IPL 2023, SRH vs KKR: Fans Roast Abdul Samad And Hails Rinku Singh, Why? - Sakshi
Sakshi News home page

#Abdul Samad: లక్షలు పోసి కొంటే రెట్టింపు తిరిగి ఇస్తున్నాడు! 4 కోట్లు తీసుకున్న నువ్విలా.. వేస్ట్‌!

Published Fri, May 5 2023 10:13 AM | Last Updated on Fri, May 5 2023 10:47 AM

IPL 2023 SRH Vs KKR: Fans Roast Abdul Samad Hails Rinku Singh Why - Sakshi

అబ్దుల్‌ సమద్‌ (PC: SRH/IPL)

IPL 2023 SRH Vs KKR: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్‌ అబ్దుల్‌ సమద్‌పై అభిమానులు మండిపడుతున్నారు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ‘ఫినిషర్‌’ రింకూ సింగ్‌తో పోలుస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. రింకూ రోజురోజుకూ మెరుగవుతుంటే అబ్దుల్‌ సమద్‌ మాత్రం చెత్త ప్రదర్శనతో విసుగు తెప్పిస్తున్నాడని ఫైర్‌ అవుతున్నారు. బహుశా.. రాజస్తాన్‌  రాయల్స్‌ యువ బ్యాటర్‌ రియాన్‌ పరాగ్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నాడేమోనంటూ మీమ్స్‌తో ఎండగడుతున్నారు. 

4 కోట్లు పెట్టి కొన్నారు
కాగా జమ్మూ కశ్మీర్‌కు చెందిన 21 ఏళ్ల అబ్దుల్‌ సమద్‌ను ఐపీఎల్‌-2023 వేలంలో సన్‌రైజర్స్‌ రూ. 4 కోట్ల‌ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన అతడు 111 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు సమద్‌ అత్యధిక స్కోరు 32(నాటౌట్‌).

లక్షలు పెట్టినందుకు రెట్టింపు తిరిగి ఇస్తున్నాడు
మరోవైపు.. రూ. 55 లక్షలకు కేకేఆర్‌ రింకూ సింగ్‌ను అట్టిపెట్టుకున్నందుకు అతడు తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపిస్తూ తన కోసం ఫ్రాంఛైజీ వెచ్చించిన మొత్తం కంటే ఆట రూపంలో రెట్టింపు తిరిగి చెల్లిస్తున్నాడు. డెత్‌ ఓవర్లలో కింగ్‌ అనిపించుకుంటూ ముందుకు సాగుతున్న రింకూ.. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌లలో 316 పరుగులు సాధించాడు.

చేతులెత్తేశాడు
ఇక ఐపీఎల్‌-2023లో భాగంగా ఉప్పల్‌లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అబ్దుల్‌ సమద్‌.. 18 బంతుల్లో 21 పరుగులు చేయగలిగాడు. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఆదుకుంటాడనుకుంటే చేతులెత్తేశాడు. కేకేఆర్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో అనుకూల్‌ రాయ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.

నిజానికి.. వరుణ్‌ వేసిన బంతిని సిక్స్‌ కొట్టే ఛాన్స్‌ ఉన్నా సమద్‌ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన అతడు డీప్‌ మిడ్‌ వికెట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న అనుకూల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆఖరి ఓవర్లో విజయానికి తొమ్మిది పరుగులు అవసరమైన వేళ అబ్దుల్‌ సమద్‌ అవుటవడం రైజర్స్‌ కొంపముంచింది. 5 పరుగుల తేడాతో జట్టు ఓటమి పాలైంది.

రింకూతో పోలిస్తే నువ్వు వేస్ట్‌ అంటూ
ఈ నేపథ్యంలో అబ్దుల్‌ సమద్‌ వైఫల్యంపై ఆరెంజ్‌ ఆర్మీ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. ‘‘లక్షలు పోసి ఉన్న రింకూ.. ఫైనల్‌ ఓవర్లో 5 సిక్స్‌లు కొట్టి జట్టును విజయతీరాలకు చేరిస్తే.. 4 కోట్లు ధారపోసి నిన్ను సొంతం చేసుకుంటే ఫైనల్‌ ఓవర్లో జట్టుకు కేవలం 9 పరుగులు అవసరమైన వేళ చేతులెత్తేశావు. రింకూతో పోలిస్తే నువ్వు వేస్ట్‌’’ అంటూ మండిపడుతున్నారు.

రింకూ ఇచ్చిన క్యాచ్‌ పట్టింది అతడే
‘‘క్లాసెన్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తే నువ్వు మాత్రం సర్వనాశనం చేశావు’’ అని విరుచుకుపడుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్‌ 35 బంతుల్లో 46 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉంది. ఇక గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రింకూ ఆఖరి ఓవర్లో 5 సిక్స్‌లు బాదిన తీరు ఎవరూ మర్చిపోలేరు. పదహారో ఎడిషన్‌ హైలైట్లలో ఒకటిగా నాటి ఇన్నింగ్స్‌ నిలిచిపోతుంది. ఇదిలా ఉంటే గురువారం నాటి మ్యాచ్‌లో నటరాజన్‌ బౌలింగ్‌లో రింకూ ఇచ్చిన క్యాచ్‌ను సమద్ అద్భుత డైవ్‌తో ఒడిసిపట్టడం కొసమెరుపు.

చదవండి: ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం.. నా వల్లే ఇలా! అతడు మాత్రం..
నేను బాగా ఆడినపుడే.. నాకు క్రెడిట్‌ దక్కకుండా చేస్తాడు: ఇషాన్‌ కిషన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement