా 2, సుయాశ్ శర్మ, నితీశ్ రాణా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. జేసన్ రాయ్ (24 బంతుల్లో 38; 8 ఫోర్లు), నితీశ్ రాణా (38 బంతుల్లో 51; ఫోర్, సిక్స్), ఆండ్రీ రసెల్ (23 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్ 10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రహ్మానుల్లా గుర్భాజ్ (15), వెంకటేశ్ అయ్యర్ (11) రెండంకెల స్కోర్ చేశారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ 2, నాథన్ ఇల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్ తలో వికెట్ పడగొట్టారు. మొన్న ఫిలిప్స్.. నిన్న రసెల్. ఛేదనలో కేకేఆర్ ఆరంభంలో దూకుడుగానే ఆడినప్పటికీ మధ్యలో స్కోర్ కాస్త నెమ్మదించడంతో మ్యాచ్ ఆఖరి బంతి వరకు సాగింది. మొన్న రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్‌లు ఏ పాత్ర అయితే పోషించారో.. నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్ ప్లేయర్స్ రసెల్, రింకూ సింగ్ కూడా అదే పాత్ర పోషించారు. క్లిష్ట సమయంలో ఫిలిప్స్ మెరుపు ఇన్నింగ్స్ (7 బంతుల్లో 25; ఫోర్, 3 సిక్సర్లు) ఆడి గెలుపుపై ఆశలు లేని ఎస్ఆర్హెచ్ను గేమ్‌లోకి తేగా.. ఆఖరి బంతికి అబ్దుల్ సమద్ (7 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు) సిక్సర్ బాది గెలిపించాడు. ఇంచుమించు అలాగే పంజాబ్‌తో మ్యాచ్‌లో రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కేకేఆర్‌ను గెలుపు ట్రాక్‌లో పెడితే, రింకూ సింగ్ ఆఖరి బంతికి బౌండరీ బాది మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఫిలిప్స్ తరహాలోనే నిన్నటి మ్యాచ్‌లో రసెల్ కూడా 19వ ఓవర్లో శివాలెత్తిపోయాడు. ఆ మ్యాచ్‌లో ఫిలిప్స్.. కుల్దీప్ బౌలింగ్‌లో 3 సిక్సర్లు, ఓ ఫోర్ బాదితే.. నిన్నటి మ్యాచ్‌లో సామ్ కర్రన్ బౌలింగ్‌లో రసెల్ 3 సిక్సర్లతో విరుచుకుపడి, మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఫిలిప్స్, రసెల్ సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడకపోయుంటే రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్ధులు గెలిచేవారు. అలాగే సన్‌రైజర్స్, కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించేవి. చదవండి: ఐపీఎల్లో ధావన్ అరుదైన రికార్డు.. కోహ్లి, వార్నర్ సరసన -
జాగ్రత్త.. అతడు హీరో! సమద్‌పై ఎస్ఆర్హెచ్ ట్వీట్ వైరల్.. ఫ్యాన్స్ మాత్రం..
IPL 2023- RR Vs SRH- Last Ball Thriller: ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్‌తో నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంతో ముగించింది. ఆఖరి బంతికి హైడ్రామా నెలకొన్న ఆదివారం నాటి మ్యాచ్‌లో ఊహించని రీతిలో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 214 పరుగుల భారీ టార్గెట్‌ను రైజర్స్ ఛేజ్ చేసే ఛాన్సే లేదన్న కామెంట్లు చేసిన వారి నోళ్లు మూయించింది. అదృష్టం తోడు రాగా.. ఆటకు తోడు అదృష్టం కలిసి రావడంతో జైపూర్‌లో జయకేతనం ఎగురవేసి.. ఉప్పల్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు అన్మోల్ప్రీత్ సింగ్(33), అభిషేక్ శర్మ (55) మెరుగ్గా రాణించగా.. వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి(47 పరుగులు) తన పాత్రకు న్యాయం చేశాడు. మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పి ఇక నాలుగో స్థానంలో వచ్చి హెన్రిచ్ క్లాసెన్ 12 బంతుల్లో 26 పరుగులతో మెరవగా.. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 7 బంతుల్లోనే 25 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. సమద్ చేసెను అద్భుతం ఇలా టాపార్డర్ బ్యాటర్లు తలా ఓ చెయ్యి వేసి మ్యాచ్‌ను చివరి వరకు లాక్కొనిరాగా.. ఆఖరి బంతికి అబ్దుల్ సమద్ కొట్టిన షాట్ ఆరెంజ్ ఆర్మీ ఆశలపై నీళ్లు చల్లింది. రాజస్తాన్ గెలిచిందన్న వార్త రైజర్స్ అభిమానుల గుండెలు బద్దలు చేసింది. అంతలోనే నో బాల్‌ను సూచిస్తూ సిగ్నల్ రావడంతో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఫ్రీ హిట్ రూపంలో లభించిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న సమద్.. సందీప్ వేసిన యార్కర్‌ను సిక్సర్‌గా మలిచాడు. సన్‌రైజర్స్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు. మొన్న జీరో.. ఇప్పుడు హీరో దీంతో అభిమానులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘మొన్న జీరో.. ఇప్పుడు హీరో’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ తమ ఆటగాడు అబ్దుల్ సమద్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. జాగ్రత్త.. అతడు హీరో అప్పటి వరకు ఓటమి ఖరారైందని తీవ్ర భావోద్వేగానికి లోనైన అభిషేక్ శర్మ సహా ఉమ్రాన్ మాలిక్ సహా డగౌట్లో కూర్చున్న వాళ్లంతా ఒక్కసారిగా దూసుకువచ్చి సమద్‌ను ఆలింగనం చేసుకున్నారు. ఈ ఫొటోను షేర్ చేసిన రైజర్స్.. ‘‘జాగ్రత్త.. అతడు హీరో’’ అంటూ బాహుబలి సినిమాలో ప్రభాస్‌ను ఆత్మీయంగా తాకుతున్న చేతులు ఉన్న ఫొటోను కూడా ఇందులో జతచేసింది. ఆరోజు అలా దీంతో ఈ మ్యాచ్‌లో ఫిలిప్స్, సమద్ ఇద్దరు రియల్ హీరోలు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా కేకేఆర్‌తో గత మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సమద్ 18 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్లో వరుణ్ చక్రవర్తి వేసి బంతినిసిక్స్ కొట్టే ఛాన్స్ ఉన్నా మిస్ చేసి అవుటైన తీరుపై విమర్శలు వచ్చాయి. కోట్లు కోట్లు తీసుకుని సరైన సమయంలో చేతులెత్తేస్తున్నాడంటూ ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యారు. అయితే, రాజస్తాన్‌తో మ్యాచ్‌లో సీన్ రివర్స్ అయింది. సమద్ కొట్టిన సిక్సర్ అద్భుతం చేసింది. దీంతో తిట్టిననోళ్లే అతడిని పొగుడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 7 బంతులు ఎదుర్కొన్న సమద్ 17 పరుగులు రాబట్టి అజేయంగా నిలిచాడు. చదవండి : నిమిషాల్లో అంతా తారుమారైంది.. వాళ్ల వల్లే గెలిచాం.. అయితే: మార్కరమ్ Carefully, he's a HERO 💪 pic.twitter.com/nppc8eOwgb — SunRisers Hyderabad (@SunRisers) May 7, 2023 WHAT. A. GAME 😱😱 Abdul Samad wins it for the @SunRisers as he hits a maximum off the final delivery. #SRH win by 4 wickets. Scorecard - https://t.co/1EMWKvcgh9 #TATAIPL #RRvSRH #IPL2023 pic.twitter.com/yh0WVMEbOz — IndianPremierLeague (@IPL) May 7, 2023 -
ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ ఫిలిప్స్.. బ్రూక్‌కు వదిలేసి మంచి పని చేసింది..!
రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న (మే 7) జరిగిన హైటెన్షన్ గేమ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడి గెలిచింది. భారీ లక్ష్య ఛేదనలో ఆఖరి బంతి నో బాల్ కావడం, ఆతర్వాతి బంతిని అబ్దుల్ సమద్ సిక్సర్‌గా మలచడం, సన్‌రైజర్స్ గెలవడం.. అంతా నాటకీయ పరిణామాల మధ్య చోటు చేసుకున్నాయి. ఎస్ఆర్హెచ్ను విజయతీరాలకు చేర్చింది సమదే అయినప్పటికీ.. గెలుపుపై ఆశలు రేకెత్తించి, గెలుపు ట్రాక్‌లో ఉంచింది మాత్రం డైనమైట్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్. ఈ కివీస్ బ్యాటర్.. ఎస్ఆర్హెచ్ విజయానికి 18 బంతుల్లో 44 పరుగులు కావాల్సిన తరుణంలో సుడిగాలి ఇన్నింగ్స్ (7 బంతుల్లో 3 సిక్సర్లు, ఓ ఫోర్ సాయంతో 25) ఆడి అసాధ్యమనుకున్న గెలుపుపై ఆశల రేకెత్తించాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 18వ ఓవర్లో తొలి నాలుగు బంతులను 6, 6, 6, 4గా మలచిన ఫిలిప్స్ మ్యాచ్‌ను సన్‌రైజర్స్ చేతుల్లోకి తెచ్చాడు. ఫిలిప్స్ ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడకపోయుంటే ఎస్ఆర్హెచ్ కచ్చితంగా ఓటమిపాలై, లీగ్ నుంచి నిష్క్రమించేది. ఫిలిప్స్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావ్ ఫిలిప్స్.. సనరైజర్స్ హ్యారీ బ్రూక్‌ను వదిలించుకుని నీకు అవకాశమిచ్చి మంచి పని చేసిందంటూ సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. 13.25 ఆటగాడి (బ్రూక్) కంటే అందులో పది శాతం (1.5 కోట్లు) కూడా రేటు దక్కని ఫిలిప్స్ చాలా బెటరని అంటున్నారు. కేకేఆర్‌పై బ్రూక్ చేసిన సెంచరీ కంటే రాజస్థాన్‌పై ఫిలిప్స్ ఆడిన ఇన్నింగ్స్ అత్యుత్తమమని కొనియాడుతున్నారు. సెంచరీ మినహాయించి దాదాపు ప్రతి మ్యాచ్‌లో విఫలమైన బ్రూక్‌ను ఇకపై పక్కకు పెట్టి ఫిలిప్స్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్లే ఆఫ్స్ అవకాశాలు మినుకమినుకుమంటున్న దశలో ఫిలిప్స్ ఎస్ఆర్హెచ్ను ఫైనల్ ఫోర్కు చేరుస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సన్‌రైజర్స్‌తో నిన్నటి మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (59 బంతుల్లో 95; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, కెప్టెన్ సంజు శాంసన్ (38 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. భారీ లక్ష్య ఛేదనలో అభిషేక్ శర్మ (34 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ త్రిపాఠి (29 బంతుల్లో 47; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), గ్లెన్ ఫిలిప్స్ (7 బంతుల్లో 25; 1 ఫోర్, 3 సిక్స్‌లు), సమద్ (7 బంతుల్లో 17 నాటౌట్; 2 సిక్స్‌లు) చెలరేగడంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసి విజయం సాధించింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడి సన్‌రైజర్స్‌ను గెలిపించిన గ్లెన్ ఫిలిప్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: RR VS SRH: హైడ్రామా.. ఆఖరి బంతి నో బాల్.. ఓడి గెలిచిన సన్‌రైజర్స్ -
RR VS SRH: హైడ్రామా.. ఆఖరి బంతి నో బాల్.. ఓడి గెలిచిన సన్‌రైజర్స్
జైపూర్: లక్ష్యం 215 పరుగులు... 17 ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 171 పరుగులు. గెలవాలంటే చివరి 3 ఓవర్లలో 44 పరుగులు కావాలి. అయితే 18వ ఓవర్లో కీలక బ్యాటర్లు రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్లను చహల్ అవుట్ చేయడంతో రాజస్తాన్ రాయల్స్ పైచేయి సాధించింది. కానీ కుల్దీప్ యాదవ్ వేసిన తర్వాతి ఓవర్లో తొలి నాలుగు బంతులను 6, 6, 6, 4గా మలచి గ్లెన్ ఫిలిప్స్ మ్యాచ్‌ను మళ్లీ రైజర్స్ చేతుల్లోకి తెచ్చాడు. ఐదో బంతికి అతను అవుట్ కాగా, ఆఖరి ఓవర్లో సమీకరణం 17 పరుగులుగా మారింది. సందీప్ శర్మ వేసిన ఈ ఓవర్లో తొలి 5 బంతుల్లో 12 పరుగులు వచ్చాయి. చివరి బంతికి అబ్దుల్ సమద్‌ను అవుట్ చేసి సందీప్ శర్మ సంబరాలు చేసుకున్నాడు. అయితే అది నోబాల్‌గా తేలింది. సన్‌రైజర్స్ విజయానికి ఫోర్ అవసరం కాగా, సందీప్ మళ్లీ వేసిన ఆఖరి బంతిని సమద్ సిక్సర్‌గా మలిచాడు! దాంతో సన్‌రైజర్స్ శిబిరం సంబరాల్లో మునిగిపోగా, జైపూర్ స్టేడియం మూగబోయింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ 4 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (59 బంతుల్లో 95; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, కెపె్టన్ సంజు సామ్సన్ (38 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 81 బంతుల్లోనే 138 పరుగులు జోడించడం విశేషం. అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 217 పరుగులు సాధించింది. అభిషేక్ శర్మ (34 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ త్రిపాఠి (29 బంతుల్లో 47; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆఖర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్లెన్ ఫిలిప్స్ (7 బంతుల్లో 25; 1 ఫోర్, 3 సిక్స్‌లు), సమద్ (7 బంతుల్లో 17 నాటౌట్; 2 సిక్స్‌లు) మెరుపులు జట్టును గెలిపించాయి. కీలక క్యాచ్‌లు వదిలేసి, సునాయాస రనౌట్ అవకాశం చేజార్చుకొని రాజస్తాన్ తగిన మూల్యం చెల్లించుకుంది. స్కోరు వివరాలు.. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) నటరాజన్ (బి) జాన్సెన్ 35; బట్లర్ (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 95; సామ్సన్ (నాటౌట్) 66; హెట్‌మైర్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 214. వికెట్ల పతనం: 1–54, 2–192. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–44–1, జాన్సెన్ 4–0–44–1, నటరాజన్ 4–0–36–0, మార్కండే 4–0–51–0, అభిషేక్ 2–0–15–0, వివ్రాంత్ 2–0–18–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అన్మోల్ప్రీత్ (సి) హెట్‌మైర్ (బి) చహల్ 33; అభిషేక్ (సి) చహల్ (బి) ఆర్.అశ్విన్ 55; త్రిపాఠి (సి) యశస్వి (బి) చహల్ 47; క్లాసెన్ (సి) బట్లర్ (బి) చహల్ 26; మార్క్రమ్ (ఎల్బీ) (బి) చహల్ 6; ఫిలిప్స్ (సి) హెట్‌మైర్ (బి) కుల్దీప్ 25; సమద్ (నాటౌట్) 17; జాన్సెన్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–51, 2–116, 3–157, 4–171, 5–174, 6–196. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–48–0, కుల్దీప్ యాదవ్ 4–0–50–1, ఆర్. అశ్విన్ 4–0–35–1, చహల్ 4–0–29–4, మురుగన్ అశ్విన్ 3–0–42–0, మెకాయ్ 1–0–13–0. -
నరాలు తెగే ఉత్కంఠ! అప్పుడు నా హార్ట్‌బీట్ 200కు చేరువైంది.. అయితే..
IPL 2023 SRH Vs KKR: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్బుత ఆట తీరు కనబరిచాడు. కీలక సమయంలో ప్రత్యర్థిని కట్టడి చేసి జట్టుకు విజయం అందించాడు. ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో కేకేఆర్‌ను గెలుపు తీరాలకు చేర్చి.. రైజర్స్పై ప్రతీకారం తీర్చుకునేలా చేశాడు. ఐపీఎల్-2023లో రైజర్స్‌తో మొదటి ముఖాముఖి పోరులో సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగింది. ఆరంభంలోనే ఎదురుదెబ్బలు ఈ క్రమంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు స్కోరు చేసింది. సొంతమైదానంలో రైజర్స్ రెచ్చిపోతుందనుకుంటే.. ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు అభిషేక్ శర్మ(9)ను శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్ (18)ను హర్షిత్ రాణా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపారు. టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి (9 బంతుల్లో 20 పరుగులు) ఆట ఆండ్రీ రసెల్ బౌలింగ్‌లో వైభవ్ అరోరాకు క్యాచ్ ఇవ్వడంతో ముగిసింది. క్లాసెన్ ఆకట్టుకున్నా ఈ క్రమంలో రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ (41 బంతుల్లో 40 పరుగులు), హెన్రిచ్ క్లాసెన్ (20 బంతుల్లో 36 పరుగులు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకోగా.. మార్కరమ్‌ను వైభవ్, క్లాసెన్‌ను శార్దూల్ అవుట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆఖరి ఓవర్లో రైజర్స్ విజయ సమీకరణం 9 పరుగులుగా మారింది. బంతి బంతికీ ఉత్కంఠ క్రీజులో అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్ ఉన్నారు. అప్పుడు కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా బంతిని వరుణ్ చక్రవర్తికి అందించాడు. చివరి ఓవర్.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ.. చక్రవర్తి బౌలింగ్‌లో మొదటి బంతికి అబ్దుల్ సమద్ ఒక పరుగు తీశాడు. రెండో బంతికి లెగ్‌బై రూపంలో పరుగు వచ్చింది. ఇక మూడో బంతికి వరుణ్ మ్యాజిక్ చేసి సమద్‌ను అవుట్ చేశాడు. దీంతో క్రీజులోకి వచ్చిన మయాంక్ మార్కండే.. నాలుగో బంతికి ఒక్క పరుగు కూడా రాబట్టలేకపోయాడు. ఐదో బంతికి ఒక పరుగు తీయగా.. ఆఖరి బంతికి భువీ చేతులెత్తేయడంతో కేకేఆర్ విజయం ఖరారైంది. కీలక ఓవర్లో 3 పరుగులే ఇచ్చి జట్టును గెలిపించిన వరుణ్ చక్రవర్తిని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం వరుణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్ట్‌బీట్ 200కు చేరింది.. అతడు 2 ఫోర్లు బాదాడు! ‘‘ఆఖరి ఓవర్లో నా హార్ట్‌బీట్ 200కు చేరువైంది. అయితే.. ఏదేమైనా వాళ్లను కట్టడి చేయాలని ఫిక్సైపోయాను. ఓ వైపు బాలేమో స్లిప్ అవుతోంది. ఎలాగైనా బ్యాటర్లను ట్రాప్ చేసి లాంగ్ షాట్లు ఆడేలా చేయాలని భావించా. నా మొదటి ఓవర్లో 12 పరుగులు ఇచ్చాను. మార్కరమ్ నా బౌలింగ్‌లో 2 ఫోర్లు బాదాడు. నిజానికి.. గతేడాది నేను గంటకు 85 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాను. లోపాలు సరిచేసుకున్నాను. గత తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకుంటున్నా’’ అని వరుణ్ చక్రవర్తి పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌లలో వరుణ్ 301 పరుగులు ఇచ్చి 14 వికెట్లు పడగొట్టాడు. రైజర్స్‌తో మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి కీలక సమయంలో వికెట్ తీశాడు. చదవండి: లక్షలు పోసి కొంటే రెట్టింపు తిరిగి ఇస్తున్నాడు! 4 కోట్లు తీసుకున్న నువ్విలా.. వేస్ట్ ఎక్కడివాళ్లు అక్కడ ఉండాలి.. మధ్యలో దూరడం ఎందుకు: గౌతీపై ఇంగ్లండ్ దిగ్గజం విమర్శలు చిన్నప్పటి నుంచే అశ్విన్‌కు నాపై క్రష్! స్కూల్ మొత్తం తెలుసు! ఓరోజు.. #KKR clinch a nail-biter here in Hyderabad as Varun Chakaravarthy defends 9 runs in the final over.@KKRiders win by 5 runs. Scorecard - https://t.co/dTunuF3aow #TATAIPL #SRHvKKR #IPL2023 pic.twitter.com/g9KGaBbADy — IndianPremierLeague (@IPL) May 4, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
లక్షలు పోసి కొంటే రెట్టింపు తిరిగి ఇస్తున్నాడు! 4 కోట్లు తీసుకున్న నువ్విలా.. వేస్ట్
IPL 2023 SRH Vs KKR: సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అబ్దుల్ సమద్‌పై అభిమానులు మండిపడుతున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ ‘ఫినిషర్’ రింకూ సింగ్‌తో పోలుస్తూ ట్రోల్ చేస్తున్నారు. రింకూ రోజురోజుకూ మెరుగవుతుంటే అబ్దుల్ సమద్ మాత్రం చెత్త ప్రదర్శనతో విసుగు తెప్పిస్తున్నాడని ఫైర్ అవుతున్నారు. బహుశా.. రాజస్తాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నాడేమోనంటూ మీమ్స్‌తో ఎండగడుతున్నారు. 4 కోట్లు పెట్టి కొన్నారు కాగా జమ్మూ కశ్మీర్‌కు చెందిన 21 ఏళ్ల అబ్దుల్ సమద్‌ను ఐపీఎల్-2023 వేలంలో సన్‌రైజర్స్ రూ. 4 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన అతడు 111 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు సమద్ అత్యధిక స్కోరు 32(నాటౌట్). లక్షలు పెట్టినందుకు రెట్టింపు తిరిగి ఇస్తున్నాడు మరోవైపు.. రూ. 55 లక్షలకు కేకేఆర్ రింకూ సింగ్‌ను అట్టిపెట్టుకున్నందుకు అతడు తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపిస్తూ తన కోసం ఫ్రాంఛైజీ వెచ్చించిన మొత్తం కంటే ఆట రూపంలో రెట్టింపు తిరిగి చెల్లిస్తున్నాడు. డెత్ ఓవర్లలో కింగ్ అనిపించుకుంటూ ముందుకు సాగుతున్న రింకూ.. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌లలో 316 పరుగులు సాధించాడు. చేతులెత్తేశాడు ఇక ఐపీఎల్-2023లో భాగంగా ఉప్పల్‌లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అబ్దుల్ సమద్.. 18 బంతుల్లో 21 పరుగులు చేయగలిగాడు. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఆదుకుంటాడనుకుంటే చేతులెత్తేశాడు. కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అనుకూల్ రాయ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. నిజానికి.. వరుణ్ వేసిన బంతిని సిక్స్ కొట్టే ఛాన్స్ ఉన్నా సమద్ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన అతడు డీప్ మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న అనుకూల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆఖరి ఓవర్లో విజయానికి తొమ్మిది పరుగులు అవసరమైన వేళ అబ్దుల్ సమద్ అవుటవడం రైజర్స్ కొంపముంచింది. 5 పరుగుల తేడాతో జట్టు ఓటమి పాలైంది. రింకూతో పోలిస్తే నువ్వు వేస్ట్ అంటూ ఈ నేపథ్యంలో అబ్దుల్ సమద్ వైఫల్యంపై ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘‘లక్షలు పోసి ఉన్న రింకూ.. ఫైనల్ ఓవర్లో 5 సిక్స్‌లు కొట్టి జట్టును విజయతీరాలకు చేరిస్తే.. 4 కోట్లు ధారపోసి నిన్ను సొంతం చేసుకుంటే ఫైనల్ ఓవర్లో జట్టుకు కేవలం 9 పరుగులు అవసరమైన వేళ చేతులెత్తేశావు. రింకూతో పోలిస్తే నువ్వు వేస్ట్’’ అంటూ మండిపడుతున్నారు. రింకూ ఇచ్చిన క్యాచ్ పట్టింది అతడే ‘‘క్లాసెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే నువ్వు మాత్రం సర్వనాశనం చేశావు’’ అని విరుచుకుపడుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ 35 బంతుల్లో 46 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. ఇక గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రింకూ ఆఖరి ఓవర్లో 5 సిక్స్‌లు బాదిన తీరు ఎవరూ మర్చిపోలేరు. పదహారో ఎడిషన్ హైలైట్లలో ఒకటిగా నాటి ఇన్నింగ్స్ నిలిచిపోతుంది. ఇదిలా ఉంటే గురువారం నాటి మ్యాచ్‌లో నటరాజన్ బౌలింగ్‌లో రింకూ ఇచ్చిన క్యాచ్‌ను సమద్ అద్భుత డైవ్‌తో ఒడిసిపట్టడం కొసమెరుపు. చదవండి: ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం.. నా వల్లే ఇలా! అతడు మాత్రం.. నేను బాగా ఆడినపుడే.. నాకు క్రెడిట్ దక్కకుండా చేస్తాడు: ఇషాన్ కిషన్ 80 lakh: Scored 5 sixes in the FINAL over and won the game for his team. 4cr : Unable to score 9 runs in the FINAL over and lost the match for his team Abdul Samad vs Rinku Singh.#SRHvsKKR pic.twitter.com/Nfm0K0GlzT — Farrago Abdullah Parody (@abdullah_0mar) May 4, 2023 You can become next Abdul Samad#SRHvsKKR pic.twitter.com/kKAU3PHX6C — Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) May 4, 2023 You gotta feel for kavya maran ❤️🥲 Once again saying,if srh has to win ,they have to drop Harry brook, mayank Agarwal and Abdul samad at any cost pic.twitter.com/suPPCAkvdc — ✶ 🎀 𝒟𝒶𝓀𝓈𝒽 𝑔𝒾𝓁𝓁 🎀 ✶ (@screwgauge77) May 4, 2023 Abdul samad yesterday#SRHvKKR #SRHvsKKR pic.twitter.com/X42156BYlZ — 18 (@SahisahilS) May 5, 2023 #KKR clinch a nail-biter here in Hyderabad as Varun Chakaravarthy defends 9 runs in the final over.@KKRiders win by 5 runs. Scorecard - https://t.co/dTunuF3aow #TATAIPL #SRHvKKR #IPL2023 pic.twitter.com/g9KGaBbADy — IndianPremierLeague (@IPL) May 4, 2023