PC: BCCI/IPL.com
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో జమ్మూ కాశ్మీర్ శుభరంభం చేసింది. ఈ టోర్నీలో భాగంగా ముంబై వేదికగా జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో జమ్మూ కాశ్మీర్ విజయం సాధించింది. 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జార్ఖండ్ 9 వికెట్లు కోల్పోయి 199 పరుగుల మాత్రమే చేయగల్గింది.
జమ్మూ బౌలర్లలో అబిడ్ ముస్తాక్ 4 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు రషీక్ ధార్ సలీం, మురగన్ అశ్విన్ తలా రెండు వికెట్లు సాధించారు. జార్ఖండ్ బ్యాటర్లలో ఉత్‌క్రాష్ సింగ్(54), పంకజ్ కిషోర్ కుమార్(56) హాఫ్ సెంచరీలతో మెరిశారు. అయితే మిగితా ఆటగాళ్లు రాణించకపోవడంతో జార్ఖండ్ ఓటమి చవిచూసింది.
అబ్దుల్ సమద్ విధ్వంసం..
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన జమ్మూ కాశ్మీర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ సాధించాడు. జమ్మూ బ్యాటర్లలో ఆల్‌రౌండర్ అబ్దుల్ సమద్ విధ్వంసం సృష్టించాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సమద్ అద్బుతమైన ఫినిషింగ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సమద్ 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 74 పరుగులు చేశాడు. అతడితో పాటు కమ్రాన్ ఇక్బాల్(61) హాఫ్ సెంచరీతో రాణించాడు.
సమద్‌ను వదిలేసిన సన్‌రైజర్స్..
కాగా ఐపీఎల్‌లో అబ్దుల్ సమద్ గత కొన్ని సీజన్లగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కానీ ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు అతడిని ఎస్‌ఆర్‌హెచ్ రిటైన్ చేసుకోలేదు. దీంతో అతడు వేలంలోకి వచ్చాడు. అయితే అతడికి అద్బుతమైన హిట్టింగ్ స్కిల్స్ ఉండడంతో వేలంలో భారీ ధర దక్కినా ఆశ్చర్యపోనక్కర్లలేదు.
చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment